బనశంకరి: బెంగళూరులో ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్యకేసులో కీలక నిందితులు నివ్వెరపోయే నిజాలను బయటపెడుతున్నారు. తమకు మతం కంటే ఏదీ ఎక్కువ కాదని, మతాన్ని కించపరిస్తే సహించేది లేదని చెబుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాలు కలిపి 5 రాష్ట్రాల్లో హిందూ వ్యతిరేకులుగా ఉన్న 60 మంది సాహితీవేత్తలు, సామాజికవేత్తల జాబితాను సిద్ధం చేసి వారిని అంతమొందించటానికి సిద్ధమైనట్లు గౌరీ లంకేశ్ హత్య కేసులో పట్టుబడిన షార్ప్‌షూటర్ పరశురామ్ వాగ్మారే సిట్ ముందు బయట పెట్టినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో వీరందరికీ ప్రాణభయం లేకుండా భారీ భద్రత కల్పించాలని వారికి సాయుధ భద్రత కల్పించాలని, కార్యాలయాలు, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు అమర్చాలని, వీరు వెళ్లే ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లు చేయాలని సిట్ రాష్ట్ర హోంశాఖకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, నటుడు గిరీష్ కర్నాడ్, సాహితీవేత్తలు కేఎస్.భగవాన్, నరేంద్రనాయక్, నిడుమామిడి మఠం శ్రీ వీరభద్ర చెన్నమల్లస్వామికి భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ హిట్‌లిస్టులో ప్రముఖ బహుభాషా నటుడు ప్రకాష్‌రాజ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment