Rain Guns
-
‘తమ్ముళ్ల’ ఇళ్లలో సిరుల వర్షం
పంట సంజీవని ‘పచ్చ’ తమ్ముళ్లకు వరాలిచ్చింది. కోట్లాది రూపాయలతో కొనుగోలు చేసిన పరికరాలు నేతల ఇళ్లలో సిరుల వర్షం కురిపించాయి. రైతుల ప్రయోజనాలను గాలికొదిలి ఏకంగా సొంత ఆస్తిలా అమ్ముకున్న తీరు విమర్శలకు తావిస్తోంది. అప్పట్లో టీడీపీ అధికార పార్టీ కావడంతో అధికారులు కూడా నోరు తెరవలేని పరిస్థితి. ఇప్పుడు డొంక కదులుతోంది. ఖరీఫ్ సీజన్ కావడంతో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు రెయిన్గన్లు ఎక్కడని వ్యవసాయాధికారులను ప్రశ్నిస్తే.. మౌనమే సమాధానమవుతోంది. సాక్షి, అనంతపురం : వరుణదేవుడు కరుణించకపోయినా పంటలను కాపాడుతామని గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెయిన్గన్లను తెరపైకి తీసుకొచ్చారు. 2016లో వీటిని ప్రారంభించారు. ఆ ఏడాది దాదాపు 15.15లక్షల ఎకరాల్లో పంటసాగైతే మొత్తం పంట ఎండిపోయింది. ఆ సందర్భంగా బాబు నాలుగురోజులు జిల్లాలోనే తిష్టవేసి పంటను కాపాడినట్లు మసిపూసి మారేడుకాయ చేశారు. ఏకంగా సీఎం తరలిరావడంతో బెంబేలెత్తిన అధికారులు రెయిన్గన్లను ఇష్టారాజ్యంగా పంపిణీ చేశారు. అయినప్పటికీ ఎకరా పంటను కూడా కాపాడలేకపోయారు. దీంతో వీటివల్ల ఉపయోగం లేదని తేల్చారు. ఇది ఓ విఫలప్రయత్నం అని, రెయిన్గన్లతో చెడ్డపేరు తప్ప మరొకటి లేదని గ్రహించిన ప్రభుత్వం వాటి ఊసెత్తడమే మరిచింది. ఇక అధికారులు కూడా ఆ తంతు ముగిసనట్లేనని భావించి పరికరాల రికవరీని పక్కన పెట్టేశారు. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మంత్రి శంకరనారాయణ ఇటీవల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంగా పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి రెయిన్గన్ల ప్రస్తావన తీసుకొచ్చారు. పరికరాలు ఎక్కడని జేడీని ప్రశ్నించారు. అందుకాయన రైతుల వద్దే ఉన్నాయని చెప్పలేక చెప్పారు. అవి ప్రభుత్వానివా? ప్రయివేటువా? కార్యాలయాల్లో ఎందుకు లేవు? అని తిరిగి ఎమ్మెల్యే ప్రశ్నించడంతో జేడీఏ నుంచి సమాధానం కరువైంది. ఈ నేపథ్యంలో రెయిన్గన్లు ఎక్కడనే విషయమై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన చేస్తే 30 శాతం కూడా అధికారుల వద్ద లేవని తేలింది. 70 శాతం పైగా పరికరాలను రైతుల పేరుతో టీడీపీ నేతలు విక్రయించి సొమ్ము చేసుకోవడం గమనార్హం. అధికారుల ఉరుకులు పరుగులు అధికారపార్టీ ఎమ్మెల్యేలు వీటి ప్రస్తావన తేవడంతో వ్యవసాయాధికారులు రికవరీపై దృష్టి సారించారు. నాలుగురోజుల్లో రెయిన్గన్లపై పూర్తి వివరాలు కావాలని ఏఓలు, ఏడీలను జేడీ హబీబ్‌బాషా ఆదేశించారు. అయితే అధికారులంతా బదిలీల్లో తలమునకలై ఉన్నారు. కాబట్టి ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకునే పరిస్థితి కరువైంది. రికవరీ కాకపోతే కొత్త ప్రభుత్వం ఊరుకునే పరిస్థితి లేదు. దీంతో బాధ్యులైన టీడీపీ నేతలను తేల్చి, అవసరమైతే వారిపై కేసులు నమోదు చేసి రికవరీ చేసే యోచనలో వ్యవసాయాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ రెయిన్గన్ల పరిస్థితి జిల్లా వ్యాప్తంగా 6,426 రెయిన్గన్లు, 5,894 స్ప్రింక్లర్లు, 4,17,000 పైపులు, 4478 ఆయిల్ ఇంజన్లు పంపిణీ చేశారు. వీటిని రూ.69.79కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే వీటిలో ఏడాదికే 20శాతం రెయిన్గన్లు ఆచూకీ లేకుండా పోయాయి. 2019 ఖరీఫ్ వచ్చే సమయానికి వీటిలో 30శాతం కూడా లేని పరిస్థితి. రెయిన్గన్లు రైతులు తీసుకున్న తర్వాత పనిముగించుకుని మరో రైతుకు ఇచ్చారు. ఆ రైతు ఇంకో రైతుకు ఇచ్చారు. ఇలా రెయిన్గన్లు చేతులు మారాయి. ఈ ప్రక్రియ ఆయా గ్రామాల్లోని స్థానిక అధికారపార్టీ నేతల కనుసన్నల్లో సాగింది. వారివద్దకు వెళ్లిన వారికే రెయిన్గన్లు ఇచ్చారు. ఆ తర్వాత రైతులు తిరిగి అధికారపార్టీ నేతలకు అప్పగించారు. టీడీపీ నేతల వద్ద రెయిన్గన్లు ఉన్నట్లు వ్యవసాయాధికారుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. దీంతో వీటిని అధికారపార్టీ నేతలు కర్ణాటక రైతులకు విక్రయించారు. ఈ విషయం అప్పట్లో పత్రికల్లో ప్రచురితమైంది. అప్పటికి మేల్కొన్న అధికారులు రికవరీపై దృష్టి సారించారు. ఏఓలు, ఎంపీఈఓలను క్షేత్రస్థాయి పరిశీలనకు పంపగా.. మెజార్టీ పరికరాలు రైతుల వద్ద లేవని, అధికారపార్టీ నేతల ఇళ్లలోనే ఉన్నాయనే విషయం వెల్లడైంది. కొందరు నేతలు పరికరాలు ఇచ్చేయగా.. ఇంకొందరు అతిబలవంతంగా పగిలిపోయిన పైపులు, ప్రభుత్వం పంపిణీ చేసిన పైపులు కాకుండా వేరే పైపులు, పనిచేయకుండా తుక్కుగా మారిన ఆయిల్ ఇంజన్లను చేతుల్లో పెట్టి పంపారు. ఆ మేరకు అతికష్టం మీద కొన్ని రికవరీ అయ్యాయి. తర్వాత ఏడాది కూడా ప్రణాళిక లేకుండా పంపిణీ జరిగింది. అంతే ఇక రెయిన్గన్లు జాడ లేకుండాపోయాయి. రాప్తాడు, తాడిపత్రి, కదిరి, కళ్యాణదుర్గం, ధర్మవరం, మడకశిర, రాయదుర్గం నియోజకవర్గాల్లో అధికంగా రికవరీ కావల్సి ఉంది. -
రెయిన్గన్లు ఎక్కడ?
వర్షాభావ పరిస్థితుల్లో పంటలను కాపాడేందుకు రూ. కోట్లు వెచ్చించి రెయిన్గన్లు కొనుగోలు చేశారు. వ్యవసాయ యంత్రాంగం ఆధీనంలో ఉండాల్సిన ఈ విలువైన పరికరాలు ఇప్పుడు ఎక్కడున్నాయో అంతుచిక్కడం లేదు. కొన్ని టీడీపీ నేతల ఇళ్లలో ఉండగా, మరికొన్నింటిని ఇది వరకే వారు అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లు ఫిర్యాదులున్నాయి. అప్పట్లో వ్యవసాయాధికారులు పట్టించుకోకపోవడంతో రెయిన్గన్ల గల్లంతు వ్యవహారం వారి మెడకు చుట్టుకుంటోంది. ఇప్పటికే రెయిన్గన్లు ఎక్కడ ఉన్నాయో తేల్చాలని వ్యవసాయశాఖ ఆదేశించడంతో వారికి దిక్కుతోచడం లేదు. కర్నూలు(అగ్రికల్చర్): దాదాపు రూ.40 కోట్లు ఎస్డీపీ నిధులతో 2015లో జిల్లాకు 4,530 రెయిన్గన్లు కొనుగోలు చేశారు. ఇందులో 2016లో 1000 రెయిన్ గన్లను చిత్తూరు జిల్లాకు తరలించారు. ప్రస్తుతం జిల్లాలో 3,530 రెయిన్గన్లు ఉండాలి. 2017లో రెయిన్గన్లు, పైపులు, స్ప్రింక్లర్లు తదితర వాటిని జియో ట్యాగింగ్ చేయడానికి ప్రయత్నించారు. అయితే, జియో ట్యాగింగ్‌కు ఇందులో చాలా వరకు లభ్యం కాలేదు. కనీసం 50శాతం కూడా కనిపించలేదు. అధికార పార్టీ నేతల అధీనంలో అవి ఉన్నట్లు అధికారులకు స్పష్టంగా తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని రెయిన్గన్లు మార్కెట్ యార్డు గోదాముల్లో నిల్వ చేశారు. వినియోగం లేక అవి తుప్పుపట్టిపోతున్నాయి. జిల్లాలో 1,317 ఆయిల్ ఇంజిన్లు, 5,175 స్ప్రింక్లర్లు, 2.50 లక్షల పైపులు ఉండాలి. వీటిలో 50 శాతం వరకు జాడా లేకుండా పోయాయి. మొత్తంగా రూ.20 కోట్ల విలువ చేసే రెయిన్గన్లు, స్ప్రింక్లర్లు, ఆయిల్ ఇంజిన్లు, పైపులు కనిపించకుండా పోయాయి. ఇవన్నీ తెలుగుదేశం నేతల ఇళ్లలో ఉన్నట్లు సమాచారం. హడావుడిగా కొనుగోలు వర్షాభావ పరిస్థితుల్లో పంటలు ఎండిపోకుండా రక్షక నీటి తడులు ఇచ్చి కాపాడేందుకు 2015లో అప్పటి జిల్లా యంత్రాంగం హడావుడిగా రెయిన్గన్లు కొనుగోలు చేసింది. వీటి కొనుగోలులో అప్పటి జిల్లా యంత్రాంగానికి కమీషన్ల రూపంలో భారీగానే ముట్టినట్లు ఆరోపణలున్నాయి. తర్వాత చేసిన హడావుడిలో ఆ రెయిన్గన్లను జిల్లా యంత్రాంగం తెలుగుదేశం పార్టీ నేతల పరం చేసింది. వారిలో కొందరు వాటిని పత్తికొండ, ఆలూరు, ఆదోని సబ్ డివిజన్లలో అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ విధంగా కోట్లాది రూపాయల వ్యయంతో తెప్పించిన రెయిన్గన్లు, స్ప్రింక్లర్లు, ఆయిల్ ఇంజిన్లు దుర్వినియోగమయ్యాయి. గతేడాది రెయిన్గన్ల ఊసెత్తని అధికారులు గతంలో ఎప్పుడూ లేని విధంగా 2018–19లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. జూన్ నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల తీవ్ర వర్షాభావ పరిస్థితులే. భూమి తడారిపోవడంతో ఖరీఫ్, రబీ పంటలన్నీ పూర్తిగా మాడిపోయాయి. గతంలో కొనుగోలు చేసి తెచ్చిన రెయిన్గన్లున్నాయి కదా వాటితో పంటలను కాపాడుదాం అనే అలోచనే వ్యవసాయశాఖకు రాలేదు. సార్.. రెయిన్గన్లు ఇస్తే కొంతవరకు పంట తడుపుకుంటామని రైతులు అడిగినా పట్టించుకోలేదు. దీంతో వారు పంటలకు పెట్టిన పెట్టుబడులు చేతికిరాక తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికైనా రెయిన్గన్లు ఎక్కడ ఉన్నాయనే విషయం తేలుస్తారో? లేక టీడీపీ నేతల ఇళ్లలోనే వాటిని వదిలేస్తారో? చూడాల్సి ఉంది. -
రెయిన్ గన్..ఓ విఫల ప్రయోగం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రభుత్వం కొనుగోలు చేసిన రెయిన్ గన్స్ ఇపుడు ఎక్కడ ఉన్నాయి? రాష్ట్రాన్ని కరువు కుదిపేస్తున్న తరుణంలో రెయిన్గన్స్ౖ గురించి చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పగా ప్రచారం చేసిన రెయిన్ గన్లు ప్రస్తుతం ఎక్కడున్నాయో.. ఏమైపోయాయో, వాటిని ఎవరైనా వాడుతున్నారో లేదో ఎవరికీ తెలియడం లేదు. రూ.వందల కోట్ల ప్రజాధనం కుమ్మరించి, కొనుగోలు చేసిన రెయిన్‌గన్స్ ఆచూకీ లేకుండాపోయాయి. రెండేళ్ల క్రితం రెయిన్ గన్ల గురించి భారీగా ప్రచారం చేసిన ప్రభుత్వం ఆ తర్వాత వాటి ఊసెత్తడం మానేసింది. వర్షాధార పంటలకు మాత్రమే ఉపయోగపడే రెయిన్ గన్లతో అన్ని పంటలనూ కాపాడుకోవచ్చని ప్రభుత్వం ప్రచారం చేసింది. అయితే, అవి రైతులకు ఉపయోగపడిన దాఖలా లు లేవు. గతంలో ఒక్కొక్క మండలానికి 3 నుంచి 10 వరకు రెయిన్ గన్స్‌ను పంపిణీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయ శాఖ అధికారులు 15 కంపెనీల నుంచి వీటిని కొనుగోలు చేశారు. వాస్తవానికి నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో వర్షాధార పంటలకు ఒకటి లేదా రెండు తడులు ఇవ్వడానికి మాత్రమే రెయిన్ గన్లను డిజైన్ చేశారు. పొలాలకు సమీపంలోని నీటి గుంతలు, చెరువులు, కాలువలు, ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి, రెయిన్ గన్ల సాయంతో సగటున ఎకరం పొలం తడిసేలా ఏర్పాటు చేయవచ్చు. అయితే వర్షాధార పంటలకు మాత్రమే ఇవి పనికొస్తాయి. ఒక్కో యూనిట్ ధర రూ.50 వేల పైమాటే కరువు బారినపడ్డ పంటలను రక్షిస్తామంటూ.. రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టి రూ.163 కోట్లు ఖర్చు పెట్టి 13,334 రెయిన్ గన్లు, స్ప్రింకర్లు, 7,970 ఆయిల్ ఇంజిన్లు, 3.50 లక్షల నీటి పైపులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటి నిర్వహణ కోసం మరో రూ.103 కోట్లు ఖర్చు పెట్టింది. రెయిన్గన్ల కొనుగోలు వ్యవహారంలో భారీ ఎత్తున అవినీతి జరిగినట్టు అప్పట్లో శాసనసభలో దుమారం చెలరేగింది. ప్రభుత్వం కొనుగోలు చేసిన 13,334 రెయిన్గన్లు ప్రస్తుతం ఎక్కడున్నాయో తెలియదు. అవి ఇప్పుడు ఎక్కడా పంటల పొలాల్లో పెద్దగా కనిపించడం లేదు. వాస్తవానికి రెండేళ్లుగా ప్రభుత్వంతో సహా రైతులు కూడా రెయిన్ గన్లను పూర్తిగా మరిచిపోయారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాల్లో వ్యవసాయశాఖ గోదాములకే రెయిన్ గన్ కిట్లు పరిమితమయ్యాయి. రాష్ట్రంలో 11 జిల్లాల్లో ఇవి ఉన్నట్లు రికార్డుల్లో చూపుతున్నారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో వీటిని అసలు వినియోగించలేదు. రెయిన్ గన్ కిట్‌లో రూ.6 వేల ఖరీదు చేసే రెయిన్ గన్, రూ.24 వేల ఖరీదైన ఆయిల్ ఇంజిన్, రూ.14 వేల విలువైన 20 పైపులు, రూ.7 వేల విలువ చేసే స్ప్రింక్లర్ల సెట్ ఉంటాయి. ఒక యూనిట్ ఖరీదు రూ.50 వేలకు పైగానే ఉంటుంది. టీడీపీ నేతల ఇళ్లల్లో రెయిన్గన్లు ఉద్యాన వన, సూక్ష్మ నీటిపారుదల పథకం కింద ప్రభుత్వం కొనుగోలు చేసిన 13,334 రెయిన్ గన్లు అడ్రస్ లేకుండా పోయాయి. అప్పట్లో రెయిన్ గన్లు కొన్న తర్వాత 2016 ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 2 వరకు ముఖ్యమంత్రి అనంతపురం జిల్లాలోనే మకాం వేసి 4 రోజుల్లో 4 లక్షల ఎకరాల్లో పంటలను కాపాడామని ప్రకటించారు. చంద్రబాబు రెయిన్ గన్ను ప్రారంభించిన పొలంలోనే పంట ఎండిపోయింది. ఇప్పుడా రెయిన్ గన్లు, వీటికి ఉపకరణాలైన ఆయిల్ ఇంజిన్లు, స్ప్రింక్లర్లు, పైపులు, ఇతరత్రా సామగ్రిలో మూడొంతులు అధికార తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లకు చేరాయి. ఈ రెయిన్ గన్స్‌లో దాదాపు సగం అంటే 6,426 గన్లను, 4306 ఆయిల్ ఇంజన్లను, 5,894 స్ప్రింకర్లు, 4.11 లక్షల పైపులను అనంతపురం జిల్లాకు ఇచ్చామని అధికారిక లెక్కలు చూపినా వీటిల్లో 60 శాతం ఎక్కడున్నాయో తెలియడం లేదని వ్యవసాయ శాఖ గుర్తించింది. ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చివరకు ఏం చేయాలో తెలియక వ్యవసాయ అధికారులు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేయాల్సి వచ్చింది. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే రెయిన్ గన్లతో 2018లో కూడా వేలాది ఎకరాల్లో పంటలను కాపాడానని సీఎం ఇటీవల శ్వేతపత్రంలో పేర్కొనడం గమనార్హం. రెయిన్‌గన్ అంటే? బిందు, తుంపర సేద్యానికి ఉపయోగించే పరికరం లాంటిదే రెయిన్‌గన్. పంటను బట్టి రెయిన్ గన్ స్టాండ్లను ఏర్పాటు చేస్తారు. జొన్న, సజ్జ, చెరకు వంటి వాటికైతే ఐదారు అడుగులు, మిర్చి, పత్తి తదితర పంటలకు రెండు మూడు అడుగుల ఎత్తులో స్టాండ్లను అమర్చుతారు. సామర్థ్యాన్ని బట్టి కొన్ని రెయిన్గన్లు సుమారు 45 మీటర్ల వరకు కూడా నీటిని విరజిమ్ముతాయి. ఇది పని చేయడానికి 5 హెచ్‌పీ ఇంజిన్ కావాలి. బోర్లు, బావులు, కాలువలు, చెరువులు, కుంటల్లో నీరున్నప్పుడే వీటిని వినియోగించడం సాధ్యమవుతుంది. లేదంటే ఎక్కడి నుంచైనా ట్యాంకర్లతో తెచ్చుకోవాలి. నీటి వనరులున్న ప్రాంతం వద్ద ఆయిల్ ఇంజిన్‌ను ఏర్పాటు చేసి పైపుల ద్వారా నీటిని రెయిన్గన్కు అందిస్తే అది నీటిని చిమ్ముతుంది. ఎక్కడి నుంచో నీటిని తీసుకొచ్చి చేలను తడుపుతామనడం అశాస్త్రీయమని నిపుణులు చెబుతున్నారు. రెయిన్ గన్ ప్రయోగం కొత్తేమీ కాదు నిజానికి రెయిన్గన్ల ప్రయోగం కొత్తదేమీ కాదు. హైదరాబాద్‌లోని కేంద్రీయ మెట్ట పంటల పరిశోధనా కేంద్రం(క్రిడా)లో వీటిని పదేళ్ల క్రితమే ప్రయోగించారు. ఒక్కో గన్ నిమిషానికి 240 లీటర్ల చొప్పున 24 మీటర్ల చుట్టూ వృత్తాకారంలో నీటిని చిమ్ముతుంది. ఒక్కో విడతకు 1,809 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గంటకు 14,400 లీటర్ల నీటిని వెదజల్లుతుంది. అంటే కేవలం 8 మిల్లీమీటర్ల వర్షపాతంతో సమానం. అనంతపురం వంటి జిల్లాల్లోని తేలికపాటి ఎర్రభూముల్లో ఈ నీటి పరిమాణం ఏమాత్రం సరిపోదు. మెట్టప్రాంతాల్లో ఎండిపోయే దశకు వచ్చిన పంటలకు కనీసం 30 మిల్లీమీటర్ల వర్షపాతం కావాలి. భూమిలో 15 సెంటీమీటర్ల లోతు వరకు తడిపినప్పుడు మాత్రమే పంట నిలుస్తుంది. ఇంతటి నీటి తడి ఇవ్వాలంటే రెయిన్గన్లు కనీసం 3 గంటల 45 నిమిషాలు పని చేయాలి. రెండు మూడు సార్లు షిఫ్ట్ పద్ధతిలో వీటిని ఉపయోగించాలి. ఎకరానికి 30 మిల్లీమీటర్ల వర్షపాతానికి సమానమైన నీటి తడి పెట్టాలంటే 1,21,500 లీటర్ల నీరు కావాలి. ఇంత నీరు అంటే ఒక్కొక్కటి 6 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న 20 ట్యాంకులు కావాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం రెయిన్గన్లతో ఇచ్చిన నీరు కేవలం 5 మిల్లీమీటర్ల వర్షపాతంతో సమానం. ముఖ్యమంత్రి చెప్పినట్టు కేవలం నాలుగు రోజుల్లో 4 లక్షల హెక్టార్లలో పంటలను కాపాడాలంటే 20 లక్షల ట్యాంకర్లు కావాల్సి ఉంటుంది. రాష్ట్రం మొత్తం వెతికినా ఇన్ని ట్యాంకర్లు గానీ, నీళ్లు గానీ కనిపించవు. అంటే నీరు, ట్రాక్టర్లు లేకుండా రెయిన్ గన్లు కొనుగోలు చేసి, కమీషన్లు మింగేశారే తప్ప వాటివల్ల దమ్మిడీ ప్రయోజనం లేకుండా చేశారు. రైతులకు సగం సబ్సిడీ.. రెయిన్ గన్లను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు అద్దెకు ఇస్తుంది. రైతులే కొనుక్కుంటామంటే వారికున్న పొలాన్ని బట్టి రాయితీ ఇస్తుంది. ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు 90 శాతం, ఆపైన ఉండే వారికి 50 శాతం రాయితీ ఇవ్వాలన్నది ప్రభుత్వ పాలసీ.. ఎకరా పంటపై నీటిని చల్లేందుకు రూ.3 వేల వ్యయం అవుతుందని అంచనా వేసి ఇందులో సగం అంటే రూ.1,500లను ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందన్నమాట. రైతులు కొనగా మిగిలిన రెయిన్ గన్స్‌ను ప్రభుత్వమే భద్రపరచాల్సి ఉంది. ఈ రెయిన్ గన్స్ కిట్లను వ్యవసాయ శాఖ గోదాములలో భద్రపరిచినట్లు శాసనసభలో చర్చ సందర్భంగా ప్రభుత్వం వెల్లడించింది. వీటి నిర్వహణకు 103 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు కూడా తెలిపింది. వాస్తవానికి రెయిన్‌గన్స్‌ను రైతులెవరూ కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. అన్నీ టీడీపీ నేతల ఇళ్లకు చేరిపోయాయి. 2016 ఆగస్టు 28 ‘‘వరుణ దేవుడు కరుణించకపోయినా మీరెవరూ భయపడాల్సిన పని లేదు. వర్షం కురవకపోయినా రెయిన్ గన్లతో వర్షం కురిపిస్తా. మీ పంటను కాపాడే బాధ్యత నాదీ’’ – అనంతపురం జిల్లా గుండువారిపల్లికి చెందిన రైతు శివన్న పొలంలో రెయిన్ గన్ను ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాట 2016 సెప్టెంబర్ 12 ‘‘చంద్రబాబు వస్తారని ఆగస్టు 27 రాత్రి నా పొలం పక్కన ఓ కుంట తవ్వారు. అందులో ప్లాస్టిక్ పట్టా వేసి ట్యాంకర్లతో నీటిని నింపారు. చంద్రబాబు వచ్చిన తర్వాత 10 నిమిషాలు రెయిన్గన్లు నడిపారు. ముఖ్యమంత్రి అటుపోగానే రెయిన్ గన్లతోపాటు పట్టాను, పైపులను తీసుకుపోయారు. ఐదు ఎకరాలకు రెండు ఫైరింజన్ల నీళ్లు ఏం సరిపోతాయి? పంట పూర్తిగా ఎండిపోయింది. బతుకు తెరువు కోసం బెంగళూరుకు వలసవెళ్లా’’ – శివన్న, రైతు, గుండువారిపల్లి, ఆమడగూడూరు మండలం, అనంతపురం జిల్లా 2018 డిసెంబర్ 26 ‘‘రెయిన్ గన్లతో లక్షలాది ఎకరాల్లో పంటలను కాపాడాం. ప్రస్తుతం రబీలో అనంతపురం, వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు జిల్లాలో సైతం 15,296 హెక్టార్లలో పంటలకు తడులు అందించాం’’ – వ్యవసాయ రంగంపై శ్వేతపత్రం విడుదల చేస్తూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు -
సునీతమ్మా.. రెయిన్గన్ల డ్రామా ఇకచాలు
పంటతడి పేరుతో గతేడాది దోపిడీ – రూ.కోట్లు ఖర్చు చేశారు.. ఎన్నెకరాలు కాపాడారో శ్వేతపత్రం విడుదల చేయాలి – వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అనంతపురం: మంత్రి పరిటాల సునీత రెయిన్గన్లతో వేరుశనగ పంటను కాపాడుతామంటూ మళ్లీ కొత్త డ్రామాకు తెర తీశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది రెయిన్గన్లకు సుమారు రూ.300–400 కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వచ్చి రెయిన్గన్లు స్విచ్ఆన్ చేసిన పొలంలోనే పంట ఎండిపోయిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. మళ్లీ రెయిన్గన్ల ద్వారా పంటలకు తడులిస్తామని మంత్రి పరిటాల సునీత చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రెయిన్గన్లతో గతేడాది ఎన్ని ఎకరాల్లో వేరుశనగ పంటను కాపాడారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం బిచ్చగాళ్లను చేస్తోందన్నారు. టీడీపీ నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి ఇన్పుట్ సబ్సిడీ రాయండి దొరా అని అడుక్కోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. దివంగత వైఎస్ హంద్రీ–నీవా, పీఏబీఆర్ ద్వారా అనంత జిల్లాను సస్యశ్యామలం చేయాలని భావించారన్నారు. టీడీపీ ప్రభుత్వం.. హంద్రీ–నీవా నుంచి దాదాపు 3.50 లక్షల ఎకరాలు, పీఏబీఆర్ ద్వారా 1.50 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చిఉంటే రైతులకు ఇలాంటి దయనీయ స్థితి వచ్చేది కాదన్నారు. జిల్లాలో 50 శాతం మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ జమకాలేదన్నారు. భూమి లేని టీడీపీ కార్యకర్తలు ఖాతాలు, దొంగ పాసు పుస్తకాలు సృష్టించి ఇన్పుట్ సబ్సిడీ దోచుకున్నారన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు బిల్లే ఈశ్వరయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లాలో రైతు ఏరువాక ప్రారంభానికి వచ్చిన రెండేళ్లు వర్షాలు కురవలేదనే విషయాన్ని రైతులు ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. సమావేశంలో పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి యూపీ నాగిరెడ్డి, పార్టీ నాయకులు ఓబుళపతి, నరసింహారెడ్డి, వాసుదేవరెడ్డి, పవన్, శివారెడ్డి, రాజా, అమర్నాథరెడ్డి పాల్గొన్నారు. -
రిక‘వర్రీ’
– ‘పంట సంజీవని’ పరికరాల స్వాధీనంలో అవకతవకలు – రెయిన్గన్లు, స్ప్రింక్లర్లు, ఆయిల్ ఇంజన్లు, పైపులు తమవద్దే పెట్టుకున్న టీడీపీ నేతలు – రివకరీకి వెళ్లిన అధికారులతో ఘర్షణ – విధిలేక రైతులపై కేసు నమోదు చేస్తున్న అధికారులు సాక్షిప్రతినిధి, అనంతపురం : ‘పంట సంజీవని’ పేరుతో పంటలను కాపాడేందుకు కొనుగోలు చేసిన పరికరాల రికవరీలో గోల్మాల్ జరుగుతోంది. అదునులో తీసుకున్న పరికరాలను అవసరం తీరాక అధికారులకు ఇవ్వకుండా అధికార పార్టీ నేతలు నానాయాగీ చేస్తున్నారు. తీసుకున్న ప్రభుత్వ సొమ్మును తిరిగి ఇచ్చేయాలంటూ ‘రికవరీ’ కోసం అధికారులు పల్లెల్లోకి వెళితే వారినీ దుర్భాషలాడుతున్నారు. వారి బెదిరింపులు తాళలేక, ఉన్నతాధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేక వ్యవసాయాధికారులు రైతులపై కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో పల్లెల్లో రైతుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తుతోంది. ప్రణాళిక లేకుండా పంపిణీ గతేడాది ఖరీఫ్‌లో జిల్లాలో 15.15 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారు. జూలై ఆఖరు, ఆగస్టులో వర్షాభావంతో పంట ఎండిపోయింది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రక్షక తడుల ద్వారా పంటలను కాపాడతామని సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. జూలైలోనే రెయిన్గన్లు జిల్లాకు చేరాయి. అయితే కృష్ణా పుష్కరాల హడావుడిలో ఉన్న యంత్రాంగం వీటిని సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలన్న ఉద్దేశంతో ఆలస్యం చేసింది. సీఎం ఆగస్టులో ధర్మవరంలో పర్యటించినా, ఆతర్వాత అనంతపురంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొన్నప్పుడు కూడా అధికారులు వీటిని పంపిణీ చేయించలేదు. పంటలు ఎండిన సంగతి తెలిసి వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావుతో ఆగస్టు 22న రెయిన్గన్లను రైతులకు పంపిణీ చేశారు. అప్పటికే పంట పూర్తిగా ఎండిపోయింది. ఆగస్టు 28న సీఎం ‘అనంత’ పర్యటనకు వచ్చి పంట ఎండిన సంగతి తనకు తెలీదని, తెలిసుంటే కాపాడేవాళ్లమని చెప్పారు. రెయిన్గన్లను రైతులకు ఇచ్చి పంటను కాపాడాలని ‘మిషన్ - 1’ పేరుతో హడావుడి చేశారు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 2 వరకూ జిల్లాలోనే మకాం వేశారు. సీఎం ఒత్తిడితో అధికారులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఓ ప్రణాళిక లేకుండా పంట సంజీవని పరికరాలను ఇష్టారాజ్యంగా పంపిణీ చేశారు. కొన్నిచోట్ల రైతుల వద్ద పాస్‌పుస్తకాలు తీసుకుని పంపిణీ చేస్తే, ఇంకొన్ని చోట్ల పేర్లు రాసుకుని ఇచ్చేశారు. ఇలా 5,887 రెయిన్గన్లు, 5,495 స్ప్రింక్లర్లు, 4,17,000 పైపులు, 4,478 ఆయిల్ ఇంజన్లు పంపిణీ చేశారు. వీటికి రూ.67 కోట్లు ఖర్చు చేశారు. టీడీపీ నేతలను వదిలి రైతులపై కేసులు రెయిన్గన్లను రైతులు తమ పనిని ముగించుకొని మరో రైతుకు ఇచ్చారు. ఆ రైతు ఇంకో రైతుకు ఇచ్చారు. ఇలా అవి చేతులు మారాయి. ఈ ప్రక్రియ స్థానిక అధికార పార్టీ నేతల కనుసన్నల్లో సాగింది. వారి వద్దకు ఎవరు వెళితే వారికే ఇచ్చారు. మిషన్ - 1, మిషన్ - 2 పూర్తయిన తర్వాత రెయిన్గన్ల రికవరీ గురించి ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత వీటిని అధికారపార్టీ నేతలు కర్ణాటకలోని రైతులకు విక్రయించారు. ఈ విషయం పత్రికల్లో ప్రచురితం కావడంతో అధికారులు రికవరీపై దృష్టి సారించారు. ఏఓలు, ఎంపీఈఓలను క్షేత్రస్థాయికి పంపారు. మెజార్టీ పరికరాలు రైతుల వద్ద లేవని, అధికారపార్టీ నేతల ఇళ్లలోనే ఉన్నాయని వారు గ్రహించారు. కొందరు నేతలు పరికరాలు వెనక్కి ఇచ్చేశారు. ఇంకొందరు పగిలిపోయిన పైపులు, ప్రభుత్వం పంపిణీ చేసినవి కాకుండా వేరేవి, పని చేయకుండా తుక్కుగా ఉన్న ఆయిల్ ఇంజన్లను ఇస్తున్నారు. ఇప్పటివరకు రికవరీ అయిన పరికరాలు కాకుండా ఇంకా 800 రెయిన్గన్లు, 1,473 స్ప్రింక్లర్లు, 91,880 పైపులు, 414 ఇంజన్లు రికవరీ కావాల్సి ఉంది. వీటిని సేకరించడం అధికారులకు తలనొప్పిగా మారింది. వీటిపై ఆరా తీసే ఏఓలు, ఎంపీఈఓలపై అధికార పార్టీ నేతలు దుర్భాషలాడుతున్నారు. ఎంపీఈఓలలో అధిక శాతం మహిళలు ఏం చేయాలో దిక్కుతోచక వెనుదిరుగుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కేసులు నమోదు చేయాలని మొదట వ్యవసాయాధికారులు భావించినప్పటికీ సంబంధిత నేతలు స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల శరణు కోరారు. దీంతో కేసులు నమోదు చేయొద్దని, చేస్తే బదిలీ తప్పదని ఎమ్మెల్యేలు ఏఓలను హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అధికారులంతా రైతులపై పోలీసుస్టేషన్, తహసీల్దార్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులు, వీర్‌ఓలు గ్రామాల్లో రైతుల వద్దకు వెళ్లి తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. తమవద్ద లేవన్నా వినడం లేదు. పరికరాలు ఇవ్వకపోతే బ్యాంకులో పంటరుణం ఇవ్వకుండా ‘బ్యాన్’ చేసేలా సిఫార్సు చేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో రైతులు తాము ఇచ్చిన రైతుల వద్దకు వెళ్లి పరికరాలు అడగడం, వారు మరో రైతుపై చెప్పడం ఇలా గ్రామాల్లో ఘర్షణ వాతావరణం తలెత్తుతోంది. అధికారులు మాత్రం రైతులపైనే ఫిర్యాదు చేసి ముందుకెళ్తున్నారు. కదిరి, కళ్యాణదుర్గం, ధర్మవరం, మడకశిర నియోజకవర్గాల్లో అధికంగా రికవరీ కావాల్సి ఉంది. పంట సంజీవని పరికరాల పరిస్థితి ఇదీ రెయిన్గన్లు స్ప్రింక్లర్లు పైపులు ఆయిల్ ఇంజన్లు పంపిణీ చేసినవి 5,887 5,495 4,17,000 4,478 రికవరీ అయినవి 5,087 4,022 3,25,120 4,064 రికవరీ కావల్సినవి 800 1,473 91,880 414 రికవరీ చేస్తున్నాం పంట సంజీవని పరికరాల రికవరీ కష్టంగా ఉంది. అయినా చేస్తున్నాం. రైతులపై పోలీసులకు, తహసీల్దార్లకు ఫిర్యాదు చేస్తున్నాం. కొందరు పగిలిన పైపులు, పనిచేయని ఇంజన్లు ఇస్తున్నారు. వీటిని సబ్సిడీ ద్వారా తమకే ఇవ్వాలని రైతులు అడుగుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాం. జిల్లాలో ఉన్న పరికరాలను శోధించి రికవరీ చేస్తాం. తక్కిన వాటిపై ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తాం. - శ్రీరామమూర్తి, జేడీఏ -
అన్నదాతను ఆదుకునే తీరిదేనా?
బాబు సర్కార్‌కు వైఎస్ జగన్ ప్రశ్న ⇒ కరువునూ క్యాష్ చేసుకుంటారా? ⇒ రెయిన్‌గన్స్‌తో ఒక్క ఎకరమన్నా బతికిందా? ⇒ పంటనష్టం సాయంలేదు.. ఇన్పుట్ సబ్సిడీ లేదు ⇒ రుణమాఫీతో ఒరిగింది గోరంత..భారం కొండంత.. ⇒ మూడేళ్లుగా రైతుల పరిస్థితి దుర్భరం.. సాక్షి, అమరావతి: మూడేళ్లుగా కరువుతో అల్లాడుతున్న అన్నదాతను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా విఫలమయ్యిందని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడుతూ రుణమాఫీ జరక్క, రుణాల రీషెడ్యూల్ జరక్క, ఇన్పుట్ సబ్సిడీ అందక, పంటనష్టం సాయం అందక రైతులు దుర్భరమైన జీవితం గడుపుతున్నారని వివరించారు. రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టులను చేపట్టకుండా కమీషన్లు వచ్చే పట్టిసీమ వంటి ప్రాజెక్టులపైనే దృష్టిపెడుతున్నారని విమర్శించారు. ఇంకా ఆయనేమన్నారంటే... ‘‘బాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి మూడేళ్లుగా కరువే కరువు. ఎంత దారుణమైన కరువంటే, రాష్ట్రంలో సగటు వర్షపాతం 860 మిల్లీమీటర్లయితే 2014లో 559 మి.మీ, 2015లో 814 మి.మీ, 2016లో 600 మి.మీ. వర్షపాతమే నమోదైంది. ప్రతియేటా రబీలో 24.63 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేస్తాం. మూడేళ్లలో ఏ సంవత్సరమూ ఆ మేరకు నాట్లు పడలేదు. ఈ ఏడాది మరీ దారుణంగా 19.56 లక్షల హెక్టార్లలో మాత్రమే విత్తనాలు వేశారు. అంటే 5 లక్షల హెక్టార్లలో విత్తనం తక్కువ పడింది. 2016 ఖరీఫ్ చూస్తే.. ఆగస్టులో వర్షాలు లేక ఏకంగా 10 లక్షల హెక్టార్లలో పంట ఎండిపోయింది. అప్పుడే చంద్రబాబు రెయిన్‌గన్స్ అన్నారు, నాలుగు రోజుల్లో కరువును పారద్రోలాం అన్నారు. కేవలం పది రోజుల కోసం రెయిన్‌గన్స్ కొనుగోలుకు రూ.160 కోట్లు ఖర్చు పెడితే, రూ.103 కోట్లతో వాటిని ఆపరేట్ చేశారు. చివరకు వాటివల్ల ఒక్క ఎకరా కూడా పంట బతకలేదు. పంట పూర్తిగా ఎండిపోయింది. అనంతపురంలో మొత్తం 63 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. అంటే రెయిన్ గన్స్ పూర్తిగా విఫలమయ్యాయని అర్థమవుతోంది. రెయిన్‌గన్స్‌తో పంటలకు తడి అందించాలంటే 5 లక్షల ట్రాక్టర్లు అవసరం. సమీపంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపినా అన్ని ట్రాక్టర్లు ఉండవేమో? కరువు రైతులతో చెలగాటం.. రాష్ట్రంలో మొత్తం 664 మండలాలుంటే, 2014–15లో 238 మండలాలను, 2015–16లో 359 మండలాలను, 2016–17లో 301 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. కరువు మండలాలుగా ప్రకటిస్తే.. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రం గట్టిగా మాట్లాడి తమకు సాయం చేస్తారని రైతులు ఆశిస్తారు. రుణాలు రీషెడ్యూలు అవుతాయనుకుంటారు. కానీ ఈ మూడేళ్లలో ఒక్కసారి కూడా రుణాలు రీషెడ్యూలు కాలేదు. ఇన్పుట్ సబ్సిడీ వస్తుం దని, పంటలు నష్టపోయినందుకు సాయం వస్తుందని అనుకుంటారు. 2013–14లో రూ.2,306 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, అందులో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పైగా కేంద్రం ఇచ్చిన వాటాను వేరే పనులకు మళ్లించారు. 2014–15లో రూ.1,500 కోట్లు ఇవ్వాలని కలెక్టర్లు చెబితే, దాన్ని తగ్గించి రూ.1,067 కోట్లు చేశారు. మళ్లీ కేబినెట్ మీటింగ్ పెట్టి రూ.692 కోట్లకు తగ్గించారు. ఇవాల్టికీ అందులో రూ. 20, 30 కోట్లు బకాయిలు ఉన్నాయి. 2015–16లో భారీ వర్షాల వల్ల రూ.270 కోట్లు, కరువు వల్ల రూ.600 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటే, ఇవాల్టికీ ఇంకా ఇవ్వలేదు. 2016–17లో కరువు వచ్చింది. 268 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిం చారు. దానివల్ల రూ.1,760 కోట్లు, మళ్లీ వర్షాలకు రూ.51 కోట్లు మొత్తం కలిపి రూ.1,811 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. అందులో ఒక్క దమ్మిడీ కూడా ఇవ్వకపోగా, కలెక్టర్లు 400 మండలాలను సిఫార్సు చేస్తే, 268 మండలాలే ప్రకటించారు. తర్వాత మళ్లీ ప్రజలనుంచి ఒత్తిడి వస్తే మరో 33 మండలాలను కలిపారు. అక్టోబర్‌లో ప్రకటించాల్సిన వాటిని కేంద్రబృందం వెళ్లిపోయాక ఫిబ్రవరిలో ఈ 33 మండలాలు కలిపారు. మాఫీ హామీతో రైతులకు రుణభారం రుణమాఫీ వాగ్దానం చూస్తే.. రైతులు లాభపడిందానికన్నా కోల్పోయిందే ఎక్కువ. 197వ ఎస్ఎల్బిసీ నివేదికను బట్టి చూస్తే.. 2014–15కు సంబంధించి రైతులకు రూ.56వేల కోట్లు పంటరుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే రూ.39,938 కోట్లు మాత్రమే ఇచ్చారు. 2016–17కు రైతులకు బ్యాంకులు 83వేల కోట్లు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుంటే రూ.55,914 కోట్లు మాత్రమే ఇచ్చారు. రైతులకు రుణాలు అందడం లేదనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. చంద్రబాబు సీఎం అయ్యాక రైతులకు రుణాలు ఇవ్వకపోవడం ఒకటైతే.. రుణభారం కూడా విపరీతంగా పెరిగిపోతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి రైతుల రుణభారం రూ.87,612 కోట్లు కాగా 2016 సెప్టెంబర్ 30 నాటికి అంటే.. రెండున్నరేళ్లలో రైతుల రుణభారం రూ.1,03,238 కోట్లకు పెరిగింది. రుణాలపైన ఏడాదికి 18శాతం అపరాధ వడ్డీ రూ. 15,770 కోట్లు చొప్పున మూడేళ్లలో రైతులు బ్యాంకులకు కట్టాల్సిన అపరాధ వడ్డీ రూ. 47వేల కోట్లు అయ్యింది. చంద్రబాబు ఇచ్చింది కేవలం రూ.10,600 కోట్లు మాత్రమే. అంటే బాబు ఇచ్చింది వడ్డీలకు కూడా సరిపోలేదన్నమాట. మొత్తం రైతుల ఖాతాలు 1.10 కోట్లు కాగా.. వాటిలో ఓవర్‌డ్యూ 31,13,215 ఖాతాలు, ఎన్పీఏ ఖాతాలు 8,41,790గా ఉన్నాయి. చంద్రబాబు రుణమాఫీని నమ్మిన రైతుల పరిస్థితి ఇది. రైతులకు మొత్తం పంట రుణాలు రూ.69,434 కోట్లయితే, వాటిలో ఓవర్‌డ్యూ, ఎన్పీఏ కలిపి దాదాపు రూ.25వేల కోట్లు( 35 శాతం). వ్యవసాయ టర్మ్ లోన్లు రూ.33,804 కోట్లు కాగా అందులో ఓవర్‌డ్యూ, ఎన్పీఏలు కలిపితే దాదాపుగా రూ.10వేల కోట్లు ఉన్నాయి. రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దీనిని బట్టి తెలుసుకోవచ్చు. 135 కోట్లు ఖర్చుపెట్టి సముద్రంలోకి పట్టిసీమ నీళ్లు.. ఏ ప్రాజెక్టులు ఉపయోగం అన్న ఆలోచన కూడా లేకుండా కమీషన్ల కోసమే ప్రాజెక్టులకు ఖర్చు పెడుతున్నారు. ఎలాంటి స్టోరేజి కెపాసిటీ లేని పట్టిసీమ కడతారు. ఈ ప్రాజెక్టు నుంచి ఎన్ని టీఎంసీలు లిఫ్ట్ చేశారంటే మంత్రి 54 టీఎంసీలు అంటారు. ఎస్ఈని అడిగితే 48 టీఎంసీలంటారు. కరెంటు బిల్లులు చూశాం. రూ. 135.46 కోట్ల బిల్లులు వచ్చాయి. అంటే లిఫ్టులు 110 రోజులు పనిచేశాయి. వాటి ఆధారంగా చూస్తే 42 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేశారు. కానీ 55 టీఎంసీల నీళ్లు ప్రకాశం బ్యారేజీ వద్ద సముద్రంలో కలుపుతారు. అంటే అంతర్వేది వద్ద సముద్రంలో కలవాల్సిన గోదావరి నీళ్లను రూ. 135 కోట్ల రూపాయలు కరెంటు బిల్లులకు ఖర్చు పెట్టి లిఫ్ట్ చేసి ప్రకాశం బ్యారేజీ వద్ద సముద్రంలో కలిపారన్నమాట. ప్రకాశం బ్యారేజి నుంచి నీళ్లు సముద్రంలోకి పోయేది అప్పుడే, పట్టిసీమ నీళ్లు లిఫ్ట్ చేసేదీ అప్పుడే. అదే 110 రోజులు కరెంటు బిల్లులు కట్టి నీళ్లు ఎత్తిపోశారు. అదే 110 రోజులపాటు 55 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీ వద్ద సముద్రంలో కలిశాయి. కరెంటు బిల్లుల మీద పెట్టిన రూ.135 కోట్లు.. తెలంగాణ ప్రభుత్వం అడుగుతున్న రూ.120 కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి ఇస్తే, వాళ్లు ఆ ఊళ్లను ఖాళీ చేయించి ఇచ్చేవారు. అప్పుడు పులిచింతలలో 45 టీఎంసీల నీళ్లు నిల్వచేసుకునే పరిస్థితి వచ్చేది. వాళ్లకు ఆ డబ్బులు ఇవ్వని కారణంగా పులిచింతల ప్రాజెక్టు రెడీ అయినా ఇప్పుడు గరిష్టంగా 28 టీఎంసీలు మాత్రమే నిల్వచేయగలిగారు. దాని పూర్తి సామర్థ్యం 45 టీఎంసీలు. గన్నవరంలోను, తన నియోజకవర్గంలోను పంటలు కాపాడలేని పరిస్థితిలో నీటిపారుదల మంత్రి ఉన్నారు. హంద్రీ–నీవాకు సంబంధించి పోయి ధర్నాలు చేయాల్సి వచ్చింది. 80 శాతం పనులు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే అయిపోయాయి. కేవలం 20 శాతం మిగిలి ఉన్నాయి వాటిని పూర్తి చేయడానికి డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులు పూర్తిచేయాలని ధర్నాలు చేశాం. అవి రాకపోవడం వల్ల అనంతపురం జిల్లాలో మొత్తం 63 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. నిజంగా నీళ్లిచ్చి ఉంటే ఆ పరిస్థితి ఎందుకు ఉంటుంది? గాలేరు–నగరి ప్రాజెక్టూ అంతే. గండికో ట కెపాసిటీ 26 టీఎంసీలు. 6 టీఎంసీలు వరద కాలువ ద్వారా తీసుకురావాల్సి ఉన్నా ఆ పనిచేయలేదు. వేరే మార్గం గుండా తీసుకొచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు సీఎం కాకముందు 2012లోనే అప్పటి కలెక్టర్ శశిధర్ 3 టీఎంసీల నీళ్లు నింపి ఫొటో దిగారు, వీళ్లూ అదే పని చేశారు. వరద కాలువ పూర్తి చేయాలనే విషయాన్ని మాత్రం ఆలోచించరు. అది పూర్తయితే గాలేరునగరి మొదటి దశ పూర్తయి నీళ్లిచ్చే పరిస్థితి ఉంటుంది. దానిపై ధ్యాసపెట్టరు.’’ హేచరీస్ ఉన్న చోట ఫార్మా పరిశ్రమలా? చంద్రబాబు పుణ్యాన హేచరీలు ఉన్నచోట్ల ఫార్మా యూనిట్లు పెడుతున్నారు. తుని వద్దకు వెళ్లి చూస్తే, 65 లక్షల లీటర్ల కాలుష్య జలాలు రోజూ సముద్రంలో కలుపుతున్నారు. హేచరీలకు హాని కలుగజేస్తూ సముద్రపు నీళ్లు కలుషితం అవుతున్నాయి. పరిశ్రమలకు నేను వ్యతిరేకం కాదు.. వాటిని పెట్టాల్సిన చోట పెట్టాలి. ఫార్మాసిటీలో అయితే ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉంటాయి. కానీ హేచరీల క్లస్టర్ వద్ద పెడితే అవి నాశనం అయిపోతాయి. చంద్రబాబు విధానాల వల్ల చేపలు పట్టే మత్స్యకారులు వేటకు వెళ్లాలంటే లోతుగా సముద్రంలోకి వెళ్లాల్సి వస్తోంది. తిరిగి ఇంటికి వస్తాడా రాడా అన్న భయం వేస్తోంది. దమ్మున్న సీఎం ఉంటేనే రైతుకు మద్దతుధర ఇదే వ్యవసాయ రంగంలో చంద్రబాబు సీఎం అవ్వడానికి ముందు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయిస్తామని, పెట్టుబడికి 50 శాతం లాభం వచ్చేలా కనీస మద్దతు ధర ఇప్పిస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. కేంద్రంలో భాగస్వామ్య ప్రభుత్వంలో ఉన్న వీళ్లు కనీస మద్దతు ధర విషయం చూడాలి. చంద్రబాబు సీఎం అయినప్పుడు వరి రూ.1360 ఉంటే, 2015–16కు కేవలం 50 రూపాయలు పెంచారు, 2016–17కు రూ.1,470కి మాత్రమే పెరిగింది. 4 శాతం కంటే తక్కువ మాత్రమే పెరిగింది. పత్తి 2014–15లో రూ.3,750 ఉంటే 2015–16లో రూ.3,850, 2016–17లో రూ.3,860 మాత్రమే అయ్యింది. అంటే ఒకటి నుంచి ఒకటిన్నర శాతమే పెరిగింది. ద్రవ్యోల్బణం 5 శాతం పైనే ఉంది. అంటే రైతులకు కనీస మద్దతు ధర దానికి సరిపోయేలా కూడా పెంచకపోతే రైతుల వాస్తవాదాయం పెరిగిందా.. తగ్గిందా? ముఖ్యమంత్రులు కేంద్రంపై ఒత్తిడి తేవాలి. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరికి కనీస మద్దతు ధర రూ.530 నుంచి రూ.1,050కి పెరిగింది. ముఖ్యమంత్రి కేంద్రం మీద తెచ్చే ఒత్తిడి ఆధారంగానే కనీస మద్దతు ధరలు పెరుగుతాయి. -
'పచ్చ నేతలు రూ.300కోట్లు దోచేశారు'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మాజీ మంత్రి సూర్య ప్రకాష్ రెడ్డి శనివారం ఫైరయ్యారు. పోలవరంపై చంద్రబాబుది ప్రచార ఆర్భాటమేనని ఎద్దేవా చేశారు. రెయిన్ గన్ ల వ్యవహారంలో టీడీపీ నేతలు రూ.300 కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. మాట మీద నిలబడని బాబుకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. -
చంద్రబాబుకు కోట్ల సూర్యప్రకాశ్ సవాల్
-
చంద్రబాబుకు కోట్ల సూర్యప్రకాశ్ సవాల్
హైదరాబాద్: రెయిన్ గన్ లతో రాయలసీమలో పంటలను కాపాడానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెయిన్ గన్ల వల్ల రాయలసీమలో ఎక్కడా పంటలు పండలేదని ఆయన తెలిపారు. పంటలు పండకపోగా లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగిందని, అక్కడికి వచ్చి వాటిని ప్రత్యక్షంగా పరిశీలించాలని సీఎం చంద్రబాబుకు సూర్యప్రకాశ్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ నెల 19న కర్నూలు జిల్లా కొడుమూరులో రైతు సభ ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. -
మళ్లీ రెయిన్గన్లు!
- విఫలమైనా అదే ప్రయోగం - విమర్శలకు తావిస్తున్న ప్రభుత్వ చర్యలు - కంది, వరి పంటల కోసం ప్రతిపాదనలు - వివరాలు సేకరిస్తున్న వ్యవసాయశాఖ సిబ్బంది - గురువారం సాయంత్రానికి నివేదిక సిద్ధం గతంలో ఇలా.. గతంలో రెయిన్గన్ల ద్వారా తడిపిన భూమి: 65 వేల హెక్టార్లు ఇందుకోసం వెచ్చించిన మొత్తం: రూ. 28 కోట్లు ఇప్పటికే రూ.25 కోట్లు మంజూరు కాగా...ఇంకా రూ.3 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇంత ఖర్చు చేసినా..ఒక్క ఎకరా పంటను కూడా కాపాడలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం ఇలా.. జిల్లాలో అక్టోబరు నెల సాధారణ వర్షపాతం: 114. మిమీ ఇప్పటి వరకు కురిసిన వర్షపాతం: 9 మి.మీ మరో వారం రోజుల్లో వర్షాలు పడకపోతే కంది పూర్తిగా ఎండిపోతుంది. పత్తి, వరి పంటలుదీ అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో నిర్దిష్టంగా పంటలను కాపాడే ప్రణాళికలు లేకుండా.. విఫలమైన రెయిన్గన్లను మళ్లీ తెరపైకి తీసుకురావడం విమర్శలకు తావిస్తోంది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: పంటలను కాపాడేందుకు రెయిన్గన్ల వినియోగాన్ని ప్రభుత్వం మరోసారి తెరపైకి తీసుకొస్తోంది. ఖరీఫ్ సీజనులో వేసి ఇంకా మిగిలి ఉన్న కంది, పత్తి, వరి పంటలను కాపాడేందుకే రెయిన్గన్లను ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏయే పంటలు ఏయే దశలో ఉన్నాయి? ఎంత విస్తీర్ణంలో ఉంది? ఇందుకోసం ఎన్ని రెయిన్గన్లు కావాలనే వివరాలను సమర్పించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో గురువారం (27వ తేదీ) సాయంత్రం జిల్లా కలెక్టర్‌కు వ్యవసాయశాఖ అధికారులు నివేదిక సమర్పించేందుకు సిద్ధమయ్యారు. వాస్తవానికి గతంలో ఒకసారి హడావుడిగా రెయిన్గన్లను ఉపయోగించి పంటలను కాపాడతామంటూ భారీగా నిధులు వెచ్చించినప్పటికీ ఫలితంలేకపోయింది. అయినప్పటికీ మరోసారి రెయిన్గన్లను ఉపయోగించేందుకు సిద్ధపడుతుండటం విమర్శలకు తావిస్తోంది. కంది, వరి కోసం ప్రతిపాదనలు జిల్లాలో ఖరీఫ్ సీజనులో వేసిన కంది, పత్తి, వరి పంటలు ఇప్పుడు ఎండుముఖం పట్టాయి. ప్రధానంగా కెసి కెనాల్‌కు నీరు రాకపోవడంతో వరి పంట పరిస్థితి దారుణంగా ఉంది. కెసీ కెనాల్లో ఒక అడుగు నీరు మాత్రమే ఉంది. ఈ నీరు తూములకు ఎక్కే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఈ నీటిని రెయిన్గన్ల ద్వారా వరి పంటలకు తడిపేందుకు అనుమతి ఇవ్వాలని వ్యవసాయశాఖ కోరనున్నట్టు తెలిసింది. ఇక పత్తి పంటలను రెయిన్గన్ల ద్వారా తడిపితే ఉపయోగం లేదని కూడా వ్యవసాయశాఖ అధికారులు భావిస్తున్నారు. కంది పంట జిల్లావ్యాప్తంగా లక్ష హెక్టార్లల్లో సాగయ్యింది. పత్తి పంట విషయానికి వస్తే లక్షా 63 వేల హెక్టార్లు, వరి 67 వేల హెక్టార్ల మేరకు సాగయ్యింది. ఇందులో ఇప్పుడు ఎంత మేరకు పంట ఎండుముఖం పట్టిందనే వివరాలను సేకరించే పనిలో వ్యవసాయశాఖ అధికారులు ఉన్నారు. ఇందుకు అనుగుణంగా ఎన్ని రెయిన్గన్లు అవసరంమనే అంశాన్ని కూడా సమర్పించే నివేదికలో పేర్కొననున్నారు. గురువారం సాయంత్రానికి నివేదిక సిద్ధమవుతుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. రూ. 28 కోట్లు ఖర్చు చేసినా...! గత నెలలోనే మొదటిసారిగా ప్రభుత్వం రెయిన్గన్లను భారీగా ఉపయోగించడం ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా రెయిన్గన్ల వినియోగానికి ప్రభుత్వం మూడు వందల కోట్లకుపైగా నిధులను ఖర్చు చేసింది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో 65 వేల హెక్టార్లను రెయిన్గన్ల ద్వారా తడిపామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రూ. 28 కోట్లు మేరకు వెచ్చించారు. ఇందులో రూ.25 కోట్లు ఇప్పటికే మంజూరు కాగా...ఇంకా రూ.3 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే, ఒక్క ఎకరా పంటను కూడా కాపాడలేకపోయారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ మరోసారి రెయిన్గన్లను తెరమీదకు తీసుకరావడం అనుమానాలకు తావిస్తోంది. నిర్దిష్టంగా పంటలను కాపాడేందుకు దీర్ఘకాలంలో చర్యలు తీసుకునేందుకు ప్రణాళిక రచించకుండా తాత్కాలిక పనుల కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేయడం ఏమిటని రైతులు వాపోతున్నారు. -
బాబ్బాబు.. వెనక్కివ్వండి
ధర్మవరం : ‘నమస్తే అన్నా.. మీ ఊరికి తీసుకెళ్లిన రెయిన్గన్లు.. స్రింక్లర్ పైపులు నిన్ననే తీసుకువస్తామని చెప్పారన్నా.. ఇంకా గోడౌన్‌కు చేర్చలేదేమన్నా? పై అధికారులు ఫోన్‌మీద ఫోన్ చేస్తున్నారన్నా.. ఎలాగైనా.. ఈ రోజు సాయంత్రంలోపు మీ ఊరికి ఇచ్చిన సామాన్లన్నీ గోడౌన్‌కు చేర్పించన్నా.. మర్చి పోద్దన్నా..ప్లీజ్..’ ఇది ఓ వ్యవసాయాధికారి వేడుకోలు. ‘ఏమయ్యా ఏవో.. రెయిన్ గన్లు.. స్ప్రింక్లర్లు వెనక్కి తీసుకు రమ్మంటున్నావంటా.. ఉన్నీలే.. మావోల్లేలే! జిల్లాలో అన్ని చోట్లా వెనక్కి ఇచ్చినప్పుడు.. మావోళ్లూ తెచ్చిస్తారులే... లాస్ట్ వరకు చూడు... వాళ్లనేం బలవంత పెట్టొద్దు’ ఇది అదే వ్యవసాయాధికారికి ఓ ప్రజాప్రతినిధి జారీ చేసిన హుకుం! ఖరీఫ్ సీజన్లో సాౖVð న వేరుశనగ పంటను కాపాడేందుకు రక్షక తడులు అందించాలంటూ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ వ్యవసాయాధికారుల ద్వారా రెయిన్గన్లు, స్రింక్లర్లు, హెచ్డీ పైపులు, డీజిల్ ఇంజన్లు అందజేసిన సంగతి తెలిసిందే. అవి ఏమేరకు పంటను రక్షించాయన్నమాట అటుంచితే. వాటిని అధికార పార్టీ నేతల నుంచి వెనక్కి తెప్పించేందుకు అధికారులకు తలప్రాణం తోకకొస్తోంది. ప్రస్తుతం కంది పంటకు కూడా రక్షక తడులు ఇచ్చేలా ఉత్తర్వులు జారీ అయినే నేపథ్యంలో వాటిని రికవరీ చేయకపోతే అధికారుల నుంచి చీవాట్లు.. గట్టిగా ఒత్తిడి చేసి తీసుకురమ్మని చెబితే నేతల నుంచి ఒత్తిళ్లు.. అడకత్తెరలో పోకచక్కలా తయారైంది వ్యవసాయాధికారుల పరిస్థితి. టీడీపీ నేతల ఆధీనంలోనే జిల్లా వ్యాప్తంగా 63 మండలాల్లో ఎండిపోతున్న వేరుశనగ పంటను కాపాడేందుకు రక్షకతడులు అందజేసేందుకు గాను 4,621 రెయిన్గన్లు, 4,279 స్ప్రింక్లర్ సెట్లు, 2,859 డీజిల్ ఇంజన్లు, 1.28 లక్షల హెచ్డీ పైపులను ప్రభుత్వం సమకూర్చింది. అయితే రైతులకు ఉపయోగపడాల్సిన ఈ సామగ్రి... పంచాయతీల వారీగా జన్మభూమి కమిటీ సభ్యులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పంచుకున్నారు. ఇళ్లలోనే సామగ్రి పంట పొలాల్లో రక్షక తడులు అందించాల్సిన రెయిన్గన్ల సామగ్రి నేతల ఇళ్లలోనే మూలుగుతున్నాయి. చాలా గ్రామాల్లో కనీసం ఒక్క ఎకరాకు రక్షక తడులు అందించేందుకు కూడా వినియోగించకుండా నేరుగా ఆయా గ్రామాల నాయకులు తమ ఇళ్లలో వాటిని భద్రంగా దాచిపెట్టారు. వీటిలో కొన్ని చోరీకి గురికాగా, మరికొన్ని శిథిలమైనట్లు తెలుస్తోంది. ధర్మవరం నియోజకవర్గంలో పరిస్థితి ఇలా.. - బత్తలపల్లి మండలంలో 102 రెయిన్ గన్లు పంపిణీ చేయగా 25 రికవరీ అయ్యాయి. స్రింక్లర్లు 132గాను 35 మాత్రమే వెనక్కి తెచ్చిచారు. ఆయిల్ ఇంజిన్లు 87కు గాను 57 మాత్రమే వ్యవసాయాధికారుల వద్దకు తిరిగి చేరాయి. మొత్తం పరికరాల్లో 8,700గాను 3,700 మాత్రమే వెనక్కి వచ్చాయి. - తాడిమర్రి మండలంలో 103 రెయిన్ గన్లు, 96 ఆయిల్ ఇంజన్లు, 5,011 పైపులు, 60 స్ప్రింక్లర్ సెట్లకు గాను 55 ఆయిల్ ఇంజిన్లు, 60 స్ప్రింక్లర్లు మాత్రమే వ్యవసాయ కార్యాలయానికి చేరాయి. - ముదిగుబ్బ మండలంలో 124 రెయిన్గన్లు, 124 స్ప్రింక్లర్ సెట్లు, 118 ఆయిల్ ఇంజన్లు, 9,554 హెచ్డీ పైపులు పంపిణీ చేయగా వాటిలో 50 శాతం సామగ్రి మాత్రమే వెనక్కి చేరింది. - ధర్మవరం మండలంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. -
'కరువును హెలికాప్టర్ల లోంచి చూస్తారట'
-
కరువును కూడా హెలికాప్టర్ల లోంచి చూస్తారట
నాలుగు రోజుల్లోనే కరువును జయించామని చెబుతున్నారు కరువు వచ్చినట్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఎవరూ చెప్పలేదట మీ కంప్యూటర్లు పనిచేయడం లేదా, కోర్ డాష్‌బోర్డు ఏమైంది కంప్యూటర్లను నొక్కడానికి మీకు చేతులు రావడం లేదా కరువు కోరల్లో అనంతపురం.. 5 లక్షల మంది వలసలు కరువు నివారణ చర్యలు చేపట్టడంలో చంద్రబాబు విఫలం అనంతపురం రైతు మహాధర్నాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం నాలుగు రోజుల్లోనే అనంతపురం జిల్లాలో కరువును జయించేసినట్లు చంద్రబాబు ప్రకటించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కరవును కూడా హెలికాప్టర్ల లోంచి చూసిన ముఖ్యమంత్రి మన ఖర్మ కొద్దీ ఈయనొక్కరేనని విమర్శించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం అనంతపురం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన మహా రైతు ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. మిట్ట మధ్యాహ్నం, ఎండలు కూడా తీక్షణంగా ఉన్నాయి కరవుతో కడుపు కాలుతోంది.. అయినా ఇంటికి పోవడానికి ఏ ఒక్కరూ సాకులు వెతుక్కోవట్లేదు మీ అందరి ప్రేమాభిమానాలకు, ఆత్మీయతకు ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి చేతులు జోడించి శిరస్సు వంచి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను కరువు తాండవిస్తోంది.. ఒక్క అనంతపురం జిల్లాలోనే దాదాపు 15 లక్షల ఎకరాల్లో వేరుశనగ వేశారు మరో 3 లక్షల ఎకరాలు మిగిలిన పంటలు వేశారు వేరుశనగ పంటలో 90 శాతం ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది రాయలసీమ నాలుగు జిల్లాల్లో దాదాపు 21.50లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట వేశారు 17 లక్షలకు పైగా ఎకరాల్లో పంట ఎండిపోయింది జూన్‌లో వర్షాలు పడ్డాయి కాబట్టి ఈసారైనా బయట పడగలమని అనుకున్నాం అందుకే మామూలు కన్నా ఎక్కువగా ఈసారి పంట వేశాం జూలైలో చాలీచాలని వర్షాలు పడ్డాయి. అక్కడి నుంచి ఆగస్టు చివరివరకు ఒక్క బొట్టు కూడా వర్షం పడలేదు వేరుశనగ ఊటలు దిగినప్పుడు వర్షాలు పడితే తప్ప వేరుశనగ బతకదు దాంతో 90 శాతం పంట నష్టపోవాల్సి వచ్చింది ఇంతటి దారుణంగా పరిస్థితులుంటే చంద్రబాబు ఆగస్టు 28న పుట్టపర్తి, కదిరి వచ్చారు కరువుందా.. నాకు తెలీదే, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఎవరూ చెప్పలేదని అంటారు మామూలుగా అయితే తనకు కంప్యూటర్ ఉందని, అందులో ఒక బటన్ నొక్కితే కోర్ డాష్ బోర్డులో ప్రతిరోజూ ఎక్కడ ఎంత వర్షం పడిందో కూడా తనకు తెలుస్తుందని ఊదరగొడతాడు నీ కోర్ డాష్ బోర్డు పనిచేయడం లేదా, కంప్యూటర్లు పనిచేయడం లేదా.. వాటిని నొక్కడానికి నీ చేతులు రావట్లేదా ఆగస్టు 6, 15 తేదీలలో కూడా ఆయన మన జిల్లాకు వచ్చి రెండు మీటింగులు పెట్టాడు ఒక్క ఎకరా పంట కూడా ఎండనివ్వబోనని ఆయన అన్నాడు మళ్లీ తర్వాత కరువు ఉందని ఎవరూ తనకు చెప్పలేదని అంటాడు వెంటనే ఆయన రెయిన్ గన్ పేరుతో ఒక సినిమా తీయడం మొదలుపెట్టాడు ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ రాత్రి వరకు నాలుగు రోజుల్లో కరువును జయించేశాం అన్నాడు కరువును తరిమికొట్టేశాం అని కూడా చెప్పాడు 4 లక్షల ఎకరాలకు నాలుగు రోజుల్లో రెయిన్గన్లతో నీరిచ్చామని చంద్రబాబు అంటాడు నోరు తెరిస్తే ఇంత అబద్ధాలు ఆడుతున్న ఈ వ్యక్తికి నిజంగా రెయిన్ గన్ అంటే ఏంటో తెలుసా అని అనుమానం వచ్చింది ఎందుకంటే రెయిన్ గన్లు ఇప్పుడు ఈయన కొత్తగా కనిపెట్టినవి కావు.. ఎప్పటినుంచో ఉన్నాయి ఒక ఎకరాకు 25 వేల లీటర్ల ట్యాంకరుతో ఒకసారి రెయిన్ గన్‌తో తడిపితే.. 5 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లు అవుతుంది అది పడిపోయిన పేషెంటుకు కేవలం వెంటిలేటర్ పెట్టినట్లు మాత్రమే అవుతుంది కనీసం 28 మిల్లీమీటర్ల తడి ఉంటే దాన్ని పదును అని గ్రామీణ భాషలో అంటారు గ్రామాల్లో ఉన్నవన్నీ 4వేలు, 5 వేల లీటర్ల ట్యాంకర్లే ఉన్నాయి ఎకరాకు కనీసం 25 నుంచి 30 ట్యాంకర్లతో నీళ్లిస్తే పదును అంటారు చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం 4 రోజుల్లో 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాడట అంటే 25 నుంచి 30 లక్షల ట్యాంకర్లతో నీళ్లు ఇచ్చినట్లు చెప్పాడు మన అనంతపురం కాదు కదా.. పక్కన తమిళనాడు, కర్ణాటక కలుపుకొన్నా కూడా ఇన్ని ట్యాంకర్లు లేవు ఆ సంగతి మీకు, నాకు అందరికీ తెలుసు చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువై, సిగ్గు లేకుండా నాలుగు రోజుల్లో నాలుగు లక్షల ఎకరాలు కాపాడానని చెబుతారు రాయచోటి నియోజకవర్గం మాధవరంలో రమణయ్య అనే టీడీపీ మాజీ సర్పంచి పొలంలో రెయిన్ గన్ను చంద్రబాబు ప్రారంభించారు అదే పొలం ఇప్పుడు పూర్తిగా ఎండిపోయి ఉంది. జిల్లాకు వచ్చేటపుడు ప్రతి ఎకరాలోనూ ఇదే పరిస్థితి.. పంటలు ఎండిపోయాయి అయినా చంద్రబాబుకు మాత్రం ఈ జిల్లాలో కరువు కనిపించదు, ఆయనకు సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రికి అంతకన్నా కనపడదు 4 లక్షల ఎకరాలను కాపాడారని, అందువల్ల 59 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని కాపాడామని ప్రత్తిపాటి పుల్లారావు అంటారు ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టడానికే ఆ డ్రామాలు ఆడుతున్నారా అని అడుగుతున్నా సెప్టెంబర్ 21న కొల్లు రవీంద్ర మన జిల్లాకు వచ్చి.. ప్రెస్ మీట్ పెడతారు జిల్లాలో 90 శాతం పంట ఎండిపోయిన విషయాన్ని తాను ఆమోదిస్తున్నానని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అంటాడు మంత్రులు చెప్పినట్లు 90 శాతం పంట ఎండిన విషయం నిజమా.. పంటలు కాపాడిన విషయం నిజమా ఈ జిల్లాలో 25 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది నెల్లూరులో 52 శాతం, చిత్తూరులో 23 శాతం తక్కువ వర్షపాతం ఉంది. దాదాపుగా రాష్ట్రంలో 250 మండలాల్లో కరువు తాండవిస్తోంది కరువు రావడం ఎవరి చేతుల్లోనూ ఉండదు.. కానీ కరువు వచ్చినపుడు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలా స్పందించాలో సీఎం చేతుల్లోనే ఉంటుంది ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. గతంలో కరువు వచ్చినప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎలా పట్టించుకున్నారో గుర్తుతెచ్చుకోండి జిల్లాలో చంద్రబాబు పుణ్యాన రైతులంతా అలమటించి ఆత్మహత్యలు చేసుకునేవారు 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు పోవాలంటే తానేం చేయాలి, కేంద్రం చేత ఏం చేయించాలని ఆలోచనలు చేశారు ఆ ఆలోచనల నుంచి పుట్టిన తొలి సంతకమే.. ఉచిత విద్యుత్ బోరు వ్యవసాయం మీద ఆధారపడుతున్న రైతులకు అది తోడుగా నిలబడింది తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబుకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని తోచలేదు, పైగా రైతులను పోలీసు స్టేషన్లలో పెట్టారు వైఎస్ రాజశేఖరరెడ్డి 1100 కోట్ల రైతుల విద్యుత్ బకాయిలను ఒక్క సంతకంతో మాఫీ చేశారు అంతటితో ఆగకుండా.. కేంద్రం దగ్గరకు వెళ్లి ఇక్కడ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో జయతి ఘోష్ నివేదిక చూపించారు రైతు ఆత్మహత్యలను నివారించడానికి ఒక విధానం రూపొందించాలని కేంద్రం మీద ఒత్తిడి తెచ్చారు చంద్రబాబు మాదిరిగా అర్జీ ఇచ్చి ఊరుకోలేదు.. కేంద్రం మీద ఒత్తిడి తేవడంతో కేంద్రం ఒక కమిటీని నియమించింది రాష్ట్రంలోనే కాక దేశంలో 2001 నుంచి 2004 వరకు కరువు వల్ల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని అధ్యయనం చేసింది దేశం మొత్తమ్మీద 31 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని కేంద్రం ఆమోదించింది. వాటిలో నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 16 జిల్లాలు వచ్చాయి ఆ ప్యాకేజి వచ్చి తర్వాత ఏళ్ల తరబడి రైతులంతా కట్టాల్సిన వడ్డీలను పూర్తిగా మాఫీ చేశారు దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకుకు రుణాలు రెన్యువల్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది అందరికీ మళ్లీ కొత్త రుణాలివ్వాలని రాజశేఖరరెడ్డి కృషివల్ల కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. కరువు శాశ్వతంగా పోవాలంటే పెండింగులో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలని హంద్రీ నీవా, గాలేరు నగరి, వెలిగొండ, పోలవరం లాంటి ప్రాజెక్టులను పరుగులు పెట్టించారు తొమ్మిదేళ్లలో హంద్రీ నీవాకు 13 కోట్లు, గాలేరు నగరికి 17 కోట్లు, వెలిగొండ ప్రాజెక్టు మీద 13.5 కోట్లు, పులిచింతల మీద కేవలం 24 కోట్లు ఖర్చుపెట్టారు. ఇక పోలవరం ప్రాజెక్టు మీద కేవలం 7 కోట్లు ఖర్చుపెట్టాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ దాదాపు 80 శాతం వరకు పూర్తయ్యాయంటే అది రాజశేఖరరెడ్డి చలవే కరువు వచ్చినపుడు రైతులకు తోడుగా ఉండాలని ఏ ముఖ్యమంత్రి అయినా ఆలోచించాలి కనీస మద్దతు ధర ఉంటేనే రైతు తన కాళ్ల మీద నిలబడగలడని ఆలోచించి అమలుచేశారు. వరి మద్దతు ధర 1030కి వెళ్లింది ఐదేళ్లలో విత్తనాల ధరలను నేలకు తెచ్చారు పత్తి విత్తనాలు రేట్లు 1800 నుంచి 650 రూపాయలకు తగ్గించారు రైతులకు తోడుగా ఉండాలంటే కరువు వచ్చినపుడు ఇన్పుట్ సబ్సిడీ, పంటబీమా ఉండాలని తలపెట్టి అవన్నీ ఇచ్చి రైతులను ఆదుకున్నారు కరువు వచ్చినపుడు తినడానికి తిండి ఉండదు కాబట్టి జనం వలసలు వెళ్లే పరిస్థితి ఉంటుంది. అనంతపురం జిల్లా నుంచి దాదాపు 5 లక్షల మంది వలస వెళ్తారు దాన్ని నివారించడానికి ఉపాధి హామీ పథకంలో 90 శాతం కూలీల కాంపొనెంట్ పెట్టారు ఇప్పుడు ఆ పథకం అంతా సిమెంటు రోడ్ల నిర్మాణం లాంటి పనులు చేస్తున్నారు.. దాంతో వలసలు మళ్లీ మొదలయ్యాయి ఇప్పుడు కరువు వరుసగా వచ్చింది. మూడో సంవత్సరం కూడా వచ్చింది. మరి చంద్రబాబు ఏం చేస్తున్నారో చూడాలి కరువొస్తే కనీసం ఆ విషయాన్ని గుర్తించి, ఒప్పుకొని రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటబీమా ఇవ్వాలని ఆలోచించాల్సి ఉండగా.. కరువు వచ్చినట్లే తనకు తెలియదని, చెప్పలేదని అంటారు పైగా ఇదే చంద్రబాబు.. నాలుగు రోజుల్లోనే కరువును జయించేశామని ప్రకటనలు ఇచ్చేస్తాడు ముఖ్యమంత్రుల మధ్య తేడా ఏంటో ఇక్కడే అర్థమవుతుంది చంద్రబాబు 2013-14లో ఎన్నికల ప్రచారంలో కరువు గురించి ఊదరగొట్టాడు సీఎం అయిన తర్వాత ఇన్పుట్ సబ్సిడీకి పూర్తిగా ఎగనామం పెట్టాడు కేంద్రం ఇచ్చిన వెయ్యి కోట్లను కూడా వేరేవాటికి వాడుకున్నాడు 2014-15లో 692 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని కూడా కొంతవరకు ఎగ్గొట్టాడు రైతుల నోట్లో పూర్తిగా మట్టికొట్టాడు కనీసం తగ్గించిన దాన్నయినా ఇచ్చాడా అంటే అదీలేదు.. కరువు, తుఫాను వచ్చి రైతులు నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ తగ్గించి లెక్కలు కట్టాడు ఇంతవరకు 990 కోట్ల ఇన్పుట్ సబ్సిడీలో ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు ఆయన ముఖ్యమంత్రి అయ్యి రెండున్నరేళ్లయింది. ఈ రెండున్నరేళ్లలో ఒక్కసారైనా క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చిందా ఇంత దారుణంగా పరిస్థితి ఉంటే, రైతులను ఆదుకోవాల్సిన చంద్రబాబు ఎగువన తెలంగాణ రాష్ట్రం కృష్ణా నుంచి పాలమూరు - రంగారెడ్డి, డిండి లిఫ్ట్ ద్వారా నీళ్లు తీసుకెళ్లిపోతుంటే అడిగే పరిస్థితి లేదు గోదావరి మీద కూడా కేసీఆర్ దాదాపు69వేల క్యూసెక్కులు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో తన్నుకుపోతున్నా అడిగే పరిస్థితి లేదు వర్షం వల్ల శనగకాయ పండకపోవడం ఒక ఖర్మయితే, నకిలీ విత్తనాలతో పండకపోవడం మరో ఖర్మ వేరుశనగతో పాటు పత్తి, మిరప అన్నింటిలోనూ నకిలీ విత్తనాలే కరువుతో 5 లక్షల మంది వలసలు పోతుంటే, ఉపాధి హామీ సొమ్ములో 97 శాతం కూలీలకు కేటాయించాల్సిన వ్యక్తి.. ఆ డబ్బును కూడా మళ్లిస్తున్నారు మొన్ననే ఖరీఫ్‌లో కర్నూలులో ఉల్లి చవగ్గా అమ్మలేమని రైతులు రోడ్లమీద పారేసి వెళ్తుంటే.. ఆ రైతులను పోలీసులతో కొట్టించాడు ఎన్నికలకు ముందు చంద్రబాబు అన్నమాటలు గుర్తుతెచ్చుకోవాలి బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు.. మరి ఆ బంగారం వచ్చిందా? పైగా.. ఆ వేలాన్ని వేలం వేస్తున్నారు..దాంతో ఆ బంగారాన్ని విడిపించుకోలేని పరిస్థితిలో రైతులు ఉన్నారు రైతు రుణాలన్నింటినీ పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానన్నాడు.. మరి రుణమాఫీతో కనీసం మీ వడ్డీలైనా తీరాయా.. జరగలేదు ఎన్నికల్లో చెప్పిన హామీలను కూడా రెండున్నరేళ్లలో ఆయన నెరవేర్చలేదు 2015లో ఖరీఫ్ నుంచి హంద్రీనీవా నీరు ఇస్తామని చెప్పావా లేదా, పట్టిసీమ ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని చెప్పారా లేదా శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. 870 అడుగులకు పైగా నీళ్లున్నాయి. ప్రకాశం బ్యారేజి నుంచి కూడా 52 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైన విషయం వాస్తవమా కాదా? శ్రీశైలంలో నీళ్లుండగా హంద్రీ నీవాకు ఎందుకు నీళ్లు ఇవ్వడం లేదు, మెయిన్ కెనాల్ ఉన్నా ఎందుకు ఇవ్వలేకపోతున్నావు ఎందుకు చేయలేకున్నాడంటే.. అందుకు హంద్రీ నీవా డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేయాలి 6 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలంటే మహా అయితే వెయ్యి కోట్లు మాత్రమే ఖర్చవుతుంది దీనిపై దృష్టిపెట్టకుండా కమీషన్ల మీదే దృష్టిపెడుతున్నారు రైతులకు తోడుగా ఉండాలని, అండగా ఉండాలని, రైతులు నష్టపోయిన పరిస్థితుల్లో ప్రతి ఎకరాకు కనీసం 10 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం పెండింగులో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కావాలని, డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండు లేఖను కలెక్టర్‌కు ఇస్తాం ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరిచి కరువును చూస్తారని ఆశిస్తున్నాం. కరువు వచ్చినపుడు పొలాల్లోకి వెళ్లాలి తప్ప ఏరియల్ సర్వేలు కావు వరదలు వచ్చినపుడు హెలికాప్టర్లు ఎక్కడం చూశాము గానీ, మా ఖర్మకొద్దీ కరువును కూడా హెలికాప్టర్లలోంచి చూసింది ఈ చంద్రబాబు ఒక్కరినే గట్టిగా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాం ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి, సెలవు తీసుకుంటున్నా -
'హోదాపై ఉద్యమాలు చేసినా ఉపయోగం లేదు'
అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేసినా ఉపయోగం లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. అనంతపురంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ప్రత్యేక హోదా రాదని చెప్పిన తన మాటే నిజమైందన్నారు. రెయిన్ గన్స్‌తో పంటలను కాపాడటం ప్రయోగమేనన్నారు. -
రేపు అనంతపురంలో వైఎస్ జగన్ ధర్నా
-
ఈ నెల 4న అనంతపురంలో వైఎస్ జగన్ ధర్నా
అనంతపురం : ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 4న అనంతపురం కలెక్టరేట్ వద్ద రైతులతో కలిసి ధర్నా చేయనున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ధర్నా ఏర్పాట్లను పార్టీ నేతలు తలశిల రఘురాం, అనంత వెంకట్రామిరెడ్డి, శంకర్ నారాయణ, గుర్నాథ్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో కరువు తాండవిస్తున్నా చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వ్యవసాయం దండగ అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. రెయిన్ గన్స్ పేరుతో కరువు రైతులను చంద్రబాబు దగా చేశారని విమర్శించారు. కరువు రైతులను ఆదుకోవాలంటూ వైఎస్ జగన్ చేపడుతున్న ధర్నాను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. -
'రైతుల పరిస్థితి దారుణంగా ఉంది'
అనంతపురం: అనంతపురం జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రెయిన్ గన్స్ ద్వారా పంటలను కాపాడామని సీఎం చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 3 న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో రైతాంగ సమస్యలపై మహాధర్నా చేపట్టనున్నట్టు విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. -
పచ్చనేతల కోసమే రెయిన్గన్లు
ముదిగుబ్బ : టీడీపీ నేతల జేబులు నింపేందుకే రెయిన్గన్లను ప్రభుత్వం పంపిణీ చేసిందని, రెయిన్ గన్ల ద్వారా ఒక్క ఎకరాను కూడా మండలంలో కాపాడ లేక పోయారని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఇందుకూరు నారాయణరెడ్డి విమర్శించారు. మంగళవారం మండల పరిధిలోని మలకవేములక్రాస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. వర్షాభావంతో వేరుశనగ పంట ఎండిపోయిందని, ఒక్క ఎకరాలో కూడా పంట పండలేకపోయారన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి ఇన్పుట్ సబ్సిడీని ప్రకటించి ఆదుకుంటారని అందరూ ఆశిస్తే.. రెయిన్గన్లతో పంటలు కాపాడామని గొప్పలు చెప్పి వెళ్లిపోయారన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి రైతాంగానికి హెక్టార్‌కు రూ.25 వేలు పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.నాయకులు ప్రభాకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, సేవేనాయక్, భాస్కర్, శివనారాయణ, రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు. -
సబ్ కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా
రెయిన్‌గన్స్‌తో రైతుల నోట మట్టి వేరుశెనగ పంట దగ్ధం మదనపల్లె రూరల్: ప్రభుత్వం పంట కాపాడుతుందన్న ఆశతో వేచి చూసి చివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కర్షకులు రోడ్డెక్కారు. పచ్చగా పండుతుందనుకున్న పంట ఎండిపోతే చూడలేక, తీసుకువచ్చి సబ్‌కలెక్టరేట్ ఎదుట తగులబెట్టి తమ నిరసన తెలియజేశారు. నిమ్మనపల్లె మండలానికి చెందిన బాలేపల్లి, రామచంద్రపురం, పిట్టావాండ్లపల్లె, చెన్నంవారిపల్లె, రెడ్డివారిపల్లె, నిమ్మనపల్లె గ్రామాల రైతులు బుధవారం స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎండిన వేరుశెనగ చెట్లను తీసుకువచ్చి పంట కాపాడటంలో ప్రభుత్వవైఫల్యంపై నిరసన వ్యక్తం చేశారు. నిమ్మనపల్లె మండల రైతు సంఘనాయకుడు శివారెడ్డి మాట్లాడుతూ పంట ప్రారంభంలో వర్షాలు విరివిగా కురవడంతో ఎంతో ఆశతో పంటసాగు చేశామన్నారు. వర్షాభావంతో పంట ఎండుతున్న సమయంలో కాకుండా పూర్తిగా ఎండిపోయిన తరువాత ప్రభుత్వం మేలుకోవడంతో పంటను కాపాడుకోలేకపోయామన్నారు. 2014–15 సంవత్సరంలో వేరుశనగ పంట ఇన్పుట్ సబ్సిడీ, రైతుల నుంచి కట్టుకున్న క్రాప్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి ఎలాంటి నష్టపరిహారం ఇప్పటివరకు అందలేదన్నారు. ప్రస్తుతం రెయిన్‌గన్స్ పేరుతో ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టేందుకు పథకం రూపొందించుకుని తమను నిలువునా నట్టేట ముంచుతున్నారని వాపోయారు. రెయిన్‌గన్స్, స్ప్రింక్లర్స్ కొనుగోలుకు వెచ్చించిన రూ. కోట్లు తమకు ఇచ్చి ఉంటే కష్టాలు తీరేవన్నారు. వేరుశెనగ పంట నష్టంపై ప్రభుత్వం తీరు రైలు వెళ్లాక టికెట్టు కొన్నట్లుగా ఉందంటూ వ్యాఖ్యానించారు. వెంటనే వ్యవసాయశాఖ అ«ధికారులతో పంట నష్టం అంచనా వేసి ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ వచ్చేలా చూడాలన్నారు. నాలుగు రోజుల లోపు పంటనష్ట పరిహారంపై ఎలాంటి నిర్ణయం వెలువడకపోతే రైతులందరూ కార్యాలయాల ఎదుట నిరాహారదీక్షలకు దిగుతామని హెచ్చరించారు. ఎండిన వేరుశెనగ పంటను కార్యాలయం ఎదుట తగులబెట్టారు. సబ్ కలెక్టరేట్లో ఏవో సురేంద్రబాబుకు వినతిపత్రం సమర్పించారు. రైతులు చేసిన ధర్నాకు స్థానిక సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప, మాలమహానాడు యమలాసుదర్శనం, గుండాల మనోహర్ తదితరులు మద్దతు తెలిపారు. ప్రభుత్వం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. -
రెయిన్గన్ల పేరిట రూ.170 కోట్లు దుర్వినియోగం
– ప్రత్యేకాధికారుల అడ్రస్ ఎక్కడ? – రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం – ఇన్పుట్ సబ్సిడీ రైతుల అకౌంట్లో జమచేయాలి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పీలేరు: రాష్ట్ర ప్రభుత్వం రెయిన్గన్ల పేరిట ప్రభుత్వం రూ.170 కోట్ల ప్రజాదనం దుర్వినియోగం చేసిందని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. సోమవారం పీలేరు మండల వెంకటాద్రి ఇళ్ల వద్ద ఎండిపోయిన వేరుశనగ పంట పొలాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పూర్తిగా పంటలు ఎండిపోయన్నారు. మూడు రోజులు సీఎం, మంత్రులు పర్యటించి రెయిన్‌గన్స్, స్ప్రింకర్లు, ఆయిల్ ఇంజన్లు, ట్యాంకర్లంటూ హడావిడి చేయడంతప్ప ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా కాపాడిన దాఖలాలు లేవన్నారు. సీఎం తన పబ్లిసిటీ కోసం ఆర్భాటం చేశారు తప్ప రైతులకు చేసింది శూన్యమని దుయ్యబట్టారు. పంటలను కాపాడేందుకు నియమించిన ప్రత్యేకాధికారులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం చేతనైతే రైతుల ఖాతాలలో ఇన్పుట్ సబ్బిడీ, పంటల భీమా వేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రెయిన్గన్లతో ఎన్ని ఎకరాల్లో వేరుశనగ పంట కాపాడారో దానిపై నిజనిర్ధారణ కమిటీ వేసే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అంటూ ప్రశ్నించారు. ఎక్కడ చూసినా వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోయి రైతులు లబోదిబోమంటున్నా ఈ ప్రభత్వానికి కనపడడం లేదని విమర్శించారు. 23న చిత్తూరులో జరుగనున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సమావేశంలో జిల్లా అధికార యంత్రాంగాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలదీస్తామన్నారు. -
గన్ రైతుది....ట్రిగ్గర్ టీడీపీది!
► కర్షకుల ‘కన్నీటితడి’ ► టీడీపీ నాయకుల చేతుల్లో రెయిన్గన్లు ► వారు చెప్పిన వారికే రక్షక తడులు ► సీఎం పర్యటన తరువాత పెరిగిన ‘పచ్చ’పాతం రెయిన్ గన్..వర్షాభావ పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఉపయోగిస్తున్న పరికరం. ఎండుతున్న పైర్లకు ప్రాణం పోయాల్సింది పోయి.. అధికార పార్టీ నాయకుల చేతుల్లో చిక్కి విలవిల్లాడుతోంది. రాజకీయమే లక్ష్యంగా ఈ గన్ పేలుతోంది. పార్టీలకు అతీతంగా నిర్వహించాల్సిన రక్షకతడి కార్యక్రమం పక్కదోవ పట్టి కర్షకుల ‘కన్నీటితడి’గా మారింది. ఆదోని వ్యవసాయ డివిజన్ ఇందుకు కేంద్రమైంది. కర్నూలు : వర్షాభావం వల్ల ఎండుతున్న పంటలకు రక్షక నీటి తడులు ఇచ్చే కార్యక్రమం ఆదోని వ్యవసాయ డివిజన్లో అధికార తెలుగుదేశం నాయకుల చేతుల్లోకి వెళ్లింది. ఈ కార్యక్రమం కింద మంజూరు చేసిన రెయిన్గన్లు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సెక్రటరీలు, వీఆర్ఓల ఆధీనంలో ఉండాలి. అయితే టీడీపీ నాయకుల చేతుల్లో ఉండిపోయాయి. అధికార పార్టీ నాయకులు సూచిస్తున్న రైతుల పంటలకు అధికారులు నీటితడులు ఇస్తున్నారు. ‘‘మా నియోజకవర్గానికి 400 రెయిన్గన్లు, 400 స్ప్రింక్లర్లు, 100 ఆయిల్ ఇంజన్లు సిద్ధంగా ఉంచండి. ఇవన్నీ మా ఆధీనంలోనే ఉంచాలి’’అని టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల నుంచి జిల్లా అధికారులు ఫోన్లు వస్తున్నాయంటే వాస్తవం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హడావుడి సరే..అమలేది?.. జిల్లాలో కర్నూలు, ఆదోని రెవెన్యూ డివిజన్లలో ఆగస్టు నెలలో వర్షాలు లేవు. కర్నూలు డివిజన్లో కొంతవరకు కొన్ని మండలాల్లో వర్షాలు కురిసినా ఆదోని డివిజన్లో చినుకు జాడ లేదు. సెప్టెంబర్ నెలలో పది రోజులు గడచినా వాన ఆచూకీ లేకుండా పోయింది. ఇప్పటికే వేరుశనగ పూర్తి దెబ్బతినగా.. మిగిలిన పంటలను కాపాడుకోవడానికి రైతులు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 20 రోజులుగా రెయిన్‌గన్‌లంటూ జిల్లా యంత్రాంగం హడావుడి చేస్తున్నా.. నిజంగా వర్షాభావం వల్ల దెబ్బతిన్న పంటలను కాపాడటంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఏం జరిగిందంటే.. ఎండు పంటటన్నింటికీ నీటితడులు ఇచ్చే విధంగా ముందుగా ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు కార్యాచరణ రూపొందించారు. కొన్ని పంటలకు నీటి తడులు కూడా ఇచ్చారు. అయితే ఆలూరు మండలం అరికెర గ్రామానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చి వెళ్లిన తర్వాత నీటి తడులు ఇవ్వడంలో మార్పు వచ్చింది. రెయిన్గన్లు, స్ప్రింక్లర్లు, ఆయిల్ ఇంజన్లు టీడీపీ నాయకుల ఆధీనంలోకి వెళ్లాయి. గ్రామాలవారీగా ఏయే రైతుల పంటలకు నీటితడులు ఇవ్వాలో అధికార పార్టీ నాయకులు సూచిస్తున్నారు. ఆలూరు వ్యవసాయ సబ్ డివిజన్లో ఈ తంతు ఎక్కువగా సాగుతోంది. దేశం కార్యకర్తలకు చెందిన పంటలకు మాత్రమే నీటి తడులు ఇవ్వడంపై స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరి జయరాం అధికారులపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. కరువులో ‘పచ్చ’పాతం చూపవద్దని గట్టిగా హెచ్చరించారు. అనుకూరులకే.. ‘‘ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీకి చెందిన రైతుల భూములకే నీటితడులు ఇస్తున్నారు.. ఇది నిజమే కదా’’ అంటూ ఆదోని, పత్తికొండ, ఆదోని నియోజకవర్గాల్లో పంటలకు రక్షక తడులు ఇచ్చే విధులు నిర్వహిస్తున్న అధికారులు పేర్కొంటున్నారు. నెల రోజులుగా వర్షాలు లేక పంటలు ఎండుతున్నాయి... రెయిన్గన్ల ద్వారా నీటి తడులు ఇవ్వండని రైతులు కోరుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. టీడీపీ నాయకులు సూచిస్తున్న కార్యకర్తల పంటలను ఆగమేఘాల మీద తడిపేందుకు సిద్ధం అవుతున్నారు. తెలుగు దేశం కార్యకర్తల పంటలను కాపాడేందుకే రెయిన్గన్లు తీసుకొచ్చారా అని కొందరు రైతులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పంట ఎండుతున్నా పట్టించుకోవడం లేదు: నాది మూడెకరాల చేను. మెట్ట భూమి. ఈ ఏడు ఉల్లి నాటిన. చేను పక్కనే పెద్ద వంక ఉంది. పంట ఎండుతోంది.. రెయిన్గన్లను ఇవ్వాలని అధికారులను అడిగితే.. కొంతమంది టీడీపీ నాయకులు వాటిని తీసుకెళ్లినారని, వారిని అడిగి తీసుకోవాలని చెబుతున్నారు. వారి దగ్గరికి మేము వెళ్లి అడిగితే బాగుండదు సార్.. అని పదేపదే ప్రాధేయపడుతున్నా పట్టించుకోవడం లేదు. - సూరి, పెద్దహోతూరు రైతు మా దృష్టికి రాలేదు రెయిన్గన్లు గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో ఉన్నాయి. టీడీపీ నాయకులు చేతుల్లో ఉన్నట్లు మా దృష్టికి రాలేదు. ఎక్కడా ఇలా జరుగుతున్నట్లయితే ఫిర్యాదు చేయవచ్చు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. - జేడీఏ ఉమామహేశ్వరమ్మ -
పిట్టలదొర తుపాకీ పేలుతుందా?
-
పిట్టలదొర తుపాకీ పేలుతుందా?
బాబు కరువును జయించారా? - రెయిన్ గన్లతో 4.69 లక్షల ఎకరాల్లో పంటలను కాపాడామన్న సీఎం సాక్షి ప్రతినిధి, అనంతపురం/హైదరాబాద్: పిట్టల దొర చేతిలోని కట్టె తుపాకీ పేలుతుందా? అతడి నోటి నుంచి కోతలే తప్ప తుపాకీ నుంచి తూటాలు రావు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అలాంటి గొప్పలే చెప్పుకుంటున్నారు. ఆయన ప్రవేశపెట్టిన రెయిన్ గన్లు రాయలసీమలో 4 రోజుల్లో 4.69 లక్షల ఎకరాల్లోంచి కరువు రక్కసిని తరిమికొట్టాయట! నిజంగా ఈ గన్లకు భయపడి కరువు పారిపోయిందా? లేక సీఎం మాటలు కోటలు దాటాయా? ఇందులో నిజమెంతో ఒక్కసారి లెక్క చూద్దామా... రాయలసీమలో 4.69 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటను రెయిన్ గన్లతో రక్షించామని సీఎం చెప్పారు. నిజానికి ఈ 4.69 లక్షల ఎకరాల్లో పంటలకు ఒక తడి ఇవ్వాలంటే దాదాపు 10 టీఎంసీల నీరు అవసరం. కరువు సీమలో 4 రోజుల్లో ఇంత నీటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో సీఎంకే తెలియాలని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ లెక్కల ప్రకారం ఒక టీఎంసీ (2,831.68 కోట్ల లీటర్లు) నీటి సరఫరాకు 10 వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకర్లు 28.31 లక్షలు కావాలి. ఇక 10 టీఎంసీల నీటిని పంటలకు పారించాలంటే 2.83 కోట్ల ట్రిప్పుల ట్యాంకర్లు అవసరం. రెయిన్ గన్ల ద్వారా పంటలకు నీరు సరఫరా చేసేందుకు అనంతపురం జిల్లాకు ముఖ్యమంత్రి తీసుకొచ్చిన ట్యాంకర్లు అత్యధికంగా వెయ్యి. ఇవి కూడా ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 2 వరకు నాలుగు రోజులు మాత్రమే ఉన్నాయి. తర్వాత తగ్గించారు. సీమలో తక్కిన 3 జిల్లాల్లో కలిపి మరో వెయ్యి ట్యాంకర్లు కూడా లేవు. ఇవి కూడా 3 నుంచి 5 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ట్రాక్టర్ ట్యాంకర్లే. నాలుగు రోజుల్లో 10 టీఎంసీల నీళ్లు ఇచ్చే అవకాశం రాయలసీమలో ఉందా? నిజంగా అక్కడ అంత నీరుందా? ముఖ్యమంత్రి తప్పుడు లెక్కలతో తమ చెవుల్లో పువ్వులు పెడుతున్నారని రాయలసీమ రైతులు మండిపడుతున్నారు. ఫలితం లేని ప్రయోగం: రాయలసీమలో ప్రధాన పంట వేరుశనగ. సీమలో ఈ ఏడాది 21.55 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారు. 95 రోజుల్లో చేతికొచ్చే ఈ పంటకు నెలకోసారి మంచి వర్షం అవసరం. కానీ, జూలై 28 తర్వాత సీమలో వర్షమేలేదు. ఆగస్టు 18 నాటికి 12.42 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. ఆగస్టు 6న ధర్మవరం, 15న అనంతపురానికి సీఎం బాబు వచ్చారు. పంట ఎండకుండా రెయిన్ గన్లతో కాపాడతామన్నారు. అప్పటికీ ఎండిన పంట 17.52 లక్షల ఎకరాలకు చేరింది. కృష్ణా పుష్కరాలు ముగిసిన తర్వాత 28న తీరిగ్గా సీఎం అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పర్యటించారు. రెయిన్గన్లను ప్రారంభించారు. అప్పటికే ఆలస్యమై నీటి తడులిచ్చినా పంట చేతికి రాని పరిస్థితి. వాస్తవానికి రాయలసీమలో 17.52 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట ఎండిపోయింది. అయితే, 4.69 లక్షల ఎకరాల్లో పంటలను రెయిన్గన్ల ద్వారా కాపాడామని ముఖ్యమంత్రి చెప్పారు. సీఎంకు తెలియదనడం పచ్చి అబద్ధం రాష్ట్రంలో పంటల పరిస్థితి, వర్షాభావం వివరాలను అధికారులు తనకు సకాలంలో తెలియజేయలేదని సీఎం చంద్రబాబు చెప్పారు. వాస్తవానికి ప్రతి బుధవారం వ్యవసాయ శాఖ రాష్ట్రంలో పంటల పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇస్తుంది. ఎక్కడెక్కడ పంటలు ఎండుతున్నాయో దీన్ని బట్టి నిర్ధారించవచ్చు. ఇంత సమాచారం తన వద్ద పెట్టుకుని అధికారులు తనకు చెప్పలేదని సీఎం అనడం అన్యాయమని వ్యవసాయ రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. రూ.160 కోట్లతో రెయిన్ గన్లు వర్షాభావ పరిస్థితులను రెయిన్ గన్లతో ఎదుర్కొంటా మని ప్రభుత్వం విస్తృత ప్రచారం చేసింది. ఈ ఏడాది వీటి కొనుగోలుకు రూ.160.54 కోట్లు, వాటి నిర్వహణ కోసం రూ.103 కోట్లు ఖర్చు పెట్టింది. పంట లను కాపాడేందుకు 13,334 రెయిన్ గన్లను ప్రవేశపెట్టింది. వీటిని ప్రభుత్వమే కొనుగోలు చేసి, రైతులకు అద్దెకు ఇస్తుంది. రైతులే కొనుక్కుంటామంటే వారి కున్న పొలాన్ని బట్టి రాయితీ ఇస్తుంది. కొనుగోళ్లలో అవినీతి! రాష్ట్ర ప్రభుత్వం రెయిన్ గన్ల సరఫరా బాధ్యతను ఉద్యానవన శాఖ కమిషనర్‌కు అప్పగించింది. దీంతో ఆ అధికారి సూక్ష్మ నీటి పారుదల పథకం కింద తొలి విడతలో 1,500 రెయిన్ గన్ల కొనుగోలుకు టెండర్లు పిలిచారు. మొత్తం 9 సంస్థలు టెండర్లు దాఖలు చేయగా జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ (మహారాష్ట్ర), క్రిషీ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏపీ) అనే 2 సంస్థలతో తుది జాబితా తయారు చేశారు. నిబంధనల ప్రకారం ఈ టెండర్ ఏపీ సంస్థకు దక్కాల్సి ఉన్నా సూక్ష్మ నీటిపారుదల శాఖలో కీలక వ్యక్తి చక్రం తిప్పి మహారాష్ట్ర సంస్థకు దక్కేలా చేశారు. దీనివెనుక రూ.లక్షలు చేతులు మారాయని పలు సంస్థలు ఆరోపించాయి. ఇన్‌ఫుట్ సబ్సిడీకి మంగళం? సీమలో జూన్‌లో సాగైన వేరుశనగ పంట మొత్తం ఎండిపోయింది. జూలై ప్రథమాంకంలో సాగైన పంట దీ ఇదే పరిస్థితి. ఆగస్టు 20కే పంట పరిస్థితి చేజారిపోయింది. ఈ క్రమంలో ఆగస్టు 29 రాత్రి వర్షం కురిసింది. ఈ వర్షంతో జూన్‌లో సాగుచేసిన పంటకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు. జూలై మొదట్లో సాగుచేసిన పంటకూ ప్రయోజనం లేదు. ఆపై సాగుచేసిన పంట 50 శాతం దిగుబడి తగ్గుతుంది. ఆగస్టు 28న రెయిన్ గన్లను ప్రారంభిన తర్వాత 30న వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడుతూ రెయిన్గన్లతో రూ.199.34 కోట్ల విలువైన పంటను కాపాడామన్నారు. తద్వారా ప్రభుత్వానికి రూ.42.92 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఆదా చేశామన్నారు. ఈ నెల 1న అనంతపురం విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇచ్చేకంటే ముందుగానే పంటను కాపాడామన్నారు. దీన్నిబట్టి ఇన్పుట్ సబ్సిడీకి మంగళం పాడాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘సీమ’ పొలాలకు నిరుపయోగం రాయలసీమలోని వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో కొందరు రైతులు ఎనిమిదేళ్లుగా రెయిన్ గన్లను వినియోగిస్తున్నారు. వేరుశనగ పంటకు ఇవి ఏమాత్రం ఉపయోగకరం కాదని శాస్త్రవేత్తలు తేల్చారు. రెయిన్ గన్‌కు కనీసం 3 ఇంచుల నీరు అవసరం. అప్పుడే అది ఒత్తిడితో పనిచేస్తుంది. కానీ, రాయలసీమలోని 78 బోర్లలో 1.5 ఇంచుల నీరే అందుబాటులో ఉంది. ఈ నీటితో రెయిన్ గన్ పనిచేయదు. రెయిన్ గన్.. కొత్తదేమీ కాదు రెయిన్ గన్ల ప్రయోగం కొత్తదేమీ కాదు. మా పరిశోధనా క్షేత్రంలో రెయిన్ గన్లను పదేళ్ల నుంచి ఉపయోగిస్తున్నాం. దీన్ని చూసి చాలా మంది రైతులు పశు గ్రాసాన్ని రెయిన్ గన్లతో సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగిస్తున్న రెయిన్ గన్ నిమిషానికి 240 లీటర్ల చొప్పున 24 మీటర్ల చుట్టూ వృత్తాకారంలో నీటిని చిమ్ముతుంది. ఇది విడతకు 1,809 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గంటకు 14,400 లీటర్ల నీటిని వెదజల్లుతూ పంటకు తడిని అందిస్తుంది. ఇది కేవలం 8 మిల్లీమీటర్ల వర్షపాతానికి సమానం. అనంతపురం వంటి జిల్లాలోని తేలికపాటి ఎర్ర భూముల్లో ఈ నీటి పరిమాణం ఏమాత్రం సరిపోదు. మెట్ట ప్రాంతాల్లో బెట్టకు గురైన పంటలకు కనీసం 30 మిల్లీమీటర్ల వర్షపాతం అవసరం. ఇది కనీసం భూమిని 15 సెంటీమీటర్ల లోతు వరకు తడుపుతుంది. ట్యాంకర్లతో నీటి సరఫరా జరిగే పనికాదు ఎర్ర భూములకు నీటి తడిని పెట్టాలంటే రెయిన్ గన్లు కనీసం 3 గంటల 45 నిమిషాలపాటు పనిచేయాలి. కనీసం రెండు మూడు సార్లు షిఫ్ట్ పద్ధతిలో వీటిని పని చేయించాలి. ఎకరాకు 30 మిల్లీమీటర్ల వర్షపాతానికి సమానమైన నీటి తడిపెట్టాలంటే 1,21,500 లీటర్ల నీరు కావాలి. ఇది 20 ట్యాంకర్లకు(ట్యాంకర్ 6 వేల లీటర్లు) సమానం. అయితే, ట్యాంకర్ల ద్వారా నీటిని తోడి వ్యవసాయ భూములను తడపడం జరిగే పనికాదు. దాని ఫలితాలు రైతులందరికీ చేరవు కూడా. - డా.శ్రీనివాస్‌రెడ్డి, ‘క్రిడా’ ప్రధాన శాస్త్రవేత్త రెయిన్ గన్ అంటే? ఇది బిందు, తుంపర సేద్యానికి ఉపయోగించే పరికరం లాంటిదే. నిజానికి ఇదొక సూక్ష్మ నీటి పారుదల పరికరం. తక్కువ నీటిని ఎక్కువ విస్తీర్ణంలో విరజిమ్మడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఆరు అడుగుల ఎత్తున ఓ రెయిన్‌గన్‌ను అమర్చితే దాని చుట్టుపక్కల సుమారు 45 మీటర్ల వరకూ నీటిని విరజిమ్మవచ్చు. 45 సెంట్ల పొలాన్ని తడిపేందుకు గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది. అదే అర ఎకరాకు మామూలు పరిస్థితుల్లో నీరు పెట్టాలంటే సుమారు 4 గంటల సమయం పడుతుంది. రెయిన్ గన్‌కు 5 హెచ్‌పీ ఇంజన్ కావాలి. ఇందుకోసం ఆయిల్ ఇంజన్లను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసింది. నీళ్లున్న చోటు నుంచి రెయిన్ గన్ వరకు సరఫరా చేసేందుకు హెచ్‌డీపీఇ, క్యూపీసీ పైపులను ఉపయోగిస్తారు. పంటను బట్టి రెయిన్ గన్ స్టాండ్లను ఏర్పాటు చేస్తారు. పొలం సమీపంలో బోర్లు, బావులు, కాలువలు, చెరువుల్లో నీరున్నప్పుడే వీటిని వినియోగించడం సాధ్యమవుతుంది. లేకుంటే ఎక్కడి నుంచైనా ట్యాంకర్లతో తెచ్చుకోవాలి. రెయిన్ గన్లు మెట్ట పంటలకే ఉపయోగకరం. వరి వంటి వాటికి పనికిరావు. రెయిన్ గన్ ఉపయోగించాలంటే ఎకరాకు కనీసం 2.5 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న కుంట కావాలి. అలా నీళ్లున్నప్పుడే రెయిన్ గన్ను ఉపయోగించే వీలుంటుంది. ఎక్కడి నుంచో నీటిని తీసుకొచ్చి చేలను తడుపుతామనడం అశాస్త్రీయమని నిపుణులు చెబుతున్నారు. -
షోగన్
* రెయిన్ గన్లు.. ప్రచార ఆర్భాటమే * నీళ్లే లేవు.. కాపాడింది ఎక్కడ? * రైతులపైనే నీటి భారం * అన్నదాతకు ఖర్చు తడిసి మోపెడు సాక్షి, అమరావతి బ్యూరో : సాగునీరు లేక ఎండిపోతున్న పంటలను రెయిన్ గన్ల ద్వారా కాపాడేశామంటూ ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారం ఉత్త ఆర్భాటమేనని రైతులు మండిపడుతున్నారు. నీళ్లే లేకుండా రెయిన్ గన్లతో ఉపయోగం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నీటిని సమకూర్చుకోవాల్సిన బాధ్యత రైతులపైనే పెడితే ఖర్చు భరించటం కష్టసాధ్యమని చెబుతున్నారు. రైతులకు అదనపు భారమే.. ఈ ఏడాది ఖరీఫ్‌లో జూలై చివరి నాటికి 3,64,215 ఎకరాల్లో అపరాలు, ప్రత్తి, మిరప, వరి, చిరు ధాన్యాల పంటలను రైతులు సాగు చేశారు. జూలై చివరి నుంచి దాదాపు నెల రోజుల పాటు వర్షాలు కురవకపోవడంతో, పంటలు ఎండు దశకు చేరుకొన్నాయి. వినుకొండ, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో పూర్తిగా పంటలు వాడిపోయాయి. ఎండుతున్న పంటలను కాపాడేందుకు వీలుగా ప్రభుత్వం రెయిన్‌గన్స్‌ను సిద్ధం చేసింది. పంటలను కాపాడాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించింది. జిల్లాకు 754 రెయిన్ గన్స్, 754 స్ప్రింక్లర్లు, 565 ఆయిల్ ఇంజన్లలను అందుబాటులోకి తీసుకొచ్చింది. నీటిని మాత్రం రైతులే సమకూర్చుకోవాలని మెలిక పెట్టింది. దీంతో రైతులకు శిరోభారం మొదలైంది. నీటిని సమకూర్చుకోవడం అదనపు భారంగా మారింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నీరు దొరకటం కష్టమవటంతో పంటలను కాపాడుకోవడం కష్టసాధ్యమైంది. రెయిన్ గన్ల ద్వారా జిల్లాలో 16,642 ఎకరాల్లో పంటలు కాపాడినట్టు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. మరి మిగిలిన పంటల సంగతేమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. వినియోగం వెనుక కష్టాలెన్నో... ప్రభుత్వం రెయిన్ గన్స్ ఆయా మండల వ్యవసాయ శాఖ కేంద్రాల్లో ఉంచుతోంది. పంట ఎండిపోతున్న రైతులు వ్యవసాయ శాఖ అధికారుల వద్ద నమోదు చేయించుకొంటే అక్కడ అందుబాబులో ఉన్న రెయిన్‌గన్స్, పైపులు, ఇంజన్‌ను రైతు పొలాల వద్దకు పంపుతారు. నీటిని మాత్రమే రైతులే సమకూర్చుకోవాలి. నీటి వనరులు దూరంలో ఉన్నప్పుడు అందుకు అవసరమైన పైపులు, డీజిల్‌ను కూడా రైతులే సమకూర్చుకోవాలి. పంటలకు నీటిని ఇచ్చిన తరువాత రెయిన్‌గన్స్, పైపులు తిరిగి స్వంత ఖర్చులతో వ్వవసాయ శాఖ కార్యాలయాలకు చేర్చాలి. నీరు దొరక్కపోతే ట్యాంకర్ల ద్వారా నీటిని అన్నదాతలు తెచ్చుకోవాల్సి వస్తోంది. ఓ ఎకరా పంటను ఓ మోస్తరుగా తడిపేందుకు 20 వేల లీటర్లు, పూర్తిగా తడిపేందుకు 40 వేల లీటర్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన కనీసం దాదాపు నాలుగు ట్యాంకర్ల నీరు అవసరమవుతోంది. ఇందుకోసం దాదాపు రూ.4 వేలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది రైతుకు తలకు మించిన భారంగా మారనుంది. రెయిన్ గన్ ద్వారా రెండు గంటల్లోనే ఎకరా పంటకు నీరు ఇవ్వవచ్చునని చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో వాటిని సిద్ధం చేసుకోవడం, మార్చుకోవడం వంటి కారణాలతో నాలుగైదు ఎకరాలకు మాత్రమే నీటిని ఇవ్వగలుగుతున్నారు. కొరవడిన సమన్వయం... రెయిన్స్ గన్స్ వినియోగంలో వ్యవసాయ శాఖ, ఏపీఎంఐపీ, ఆగ్రోస్ సమన్వయంతో పనిచేయాల్సి ఉంది. రెయిన్గన్ల నిర్వహణ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సాగుతుండగా, పైపులను ఏపీఎంఐపీ వారు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ శాఖ సిబ్బంది తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల వారి పనులు కుంటుపడుతున్నాయి. మొత్తం మీద ఈ మూడు శాఖల మధ్య సమన్వయం కొరవడటం అన్నదాతలకు ఇబ్బందిగా మారింది. -
పచ్చి మోసం
రైతులను దగా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతు సంఘం చర్చా వేదికలో వక్తలు అనంతపురం సప్తగిరి సర్కిల్ : రైతులను పచ్చిగా మోసం చేస్తున్నారని రైతు సంఘం ఏర్పాటు చేసిన చర్చావేదికలో వక్తలు రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ‘ఎండిన వేరుశనగ పంట–రెయిన్గన్లు’ అనే అంశంపై స్థానిక ప్రెస్‌క్లబ్‌లో రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం చర్చా వేదిక నిర్వహించారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.పెద్దిరెడ్డి అధ్యక్షత వహిం చారు. ఆయన మాట్లాడుతూ రక్షక తడుల పేరుతో ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేస్తోందన్నారు. రక్షకతడితో పంటను మాత్రం రక్షించలేక పో యారన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ రెయిన్గన్ల సృష్టికర్తే తానేనన్నుట్టు చం ద్రబాబు రైతులను నమ్మిస్తున్నారని ఆరోపించారు. వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ కరువును ఎలా ఎదుర్కోవాలి, శాశ్వత నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న ఆలోచనను పూర్తిగా విస్మరిం చారన్నారు. చంద్రబాబు రైతులను ద గా చేస్తున్నారన్నారు. కూలీలకు పను లు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాయలసీమలో 22 లక్షల ఎకరాల్లో వేరశనగను సాగుచేశారన్నారు. ఇందులో ఆగస్టులోనే 12 లక్షల ఎకరాల్లోని పంట సరైన సమయంలో నీరు అందక చేజారిందన్నారు. మొత్తం పంటను రక్షించడానికి 8 టీఎంసీల నీరు అవసరమవుతాయన్నారు. అంతనీటిని ఎక్కడి నుంచి తెచ్చారని, ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. రక్షకతడుల ద్వారా రైతులకు చెందిన రూ.199 కోట్ల పంటను రక్షించగలిగామని, రూ. 59 కోట్ల 62 లక్షల విలువ చేసే ఇన్పుట్ సబ్సిడీని ప్రభుత్వానికి మిగులుబాటు చేశామని చెప్పడం విడ్డురంగా ఉందన్నారు. ఇలాంటి ప్రకటనల ద్వారా ఇన్పుట్ సబ్సిడీ ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి ఫసల్‌బీమా లో వేరుశనగ ను చేర్చేవిధంగా చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. వాతావరణాన్ని గ ణించడానికి ఉన్న వెదర్స్టేçÙన్లు ఎక్కడా పనిచేయడం లేదన్నారు. ప్రతి ఏడాది జూన్æ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం నమోదు కాకపోతే పంటకు జరిగిన నష్టాన్ని వెల కట్టి రైతుల ఖాతాలకు ఇన్సూరెన్స్ కంపెనీలు పరిహారం జమ చేయాలని డి మాండ్ చేశారు. విజయవాడ నుంచి బులెటిన్ విడుదల చేసి రక్షించామని తప్పుడు మాటలు చెప్తే నమ్మే పరిస్థితి లేదన్నారు. వైఎస్సార్ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వెంకట చౌదరి, కదలిక ఎడిటర్ ఇమాం, సీపీఐ ఎమ్ ఎల్ న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రమణ, సీపీఐ కార్యవర్గ సభ్యులు కా టమయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి, రైతు సంఘాల సమాఖ్య నాయకులు రామక్రిష్ణ, రైతు సంఘం నాయకులు రామాంజినేయులు, చంద్రశేఖర్‌రెడ్డి, సుబ్బిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఎర్రిపల్లిలో వేరుశెనగ పంట పరిశీలించిన వైఎస్ జగన్
పులివెందుల : జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఆయన శుక్రవారం పులివెందుల మండలం ఎర్రిపల్లిలో పర్యటించారు. వర్షాలు లేక దెబ్బతిన్న వేరుశెనగ పంటలను వైఎస్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత ముందు రైతులు తమ కష్టాలను ఏకరువు పెట్టుకున్నారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నా...ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన వైఎస్ జగన్.... బాధిత రైతులకు అండగా ఉంటానంటూ భరోసా కల్పించారు. పంటలు ఎండిపోతున్నా...ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ‘జిల్లాలో 71వేల హెక్టార్లలో వేరుశెనగ పంట వేశారు. దాదాపు అన్నిచోట్లా పంట చేతికొచ్చే పరిస్థితి లేదు. 70 రోజుల తర్వాత కూడా కాయలు రాలేదు. జూన్ లో కాస్తో కూస్తో వర్షాలు పడ్డాయి. జూలైలో చాలీచాలని వర్షాలు, ఆగస్టులో అసలు వర్షాలే పడలేదు. వర్షాలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. జూన్ 7న ఎస్ఎల్బీసీ సమావేశం పెట్టారు. ఆగస్టు 12న జరగాల్సిన మీటింగ్‌ను ఇప్పటివరకూ జరపలేదు. సీజన్ అయిపోయాక ఈ నెల 15న జరుపుతారట. రుణాలు మాఫీ అవ్వక, ఇన్సూరెన్స్ అందక రైతులు అల్లాడిపోతున్నారు. 2015-16 క్రాఫ్ ఇన్సురెన్స్ ఇప్పటివరకూ ఇవ్వలేదు. శ్రీశైలంలో 845 అడుగుల నీరుంటేనే పోతిరెడ్డిపాడుకు నీళ్లొస్తాయి. కానీ కరెంట్ కోసమని శ్రీశైలం నుంచి ఎడాపెడా నీళ్లువాడి 780 అడుగులకు తీసుకెళ్లారు. 854 అడుగులు లేకపోతే రాయలసీమకు నీళ్లు ఎలా ఇస్తారు. గండికోటకు 10 టీఎంసీల నీరు ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఇప్పటివరకూ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీనే ఇవ్వలేదు. మరి నీరు ఏకరంగా ఇస్తారో చెప్పాలి. బ్రహ్మంసాగర్ కు 12 టీఎంసీల నీళ్లిస్తామని ఇప్పటివరకూ ఇవ్వలేదు. 2008లో వైఎస్ఆర్ మాత్రం ఇచ్చారు. చంద్రబాబు రెండేళ్లలో ఒక్క టీఎంసీ నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. హంద్రీనీవా, గాలేరి-నగరి అన్ని ప్రాజెక్టులు నత్తనడకనే నడుస్తున్నాయి. వైఎస్ఆర్ హయాంలో ఈ ప్రాజెక్టులన్నీ 80 శాతం పూర్తయ్యాయి. మిగతా 20 శాతాన్ని కూడా చంద్రబాబు పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు రెయిన్ గన్లను తానే కనిపెట్టినట్లు చెబుతున్నారు. పులివెందులలో 4వేల ఎకరాలకు నాలుగు రెయిన్ గన్లు ఇచ్చారు. వాటితో 4వేల ఎకరాలను ఎలా కాపాడతారు. వరదలొచ్చినప్పుడు ఎవరైనా ఏరియల్ సర్వే నిర్వహిస్తారా? కానీ చంద్రబాబు మాత్రం కరువును తెలుసుకునేందుకు ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏరియల్ సర్వే చేస్తే కరువు తీవ్రత తెలుస్తుందా?. రాయలసీమలో 8లక్షల హెక్టార్లలో వేరుశెనగ పంట వేస్తే 7 లక్షల హెక్టార్లలో పంట ఎండిపోయింది. కానీ చంద్రబాబు మాత్రం 61వేల హెక్టార్లలోనే పంట దెబ్బతిందని 42వేల హెక్టార్లలో రెయిన్ గన్స్ తో కాపాడామని అబద్ధం చెబుతున్నారు. కేవలం 18 వేల హెక్టార్లలో మాత్రమే పంటనష్టం జరిగిందంటున్నారు. ఇన్సూరెన్స్ కూడా రాకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారు. పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి. 2015-16 ఇన్పుట్ సబ్సిడీని వెంటనే చెల్లించాలి. ఈ ఏడాది ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారం ఇవ్వాలి’ అన్నారు. -
రెయిన్ గన్లతో రైతుల్ని ఆదుకుంటాం
వర్షాలు లేని ప్రాంతాల్లో రెయిన్ గన్లను ఉపయోగించి రైతులను ఆదుకుంటామని రాష్ట్ర హోం శాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. గురువారం నైవేద్య విరామ సమయంలో ఆయన డీజీపీ సాంబశివరావుతో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల చినరాజప్ప మీడియాతో మాట్లాడారు. రాయలసీమలో కరువు ప్రాంతాలను గుర్తించి సీఎం చంద్రబాబు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు చెప్పారు. ఇందులో భాగంగా జిల్లాకి నలుగురు మంత్రులను కేటాయించి రైతులకు సహకారం అందించేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఈ మేరకు పీలేరు నుండి రెయిన్ గన్ల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తె లిపారు. శాంతి భద్రతల విషయంలో తమ ప్రభుత్వం రాజీ పడదని స్పష్టం చేశారు. టీటీడీ సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. మంచి వసతులు ఉన్నాయని, కృష్ణ పుష్కరాల్లో టీటీడీ మెరుగైన ఏర్పాట్లు చేసిందని కితాబిచ్చారు. -
రెయిన్‌గన్స్ కోసం చిత్తూరుకు లారీలు
రెయిన్‌గన్స్ కోసం చిత్తూరుకు లారీలు నష్టపోతున్నామంటున్న డ్రైవర్లు మనుబోలు: చిత్తూరు జిల్లాలో ఎండిపోతున్న పంటలకు కాపాడేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు మంగళవారం మండల పరిధిలోని జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్యాంకర్ లారీలను ఆపి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి గాను ఒక్కో లారీకి రూ.3 వేల రూపాయల ఆయిల్ నింపుతున్నారని డ్రైవర్‌కు బత్తా కింద రూ.500 వరకూ చెల్లిస్తున్నట్లు డ్రైవర్లు తెలిపారు. ఇలా సోమవారం రాత్రి 50 లారీల వరకూ పంపించినట్లు తెలిసింది. సుమారు మరో 100 లారీలను పంపేందుకు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే చిత్తూరు పంపేందుకు సిద్ధం చేసిన ట్యాంకర్లు పెద్ద ఎత్తున పోర్టు క్రాస్ రోడ్డు వద్ద బారులు తీరాయి. అయితే తమకు ప్రైవేటు సరుకులు సరఫరా చేసుకుంటే రోజుకు రూ.1000 పైగా గిట్టుబాటు అవుతుందని, ప్రభుత్వం మాత్రం కేవలం రూ.550 ఇస్తామని చెబుతోందని డ్రైవర్లు వాపోతున్నారు. అదీ కాకుండా చిత్తూరులో నాలుగు రోజుల పాటు ఉండాలని చెపుతున్నారని ఈ లోపు వర్షం కురిస్తే పంపుతామంటున్నారని డ్రైవర్లు వాపోతున్నారు. -
అనంతపురానికి రెయిన్ గన్స్
గుంటూరు వెస్ట్ : అనంతపురం జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా నుంచి 754 రెయిన్‌గన్స్‌ను తరలిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. నగరంలోని ఆర్ అండ్ బీ ఇన్స్పెక్షన్ బంగ్లాలో స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుతో సోమవారం సమావేశమైన కలెక్టర్ అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈనెల 24, 25, 26 తేదీల్లో కురిసిన వర్షాల వల్ల జిల్లాలోని 51 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కావడంతో పంటలకు ఉపయోగకరంగా మారాయని చెప్పారు. మాచర్ల, వెల్దుర్తి, పెదకూరపాడు తదితర పల్నాడు ప్రాంత మండలాల్లో అక్కడక్కడా తక్కువ వర్షపాతం నమోదు కావడం వల్ల రెయిన్‌గన్స్‌తో పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. స్పెషలాఫీసర్‌గా నాగలక్ష్మి... అనంతపురం జిల్లాలో వర్షాభావ ప్రాంతాలలో అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్.నాగలక్ష్మిని స్పెషలాఫీసర్‌గా నియమించినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా నుంచి రెయిన్‌గన్స్, స్ప్రింక్లర్లు, ఆయిల్ ఇంజన్లను అనంతపురం జిల్లాకు తరలించి అక్కడి పంటలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సుమారు 150 నీటి ట్యాంకర్లను కూడా ఇక్కడినుంచి పంపిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. అధికారులతో కోడెల సమావేశం.. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు జిల్లా కలెక్టర్ కాంతిలాల్, ఆర్‌డబ్లు్యఎస్ ఎస్ఈ పి.భానువీరప్రసాద్, సత్తెనపల్లి, నరసరా>వుపేట నియోజకవర్గాలకు చెందిన డీఈలు, ఈఈలతో సమావేశం నిర్వహించి మంచినీటి సరఫరా స్కీమ్‌ల నిర్వహణపై చర్చించారు. వనం– మనం మొక్కల పెంపకాన్ని వేగవంతం చేయాలని జిల్లా అటవీ శాఖాధికారులు కె.మోహనరావు, పి.రామమోహనరావు, డ్వామా పీడీ పులి శ్రీనివాసులును కోరారు. 754 రెయిన్‌గన్స్ తరలింపు : జేడీఏ కృపాదాసు కొరిటె పాడు (గుంటూరు): జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాకు కేటాయించిన 754 రెయిన్‌గన్స్, 754 స్ప్రింక్లర్లను అనంతపురం జిల్లాకు తరలిస్తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుడు వి.డి.వి.కృపాదాసు చెప్పారు. స్థానిక కలెక్టరేట్ ఆవరణలోని జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతపురం జిల్లాలో కరువు తాండవిస్తుండడంతో ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వాటిని అక్కడకు పంపుతున్నామన్నారు. జిల్లాలో గత ఐదు రోజులుగా 157.7 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైందని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 47 శాతం మాత్రమే పంటలు సాగు చేశారని, ఈ వర్షాలకు మిగిలిన రైతులు కూడా సాగు చేసుకునే అవకాశం వుందని తెలిపారు. ప్రతి రైతు తన పొలంలో నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. -
వేరుశనగ రక్షణకు రెయిన్ గన్స్
–అవసరమైతే విద్యుత్ వేళల్లో మార్పు –రాష్ట్ర వ్యవసాయసంచాలకులు: ధనంజయరెడ్డి భాకరాపేట : రాష్ట్ర వ్యాఫ్తంగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు నుండి వేరుశనగ పంటను కాపాడటానికి రాష్ట్రవ్యాప్తంగా 13వేల 300 రెయిన్‌గన్స్‌ను వినియోగిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు ధనంజయరెడ్డి తెలిపారు. బుధవారం చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లులో వేరుశనగ పంటకు అందిస్తున్న తడిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు కారణంగా ఎండి పోతున్న పంటకు తడిని అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రూ. 160 కోట్లతో రెయిన్ గన్లను అందిస్తున్నామన్నారు. ఎక్కడా తడి లేక పంట రాలేదన్నది వినపడకూడదని సీఎం చెప్పినట్లు తెలిపారు. జూన్ మొదటి వారంలో వేసిన వేరువనగ 50 శాతం పంట మాత్రం చేతికి వస్తుందన్నారు. ఎకరాకు 20 వేల లీటర్లు నీటితో వేరుశనగ చేనును తడపవచ్చునన్నారు. ఇందుకు అయ్యే ఖర్చులో 50 శాతం ప్రభుత్వం భరిస్తుందన్నారు. ముందుగా రైతు పెట్టుకుంటే వారి ఖాతాలకు వారంలో వేస్తామన్నారు. చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లా ప్యాఫిలి మండలంలో అత్యధికంగా పంట ఎండిపోయిందన్నారు. కరెంటు వేళల్లో కూడా మార్పులు చేయడానికి ప్రభుత్వం చోరవ తీసుకుందన్నారు. మధ్యాహ్నం సమయంలో కరెంటు ఇస్తే రెయిన్‌గన్స్‌తో నీటీని వదలితే ఎక్కువ శాతం గాలిలో కలిసి పోతుందని, ఉదయం వేళల్లోనే కరెంటు సరఫరా చేసి వేరుశనగ రైతులును ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెగుళ్ళు, సస్యరక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక టీమ్‌లు సందర్శించి చర్యలు తీసుకుంటున్నాయన్నారు. రైతులుకు వ్యవసాయబావులు దగ్గర నీటీ వసతి లేకుండా అయిల్ఇంజిన్లు సైతం సరఫరా చేసి, పైపులు, రెయిన్‌గన్స్, స్పింక్లర్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. నీటీ వసతి లేక, వర్షాభావం వల్ల వేరుశనగ పంట ఎండిపోతే ఇన్సూరెన్సు చేయించుకున్నవారికి వారంలో బీమా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇన్సూరెన్సు లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామన్నారు. సమావేశంలో వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ విజయ్‌కుమార్, ఆత్మ పీడీ శివనారాయణ పాల్గొన్నారు. -
వేరుశనగ రక్షణకు రెయిన్‌గన్స్
-అవసరమైతే విద్యుత్ వేళల్లో మార్పు -రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు: ధనంజయరెడ్డి భాకరాపేట రాష్ట్ర వ్యాఫ్తంగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు నుండి వేరుశనగ పంటను కాపాడటానికి రాష్ట్రవ్యాప్తంగా 13వేల 300 రెయిన్‌గన్స్‌ను వినియోగిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయు సంచాలకులు ధనంజయరెడ్డి తెలిపారు. బుధవారం చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లులో వేరుశనగ పంటకు అందిస్తున్న తడిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు కారణంగా ఎండి పోతున్న పంటకు తడిని అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రూ. 160 కోట్లతో రెయిన్ గన్లను అందిస్తున్నామన్నారు. ఎక్కడా తడి లేక పంట రాలేదన్నది వినపడకూడదని సీఎం చెప్పినట్లు తెలిపారు. జూన్ మొదటి వారంలో వేసిన వేరుశనగ 50 శాతం పంట మాత్రం చేతికి వస్తుందన్నారు. ఎకరాకు 20 వేల లీటర్లు నీటితో వేరుశనగ చేనును తడపవచ్చునన్నారు. ఇందుకు అయ్యే ఖర్చులో 50 శాతం ప్రభుత్వం భరిస్తుందన్నారు. ముందుగా రైతు పెట్టుకుంటే వారి ఖాతాలకు వారంలో నగదు వేస్తామన్నారు. చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లా ప్యాఫిలి మండలంలో అత్యధికంగా పంట ఎండిపోయిందన్నారు. కరెంటు వేళల్లో కూడా మార్పులు చేయడానికి ప్రభుత్వం చోరవ తీసుకుందన్నారు. మధ్యాహ్నం సమయంలో కరెంటు ఇస్తే రెయిన్ తో నీటీని వదలితే ఎక్కువ శాతం గాలిలో కలిసి పోతుందని, ఉదయం వేళల్లోనే కరెంటు సరఫరా చేసి వేరుశనగ రైతులును ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. రాష్ర్ట వ్యాప్తంగా తెగుళ్ళు, సస్యరక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక టీమ్‌లు సందర్శించి చర్యలు తీసుకుంటున్నాయన్నారు. రైతులుకు వ్యవసాయబావులు దగ్గర నీటీ వసతి లేకుండా అయిల్ఇంజిన్లు సైతం సరఫరా చేసి, పైపులు, రెయిన్ గన్స్, స్పింక్లర్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. నీటీ వసతి లేక, వర్షాభావం వల్ల వేరుశనగ పంట ఎండిపోతే ఇన్సూరెన్సు చేయించుకున్నవారికి వారంలో బీమా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇన్సూరెన్సు లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామన్నారు. సమావేశంలో వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ విజయ్‌కుమార్, పీడీ శివనారాయణ పాల్గొన్నారు. -
నేడు జిల్లాకు రెయిన్గన్లు
అనంతపురం అగ్రికల్చర్ : రక్షకతడికి అవసరమైన రెయిన్గన్లు, స్ప్రింక్లర్లు, డీజిల్ ఇంజిన్లు, హెచ్డీ పైపులు సోమవారం జిల్లాకు రానున్నాయి. ఖరీఫ్‌లో సాగు చేసిన వేరుశనగ పంట ఎండిపోతున్నా ‘రక్షకతడి’ ప్రణాళిక అడుగు ముందుకు పడటం లేదని ఈనెల 16న సాక్షిలో ‘నైరుతి’ పేరుతోనూ, అంతకు మునుపు ‘జీవోకే పరిమితమైన రక్షకతడి ప్రణాళిక’ శీర్షికతో కథనాలు ప్రచురితమయ్యాయి. స్పందించిన ఏపీఎంఐపీ, వ్యవసాయశాఖ అధికారులు ఆదిశగా దృష్టి సారించారు. ఈ క్రమంలో రక్షకతడికి అవసరమైన రెయిన్గన్లు, స్ప్రింక్లర్లు సెట్లు, ఇంజిన్లు, పైపులు సోమవారం జిల్లాకు వచ్చే అవకాశం ఉందని ఏపీఎంఐపీ పీడీ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. 63 మండలాల్లోనూ వ్యవసాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో స్టాకు పాయింట్లు గుర్తించారన్నారు. -
‘రబీలో రైతులకు రెయిన్ గన్స్ ఇస్తాం’
విజయవాడ: రబీ పంట వేసిన రైతులకు రెయిన్ గన్స్ అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. నీటి వసతి ఉన్న రైతులకు మాత్రమే రెయిన్ గన్స్ అందిస్తామని స్పష్టం చేశారు. తమ శాఖలో ఇప్పటికే 1500 గన్స్ సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అవసరమున్న రైతులు ఏఓ, ఎంపీఈఓల దగ్గర దరఖాస్తులు చేసుకోవాలని రైతులకు సూచించారు. 250 గన్స్‌లను ఇప్పటికే జిల్లాలోకి పంపించామని మంత్రి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీతో రెయిన్ గన్స్ అందిస్తామని ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు.