చంద్రబాబుకు కోట్ల సూర్యప్రకాశ్ సవాల్
హైదరాబాద్: రెయిన్ గన్ లతో రాయలసీమలో పంటలను కాపాడానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెయిన్ గన్ల వల్ల రాయలసీమలో ఎక్కడా పంటలు పండలేదని ఆయన తెలిపారు.
పంటలు పండకపోగా లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగిందని, అక్కడికి వచ్చి వాటిని ప్రత్యక్షంగా పరిశీలించాలని సీఎం చంద్రబాబుకు సూర్యప్రకాశ్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ నెల 19న కర్నూలు జిల్లా కొడుమూరులో రైతు సభ ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.