‘రబీలో రైతులకు రెయిన్‌ గన్స్ ఇస్తాం’ | rain guns will give in rabi season, says prathipati pullarao | Sakshi
Sakshi News home page

‘రబీలో రైతులకు రెయిన్‌ గన్స్ ఇస్తాం’

Published Sat, Feb 20 2016 7:26 PM | Last Updated on Sun, Sep 3 2017 6:03 PM

rain guns will give in rabi season, says prathipati pullarao

విజయవాడ: రబీ పంట వేసిన రైతులకు రెయిన్ గన్స్ అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. నీటి వసతి ఉన్న రైతులకు మాత్రమే రెయిన్ గన్స్ అందిస్తామని స్పష్టం చేశారు. తమ శాఖలో ఇప్పటికే 1500 గన్స్ సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అవసరమున్న రైతులు ఏఓ, ఎంపీఈఓల దగ్గర దరఖాస్తులు చేసుకోవాలని రైతులకు సూచించారు. 250 గన్స్‌లను ఇప్పటికే జిల్లాలోకి పంపించామని మంత్రి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీతో రెయిన్ గన్స్ అందిస్తామని ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement