టీడీపీ  విధ్వంస కాండ | TDP Leaders Attacked YSR Congress Party Polling Agents | Sakshi
Sakshi News home page

టీడీపీ  విధ్వంస కాండ

Published Fri, Apr 12 2019 8:20 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

TDP Leaders Attacked  YSR Congress Party Polling Agents - Sakshi

సాక్షి, గుంటూరు : ఐదేళ్ల టీడీపీ అరాచక పాలనతో విసిగి వేసారిన ప్రజలు గురువారం పోలింగ్‌ బూత్‌లకు పోటెత్తారు. పోలింగ్‌ శాతం తగ్గించేందుకు టీడీపీ నాయకులు ఎంతగా ప్రయత్నించినా ప్రజలు వెనకడుగు వేయలేదు. ఓటమి తప్పదన్న ఉక్రోషంతో  టీడీపీ నాయకులు విధ్వంస కాండకు తెగబడ్డారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోలింగ్‌ ఏజెంట్లపై దాడులకు తెగబడ్డారు.

నరసరావుపేటలో ఏకంగా కిడ్నాప్‌ చేశారు. అడ్డుకోబోయిన ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డిపై దాడిచేసి గాయపరిచారు. వైఎస్సార్‌ సీపీకి ఓట్లు వేస్తారా అంటూ గురజాలలో ముస్లింల ఇళ్లపై రాళ్లు రువ్వి, మహిళలు, వృద్ధులపై దాడులకు తెగబడ్డారు. సుమారు 500 మంది కర్రలు, కత్తులతో సీఐ సమక్షంలోనే మూడు గంటలపాటు వీరంగం సృష్టించి వైఎస్సార్‌సీపీ నేతల కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, సినిమా హాళ్లను ధ్వంసం చేశారు. 

ఓటమి భయంతో టీడీపీ నాయకులు జిల్లాలో విధ్వంసాలకు తెగబడ్డారు. ప్రశాం తంగా ఉన్న పల్నాడులో సార్వత్రిక ఎన్నికల పోలిం గ్‌ సాక్షిగా టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడా ్డరు. పౌరులు ఓటు హక్కు వినియోగించుకోకుండా భ యభ్రాంతులకు గురిచేశారు. వైఎస్సార్‌ సీపీ ఏజెం ట్లపై దాడులకు తెగబడ్డారు. యథేచ్ఛగా ఓట్లను సైక్లింగ్‌ చేశారు. ఈ అరాచకాలను అడ్డుకున్న వైఎ స్సార్‌ సీపీ నాయకులపై వేటకొడవళ్లతో దాడులకు దిగారు. జిల్లాలో గురువారం పోలింగ్‌ సందర్భంగా టీడీపీ నాయకులు రావాణ కాష్టాన్ని రగిల్చారు.  

గురజాలలో అరాచకం 
గురజాల టౌన్‌లోని 29వ పోలింగ్‌ బూత్‌లో ముస్లింలను ఓటు వేయడానికి రాకుండా అడ్డుకుని, ఓటు వేయడానికి వచ్చిన ముస్లిం యువలకుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. అయినా ముస్లిం బెదరకుండా ఓట్లు వేశారు. ముస్లింలు వైఎస్సార్‌ సీపీకి ఓట్లు వేశారని అక్కసుతో పోలింగ్‌ అనంతరం టీడీపీ నాయకులు ముస్లింల ఇళ్లు, షాప్‌లపై దాడులు చేసి ధ్వంసం చేశారు.

ఈ సమాచారం తెలిసిన జంగమహేశ్వరపురం, గురజాల టౌన్‌ వైఎస్సార్‌ సీపీ నాయకులు ముస్లింలకు అండగా వెళ్లగా వారి పైనా టీడీపీ నాయకులు దాడులకు దిగారు. రాళ్లు రువ్వుతూ, కర్రలు, రాడ్డులతో విచక్షణ రహితంగా దాడులు చేశారు. అయితే వైఎస్సార్‌ సీపీ నాయకులు ప్రతిఘటించారు. తాము తక్కువ మంది ఉండటంతో కొద్దిసేపు వెనక్కు తగ్గిన టీడీపీ నాయకులు వైఎస్సార్‌ సీపీ నాయకులు టౌన్‌ నుంచి వెళ్లి పోయిన తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లోని తమ వర్గీయులందరినీ కూడగట్టుకుని విధ్వంసానికి దిగారు.

వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లు, పార్టీ నాయకుడు యెనుముల మురళీధర్‌రెడ్డి కేబుల్‌ కార్యాలయాన్ని, శ్రీనివాసరెడ్డికి చెందిన సత్యనారాయణ ఐనాక్స్‌ సినిమాహాల్, కారులను ధ్వంసం చేశారు. ఇదంతా గురజాల టౌన్‌ సీఐ రామారావు కనుసన్నల్లో సాగింది. గురజాలలో తమ షాప్‌లు, కార్యాయాలను ధ్వంసం చేస్తున్న విషయాన్ని తెలుసుకుని అక్కడకు బయల్దేరిన జంగమహేశ్వర పురం గ్రామస్తులను మార్గ మధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. 

నరసరావుపేటలో గోపిరెడ్డిపై దాడి..
నరసరావుపేట వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై టీడీపీ నాయకులు యలమంద గ్రామంలో దాడికి దిగారు. యలమంద గ్రామంలోని పోలింగ్‌ కేంద్రానికి ఏజెంట్లతో వెళ్తున్న గోపిరెడ్డిని అడ్డుకున్న టీడీపీ వర్గీయులు ఆయన కారు అద్దాలను ధ్వంసం చేసి ఆయన్ను గాయపరిచారు. వైఎస్సార్‌ సీపీకి చెందిన ఆరుగురు ఏంజెంట్లను పోలింగ్‌ బూత్‌ల నుంచి బయటకు లాక్కొచ్చి దాడి చేశారు.

పోలింగ్‌ ఏజెంట్లు బోయపాటి నరసింహారావు, గార్లపాటి అంజయ్య, ముప్పాళ్ల నాగరాజును కిడ్నాప్‌ చేసి, మధ్యాహ్నం వరకూ బంధించి వేధింపులకు గురిచేశారు. ఇంత జరుగుతున్నా పట్టిం చుకోని పోలీసులు వైఎ స్సార్‌ సీపీ నాయకులపై జులుం చూపించారు. శ్రీనివాస గిరిజన కాలనీ లోని ఓటర్లను పోలింగ్‌ బూత్‌లోకి రాకుండా బూత్‌ను ఆక్రమించిన టీడీపీ వర్గీయులను నిలదీసిన వైఎస్సార్‌ సీపీ నాయకులపై  ఎస్‌ఐ షఫీ దాడికి దిగి యువకులను తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఎస్‌ఐ టీడీపీకి కొమ్ముకాస్తున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న రూరల్‌ ఎస్పీ రాజశేఖర్‌బాబు వైఎస్సార్‌సీపీ నాయకులకు సర్దిచెప్పి పంపారు.  

కాసు మహేష్‌రెడ్డిపై దాడి
గురజాల వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డిపై మాచవరం మండలం కొత్తగణేశునిపాలెంలో టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాస్‌ కుమారుడు రమేశ్, తెలుగు యువత నాయకుడు జీఆర్‌ రామకృష్ణ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు దాడికి దిగారు. కాసు కారు అద్దాలను ధ్వంసం చేసి, బౌన్సర్లను గాయపరిచారు. యరపతినేని చిన్న కుమారుడు నిఖిల్‌ రెండు కార్లు, 50 బైక్‌లపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేసుకుని పిడుగురాళ్ల మండలం పాత గణేశునిపాడులో విధ్వంసం సృష్టించాడు.

తమకు ఓట్లు వేయలేదని దళితులపై దాడులు చేశాడు. నిఖిల్‌ తమపై దాడి చేశాడని ఫిర్యాదు చేసేందుకు పిడుగురాళ్ల పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన దళితులను సీఐ వీరేంద్రబాబు, ఎస్‌ఐ నారాయణస్వామి నిర్బంధించారు. కేసు పెట్టడానికి వెళ్లిన మహిళ నాగమణిపై టీడీపీ నాయకుడు గుర్రం శ్రీను దాడి చేశాడు. మహిళ తీవ్ర గాయాలపాలై కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. గుత్తికొండ గ్రామంలోని పోలింగ్‌ కేంద్రంలో యరపతినేని శ్రీనివాసరావు హల్‌చల్‌ చేశాడు. ఎన్నికల విధుల నిర్వహిస్తున్న అధికారిపై చేయి చేసుకున్నాడు.  

మంత్రి లోకేష్‌ హైడ్రామా
మంగళగిరి నియోజకవర్గంలో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన మంత్రి నారా లోకేష్‌ తాడేపల్లిలో సాయంత్రం హైడ్రామాకు తెరతీశారు. తాడేపల్లిలోని 34, 37 పోలింగ్‌ బూత్‌ల పరిశీలనకంటూ వందమంది అనుచరులతో నిబంధనలను ఉల్లంఘించి బలప్రదర్శనకు దిగారు. అక్కడే మీడియా సమావేశం పెట్టి ఎన్నికల కమిషన్‌ తీరుపై ఆరోపణలు గుప్పించారు.

ఇరుకుగా ఉండే పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్లకు ఇబ్బందిగా కలిగించేలా మీడియా సమావేశం పెట్టడం ఏంటని ప్రశ్నించిన ‘సాక్షి’ విలేకరి నాగిరెడ్డిపై లోకేష్‌ దౌర్జన్యానికి దిగారు. ఆయన అనుచరులు నాగిరెడ్డిపై దాడికి యత్నించారు. దీంతో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు ధర్నాకు దిగడంతో లోకేష్‌ వెళ్లిపోయారు. అనంతరం పోలీసులు వైఎస్సార్‌ సీపీపై లాఠీల విరుచుకుపడ్డారు. ఆ దృశ్యాలను ‘సాక్షి’ విలేకరి నాగిరెడ్డి తన సెల్‌ఫోన్‌ చిత్రీకరిస్తుండగా పోలీసులు అతనిపైనా లాఠీ ఝళిపించారు. ఇంతలో అక్కడికి చేరుకున్న అర్బన్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావు విలేకరి నాగిరెడ్డి ఫోన్‌ను లాగేసుకున్నారు.  

వినుకొండలో మారణాయుధాలతో..
నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీకి పట్టున్న గ్రామాల్లో టీడీపీ నాయకులు అలజడులు సృష్టించారు. బొల్లాపల్లి మండలం పేరూరుపాడు గ్రామంలో ఉదయం నుంచి పోలింగ్‌కు విఘాతం కలిగిస్తూ వచ్చారు. సాయంత్రం ఈవీఎంలను బయటికీ తీసుకురాకుండా మారణాయుధాలతో పోలింగ్‌ బూత్‌ ఎదుట హల్‌చేశారు. పొన్నూరు, మాచర్ల, బాపట్ల, రేపల్లె, సహా వివిధ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ సీపీ నాయకులు, ఏజెంట్లపై టీడీపీ నాయకులు దాడులు చేశారు.

చాలా చోట్ల పోలింగ్‌ బూత్‌లలోకి చొరబడి సైక్లింగ్‌కు సైతం పాల్పడ్డారు. వేమూరు మండలం బూతుమల్లి గ్రామంలో సైక్లింగ్‌కు పాల్పడుతున్న టీడీపీ నాయకులను అడ్డుకున్న వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి మేరుగ నాగార్జునపై టీడీపీ వర్గీయులు దాడికి దిగారు. ఆయన్ను చుట్టుముట్టి కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో మేరుగ నాగార్జునకు స్వల్ప గాయాలయ్యాయి. టీడీపీ వర్గీయుల దాడిపై నాగార్జున వేమూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పేటలో ప్రత్తిపాటి జులుం
చిలకలూరిపేటలో ప్రత్తిపాటి అనుచరులు నిబంధనలకు నీళ్లు వదిలారు. పోలింగ్‌ బూత్‌లలోకి చొరబడి వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లపై దాడులకు దిగారు. నియోజకవర్గంలోని కమ్మవారిపాలెం, పోతవరం, మద్దిరాల, సాతులూరు సహా వివిధ గ్రామాల్లో ప్రత్తిపాటి అనుచరులు సైక్లింగ్‌కు పాల్ప డ్డారు. నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామంలో 498 ఓట్లు ఉండగా 435ఓట్లు పోల్‌ అయ్యాయి. అయితే ఎంపీ బ్యాలెట్‌ బాక్స్‌లో మాత్రం 50 ఓట్లు అదనంగా చూపిస్తున్నాయి. ఇక్కడ టీడీపీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడ్డం వల్లే 50 ఓట్లు అదనంగా చేరాయని రీపోలింగ్‌ నిర్వహించాలని వైఎస్సార్‌ సీపీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

సత్తెనపల్లిలో ఇలా...
ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు గ్రామంలో కోడెల శివప్రసాద్‌ తనయుడు శివరామ్‌ 248 బూత్‌లోకి అనుచరులతో చొరబడి హల్‌చల్‌ చేశాడు. ఎస్‌ఐ ఏడుకొండలు పోలింగ్‌ బూత్‌ల వద్ద విధులను విస్మరించి శివరామ్‌ గన్‌మెన్‌లా వ్యవహరించారు. అక్కడి నుంచి శివరామ్‌ దమ్మలపాడు చేరుకుని పోలింగ్‌కు విఘాతం కలిగించే ప్రయత్నం చేశారు. అక్కడ కోడెల అనుచరులు జనసేన కార్యకర్తల మధ్య వాగ్వా దం చోటు చేసుకుని ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి.

ఓటమి భయంతో సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం ఇనుమెట్ల గ్రామంలో టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాద్‌ పోలింగ్‌ను అడ్డుకున్నారు. ఉదయం 10 గంటల సమయంలో జెడ్పీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన 160వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌కు చేరుకున్న కోడెల పోలింగ్‌ జరగకుండా కేంద్రంలో సుమారు 2.30 గంటల సేపు బైఠాయించారు. అంతసేపు పోలింగ్‌ ఆగిపోవడంతో కోడెల బయటికి రావాలని వైఎస్సార్‌ సీపీ నాయకులు, ఓటర్లతో పోలింగ్‌ బయట నిరసన తెలిపారు. వారి నిరసనతో కోడెల హైడ్రామాకు తెరతీశారు. చొక్కా చింపుకొని తనపై దాడి చేశారని, స్పృహతప్పి పడిపోయాడు. అప్పటికే అక్కడి చేరుకున్న కోడె ల రౌడీలు ఓటర్లపై దాడి కి దిగడంతో ఓటర్లు వారిపై తిరగబడి అక్కడి నుంచి తరిమికొట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement