సాక్షి, బెంగళూరు : బీజేపీ ప్రచారం చేస్తున్న హిందుత్వ వాదం భారత్‌లో పని చేయదని సినీనటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు.‘సంస్కృతి- విబేధాలు’ అంశంపై ఓ చర్చ వేదికలో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక సంస్కృతి గురించి మాట్లాడుతూ.. ‘ మేము(కర్ణాటక వాసులు) అందరితో కలిసి జీవిస్తాము. అందరిని ఆదరిస్తాం. ఇతరులతో సామరస్యంగా ఉంటాం. కర్ణాటకలో బహుళ సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి. ఇక్కడ హిందుత్వ(బీజేపీ) ప్రచారం పనిచేయదు.’ అని పేర్కొన్నారు.
కర్ణాటక ప్రజలు బీజేపీని ఆదరిస్తారా అన్న ప్రశ్నకు ప్రకాశ్ రాజ్ సమాధానమిస్తూ కొద్ది రోజుల్లో మీరే చూస్తారు(వచ్చే నెలలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి) అని బదులిచ్చారు. కర్ణాటకవాసులు చాలా సహనంతో ఉంటారని, ఏ హిందుత్వ పార్టీలు కూడా వారిని విడగొట్టలేవని ఆయన అన్నారు. మతం పేరుతో ప్రచారం చేస్తున్నవారు కర్ణాటక ప్రజల మన్నలను పొందలేరని బీజేపీ ఉద్దేశించి ఆయన వాఖ్యాలు చేశారు.
కాగా ప్రకాశ్ రాజ్ ఆరోపణలను బీజేపీ అధికార ప్రతినిధి మాలవికా అవినాశ్ తీవ్రంగా ఖండించారు. ‘మేము హిందువులం అయినప్పటికి లౌకిక వాదాన్ని పాటిస్తామ’ని పేర్కొన్నారు. భారత్‌లో హిందుమతం ఎప్పటినుంచో ఉందని, మేము అన్ని మతాలను గౌరవిస్తూ సామరస్యంతో ఉంటూన్నామని అవినాశ్ పేర్కొన్నారు. హిందూలు అన్ని మతాల వారితో కలిసి ఉంటారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment