
టాలీవుడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం జాక్. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా జాక్ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. అయితే ట్రైలర్‌లో ఎక్కువగా బూతులు వినియోగించడంతో సెన్సార్ విషయంలో ఇబ్బందులు రావొచ్చని ఊహించారు. కానీ ఎలాంటి కట్స్ లేకుండానే సెన్సార్ పూర్తియినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం.
The equation is set 😎
The chaos is calculated 🤟🏻#JACK certified 𝐔/𝐀
Rounding off the entertainment in the most explosive way ❤️🔥
Bookings are now open 🎟️ https://t.co/6uRbOx5ekl#JackOnApril10th#SidduJonnalagadda @iamvaishnavi04 @baskifilmz @Prakashraaj #AchuRajamani… pic.twitter.com/9DbOmDuqb3— SVCC (@SVCCofficial) April 7, 2025