physical attacks
-
స్టేషన్లో పులివర్తి గ్యాంగ్ వీరంగం
సాక్షి, నెట్వర్క్: ఎన్నికల అనంతరం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో స్వైర విహారం చేస్తున్న టీడీపీ కార్యకర్తలు ఏకంగా పోలీసు స్టేషన్లోనే అధికారులపై దాడులకు తెగబడ్డాయి. విజయోత్సవ ర్యాలీల ముసుగులో వైఎస్సార్సీపీ శ్రేణులపై భౌతిక దాడులకు తెగబడుతున్న పచ్చ ముఠాలు నియోజక వర్గంలో భయానక పరిస్థితులను సృష్టించాయి. రెండు రోజుల క్రితం వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు, వార్డు సభ్యుడిపై దాడులకు దిగగా తాజాగా మరో కార్యకర్తపైనా టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 16 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డాయి. వందల మందిని వెంటేసుకుని: చంద్రగిరిలోని కొత్తపేటకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త అంగేరి రాజశేఖర్ శుక్రవారం ఉదయం ఓ దుకాణం వద్ద ఉండగా టీడీపీకి చెందిన ఉగ్రాణం గురునాథం మరి కొందరితో కలసి దాడి చేశాడు. గాయపడ్డ బాధితుడు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు టీడీపీ నాయకులను స్టేషన్‌కు రప్పించారు. ఈ విషయం తెలిసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులు సుమారు 200 మంది అక్కడకు చేరుకున్నారు. పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మస్తాన్‌ను స్టేషన్‌కు పిలిపించాలని సీఐనే ఆదేశించారు. అనంతరం అక్కడకు చేరుకున్న మస్తాన్‌ను టీడీపీ కార్యకర్తలు చంద్రగిరి పోలీసు స్టేషన్ లోనే డీఎస్పీ రవికుమార్, సీఐ రామయ్య కళ్లెదుటే, సీసీ కెమెరాల సాక్షిగా చితకబాదారు.సీఐ, డీఎస్పీపై దాడి మస్తాన్‌పై దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సీఐ, డీఎస్పీలపై సైతం టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. దాడుల్లో డీఎస్పీ కింద పడిపోగా సీఐ తృటిలో తప్పించుకున్నారు. దీంతో పోలీసు సిబ్బంది డీఎస్పీని లోపలికి తరలించారు. అనంతరం నాని అనుచరులు మస్తాన్‌తో క్షమాపణ చెప్పించుకుని పంపించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన ఈ దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు సమాచారం. దాడి ఘటనను వైఎస్సార్సీపీ శ్రేణులు ఎస్పీ దృష్టికి తెచ్చాయి.పాకాలలో పూల అంగడి ధ్వంసం ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అనుకూలంగా పని చేశాడనే కక్ష్యతో పాకాలలో పూల అంగడి నిర్వహిస్తున్న సతీ‹Ùను పులవర్తి నాని అనుచరులు చితకబాదారు. పూల అంగడిని ధ్వంసం చేసి పూలన్నీ రోడ్డుపై పారబోశారు. స్థానికులు వారించడంతో ని్రష్కమించారు. -
కీచక పర్వం.. నిండు గర్భిణిలనూ వదలని వైనం!
ఉక్రెయిన్ మీద మిలిటరీ చర్య వంకతో.. రష్యా బలగాలు చెప్పడానికి వీల్లేని రీతిలో అకృత్యాలకు పాల్పడుతున్నాయి. కొన్ని ప్రాంతా నుంచి సైన్యం ఉపసంహరణ తర్వాత.. వీధుల్లోని దృశ్యాలు అక్కడ జరిగిన దమనకాండ ఏంటో ప్రపంచానికి తెలియజెప్తున్నాయి. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, కాళ్లు చేతులు కట్టేసి బుల్లెట్లు దింపిన శవాలు, సామూహిక అంత్యక్రియలు.. రష్యా బలగాలు చేపట్టిన మారణహోమానికి ప్రతీకలుగా నిలిచాయి. దీనిపై ప్రపంచం మొత్తం రష్యాను నిందిస్తోంది. అదే సమయంలో రష్యా బలగాల కీచక పర్వం ఏస్థాయిలో ఉందో ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. టీనేజ్ యువతుల దగ్గరి నుంచి పండు ముసలి దాకా.. ఎవరినీ వదలకుండా అఘాయిత్యాలకు తెగపడింది రష్యా సైన్యం. భయానకమైన ఆ అనుభవాల కథనాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఖేర్సన్ రీజియన్‌లో పదహారేళ్ల యువతితో పాటు ఓ వృద్ధురాలిపై రష్యా సైన్యం అత్యాచారానికి పాల్పడింది. చిన్నారులు, వయసు మళ్లిన వాళ్లే కాదు.. ఆఖరికి గర్భవతులైనా దాష్టీకానికి పాల్పడినట్లు కీవ్ వర్గాలు కథనాలు ప్రచురిస్తున్నాయి. గురువారం ఓ బోటులో పారిపోతున్న 14 మంది ప్రయాణికులను రష్యా బలగాలు అడ్డుకున్నాయని, అందులో 13 ఏళ్ల చిన్నారితో పాటు ఓ గర్భవతిపై అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేసినట్లు క్రైవ్యీ రిహ్ మిలిటరీ హెడ్ ఒలెక్సాండ్ర్ విల్కుల్ ప్రకటించారు. ఇంతకన్నా భయంకరమైన అనుభవాలు ఉక్రెయిన్ పౌరులు ఇప్పుడు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. మరో మార్గం లేక.. ఉక్రెయిన్‌లో ఆడవాళ్లది ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి. ప్రాణంతో పాటు మానం కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. రష్యా సైన్యం ఏ క్షణాన మళ్లీ విరుచుకుపడుతుందో అని భయంగా గడుపుతున్నారు. కొందరు దేశం విడిచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొందరు.. జుట్టు కత్తిరించుకోవడం, నిండైన దుస్తులు ధరించడం.. రష్యా సైన్యానికి అందవిహీనంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజధాని కీవ్‌కు 50 మైళ్ల దూరంలోని ఇవాన్కివ్లో కనిపించే దృశ్యాలే అందుకు ఉదాహరణ. రష్యా బలగాల చెర నుంచి మార్చి 30న ఈ పట్టణానికి స్వేచ్ఛ దొరికింది. అప్పటిదాకా ఇక్కడ కీచక పర్వం కొసాగిందని డిప్యూటీ మేయర్ మర్యాన బెస్చాస్తానా వెల్లడించారు. బేస్మెంట్లో దాక్కున్న వాళ్లను జుట్టు పట్టుకుని బయటకులాగి మరీ అఘాయిత్యాలకు పాల్పడ్డారని ఆమె వెల్లడించారు. తన భర్తను చంపి.. నాలుగేళ్ల కొడుకు ముందే తనపై రష్యా సైనికులు అఘాయ్యితానికి పాల్పడ్డారంటూ ఓ తల్లి వ్యక్తం చేసిన ఆవేదనతో మొదలైన ఈ కీచక పర్వం గాథలు.. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇక బుచాలో జరిగిన మారణహోమం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అఘాయిత్యాలకు పాల్పడిన తర్వాత.. బాధితులను మంటల్లో కాల్చి చంపి పైశాచిక ఆనందం పొందాయి రష్యా బలగాలు!. ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ అనస్థాషియా సుబచెవ(52) మృతదేహాన్ని.. ఆమె నెయిల్ పాలిష్ ఆధారంగా గుర్తించింది ఉక్రెయిన్ సైన్యం. అయితే ఆమె అత్యాచారానికి గురైందా లేదా? అనేది తెలియాల్సి ఉంది. -
ప్రజాస్వామ్యం ఖూనీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు ముగిసినా ఢిల్లీలో రాజకీయ వేడి తగ్గలేదు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కిందంటూ, రాజ్యసభలో భౌతికంగా దాడులకు దిగిందంటూ నిరసన వ్యక్తం చేస్తూ గురువారం విపక్షాలు ర్యాలీగా వచ్చి విజయ్‌చౌక్‌లో ధర్నా నిర్వహించాయి. ముందుగా గురువారం ఉదయం పార్లమెంట్లో రాజ్యసభలో ప్రతిపక్షనేత ఖర్గే కార్యాలయంలో ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, సమాజ్‌వాదీ, సీపీఎం, సీపీఐ, డీఎంకే తదితర పార్టీల నేతలు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పార్లమెంట్ నుంచి విజయ్‌చౌక్‌కు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రతిపక్ష ఎంపీలంతా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ప్రజల గొంతుకను నొక్కేశారని నినదిస్తూ విజయ్ చౌక్‌కు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. మార్షల్స్‌లా బయటి వ్యక్తులొచ్చారు: శివసేన శివసేన పక్షనేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ ‘ప్రతిపక్షాలకు తమ అభిప్రాయాలను పార్లమెంటులో వెల్లడించేందుకు అవకాశం రాలేదు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల జరిగిన సంఘటన ప్రజాస్వామ్యానికి చేటు. పాకిస్తాన్ సరిహద్దు వద్ద నిలబడినట్లు అనిపించింది..’ అని విమర్శిచారు. బయటి వ్యక్తులు మార్షల్స్ యూనిఫారమ్ ధరించి మహిళలను కొట్టడానికి వచ్చారని ఆరోపించారు. అధికార పార్టీయే కారణం: డీఎంకే డీఎంకే రాజ్యసభ పక్ష నేత శివ మాట్లాడుతూ ‘ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించేందుకు తెచ్చిన ఇన్సూరెన్స్ బిల్లును లక్షలాది మంది ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. దీనిని సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ బిల్లును బలవంతంగా ఆమోదించుకుంది. దీనిపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేశారు. ఇద్దరు మహిళా ఎంపీలు దాడికి గురయ్యారు. ఈ నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్షాలు ఐక్యంగా ఉద్యమిస్తున్నాయి. పార్లమెంట్ సజావుగా జరగకపోవడానికి అధికార పార్టీనే కారణం‘ అని విమర్శించారు. ఉపరాష్ట్రపతితో భేటీ.. విజయ్ చౌక్‌లో నిరసన అనంతరం విపక్షాలు రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుతో సమావేశమయ్యాయి. ఆగస్టు 11న రాజ్యసభలో భారీ సంఖ్యలో మార్షల్స్ కాని వారిని మోహరించారని ఫిర్యాదు చేశారు. సమావేశాలు సజావుగా సాగేలా, విపక్షాలు ప్రజా సమస్యలపై తమ వాణి వినిపించేలా చూడాలని కోరారు. జనరల్ ఇన్సూరెన్స్ బిల్లును కేంద్రం తెచ్చిన తీరును నివేదించారు. ఈ సమావేశం అనంతరం 15 పార్టీల ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. ‘పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పట్టాలు తప్పించింది. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను అగౌరవ పరుస్తుంది. ప్రారంభంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో సంయుక్తంగా ప్రతిపక్షాలు ముఖ్యమైన అంశాలపై చర్చించాలని ప్రతిపాదించాయి. పెగసస్ గూఢచార్యం, రైతుల ఆందోళనలు, ధరలు పెరుగుదల, దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై చర్చించాలని కోరాం.. చర్చ కోసం పట్టుపట్టిన ప్రతిపక్షాల డిమాండ్లను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ప్రస్తుత ప్రభుత్వానికి పార్లమెంటరీ జవాబుదారీతనంపై నమ్మకం లేదు. పెగసస్‌పై చర్చ నుంచి పారిపోతోంది. ప్రతిష్టంభనను తొలగించడానికి ప్రతిపక్ష పార్టీలతో చర్చించాల్సింది. కానీ ప్రభుత్వం అహంకారపూరితంగా నిర్లక్ష్యంగా ఉంది. ప్రతిష్టంభనకు పూర్తిగా బాధ్యత ప్రభుత్వమే వహించాలి’ అని పేర్కొన్నాయి. ‘ప్రభుత్వ నిరంకుశ వైఖరిని, అప్రజాస్వామిక చర్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై దాడికి వ్యతిరేకంగా మా పోరాటాన్ని కొనసాగించడానికి, జాతీయ ప్రాముఖ్యత అంశాలు, ప్రజా సమస్యలపై ఆందోళన చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం..’ అని పేర్కొన్నాయి. -
టీడీపీ విధ్వంస కాండ
సాక్షి, గుంటూరు : ఐదేళ్ల టీడీపీ అరాచక పాలనతో విసిగి వేసారిన ప్రజలు గురువారం పోలింగ్ బూత్‌లకు పోటెత్తారు. పోలింగ్ శాతం తగ్గించేందుకు టీడీపీ నాయకులు ఎంతగా ప్రయత్నించినా ప్రజలు వెనకడుగు వేయలేదు. ఓటమి తప్పదన్న ఉక్రోషంతో టీడీపీ నాయకులు విధ్వంస కాండకు తెగబడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్లపై దాడులకు తెగబడ్డారు. నరసరావుపేటలో ఏకంగా కిడ్నాప్ చేశారు. అడ్డుకోబోయిన ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డిపై దాడిచేసి గాయపరిచారు. వైఎస్సార్ సీపీకి ఓట్లు వేస్తారా అంటూ గురజాలలో ముస్లింల ఇళ్లపై రాళ్లు రువ్వి, మహిళలు, వృద్ధులపై దాడులకు తెగబడ్డారు. సుమారు 500 మంది కర్రలు, కత్తులతో సీఐ సమక్షంలోనే మూడు గంటలపాటు వీరంగం సృష్టించి వైఎస్సార్సీపీ నేతల కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, సినిమా హాళ్లను ధ్వంసం చేశారు. ఓటమి భయంతో టీడీపీ నాయకులు జిల్లాలో విధ్వంసాలకు తెగబడ్డారు. ప్రశాం తంగా ఉన్న పల్నాడులో సార్వత్రిక ఎన్నికల పోలిం గ్ సాక్షిగా టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడా ్డరు. పౌరులు ఓటు హక్కు వినియోగించుకోకుండా భ యభ్రాంతులకు గురిచేశారు. వైఎస్సార్ సీపీ ఏజెం ట్లపై దాడులకు తెగబడ్డారు. యథేచ్ఛగా ఓట్లను సైక్లింగ్ చేశారు. ఈ అరాచకాలను అడ్డుకున్న వైఎ స్సార్ సీపీ నాయకులపై వేటకొడవళ్లతో దాడులకు దిగారు. జిల్లాలో గురువారం పోలింగ్ సందర్భంగా టీడీపీ నాయకులు రావాణ కాష్టాన్ని రగిల్చారు. గురజాలలో అరాచకం గురజాల టౌన్‌లోని 29వ పోలింగ్ బూత్‌లో ముస్లింలను ఓటు వేయడానికి రాకుండా అడ్డుకుని, ఓటు వేయడానికి వచ్చిన ముస్లిం యువలకుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. అయినా ముస్లిం బెదరకుండా ఓట్లు వేశారు. ముస్లింలు వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశారని అక్కసుతో పోలింగ్ అనంతరం టీడీపీ నాయకులు ముస్లింల ఇళ్లు, షాప్‌లపై దాడులు చేసి ధ్వంసం చేశారు. ఈ సమాచారం తెలిసిన జంగమహేశ్వరపురం, గురజాల టౌన్ వైఎస్సార్ సీపీ నాయకులు ముస్లింలకు అండగా వెళ్లగా వారి పైనా టీడీపీ నాయకులు దాడులకు దిగారు. రాళ్లు రువ్వుతూ, కర్రలు, రాడ్డులతో విచక్షణ రహితంగా దాడులు చేశారు. అయితే వైఎస్సార్ సీపీ నాయకులు ప్రతిఘటించారు. తాము తక్కువ మంది ఉండటంతో కొద్దిసేపు వెనక్కు తగ్గిన టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ నాయకులు టౌన్ నుంచి వెళ్లి పోయిన తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లోని తమ వర్గీయులందరినీ కూడగట్టుకుని విధ్వంసానికి దిగారు. వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లు, పార్టీ నాయకుడు యెనుముల మురళీధర్‌రెడ్డి కేబుల్ కార్యాలయాన్ని, శ్రీనివాసరెడ్డికి చెందిన సత్యనారాయణ ఐనాక్స్ సినిమాహాల్, కారులను ధ్వంసం చేశారు. ఇదంతా గురజాల టౌన్ సీఐ రామారావు కనుసన్నల్లో సాగింది. గురజాలలో తమ షాప్‌లు, కార్యాయాలను ధ్వంసం చేస్తున్న విషయాన్ని తెలుసుకుని అక్కడకు బయల్దేరిన జంగమహేశ్వర పురం గ్రామస్తులను మార్గ మధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. నరసరావుపేటలో గోపిరెడ్డిపై దాడి.. నరసరావుపేట వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై టీడీపీ నాయకులు యలమంద గ్రామంలో దాడికి దిగారు. యలమంద గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి ఏజెంట్లతో వెళ్తున్న గోపిరెడ్డిని అడ్డుకున్న టీడీపీ వర్గీయులు ఆయన కారు అద్దాలను ధ్వంసం చేసి ఆయన్ను గాయపరిచారు. వైఎస్సార్ సీపీకి చెందిన ఆరుగురు ఏంజెంట్లను పోలింగ్ బూత్‌ల నుంచి బయటకు లాక్కొచ్చి దాడి చేశారు. పోలింగ్ ఏజెంట్లు బోయపాటి నరసింహారావు, గార్లపాటి అంజయ్య, ముప్పాళ్ల నాగరాజును కిడ్నాప్ చేసి, మధ్యాహ్నం వరకూ బంధించి వేధింపులకు గురిచేశారు. ఇంత జరుగుతున్నా పట్టిం చుకోని పోలీసులు వైఎ స్సార్ సీపీ నాయకులపై జులుం చూపించారు. శ్రీనివాస గిరిజన కాలనీ లోని ఓటర్లను పోలింగ్ బూత్‌లోకి రాకుండా బూత్‌ను ఆక్రమించిన టీడీపీ వర్గీయులను నిలదీసిన వైఎస్సార్ సీపీ నాయకులపై ఎస్ఐ షఫీ దాడికి దిగి యువకులను తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఎస్ఐ టీడీపీకి కొమ్ముకాస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న రూరల్ ఎస్పీ రాజశేఖర్‌బాబు వైఎస్సార్సీపీ నాయకులకు సర్దిచెప్పి పంపారు. కాసు మహేష్‌రెడ్డిపై దాడి గురజాల వైఎస్సార్ సీపీ అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డిపై మాచవరం మండలం కొత్తగణేశునిపాలెంలో టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాస్ కుమారుడు రమేశ్, తెలుగు యువత నాయకుడు జీఆర్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు దాడికి దిగారు. కాసు కారు అద్దాలను ధ్వంసం చేసి, బౌన్సర్లను గాయపరిచారు. యరపతినేని చిన్న కుమారుడు నిఖిల్ రెండు కార్లు, 50 బైక్‌లపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేసుకుని పిడుగురాళ్ల మండలం పాత గణేశునిపాడులో విధ్వంసం సృష్టించాడు. తమకు ఓట్లు వేయలేదని దళితులపై దాడులు చేశాడు. నిఖిల్ తమపై దాడి చేశాడని ఫిర్యాదు చేసేందుకు పిడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన దళితులను సీఐ వీరేంద్రబాబు, ఎస్ఐ నారాయణస్వామి నిర్బంధించారు. కేసు పెట్టడానికి వెళ్లిన మహిళ నాగమణిపై టీడీపీ నాయకుడు గుర్రం శ్రీను దాడి చేశాడు. మహిళ తీవ్ర గాయాలపాలై కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. గుత్తికొండ గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో యరపతినేని శ్రీనివాసరావు హల్చల్ చేశాడు. ఎన్నికల విధుల నిర్వహిస్తున్న అధికారిపై చేయి చేసుకున్నాడు. మంత్రి లోకేష్ హైడ్రామా మంగళగిరి నియోజకవర్గంలో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన మంత్రి నారా లోకేష్ తాడేపల్లిలో సాయంత్రం హైడ్రామాకు తెరతీశారు. తాడేపల్లిలోని 34, 37 పోలింగ్ బూత్‌ల పరిశీలనకంటూ వందమంది అనుచరులతో నిబంధనలను ఉల్లంఘించి బలప్రదర్శనకు దిగారు. అక్కడే మీడియా సమావేశం పెట్టి ఎన్నికల కమిషన్ తీరుపై ఆరోపణలు గుప్పించారు. ఇరుకుగా ఉండే పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు ఇబ్బందిగా కలిగించేలా మీడియా సమావేశం పెట్టడం ఏంటని ప్రశ్నించిన ‘సాక్షి’ విలేకరి నాగిరెడ్డిపై లోకేష్ దౌర్జన్యానికి దిగారు. ఆయన అనుచరులు నాగిరెడ్డిపై దాడికి యత్నించారు. దీంతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ధర్నాకు దిగడంతో లోకేష్ వెళ్లిపోయారు. అనంతరం పోలీసులు వైఎస్సార్ సీపీపై లాఠీల విరుచుకుపడ్డారు. ఆ దృశ్యాలను ‘సాక్షి’ విలేకరి నాగిరెడ్డి తన సెల్‌ఫోన్ చిత్రీకరిస్తుండగా పోలీసులు అతనిపైనా లాఠీ ఝళిపించారు. ఇంతలో అక్కడికి చేరుకున్న అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు విలేకరి నాగిరెడ్డి ఫోన్‌ను లాగేసుకున్నారు. వినుకొండలో మారణాయుధాలతో.. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి పట్టున్న గ్రామాల్లో టీడీపీ నాయకులు అలజడులు సృష్టించారు. బొల్లాపల్లి మండలం పేరూరుపాడు గ్రామంలో ఉదయం నుంచి పోలింగ్‌కు విఘాతం కలిగిస్తూ వచ్చారు. సాయంత్రం ఈవీఎంలను బయటికీ తీసుకురాకుండా మారణాయుధాలతో పోలింగ్ బూత్ ఎదుట హల్‌చేశారు. పొన్నూరు, మాచర్ల, బాపట్ల, రేపల్లె, సహా వివిధ నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, ఏజెంట్లపై టీడీపీ నాయకులు దాడులు చేశారు. చాలా చోట్ల పోలింగ్ బూత్‌లలోకి చొరబడి సైక్లింగ్‌కు సైతం పాల్పడ్డారు. వేమూరు మండలం బూతుమల్లి గ్రామంలో సైక్లింగ్‌కు పాల్పడుతున్న టీడీపీ నాయకులను అడ్డుకున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థి మేరుగ నాగార్జునపై టీడీపీ వర్గీయులు దాడికి దిగారు. ఆయన్ను చుట్టుముట్టి కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో మేరుగ నాగార్జునకు స్వల్ప గాయాలయ్యాయి. టీడీపీ వర్గీయుల దాడిపై నాగార్జున వేమూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పేటలో ప్రత్తిపాటి జులుం చిలకలూరిపేటలో ప్రత్తిపాటి అనుచరులు నిబంధనలకు నీళ్లు వదిలారు. పోలింగ్ బూత్‌లలోకి చొరబడి వైఎస్సార్ సీపీ ఏజెంట్లపై దాడులకు దిగారు. నియోజకవర్గంలోని కమ్మవారిపాలెం, పోతవరం, మద్దిరాల, సాతులూరు సహా వివిధ గ్రామాల్లో ప్రత్తిపాటి అనుచరులు సైక్లింగ్‌కు పాల్ప డ్డారు. నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామంలో 498 ఓట్లు ఉండగా 435ఓట్లు పోల్ అయ్యాయి. అయితే ఎంపీ బ్యాలెట్ బాక్స్‌లో మాత్రం 50 ఓట్లు అదనంగా చూపిస్తున్నాయి. ఇక్కడ టీడీపీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడ్డం వల్లే 50 ఓట్లు అదనంగా చేరాయని రీపోలింగ్ నిర్వహించాలని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సత్తెనపల్లిలో ఇలా... ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు గ్రామంలో కోడెల శివప్రసాద్ తనయుడు శివరామ్ 248 బూత్‌లోకి అనుచరులతో చొరబడి హల్చల్ చేశాడు. ఎస్ఐ ఏడుకొండలు పోలింగ్ బూత్‌ల వద్ద విధులను విస్మరించి శివరామ్ గన్మెన్లా వ్యవహరించారు. అక్కడి నుంచి శివరామ్ దమ్మలపాడు చేరుకుని పోలింగ్‌కు విఘాతం కలిగించే ప్రయత్నం చేశారు. అక్కడ కోడెల అనుచరులు జనసేన కార్యకర్తల మధ్య వాగ్వా దం చోటు చేసుకుని ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఓటమి భయంతో సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం ఇనుమెట్ల గ్రామంలో టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాద్ పోలింగ్‌ను అడ్డుకున్నారు. ఉదయం 10 గంటల సమయంలో జెడ్పీ స్కూల్లో ఏర్పాటు చేసిన 160వ నంబర్ పోలింగ్ బూత్‌కు చేరుకున్న కోడెల పోలింగ్ జరగకుండా కేంద్రంలో సుమారు 2.30 గంటల సేపు బైఠాయించారు. అంతసేపు పోలింగ్ ఆగిపోవడంతో కోడెల బయటికి రావాలని వైఎస్సార్ సీపీ నాయకులు, ఓటర్లతో పోలింగ్ బయట నిరసన తెలిపారు. వారి నిరసనతో కోడెల హైడ్రామాకు తెరతీశారు. చొక్కా చింపుకొని తనపై దాడి చేశారని, స్పృహతప్పి పడిపోయాడు. అప్పటికే అక్కడి చేరుకున్న కోడె ల రౌడీలు ఓటర్లపై దాడి కి దిగడంతో ఓటర్లు వారిపై తిరగబడి అక్కడి నుంచి తరిమికొట్టారు. -
బెదిరించడం తగదు
న్యూఢిల్లీ: కళాకారులను హింసాత్మక రీతిలో బెదిరించడం, వారిపై భౌతిక దాడులు చేసిన వారికి నగదు బహుమతులిస్తామని ప్రకటించడం ప్రజాస్వామ్య దేశంలో ఆమోదనీయం కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఓ సాహిత్య వేడుకలో ఆయన మాట్లాడుతూ ‘సినిమాలపై నిరసన తెలపడంలో భాగంగా కొందరు వ్యక్తులు కళాకారులపై భౌతిక హింసకు పాల్పడిన వారికి రూ.కోటి బహుమతిగా ఇస్తామని ప్రకటిస్తున్నారు. ముందు అలాంటి వాళ్ల దగ్గర అసలు కోటి రూపాయలు ఉంటుందో లేదోనని నాకు అనుమానం? నిరసన తెలపాలంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. అంతేకానీ ఇలాంటి బెదిరింపులకు పాల్పడటం ప్రజాస్వామ్యంలో తగదు’ అని అన్నారు. ప్రత్యేకించి ఏ సినిమా గురించి వెంకయ్య ప్రస్తావించకపోయినప్పటికీ, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన పద్మావతి చిత్రంపై ప్రస్తుతం పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎన్నిరోజులు పనిచేసిందన్నదే ముఖ్యం.... పార్లమెంటు సమావేశాలకు ప్రభుత్వం చాలా తక్కువ సమయం కేటాయించిందంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శిస్తున్న సందర్భంలో వెంకయ్య మాట్లాడుతూ ‘పార్లమెంటు సమావేశాలు ఎన్ని రోజులు జరిగాయన్నది ముఖ్యం కాదు. ఎన్ని రోజులు సభ పనిచేసిందన్నది ప్రధానం’ అని అన్నారు. సాహిత్యం సమాజానికి వెన్నెముకనీ, కాళిదాసు కాలం నుంచి నేటి వరకు ఎందరో కవులు, రచయితలు, మేధావులు భారతీయ సంప్రదాయాల్ని తమ రచనల్లో ప్రతిబింబించారని ఆయన పేర్కొన్నారు. -
భౌతిక దాడులు భావ్యం కాదు
► ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్య ప్రతినిధులు ► మూతపడిన పాఠశాలలు, జూనియర్, ఇంజినీరింగ్ కళాశాలలు ► విజయవంతమైన ప్రైవేటు విద్యాసంస్థల బంద్ శ్రీకాకుళం అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలపై విద్యార్థి సంఘాలు అసాంఘిక శక్తులవలే దాడి చేయడం, భౌతికదాడులకు దిగడం భావ్యం కాదని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్య ప్రతినిధులు ధ్వజమెత్తారు. విద్యాసంస్థలపై విద్యార్థి సంఘాల వేధింపులు, దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా గురువారం ప్రైవేటు విద్యాసంస్థలు, జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలంతా కలసి బంద్ నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రైవేటు పాఠశాలలు, వారికి మద్దతుగా ప్రైవేటు జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు సైతం ముందస్తుగా సెలవు ప్రకటించడంతో బంద్ సంపూర్ణమైంది. బంద్ సందర్భంగా అన్ని ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులతో కలసి మౌన నిరసన ప్రదర్శనను నిర్వహించారు. శ్రీకాకుళంలోని ఏడు రోడ్ల కూడలి నుంచి పొట్టి శ్రీరాములు కూడలి వరకూ భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నినాదాలతో ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం పొట్టి శ్రీరాములు కూడలి వద్ద పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్య సంఘాల ప్రతినిధి దుప్పల వెంకటరావు, విద్యాసంస్థల ప్రతినిధి జామి భీమశంకరరావు, ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్య ప్రతినిధి పి.జయరాం, అపుస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.లక్ష్మణరావు తదితరులు మాట్లాడుతూ తప్పులు చేసే ఉద్దేశంతో ఏ ప్రైవేటు విద్యాసంస్థా ఉండదన్నారు. పొరపాటు జరిగితే బాధ్యులను చట్ట ప్రకారం శిక్షించడం తప్పుకాదన్నారు. అయితే కొంతమంది అసాంఘిక శక్తులు విద్యార్ధి సంఘాల పేరుతో విద్యాసంస్థల యాజమాన్యంపై భౌతికదాడులకు దిగడం సరికాదన్నారు. ఆ హక్కు వారికి లేదన్నారు. విద్యార్థి సంఘాల నుంచి, అసాంఘిక శక్తుల నుంచి రక్షణ కల్పిస్తూ ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల ఏజీఎం శ్రీనివాసరావు, అపుస్మా సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.వెంకటరావు, పి.శ్రీకాంత్, ఎన్.వి.రమణమూర్తి, నారాయణరావు, చంద్రమోహన్, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ త్రివిక్రమవర్మని సంఘ ప్రతినిధులు కలసి వినతి అందజేశారు. -
ఇతర పార్టీలవారిపై దాడులు సరికాదు: సీపీఎం
ఢిల్లీ ఘటనపై సీపీఎం నేతల నిరసన సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం చేతకాని మోదీ ప్రభుత్వం ఇతర పార్టీల వారిపై తమ కార్యకర్తలతో భౌతిక దాడులు చేయించడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దాడులు, దౌర్జన్యాలకు దిగడం సమాజానికే నష్టమని, వీటికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం చేపట్టేందుకు ప్రతి ఒక్కరూ కలసి రావాలని కోరారు. దళిత, గిరిజన, మైనారిటీ, మహిళా హక్కులపై వామపక్షపార్టీలు, ప్రజాసంఘాలు ఉద్యమించడాన్ని జీర్ణించుకోలేక హిందూ మతోన్మాదశక్తులు ఈ తరహాదాడులకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ఆదివారం ఢిల్లీలో సీపీఎం కార్యాలయంపై జరిగిన దాడిని ప్రజాస్వామ్య, సామాజికశక్తులపై దాడిగా ఆయన అభివర్ణించారు. దీనిని నిరసిస్తూ సోమవారం సుందరయ్య విజ్ఞానకేంద్రం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో మోదీ సర్కారు దిష్టిబొమ్మను ద హనం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు జి.నాగయ్య, డీజీ నరసింహారావు, టి.జ్యోతి, జె.వెంకటేశ్, ఎం.శ్రీనివాస్, బి.చంద్రారెడ్డి, బి.హైమావతి, జాన్‌వెస్లీ పాల్గొన్నారు. -
నియంతృత్వ పాలనకు చరమగీతం పాడతాం
అనంతపురం అగ్రికల్చర్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా పథకం ప్రకారం దాడులు సాగిస్తున్న టీడీపీ దౌర్జన్యకాండకు ప్రజల సహకారంతో చరమగీతం పాడతామని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై భౌతిక దాడులకు పూనుకోవడం చంద్రబాబు నియంతృత్వ పాలనకు నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే గొట్టిపాటిపై దాడిని నిరసిస్తూ పార్టీ క్రమశిక్షణా సంఘం సభ్యుడు బి.ఎర్రిస్వామిరెడ్డి, నగర కమిటీ అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి.. టీడీపీ నేతలకు మంచి బుద్దిప్రసాదించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) అధ్యక్షుడు లింగాల శివశంకర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి హెచ్.నదీం అహ్మద్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ధనుంజయయాదవ్ తదితరులు మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులకే రక్షణ కల్పించలేని చంద్రబాబు ప్రభుత్వం సామాన్య వర్గాలను ఎలా కాపాడుతుందని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోనే ఎమ్మెల్యేపై దాడి చేశారంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అందరు చూస్తుండగానే కారు అద్దాలు ధ్వంసం చేసి గొట్టిపాటి రవిపై దాడులకు తెగబడుతున్నా పోలీసు యంత్రాంగం నిందితులను అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ అరాచకాలు రోజురోజుకు మితిమీరుతున్నాయన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. దాడులు ఇలాగే కొనసాగిస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. గొట్టిపాటిపై జరిగిన దాడిపై రాష్ట్ర గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ గుండాగిరి నశించాలంటూ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినదించారు. ఈ కార్యక్రమంలో యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.యోగీశ్వర్‌రెడ్డి, రైతు విభాగం, ఎస్టీ సెల్, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శులు యూపీ నాగిరెడ్డి, పాలె జయరామ్‌నాయక్, కొర్రపాడు హుస్సేన్‌పీరా, యూత్ సిటీ కమిటీ అధ్యక్షుడు మారుతీనాయుడు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండిపరశురాం, రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోభిలేసు, అధికార ప్రతినిధులు పోరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, చింతకుంట మధు, వైఎస్సార్‌టీఎఫ్ నాయకులు ఓబుళపతి, అశోక్‌కుమార్‌రెడ్డి, మహిళా విభాగం నాయకురాళ్లు రుద్రంపేట కృష్ణవేణి, అంకిరెడ్డి ప్రమీళ, దేవి, నాగలక్ష్మి, మునీర, హజరాబీ, షానాజ్, శోభ, కార్పొరేటర్లు సరోజమ్మ, ఫక్కీరమ్మ, పార్టీ నాయకులు ప్రసాదరెడ్డి, మార్కెట్మల్లి, గోపాల్‌మోహన్, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, జేఎం బాషా, ఖాదర్‌బాషా, అంజాద్, జిలాన్, బాలు, సతీష్, వలిపిరెడ్డి శివారెడ్డి, పురుషోత్తం, జంగాలపల్లి రఫీ, శివశంకర్, ఆది, నారాయణరెడ్డి, షేక్షావలీ, మంజునాథ్, షమీఅహ్మద్, హనుమంతు పాల్గొన్నారు. -
తరుణీ.. మనమెక్కడ!
ఏలూరు సిటీ/స్పోర్ట్స్/వన్‌టౌన్ : ‘ముదితల్ నేర్వగ లేని విద్య గలదె.. ముద్దార నేర్పింపగన్’ అన్నారు పాత తరం కవి. ఈ తరంలో ఆ నానుడిని అక్షరాలా నిజం చేస్తున్నారు ‘పశ్చిమ’ మహిళలు. అయినా ‘చదువుకున్న పడుచు.. అన్నింటా ముందు నడుచు’ అన్న మాటలకు మాత్రం సంపూర్ణత్వం సిద్ధించడం లేదు. మహిళలు ఉన్నత చదువులను అందుకోవడానికి కుటుంబ, సామాజిక పరిస్థితులు అనుకూలంగానే ఉన్నా.. చదువుకున్న వారి అడుగులను సాధికారిత దిశగా పడనివ్వడం లేదు. మహిళా విద్యపై సానుకూల దృక్పథం ఉన్నా.. పరిస్థితులు మాత్రం వారిని వంటింటి కుందేళ్లుగానే మారుస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ఇతర ఉపాధి రంగాల్లో అడుగు పెట్టేందుకు మహిళా లోకం సర్వశ్రేష్టమై ఉన్నా... వెళ్లనివ్వడం లేదు. ఇదే అంశంపై ఏలూరులోని రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ‘సాక్షి’ చర్చావేదికలో బీటెక్, ఎంటెక్ విద్యార్థినులు తమ మనోభావాలను వెల్లడించారు. వ్యాపార, వాణిజ్య, ఆర్థిక, క్రీడలు, ఉద్యోగ తదిత ర రంగాల్లో మహిళా లోకం ముందంజలో ఉందనే భావన అందరిలోనూ ఉందని.. వాస్తవానికి మాత్రం వారికి అలాంటి స్వేచ్ఛ లేదని విద్యార్థినులు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. యువతులపై పెరిగిపోతున్న వేధింపులు, భౌతిక దాడులు వారిని ఇళ్లకే పరిమితం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి నుంచి మహిళలు బయట పడాలంటే సామాజిక పరిస్థితులతోపాటు అతివల అంతరంగంలోనూ మార్పులు రావాలని ఆకాంక్షించారు. చర్చావేదికలో మాట్లాడిన యువతుల్లో కొందరి మనోభావాలు వారి మాటల్లోనే... చదువు వరకూ బాగుంది మహిళలు అన్నిరంగాల్లో ముందున్నారని చెప్పుకుంటున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగానే ఉంది. యువతులకు తల్లిదండ్రుల ప్రోత్సాహమైతే చాలా బాగుంది. పురుషులతో సమానంగా మహిళలనూ చదివించాలనే సామాజిక స్పృహ వచ్చింది. ఇది ఆడపిల్లలకు శుభపరిణామమే. అరుుతే, చదువుకున్న ఆడపిల్లల్లో ఎంతమంది సాధికారత వైపు అడుగులు వేసే పరిస్థితులు ఉన్నాయో చెప్పండి. - అశ్విని పరుచూరి మహిళా రిజర్వేషన్ ఏమైపోరుుంది మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం విఫలమవుతోంది. నిజం చెప్పమనండి. మహిళా రిజర్వేషన్ బిల్లు ఏమైంది. కుటుంబ, సామాజిక పరిస్థితులు మహిళా లోకానికి సానుకూలంగా ఉన్నా రాజకీయ పరిస్థితులు మాత్రం వ్యతిరేకంగా ఉన్నారుు. మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ పరంగా సాధికారత సాధించగలిగితేనే వారు అభ్యసించిన చదువు సార్థకమవుతుంది. - ఎస్.కావ్య చదువు సార్థకం కావాలంటే.. చదువంటే కేవలం పుస్తకాలే కాదు. చదువుకుంటే జ్ఞానం వస్తుంది. అది మనిషి ఆలోచనల్ని వికసింపజేస్తుంది. ప్రతి మహిళా తాను సంపాదించిన విజ్ఞానాన్ని ఇతరులకు పంచితే సమాజంలో మార్పు వస్తుంది. ఇవన్నీ నిజాలే.. కానీ ఆ చదువు సార్థకం కావాలంటే మహిళ ఏం చేయూలన్నదే మహిళా లోకం ముందున్న తాజా ప్రశ్న. దీనికి జవాబు అందరి వద్దా ఉంది. కానీ.. అనుకూలమైన పరిస్థితులే లేవు. - సీహెచ్ స్వాతి ఆడ పిల్లల్ని ఉద్యోగానికి ఎందుకు పంపరు మగ పిల్లల్ని చదువు కోసమో, ఉద్యోగం కోసమే ఇతర దేశాలకు పంపడానికి ఏమాత్రం సందేహించని తల్లిదండ్రులు చదువుకున్న ఆడపిల్లల్ని మాత్రం అలా ఎందుకు పంపించడం లేదు. ఏ దేశంలోనూ అందుకు అనుకూలమైన సామాజిక పరిస్థితులు కనిపించడం లేదు. ఈ విషయంలో తల్లిదండ్రులతోపాటు సామాజిక పరిస్థితుల్లోనూ మార్పు రావాలి. - ఎస్జీ ప్రియాంక అనుకూలత విస్తరించాలి పూర్వం పురుషులకే ప్రాధాన్యత ఎక్కువ ఉండేది. చదువులో సైతం వారికే పెద్దపీట వేసేవారు. ఉన్నత విద్య అనేది అప్పట్లో పురుషులకే పరిమితం.. మహిళలు వంటిం టికే పరిమితం అయ్యేవారు. ఆ రోజులు ఇప్పుడు లేవు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. కానీ.. ఆ స్వేచ్ఛ చదువు వరకే పరిమితం కాకూడదు. సమాజ అభివృద్ధికి మహిళల సేవలు ఉపయోగపడాలి. అందుకు అనుకూలమైన పరిస్థితులు విస్తరించాలి. - నయీమిష దేశానికి మహిళల అవసరం ఎంతో ఉంది విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ దృష్ట్యా సమాజంలో సగ భాగమైన మహిళలూ ఉన్నత విద్యను అభ్యసించాల్సిన ఆవశ్యకత ఉంది. దేశాభివృద్ధిలో మహిళలూ పాలు పంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. చదువు ఒక్కటే జీవితం కాదు. చదువు లేకుం టే నేటి సమాజంలో మహిళకు విలువ లేకుండా పోతుంది. - సాయిదుర్గ దాడులకు భయపడొద్దు సమాజంలో మహిళపై గల చులకన భావన పోవాలి. యువతులపై దాడులు జరుగుతున్నారుు నిజ మే. అలాగని బయటకు రావటానికి భయపడాల్సిన పనిలేదు. గతంతో పోలిస్తే మహిళల విషయంలో పరిస్థితులు కొంత సానుకూలంగా మారారుు. ఇందుకోసం మహిళా లోకం ఎంతో పోరాటం చేసింది. అదే పటిమను కొనసాగించాలి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో సాధికారత దిశగా సాగాలి. - లావణ్య ప్రతిబంధకాలు ఉన్నాయ్ కానీ.. నా తండ్రి ఉన్నత విద్యావంతులు కారు. అరుునా తన ఇంట్లో పుట్టిన ఆడపిల్లలు కూడా పెద్ద చదువులు చదవాలనే కోరికతో నన్ను చదివిస్తున్నారు. మహిళలకు ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నాయ్. వాటిని నేర్పుగా.. ఓర్పుగా తొలగించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. లక్ష్యాలు నిర్దేశించుకుని వాటి సాధనకు పట్టుదలతో శ్రమించాల్సిన అవసరం ఉంది. అలా చేస్తే మహిళ తాను అనుకున్నది చేయగలదు. - కె.హారిక డిగ్రీలతో ఆగిపోతే ఎలా సామాజిక అభివృద్ధి సాధించాలంటే ప్రతి మహిళ చదువుకోవాలి. డిగ్రీలతో చదువులు ఆగిపోకూడదు. ఉన్నత చదువులు చదవాలి. చదువు పూర్తయ్యూక ఖాళీగా కూర్చుంటే ఒరిగేదేమిటి. కుటుంబాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముందుకు రావాలి. ప్రతికూల పరిస్థితులు ఉన్నా అనుకూలంగా మార్చుకోవాలి. మహిళలు ఓర్పుతో నేర్పుగా ముందుకు సాగాలి. - పి.మహిత