'భగవంత్‌ కేసరి'కి షాకిచ్చిన తారక్‌,మెగా ఫ్యాన్స్‌.. భారీగా నష్టాలు | Jr NTR And Mega Fans Boycott Bhagavanth Kesari | Sakshi
Sakshi News home page

'భగవంత్‌ కేసరి'కి షాకిచ్చిన తారక్‌,మెగా ఫ్యాన్స్‌.. భారీగా నష్టాలు

Published Sat, Oct 21 2023 4:08 PM | Last Updated on Sat, Oct 21 2023 5:03 PM

Jr NTR And Mega Fans Boycott Bhagavanth Kesari - Sakshi

తండ్రీకూతుళ్ల అనుబంధంతో పాటు సమాజంలో ఆడపిల్లను ఎలా పెంచాలి అనే కాన్సెప్ట్‌తో బాలకృష్ణ- శ్రీలీల నటించిన చిత్రం ‘భగవంత్‌ కేసరి’. మాస్‌ సినిమాలకు మొదటి ప్రయారిటీ ఇచ్చే బాలకృష్ణ ఈ సినిమాతో తన రూట్‌ మార్చుకున్నారు. మరోవైపు కామెడీ కంటెంట్‌తో సూపర్‌ హిట్స్‌ కొట్టిన డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కూడా ‘భగవంత్‌ కేసరి’తో తన స్ట్రాటజీలో మార్పులు చేసుకున్నారు. ఇలా భారీ అంచనాలతో అక్టోబర్‌ 19న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకాధరణ అంతగా లేదని తేలిపోయింది.

విడుదలైన మొదటిరోజే భారీ ఎఫెక్ట్‌

‘భగవంత్ కేసరి’ షూటింగ్‌ ప్రారంభం నుంచి ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ఆకట్టుకున్నాయి. అలాంటప్పుడు ‘భగవంత్ కేసరి’ అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరుగుతాయని చిత్ర యూనిట్‌ అంచనా వేసింది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా టికెట్లను మూడు రోజుల ముందే ఆన్‌లైన్లతో పాటు ఆఫ్‌లైన్‌ కూడా బుకింగ్స్ మొదలు పెట్టారు. కానీ ప్రేక్షకుల నుంచి అంతగా రెస్పాన్స్‌ రాలేదు.

సినిమా మొదటి రెండు రోజులు అఖండ, వీరసింహారెడ్డి సినిమాల కంటే తక్కువగానే బుకింగ్స్‌ జరిగాయని తెలుస్తోంది. సినిమా విడుదలైన మొదటిరోజే హైదరాబాద్‌,విశాఖ,విజయవాడ లాంటి నగరాల్లో సోల్డ్ ఔట్ షోలు చాలా తక్కువగానే కనిపించాయి. అంతేకాకుండా ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో ఉన్న షోలు కూడా ఆశించిన స్థాయిలో లేవు. విడుదలైన మొదటిరోజే రెండు రోజులే ఇలా ఉంటే తర్వాత మాత్రం కనీసం 30 శాతం టికెట్లు కూడా సోల్డ్‌ కాలేదని స్పష్టంగా తెలుస్తోంది.

బాలయ్యకు చెక్‌ పెట్టిన తారక్‌ ఫ్యాన్స్‌

బాలయ్య సినిమాకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి. బి, సి సెంటర్లలో ఎక్కువ మంది థియేటర్లకు వెళ్లి టికెట్లు కొంటారు. అయినా సరే అక్కడ కూడా చాలా థియేటర్ల వద్ద బుకింగ్స్‌ డల్లుగానే ఉన్నాయని తెలుస్తోంది. దీనంతటికి కారణం జూ. ఎన్టీఆర్‌ అభిమానులని తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం జూ ఎన్టీఆర్‌పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో ‘భగవంత్ కేసరి’ సినిమాకు వారు కూడా దూరం అయ్యారని తెలుస్తోంది. బాలయ్యకు, తారక్‌కు మధ్య విభేదాలు చాలా ఏళ్ల నుంచి ఉన్నప్పటికీ పలుమార్లు తారక్‌నే ఒకడుగు వెనక్కు తగ్గేవాడు.

కానీ చంద్రబాబు అరెస్ట్‌ గురించి తారక్‌ స్పందించకపోవడంతో అసహనానికి గురైన బాలయ్య ఏకంగా తారక్‌పై మండిపడ్డాడు. బహిరంగంగానే తారక్‌ను సంబోదిస్తూ 'డోంట్‌ కేర్‌' అనేసి అవమానించాడు. దీంతో జూనియర్ అభిమానులకు కోపం రావడమే కాకుండా వాళ్లు పట్టుబట్టి ఈ సినిమాను బాయ్‌కాట్ చేసినట్లు సమాచారం. తారక్‌ ఫ్యాన్స్‌ ఎవరూ భగవంత్‌ కేసరి చూసేందుకు వెళ్లకండి అంటూ సోషల్‌ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం చేశారు.

'డోంట్‌ కేర్‌ బాబాయ్‌' అని బాలయ్యకు ఇలా వార్న్‌ చేసిన తారక్‌
బాలకృష్ణ 'డోంట్‌ కేర్‌' అని చేసిన వ్యాఖ్యలకు జూ.ఎన్టీఆర్‌ ఒక అడుగు తగ్గి 'భగవత్‌ కేసరి'తో చెక్‌ పెడతాడని అందరూ ఆశించారు. సినిమా విడుదల సందర్భంగా 'ఆల్‌ ది బెస్ట్‌'తో ట్వీట్‌ చేస్తాడని నందమూరి ఫ్యాన్స్‌ ఆశించారు. కనీసం సినిమా విడుదలైన తర్వాత అయినా కంగ్రాట్స్‌ 'బాలయ్య బాబాయ్‌' అని చెబుతాడని కోరుకున్నారు. కానీ 'భగవంత్‌ కేసరి' విషయంలో అలాంటిదేమీ జరగలేదు. రీసెంట్‌గా తన బావమరిది నటించిన 'మ్యాడ్‌' సినిమా ట్రైలర్‌ను షేర్‌ చేసిన తారక్‌... బాబాయ్‌ చిత్రం గురించి మాత్రం ఎలాంటి ట్వీట్‌ చేయలేదు.

ఇదే దారిలో నందమూరి కల్యాణ్‌ రామ్‌ కూడా నడిచారని తెలుస్తోంది. ఆయన కూడా 'భగవంత్‌ కేసరి' గురించి ఎలాంటి కామెంట్‌ చేయలేదు. ఇలా అన్నాదమ్ముళ్లు ఇద్దరూ 'డోంట్‌ కేర్‌' అనేసి బాలయ్యకు సిగ్నల్‌ పంపించేశారని తెలుస్తోంది. దీంతో తారక్‌ ఫ్యాన్స్‌ సత్తా ఎలా ఉంటుందో 'భగవంత్‌ కేసరి' విషయంలో తెలిసిపోయిందని టాక్‌ నడుస్తోంది.

టీడీపీతో పొత్తు.. షాకిచ్చిన మెగా ఫ్యాన్స్‌
రాజమండ్రి జైలు వద్ద టీడీపీతో జనసేన పొత్తు ఉంటుందని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాకు మెగా ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ ఒక్కటి అవుతారని అందరూ అంచనా వేశారు. కానీ సినిమాల వరకు వచ్చేసరికి అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. తారక్‌ ఫ్యాన్స్‌ ఏ విధంగా అయితే డోంట్‌ కేర్‌ అన్నారో మెగా ఫ్యాన్స్‌ కూడా పవన్‌ కల్యాణ్‌ను డోంట్‌ కేర్‌ అనేశారా..? అనే సందేహాలు వస్తున్నాయి.

తారక్‌,మెగా ఫ్యాన్స్‌ ఎఫెక్ట్‌ భగవంత్‌ కేసరి చిత్రంపై భారీగానే పడినట్లు కనిపిస్తోంది. మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్‌లలో రెండో రోజుకు వచ్చేసరిగి ఒక్కసారిగా 60 శాతం డౌన్‌ అయ్యాయి. ఏదేమైనప్పటికి సినిమా క్లోజింగ్‌ సమయానికి భగవంత్‌ కేసరి చిత్రానికి నష్టాలు తప్పవని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement