ఈ నెల 4న అనంతపురంలో వైఎస్ జగన్ ధర్నా | YS Jagan mohan reddy dharna in ananthapur on 4th October | Sakshi
Sakshi News home page

4న అనంతపురంలో వైఎస్ జగన్ ధర్నా

Published Sat, Oct 1 2016 8:13 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

ఈ నెల 4న అనంతపురంలో వైఎస్ జగన్ ధర్నా - Sakshi

ఈ నెల 4న అనంతపురంలో వైఎస్ జగన్ ధర్నా

అనంతపురం : ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 4న అనంతపురం కలెక్టరేట్ వద్ద రైతులతో కలిసి ధర్నా చేయనున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ధర్నా ఏర్పాట్లను పార్టీ నేతలు తలశిల రఘురాం, అనంత వెంకట్రామిరెడ్డి, శంకర్ నారాయణ, గుర్నాథ్ రెడ్డి శనివారం పరిశీలించారు.

ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కరువు తాండవిస్తున్నా చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వ్యవసాయం దండగ అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. రెయిన్ గన్స్ పేరుతో కరువు రైతులను చంద్రబాబు దగా చేశారని విమర్శించారు. కరువు రైతులను ఆదుకోవాలంటూ వైఎస్ జగన్ చేపడుతున్న ధర్నాను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement