హీరోయిన్ శ్రీలీలకు పెళ్లి? ఈ రూమర్స్‌లో నిజమెంత? | Actress Sreeleela Marriage Rumours Goes Viral | Sakshi
Sakshi News home page

Sreeleela Wedding: శ్రీలీల పెళ్లి చేసుకోనుందని రూమర్స్.. అసలేం జరిగింది?

Published Wed, Oct 11 2023 6:00 PM | Last Updated on Wed, Oct 11 2023 6:18 PM

Actress Sreeleela Marriage Rumours Viral Latest - Sakshi

ప్రస్తుతం తెలుగు సినిమాల్లో సెన్సేషన్‌గా మారిపోయిన హీరోయిన్ శ్రీలీల. ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టనప్పటికీ.. ఆ తర్వాత మాత్రం అరడజనుకు పైగా మూవీస్ ఒప్పుకొంది. దసరా నుంచి మొదలుపెడితే సంక్రాంతి వరకు నెలకో సినిమాతో ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయిపోయింది. సరిగ్గా ఇలాంటి టైంలో ఈమె పెళ్లి చేసుకోనుందనే రూమర్స్ వచ్చాయి.

(ఇదీ చదవండి: గిఫ్ట్ ఇచ్చిన సమంత.. అతడు తెగ మురిసిపోయాడు!)

ఇంతకీ ఏం జరిగింది?
'ధమాకా'తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న శ్రీలీల.. రీసెంట్‌గా 'స్కంద'తో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ దసరాకి 'భగవంత్ కేసరి' సినిమాతో థియేటర్లలోకి రానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బాలకృష్ణ కొడుకుతో ఓ ఫొటోలో ఈమె కనిపించింది. అంతే గాసిప్స్, రూమర్స్ అల్లేశారు. అతడితో పెళ్లికి రెడీ అయిందని న్యూస్ వైరల్ అయింది.

శ్రీలీల క్లారిటీ
అయితే ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో కుదురుకుంటున్న తనపై ఇలాంటి వార్తలు వచ్చేసరికి శ్రీలీల కాస్త డిస్ట్రర్బ్ అయినట్లు అయింది. పెళ్లి అంటూ వస్తున్న రూమర్స్‪‌లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చేసింది. ఇలాంటి వాటిని రాసేముందు నిజం తెలుసుకోవాలని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా భగవంత్ కేసరి తర్వాత ఆదికేశవ, ఎక్స్‌ట్రా, గుంటూరు కారం సినిమాలతో వరసగా శ్రీలీల థియేటర్లలోకి రానుంది.

(ఇదీ చదవండి: చై-సామ్‌ కలుస్తున్నారంటూ వార్తలు.. షాకిచ్చిన సమంత!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement