'భగవంత్ కేసరి'లో బిగ్‌బాస్‌-7 బ్యూటీ.. ఏకంగా మంత్రిగానే కీ రోల్‌ | Bigg Boss Rathika Rose In Balakrishna Bhagavanth Kesari Movie, Know About Her Role Details - Sakshi
Sakshi News home page

Rathika Rose In Bhagavanth Kesari: 'భగవంత్ కేసరి'లో బిగ్‌బాస్‌-7 బ్యూటీ.. ఏకంగా మంత్రిగానే కీ రోల్‌.. ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషి

Published Thu, Oct 19 2023 3:53 PM | Last Updated on Sat, Oct 21 2023 11:15 AM

Bigg Boss Rathika Rose In Bhagavanth Kesari - Sakshi

బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబినేషన్లో 'భగవంత్ కేసరి' నేడు (అక్టోబర్‌ 19) విడుదలైంది. యాక్షన్ అండ్​ ఎమోషనల్ కంటెంట్‌తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బాలకృష్ణకు కూతురు పాత్రలో యంగ్‌ బ్యూటీ శ్రీలీల నటించడం విషేశం అయితే. ఈ చిత్రంలో తెలుగు అమ్మాయి, బిగ్ బాస్ కంటెస్టెంట్ రతికారోజ్‌ కూడా ఒక కీలక పాత్రలో మెరిసింది.  

(ఇదీ చదవండి: ఈ కారణం వల్లే సూర్యతో పెళ్లి.. మొదటిసారి రివీల్‌ చేసిన జ్యోతిక)

బిగ్‌బాస్‌ సీజన్‌ ఏడులో ఆమె కంటెస్టెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే. కానీ సినిమా విడుదల వరకు ఆ సినిమాలో రతిక ఉన్నట్లు ఎక్కడా ఆమె చెప్పలేదు. కానీ సినిమా చూసిన ప్రేక్షకులు స్క్రీన్‌పై రతికాను చూసి సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఇందులో రతికా రోజ్ ఓ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేగా కనిపించిడమే కాకుండా మంత్రిగా మెప్పించిందట. ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడే మహిళా మంత్రిగా నవ్వులు పూయించిందట రతిక. ఆమె ఎక్కువ సేపు స్క్రీన్ మీద కనిపించకపోయినప్పటికీ ఉన్నంతసేపు ప్రేక్షకులను ఆకట్టుకుందనే టాక్ నడుస్తోంది. స్క్రీన్‌పై రతికా రోజ్‌ కనిపించగానే ఈలలతో థియేటర్‌ ఒక్కసారిగా దద్దరిల్లిపోయిందట.  

గతంలో నారప్ప, కార్తికేయ, దృశ్యం 2 తదితర చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఈ బ్యూటీకి దర్శకుడు కె.రాఘవేంద్రరావు అవకాశమిచ్చారు. స్వయంగా ఈ విషయాన్ని రతికనే ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. బిగ్​ బాస్ ఏడో కంటెస్టెంట్​గా ఎంట్రీ ఇచ్చిన రతికా రోజ్.. నాలుగో వారంలోనే బయటకు వచ్చేసింది. కానీ పల్లవి ప్రశాంత్‌తో ఆమె గొడవ పడటంతో ఆయన ఫ్యాన్స్‌ రతికా రోజ్‌ను దారుణంగా ట్రోల్‌ చేయడమే కాకుండా ఆమెపై నెగటివిటీ వచ్చేలా సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారని విమర్శలు ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement