Prathipati Pullarao
-
అవినీతిలో మేటి ప్రత్తిపాటి
ఆయన అవినీతిలో ఘనాపాఠి. పదవిని అడ్డం పెట్టుకుని అక్రమాలకు తెరలేపారు.కుంభకోణాలకు కేంద్రబిందువుగా నిలిచారు. భూ ఆక్రమణల నుంచి గ్రావెల్ తవ్వకాల వరకు అంతా దోపిడీ పర్వమే. రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించిన సీసీఐ స్కామ్‌కు సూత్రధారుడు. అగ్రిగోల్డ్ భూముల అక్రమ కొనుగోళ్ల వ్యవహారాల్లో అడ్డంగా దోచేశాడు. బడుగుల భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు చేసిన ఘనుడు. ఇదీ టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన ప్రత్తిపాటి పుల్లారావు అవినీతి బాగోతం. చిలకలూరిపేట: గత టీడీపీ ప్రభుత్వం హయాంలో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రత్తిపాటి పుల్లారావు 2014–15 కాలంలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఈ సమయంలో సీసీఐ కుంభకోణం జరిగింది. దాదాపు రూ.650 కోట్లు అక్రమాలు జరిగినట్లు సీబీఐ విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంలో మంత్రి పాత్ర ఉన్నట్టు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కుంభకోణం అప్పటి ప్రభుత్వాన్ని కుదిపేసింది. దీంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించిన అప్పటి ప్రభుత్వం అనంతరం 2016 నవంబర్‌లో చిలకలూరిపేట మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి కె.నాగవేణి సహా మొత్తం 26 మంది మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేసి చేతులు దులుపేసుకుంది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లిలో అగ్రిగోల్డ్ వెంచర్లలో 14.81 ఎకరాల భూమిని విడతలవారీగా ప్రత్తిపాటి పుల్లారావు తన సతీమణి ప్రత్తిపాటి తేనె వెంకాయమ్మ(ప్రత్తిపాటి వెంకట కుమారి) పేరుతో కారుచౌకగా కొన్నారు. అప్పటికే అగ్రిగోల్డ్ సంస్థ వివాదాల్లో ఇరుక్కోవడంతో ఆ సంస్థ భాగస్వాములను అధికారం అడ్డంపెట్టుకుని బెదిరించి ఈ భూములను చౌకగా కొట్టేశారనే ఆరోపణలు పుల్లారావుపై వెల్లువెత్తాయి. ఈ మొత్తం భూమిని ఆ తర్వాత గుంటూరుకు చెందిన కామేపల్లి వెంకటేశ్వరరావుకు, పెదకాకాని మండలం, ఉప్పలపాడుకు చెందిన చెరుకూరి నరసింహారావులకు దాదా పు 30 లక్షలు ఎక్కువకు విక్ర యించారు. ఈ భూమిని ఎకరా రూ. 20 లక్షలలోపు ధరకు కొన్న ప్రత్తిపాటి ఆ తర్వాత ఎకరా రూ.52 లక్షలకు విక్రయించినట్లు సమాచారం. గ్రావెల్, రేషన్ మాఫియా యడ్లపాడు మండలంలోని అసైన్డ్ భూముల్లో యథేచ్ఛగా గ్రావెల్ తవ్వి ప్రత్తిపాటి, ఆయన అనుచరులు రూ.కోట్లాది రూపాయలు గడించారు. చారిత్రాత్మక కొండవీడు కొండలనూ పిండి చేశారు. ప్రత్తిపాటిపై అప్పట్లో అదే పార్టీకి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు బహిరంగ విమర్శలు చేశారు. పౌరసరఫరాల శాఖ మంత్రిగా వ్యవహరించిన ప్రత్తిపాటి పుల్లారావు రేషన్ మాఫియాను ప్రోత్సహించి రూ.కోట్లు వెనుకేశారు. అప్పట్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడుల్లో ఈయన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. నీరు–చెట్టు పథకంలోనూ ప్రత్తిపాటి అనుచరులు రూ.కోట్లు కొల్లగొట్టారు. యడవల్లి దళిత భూములు కాజేసే కుట్ర చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలో 1975లో సర్వే నెంబర్ 381లో ఉన్న 416.5 ఎకరాల భూమిని 250 మంది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఏకపట్టాగా అందజేశారు. 1976లో యడవల్లి వీకర్స్ సెక్షన్ ల్యాండ్ కమిటీ పేరుతో లబ్దిదారులైన ఎస్సీ, ఎస్టీలు ఓ సొసైటీగా ఏర్పడి సాగు చేసుకుంటూ వస్తున్నారు. ఈ భూముల్లో విలువైన బ్లాక్ పెరల్ గ్రానైట్ ఉన్నట్టు తెలుసుకున్న ప్రత్తిపాటి సొసైటీనే రద్దు చేయించారు. ప్రభుత్వ భూములుగా ప్రకటింపజేశారు. బినామీలతో అక్రమ మైనింగ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో వైఎస్సార్ సీపీ, దళిత సంఘాల పోరాటానికి దిగాయి. దళితులు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు వెళ్లారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక యడవల్లి దళితులకు న్యాయం జరిగింది. జర్నలిస్టులపై కక్ష చిలకలూరిపేట పట్టణానికి చెందిన విలేకరి ఎంవీఎన్ శంకర్ 2014 నవంబర్ 25వ తేదీ విధులు ముగించుకుని రాత్రి వేళ ఇంటి బయట బైక్ పార్క్ చేస్తుండగా ఇద్దరు దాడి చేశారు. అతను గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి మృతి చెందాడు. ఈ కేసులో ప్రత్తిపాటి పాత్రపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. తనకు వ్యతిరేకంగా వార్తలు రాశారన్న అక్కసుతో యడ్లపాడుకు చెందిన మాజీ విలేకరి మానుకొండ సురేంద్రనాథ్‌కు సంబంధించిన భూమిలో మంత్రి అనుచరులు భారీగా గ్రావెల్ తవ్వకాలు జరిపి విక్రయించారు. అదే భూమిని గతంలో ఇతరులకు అమ్మేందుకు సురేంద్ర అడ్వాన్సులు తీసుకున్నాడు. ఆ భూమి వివాదంలోకి వెళ్లడంతో తీసుకున్న అడ్వాన్సులు ఇవ్వలేక సురేంద్ర 2017 డిసెంబర్ 18న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పుల్లా రావు సతీమణి పెత్తనం పుల్లారావు తన అధికారాన్ని రాష్ట్ర స్థాయిలో విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తే ఆయన సతీమణి వెంకాయమ్మ నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇంటికి వచ్చి తనకు సలాం కొట్టలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.జ్యోతిర్మయితోపాటు ముగ్గురు వైద్యులు, ఓ హెడ్‌నర్సు, నలుగురు స్టాఫ్ నర్సులు, ఒక సీనియర్ అసిస్టెంట్‌ను బదిలీ చేయించారు. ఏ కార్యాలయంలోనైనా ఫైల్ కదలాలంటే ముందు మేడమ్‌కు కప్పం కట్టాల్సిందే అన్నంతగా అవినీతికి పాల్పడ్డారు. పుల్లారావుపై కేసులివే.. ♦ ఎమ్మెల్యే విడదల రజినిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త పిల్లి కోటిని అరెస్టు చేసినప్పుడు పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు ప్రత్తిపాటి పుల్లారావుపై చిలకలూరిపేట టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 45/2020 యూ/ ఎస్ 341.18855/ కింద కేసు నమోదు చేశారు. ♦ మంచినీటి చెరువువద్ద ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ అనుమతులు లేకుండా ప్రారంభించేందుకు యత్నించి విధుల్లో ఉన్న మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ కోడిరెక్క సునీతపై దాడి చేసినందుకు క్రైమ్ నంబర్ 136/2022 యూ/ఎస్ 353, 509, 506,323 ఆర్/డబ్ల్యూ, 34 ఐపీసీ – సెక్షన్ 3(1)(ఆర్)(ఎస్),3(2)(వీఏ) ఆఫ్ ఎస్సీ/ఎస్టీ పీఓఏ యాక్ట్ కింద ప్రత్తిపాటిపై కేసు నమోదైంది. ♦ చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో అరెస్టయినప్పుడు చిలకలూరిపేట జాతీయ రహదారి దిగ్బంధనం చేసి పోలీసు విధులకు ఆటంకపరిచినందుకు క్రైమ్ నంబర్ 238/2023 యూ/ఎస్ 341, 353, 120(బి), 144, 148 ఆర్/డబ్ల్యూ 143 ఐపీసీ – సెక్షన్ 129–149, క్రైమ్ నంబర్ 240/2023 యూ/ఎస్ 435, 353, 120–బి ఆర్/డబ్ల్యూ 149 ఐపీసీ కింద, క్రైమ్ నంబర్ 125/2023 యూ/ఎస్ 353, 341, 147, 143, 120–బి. ఆర్/డబ్ల్యూ 149 కింద మూడు కేసులు నమోదయ్యాయి. ♦ చట్టప్రకారం జరుగుతున్న ఇసుక రవాణాను అడ్డు కుని పోలీసు విధులను అడ్డుకోవడంతో అమరా వతి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 93/2023 యూ/ఎస్ 143, 341, 230 ఆర్/డబ్ల్యూ 149 ఐపీసీ కి ంద కేసు నమోదైంది. -
ఓం భూం స్వాహా!
‘నా పరిశీలనకు వచ్చిన, తెలియవచ్చిన విషయాల్ని ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని చెబుతూ 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కుర్చిలో కూర్చున్నాక.. కుట్రలు చేయడంలో, నమ్మిన ప్రజల్ని మోసగించడంలో సిద్ధ హస్తుడైనచంద్రబాబు ఆ ప్రమాణాన్ని నిస్సిగ్గుగా ఉల్లంఘించారు. అత్యంత కీలకమైన రాజధాని రహస్యాన్ని ఎల్లో గ్యాంగ్‌కు లీక్ చేసి సీఎం పదవికే కళంకం తెచ్చారు. అంతర్జాతీయ రాజధాని అంటూ ప్రధానితో పాటు ప్రముఖుల్ని పిలిచి హడావుడి చేసినప్పుడు.. బాబు కుట్రల్ని జనం పసిగట్టలేకపోయారు. ఇదంతా పేదల అసైన్డ్ భూముల స్వాహాకు, ఇన్సైడర్ ట్రేడింగ్ కోసం చంద్రబాబు వేసిన ఎత్తులు, జిత్తులని అప్పుడు వారికి తెలియలేదు. ‘రాజధాని ఫైల్స్’ డ్రామాలో పేద రైతుల అసైన్డ్ భూములను బెదిరించి బినామీల రూపంలోసొంతం చేసుకుని కథ నడిపించారు. ఎవరికీ చెందని ప్రభుత్వ అసైన్డ్ భూములు తమ వారివే అంటూ రికార్డులు సృష్టించి స్వాహా చేశారు. తన పని పూర్తయ్యాక.. గ్రాఫిక్స్ రాజధాని కట్టలేక చేత్తులేత్తేసి ఎన్నికల ముందు కొత్త డ్రామాలు అందుకున్నారు. ఈ డ్రామాలో బాబు బృందంలోనిమంత్రులు, ఎమ్మెల్యేలు...ఆయనకు ఆప్తులు అందరూ పాత్రధారులే.. ‘చేసేది నువ్వు.. చేయించేది నేను..’ రాజధాని ఫైల్స్‌లో చంద్రబాబు డైలాగ్ ఇదే. తెరముందు రాజధాని రూపశిల్పి.. తెరవెనుక రాజధాని లీక్స్ సూత్రధారి. అసలు సూత్రధారులు చంద్రబాబు, లోకేశ్ కాగా.. పాత్రధారులు నారాయణ, లింగమనేని రమేష్, ప్రత్తిపాటి పుల్లారావు, సుజనా చౌదరి, వేమూరి రవికుమార్, మాగంటి మురళీ మోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావు ఇలా 1,336 మంది బినామీలున్నారు. అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్సైడర్ ట్రేడింగ్‌తో రూ.లక్షల కోట్ల భూ దందాకు తెగించారు. అసైన్డ్ దోపిడీ, ఇన్సైడర్ ట్రేడింగ్‌లో 1,336 మంది బినామీ ‘బాబు’ల బాగోతం సాక్షి, అమరావతి : అమరావతి భూదోపిడీకి కర్త, కర్మ, క్రియ చంద్రబాబే. అసైన్డ్ భూములు, ప్రైవేటు భూములు, క్విడ్ ప్రోకో భూములు, బంగ్లాలు.. ఇలా ఒకటేమిటి.. చంద్రబాబు అక్రమ సామ్రాజ్యంలో అన్నీ భాగమే. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలతో క్విడ్ ప్రోకో ద్వారా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌కు 14 ఎకరాలు దక్కాయి. కృష్ణానది కరకట్ట మీద ఉన్న లింగమనేని బంగ్లా ఆయన పరమైంది. ఎస్సీ, ఎస్టీ, రైతులను భయపెట్టి బినామీల పేరిట కొల్లగొట్టిన వందలాది ఎకరాలు చంద్రబాబు ఖాతాలోకే వెళ్లాయి. సింగపూర్ కంపెనీ పేరిట స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోని భూముల అసలు హక్కుదారూ చంద్రబాబు కుటుంబమే. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌కు ఇరువైపులా, అమరావతి సీడ్ క్యాపిటల్ పరిధి దాటి బినామీల పేరిట కొనుగోలు చేసిన దాదాపు 5 వేల ఎకరాల అసలు యజమాని చంద్రబాబు కుటుంబమే. చినబాబుది పెద్ద వాటానే అమరావతి భూ కుంభకోణంలో లోకేశ్‌ది పెద్ద వాటానే. తన బినామీ, ఎన్నారై వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించిన వేమూరి రవికుమార్‌తో పాటు మరికొందరు బినామీల పేరిట వేలాది ఎకరాలు దక్కించుకున్నారు. వేమూరి రవికుమార్‌తోపాటు ఆయన భార్య అనూరాధ గోష్పాది గ్రీన్‌ఫీల్డ్స్ పేరిట అమరావతిలోని కోర్ క్యాపిటల్ ప్రాంతంలోనే 500 ఎకరాలకుపైగా స్వాహా చేశారు. అవినీతి తిమింగలం లింగమనేని అమరావతిలో అవినీతి తిమింగలం లింగమనేని రమేశ్. చంద్రబాబు భూ దోపిడీలో ఇతనూ ఒక ప్రధాన పాత్రధారి. ఆయన కుటుంబానికి చెందిన 355 ఎకరాలను ఆనుకునే ఇన్నర్ రింగ్ రోడ్డు నిరి్మంచేలా అలైన్మెంట్ ఖరారు చేశారు. తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట కొనుగోలు చేసిన వందలాది ఎకరాలను భూ సమీకరణ ప్రక్రియ నుంచి తప్పించారు. అమరావతిలో దాదాపు వెయ్యికి పైగా ఎకరాలు లింగమనేని హస్తగతం చేసుకున్నారు. నారాయణ తంత్రం.. సుజనా, ప్రత్తిపాటి భూదందా చంద్రబాబు తరువాత అమరావతి భూ దోపిడీలో రెండో పెద్ద దోపిడీదారు నారాయణ. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కో లో ప్రధాన పాత్రధారు. కృష్ణా నదికి ఇటువైపు.. అటువైపు, కృష్ణా జిల్లా పరిధిలో ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్‌మెంట్‌కు దగ్గరలో వేలాది ఎకరాలు కొనుగోలు చేశారు. అక్కడ నారాయణ విద్యా సంస్థల భూములు ఉన్నాయి. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తన ఉద్యోగులను బినామీలుగా చేసి 162 ఎకరాల అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు. అసైన్డ్, ప్రైవేటు భూములు కలిపి దాదాపు 3 వేల ఎకరాల వరకు బినామీల పేరిట గుప్పిట పట్టారు. నారాయణ బినామీ కంపెనీ రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌ది అమరావతి భూ కుంభకోణంలో కీలక పాత్ర. అసైన్డ్ భూముల దోపిడీలో ఆ కంపెనీ ఎండీ అంజనీకుమార్ కీలకంగా వ్యవహరించారు. అమరావతిలో దాదాపు 2 వేల ఎకరాలను బినామీలు, ఉద్యోగుల పేరిట రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ కొల్లగొట్టింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరి అమరావతి భూ దోపిడీలో అతిపెద్ద వాటాదారు. ఆయన తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఏకంగా 700 ఎకరాల వరకు కొల్లగొట్టారు. అమరావతి భూదోపిడీలో బినామీల పేరిట అసైన్డ్ భూములతో సహా 196 ఎకరాలు దోచుకున్నారు. -
అమరావతిలో ‘ప్రత్తిపాటి’ దోపిడీ
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో జరిగిన కుంభకోణాల్లో మరో భారీ అవినీతి బయటపడింది. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం రాజధానిలో మౌలిక సదుపాయాల కాంట్రాక్టుల పేరిట రూ.66.03 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్లు వెల్లడైంది. ప్రత్తిపాటి కుటుంబానికి చెందిన అవెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టుల పేరుతో బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి నిధులు కొల్లగొట్టి.. షెల్‌కంపెనీల ద్వారా దారి మళ్లించినట్టు ఆధారాలతోసహా బట్టబయలైంది. కేంద్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ), రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఏపీ డీఆర్ఐ) సోదాల్లో ఈ వ్యవహారం మొత్తం బయటకొచ్చింది. ఈ కంపెనీ కేంద్ర జీఎస్టీ విభాగాన్ని బురిడీ కొట్టించడంతోపాటు రాష్ట్ర ఖజానాకు గండి కొట్టి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడినట్లు తేటతెల్లమైంది. దీంతో డీఆర్ఐ ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి అవెక్సా కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను గురువారం అరెస్టు చేశారు. ఆయనతోపాటు మరో ఆరుగురిపై ఐపీసీ సెక్షన్లు 420, 409, 467, 471, 477(ఎ), 120 (బి) రెడ్‌విత్ 34 కింద కేసు నమోదు చేశారు. ఆయన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. తీగ లాగితే కదిలిన డొంక ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబానికి చెందిన అవెక్సా కార్పొరేషన్‌కు హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం, నెల్లూరు, విజయనగరం జిల్లా మానాపురంలలో బ్రాంచి కార్యాలయాలున్నాయి. ప్రత్తిపాటి పుల్లారావు భార్య తేనే వెంకాయమ్మ డైరెక్టర్‌గా, ఆయన కుమారుడు ప్రత్తిపాటి శరత్ అదనపు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ కంపెనీకి టీడీపీ ప్రభుత్వం అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టింది. వాటి పనులు చేయకపోయినప్పటికీ, చేసినట్లు గా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించిన అవెక్సా కంపెనీ బిల్లులు డ్రా చేసుకోవడంతోపాటు జీఎస్టీ విభాగం నుంచి అడ్డగోలుగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని కూడా పొందింది. దేశవ్యాప్తంగా అక్రమంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందిన కంపెనీలపై డీజీజీఐ విచారణ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అవెక్సా కంపెనీ అక్రమంగా ఐటీసీ పొందిందని వెల్లడి కావడంతో ఆ కంపెనీకి డీజీజీఐ రూ.16 కోట్ల జరిమానా విధిస్తూ షోకాజ్ కమ్ డిమాండ్ నోటీసు జారీ చేయాలని ప్రతిపాదించింది. అసలు అవెక్సా కార్పొరేషన్ వ్యవహారాలు, కాంట్రాక్టులు, బిల్లుల చెల్లింపులపై డీజీజీఐ, ఏపీ డీఆర్ఐ దృష్టిసారించాయి. ఆ కంపెనీ కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించడంతో మొత్తం బాగోతం బట్టబయలైంది. షెల్ కంపెనీలను సబ్ కాంట్రాక్టర్లుగా చూపించి రూ.21.93 కోట్లు అవెక్సా కార్పొరేషన్ ముసుగులో ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం ప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టిందీ అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది. 2017 నుంచి అవెక్సా కార్పొరేషన్ పేరుతో ప్రత్తిపాటి కుటుంబం అమరావతిలో కాంట్రాక్డు సంస్థలను బెదిరించి సబ్ కాంట్రాక్టులు తీసుకుంది. పనులు చేయకుండానే అక్రమంగా నిధులు కొల్లగొట్టింది. జాక్సన్ ఎమినెన్స్ (ప్రస్తుత పేరు జైశ్నవి ఎమినెన్స్) అనే కంపెనీ అమరావతిలో మౌలిక సదుపాయాల కాంట్రాక్టును పొందింది. ఆ కంపెనీ నుంచి రూ.37.39 కోట్ల విలువైన పనులను అవెక్సా కార్పొరేషన్ సబ్ కాంట్రాక్టుకు తీసుకుంది. సీఆర్డీయే పరిధిలో రోడ్లు, వరదనీటి కాలువలు, కల్వర్టులు, సివరేజ్ పనులు, వాకింగ్ ట్రాక్‌లు, పచ్చదనం తదితర పనులు అవెక్సా కార్పొరేషన్ చేయాల్సి ఉంది. అయితే, ఈ సంస్థ తానిషా ఇన్ఫ్రా, రాలాన్ ప్రోజెక్ట్స్, అనయి ఇన్ఫ్రా అల్వేజ్ టౌన్ ప్లానర్స్ అనే నాలుగు కంపెనీలకు రూ.21.93 కోట్లకు సబ్ కాంట్రాక్టుకు ఇచ్చినట్టు చూపించింది. ఆ సబ్ కాంట్రాక్టుల ముసుగులోనే అవెక్సా కంపెనీ ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్లు డీఆర్ఐ సోదాల్లో వెల్లడైంది. సబ్ కాంట్రాక్టుకు ఇచ్చామని చెప్పిన నాలుగు కంపెనీల నుంచి బోగస్ ఇన్వాయిస్లు, బిల్లులు పొంది ఆ మేరకు పనులు చేసినట్టుగా కనికట్టు చేసింది. ప్రభుత్వ ఖజానా నుంచి బిల్లుల సొమ్ము పొందింది. కేంద్ర జీఎస్టీ నుంచి అక్రమంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను కూడా తీసుకుంది. వాస్తవానికి సబ్ కాంట్రాక్టు సంస్థల నుంచి అవెక్సా కంపెనీ ఎలాంటి సేవలూ పొందలేదు. అవి ఏ పనులూ చేయలేదు. ఆ నాలుగు కంపెనీలూ షెల్ కంపెనీలే. వాటి పేరుతో మొత్తం రూ.21,93,08,317 నిధులను ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం అక్రమంగా తరలించింది. రహదారి కాంట్రాక్టుల ముసుగులో రూ.26.25 కోట్లు దోపిడీ అంతటితో అవెక్సా కంపెనీ అక్రమాలు ఆగలేదు. అమరావతిలోని ఉద్దండరాయపురం నుంచి నిడమర్రు వరకు ఎన్ 9 రోడ్డు నిర్మాణ కాంట్రాక్టును బీఎస్ఆర్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్ కంపెనీ నుంచి సబ్ కాంట్రాక్టుకు తీసుకుంది. కానీ ఎలాంటి రోడ్డు పనులు చేయకుండానే అక్రమంగా బిల్లులు సమర్పించి ప్రజాధనాన్ని సొంత ఖాతాలోకి మళ్లించుకుంది. రహదారి నిర్మాణం కోసం మెటీరియల్ కొనుగోలు చేసినట్టు, వివిధ వృత్తి నిపుణుల సేవలు పొందినట్టు బీఎస్ఆర్ కంపెనీ పేరిట బోగస్ బిల్లులు సమర్పించి కనికట్టు చేసింది. అందుకోసం క్వాహిష్ మార్కెటింగ్ లిమిటెడ్, నోయిడా ఎస్పాత్ లిమిటెడ్, ప్రశాంత్ ఇండస్ట్రీస్, గోల్డ్ ఫినెక్స్ ఐరన్ – స్టీల్ కంపెనీల నుంచి మెటీరియల్ కొనుగోలు చేసినట్టు బోగస్ బిల్లులు సమర్పించింది. ఆ విధంగా ఏ పనీ చేయకుండానే వివిధ దశల్లో రూ.26,25,19,393 దోపిడీ చేసింది. గృహ నిర్మాణ ప్రాజెక్టుల పేరిట అక్రమంగా రూ.17.85 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేదల గృహ నిర్మాణ ప్రాజెక్టులోనూ అవెక్సా కంపెనీ అడ్డగోలుగా నిధులు కొల్లగొట్టింది. ఏపీ టిడ్కో కింద జి+3 గృహ నిర్మాణ ప్రాజెక్టు, విశాఖపట్నంలో హుద్‌హుద్ తుపాను బాధితులకు 800 గృహాల నిర్మాణ ప్రాజెక్టు, మిడ్ పెన్నార్ ప్రాజెక్టు ఆధునీకరణ సబ్ కాంట్రాక్టులు పొందింది. ఆ ప్రాజెక్టుల బిల్లుల కింద బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము పొందింది. ఈమేరకు ఆధ్యా ఎంటర్‌ప్రైజస్, మెస్సెర్స్ సంజయ్ కుమార్ భాటియా, తనిష్క్ స్టీల్ లిమిటెడ్, మౌంట్ బిజినెస్ బిల్డ్ లిమిటెడ్ కంపెనీల నుంచి మెటీరియల్ కొన్నట్లు బోగస్ ఇన్వాయిస్లు, బిల్లులు సమర్పించింది. ఆ పేరుతో ఏకంగా రూ.17,85,61,864 ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందింది. ఈ విధంగా అవెక్సా కార్పొరేషన్ కంపెనీ ద్వారా ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం మొత్తం రూ.66,03,89,574 ప్రజాధనాన్ని కొల్లగొట్టింది. అవును ...భోగస్ బిల్లులతో నిధులు కొల్లగొట్టాం – అవెక్సా కంపెనీ డైరెక్టర్ కుర్ర జగదీశ్వరరావు ఈ వ్యవహారంపై డీజీజీఐ, ఏపీ డీఆర్ఐ విచారణలో మొత్తం లోగుట్టు బట్టబయలైంది. అవెక్సా కంపెనీ డైరెక్టర్‌గా ఉన్న కుర్ర జగదీశ్ తాము బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి అక్రమంగా బిల్లులు డ్రా చేసుకున్నామని అంగీకరించారు. ఈ కుంభకోణానికి ఎలా పాల్పడిందీ ఆయన సవివరంగా వెల్లడించారు. దాంతో అవెక్సా కంపెనీ ముసుగులో ప్రత్తిపాటి కుటుంబం అవినీతి బాగోతం ఆధారాలతోసహా బట్టబయలైంది. తనయుడి కోసం తండ్రి పుల్లారావు చక్కర్లు విజయవాడ స్పోర్ట్స్/గుణదల (విజయవాడ తూర్పు): అమరావతి పనుల కుంభకోణంలో దొరికిపోయిన ప్రత్తిపాటి శరత్ కోసం అతని తండ్రి, టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి పత్త్రిపాటి పుల్లారావు విజయవాడలో చక్కర్లు కొట్టారు. డీఆర్ఐ ఫిర్యాదుపై శరత్‌ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ పోలీసులు అత్యంత గోప్యంగా విచారణ చేపట్టారు. దీంతో శరత్ జాడ కోసం అతని తండ్రి పుల్లారావు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, ఇతర టీడీపీ నాయకులను వెంటేసుకుని పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రదక్షణలు చేశారు. ముందుగా గురునానక్ కాలనీలోని ఏసీపీ కార్యాలయానికి, అక్కడ లేకపోవడంతో మాచవరం పోలీస్ స్టేషన్‌కు, ఆ తర్వాత టాస్‌్కఫోర్స్ కార్యాలయానికి వెళ్లారు. సాయంత్రం తన అనుచరులను నగరం నలుదిక్కులకు పంపారు. ఆ తరువాత సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతోందని తెలుసుకుని అక్కడకు చేరుకున్నారు. అక్కడా లేకపోవడంతో టీడీపీ కార్యాలయానికి వచ్చారు. రాత్రి 8.30 గంటల సమయంలో పుల్లారావు, పట్టాభి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తదితరులతో కలిసి పోలీసు కమిషనరేట్‌కు చేరుకొని తన కొడుకును చూపించాలంటూ ఆందోళనకు దిగారు. కొద్ది సేపటి తరువాత రూరల్ డీసీపీ కె.శ్రీనివాసరావు వచ్చి ఓ గంటలో న్యాయమూర్తి వద్ద నిందితుడు శరత్‌ను ప్రవేశపెడతామని చెప్పడంతో ఆందోళన విరమించి మాచవరంలోని జడ్జి క్వార్టర్స్‌కు వెళ్లారు. -
సీనియర్ల మౌనం.. సందేహం!
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు కొందరు ఎన్నికల సమయంలో స్తబ్దుగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. కీలకంగా పని చేయాల్సిన తరుణంలో ముఖం చాటేయడం, పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనకపోవడంతో టీడీపీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు తదితరులు అధిష్టానం తీరుతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వారు పార్టీ వీడే ఆస్కారమూ ఉందనే వాదన ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పూర్తి దూరంగా పుల్లారావు టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆ పార్టీ ముఖ్యనేత ప్రత్తిపాటి పుల్లారావు కొద్దికాలంగా పార్టీపై అసంతృప్తితో బయటకు రావడంలేదు. ఆయన ఇన్చార్జిగా ఉన్న చిలకలూరిపేట సీటును వేరే వారికి ఇచ్చేందుకు యత్నించడంతో ఆయన అడ్డుకున్నారు. ఆ తర్వాత అడపాదడపా పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు. కొద్దిరోజులుగా పూర్తిగా సైలెంట్ అయ్యారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయానికీ రావడంలేదని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీపైనా స్పష్టత లేదు. గతంలో ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. పరపతి తగ్గిన యరపతినేని! పల్నాడుకు చెందిన మరో కీలక నేత యరపతినేని శ్రీనివాసరావుకు పార్టీలో పరపతి పూర్తిగా తగ్గిందని సమాచారం. ఫలితంగా పార్టీతో అంటీముట్టనట్లు ఉంటున్నారని తెలుస్తోంది. చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలేదు. తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గురజాల నుంచి పోటీ చేస్తారో లేదో అనే సందిగ్ధం నెలకొంది. అయ్యో.. ‘చింత’కాయల ఉత్తరాంధ్రకు చెందిన మరో కీలక నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అప్పుడప్పుడు మీడియాలో మాట్లాడుతున్నా పార్టీ వ్యవహారాల్లో గతంలో ఉన్నంత చురుగ్గా లేరని చర్చ జరుగుతోంది. ఆయన కుమారుడు విజయ్ కూడా ఇప్పుడు అంత క్రియాశీలకంగా లేరని సమాచారం. గతంలో టీడీపీ సోషల్ మీడియా వింగ్‌కు ఇన్చార్జిగా ఉన్న విజయ్ను తప్పించి ఆ బాధ్యతలను పయ్యావుల కేశవ్‌కు అప్పగించారు. అప్పటి నుంచి టీడీపీకి, అయ్యన్న కుటుంబానికి దూరం పెరిగినట్లు తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావుకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా వారికి నచ్చడంలేదని చెబుతున్నారు. లోకేశ్ తీరే కారణమా..? ఇలా సీనియర్లంతా పార్టీపై అసంతృప్తితో మౌనంగా ఉండడానికి చినబాబు లోకేశ్ తీరే కారణంగా తెలుస్తోంది. ఆయన సీనియర్లను దూరం పెట్టడంతోపాటు వారికి వ్యతిరేకంగా జూనియర్లను ఎగదోయడం అసంతృప్తి జ్వాలలను పెంచిందని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రత్తిపాటి, యరపతినేని తదితర సీనియర్ నేతలు పార్టీని వీడే ఆస్కారం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. లోలోన రగులుతున్న మరింత మంది మరింత మంది సీనియర్లు లోకేశ్ తీరు కారణంగా లోలోన రగిలిపోతున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు అప్పుడప్పుడూ మీడియాలో ఘీంకరించడం తప్ప నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఉండడం లేదు. ఆయన్ను పార్టీ క్యాడర్ పట్టించుకోవడంలేదు. అసమ్మతి పెరిగిపోవడంతో ఈసారి ఆయనకు సీటు లేదని లోకేశ్ తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో ఆయన మిన్నకుండిపోయారు. ఏలూరు జిల్లాలో కీలక నేత చింతమనేని ప్రభాకర్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నిమ్మకాయల చినరాజప్ప, ఉమ్మడి కర్నూలు జిల్లాలో కేఈ ప్రభాకర్ వంటి నేతలూ చురుగ్గా ఉండడంలేదని పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కింజరపు అచ్చెన్నాయుడూ మొక్కుబడిగానే వ్యవహరిస్తున్నట్టు సమాచారం. లోకేష్ కోసం ఆయన ప్రాధాన్యాన్ని తగ్గించడమే కాకుండా తరచూ మీడియా సమావేశాలు కూడా నిర్వహించనీయడం లేదని తెలుస్తోంది. అందుకే ఆయన పత్రికా ప్రకటనలతో అచ్చెన్న సరిపెట్టుకుంటున్నారు. పేరుకు అధ్యక్షుడైనా లోకేష్ ఆయన్ను అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదని లోలోపల ఆవేదన చెందుతున్నారని సమాచారం. ఇంకా చాలామంది సీనియర్లు ఇలాగే స్తబ్దుగా ఉండడంతో పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీ పుంజుకోకపోవడం, లోకేశ్ వ్యవహార శైలితో పార్టీ పరిస్థితి మరింత దిగజారిందనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. -
పైకి మాత్రం నవ్వుల పువ్వులు.. కడపులో కత్తులు పెట్టుకొని మరీ..
ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం నేతల మధ్య ఆధిపత్యపోరు పరాకాష్టకు చేరింది. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకునే పరిస్థితి కొనసాగుతోంది. పైకి మాత్రం అందరూ నవ్వుల పువ్వులు పూయిస్తున్నారు. కడుపులో కత్తులు పెట్టుకుని బయటకు మాత్రం నవ్వుతూ పలకరించుకుంటున్నారు. జిల్లాలో ప్రధానంగా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పార్టీ సీనియర్ నేత జీవీ ఆంజనేయులు మధ్య ఇప్పుడు వార్ నడుస్తోంది. ఉమ్మడి జిల్లాకు మూడుసార్లు ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీ అధ్యక్షుడిగా చేశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు మంత్రి పదవి అప్పగించాక.. పుల్లారావు స్థానంలో పార్టీ అధ్యక్ష పదవిని అధిష్టానం జీవీ ఆంజనేయులకు కట్టబెట్టింది. జీవీ కూడా రెండుసార్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జీవీ వ్యవహరిస్తున్నారు. సొంతింటి నుంచే వెన్నుపోటు ప్రత్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉన్న సమయంలో కొంతమంది ఎంపిక చేసిన జర్నలిస్టులకు ప్రత్యేక లబ్ది చేకూర్చారు. తద్వారా గుంటూరు జిల్లా మీడియాలో ఆయన మనుషులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మీడియా ప్రతినిధులు చేతిలో ఉన్నందువల్లే పుల్లారావుకు ఎవరిమీద అయినా కోపం ఉంటే పథకం ప్రకారం వారిపై నెగిటివ్ కథనాలు రాయించి డామేజ్ చేస్తుంటారని పార్టీలోనే ఆయన ప్రత్యర్థులు చెబుతారు. కొన్నాళ్లుగా మాజీ మంత్రి పుల్లారావు, జీవీ ఆంజనేయులుకు మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో పుల్లారావు తన పలుకుబడిని ఉపయోగించి జీవీపై మీడియాలో నెగిటివ్ కథనాలు రాయిస్తూ.. వీటిని పార్టీ కార్యాలయానికి కూడా పంపుతున్నారు. ఈ నెగిటివ్ కథనాల వెనుక ఎవరున్నారనేది కొన్నాళ్లపాటు జీవీకి అర్దంకాలేదు. తర్వాత అసలు విషయం తెలుసుకుని జీవీకి మైండ్ బ్లాకయ్యిందట. తనకు టికెట్ రాకుండా చెయ్యడానికి పుల్లారావు కుట్ర పన్నారని జీవీ ఆంజనేయులు అందరి వద్ద చెప్పుకుంటున్నారట. అప్పటినుంచి పుల్లారావును జీవీ టార్గెట్ చేశారు. చదవండి: (Pawan-Chandrababu Meet: రెచ్చిపోయిన చంద్రబాబు) రాజకీయం కాదు రియల్ బిజినెస్ గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రత్తిపాటి పుల్లారావు పూర్తిగా హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. అక్కడే రియల్ వ్యాపారం చేసుకుంటున్నారు. ఏపీలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం లేదు. కనీసం కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండడంలేదు. వీటన్నింటినీ పరిశీలించిన జీవీ.. పుల్లారావు ఎక్కడెక్కడ, ఏం చేస్తున్నాడో వివరిస్తూ పార్టీ నాయకత్వానికి పెద్ద లిస్ట్ పంపించారట. ఐదేళ్లు మంత్రి పదవిలో ఉండి అడ్డ దిడ్డంగా సంపాదించి కష్టకాలంలో పార్టీని, కార్యకర్తలను గాలికొదిలేశారంటూ ఒక రిపోర్ట్ ను కూడా అధిష్టానానికి పంపారట. ఇలా అవకాశం వచ్చినప్పుడల్లా పుల్లారావుకు పొగపెడుతూనే ఉన్నారు. పుల్లారావు కూడా మీడియాను అడ్డం పెట్టుకుని జీవిపై కథనాలు రాయించడం కొనసాగిస్తూనే ఉన్నారట. జీవీ మార్కు రాజకీయం కొంతకాలంగా పుల్లారావు అప్పుడప్పుడు నియోజకవర్గంలో కనిపిస్తున్నారంటే అందుకు కారణం జీవీ ఆంజనేయులేనని పార్టీలో ప్రచారం సాగుతోంది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోతే పుల్లారావుపై అధిష్టానానికి ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తూ..ఆయనకు చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారట. అంతేకాదు చిలకలూరిపేటలో పుల్లారావు వ్యతిరేకులందరినీ కలుపుకుని వారితో జట్టుకడుతున్నారట ఆంజనేయులు. ప్రత్తిపాటి కూడా వినుకొండలో జీవీ వ్యతిరేకవర్గాన్ని కూడగట్టి జీవీకి చెక్ పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఇలా ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
టోల్గేట్ వద్ద మంత్రి భార్య హల్చల్
-
పార్టీ మారినందుకు మంత్రి వేధింపులు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో తనకు అనుకూలంగా పనిచేయని నాయకులపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అప్పుడే వేధింపులు మొదలుపెట్టారు. పోలీస్, మార్కెటింగ్ శాఖ అధికారులను ఇందుకోసం వినియోగించుకుంటున్నారు. చిలకలూరిపేట టీడీపీ అధ్యక్షునిగా పనిచేసిన మల్లెల రాజేష్‌నాయుడు నెల రోజుల క్రితం వైఎస్సార్ సీపీలో చేరటంతో ఆయనపై వేధింపులు మొదలయ్యాయి. పట్టణంలో తనకంటూ ప్రత్యేక వర్గం కలిగిన రాజేష్‌నాయుడు ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి విడదల రజినికి అనుకూలంగా ప్రచారం చేశారు. ఫలితంగా తన గెలుపు అవకాశాలు తగ్గిపోవడంతో మంత్రి పుల్లారావు ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. చిలకలూరిపేట మార్కెట్ యార్డులో పశువుల కొనుగోళ్లు, అమ్మకాలు నిర్వహిస్తున్న రాజేష్ ఇకపై ఆ వ్యాపారం చేయకూడదంటూ మార్కెటింగ్ శాఖ నుంచి మౌఖిక ఆదేశాలు జారీ చేయించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న తరుణంలో మంత్రి పుల్లారావు అధికారులపై ఇంకా అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారని.. ఎటువంటి కారణాలు చూపకుండానే అధికారులు తాను చేస్తున్న వ్యాపారానికి ఆటంకాలు కలిగిస్తున్నారని రాజేష్‌నాయుడు ఎన్నికల అధికారులకు, సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. చిలకలూరిపేట మార్కెట్ యార్డులో గ్లోబల్ మర్చంటైజ్డ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రాజేష్‌నాయుడు చాలాకాలంగా పశువుల కొనుగోలు, అమ్మకాలు చేస్తున్నారు. ప్రతి అమ్మకంపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం సెస్ చెల్లిస్తున్నారు. మార్కెట్ కమిటీ కార్యదర్శి సువార్త ఆయన కార్యాలయానికి ఫోన్‌చేసి, శనివారం సంతలో పశువుల క్రయ, విక్రయాలు చేయకూడదని ఆదేశించారు. తమ సంస్థ ఎందుకు వ్యాపారం నిలిపివేయాలో కారణాలు చెప్పాలని, దీనికి సంబంధించి లిఖితపూర్వకంగా నోటీసు ఇవ్వాలని రాజేష్ కోరారు. అవేమీ తనకు తెలియదని, వ్యాపారం నిర్వహించకూడదని ఆమె హెచ్చరించారు. దీంతో రాజేష్ జిల్లా అధికారులకు, ఎన్నికల ప్రధానాధికారికి, హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. మంత్రి పుల్లారావు తనపై వేధింపులకు దిగుతున్నారని, వ్యాపారానికి ఆటంకం కలిగిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై మార్కెట్ కమిటీ ప్రధాన కార్యదర్శి సువార్తను ‘సాక్షి’ వివరణ కోరగా.. అలాంటిదేమీ లేదన్నారు. ఇప్పటివరకు ఆయన వ్యాపారానికి సంబంధించిన రికార్డులను అడిగామన్నారు. రాజేష్‌నాయుడు మాట్లాడుతూ.. తన కార్యాలయ ఉద్యోగి భూపతిని ఆమె కార్యాలయానికి పిలిపించుకుని వ్యాపారం చేయొద్దని ఆదేశించారన్నారు. శనివారం సంతలో వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్టు ఆయన తెలిపారు. -
టీడీపీ విధ్వంస కాండ
సాక్షి, గుంటూరు : ఐదేళ్ల టీడీపీ అరాచక పాలనతో విసిగి వేసారిన ప్రజలు గురువారం పోలింగ్ బూత్‌లకు పోటెత్తారు. పోలింగ్ శాతం తగ్గించేందుకు టీడీపీ నాయకులు ఎంతగా ప్రయత్నించినా ప్రజలు వెనకడుగు వేయలేదు. ఓటమి తప్పదన్న ఉక్రోషంతో టీడీపీ నాయకులు విధ్వంస కాండకు తెగబడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్లపై దాడులకు తెగబడ్డారు. నరసరావుపేటలో ఏకంగా కిడ్నాప్ చేశారు. అడ్డుకోబోయిన ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డిపై దాడిచేసి గాయపరిచారు. వైఎస్సార్ సీపీకి ఓట్లు వేస్తారా అంటూ గురజాలలో ముస్లింల ఇళ్లపై రాళ్లు రువ్వి, మహిళలు, వృద్ధులపై దాడులకు తెగబడ్డారు. సుమారు 500 మంది కర్రలు, కత్తులతో సీఐ సమక్షంలోనే మూడు గంటలపాటు వీరంగం సృష్టించి వైఎస్సార్సీపీ నేతల కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, సినిమా హాళ్లను ధ్వంసం చేశారు. ఓటమి భయంతో టీడీపీ నాయకులు జిల్లాలో విధ్వంసాలకు తెగబడ్డారు. ప్రశాం తంగా ఉన్న పల్నాడులో సార్వత్రిక ఎన్నికల పోలిం గ్ సాక్షిగా టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడా ్డరు. పౌరులు ఓటు హక్కు వినియోగించుకోకుండా భ యభ్రాంతులకు గురిచేశారు. వైఎస్సార్ సీపీ ఏజెం ట్లపై దాడులకు తెగబడ్డారు. యథేచ్ఛగా ఓట్లను సైక్లింగ్ చేశారు. ఈ అరాచకాలను అడ్డుకున్న వైఎ స్సార్ సీపీ నాయకులపై వేటకొడవళ్లతో దాడులకు దిగారు. జిల్లాలో గురువారం పోలింగ్ సందర్భంగా టీడీపీ నాయకులు రావాణ కాష్టాన్ని రగిల్చారు. గురజాలలో అరాచకం గురజాల టౌన్‌లోని 29వ పోలింగ్ బూత్‌లో ముస్లింలను ఓటు వేయడానికి రాకుండా అడ్డుకుని, ఓటు వేయడానికి వచ్చిన ముస్లిం యువలకుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. అయినా ముస్లిం బెదరకుండా ఓట్లు వేశారు. ముస్లింలు వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశారని అక్కసుతో పోలింగ్ అనంతరం టీడీపీ నాయకులు ముస్లింల ఇళ్లు, షాప్‌లపై దాడులు చేసి ధ్వంసం చేశారు. ఈ సమాచారం తెలిసిన జంగమహేశ్వరపురం, గురజాల టౌన్ వైఎస్సార్ సీపీ నాయకులు ముస్లింలకు అండగా వెళ్లగా వారి పైనా టీడీపీ నాయకులు దాడులకు దిగారు. రాళ్లు రువ్వుతూ, కర్రలు, రాడ్డులతో విచక్షణ రహితంగా దాడులు చేశారు. అయితే వైఎస్సార్ సీపీ నాయకులు ప్రతిఘటించారు. తాము తక్కువ మంది ఉండటంతో కొద్దిసేపు వెనక్కు తగ్గిన టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ నాయకులు టౌన్ నుంచి వెళ్లి పోయిన తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లోని తమ వర్గీయులందరినీ కూడగట్టుకుని విధ్వంసానికి దిగారు. వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లు, పార్టీ నాయకుడు యెనుముల మురళీధర్‌రెడ్డి కేబుల్ కార్యాలయాన్ని, శ్రీనివాసరెడ్డికి చెందిన సత్యనారాయణ ఐనాక్స్ సినిమాహాల్, కారులను ధ్వంసం చేశారు. ఇదంతా గురజాల టౌన్ సీఐ రామారావు కనుసన్నల్లో సాగింది. గురజాలలో తమ షాప్‌లు, కార్యాయాలను ధ్వంసం చేస్తున్న విషయాన్ని తెలుసుకుని అక్కడకు బయల్దేరిన జంగమహేశ్వర పురం గ్రామస్తులను మార్గ మధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. నరసరావుపేటలో గోపిరెడ్డిపై దాడి.. నరసరావుపేట వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై టీడీపీ నాయకులు యలమంద గ్రామంలో దాడికి దిగారు. యలమంద గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి ఏజెంట్లతో వెళ్తున్న గోపిరెడ్డిని అడ్డుకున్న టీడీపీ వర్గీయులు ఆయన కారు అద్దాలను ధ్వంసం చేసి ఆయన్ను గాయపరిచారు. వైఎస్సార్ సీపీకి చెందిన ఆరుగురు ఏంజెంట్లను పోలింగ్ బూత్‌ల నుంచి బయటకు లాక్కొచ్చి దాడి చేశారు. పోలింగ్ ఏజెంట్లు బోయపాటి నరసింహారావు, గార్లపాటి అంజయ్య, ముప్పాళ్ల నాగరాజును కిడ్నాప్ చేసి, మధ్యాహ్నం వరకూ బంధించి వేధింపులకు గురిచేశారు. ఇంత జరుగుతున్నా పట్టిం చుకోని పోలీసులు వైఎ స్సార్ సీపీ నాయకులపై జులుం చూపించారు. శ్రీనివాస గిరిజన కాలనీ లోని ఓటర్లను పోలింగ్ బూత్‌లోకి రాకుండా బూత్‌ను ఆక్రమించిన టీడీపీ వర్గీయులను నిలదీసిన వైఎస్సార్ సీపీ నాయకులపై ఎస్ఐ షఫీ దాడికి దిగి యువకులను తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఎస్ఐ టీడీపీకి కొమ్ముకాస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న రూరల్ ఎస్పీ రాజశేఖర్‌బాబు వైఎస్సార్సీపీ నాయకులకు సర్దిచెప్పి పంపారు. కాసు మహేష్‌రెడ్డిపై దాడి గురజాల వైఎస్సార్ సీపీ అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డిపై మాచవరం మండలం కొత్తగణేశునిపాలెంలో టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాస్ కుమారుడు రమేశ్, తెలుగు యువత నాయకుడు జీఆర్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు దాడికి దిగారు. కాసు కారు అద్దాలను ధ్వంసం చేసి, బౌన్సర్లను గాయపరిచారు. యరపతినేని చిన్న కుమారుడు నిఖిల్ రెండు కార్లు, 50 బైక్‌లపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేసుకుని పిడుగురాళ్ల మండలం పాత గణేశునిపాడులో విధ్వంసం సృష్టించాడు. తమకు ఓట్లు వేయలేదని దళితులపై దాడులు చేశాడు. నిఖిల్ తమపై దాడి చేశాడని ఫిర్యాదు చేసేందుకు పిడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన దళితులను సీఐ వీరేంద్రబాబు, ఎస్ఐ నారాయణస్వామి నిర్బంధించారు. కేసు పెట్టడానికి వెళ్లిన మహిళ నాగమణిపై టీడీపీ నాయకుడు గుర్రం శ్రీను దాడి చేశాడు. మహిళ తీవ్ర గాయాలపాలై కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. గుత్తికొండ గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో యరపతినేని శ్రీనివాసరావు హల్చల్ చేశాడు. ఎన్నికల విధుల నిర్వహిస్తున్న అధికారిపై చేయి చేసుకున్నాడు. మంత్రి లోకేష్ హైడ్రామా మంగళగిరి నియోజకవర్గంలో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన మంత్రి నారా లోకేష్ తాడేపల్లిలో సాయంత్రం హైడ్రామాకు తెరతీశారు. తాడేపల్లిలోని 34, 37 పోలింగ్ బూత్‌ల పరిశీలనకంటూ వందమంది అనుచరులతో నిబంధనలను ఉల్లంఘించి బలప్రదర్శనకు దిగారు. అక్కడే మీడియా సమావేశం పెట్టి ఎన్నికల కమిషన్ తీరుపై ఆరోపణలు గుప్పించారు. ఇరుకుగా ఉండే పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు ఇబ్బందిగా కలిగించేలా మీడియా సమావేశం పెట్టడం ఏంటని ప్రశ్నించిన ‘సాక్షి’ విలేకరి నాగిరెడ్డిపై లోకేష్ దౌర్జన్యానికి దిగారు. ఆయన అనుచరులు నాగిరెడ్డిపై దాడికి యత్నించారు. దీంతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ధర్నాకు దిగడంతో లోకేష్ వెళ్లిపోయారు. అనంతరం పోలీసులు వైఎస్సార్ సీపీపై లాఠీల విరుచుకుపడ్డారు. ఆ దృశ్యాలను ‘సాక్షి’ విలేకరి నాగిరెడ్డి తన సెల్‌ఫోన్ చిత్రీకరిస్తుండగా పోలీసులు అతనిపైనా లాఠీ ఝళిపించారు. ఇంతలో అక్కడికి చేరుకున్న అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు విలేకరి నాగిరెడ్డి ఫోన్‌ను లాగేసుకున్నారు. వినుకొండలో మారణాయుధాలతో.. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి పట్టున్న గ్రామాల్లో టీడీపీ నాయకులు అలజడులు సృష్టించారు. బొల్లాపల్లి మండలం పేరూరుపాడు గ్రామంలో ఉదయం నుంచి పోలింగ్‌కు విఘాతం కలిగిస్తూ వచ్చారు. సాయంత్రం ఈవీఎంలను బయటికీ తీసుకురాకుండా మారణాయుధాలతో పోలింగ్ బూత్ ఎదుట హల్‌చేశారు. పొన్నూరు, మాచర్ల, బాపట్ల, రేపల్లె, సహా వివిధ నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, ఏజెంట్లపై టీడీపీ నాయకులు దాడులు చేశారు. చాలా చోట్ల పోలింగ్ బూత్‌లలోకి చొరబడి సైక్లింగ్‌కు సైతం పాల్పడ్డారు. వేమూరు మండలం బూతుమల్లి గ్రామంలో సైక్లింగ్‌కు పాల్పడుతున్న టీడీపీ నాయకులను అడ్డుకున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థి మేరుగ నాగార్జునపై టీడీపీ వర్గీయులు దాడికి దిగారు. ఆయన్ను చుట్టుముట్టి కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో మేరుగ నాగార్జునకు స్వల్ప గాయాలయ్యాయి. టీడీపీ వర్గీయుల దాడిపై నాగార్జున వేమూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పేటలో ప్రత్తిపాటి జులుం చిలకలూరిపేటలో ప్రత్తిపాటి అనుచరులు నిబంధనలకు నీళ్లు వదిలారు. పోలింగ్ బూత్‌లలోకి చొరబడి వైఎస్సార్ సీపీ ఏజెంట్లపై దాడులకు దిగారు. నియోజకవర్గంలోని కమ్మవారిపాలెం, పోతవరం, మద్దిరాల, సాతులూరు సహా వివిధ గ్రామాల్లో ప్రత్తిపాటి అనుచరులు సైక్లింగ్‌కు పాల్ప డ్డారు. నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామంలో 498 ఓట్లు ఉండగా 435ఓట్లు పోల్ అయ్యాయి. అయితే ఎంపీ బ్యాలెట్ బాక్స్‌లో మాత్రం 50 ఓట్లు అదనంగా చూపిస్తున్నాయి. ఇక్కడ టీడీపీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడ్డం వల్లే 50 ఓట్లు అదనంగా చేరాయని రీపోలింగ్ నిర్వహించాలని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సత్తెనపల్లిలో ఇలా... ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు గ్రామంలో కోడెల శివప్రసాద్ తనయుడు శివరామ్ 248 బూత్‌లోకి అనుచరులతో చొరబడి హల్చల్ చేశాడు. ఎస్ఐ ఏడుకొండలు పోలింగ్ బూత్‌ల వద్ద విధులను విస్మరించి శివరామ్ గన్మెన్లా వ్యవహరించారు. అక్కడి నుంచి శివరామ్ దమ్మలపాడు చేరుకుని పోలింగ్‌కు విఘాతం కలిగించే ప్రయత్నం చేశారు. అక్కడ కోడెల అనుచరులు జనసేన కార్యకర్తల మధ్య వాగ్వా దం చోటు చేసుకుని ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఓటమి భయంతో సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం ఇనుమెట్ల గ్రామంలో టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాద్ పోలింగ్‌ను అడ్డుకున్నారు. ఉదయం 10 గంటల సమయంలో జెడ్పీ స్కూల్లో ఏర్పాటు చేసిన 160వ నంబర్ పోలింగ్ బూత్‌కు చేరుకున్న కోడెల పోలింగ్ జరగకుండా కేంద్రంలో సుమారు 2.30 గంటల సేపు బైఠాయించారు. అంతసేపు పోలింగ్ ఆగిపోవడంతో కోడెల బయటికి రావాలని వైఎస్సార్ సీపీ నాయకులు, ఓటర్లతో పోలింగ్ బయట నిరసన తెలిపారు. వారి నిరసనతో కోడెల హైడ్రామాకు తెరతీశారు. చొక్కా చింపుకొని తనపై దాడి చేశారని, స్పృహతప్పి పడిపోయాడు. అప్పటికే అక్కడి చేరుకున్న కోడె ల రౌడీలు ఓటర్లపై దాడి కి దిగడంతో ఓటర్లు వారిపై తిరగబడి అక్కడి నుంచి తరిమికొట్టారు. -
ఓటమి భయంతో అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, చిలకలూరిపేట : ఓటమి భయంతో మతి భ్రమించి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతున్నారని వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పట్టణంలో శనివారం రాత్రి నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు సభ విఫలం కావడంతో సహనం కోల్పోయి అనుచిత వ్యాఖ్యలకు దిగజారారని విమర్శించారు. తనను మహానటి అని పుల్లారావు విమర్శించటాన్ని తప్పు పట్టారు. తనకు తాను మహానాయకుడని చెప్పుకొనే ఆయన ఆ సినిమా ఎంత ప్లాప్ అయ్యిందో గుర్తించాలన్నారు. అలాగే ఈ ఎన్నికల్లో పుల్లారావు మట్టికరవటం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రజలందరినీ మోసగించే కపటనటుడు మంత్రి ప్రత్తిపాటి అని నియోజకవరంలో అందరికీ తెలుసన్నారు. అసలు మీ గురించి, మీ జీవితం గురించి, మీరు రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యం గురించి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని హితవు పలికారు. మీరు చేసిన మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, వంచనలు, హత్యలు తప్ప మీ జీవితంలో చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క మంచి పని లేదని ధ్వజమెత్తారు. రేషన్ డీలర్‌గా జీవితాన్ని ప్రారంభించిన పుల్లారావు.. ప్రకాశం జిల్లా నుంచి చిలకలూరిపేటకు వచ్చి, వ్యాపారం పేరుతో ఆర్యవైశ్యుల దగ్గర కోట్లాది రూపాయలు అప్పు చేసి వారికి ఎగనామం పెట్టారని ఆరోపించారు. కన్న తండ్రికి తలకొరివి పెట్టాల్సి వస్తుందని, మీరు ఊరు విడిచి పారిపోతే వేరొకరు మీ తండ్రి చితికి నిప్పు పెట్టిన విషయం బహుశా ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియక పోవచ్చన్నారు. కన్న తల్లికి మీరు ఇప్పటికీ అన్నం పెట్టకపోతే, ఆమె ఒంటరిగానే జీవిస్తున్న సంగతి మీ నిజనైజానికి అద్దం పడుతుందన్నారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలకు వెళ్లి అన్నదానం చేసేటప్పుడు, ఆ ఫొటోలకు ఫోజులిచ్చేటప్పడు మీ అమ్మానాన్నలు ఎప్పుడైనా గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు. అలాంటి ప్రత్తిపాటి పుల్లారావుకు తన కుటుంబాన్ని విమర్శించే అర్హత లేదన్నారు. ఆరోపణలకు ఆధారం ఉందా? తన భర్త విడదల కుమారస్వామిని తానే అమెరికా పంపినట్లు మంత్రి ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటు వ్యవహారమన్నారు. తన భర్త 20 ఏళ్ల నాడు అమెరికా వెళ్లినప్పుడు ప్రత్తిపాటి పుల్లారావు గుడ్డి పత్తి వ్యాపారం చేసుకుంటూ, రైతులకు డబ్బులు చెల్లించకుండా దాక్కొనే పరిస్థితులు నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. వీఆర్ ఫౌండేషన్ పేరుతో విదేశాల్లో విరాళాలు వసూలు చేస్తున్నారని నీతి లేని ఆరోపణలకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అమెరికా నుంచి ఇక్కడకు వచ్చాక పౌండేషన్ స్థాపించామని, దాని రిజిస్ట్రేషన్ ఇక్కడే ఉందని, దీనికి విరుద్ధంగా ఒక్క ఆధారం ఉన్నా పుల్లారావు నిరూపించాలని సవాలు విసిరారు. మా మామయ్య విడదల లక్ష్మీనారాయణకు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి ఇప్పించానని చెబుతున్న మంత్రి పుల్లారావు, ఆ పదవి కోసం ఎంత డబ్బులు తీసుకుంది, మీ లోకేష్ బాబుకు ఎన్ని కోట్లు ఇప్పించింది ఆధారాలతో సహా తన కుటుంబ సభ్యులు నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మల్లెల రాజేష్ నాయుడు డబ్బులు ఇస్తే గాని ప్రత్తిపాటి చారిటబుల్ ట్రస్ట్ తరఫున వైద్యశిబిరాలు నిర్వహించలేని మీరు కూడా కాకమ్మ కబుర్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎడ్ల పందాలు కూడా రాజేష్ నాయుడు డబ్బులతోనే నిర్వహించింది వాస్తవం కదా అని ప్రశ్నించారు. వీఆర్ ఫౌండేషన్ పేరుతో మేము పేదలకు సాయం చేయాలని వచ్చామని తెలిపారు. కాని మీరు స్వర్ణాంధ్ర ఫౌండేషన్ పేరుతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నిరుద్యోగులను దారుణంగా మోసగించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వ్యాపారులకు అండగా ఉంటాం ఇప్పటికీ మీ భార్య పేరున వెంకాయమ్మ ట్యాక్స్ వసూలు చేస్తున్న మీరు, ఇతరులు గెలిస్తే పన్ను వసూలు చేస్తారని అవాస్తవాలు ప్రచారం చేయటం సిగ్గుచేటన్నారు. మీలాగా రాజకీయాల్లో పెట్టుబడి పెట్టి దానికి పదింతలు సంపాదించాలన్న దుర్భుద్ధితో రాజకీయాల్లోకి రాలేదని, మాకు ఉన్నదాంట్లో సేవ చేద్దామనే వచ్చామని చెప్పారు. తాము వ్యాపారులకు అండగా ఉంటామని వివరించారు. -
ప్రత్తిపాటి @ ప్రజాధనం లూటీ
సాక్షి, గుంటూరు : మన నియోజకవర్గ ఎమ్మెల్యేకు మంత్రి పదవి వచ్చింది. ఇక ప్రతి మండలంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని నాలుగేళ్ల క్రితం చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు భావించారు. ప్రత్తిపాట్టి పుల్లారావుకు నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు తమ సమస్యలకు పరిష్కారం చూపిస్తారని ఆశలు పెట్టుకున్నారు. ఆయనకు పదవి వచ్చిన దగ్గర నుంచి అవినీతి జడలు విప్పింది. ఊరూవాడా అక్రమాలు జోరు పెరిగింది. నీరు– చెట్టు పథకం మంత్రితోపాటు ఆయన అనుచరులకు వరంగా మారింది. అధికారం అండ ఉండడంతో పత్తి కొనుగోలులో గోల్మాల్ చేశారు. అవినీతి తోడేళ్లుగా మారి గ్రావెల్‌ను మింగేస్తూ.. అందినకాడిని మట్టి బొక్కేశారు. అగ్రిగోల్డ్ బాధితుల ప్రాణాలు ఆరిపోతుంటే.. ఆ సంస్థ భూములు అన్యాయంగా చెరబట్టారు. అక్రమాలపై ప్రశ్నించి జర్నలిస్టుల కలాల కంఠానికి ఉరి బిగించారు. మంత్రి భార్య రాజ్యాంగేతర శక్తిగా మారి ప్రజలను పీడించారు. అన్ని శాఖల అధికారులను గుప్పిట్లో పెట్టుకుని కమీషన్లు దండుకున్నారు. ఇలా ఐదేళ్ల పాలనలో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారు. మొత్తంగా చిలకలూపేట నియోజకవర్గంలో అభివృద్ధికి పాతరేసి.. అవినీతి, అక్రమాలు, అరాచకాల కోటగా మార్చేశారు. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు... ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లిలో అగ్రిగోల్డ్ భూమి ఉంది. గతంలో వెంచర్లు వేసి భూమి అభివృద్ధి చేయటానికి సంస్థ వీటిని కొనుగోలు చేసింది. ఈ భూమి అగ్రిగోల్డ్‌కు చెందిన హాయ్‌ల్యాండ్ డైరెక్టర్ కనుకొల్లు ఉదయదినాకర్ పేరుపై రిజిస్టర్ అయ్యింది. అగ్రి గోల్డ్ భాగస్వామి అయిన ఇతని వద్ద నుంచి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి తేనె వెంకాయమ్మ (ప్రత్తిపాటి వెంకటకుమారి) 2015 జనవరి 19వ తేదీన ఖాతా నంబర్ 525, సర్వే నంబర్లు 104–6, 104–5,104–4,104–3,104–1,103–2ల ప్రకారం మొత్తం 6.19 ఎకరాలను కొనుగోలు చేశారు. తిరిగి గతేడాది ఏప్రిల్ 17వ తేదీ అగ్రి ప్రాజెక్టు సంస్థకు చెందిన బండా శ్రీనివాసబాబు నుంచి సర్వే నంబర్ 101–1లోని 5.44 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అదే రోజు అంటే ఏప్రిల్ 17వ తేదీ మంత్రిప్రగడ విజయ్‌కుమార్ వద్ద నుంచి సర్వే నంబర్లు 104–1,104–2,104–3 ద్వారా 2.60 ఎకరాలు, సర్వే నంబర్ 104–4లో ఉన్న 0.57 ఎకరాలను కొనుగోలు చేశారు. మొత్తం అగ్రిగోల్డ్‌కి చెందిన 14.81 ఎకరాల భూమిని మంత్రి సతీమణి పేరుపై కొనుగోలు చేశారు. ఇలా కొనుగోలు చేసిన మొత్తం భూమిని అదే ఏడాది జూన్ 4వ తేదీన గుంటూరుకు చెందిన కామేపల్లి వెంకటేశ్వరరావుకు, పెదకాకాని మండలం, ఉప్పలపాడుకు చెందిన చెరుకూరి నరసింహారావులకు విక్రయించారు. అగ్రి గోల్డ్ భూమిని రహస్యంగా భాగస్వాములు వేరే వ్యక్తులకు ఎకరా రూ.32 లక్షలకు అమ్మటానికి వ్యవహారం నడిచింది. ఇందుకు సంబంధించిన వేర్వేరు వ్యక్తులతో అగ్రిమెంటు కూడా రాయించుకున్నారు. విషయం తెలిసిన మంత్రి వీరిని బెదిరించి అగ్రిమెంట్లు రద్దు చేయించారు. తాను కేవలం ఎకరాకు రూ.20 లక్షలు మాత్రమే ఇస్తానని చెప్పటంతో గత్యంతరం లేక నష్టానికి మంత్రికి భూములు అమ్మారు. భూములు కొన్న మంత్రి జూన్‌లో ఇవే భూములను ఎకరాకు రూ.52 లక్షలకు విక్రయించారు. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు మంత్రికి లాభంగా దక్కాయి. అక్షరం గొంతు నొక్కి చిలకలూరిపేట పట్టణానికి చెందిన విలేకరి ఎంవీఎన్ శంకర్‌పై(హత్యకు గురైనప్పుడు ఆంధ్రప్రభ ఆర్సీ ఇన్చార్జి) 2014 నవంబర్ 25వ తేదీన తెలుగు యువత పట్టణ మాజీ అధ్యక్షుడు మద్దిబోయిన శివ, మరో ముగ్గురు దాడి చేశారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి మృతి శంకర్ మృతి చెందాడు. తొలుత ఆధారాలు లేవని కేసు మూసివేసేందుకు ప్రయత్నించగా.. జర్నలిస్టు సంఘాలు పోరాటం చేయడంతో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. వీరు కేవలం పాత్రధారులు మాత్రమే. సూత్రధారులను మాత్రం అరెస్టు చేయ లేదు. సీసీఐలో భారీ కుంభకోణం 2014–15 కాలంలో ప్రత్తిపాటి పుల్లారావు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్ యార్డుల ద్వారా ఈ కుంభకోణం జరిగింది. విశాఖపట్టణం నుంచి గుంటూరు వచ్చిన సీబీఐ అధికారుల బృందం సీసీఐ కార్యాలయంలో విచారణ నిర్వహించింది. అప్పట్లో జరిగిన పత్తి కుంభకోణంలో దాదాపు రూ.540 కోట్ల అక్రమాలు చోటు చేసుకున్నాయని విచారణలో వెల్లడైంది. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళలో సీసీఐ రాష్ట్ర వ్యాప్తంగా 43 మార్కెట్ యార్డుల్లో పత్తికొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా రైతుల నుంచి సీసీఐ పత్తి కొనుగోలు చేయాలి. అయితే ముందే రైతుల నుంచి వ్యాపారులు, దళారీలు పత్తి క్వింటాకు రూ. 3 వేలలోపు కొని రూ. 4 వేలు, రూ.4100 చొప్పున సీసీఐకి విక్రయించారు. కొనుగోలు చేసిన పత్తిని మార్కెట్ యార్డులకు తీసుకురాకుండా గ్రామాల నుంచే నేరుగా జిన్నింగ్ మిల్లులకు తరలించారు. ఈ వ్యవహారంలో సీసీఐ బయ్యర్లు, మార్కెటింగ్ శాఖ అధికారులు, వ్యాపారులు, దళారులు కుమ్మక్కై భారీ అవినీతికి పాల్పడ్డారు. గ్రామాల నుంచి వ్యాపారులు నేరుగా కొనుగోలు చేసిన పత్తిని సీసీఐ ద్వారా కొనుగోలు చేసినట్లు రికార్డులు సృష్టించారు. కాటా వేయని పత్తికి కాటా వేసినట్లు చార్జీలు, మార్కెట్ యార్డుల నుంచి సీసీఐ జిన్నింగ్ చేయించే మిల్లులకు పత్తిని తరలించినట్లు రవాణా చార్జీలు ఖర్చు రాసి డబ్బులు దండుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని భారత పత్తి కొనుగోలు సంస్థ (సీసీఐ)లో జరిగిన అవినీతి ప్రభుత్వాన్ని కుదిపేసింది. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావటంతో కంటితుడుపుగా రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించింది. విచారణ అనంతరం 2016 నవంబర్‌లో చిలకలూరిపేట మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి కే నాగవేణి సహా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26 మంది మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేశారు. కప్పం కట్టనిదే ఫైల్ కదలదు చిలకలూరిపేట నియోజకవర్గంలో రెవెన్యూ, మున్సిపల్ ఇలా ఏ కార్యాలయంలో ఫైల్ కదలాలన్నా మేడమ్‌ను కలిసి కప్పం కట్టాల్సిందే. ల్యాండ్ కన్వర్షన్ ఎకరాకు రూ.1 లక్ష వసూలు చేస్తున్నారు. మంచినీటి సరఫరా పేరుతో ఇప్పటి వరకు రూ. 5 కోట్ల వరకు దండుకున్నారు. ఎంత పెద్ద వర్క్ అయినా మూడు, నాలుగు భాగాలుగా విభజించి ఒక్కరికే నామినేషన్ పద్ధతిలో అప్పగిస్తూ భారీగా ముడుపులు తీసుకున్నారు. బాణా సంచా వ్యాపారుల నుంచి ఏటా రూ. కోటి చొప్పున ఇప్పటి వరకు రూ. 5 కోట్లు, పాన్ పరాగ్, గుట్కా హోల్‌సేల్ వ్యాపారుల నుంచి రూ. 3 కోట్లు వసూలు చేశారు. గుంటూరులో కల్తీ కారం తయారీదారులను బెదిరించి రూ. 8 కోట్లు దండుకున్నారు. నకిలీ విత్తనాల కుంభకోణం సైతం వీరి కనుసన్నల్లోనే జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. విత్తనాలను బ్లాక్ చేసి కిలో లక్ష రూపాయలకు అమ్మించారు. అతి ఖరీదైన భూమి కబ్జా చిలకలూరిపేటలోని ఓగేరు వాగు పక్కనే ఉన్న సుమారు ఎకరాల స్థలాన్ని మంత్రి పుల్లారావు అనుచరులు ఆక్రమించి ప్లాట్లు వేసేశారు. 12 ఏళ్ళ క్రితం వాగు నుంచి వరద నీరు పట్టణంలోకి రాకుండా కరకట్టలు నిర్మించారు. ఆ సమయంలో అక్కడ ఎస్టీలు కొందరు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. దీంతో కొంత స్థలాన్ని వదిలేసి కరకట్ట నిర్మించారు. ఇది మంత్రి అనుచరులకు వరంగా మారింది. తమ పూర్వీకుల పేరుతో పట్టాలు ఉన్నట్లుగా సృష్టించి మంత్రి అండదండలతో పూర్ణాసింగ్, మాధవ్‌సింగ్, శంబుసింగ్ అనే వ్యక్తులు ఆక్రమించి ప్లాట్లు వేశారు. సుమారు రూ. 4 కోట్ల విలువ చేసే స్థలం కబ్జాకు గురైంది. మంత్రి కన్నుపడిన యడవల్లి భూముల్లో గ్రానైట్ విలువ : రూ. 3000 కోట్లు పేదల బియ్యం రవాణాలో అక్రమాలు : రూ. 200 కోట్లు ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో గ్రావెల్ దోపిడీ : రూ.500 కోట్లు మున్సిపల్ పనుల్లో మంత్రి భార్య కమీషన్ : రూ.150 కోట్లు పేట కేంద్రంగా సీసీఐ కుంభకోణం : రూ. 540 కోట్లురూ. టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలను అడ్డుపెట్టుకుని దోచుకున్న మొత్తం : 150 కోట్లు అగ్రి గోల్డ్ ఆస్తుల కొనుగోలులో లబ్ధి : సుమారు 5 కోట్లు -
పేటలో కొత్తవారికే అందలం
సాక్షి, చిలకలూరిపేట : చిలకలూరిపేట నియోజకవర్గం 2004 వరకు ఎన్నికల ఫలితాల్లో నూతన విశిష్టత చాటుకునేది. ఇక్కడ ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ కొత్తగా పోటీ చేసే వారికే అనుకూలంగా ఉంటాయి. ఈ నియోజకవర్గానికి తొలిసారి 1952లో ఎన్నికలు జరిగాయి. తొలి సారి పొటీ పడిన ఇద్దరు అభ్యర్థుల్లో సీపీఐ తరఫున పోటీ చేసిన కరణం రంగారావు కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి పి.నాగయ్యపై గెలిచారు. పదేళ్ల పాటు నియోజకవర్గం ప్రకాశం జిల్లా మార్టూరులోకి వెళ్లింది. తిరిగి 1967లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ తొలిసారి పోటీ పడిన ఇద్దరు అభ్యర్థుల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థి కందిమళ్ల బుచ్చయ్య, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నూతి వెంకటేశ్వర్లుపై విజయం సాధించారు. 1972 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రెండోసారి పోటీ చేసిన కందిమళ్ల బుచ్చయ్యపై తొలిసారి రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొబ్బాల సత్యనారాయణ గెలిచారు. 1978లో తొలిసారి పోటీ పడిన ఇద్దరు అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సోమేపల్లి సాంబయ్య, జనతాపార్టీకి చెందిన భీమిరెడ్డి సుబ్బారెడ్డిపై విజయం సాధించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో కొత్తగా రంగంలోకి దిగిన డాక్టర్ కాజా కృష్ణమూర్తి రెండోసారి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సోమేపల్లి సాంబయ్యపై విజయం సాధించారు. 1989 ఎన్నికల్లో టీడీపీ తరఫున కొత్తగా రంగంలోకి దిగిన డాక్టర్ కందిమళ్ల జయమ్మ, కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి సోమేపల్లి సాంబయ్యపై విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సోమేపల్లి సాంబయ్యపై గెలుపొందారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ బలపరిచిన ఇండిపెండింట్ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసిన మర్రిరాజశేఖర్, టీడీపీకి చెందిన ప్రత్తిపాటి పుల్లారావుపై గెలిచారు. ఆ తదుపరి జరిగిన రెండు ఎన్నికల్లో మాత్రమే పాత అభ్యర్థులు పోటీ చేశారు. ప్రస్తుతం 2019లో టీడీపీ తరుఫున ప్రత్తిపాటి పుల్లారావు పోటీ చేస్తుండగా, వైఎస్సార్ సీపీ తరఫున కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విడదల రజని బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మొదటి నుంచి తొలిసారి పోటీ చేసిన అభ్యర్థులకే అండగా నిలుస్తున్న నియోజకవర్గం సెంటిమెంట్ పునరావృతం అవుతుందని, రజనికి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. -
నాయక్ నహీ..ఓ చోర్ హై..
సాక్షి, గుంటూరు : టీడీపీ అభ్యర్థుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. నరసరావు పేట పార్లమెంట్ అభ్యర్థితోపాటు ముగ్గురు అసెంబ్లీ టిక్కెట్లు పొందినవారికీ నేర చరిత్ర ఉంది. ఎంపీ అభ్యర్థి రాయపాటిపై పొగాకు బేళ్లలో చెత్త నింపి విదేశాలకు ఎగుమతి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సత్తెనపల్లి, గురజాల, వినుకొండ, చిలకలూరిపేట, పొన్నూరు, పెదకూరపాడు, బాపట్ల అభ్యర్థులు కోడెల, యరపతినేని, జీవీ, ప్రత్తిపాటి, ధూళిపాళ్ల, కొమ్మాలపాటి, అన్నం సతీష్‌పై ఆరోపణలు ఉన్నాయి. ‘ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం’ అన్న నినాదంతో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అయితే ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పార్టీ నాయకులు ప్రజలను, ప్రభుత్వ ఆస్తులను అడ్డగోలుగా దోచుకుం టున్నారు. ఎంతటి నేరచరిత్ర ఉన్నా, ఎన్ని అక్రమాలకు తెగబడినా రూ.కోట్లకు పడగలెత్తి, పార్టీకి సూట్‌కేసుల్లో రూ.కోట్లు ముట్టజెబితేచాలు టిక్కెట్లు ఖాయమన్న తీరులో ఆ పార్టీ రాజకీయాలు సాగుతున్నాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులే ఇందుకు నిదర్శనమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. హత్య కేసులో జైలుకెళ్లిన యరపతినేని గురజాల సిట్టింగ్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు 1992లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు సంబంధించి గుంటూరు, నల్గొండ జిల్లాల డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. అయితే డిపాజిట్ డబ్బు చెల్లించకుండా భూములు తాకట్టుపెట్టి అప్పు తెచ్చుకున్నారు. రూ.60 లక్షలు వారికి చెల్లించకుండా ఎగనామం పెట్టారు. దీంతో వారు హైదరాబాద్ సిటీ సివిల్‌కోర్టులో దావా వేయగా రూ.1.70 కోట్లకు కోర్టు డిక్రీ ఇచ్చింది. అనంతరం 1999లో యరపతి నేని టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన భూములను జప్తు చేయకుండా తప్పించుకున్నారు. ఇప్పటికీ ఏపీఎస్ఎస్డీసీ ఆ భూములను జప్తు చేసుకోలేకపోయింది. గుంటూరులో స్నేహ చరిత చిట్‌ఫండ్ కంపెనీ స్థాపించి, కస్టమర్లకు కుచ్చు టోపీపెట్టి ఐపీ దాఖలు చేయడంతో అప్పట్లో బాధితులు నరసరావుపేట కోర్టును ఆశ్రయించారు. 2012లో పిడుగురాళ్లలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉన్నం నరేంద్ర హత్యకు గురయ్యారు. ఆ కేసులో యరపతినేని మూడో నిందితుడు. కేసు నుంచి తప్పించుకునేందుకు ఆయన అప్పట్లో అజ్ఞాతంలోకి వెళ్లగా రూరల్ ఎస్పీ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. యరపతినేని హైదరాబాద్‌లో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి 14 రోజులు రిమాండ్‌కు సైతం పంపారు. 2014 సంవత్సరంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక యరపతినేని అక్రమాలకు లైసెన్స్ ఇచ్చినట్లయింది. నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ తెరలేపి అడ్డగోలుగా రూ.వేల కోట్ల విలువజేసే సహజ సంపదను దోచుకున్నారు. పిడుగురాళ్ల మండలం సీతారాంపురం, దాచేపల్లి మండలం కేశానుపల్లి, నడికుడి ప్రాంతాల్లో ఎమ్మెల్యే కనుసన్నల్లో నడిచిన మైనింగ్ మాఫియా నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) రిపోర్ట్ ప్రకారం 2017 జనవరి నాటికి 68.53 లక్షల టన్నుల తెల్లరాయిని అమ్ముకుంది. 2017 జనవరి నుంచి 2018 జూలై 25వ తేదీ హైకోర్టు అక్రమ మైనింగ్ నిలిపివేసే నాటి వరకూ మరో 30 లక్షల టన్నుల సున్నపు రాయిని దోచేశారని నిపుణులు లెక్కతేల్చారు. డెయిరీ ఆస్తులు కబ్జా చేసిన ధూళిపాళ్ల పొన్నూరు నుంచి టీడీపీ తరఫున బరిలో నిలుస్తున్న ధూళిపాళ్ల నరేంద్ర రూ.వేల కోట్ల విలువ చేసే సంఘం డెయిరీ ఆస్తులను హస్తగతం చేసుకుని, ఏకంగా డెయిరీ స్థలంలో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పేరున ఆసుపత్రి నిర్మించారనే ఆరోపణలున్నాయి. పెదకాకాని, ఇతర ప్రాంతాల్లో పోరంబోకు భూములను కాజేసిన చరిత్ర ఆయన సొంతం. నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ నిర్వహిస్తూ, రాజధాని ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేపట్టి రూ.కోట్లతో జేబులు నింపుకొన్నారని, భూకబ్జాలకు సైతం పాల్పడ్డారనే విమర్శలున్నాయి ఆయన అవినీతి అక్రమాలను ప్రశ్నించినవారిపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీల్లో పెట్టించి నరేంద్ర వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో నివసిస్తున్న చేబ్రోలుకు చెందిన పెమ్మసాని శ్రీధర్‌కు స్వగ్రామంలో 2014లో వాసిరెడ్డి రాజశేఖర్ నుంచి 803 గజాల స్థలం కొన్నారు. వాసిరెడ్డి రాజశేఖర్ బాబాయ్ వాసిరెడ్డి శంకర్రావు, అతని కుమారుడు వాసిరెడ్డి వంశీ ఆ స్థలంలోకి వెళ్లకుండా శ్రీధర్‌ను అడ్డుకుంటున్నారు. ఈ విషయమై శ్రీధర్ చేబ్రోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. ఇటీవల శ్రీధర్‌పై శంకర్రావు కుటుంబ సభ్యులు కత్తితో దాడి చేసి గాయపరిచారు. అయినా కేసు నమోదు చేసి శంకర్రావు కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోలేదు. ఇందుకు కారణం శంకర్రావు సమీప బంధువు ధూళిపాళ్ల నరేంద్ర వద్ద న్యాయవాదిగా పనిచేయడమే. ఆయనకు తన స్థలాన్ని కట్టబెట్టాలని ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని శ్రీధర్ ఆరోపిస్తున్నారు. న్యాయం చేయమని పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా చేబ్రోలు సీఐ తనపైనే దాడికి పాల్పడ్డాని శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయమై బాధితుడు ఎస్పీకి సైతం ఫిర్యాదు చేశాడు. రాయపాటిపై ఎన్ని ఆరోపణలో.. తాజామాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఆరోపణలు అన్నీ ఇన్నికావు. గతంలో పొగాకు రైతులకు డబ్బు ఎగ్గొ ట్టారని, పొగాకు బేళ్లలో చెత్తను కుక్కి ఇతరదేశాలకు ఎగుమతి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో ఇరుక్కున్న రాయపాటిని అప్పట్లో ఇందిరాగాంధీ కాపాడారనే పుకార్లు ఇప్పటికీ షికార్లు చేస్తున్నాయి. చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేశారంటూ ఓ బాధితుడు నాంపల్లి కోర్టును ఆశ్రయించగా కోర్టు రాయపాటికి మొట్టికాయలు వేసిన విషయం తెలిసిందే. 2014లో రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌పార్టీ పూర్తిగా దెబ్బతిన్నదని గ్రహించి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఆ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న మోదుగుల వేణుగోపాలరెడ్డిని పక్కనపెట్టి రాయపాటికి నరసరావుపేట పార్లమెంట్ టిక్కెట్ ఇచ్చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచిన రాయపాటి నియోజకవర్గంలోని ప్రజలకు ఎన్నడూ అందుబాటులో ఉన్న దాఖలాలు లేవు. నాగార్జున సాగర్‌కు పక్కనే ఉన్న భూములకు సైతం చుక్క నీరందక రైతులు విలవిల్లాడుతున్నా రాయపాటి అటువైపు తొంగి చూడలేదు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన రాయపాటికి రెండో సారి టీడీపీ టిక్కెట్ కేటాయించడంపై ప్రజలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. కోడెల హయాంలో అరాచకాలు సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు హోంమంత్రిగా ఉన్న సమయంలో దివంగత కాపు నాయకుడు వంగవీటి మోహనరంగ హత్య జరిగింది. ఆ హత్యలో మంత్రి కోడెల హస్తం ఉందని అప్పట్లో తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించారు. 1999 ఎన్నికల సమయంలో కోడెల ఇంటిలో బాంబులు పేలి అతని అనుచరులు నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మంత్రి పదవి కోసం తాను వెళ్తున్న దారిలో తానే బాంబులు పెట్టించుని, వాటిని దూరంగా పేల్చడం వంటివి కూడా చేశారనే విమర్శలూ ఉన్నాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కోడెల కుటుంబ సభ్యులు చెలరేగిపోయారు. భూ కబ్జాలు, కే ట్యాక్స్ పేరుతో కాంట్రాక్టర్లు నుంచి సామాన్యుడి వరకూ ప్రతి ఒక్కరి రక్తాన్ని జలగాల్లా తాగారు. మరో సారి సత్తెనపల్లి సీటు కోడెలకు ప్రకటించడంతో ఆయన గెలుపొందితే మా మనుగడ కష్టాంగా మారుతుందని ఆ పార్టీ నాయకులే రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారంటే అక్కడ పరిస్థితి ఎంటో అర్థం చేసుకోవచ్చు. బ్యాంకులను బురిడీ కొట్టించిన అన్నం సతీష్ బాపట్ల టీడీపీ అభ్యర్థి అన్నం సతీష్ ప్రభాకర్‌పై ప్రభుత్వ భూములు తనఖా పెట్టి లోన్లు తీసుకుని బ్యాంకులను బురిడీ కొట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం యాజిలి గ్రామంలోని ప్రభుత్వ భూములను తనఖా పెట్టి ఎస్బీఐ నుంచి సతీష్‌ప్రభాకర్ తన కంపెనీ అయిన సతీష్ మెరైన్ ఎగ్గిమ్ ప్రైవేటు లిమిటెడ్ పేరున లోను తీసుకున్నారు. యాజిలి గ్రామంలో 11.66 ఎకరాల ప్రభుత్వ భూమికి 1బీ భూ యాజమాన్య హక్కు నిర్ధారించే పత్రం తయారు చేసుకుని ఆయన బ్యాంకులను బురిడీ కొట్టించారు. హత్య కేసులో ముందస్తు బెయిల్ పొందిన జీవీ ఆంజనేయులు వినుకొండ తాజామాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు సైతం 2004లో ఓ హత్య కేసులో నిందితునిగా ఉండి అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ పొందారు. ఆ తరువాత రాజీ కుదుర్చుకుని కేసు కొట్టివేయించుకున్నారని చెబుతుంటారు. ఈ హత్య కేసులో మరో నిందితుడు కామేశ్వరరావును ఆ తరువాత పోలీసులు ఎన్కౌంటర్ కూడా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఐదేళ్ల టీడీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని రేషన్ మాఫియాను పెంచి పోషించారనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. నకిలీ బయో ఉత్పత్తుల్లో జీవీ కంపెనీలపై రెండు తెలుగురాష్ట్రాలు సహా, ఇతర రాష్ట్రాల్లో సైతం కేసులు నమోదయ్యాయి. అమాయకులైన గుమాస్తాలు కేసుల్లో ఇరుక్కున్ని నేటికీ అవస్థలు పడుతున్నారు. దోచుకోవడంలో ఘనాపాటి.. ప్రత్తిపాటి అడ్డోగోలుగా దోచుకోవడంలో తాజా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఘనాపాటి అన్న ఆరోపణలు ఉన్నాయి. 2014–15 కాలంలో ప్రత్తిపాటి పుల్లారావు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్ యార్డుల ద్వారా చిలకలూరిపేట మండలంలోని యడవల్లి భూ కుంభకోణానికి పాల్పడి భారీగా దోచుకున్నారనే ఆరోపణలున్నాయి. పత్తి కుంభకోణంలో దాదాపు రూ.450 కోట్లు వెనకేసుకున్నారనే విమర్శలు విచారణలో వెలుగుచూశాయి. నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు, అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు, రేషన్ బియ్యం అక్రమ రవాణా వంటి అనేక కార్యకలాపాలు ప్రత్తిపాటి కనుసన్నల్లో కొనసాగి రూ.వేల కోట్లు దోచుకున్నారని విమర్శలున్నాయి. చిలకలూరిపేట పట్టణానికి చెందిన విలేకరి ఎం.వి.ఎన్.శంకర్ పై 2014 నవంబర్ 25వ తేదీన ప్రత్తిపాటి అనుచరుడైన వెంగళరాయుడు, తెలుగుయువత పట్టణ మాజీ అధ్యక్షుడు మరో ఇద్దరు దాడి చేసి తీవ్రంగా గాయపరి చారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి శంకర్ మృతి చెందాడు. యడ్లపాడుకు చెందిన మానుకొండ సురేంద్రనాథ్ ఆత్మహత్య వెనుక ప్రత్తిపాటి హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. -
పేపర్లు బల్లకేసి కొట్టిన డిప్యూటీ సీఎం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అసైన్డ్ కమిటీల విషయమై సోమవారం ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని టార్గెట్ చేశారు. అసైన్డ్ కమిటీల ఏర్పాటుపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో అసలు అసైన్మెంట్ కమిటీలు ఉన్నాయా లేదా అని ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు నిలదీశారు. ఎమ్మెల్యే చైర్మన్‌గా ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటుచేసే అసైన్డ్ కమిటీల గురించి సమాచారం కోరారు. ఎమ్మెల్యేల తీరుపై డిప్యూటీ సీఎం కేఈ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసైన్డ్ కమిటీలపై సమాచారం తెప్పించుకుంటామని తెలిపారు. అసైన్మెంట్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయో లేదా రిపోర్ట్ తెప్పించుకుంటామని ఆయన అన్నారు. అసైన్డ్ కమిటీలపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలపై మంత్రి కేఈ అసహనం వ్యక్తం చేస్తూ.. తన చేతిలో ఉన్న పేపర్లను బల్లకేసి కొట్టారు. సీఎందే బాధ్యత! అనంతరం డిప్యూటీ సీఎం కేఈ మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. అసైన్డ్ కమిటీల బాధ్యత సీఎందేనని అన్నారు. ‘ నన్ను ప్రశ్నిస్తే నేనేం సమాధానం చెప్తాను. ఎమ్మెల్యేలు నన్ను కాదు.. సీఎంను అడగాలి’ అని కేఈ అన్నారు. రేషన్ షాప్‌ల్లో వేలిముద్రలు..! రేషన్‌షాపుల్లో లబ్ధిదారుల వేలిముద్రల విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సభ దృష్టికి తెచ్చారు. బయోమెట్రిక్ మెషిన్లలో వేలిముద్రలు రాకపోవడంతో వృద్ధులు, లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయంలో మంత్రులు అసత్యాలు చెపుతున్నారని బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆయన వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రులు అంటూ అందరికీ ఆపాదించడం సరికాదని, విష్ణుకుమార్ రాజు తన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని యనమల కోరారు. తన ఉద్దేశం అది కాదన్న విష్ణుకుమార్ రాజు.. స్పీకర్ సూచన మేరకు మంత్రులు అబద్ధాలు చెప్తున్నారన్న వ్యాఖ్యలను వెనుకకు తీసుకున్నారు. బయో మెట్రిక్ మెషిన్లలో వేలిముద్రలు గుర్తించకపోవడంతో రేషన్ ఆగిపోయే పరిస్థితి లబ్ధిదారులకు రానివ్వబోమని పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. వెలిముద్రల సమస్యలు ఉన్న చోట వెంటనే స్పందిస్తున్నామని చెప్పారు. మూడు3 నెలలు వరుసగా రేషన్ తీసుకోకపోయిన కార్డ్ రద్దు కాదని చెప్పారు. అవస్తవాలు చెప్పాల్సిన అవసరం మంత్రులకు లేదని, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురాబోమని ఆయన అన్నారు. -
నేను చెప్పిందే చేయాలి.. మీ రూల్ నడవదు
చిలకలూరిపేటటౌన్ : ‘‘ఏమయ్యా ఆర్డీవో..నేను చెప్పింది చేయండి.. మీ ఇష్టమొచ్చినట్లు కాదు.. ఇక్కడ మీ రూల్స్ నడవవు.. రూల్ ప్రకారం చేయాలంటే దేశంలో ఏవీ జరగవు. రూల్స్ గురించి నా దగ్గర ఎక్కువగా మాట్లాడొద్దు..అలా చేస్తే నువ్వు సమాధానం చెప్పుకోలేనన్ని ప్రశ్నలు అడుగుతా’’ అంటూ పౌర సరఫరాలశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నరసరావుపేట ఆర్డీవో జి.రవీందర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని స్థానిక ప్రత్తిపాటి గార్డెన్స్‌లో సోమవారం ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల మండలాలకు చెం దిన అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో అధికారులపై రెచ్చిపోయారు. ఏం చెప్పినా చేయడంలేదని అనేక ఫిర్యాదులు చేశారు. స్పందించిన మంత్రి ఆన్లైన్ నమోదు నుంచి పొజిషన్ సర్టిఫికెట్ల మంజూరు వరకు ఏ చిన్న పని కూడా ఎందుకు చేయడం లేదని అధికారులను ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధమైన పనులు తాము చేయడం లేదని అధికారులు జవాబు చెప్పడంతో మంత్రి పైవిధంగా విరుచుకుపడ్డారు. ఫిర్యాదులు ఇలా.. ఇళ్లు మంజూరు అయినా పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని యడ్లపాడు మండల అధికార పార్టీ నేతలు అధికారులపై మంత్రికి ఫిర్యాదు చేశారు. సీఎం చెప్పినా మీరింకా ఎందుకు ఆలోచిస్తున్నారు అని మంత్రి ఆర్డీవోని ప్రశ్నించారు. ఉత్తర్వులు తమకు అందలేదని జవాబిచ్చారు. అదేం కుదరదు, ఇళ్లు మంజూరు అయిన వాళ్లకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందే అని ఆదేశించారు. ఒక టీడీపీ నేత అందరి ముందు మహిళా అధికారిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు. వేలు చూపిస్తూ బెదిరించాడు. దీనిపై అందరూ ఆశ్చర్యపోయారు. స్పందించిన పుల్లారావు జనాలను ఏడిపించడం మీకు బాగా అలవాటైపోయింది, రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి తీరుతాం
– రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కళ్యాణదుర్గం : అనంతపురం జిల్లాలో ఈ ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి తీరుతామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. గురువారం పుల్లారావుతో పాటు మంత్రి పల్లె రఘనాథరెడ్డి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వ్యవసాయ మార్కెట్‌యార్డులో రూ.90 లక్షలతో గోదాము, రూ.50 లక్షలతో రైపనింగ్ చాంబర్, కేవీకే సమీపంలో రూ.60 లక్షలతో నిర్మించిన రైతు శిక్షణ కేంద్రంæప్రారంభోత్సవానికి హాజరయారు. స్థానిక ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి మట్లాడుతూ అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాగా అనంతపురం ఉందన్నారు. ఈ జిల్లాపై సీఎం చంద్రబాబుకు ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. పంట నష్టపోయిన రైతులకు రెయిన్గన్ల పేరుతో ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందంటూ ప్రతిపక్షం చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. రెయిన్గన్లు ఆలస్యంగా ఏర్పాటు చేయడానికి వైఎస్సార్సీపీనే కారణమని ఆరోపించారు. రైతులు అధైర్యపడాల్సిన పనిలేదని, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటామని చెప్పారు. గతేడాది కూడా జిల్లాకు రూ.547 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగు నీరు ఇవ్వాలనేదే సీఎం లక్ష్యమన్నారు. ఇందులో భాగంగానే నదుల అనుసంధానం చేస్తున్నామన్నారు. అనంతరం రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ రైతులకు రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సీఎం కుటుంబం ఆస్తులను ప్రకటించి దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని, వైఎస్ జగన్ కూడా కుటుంబ ఆస్తులు ప్రకటించాలని అన్నారు. -
రైతు కంట ‘తడి’
– ఆదుకోని రెయిన్గన్లు – నీళ్లు, కరెంటు లేక ముందుకు సాగని రక్షకతడులు – మూడు రోజుల్లో 4 వేల హెక్టార్లను కూడా తడపని వైనం – ప్రమాదంలో పడిన 3.50 లక్షల హెక్టార్ల వేరుశనగ పంట – నేడు జిల్లాకు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఖరీఫ్‌లో ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా రక్షకతడులు (లైఫ్ సేవింగ్ ఇరిగేషన్స్) ఇచ్చి పంటను కాపాడుతామంటూ పాలకులు, అధికారులు ఆర్భాటంగా ప్రకటించినా క్షేత్రస్థాయిలో పది శాతం కూడా ఫలితం కనిపించడం లేదు. 20 రోజులైనా వాన చినుకు నేలకు పడకపోవడం, ఎండలు ముదిరిపోవడం, గాలిలో తేమశాతం తగ్గిపోవడంతో ‘అనంత’లో అప్పుడే కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. పంటకు నీరందించలేకపోతుండటంతో రైతులు కంట తడి పెడుతున్నాడు. జిల్లాకు 4,200 సెట్ల చొప్పున రెయిన్గన్లు, స్ప్రింక్లర్ యూనిట్లు, డీజిల్ ఇంజిన్లు, అలాగే 1.30 లక్షల సంఖ్యలో హెచ్డీ పైపులు కేటాయించగా.. అందులో 3,107 సెట్ల రెయిన్గన్లు, 2,827 సెట్ల స్ప్రింక్లర్ యూనిట్లు, 1,626 డీజిల్ ఇంజిన్లు, 1.07 లక్షల హెచ్డీ పైపులు సరఫరా అయ్యాయి. వీటి ద్వారా ఈ నెల 18 నుంచి వేరుశనగ పంటకు రక్షకతడులు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైంది. కానీ... అనుకున్న ఫలితాలు కనిపించకపోవడంతో రైతుల్లో రోజురోజుకు ఆందోళన ఎక్కువవుతోంది. నీళ్లు, కరెంటు సమస్య వర్షాలు లేక పంట కుంటలు, ఫారంపాండ్లు పూర్తిగా ఎండిపోవడం, భూగర్భజలాలు సగటున 19 మీటర్ల లోతుకు పడిపోవడంతో నీటి వనరుల లభ్యత సమస్యగా మారుతోంది. దానికి తోడు విద్యుత్ సరఫరా కూడా పగటి పూట మూడు నుంచి నాలుగు గంటల పాటు మాత్రమే ఉండటంతో ఆ సమయంలో ఒక్కో రెయిన్‌గన్ ద్వారా ఒక ఎకరా పొలాన్ని కూడా తడుపుకోలేని పరిస్థితి నెలకొంది. రెయిన్గన్లను కూడా పూర్తిస్థాయిలో వాడని పరిస్థితి. అందులోనూ కొన్ని మండలాల్లో తెలుగు తమ్ముళ్లు తమకే రెయిన్గన్లు ఇవ్వాలని అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. దీంతో పంట ఎండినా కూడా కొందరు రైతులకు రెయిన్గన్ల ద్వారా నీటి తడులు ఇవ్వడానికి అధికారులు వెనుకాడుతున్నారు. 3.50 లక్షల హెక్టార్ల పంట వర్షాభావం వెంటాతుండటం, రెయిన్గన్ల ద్వారా ఫలితం కనిపించకపోవడంతో 3.50 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ పంట ప్రమాదంలో పడింది. అధికారులు రూపొందించిన ప్రత్యేకయాప్లో 10 వేల హెక్టార్లలో పంట పూర్తిగా ఎండిపోయినట్లు గుర్తించారు. వాస్తవానికి 3.50 లక్షల హెక్టార్ల పంట కూడా దెబ్బతినే పరిస్థితిలో ఉంది. కానీ... గత మూడు రోజులుగా రెయిన్గన్ల ద్వారా కేవలం 4 వేల హెక్టార్లకు కూడా నీటి తడులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వమే నీటి వనరులను అందుబాటులోకి తెస్తే రెయిన్గన్లు, స్ప్రింక్లర్లు, డీజిల్ ఇంజిన్లు, పైపులైన్ల ద్వారా కొంతవరకైనా పంటను కాపాడుకునే వీలుంది. అలా కాకుండా అన్నీ రైతులే చూసుకుంటే రెయిన్గన్లు ఇస్తామంటే రోజుకు 2 వేల హెక్టార్లు కూడా తడపడం కష్టంగానే కనిపిస్తోంది. నేడు జిల్లాకు మంత్రి ప్రత్తిపాటి రెయిన్గన్ల ద్వారా వేరుశనగ పంటకు ఇస్తున్న రక్షకతడుల పరిశీలనకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం జిల్లాలో పర్యటిస్తున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. గోరంట్ల, పుట్టపర్తి, ధర్మవరం, రాప్తాడు ప్రాంతాల్లో ఆయన పర్యటన ఉంటుందంటున్నారు. ప్రత్తిపాటి రాకతోనైనా వేరుశనగ రైతులకు కనీస ప్రయోజనం కలుగుతుందా లేదా అనేది వేచిచూడాలి. -
రేపు రాష్ట్ర మంత్రుల రాక
చెన్నేకొత్తపల్లి : వర్షాభావం కారణంగా ఎండుతున్న వేరుశనగ పంటకు రెయిన్గన్ల ద్వారా అందిస్తున్న రక్షక తడులను పరిశీలించేందుకు మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత ఆదివారం చెన్నేకొత్తపల్లిలో పర్యటించనున్నారు. ఈ మేరకు మండల వ్యవసాయాధికారి ఎల్లప్ప, ఎమ్పీపీ అమరేంద్ర తెలిపారు. ఇందుకోసం వేరుశనగ పొలాన్ని ఎంపీపీతో పాటు ఏఓ, తహశీల్దార్ నాగరాజు పరిశీలించి ఎంపిక చేశారు. -
ఒక్క ఎకరా పంట కూడా ఎండరాదు
అనంతపురం అగ్రికల్చర్ : వర్షాభావం నెలకొన్న ప్రస్తుత తరుణంలో పంట పొలాలకు రక్షక తడులు అందివ్వాలని, ఎక్కడేగాని ఒక్క ఎకరా పంట కూడా ఎండి పోకుండా చర్యలు చేపట్టాలంటూ వ్యవసాయాధికారులకు రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశించారు. వ్యవసాయశాఖ అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టి.విజయకుమార్, డైరెక్టర్ ధనుంజయరెడ్డితో కలిసి ఆయన సమీక్షించారు. గురువారం రాత్రి వారు అమరావతి నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానంగా ఖరీఫ్ పంటల వారీగా సాగు విస్తీర్ణం, ప్రత్యామ్నాయ పంటలు, చిరుధాన్యపు పంటల విస్తీర్ణం పెంపు, వర్షపాతం, పంటల స్థితిగతులు, ఈ–క్రాప్ బుకింగ్, ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనా, భూసార పరీక్షా ఫలితాల పత్రాలు పంపిణీ, యాంత్రీకరణ పథకం గురించి ప్రగతి వివరాలు తెలుసుకున్నారు. అందులోనూ పంట సంజీవిని కింద వేరుశనగ పంట ఎండిపోకుండా రెయిన్గన్ల ద్వారా రక్షకతడుల ప్రణాళిక గురించి ఆరాతీశారు. ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా పంటను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేడీఏ పీవీ శ్రీరామమూర్తితో పాటు డీడీఏలు, ఏడీఏలు, ఏవోలు హాజరయ్యారు. -
‘రబీలో రైతులకు రెయిన్ గన్స్ ఇస్తాం’
విజయవాడ: రబీ పంట వేసిన రైతులకు రెయిన్ గన్స్ అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. నీటి వసతి ఉన్న రైతులకు మాత్రమే రెయిన్ గన్స్ అందిస్తామని స్పష్టం చేశారు. తమ శాఖలో ఇప్పటికే 1500 గన్స్ సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అవసరమున్న రైతులు ఏఓ, ఎంపీఈఓల దగ్గర దరఖాస్తులు చేసుకోవాలని రైతులకు సూచించారు. 250 గన్స్‌లను ఇప్పటికే జిల్లాలోకి పంపించామని మంత్రి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీతో రెయిన్ గన్స్ అందిస్తామని ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. -
మంత్రి పుల్లారావుపై డొక్కా ఫైర్
గుంటూరు : గుంటూరు జిల్లాలో అధికార టీడీపీ నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఫైర్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణ విషయంపై మంత్రి పుల్లరావు వ్యాఖ్యలు సరికావని, పుల్లారావుతో సహా మంత్రులు ఎవరైనా అవగాహన లేకుండా మాట్లాడటం మంచిది కాదని చెప్పారు. మంత్రి పుల్లారావు తాను నిర్వహిస్తున్న వ్యవసాయ శాఖపై పూర్తి స్థాయిలో దృష్టిపెడితే మంచిదని సూచించారు. సున్నితమైన అంశాన్ని మాటల ద్వారా జటిలం చేయడం సరికాదని హితవు పలికారు. మాదిగలకు మంద కృష్ణనే నాయకుడని, మందకృష్ణ నాయకత్వానికి పుల్లారావు సర్టిఫికెట్ అవసరం లేదని అన్నారు. ఎస్పీ వర్గీకరణ అంశంపై ఆదివారం మంద కృష్ణ సహా మాదిగ నేతలతో సమావేశమవుతానని చెప్పారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని డొక్కా తెలిపారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్నవారిలో ఏపీ మంత్రులు మృణాళిని, ప్రత్తిపాటి పుల్లారావు, అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్సీలు ప్రతిభా భారతి, రాజేంద్రప్రసాద్, ఎంపీ కొనకళ్ల, నారాయణ, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, బొండా ఉమ ఉన్నారు. అదేవిధంగా మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామిని దర్వించుకున్నారు. అనంతరం ఆలయం అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు -
ఆ రైతులకు ఇచ్చేది లక్షన్నరే: ప్రత్తిపాటి
హైదరాబాద్: రైతుల ఆత్మహత్యల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోమారు మాటతప్పింది. కరువు జిల్లాగా పేరొందిన అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఇచ్చే పరిహారంలో భారీగా కోత విధించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలదీసినపుడు.. రూ.5లక్షలు ఇస్తామని వ్యవసాయమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, జిల్లాలోని 33 మంది రైతులకు రూ.లక్షన్నర మాత్రమే పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ప్రత్తిపాటి పుల్లారావు తాజాగా మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19 ముందు మరణించినందున ఐదు లక్షల ప్యాకేజీ వర్తించదని మంత్రి చెప్పారు. వారంతా 2013 - 14 మధ్య చనిపోయిన వారు.. కానీ, అసెంబ్లీలో అధికారులు సరైన సమాచారం అందించలేదని.. అందుకే అలా ప్రకటించాల్సి వచ్చిందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. -
'రైతులూ.. ఆందోళన చెందవద్దు..'
విజయవాడ: నూతన రాజధాని ప్రాంతంలోని రైతులు గ్రామకంఠాలపై ఆందోళన చెందవద్దని మంత్రి నారాయణ అన్నారు. శనివారం ఆయన ఇక్కడ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. భూసేకరణ జరిగే గ్రామాలను మరోసారి పరిశీలించి వాటికి ఆనుకుని ఉన్న నిర్మాణాలపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో శనివారం జరిగే సమావేశంలో రెండు రాష్ట్రాలకు చెందిన కమిటీలు, కేంద్రకమిటీలపై చర్చిస్తామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రానున్న ఐదేళ్లలో ఖర్చు చేయాల్సిన రూ.65వేల కోట్లపై సమీక్షిస్తామని మంత్రి పుల్లారావు తెలిపారు. -
చెరువులు ఆక్రమిస్తే కఠినచర్యలు
తిరుపతి : చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని చిన్నగొట్టిగల్లు చెరువును వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గురువారం పరిశీలించారు. ఈ చెరువు భూములు ఆక్రమణకు గురయ్యాయని ఆరోపణలు రావడంతో గతంలో అధికారులు చెరువు వద్దకు వెళ్లగా వారిపై ఆక్రమణ దారులు దాడికి దిగారు. ఈ నేపధ్యంలో మంత్రి గురువారం చెరువును పరిశీలించి ఆక్రమణల దారులపై చర్యలు తీసుకుని చెరువుకు సంబంధించిన భూములు స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ చెరువు కింద 400 ఎకరాల ఆయకట్టు ఉందని, తలకోన సప్లయ్ ఛానల్ నుంచి నీటిని చెరువుకు మళ్లించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మంత్రి వెంట ఎమ్మెల్సీలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, గౌనివారి శ్రీనివాసులు, నీటిపారుదల అధికారులు ఉన్నారు. -
'ఉల్లి ధరలు తగ్గించే ప్రయత్నం చేస్తాం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉల్లి ధరలు తగ్గించే ప్రయత్నం చేస్తామని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కర్నూలు, మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయలు దిగుమతి చేసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. త్వరలోనే ఉల్లిపాయలు, కందిపప్పుకు మద్దతు ధర ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో ఉల్లి ఉత్పత్తి తగ్గడం వల్లనే ధర పెరిగిందని.. ఉల్లి ఉత్తత్తులు పెంచేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా.. రైతు బజార్‌తో పాటు.. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కూడా ఉల్లి కౌంటర్లు ఏర్పాటు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఇప్పటికే సబ్సిడీతో రూ.20కే మార్కెట్లలో అమ్ముతున్నామని ఆమె అన్నారు. ఉల్లిపాయల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.10 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఉల్లి ధరలు తగ్గేంత వరకు ఎంతైనా కొనుగోలు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పరిటాల సునీత అన్నారు.