క్షమాపణలు చెప్పిన 'భగవంత్ కేసరి' డైరెక్టర్ | Director Anil Ravipudi Says Sorry For Balakrishna Bhagavanth Kesari Movie Mistakes - Sakshi
Sakshi News home page

Bhagavanth Kesari: అది మా తప్పే.. సారీ చెప్పిన దర్శకుడు అనిల్ రావిపూడి

Published Fri, Oct 20 2023 6:50 PM | Last Updated on Fri, Oct 20 2023 7:03 PM

Bhagavanth Kesari Movie Mistakes Director Anil Ravipudi Sorry - Sakshi

హీరో బాలకృష్ణ 'భగవంత్ కేసరి' సినిమా.. నిన్న(గురువారం) థియేటర్లలో రిలీజైంది. మరీ అంత సూపర్ అని చెప్పలేం గానీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాలయ్య, శ్రీలీల యాక్టింగ్ బాగుందని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే తొలిరోజు కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.30 కోట్లకు పైనే గ్రాస్ వచ్చింది. దీంతో శుక్రవారం 'భగవంత్ కేసరి' సక్సెస్ మీట్ పెట్టారు. ఇందులోనే మాట్లాడుతూ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ విషయమై సారీ చెప్పాడు.

(ఇదీ చదవండి: రెండోసారి తండ్రి అయిన 'బలగం' డైరెక్టర్ వేణు)

ఇంతకీ ఏమైంది?
భగవంత్ కేసరి సినిమాలో పోలీస్ అధికారి, ఖైదీ పాత్రల్లో బాలయ్య కనిపించాడు. అతడి పెంపుడు కూతురిగా శ్రీలీల నటించింది. గత సినిమాలతో పోలిస్తే శ్రీలీల ఇందులో సెటిల్డ్‌గా యాక్ట్ చేసింది. ఎమోషన్స్ సీన్స్‌తో పాటు క్లైమాక్స్‌లో యాక్షన్ సీన్స్ కూడా చేసి ఆశ్చర్యపరిచింది. అయితే ఇందులో శ్రీలీల పోషించిన విజ్జి పాత్ర తండ్రిగా శరత్ కుమార్ కాసేపు కనిపించారు. జైలర్‌ రోల్ చేశారు. కానీ ఆయన చనిపోయారని టీవీలో చెప్పినప్పుడు సీఐ అని స్క్రోలింగ్ వేస్తారు. తాజాగా ఇదే విషయాన్ని ఓ రిపోర్టర్ అనిల్ రావిపూడిని అడిగారు.

అనిల్ ఏం చెప్పాడు?
'పెద్ద కమర్షియల్ సినిమాలో మీరు ఇంత చిన్న మిస్టేక్ గుర్తించడం గొప్ప విషయం. మీ సునిశీత పరిశీలన, సూక్ష‍్మ బుద్దికి హ్యాట్సాఫ్. జైలర్‌ని సీఐ అని న్యూస్ చెప్పడం మా తప్పే. మా వాళ్లు పొరపాటుగా అలా వేసి ఉంటారు. అందుకు క్షమాపణలు' అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. ఇకపోతే సినిమా బ్లాక్‌బస్టర్ అంటున్నారు గానీ తొలిరోజు వసూళ్లలో చిరు 'భోళా శంకర్'ని బాలయ్య దాటలేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

(ఇదీ చదవండి: మెగాస్టార్ పాన్ ఇండియా సినిమా.. రెండు నెలల్లో పూర్తి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement