
రెయిన్ గన్‌లతో రైతుల్ని ఆదుకుంటాం
వర్షాలు లేని ప్రాంతాల్లో రెయిన్ గన్లను ఉపయోగించి రైతులను ఆదుకుంటామని రాష్ట్ర హోం శాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. గురువారం నైవేద్య విరామ సమయంలో ఆయన డీజీపీ సాంబశివరావుతో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల చినరాజప్ప మీడియాతో మాట్లాడారు. రాయలసీమలో కరువు ప్రాంతాలను గుర్తించి సీఎం చంద్రబాబు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు చెప్పారు. ఇందులో భాగంగా జిల్లాకి నలుగురు మంత్రులను కేటాయించి రైతులకు సహకారం అందించేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఈ మేరకు పీలేరు నుండి రెయిన్ గన్ల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తె లిపారు. శాంతి భద్రతల విషయంలో తమ ప్రభుత్వం రాజీ పడదని స్పష్టం చేశారు. టీటీడీ సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. మంచి వసతులు ఉన్నాయని, కృష్ణ పుష్కరాల్లో టీటీడీ మెరుగైన ఏర్పాట్లు చేసిందని కితాబిచ్చారు.