ఓటీటీకి భగవంత్ కేసరి.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ | Balakrishna Bhagavanth Kesari Movie OTT Released Date Fixed, Check Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Bhagavanth Kesari In OTT: ఓటీటీకి భగవంత్ కేసరి.. ఆ రోజు అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్

Published Thu, Nov 23 2023 4:06 PM | Last Updated on Thu, Nov 23 2023 4:41 PM

Balakrishna Bhagavanth Kesari Movie Streaming Date Fixed - Sakshi

నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం 'భగవంత్ కేసరి'. ఈ చిత్రంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల ప్రత్యేకపాత్రలో మెరిసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరెక్కించిన ఈ చిత్రం దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ రావడంతో వందకోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే బాలయ్య అభిమానుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. 

కాగా.. ఇప్పటికే 'భగవంత్ కేసరి' డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది. అక్టోబరు 19న ఈ మూవీ థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం నవంబర్‌ 24న స్ట‍్రీమింగ్ కానుంది. అయితే మొదట ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌పై చాలా సార్లు రూమర్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం అఫీషియల్‌గా ఓటీటీ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. దీంతో ఈ శుక్రవారమే భగవంత్ కేసరి కుటుంబంతో కలిసి చూసేయొచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement