హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఎన్నికలకు సమయం ఇంకా ఉన్నప్పటికీ అప్పుడే అభ్యర్థులు ప్రత్యర్థులపై ఆరోపణలు చేసుకోవడం, విమర్శనాస్త్రాలు సంధించుకోవడం మొదలెట్టేశారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఇవి రాజకీయ ఎన్నికలలానే కనిపిస్తున్నాయి. కాగా ఈ ఎన్నికలకు సంబంధించి ఎక్కువగా వార్తల్లో విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ పేరే వినపడుతోంది. అభ్యర్థిగా పేరు ప్రకటించిన రోజు నుంచి ఏదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం మన మోనార్క్‌కు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సపోర్ట్ ఉందని టాలీవుడ్‌లో టాక్.
ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తుండగా....ఇదివరకే ఆయనకు సంబంధించి లోకల్ నాన్ లోకల్ అంశం తెరపైకి రావడం ఈ ఎన్నికల వేడిని కాస్త పెంచిదనే చెప్పాలి. ఈ విషయంలో కొందరు సినీ ప్రముఖులు ప్రకాశ్ రాజ్‌కు మద్దతుగా నిలవగా, మరికొందరు దీనిని సమర్థిస్తున్నారు. ఇదే అంశంపై వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ తనదైన శైలిలో కామెంట్లు చేయడం కూడా తెలిసిందే. ఇంత హంగామా ప్రకాశ్ రాజ్ చూట్టు జరుగుతుండగా ఈ తరుణంలో తాజాగా పూరి జగన్నాథ్ సహకారం కూడా ఉందనే వార్త బయటకు రావడం హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటికే ప్రకాష్ రాజ్‌కి మెగా ఫ్యామిలీ మద్దతు ఉందని సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్, ప్రకాష్ రాజ్ మధ్య మంచి స్నేహబంధం కొనసాగుతోంది. 'బద్రి' సినిమా టైమ్ నుంచే వీళ్ళ మధ్య మంచి బాండింగ్ కొనసాగుతోంది. ఈ బాండింగ్ కారణంగానే పూరి సహాయం కోరారట ప్రకాష్ రాజ్. దీంతో ఆయన రిక్వెస్ట్ అగ్రీ చేసిన పూరి.. బ్యాక్ గ్రౌండ్‌లో కొన్ని కీలకమైన సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment