అనంతపురం అర్బన్: జిల్లాలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకునే విషయంలో ప్రభుత్వం కనీస మానవత్వం కూడా చూపడం లేదని ధ్వజమెత్తారు. స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రతి రైతు కుటుంబానికి రూ.25 వేలు తక్షణ సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం అనంతపురం విచ్చేసిన ఆయన స్థానికంగా ఉన్న ఒక హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వానికి అనంత రైతును ఆదుకోవడం చేతకాకపోతే అధికారం నుంచి తప్పుకోవాలన్నారు. తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య వారు ఇప్పుడు ఉండి ఉంటే ఈ ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను తరిమి కొట్టేవారన్నారు.