నాలుగు రోజుల్లోనే అనంతపురం జిల్లాలో కరువును జయించేసినట్లు చంద్రబాబు ప్రకటించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కరవును కూడా హెలికాప్టర్ల లోంచి చూసిన ముఖ్యమంత్రి మన ఖర్మ కొద్దీ ఈయనొక్కరేనని విమర్శించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం అనంతపురం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన మహా రైతు ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు.