చంద్రగిరి పోలీసు స్టేషన్‌లో సీఐ, డీఎస్పీపై దాడి
స్టేషన్‌కు పిలిచి విచారించడమే వారు చేసిన నేరం
సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలు నమోదు
ఏ.రంగంపేటలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం ధ్వంసం
పాకాలలో పార్టీ కార్యకర్త పూల అంగడిపై దాడి
బాధితులందరినీ పరామర్శించిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
సాక్షి, నెట్‌వర్క్: ఎన్నికల అనంతరం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో స్వైర విహారం చేస్తున్న టీడీపీ కార్యకర్తలు ఏకంగా పోలీసు స్టేషన్‌లోనే అధికారులపై దాడులకు తెగబడ్డాయి.
విజయోత్సవ ర్యాలీల ముసుగులో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై భౌతిక దాడులకు తెగబడుతున్న పచ్చ ముఠాలు నియోజక వర్గంలో భయానక పరిస్థితులను సృష్టించాయి. రెండు రోజుల క్రితం వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు, వార్డు సభ్యుడిపై దాడులకు దిగగా తాజాగా మరో కార్యకర్తపైనా టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 16 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డాయి.
వందల మందిని వెంటేసుకుని: చంద్రగిరిలోని కొత్తపేటకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త అంగేరి రాజశేఖర్ శుక్రవారం ఉదయం ఓ దుకాణం వద్ద ఉండగా టీడీపీకి చెందిన ఉగ్రాణం గురునాథం మరి కొందరితో కలసి దాడి చేశాడు. గాయపడ్డ బాధితుడు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు టీడీపీ నాయకులను స్టేషన్‌కు రప్పించారు.
ఈ విషయం తెలిసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులు సుమారు 200 మంది అక్కడకు చేరుకున్నారు. పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మస్తాన్‌ను స్టేషన్‌కు పిలిపించాలని సీఐనే ఆదేశించారు. అనంతరం అక్కడకు చేరుకున్న మస్తాన్‌ను టీడీపీ కార్యకర్తలు చంద్రగిరి పోలీసు స్టేషన్ లోనే డీఎస్పీ రవికుమార్, సీఐ రామయ్య కళ్లెదుటే, సీసీ కెమెరాల సాక్షిగా చితకబాదారు.
సీఐ, డీఎస్పీపై దాడి
మస్తాన్‌పై దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సీఐ, డీఎస్పీలపై సైతం టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. దాడుల్లో డీఎస్పీ కింద పడిపోగా సీఐ తృటిలో తప్పించుకున్నారు. దీంతో పోలీసు సిబ్బంది డీఎస్పీని లోపలికి తరలించారు. అనంతరం నాని అనుచరులు మస్తాన్‌తో క్షమాపణ చెప్పించుకుని పంపించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన ఈ దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు సమాచారం. దాడి ఘటనను వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఎస్పీ దృష్టికి తెచ్చాయి.
పాకాలలో పూల అంగడి ధ్వంసం
ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా పని చేశాడనే కక్ష్యతో పాకాలలో పూల అంగడి నిర్వహిస్తున్న సతీ‹Ùను పులవర్తి నాని అనుచరులు చితకబాదారు. పూల అంగడిని ధ్వంసం చేసి పూలన్నీ రోడ్డుపై పారబోశారు. స్థానికులు వారించడంతో ని్రష్కమించారు.
Comments
Please login to add a commentAdd a comment