Prakash RAJ
-
పవన్ కల్యాణ్.. విధ్వంస రాజకీయం చేస్తున్నాడు: ప్రకాష్ రాజ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయ తీరుపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీలో పవన్ చేస్తున్న పాలిటిక్స్‌పై తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు. సనాతన ధర్మం పేరుతో పవన్ చేస్తున్న రాజకీయంపై ఆయన పలుమార్లు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: శ్రీకాంత్ అయ్యంగర్.. ఏంటీ నోటి దురుసు?)ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొన్న ప్రకాష్ రాజ్.. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ అంటే మీకెందుకు అంత కోపం? అని అడగ్గా.. పవన్ కల్యాణ్ మూర్ఖత్వంగా రాజకీయాలు చేస్తున్నాడు. విధ్వంస రాజకీయం చేస్తున్నాడు. అది నాకు నచ్చడం లేదు. అది మాత్రమే చెబుతున్నాను. ప్రజలు ఆయన్ను ఎన్నుకుంది ఇలాంటి పాలిటిక్స్ కోసం కాదు కదా? ప్రజల తరుపున పవన్‌ని అడిగేవారు కూడా ఉండాలి కదా! మతం పేరుతో రాజకీయం చేసి అయోధ్యలో (బీజేపీ) ఓడిపోయారు. ఇప్పుడు మన కొండ ఎక్కడానికి వచ్చారు. మత తత్వ రాజకీయాలు మన దక్షిణ భారతదేశంలో బలపడే అవకాశం ఉండదు' అని ప్రకాశ్ రాజ్ అన్నాడు.తనకు సినిమా ఛాన్సులు రాకుండా ఎవరూ అడ్డుకోలేరని ప్రకాష్ రాజ్ ధీమా వ్యక్తం చేశాడు. సినిమాలు వస్తూనే ఉన్నాయి.. పనిచేస్తూనే ఉన్నాను ఎవరైనా ఆపగలరా అని అన్నాడు. తన వల్ల సినిమా ఇండస్ట్రీలో ఎవరూ ఇబ్బంది పడలేదని.. సమాజంలో జరిగే తప్పులను చూస్తూ నోరు మెదపకుండా ఉండలేనని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో తనకు సినిమా అవకాశాలు కోల్పోయినా ప్రశ్నించడం మాత్రం ఆపనని ప్రకాష్ రాజ్ బలంగా చెప్పారు.(ఇదీ చదవండి: వీడియో షేర్ చేస్తూ 'సాయి పల్లవి'ని టార్గెట్ చేస్తుందెవరు..?) -
'మీరు అదే పనిలో ఉండండి'.. పవన్ కల్యాణ్‌కు మరోసారి కౌంటర్!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్ చేశారు. నిన్న తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో సనాతన ధర్మం గురించి పవన్ కామెంట్స్ చేశారు. తాజాగా దీనిపై ప్రకాశ్ రాజ్ తనదైన స్టైల్లో స్పందించారు. 'మీరు సనాతన ధర్మ పరిరక్షణలో ఉండండి.. సమాజ రక్షణలో మేముంటాం'.. జస్ట్ ఆస్కింగ్.. ఆల్ ది బెస్ట్' అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.(ఇది చదవండి: పవన్ కల్యాణ్‌కి ప్రకాష్ రాజ్ మరో సూటి ప్రశ్న)కాగా.. తిరుపతి లడ్డు వ్యవహారం మొదలైనప్పటి నుంచి ప్రకాశ్ రాజ్ వరుస పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అంతకుముందే కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ కదా ?. … ఇక చాలు… ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి అంటూ ఘూటుగా ఇచ్చిపడేశారు. నిన్న తిరుమల డిప్యూటీ సీఎం పవన్.. వారాహి డిక్లరేషన్ పేరుతో సనాతన ధర్మాన్ని కాపాడాతానంటూ ఆవేశంగా మాట్లాడారు. దీంతో ప్రకాశ్ రాజ్ మరోసారి పవన్‌కు చురకలంటించారు. సనాతన ధర్మ రక్షణలో మీరుండండి. సమాజ రక్షణలో మేముంటాం. జస్ట్ ఆస్కింగ్. 🙏🏿🙏🏿🙏🏿 All the Best #justasking— Prakash Raj (@prakashraaj) October 4, 2024 -
చంద్రయాన్-3 సక్సెస్.. ప్రకాశ్ రాజ్‌ను ఓ రేంజ్లో ఆడేసుకుంటున్న నెటిజన్స్!
యావత్ భారత్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చంద్రయాన్-3 సక్సెస్ అయింది. ఇస్రో శాస్త్రవేత్తల అహర్నిషలు కృషి చేసిన కష్టానికి ఫలితం దక్కింది. ఆగస్టు 23, 2023 భారతదేశ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయంగా లిఖించబడింది. ఇంతటి ఘనత సాధించిన మన శాస్త్రవేత్తలను ఘనతను ప్రపంచ మొత్తం అభినందిస్తోంది. ఈ విజయం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. (ఇది చదవండి: జాబిల్లిపై ఇండియా జయకేతనం.. టాలీవుడ్ స్టార్స్ విషెస్ ) అయితే ఇంతకుముందు విక్రమ్ ల్యాండర్ గురించి నటుడు ప్రకాశ్ రాజ్ ఓ ఫోటోను ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. శాస్త్రవేత్తల మనోభావాలు దెబ్బతినేలా ఇస్రో ఛైర్మన్ ఛాయ్ పోస్తున్న ఫోటోను షేర్ చేశారు. దీనిపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. అంతే కాకుండా ప్రకాశ్ రాజ్‌పై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావడంతో ప్రకాశ్ రాజ్‌పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. చంద్రయాన్ తీసిన ప్రకాశ్ రాజ్ ఫోటో ఇదేనంటూ.. అతను బురదలో ఉన్న ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇంకా కొన్ని సినిమాల్లోని ప్రకాశ్ రాజ్ క్లిప్స్‌ను షేర్ చేస్తూ నెటిజన్స్ ఆడేసుకుంటున్నారు. చంద్రయాన్-3 నుంచి రోవర్ ప్రగ్యాన్ తీసిన మొదటి చిత్రం ఇదేనంటూ నెటిజన్స్ ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇస్రో విజయం పట్ల కంగ్రాట్స్ చెబుతూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. (ఇది చదవండి: కొందరి జీవితాలు అంతే.. ప్రకాశ్ రాజ్‌కు అనుపమ్ ఖేర్ గట్టి కౌంటర్..!) Early Pictures coming in from Moon after landing of #Chandrayaan3. 🌕#justasking #PrakashRaj 😂😂 pic.twitter.com/c1pqizkNbC — Keshav Soni (@ImKeshavSoni) August 23, 2023 For Prakash Raj ji, 1 Like = 1 Slap 1 Retweet = 100 Slap#justasking pic.twitter.com/zRJkdib1bm — WTF (@WeTheFukrey) August 23, 2023 BREAKING NEWS:- First picture coming from the Moon by #VikramLander Wowww Prakash Raj #justasking pic.twitter.com/UsinHfbzlx — Kadak (@kadak_chai_) August 21, 2023 PROUD MOMENT for INDIA and to Humankind.. 🙏🏿🙏🏿🙏🏿Thank you #ISRO #Chandrayaan3 #VikramLander and to everyone who contributed to make this happen .. may this guide us to Explore and Celebrate the mystery of our UNIVERSE .. #justasking — Prakash Raj (@prakashraaj) August 23, 2023 -
మీరు ఏ చాయ్‌వాలా గురించి అనుకున్నారో?
న్యూఢిల్లీ: భారత దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3పై అనుచిత వ్యాఖ్యలు చేసి నవ్వులపాలైన సినీ నటుడు ప్రకాష్ రాజ్‌ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. అయినా కూడా ప్రకాష్ రాజ్ తన తప్పును ఒప్పుకోలేదు సరికదా దానిని సమర్ధించుకున్నాడు. ప్రకాష్ రాజ్ చంద్రయాన్-3 పై చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్లో పెద్ద దుమారాన్నే రేపాయి. జులై 14న భారత కీర్తి పతాకాన్ని ఎగురవేస్తూ చంద్రుడిపై కాలు మోపడానికి సిద్ధంగా ఉన్న చంద్రయాన్-3 పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్)లో టీ వడపోస్తున్న ఒక వ్యక్తి ఫోటో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నెటిజన్లు ప్రకాష్ రాజ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా ప్రకాష్ రాజ్ తన తప్పును ఒప్పుకోకపోగా తాను పోస్ట్ చేసిన దానిని సమర్ధించుకున్నాడు. ద్వేషించే వారికి అంతా ద్వేషమే కనిపిస్తుంది.. అది ఆర్మ్ స్ట్రాంగ్ కాలం నాటి జోక్.. అది అర్ధం చేసుకోకుండా ఎవరికి వారు విమర్శిస్తే ఎట్లా? నేను కేరళ చాయ్‌వాలాని ఉద్దేశించి పోస్ట్ చేశాను.. మీరు ఏ చాయ్‌వాలా గురించి అనుకున్నారో..? అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. చంద్రయాన్-3 పార్టీలకతీతంగా ప్రతి భారతీయుడు గర్వించాల్సిన ప్రయోగమని.. ఎవ్వరైనా ఆ వ్యత్యాసాన్ని గ్రహించి ప్రవర్తించాలని అత్యధికులు అభిప్రాయపడ్డారు. ఇది కూడా చదవండి: నా భర్త రాజకీయ జీవితం కిరాతకంగా ముగిసింది.. సోనియా -
ప్రకాష్ రాజ్ కు భయపడ్డాను.. |
-
‘రంగమార్తాండ’ క్లైమాక్స్ అలా ఉండి ఉంటే మరింత బాగుండేది
పరుచూరి గోపాలకృష్ణ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కొత్త సినిమాలపై ఎప్పటికప్పుడు తన రివ్యూలను అభిమానులతో పంచుకుంటారు. ఇటీవలే విడుదలైన సూపర్ హిట్ టాక్ అందుకున్న 'రంగమార్తాండ' చిత్రంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, అనసూయ ప్రధానపాత్రల్లో నటించారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..'సినిమా గురించి నేను ఎక్కువ చెప్పడం లేదు. ఈ సినిమాలో జీవితం గురించి ఉంది కాబట్టి చెబుతున్నా. ప్రస్తుత సమాజంలో ఎక్కడైనా ఏదైనా జరుగుతూ ఉంటే చూసి కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు. ఒక అమ్మాయిని చంపుతుంటే ఎవరు పట్టించుకోకుండా వీడియోలు తీసే సీన్‌తోనే సినిమా ప్రారంభమైంది. ప్రపంచంలో మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, రాహుల్, అనసూయ, శివాత్మిక, ఆదర్శ్ అద్భుతంగా నటించారు. శివాత్మిక పాత్ర అద్దం పట్టేలా ఉంటుంది. ఒక కూతురు తన తండ్రిని సెల్లార్లో పడుకోమని చెప్పినప్పుడు ప్రేక్షకులకు తప్పకుండా కన్నీళ్లు వచ్చేస్తాయి. ఈ సినిమాలో బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. బ్రహ్మానందం అంటే నవ్విస్తాడనుకుంటాం. కానీ ఆయన ఏడిపించగలడని ఈ సినిమాలో నిరూపించారు. మన అమ్మా, నాన్నలను మించినది ఏది లేదు. మనకు ఏది రాదు కూడా. అందుకే వారిని పదిలంగా చూసుకుందాం. ఈ సినిమా చూశాక ఎవరైనా తమ అమ్మా, నాన్న దగ్గరకు వెళ్లి ఉంటే కృష్ణవంశీ జన్మ ధన్యమైనట్లే. కళాభారతిని చూసి రాఘవరావు అంటే ప్రకాశ్ రాజ్ కన్న మూయడం. పిల్లలందరూ వచ్చి చూడడంతో క్లైమాక్స్ చూపించారు. కళాభారతిని పునర్ నిర్మాణం చేయించి.. రాఘవరావు సౌజన్యంతో అని పెట్టి క్లైమాక్స్ సీన్ తీసి ఉంటే ఇంకా బాగుండేది. ఈ విషయాన్ని కృష్ణవంశీతో చెప్పా. కానీ ఒరిజినల్ కథలో అలా లేదు. అందుకే పెట్టలేదన్నారు. ప్రకాశ్‌రాజ్‌కు, బ్రహ్మనందానికి మధ్య ఉండే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. అంతే కాకుండా ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం నటనా ప్రావీణ్యాన్ని తెలిసేలా ఇంకొన్ని షాట్స్ పెట్టి ఉంటే మరిన్ని వసూళ్లు రాబట్టేది. కన్నీళ్లు రావు అనుకున్న వాళ్లకు కూడా కన్నీళ్లు తెప్పించే సినిమా ఇది.' అని పరుచూరి వివరించారు. -
ఓటీటీలో రంగమార్తాండ.. అప్పుడే రిలీజ్!
ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రంగ మార్తాండ’. ఈ చిత్రానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల థియేటర్లలో అలరిస్తోంది. మరాఠీ సూపర్ హిట్ ‘నట సామ్రాట్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రంగమార్తాండ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమా రిలీజైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేగాక.. సినిమాకు పెట్టిన బడ్జెట్లో దాదాపు 70 శాతానికి పైగా రికవరీ అయ్యేలా డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. -
'నీ బంగారు నిన్ను దొంగ అంటోంది'.. ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్
ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'రంగమార్తాండ'. దర్శకుడు కృష్ణవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఉగాది కానుకగా ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను హౌల్ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్ చూస్తే కుటుంబంలో జరిగే సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించినట్లు కనిపిస్తోంది. కుటుంబ నేపథ్యంలో సాగే ఎమోషన్స్, డైలాగ్స్ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ముఖ్యంగా రమ్యకృష్ణ-ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం-ప్రకాశ్ రాజ్ మధ్య సాగే ఎమోషన్స్ ఈ చిత్రంలో హైలెట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలర్లో బ్రహ్మనందం సీరియస్ లుక్ సినిమాకే హైలెట్‌గా మారనుంది. జీవితంలో నటనను ప్రాణంగా భావించే ఒక రంగస్థల కళాకారుడి జీవిత అనుభవాలను సినిమాగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు కూడా ఈ చిత్రంలో నటించారు. ఇప్పటికే సినీ ప్రముఖుల కోసం ప్రీమియర్ షోను ప్రదర్శించగా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. -
‘1997’ అందరూ తప్పక చూడాల్సిన సినిమా: నటుడు ప్రకాష్ రాజ్
నటుడు నవీన్ చంద్ర, డా.మోహన్, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న భిన్నమైన కథా చిత్రం 1997. రియల్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన భిన్నమైన చిత్రం ఇది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, మూడు ప్రధాన పాత్రల్లో నటించిన మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్ లుక్స్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఏమి బతుకు.. ఏమి బతుకు’కు మంచి స్పందన లభించింది. మంగ్లీ పాడిన ఈ సాంగ్ అద్భుతంగా ఉందని మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. తాజాగా ఈ సాంగ్ నీ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చూసి చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు...ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ...1997..నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, డాక్టర్ మోహన్ ముఖ్య పాత్రల్లో డాక్టర్ మోహన్ డాక్టర్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలోని పాట విన్నాను, కథ గురించి తెలుసుకున్నాను. ఈ రోజుల్లో కూడా మనల్ని బాధ పెడుతున్న సమస్యల గురించి సినిమా తీశారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. నిజంగా ఇలాంటి మంచి ప్రయత్నం చేసిన మోహన్ అండ్ టీమ్ నీ అభినందిస్తున్నాను. అలాగే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాను అన్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఈ సినిమాలో నటించడంతో పాటు సంగీతం అందిస్తుండటం విశేషం. ఈశ్వర్ పార్వతి మూవీస్ పతాకంపై మీనాక్షి రమావత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. -
నటుడు ఉత్తేజ్కి సతీ వియోగం.. పరామర్శించిన పలువురు ప్రముఖులు
-
Maa Elections 2021: ప్రకాశ్‌రాజ్‌కు ఆ స్టార్ డైరెక్టర్ సపోర్ట్
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఎన్నికలకు సమయం ఇంకా ఉన్నప్పటికీ అప్పుడే అభ్యర్థులు ప్రత్యర్థులపై ఆరోపణలు చేసుకోవడం, విమర్శనాస్త్రాలు సంధించుకోవడం మొదలెట్టేశారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఇవి రాజకీయ ఎన్నికలలానే కనిపిస్తున్నాయి. కాగా ఈ ఎన్నికలకు సంబంధించి ఎక్కువగా వార్తల్లో విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ పేరే వినపడుతోంది. అభ్యర్థిగా పేరు ప్రకటించిన రోజు నుంచి ఏదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం మన మోనార్క్‌కు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సపోర్ట్ ఉందని టాలీవుడ్లో టాక్. ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తుండగా....ఇదివరకే ఆయనకు సంబంధించి లోకల్ నాన్ లోకల్ అంశం తెరపైకి రావడం ఈ ఎన్నికల వేడిని కాస్త పెంచిదనే చెప్పాలి. ఈ విషయంలో కొందరు సినీ ప్రముఖులు ప్రకాశ్ రాజ్‌కు మద్దతుగా నిలవగా, మరికొందరు దీనిని సమర్థిస్తున్నారు. ఇదే అంశంపై వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ తనదైన శైలిలో కామెంట్లు చేయడం కూడా తెలిసిందే. ఇంత హంగామా ప్రకాశ్ రాజ్ చూట్టు జరుగుతుండగా ఈ తరుణంలో తాజాగా పూరి జగన్నాథ్ సహకారం కూడా ఉందనే వార్త బయటకు రావడం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ప్రకాష్ రాజ్‌కి మెగా ఫ్యామిలీ మద్దతు ఉందని సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్, ప్రకాష్ రాజ్ మధ్య మంచి స్నేహబంధం కొనసాగుతోంది. 'బద్రి' సినిమా టైమ్ నుంచే వీళ్ళ మధ్య మంచి బాండింగ్ కొనసాగుతోంది. ఈ బాండింగ్ కారణంగానే పూరి సహాయం కోరారట ప్రకాష్ రాజ్. దీంతో ఆయన రిక్వెస్ట్ అగ్రీ చేసిన పూరి.. బ్యాక్ గ్రౌండ్లో కొన్ని కీలకమైన సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు సమాచారం. -
ప్రకాశ్ రాజ్‌పై ప్రజావ్యాజ్యం వేస్తాం
శివాజీనగర : బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ కర్ణాటకతో పాటు మూడు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలో పేరు ఉండటంతో హైకోర్టులో వ్యాజ్యం వేయనున్నట్లు శాంతినగర నివాసి కే.గిరీశ్ కుమార్ నాయుడు తెలిపారు. ఆదివారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో మూడు చోట్ల ఓటర్ల జాబితా ఉన్న విషయాన్ని తెలియజేసిన ఆయన, బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ శాంతినగర అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో తమ పేరును చేర్చారు. మిగిలిన తమిళనాడులో, తెలంగాణ రాష్ట్రంలో సేర్‌లింగమ్ పల్లి శాసనసభ నియోజకవర్గ ఓటర్ల జాబితాను తమ పేరును అలాగే ఉంచుకొన్నారని ఆరోపించారు. రాజ్యాంగ ఎన్నికల నియమాల ప్రకారం ఒక వ్యక్తికి ఒకేచోటకంటే అధిక విధానసభా నియోజకవర్గ ఓటర్ల జాబితాలో పేరు ఉంచుకోవటం చట్ట ఉల్లంఘన అవుతుందన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గతనెల 28న ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. హైకోర్టులో ఈ విషయంపై ప్రజావాజ్యం వేస్తామన్నారు. -
ప్రకాశ్‌రాజ్‌కు పోలీసుల నోటీసు
కర్ణాటక, యశవంతపుర : హిందువులను అవహేళనంగా మాట్లాడిన బహుభాష నటుడు ప్రకాశ్‌రాజ్‌కు బెంగళూరు పోలీసులు విచారణ నోటీస్‌ను జారీ చేశారు. న్యాయవాది ఎన్.కిరణ్ బెంగరూరు 24వ ఎసీఎంఎం కోర్డు ఆదేశాల మేరకు హనుమంతనగర పోలీసులు ప్రకాశ్‌రాజ్‌పై కేసు నమోదు చేశారు. దీంతో తమ ముందు హజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. విజయపురలో జరిగిన సమావేశంలో గోమాత గురించి ఏమి తెలియదు. బట్టలు సుభ్రం కావాలంటే ఒక కేజీ పేడ, రెండు లీటర్ల గోమూత్రంతో బట్టలను శుభ్రం చేసుకోవాలని అవహేళనగా మాట్లాడారు. హిందువుల మనోభావాలను రెచ్చకొట్టిన ప్రకాశ్‌రాజ్‌పై చర్యలు తీసుకోనేలా పోలీసులను అదేశించాలంటూ రెండు నెలల క్రితం న్యాయవాది కిరణ్‌కేసు దాఖలు చేశారు. దీంతో ప్రకాశ్‌రాజ్‌కు పోలీసులు నోటీసును జారీ చేశారు. -
హిట్‌లిస్టులో 60 మంది
బనశంకరి: బెంగళూరులో ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్యకేసులో కీలక నిందితులు నివ్వెరపోయే నిజాలను బయటపెడుతున్నారు. తమకు మతం కంటే ఏదీ ఎక్కువ కాదని, మతాన్ని కించపరిస్తే సహించేది లేదని చెబుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాలు కలిపి 5 రాష్ట్రాల్లో హిందూ వ్యతిరేకులుగా ఉన్న 60 మంది సాహితీవేత్తలు, సామాజికవేత్తల జాబితాను సిద్ధం చేసి వారిని అంతమొందించటానికి సిద్ధమైనట్లు గౌరీ లంకేశ్ హత్య కేసులో పట్టుబడిన షార్ప్‌షూటర్ పరశురామ్ వాగ్మారే సిట్ ముందు బయట పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీరందరికీ ప్రాణభయం లేకుండా భారీ భద్రత కల్పించాలని వారికి సాయుధ భద్రత కల్పించాలని, కార్యాలయాలు, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు అమర్చాలని, వీరు వెళ్లే ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లు చేయాలని సిట్ రాష్ట్ర హోంశాఖకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, నటుడు గిరీష్ కర్నాడ్, సాహితీవేత్తలు కేఎస్.భగవాన్, నరేంద్రనాయక్, నిడుమామిడి మఠం శ్రీ వీరభద్ర చెన్నమల్లస్వామికి భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ హిట్‌లిస్టులో ప్రముఖ బహుభాషా నటుడు ప్రకాష్‌రాజ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. -
హిందుత్వ ప్రచారం పనిచేయదు..
సాక్షి, బెంగళూరు : బీజేపీ ప్రచారం చేస్తున్న హిందుత్వ వాదం భారత్‌లో పని చేయదని సినీనటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు.‘సంస్కృతి- విబేధాలు’ అంశంపై ఓ చర్చ వేదికలో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక సంస్కృతి గురించి మాట్లాడుతూ.. ‘ మేము(కర్ణాటక వాసులు) అందరితో కలిసి జీవిస్తాము. అందరిని ఆదరిస్తాం. ఇతరులతో సామరస్యంగా ఉంటాం. కర్ణాటకలో బహుళ సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి. ఇక్కడ హిందుత్వ(బీజేపీ) ప్రచారం పనిచేయదు.’ అని పేర్కొన్నారు. కర్ణాటక ప్రజలు బీజేపీని ఆదరిస్తారా అన్న ప్రశ్నకు ప్రకాశ్ రాజ్ సమాధానమిస్తూ కొద్ది రోజుల్లో మీరే చూస్తారు(వచ్చే నెలలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి) అని బదులిచ్చారు. కర్ణాటకవాసులు చాలా సహనంతో ఉంటారని, ఏ హిందుత్వ పార్టీలు కూడా వారిని విడగొట్టలేవని ఆయన అన్నారు. మతం పేరుతో ప్రచారం చేస్తున్నవారు కర్ణాటక ప్రజల మన్నలను పొందలేరని బీజేపీ ఉద్దేశించి ఆయన వాఖ్యాలు చేశారు. కాగా ప్రకాశ్ రాజ్ ఆరోపణలను బీజేపీ అధికార ప్రతినిధి మాలవికా అవినాశ్ తీవ్రంగా ఖండించారు. ‘మేము హిందువులం అయినప్పటికి లౌకిక వాదాన్ని పాటిస్తామ’ని పేర్కొన్నారు. భారత్‌లో హిందుమతం ఎప్పటినుంచో ఉందని, మేము అన్ని మతాలను గౌరవిస్తూ సామరస్యంతో ఉంటూన్నామని అవినాశ్ పేర్కొన్నారు. హిందూలు అన్ని మతాల వారితో కలిసి ఉంటారని అన్నారు. -
కేంద్ర మంత్రిపై ప్రకాశ్ రాజ్ ఫైర్
సాక్షి, బెంగళూరు : బీజేపీ నేత అనంత్ కుమార్ హెగ్దే మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. దళితులను కించపరిచేలా ఆయన మాట్లాడారు. మొరుగుతున్న కుక్కలకు తాము భయపడబోమంటూ పరోక్షంగా తనను అడ్డుకున్న దళితులపై చిర్రుబుర్రులాడారు. రాజ్యాంగాన్ని మార్చేస్తామని, అందుకే తాము అధికారంలోకి వచ్చామని, లౌకిక పదాన్ని త్వరలోనే రాజ్యాంగంలో నుంచి తొలగించనున్నామని కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్దే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతోపాటు ఆందోళనలు బయల్దేరడంతో అని పార్లమెంటు సాక్షిగా క్షమాపణలు చెప్పారు. తాజాగా బెంగళూరు నుంచి బళ్లారి వచ్చిన ఆయన ఓ జాబ్ ఫెయిర్‌ను ప్రారంభించేందుకు కారులో వచ్చారు. ఈ సందర్భంగా కొంతమంది దళితులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. రాజ్యాంగంపై పరుష వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. అయితే, జాబ్ ఫెయిర్ ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడుతూ ‘మేం మీకు సాయం చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నాము. ఏదేమైనా మేం మీతో ఉంటాము. మా ప్రజలను బతికించుకునేందుకు మేం ఏమైనా చేస్తాం. వీధి కుక్కల అరుపులకు, ఆందోళనలు, నిరసనలకు మేం తలవంచబోం’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై నటుడు ప్రకాశ్ రాజ్ వెంటనే గట్టి కౌంటర్ ఇచ్చారు. హెగ్దే ఎన్ని తప్పులు చేస్తారని, ఇక ఆయన ఆపాలని, దళితులను వీధికుక్కలంటూ అవమానిస్తారా? అని ట్విటర్లో ప్రశ్నించారు. బీజేపీ సీనియర్ నాయకత్వం వెంటనే హెగ్దేను దిగిపోవాలని ఆదేశించాలని, క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. Enough is enough.🙏🙏🙏..Serial offender...minister Ananthkumar Hegde at it again....he calls Dalits DOGs ..for protesting against his controversial constitution remark... supreme leaders of #bjp will you ask him to step down ...or do you endorse his abuse #justasking — Prakash Raj (@prakashraaj) January 20, 2018 -
నా ముందు నటించొద్దు..
శివాజీనగర (బెంగళూరు): పత్రికా సంపాదకురాలు గౌరీ లంకేశ్ హత్య విషయంలో ప్రధాని మోదీపై నటుడు ప్రకాశ్‌రాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గౌరి మరణాన్ని సంబరంగా జరుపుకుంటున్న వారెవరనేది సామాజిక మాధ్యమాల ద్వారా తెలుస్తూనే ఉందనీ, అయినా మోదీ కళ్లు మూసుకుని మౌనం వహిస్తూ గొప్పగా నటిస్తున్నారని ప్రకాశ్‌రాజ్ అన్నారు. మోదీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘నేను మీ కన్నా గొప్ప నటుడిని. నా ముందు నటించాలని యత్నించకండి. నటుడిగా నన్ను గౌరవించండి. నటన గురించి మీకేమీ తెలియకపోయినా మీరు నటిస్తున్నారంటే...యువతరం, నేను, జనాలు పిచ్చివాళ్లమని మీరు భావిస్తున్నారా? మీరు నాకన్నా గొప్పగా నటిస్తున్నారు. నాకు వచ్చిన ఐదు జాతీయ అవార్డులు మీకే ఇచ్చేయాలనిపిస్తోంది’ అని అన్నారు. మతవాద సంస్థలకు వ్యతిరేకంగా వార్తలు రాసిన గౌరీని కొందరు దుండగులు సెప్టెంబరు 5న రాత్రి ఆమె ఇంటివద్దనే చాలా దగ్గరి నుంచి తుపాకీతో కాల్చి చంపడం తెలిసిందే. సీపీఎంకు చెందిన డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సదస్సును ఆదివారం ప్రారంభించిన అనంతరం ప్రకాశ్‌రాజ్ మాట్లాడారు. ‘నేను చెప్పేదేంటంటే ఆమెను చంపిందెవరనేది ముఖ్యం కాదు. ట్వీటర్లో ఆమె మరణాన్ని వేడుకగా జరుపుకుంటున్నవారెవరో కనిపిస్తూనే ఉంది. చంపినవారెవరో గుర్తించడానికి సాక్ష్యాలు లేకపోవచ్చు. కానీ ఆ మరణాన్ని కొందరు సంబంరంగా జరుపుకుంటున్నా, ఒక్క మాట మాట్లాడుకుండా కళ్లు మూసుకుని మౌనం వహిస్తున్న ప్రధాని మనకు ఉన్నారు’ అంటూ ప్రకాశ్‌రాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గౌరీలంకేశ్ తనకు సన్నిహితురాలని ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు. -
ఫిఫ్టీన్ ఇయర్స్ పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్
హీరోయిన్లకు ఎంత గుడ్ లక్ ఉంటుందో, అంత బ్యాడ్ లక్ కూడా ఉంటుంది. ఎంత త్వరగా హిట్ అవుతారో... అంతే త్వరగా వాళ్ల ఇన్నింగ్స్ ముగిసిపోతాయి. ఆ తర్వాత ఐటెమ్ సాంగ్స్. అక్కా, వదిన పాత్రలు చేసుకోవాల్సిందే. పాత తరం హీరోయిన్లకైతే 15, 20 ఏళ్ల కెరీర్ స్పాన్ ఉండేది. ఇప్పుడలాంటి అవకాశమే ఉండటంలేదు. అలాగని అందర్నీ ఒకే గాటన కట్టేయలేం. శ్రీయ, త్రిష, తమన్నా లాంటివాళ్లు మహా జోరుగా లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. శ్రీయ అయితే.. స్టిల్ 15 ఇయర్స్ బ్యాటింగ్. పదిహేనేళ్లయినా ఎక్కడా పట్టు తగ్గకుండా ఆమె సినిమాలు చేయగలుగుతున్నారు. 2001లో ‘ఇష్టం’తో ఎంతో ఇష్టంగా కథానాయికగా పరిచయం అయ్యారు శ్రీయ. ఆ సినిమా గొప్పగా ఆడకపోయినా నలుగురి దృష్టీ శ్రీయ మీద పడింది. ఆ తర్వాత చేసిన ‘సంతోషం’ శ్రీయను తిరుగు లేని తారను చేసింది. అప్పట్నుంచీ ఏడాదికి ఐదారు సినిమాలకు తగ్గకుండా, క్షణం తీరిక లేకుండా సినిమాలు చేశారు. అంతెందుకు.. 2005లో ఎనిమిది కథానాయిక పాత్రలూ, రెండు అతిథి పాత్రలతో కలుపుకుని తెలుగు, తమిళ భాషల్లో మొత్తం పది చిత్రాల్లో మెరిశారు. ఇది మామూలు రికార్డ్ కాదు. సరే.. పదిహేనేళ్లయ్యింది కదా.. పైగా నూతన తారలు దూసుకొచ్చేశారు. ఇప్పుడైనా శ్రీయ వెనక్కి తగ్గాల్సిందే. మరి తగ్గారా? లేదు. ఏడాదికి రెండు సినిమాలైనా దక్కించుకోగలుగుతున్నారు. అవీ దాదాపు హిట్ సినిమాలే. అయితే విశేషం ఏంటంటే... ఈ రెండేళ్లల్లో ఆమె చేసినవన్నీ రీమేక్‌లే. 2015లో వెంకటేశ్ సరసన శ్రీయ నటించిన ‘గోపాల గోపాల’ హిందీ ‘ఓ మైగాడ్’కి రీమేక్. హిందీలో చేసిన ‘దృశ్యం’ మలయాళ ‘దృశ్యం’కి రీమేక్. ఇక, ఈ మధ్య విడుదలై, వీర విహారం చేస్తున్న ‘ఊపిరి’ కూడా ‘ఇన్టచ్బుల్స్’కి రీమేక్ కావడం విశేషం. శ్రీయ లేటెస్ట్గా అంగీకరించినది కూడా ఓ రీమేక్ సినిమానే. ఆ సినిమా ఏంటంటే.. తెలుగులో ‘ఉలవచారు బిర్యాని’, తమిళంలో ‘ఉన్ సమయల్ అరయిల్’ , కన్నడంలో ‘ఒగ్గరణె’ పేరుతో ప్రకాశ్‌రాజ్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం గుర్తుండే ఉంటుంది. మలయాళ ‘సాల్ట్ అండ్ పెప్పర్’కి ఇవి రీమేక్. ఇప్పుడీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి ప్రకాశ్‌రాజ్ సన్నాహాలు మొదలుపెట్టారు. హిందీలో ఆయన దర్శకత్వం వహించనున్న మొదటి సినిమా ఇది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ప్రకాశ్‌రాజ్ చేసిన పాత్రను హిందీలో నానా పటేకర్ చేయనున్నారు. ఆయన సరసన శ్రీయ నటించనున్నారు. హిందీ చిత్రానికి ‘తడ్కా’ అని టైటిల్ పెట్టారు. ‘‘ఇది చాలా స్వీట్ లవ్‌స్టోరి. గోవాలో షూటింగ్ మొదలుపెట్టనున్నాం. ఎన్నో అవార్డులు పొందిన ప్రకాశ్‌రాజ్ దర్శకత్వంలో సినిమా చేయడం, నానా పటేకర్ వంటి సీనియర్ నటుడితో చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు శ్రీయ. మొత్తానికి ‘శివాజీ’ సినిమాలో ‘పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్..’ పాట అంత హుషారుగా శ్రీయ కెరీర్ ఉందన్నమాట.