'రైతులూ.. ఆందోళన చెందవద్దు..' | Farmers .. Do not worry .. says ministers | Sakshi
Sakshi News home page

'రైతులూ.. ఆందోళన చెందవద్దు..'

Published Sat, Aug 22 2015 10:37 AM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM

Farmers .. Do not worry .. says ministers

విజయవాడ: నూతన రాజధాని ప్రాంతంలోని రైతులు గ్రామకంఠాలపై ఆందోళన చెందవద్దని మంత్రి నారాయణ అన్నారు. శనివారం ఆయన ఇక్కడ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. భూసేకరణ జరిగే గ్రామాలను మరోసారి పరిశీలించి వాటికి ఆనుకుని ఉన్న నిర్మాణాలపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో శనివారం జరిగే సమావేశంలో రెండు రాష్ట్రాలకు చెందిన కమిటీలు, కేంద్రకమిటీలపై చర్చిస్తామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రానున్న ఐదేళ్లలో ఖర్చు చేయాల్సిన రూ.65వేల కోట్లపై సమీక్షిస్తామని మంత్రి పుల్లారావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement