రెయిన్‌గన్స్ కోసం చిత్తూరుకు లారీలు
-
రెయిన్‌గన్స్ కోసం చిత్తూరుకు లారీలు
-
నష్టపోతున్నామంటున్న డ్రైవర్లు
మనుబోలు:
చిత్తూరు జిల్లాలో ఎండిపోతున్న పంటలకు కాపాడేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు మంగళవారం మండల పరిధిలోని జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్యాంకర్ లారీలను ఆపి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి గాను ఒక్కో లారీకి రూ.3 వేల రూపాయల ఆయిల్ నింపుతున్నారని డ్రైవర్‌కు బత్తా కింద రూ.500 వరకూ చెల్లిస్తున్నట్లు డ్రైవర్లు తెలిపారు. ఇలా సోమవారం రాత్రి 50 లారీల వరకూ పంపించినట్లు తెలిసింది. సుమారు మరో 100 లారీలను పంపేందుకు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే చిత్తూరు పంపేందుకు సిద్ధం చేసిన ట్యాంకర్లు పెద్ద ఎత్తున పోర్టు క్రాస్ రోడ్డు వద్ద బారులు తీరాయి. అయితే తమకు ప్రైవేటు సరుకులు సరఫరా చేసుకుంటే రోజుకు రూ.1000 పైగా గిట్టుబాటు అవుతుందని, ప్రభుత్వం మాత్రం కేవలం రూ.550 ఇస్తామని చెబుతోందని డ్రైవర్లు వాపోతున్నారు. అదీ కాకుండా చిత్తూరులో నాలుగు రోజుల పాటు ఉండాలని చెపుతున్నారని ఈ లోపు వర్షం కురిస్తే పంపుతామంటున్నారని డ్రైవర్లు వాపోతున్నారు.