తిరుమల: తిరుమల శ్రీవారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్నవారిలో ఏపీ మంత్రులు మృణాళిని, ప్రత్తిపాటి పుల్లారావు, అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్సీలు ప్రతిభా భారతి, రాజేంద్రప్రసాద్, ఎంపీ కొనకళ్ల, నారాయణ, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, బొండా ఉమ ఉన్నారు. అదేవిధంగా మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామిని దర్వించుకున్నారు. అనంతరం ఆలయం అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు