పన్నీరు వైపు సెంథిల్‌ చూపు..? | Senthil Balaji Focus on panneerselvam Camp | Sakshi
Sakshi News home page

పన్నీరు వైపు సెంథిల్‌ చూపు..?

Published Tue, Mar 14 2017 1:59 AM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM

Senthil Balaji Focus on panneerselvam Camp

సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ నేతత్వంలోని అన్నాడీఎంకే శిబిరానికి చెందిన ఎమ్మెల్యే, మాజీమంత్రి సెంథిల్‌ బాలాజీ మాజీ సీఎం పన్నీరు సెల్వం శిబిరంలో చేరబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. సోమవారం పన్నీరు ఇంటికి ఆయన రానున్నారన్న సమాచారంతో ఊహాగానాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయి తే, ఆయన రాక ఎదురు చూపులే మిగిలాయి. గత కేబినెట్‌లో అమ్మ జయలలితకు అత్యంత సన్నిహితుడిగా కరూర్‌ ఎమ్మెల్యే, మంత్రి సెంథిల్‌ బాలాజీ మెలిగారు.  మంత్రివర్గంలో పలుమార్లు మార్పులు జరిగినా, ఆయన పదవికి మాత్రం ఎలాంటి ఢోకా రాలేదు.

జయలలిత జైలుకు వెళ్లిన సమయంలో సీఎం పగ్గాలు సెంథిల్‌కు అప్పగిస్తారన్నంతగా చర్చ అన్నాడీఎంకేలో సాగడం గమనార్హం. అయితే, 2016 ఎన్నికలకు ముందు సెంథిల్‌ బాలాజీ అమ్మ ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. మంత్రి పదవి ఊడినా,  ఆ ఎన్నికల్లో బాలాజీకి సీటు మాత్రం  దక్కింది. అయితే  నోట్ల బట్వాడా వ్యవహరంలో అరవకురిచ్చి ఎన్నిక కాస్త ఆగడంతో ఎన్నికల కోసం మరికొన్ని నెలలు ఆగాల్సి వచ్చింది. అమ్మ ఆసుపత్రిలో ఉన్న సమయంలో మళ్లీ ఎన్నికలు జరగడంతో సెంథిల్‌  విజయ ఢంకా మోగించారు.

అరవకురిచ్చి ఎమ్మెల్యేగా, మాజీ మంత్రి గా  ఉన్న సెంథిల్‌ బాలాజీ ప్రస్తుతం సీఎం ఎడపాడి కే పళని స్వామి మీద తీవ్ర అసంతప్తితో ఉన్నట్టు సమాచారం. తిరుచ్చిలో జరిగిన సీఎం కార్యక్రమానికి సైతం ఆయన దూరంగా ఉండటం గమనార్హం. తనకు గౌర వం దక్కడం లేదన్న వేదనతో మాజీ సీఎం పన్నీరు సెల్వం శిబిరం వైపుగా ఆయన చూపు ఉన్నట్టుగా సంకేతాలు వెలువడటంతో ఎదురు చూపులు పెరిగాయి.

వస్తారని ఎదురు చూపు: పన్నీరు శిబిరం నేతత్వం లోని అన్నాడీఎంకేలో ప్రస్తుతం పన్నెండు మంది ఎమ్మెల్యేలు, పన్నెండు మంది ఎంపీలు ఉన్నారు. ప్ర స్తుతం సెంథిల్‌ బాలాజీ రాబోతున్న సమాచారంతో గ్రీన్‌ వేస్‌ రోడ్డులోని పన్నీరు శిబిరంలో హడావుడి బయలు దేరింది. ఆయన వస్తారని రాత్రి వరకు ఎదురు చూసినా ప్రయోజనం శూన్యం. ఎంతకు సెంథిల్‌ బాలాజీ అటువైపుగా రాలేదు. అయితే, మాజీ మంత్రి నవాలర్‌ నెడుంజెలియన్‌ కుమారుడు వీఆర్‌ నెడుంజెలియన్‌ మదివానన్‌ మాత్రం పన్నీరు శిబిరంలో చేరారు. కాగా, సెంథిల్‌ బాలాజీ పన్నీరు శిబిరంలో చేరడానికి సిద్ధం అయ్యారన్న సమాచారంతో అన్నాడీఎంకే ఉపప్రధాన కార్యదర్శి టీటీవీ దినకర్‌ బుజ్జగింపుల్లో పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. సెంథిల్‌ జారుకుంటే, ఆయన బాటలో మరో నలుగురైదురు ఎమ్మె ల్యే శిబిరం మారిన పక్షంలో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకం అయ్యే ప్రమాదం ఉందని చెప్పవచ్చు. దీంతో సెంథిల్‌ బాలాజీ మనస్సు మార్చే ప్రయత్నాల్లో టీటీవీ  ఉన్నట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement