Senthil Balaji
-
సెంథిల్ బాలాజీ కేసుపై సుప్రీంకోర్టు విస్మయం.. ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: డీఎంకే నేత డీఎంకే నేత సెంథిల్ బాలాజీకి అవినీతి కేసులో బెయిల్ లభించిన కొద్దిసేపటికే తమిళనాడు మంత్రిగా ఆయనతిరిగి బాధ్యతలు స్వీకరించడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అవినీతి ఆరోపణలపై అరెస్ట్ అయిన వ్యక్తి వమంత్రివర్గంలో చేరడం వల్ల సాక్షులు ఒత్తిడికి గురవుతారనే అభిప్రాయం ఎవరికైనా వస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.మంత్రి సెంథిల్ బాలాజీ బెయిల్‌ను రద్దుచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.ఈ మేరకు జస్టిస్ ఏఎస్ ఓకా ధర్మాసనం..సెంథిల్ బాలాజీ బెయిల్‌ను రద్దు చేసేందుకు నిరాకరించింది. బెయిల్ ఉత్తర్వులు ఇతరులకు ప్రయోజనం చేకూర్చాయని, కాబట్టి మెరిట్‌లపై జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. అయితే బాలాజీ మంత్రి వర్గంలో చేరడం వల్ల సాక్షులు ఒత్తిడికి గురవుతున్నారా లేదా అనే దానిపై పిటిషన్ పరిధిని పరిమితం చేస్తామని కోర్టు తెలిపింది.‘మేము బెయిల్ ఇచ్చిన మరుసటి మీరు మంత్రి అయ్యారు. ఇప్పుడు సీనియర్ క్యాబినెట్ మంత్రిగా ఉంఉన్నారు. ఈ సమయంలో సాక్షులు ప్రభావితం అవుతారనే అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది.. ఏం జరుగుతోంది’ అని సెంథిల్ బాలాజీ తరఫున న్యాయవాదిని జస్టిస్ ఏఎస్ ఓకా ప్రశ్నించారు. అయితే దీనిపై తమకు కొంత సమయం కావాలని బాలాజీ న్యాయవాది తెలపడంతో.. తదుపరి విచారణకు డిసెంబరు 13కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.కాగా డీఎంకే పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సెంథిల్ బాలాజీ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం అన్న డీఎంకేలో చేరారు. 2011 నుంచి 2015 వరకు జయలలిత ప్రభుత్వంలో రవాణాశాఖ మంత్రిగా మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఈడీ కేసు నమోదుచేసింది. ఈ కేసులో గతేడాది జూన్‌లో ఆయనను అరెస్ట్ చేయగా.. 8 నెలల తర్వాత మంత్రిపదవికి బాలాజీ రాజీనామా చేశారు. 14 నెలలు జైల్లో ఉన్న అనంతరం సెప్టెంబరు 26న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం స్టాలిన్ మంత్రివర్గంలో విద్యుత్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖల మంత్రిగా చేరారు. -
డిప్యూటీ సీఎంగా ఉదయనిధి
చెన్నై: తమిళనాట వారసుడికి పట్టాభిషేకం జరిగింది. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి లభించింది. 2026 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా 46 ఏళ్ల ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేయాలని డీఎంకే శ్రేణులు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. శనివారం స్టాలిన్ ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉదయనిధి డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు కూడా. పలు చిత్రాల్లో నటించడంతో పాటు సినిమాలు నిర్మించారు. మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని కూడా స్టాలిన్ తిరిగి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మనీలాండరింగ్ కేసులో 471 రోజుల తర్వాత రెండ్రోజుల క్రితమే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. బాలాజీతో పాటు గోవి చెజియన్, రాజేంద్రన్, నాజర్‌లను స్టాలిన్ కేబినెట్లోకి తీసుకున్నారు. టి.మనో తంగరాజ్, జింజీ ఎస్.మస్తాన్, కె.రామచంద్రన్‌లను మంత్రివర్గం నుంచి తొలగించారు. -
తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి బెయిల్
ఢిల్లీ: తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి బెయిల్ మంజూరైంది. క్యాష్ ఫర్ జాబ్స్(మనీల్యాండరింగ్) కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న సెంథిల్ బాలాజీకి తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో, ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు.తమిళనాడుకు చెందిన మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని మనీల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గతేదాడి జూన్‌లో అరెస్ట్ చేసింది. ఈ సందర్భంగా తమిళనాడులోని రవాణాశాఖలో ఉద్యోగాలు ఇస్తామని(అన్నాడీఎంకే ప్రభుత్వంలో 2011-15 మధ్య) నిరుద్యోగుల నుంచి సెంథిల్ బాలాజీ భారీగా డబ్బులు వసూలు చేశారని ఈడీ ఆరోపించింది. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై జూన్ 15న ఆయనను ఈడీ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ అరెస్టుతో ఆయన మంత్రిత్వ శాఖను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.అయితే, ఈ కేసులో బెయిల్ కోసం సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గతేడాది అక్టోబర్ 19న బాలాజీ ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా హైకోర్టు కొట్టివేసింది. స్థానిక కోర్టు కూడా అతని బెయిల్ పిటిషన్లను మూడుసార్లు కొట్టివేసింది. ఈక్రమంలో బెయిల్ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాజాగా బెయిల్ మంజూరు చేసింది. Supreme Court grants bail plea to former Tamil Nadu minister V Senthil Balaji in connection with a money laundering case linked to the cash-for-jobs scam. pic.twitter.com/qBnLoArEoj— ANI (@ANI) September 26, 2024 ఇది కూడా చదవండి: బెంగళూరు మహాలక్ష్మి కేసులో షాకింగ్ ట్విస్ట్ -
TN: అన్నామలైకి కనిమొళి స్ట్రాంగ్ కౌంటర్
చెన్నై: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి డీఎంకే ఎంపీ కనిమొళి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం(మార్చ్ 28)రాత్రి కరూర్‌లో నిర్వహించిన సభలో కనిమొళి మాట్లాడారు. ‘ప్రస్తుతం జైలులో ఉన్న మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ గతంలో కరూర్ నుంచి పోటీ చేశారు. సెంథిల్ బాలాజీ భయంతోనే ఈ ఎన్నికల్లో అన్నామలై కరూర్ నుంచి పోటీ చేయడం లేదు’ అని కనిమొళి సెటైర్లు వేశారు. గతంలో కరూర్ నుంచి ఒక మంత్రి ఉండేవాడని, ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నాడని ఇటీవల కరూర్‌లో నిర్వహించిన ప్రచారంలో అన్నామలై ప్రస్తావించినందునే కనిమొళి ఆయనకు కౌంటర్ ఇచ్చారు. పార్లమెంటులో మాట్లాడిన ఎంపీలను సస్పెండ్ చేస్తారని, బయటమాట్లాడిన వారిని జైలుకు పంపుతారని కేంద్ర ప్రభుత్వంపై కనిమొళి విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఒక్క సీటు గెలుచుకునే అవకాశాలు కూడా లేవన్నారు. ప్రస్తుతం కరూర్ నుంచి ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ జోతిమణి పోటీ చేస్తున్నారు. ఇదీ చదవండి.. కర్ణాటకలో ఏకైక కాంగ్రెస్ ఎంపీ రాజీనామా -
TN: మంత్రి పదవికి సెంథిల్ బాలాజీ రాజీనామా
చెన్నై: మనీలాండరింగ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ మంగళవారం ఉదయం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని డీఎంకే పార్టీ వర్గాలు ధృవీకరించాయి. మరో రెండు రోజుల్లో మద్రాస్ హైకోర్టులో బాలాజీ బెయిల్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. న్యాయపరమైన చిక్కుల వల్లే బాలాజీ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. గత ఏడాది జూన్ 14న మనీలాండరింగ్ కేసులో బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అరెస్టు చేసింది. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో బాలాజీపై చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు క్యాష్ ఫర్ జాబ్ స్కామ్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ బాలాజీని అరెస్టు చేసింది. అరెస్టయి జైలులో ఉన్నప్పటికీ బాలాజీని సీఎం స్టాలిన్ మంత్రివర్గంలోనే కొనసాగించారు. పోర్ట్‌ఫోలియో మాత్రం కేటాయించలేదు. అయితే దీనిపై హైకోర్టు ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసింది. బాలాజీని మంత్రి పదవిలో కొనసాగించే విషయమై మరోసారి ఆలోచించాలని సీఎం స్టాలిన్‌కు కోర్టు సూచించింది. దీంతో బెయిల్ పిటిషన్ రెండోసారి హైకోర్టు ముందు విచారణకు రానున్న నేపథ్యంలో బాలాజీ మంత్రి పదవికి రాజీనామా చేయడం గమనార్హం. ఇదీ చదవండి.. హస్తినలో హై టెన్షన్ -
200 రోజులుగా జైల్లోనే.. తమిళనాడు మంత్రికి మరోసారి ఎదురుదెబ్బ
చెన్నై: ప్రస్తుతం జ్యూడీషియల్ కస్టడిలో ఉన్న తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి మరోసారి నిరాశే ఎదురైంది. మనీలాండరింగ్ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను చెన్ననై సిటీ కోర్టు మూడోసారి తిరస్కరించింది. ఈ కేసులో ఎలాంటి మార్పు జరగనందున బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు చెన్నై ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి ఎస్ అలీ తీర్పునిచ్చారు. కాగా గతేడాది జూన్ 14న మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. గత అన్నా డీఎంకే ప్రభుత్వంలో రవాణాశాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీ(2018లో ఆయన డీఎంకే పార్టీలో చేరారు).. రవాణాశాఖలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీగా సొమ్ము వసూలు చేసినట్లు ఈడీ ఆరోపించింది. ఆఈ కేసులో కేసు నమోదు చేసిన ఈడీ.. అతన్ని అరెస్ట్ చేసింది. అరెస్ట సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో ఆయన చెన్నైలోని ఆసుపత్రిలో చేరారు. చదవండి: ‘ఆటల్ సేతు’ నిర్మాణం కోసం ఉపయోగించిన టెక్నాలజీ ఇదే! అక్కడ మంత్రికి బైపాస్ సర్జరీ జరిగింది. అనంతరం ఈడీ విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకొని తరువాత జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. అప్పటి నుంచి అతని రిమాండ్‌ను కోర్టు పొడిగిస్తూనే ఉంది. గత 200రోజులకు పైగా సెంథిల్ జైల్లోనే ఉన్నారు. ఎటువంటి పోర్ట్‌ఫోలియో లేకుండా డీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక ఆగస్టులో బాలాజీపై ఈడీ 3, 000 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేసింది. అయితే అనారోగ్య కారణాలతో ఇప్పటి వరకు మూడుసార్లు బాలాజీ బెయిల్ కోసం అభ్యర్ధించగా.. ప్రతిసారీ కోర్టులో తిరస్కరణే ఎదురైంది. అంతకముందు ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు అక్టోబర్ 19న కొట్టివేసింది. ముందస్తు బెయిల్ దరఖాస్తులను చెన్నై కోర్టు రెండుసార్లు కొట్టివేసింది. -
జైల్లోని తమిళనాడు మంత్రికి సుప్రీంకోర్టులో ఊరట
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసుతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసిన తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి (ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు) సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బాలాజీని మంత్రి పదవి నుంచి తప్పించాలంటూ ఓ సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం శుకవ్రారం కొట్టివేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి అనుమతి లేకుండా రాష్ట్ర కేబినెట్ నుంచి తొలగించడం కుదరదని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. పోర్ట్‌ఫోలియో లేని బాలాజీని మంత్రిగా కొనసాగాలా వద్దా అనేది ముఖ్యమంత్రే నిర్ణయిస్తారని చెబుతూ.. ఇంతకు ముందు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించింది. ‘ఒక మంత్రిని తొలగించే అధికారం గవర్నర్‌కు ఉందా? లేదా? అనే విషయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. అంతేగానీ సంబంధిత వ్యక్తి మంత్రిగా కొనసాగాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకునే బాధ్యతను ముఖ్యమంత్రికి వదిలివేస్తుంది' అని జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకాతో కూడిన ఏకసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. మద్రాస్ హైకోర్టు అభిప్రాయంతో ఏకీభవిస్తున్నామని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. గతంలో మద్రాస్ హైకోర్టు తీర్పును సామాజిక కార్యకర్త ఎంఎల్ రవి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మనీలాండరింగ్ కేసులో బాలాజీని దర్యాప్తు సంస్థ ఈడీ అరెస్ట్ చేసినప్పటికీ.. ఆయన తమిళనాడు ప్రభుత్వంలో పోర్ట్‌ఫోలియో లేని మంత్రిగా కొనసాగడంపై అభ్యంతరం వ్యక్తం చేశారాయన. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం కూడా.. క్రిమినల్ ప్రాసిక్యూషన్ పెండింగ్‌లో ఉన్న వ్యక్తిని మంత్రి పదవిని నిర్వహించకుండా నిరోధించలేదని, కేవలం అతడు దోషిగా తేలితే మాత్రమే ఆ పదవికి అనర్హుడిగా గుర్తిస్తారని కోర్టు ప్రస్తావించింది. ఎంఎల్ రవి పిటిషన్‌ను తోసిపుచ్చింది. కాగా మనీ లాండరింగ్ కేసులో సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే ఆయన అనారోగ్యం బారిన పడటంతో మంత్రి సెంథిల్ బాలాజీని బెయిల్‌పై బయటకు తీసుకొచ్చేందుకు న్యాయవాదులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ సెంథిల్‌కు బెయిల్ దక్కలేదు. చదవండి: ఇండియన్ మ్యూజియానికి బాంబు బెదిరింపులు -
మరో రెండు రోజుల్లో ఈడీ ఎదుటకు సెంథిల్ సోదరుడు
సాక్షి, చైన్నె: మంత్రి సెంథిల్ బాలాజీ సోదరుడు అశోక్‌కుమార్ ఈడీ సమక్షంలో ఒకటి రెండురోజుల్లో లొంగి పోనున్నట్లు ఆయన తరపు న్యాయవాదులు బుధవారం పేర్కొన్నారు. మనీ లాండరింగ్ కేసులో సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన వద్ద ఐదు రోజల పాటు విచారణ కూడా జరిగింది. అదే సమయంలో ఈ కేసులో సెంథిల్ సోదరుడు అశోక్‌కుమార్‌ను ఇప్పటికే ఈడీ టార్గెట్ చేసింది. ఆయన నివాసాలు, కార్యాలయాలు, సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. విచారణకు రావాలని పలుమార్లు అశోక్‌కుమార్‌కు ఈడీ తరపున సమన్లు జారీ అయ్యాయి. అయితే, ఆయన వాటిని పట్టించుకోలేదు. ఆ యన విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం అందుకున్న ఈడీ వర్గాలు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అదే సమయంలో కేరళ రాష్ట్రం కొచ్చి విమానాశ్రయంలో భద్రతా అఽధికారులు అశోక్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం సాగింది. దీనిని ఈడీ ఖండించింది. ఆయన్ని తాము అరెస్టు చేయలేదని స్పష్టం చేసింది. ఆయనకు సమన్లు జారీ చేశామని, ఇంత వరకు స్పందన లేని దృష్ట్యా, తదుపరి చర్యలపై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో తనకు అనారోగ్య సమస్య ఉందని, చికిత్స అనంతరం ఒకటి రెండు రోజులలో ఈడీ ఎదుట లొంగిపోనున్నట్లు అశోక్‌కుమార్ తెలియజేశారని ఆయన తరపు న్యాయవాది ప్రకటించారు. ఈ విషయాన్ని ఈడీ దృష్టికి తీసుకెళ్లి, మరికొంత సమయం కోరినట్లు పేర్కొన్నారు. కారు బోల్తా ముగ్గురి మృతి సాక్షి, చైన్నె: చెంగల్పట్టు జిల్లా మధురాంతకం సమీపంలోని కారు బోల్తా పడి నలుగురు మృతి చెందారు. తిరువారూర్‌కు చెందిన ముగ్గురు కారులో చైన్నెకు మంగళవారం రాత్రి పని నిమిత్తం బయలుదేరారు. మార్గం మధ్యలో చైన్నై – తిరుచ్చి జాతీయ రహదారిలోని మేల్ మరువత్తురు దాటగానే మధురాంతకం వద్ద బుధవారం వేకువజామున ఓ వంతెన ప్రాంతంలో అదుపు తప్పింది. కారుపై నుంచి కింద పడడంతో అందులో ఉన్న ముగ్గురు ఘటనా స్థలంలోనే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు జీహెచ్‌కు తరలించారు. మృతులు తిరువారూర్‌కు ఎందిన కదిరవన్, నందకుమార్, కార్తీక్‌లుగా గుర్తించారు. -
టార్గెట్ సెంథిల్!
సాక్షి, చైన్నె: మంత్రి సెంథిల్ బాలాజీకి సంబంధించిన వారిని ఆదాయ పన్ను శాఖ అధికారులు టార్గెట్ చేశారు. వివరాలు.. మంత్రి సెంథిల్ బాలాజీని టార్గెట్ చేసి మే 26వ తేదీన కరూర్, కోయంబత్తూరు, మదురై తదితర 40కు పైగా ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాల్లో నిమగ్నమైంది. కరూర్‌లో అయితే అధికారులకు డీఎంకే వర్గాలు ముచ్చెమటలు పట్టించాయి. ఈ సోదాలు 8 రోజుల పాటు జరిగాయి. ఆ తదుపరి పరిణామాలతో సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయినా, ఐటీ అధికారులు మాత్రం సెంథిల్ బాలాజీ, ఆయనకు చెందిన వారిని వెంటాడుతున్నానే ఉన్నారు. జూన్ 13 నుంచి రెండు రోజులు, జూన్ 23వ తేదీ నుంచి మరో రెండు రోజులు కరూర్‌లో తనిఖీలు చేపట్టారు. కొన్ని చోట్ల కార్యాలయాలకు తాళం వేసి వెళ్లారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం కరూర్‌లో మళ్లీ ఐటీ అధికారులు 7 చోట్ల సోదాల్లో నిమగ్నమయ్యారు. ఇందులో సెంథిల్ బాలాజీ మిత్రుడు రామన్, సుబ్రమణ్యన్ నివాసాలు, కార్యాలయాలతోపాటు, శక్తి హోటల్, శ్రీరామ్ విలాస్ హోటల్, రమేష్ ఫైనాన్స్, వివిన్ ఫ్యాక్టరీ ఉన్నాయి. సీఆర్పీఎఫ్ భద్రత నీడలో తనిఖీలు సాగుతున్నాయి. హోరాహోరీగా వాదనలు.. ఓవైపు ఐటీ దాడులు జరుగుతోంటే, మరో వైపు మంగళవారం హైకోర్టులో త్రిసభ్య బెంచ్ ముందు సెంథిల్ బాలాజీ సతీమణి మేఘల దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. మేఘల తరపున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ నుంచి సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. చట్ట విరుద్ధంగా అరెస్టులు జరిగినట్లు వాదించారు. ఆధారాలు సేకరించక ముందే అరెస్టు చేశారని వివరించారు. ఈ సందర్భంగా మూడో న్యాయమూర్తి కార్తికేయన్ పలుప్రశ్నలను సంధించినట్లు తెలిసింది. మధ్యాహ్నం సెంథిల్ బాలాజీ తరపున సీనియర్ న్యాయవాది ఎన్ఆర్ ఇళంగో వాదనలు వినిపించారు. అదే సమయంలో సుప్రీంకోర్టులో ఈడీ అధికారులు కేవియేట్ పిటిషన్ వేయడం చర్చకు దారి తీసింది. మేఘల దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్లో ఇది వరకు ఇచ్చిన ఉత్తర్వులలో మార్పుల కోసం సెంథిల్ తరపున ప్రయత్నాలు చేస్తున్నట్టు ఈడీకి సమాచారం అందింది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, శాఖ లేని మంత్రిగా ఉన్న సెంథిల్‌ను ఆ పదవి నుంచి తప్పించడమే లక్ష్యంగా గవర్నర్ ఆర్ఎన్ రవి ఢిల్లీలో గవర్నర్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. -
మంత్రి సెంథిల్ బాలాజీ కేసులో కొత్త ట్విస్టు!
మంత్రి సెంథిల్ బాలాజీ కేసులో మద్రాసు హైకోర్టులో బుధవారం ‘ధర్మ’సంకటం ఏర్పడింది. ద్విసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులు మంగళవారం భిన్న తీర్పులను వెలువరించారు. ఒకరు సెంథిల్ అరెస్టు చట్ట విరుద్ధం కాదని, మరొకరు చట్ట విరుద్ధమేనంటూ వేర్వేరు తీర్పులు ఇవ్వడంతో మూడో న్యాయమూర్తి ప్రమేయం తప్పనిసరిగా మారింది. దీంతో ఈ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్లయ్యింది. సాక్షి, చైన్నె: మనీలాండరింగ్ కేసులో మంత్రి సెంథిల్ బాలాజీని గత నెల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తీవ్ర ఉత్కంఠ, నాటకీయ పరిణామాల మధ్య ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. విచారణ సమయంలో గుండె పోటు రావడంతో సెంథిల్ బాలాజీని తొలుత ఓమందూరార్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చివరకు హైకోర్టు ఆదేశాలతో కావేరి ఆసుపత్రికి తరలించి బైపాస్ సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయనకు విధించిన రిమాండ్ కాలాన్ని ఈనెల 12వ తేదీ వరకు పొడించారు. అదే సమయంలో సెంథిల్‌ను ఎలాగైనా తమ కస్టడీకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈడీ వర్గాలు తీవ్రంగానే న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నాయి. ఇక, తన భర్తను ఈడీ చట్ట విరుద్ధంగా అరెస్టు చేసినట్టు సెంథిల్ సతీమణి మేఘల కోర్టును ఆశ్రయించారు. ఈమేరకు ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే గత నెల 13వ తేదీ రాత్రే విచారణ ముగించినట్టు ఈడీ పేర్కొందని, అయితే మరుసటి రోజు ఉదయం రెండు గంటల అనంతరం అరెస్టు చూపించారని కోర్టుకు వివరించారు. ఈ రెండుగంటల పాటు తన భర్తను ఎక్కడ ఉంచారో..? ఏం చేశారో..? అన్ని వివరాలను కోర్టుకు ఈడీ తెలియజేయాలని, తన భర్త అరెస్టును రద్దు చేయాలని కోర్టులో వాదనలు తమ న్యాయవాదుల ద్వారా వినిపించారు. ఈడీ సైతం బలమైన వాదనలను కోర్టు ముందు ఉంచింది. సెంథిల్‌ను చట్ట బద్ధంగానే అరెస్టు చేశామని వివరించారు. మెమో తీసుకోక పోవడంతో ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా అరెస్టు సమాచారాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందజేశామని వాదించారు. ఆయన్ని ఇంత వరకు తాము విచారించ లేదని పేర్కొంటూనే, ఆయనకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు తమ వద్ద ఉందని కోర్టుకు వివరించారు. వీటిని తారు మారు చేసే పరిస్థితులు ఉన్నట్లు వాదించారు. వారం రోజులు ఈ వాదనలు జరగ్గా, తీర్పు తేదీని ప్రకటించకుండా న్యాయమూర్తులు నిషా భాను, భరత చక్రవర్తి వాయిదా వేశారు. ఆసక్తికరంగా.. వాదనలను పరిశీలించిన అనంతరం మంగళవారం న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు. నిషా భాను తన తీర్పులో ఈ పిటిషన్ విచారణ యోగ్యమేనని పేర్కొన్నారు. సెంథిల్ బాలాజీ అరెస్టును చట్ట విరుద్ధంగా భావిస్తున్నామని ప్రకటించారు. సెంథిల్ ఆస్పత్రిలో ఉన్న కాలాన్ని కస్టోడియల్ గడువు నుంచి మినహాయించాలని ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసి పుచ్చారు. అదే సమయంలో ఈ తీర్పునకు భిన్నంగా న్యాయమూర్తి భరత చక్రవర్తి తీర్పు వెలువరించారు. మేఘల పిటిషన్ విచారణ యోగ్యం కాదని స్పష్టం చేశారు. అరెస్టు అనంతరం సెంథిల్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని, ఈ వ్యవహారాలన్ని చట్టబద్ధంగానే జరిగినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే కస్టోడియల్ గడువును పెంచుతున్నట్టు ప్రకటించారు. కావేరి ఆస్పత్రిలో వైద్యుల సూచన మేరకు ఆయన చికిత్సలో ఉన్నారని , ఆతదుపరి పరిణామాలతో జైలుకు పంపించడం లేదా, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు తీసుకోవచ్చు అని సూచించారు. ఒకరు చట్ట విరుద్ధమని, మరొకరు చట్టబద్ధంగానే అరెస్టు జరిగినట్టు భిన్న తీర్పు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. భిన్న తీర్పుల నేపథ్యంలో ఈకేసులోకి మూడో న్యాయమూర్తి ప్రమేయం అవశ్యమైంది. దీనిపై హైకోర్టు సీజే ఎస్వీ గంగాపూర్వాలకు ద్విసభ్య బెంచ్ సిఫార్సు చేసింది. న్యాయమూర్తుల మధ్య భిన్న తీర్పుపై సీనియర్ న్యాయవాది ఎన్ఆర్ ఇలంగో స్పందిస్తూ, కొన్ని కేసుల్లో భిన్న తీర్పులు సహజమేనని, ఇది వరకు భిన్న తీర్పులు వెలువరించిన కేసులను గుర్తు చేశారు. మూడో న్యాయమూర్తి ఎదుట బలమైన వాదనలు ఉంచుతామన్నారు. వారంలో మూడో న్యాయమూర్తి నియామకం సెంథిల్ బాలాజీ సతీమణి మేఘల దాఖలు చేసిన పిటిషన్‌పై ఓ వైపు హైకోర్టులో భిన్న తీర్పు వెలువడిన నేపథ్యంలో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు సైతం చేరింది. సెంథిల్ బాలాజీని కావేరి ఆసుపత్రికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ఈడీ దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ కూడా మంగళవారమే విచారణకు వచ్చింది. కేసులో ఆధారాలను తారు మారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, విచారణలో జాప్యం జరిగే కొద్ది కేసు వీగి పోయే పరిస్థితులు ఉన్నాయని ఈడీ తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంలో హైకోర్టు సైతం భిన్న తీర్పును వెలువరించిన విషయాన్ని ప్రస్తావించారు. వాదనల అనంతరం వారం రోజుల్లో మూడో న్యాయమూర్తి నియామకం జరగాలని, తొలి ప్రాధాన్యతగా పరిగణించి కేసును త్వరితగతిన విచారించి తీర్పు వెలువరించాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాగా, సెంథిల్ వ్యవహారంలో మూడో న్యాయమూర్తి ప్రమేయంతో మళ్లీ కేసు మొదటికి వచ్చినట్లయ్యిందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. -
సెంథిల్ బాలాజీ విడుదలపై మద్రాస్ హైకోర్టు భిన్న తీర్పులు..
సాక్షి, చెన్నై: తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ విడుదలకు సంబంధించి మద్రాసు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నమైన తీర్పులు ఇచ్చింది. మంత్రిని విడుదల చేయాలని జస్టిస్ నిషా భాను నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పగా.. సెంథిల్‌ను విడుదల చేయకూడదని జస్టిస్ భరత చక్రవర్తి భిన్నంగా మరో తీర్పును వెలువరించారు. దీంతో ఈ కేసును మద్రాసు కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ విచారణ జరపనుంది. 'ఈడీకి అధికారం లేదు..' మనీ లాండరింగ్ కేసులో పోలీసు కస్టడీని కోరే అధికారం ఈడీకి ఉండదని జస్టిస్ నిషా భాను ధర్మాసనం తెలిపింది. కావున సెంథిల్ బాలాజీ భార్య మేఘాలా దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ చెల్లుబాటు అవుతుందని చెప్పారు. అంతేకాకుండా సెంథిల్ ఆస్పత్రిలో ఉన్న వ్యవధిని కస్టోడియల్ గడువు నుంచి మినహాయించాలని ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. భిన్నమైన తీర్పు.. జస్టిస్ నిషా భాను ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు పూర్తి విరుద్ధంగా జస్టిస్ భరత చక్రవర్తి తీర్పును వెలువరించారు. మేఘాలా దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ చెల్లుబాటు కాదని ధర్మాసనం తెలిపింది. కేవలం అరెస్టు, నిర్బంధం చట్టవిరుద్ధమని చూపితే తప్పా హెబియస్ కార్పస్ చెల్లుబాటు కాదని వెల్లడించారు. అంతేకాకుండా కస్టోడియల్ గడువును కూడా పెంచుతున్నట్లు తీర్పును వెలువరించారు. ఆరోగ్యం బాగా లేని కారణంగా ఒక్కరోజు కూడా ఈడీ విచారణలో సెంథిల్ గడపనందున జూన్ 14 నుంచి ఇప్పటివరకు కస్టోడియల్ గడువును మినహాయింపునిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. సెంథిల్ బాలాజీ అరెస్టులో ఈడీ చట్టపరమైన విధివిధానాలు పాటించలేదని మేఘాలా కోర్టుకు విన్నవించారు. సెషన్స్ కోర్టు ఇచ్చిన కస్టడీ గడువు తాత్కాలికమైనదని ధర్మాసనానికి తెలిపారు. దీనిపై స్పందించిన ఈడీ తరుపు న్యాయవాదులు.. అరెస్టుకు సంబంధించిన పంచనామాను సెంథిల్ బాలాజీ స్వీకరించలేదని తెలిపారు. సెషన్ కోర్టు రిమాండ్ ఇచ్చే క్రమంలోనే అరెస్టుకు సంబంధించిన కారణాలను సెంథిల్ బాలాజీకి వివరంగా తెలిపారని వెల్లడించారు. మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్టు అక్రమమంటూ ఆయన భార్య మేఘలా జూన్ 14న హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేస్తూ కోర్టు మెట్లెక్కారు. అనారోగ్యం కారణంగా సెంథిల్ బాలాజీని కావేరీ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. అయితే.. ఈడీ దర్యాప్తు నిమిత్తం సెంథిల్ బాలాజీకి సెషన్స్ కోర్టు 8 రోజుల కస్టడీని విధించింది. ఇదీ చదవండి: పురుషులకు జాతీయ కమిషన్.. పిల్ కొట్టేసిన సుప్రీంకోర్టు -
కోర్టులో మరో పిటిషన్
సాక్షి, చైన్నె: మంత్రి సెంథిల్ బాలాజి వ్యవహారంలో కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. డిస్మిస్ ఉత్తర్వులను గవర్నర్ వెనక్కి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం ఈ పిటిషన్‌ను న్యాయవాది ఎంఎల్ రవి దాఖలు చేశారు. క్యాష్ ఫర్ జాబ్స్ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన మంత్రి సెంథిల్ బాలాజీకి వ్యతిరేకంగా, అనుకూలంగా కోర్టుల్లో అనేక పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఇందులో కీలక కేసు విచారణ ముగిసింది. తీర్పు వెలువడాల్సి ఉంది. ఈ సమయంలో ఇలాకా లేని మంత్రిగా సెంథిల్ కొనసాగడాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి పరిగణించి డిస్మిస్ చేశారు. ఈ ఉత్తర్వులను రాత్రికి రాత్రే వెనక్కి తీసుకున్నారు. ఈ వ్యవహారాన్ని కూడా అస్త్రంగా చేసుకుని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ శాసనాల మేరకు జరిగిన వ్యవహారంలో గవర్నర్ హఠాత్తుగా తన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవడంపై సమగ్ర విచారణ జరపాలని, డిస్మిస్ ఉత్తర్వులు కొనసాగే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది. సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో డిస్మిస్ ఉత్తర్వుల విషయంగా కేంద్ర సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో మరో మారు గవర్నర్ ఆర్ఎన్ రవి చర్చించినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో ఆదివారం స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని, సెంథిల్‌ను డిస్మిస్ చేయడం ఖాయం అనే చర్చ జోరందుకుంది. -
అమిత్ షా ఎంట్రీ.. వెనక్కి తగ్గిన తమిళనాడు గవర్నర్
చెన్నై: అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని క్యాబినెట్ నుంచి తప్పిస్తూ గవర్నర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. కొన్ని గంటల్లోనే ఆర్.ఎన్. రవి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచన మేరకు తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. ఇంతకూ అమిత్ షా ఏం చెప్పారు? ఎందుకు సెంథిల్ బాలీజీ విషయంలో గవర్నర్ ఆర్.ఎన్.రవి వెనక్కి తగ్గారు? క్యాష్ ఫర్ జాబ్స్, మనీల్యాండరింగ్ లాంటి తీవ్రమైన అవినీతి ఆరోపణల కేసుల నేపథ్యంలో క్యాబినెట్ నుంచి మంత్రి సెంథిల్‌ను తొలగిస్తున్నట్లు గవర్నర్ ఆర్.ఎన్.రవి నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం గవర్నర్ తన విచక్షణ అధికారం ఉపయోగించినట్లు రాజ్‌భవన్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే.. ఈ నిర్ణయంపై డీఎంకే ప్రభుత్వం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచన మేరకు అర్ధరాత్రి సమయంలో అటార్నీ జనరల్‌తో భేటీ అయిన గవర్నర్ ఆర్ఎన్ రవి.. ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని నిలుపుదల చేసినట్లు ప్రకటన విడుదల చేశారు. దీంతో బాలాజీ ప్రస్తుతానికి మంత్రిగానే కొనసాగనున్నారు. గవర్నర్ ఆర్.ఎన్.రవి నిర్ణయం న్యాయ పరంగా చిక్కుల్ని తెచ్చి పెట్టే అవకాశం ఉందనే అనుమానంతోనే అటార్ని జనరల్ సూచన తీసుకోమని అమిత్ షా సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు బుధవారం బాలాజీ జ్యూడీషియల్ కస్టడీని జులై 12వ తేదీ వరకు పొడిగించింది స్థానిక కోర్టు. మనీల్యాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఆయన్ని ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన చేతిలో ఉన్న శాఖలను ఇది వరకే మరో ఇద్దరు మంత్రులకు సీఎం స్టాలిన్ అందజేయగా.. మంత్రిత్వ శాఖ మంత్రిగా ప్రస్తుతం సెంథిల్ కొనసాగుతుండడం గమనార్హం. ఇదీ చదవండి: అర్ధరాత్రి తమిళనాట హైడ్రామా.. మంత్రి డిస్మిస్‌పై వెనక్కి తగ్గిన గవర్నర్! -
TN: మంత్రి డిస్మిస్‌పై వెనక్కి తగ్గిన గవర్నర్!
చెన్నై: తమిళనాట బుధవారం అర్ధరాత్రి దాకా పొలిటికల్ హైడ్రామా సాగింది. గవర్నర్ ఆర్ఎన్ రవి వివాదాస్పద నిర్ణయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణల కేసులో అరెస్టయిన మంత్రి వీ సెంథిల్ బాలాజీని.. మంత్రి వర్గం నుంచి తొలగించడం, అదీ సీఎం స్టాలిన్‌ను సంప్రదించకుండానే నిర్ణయం తీసుకోవడం గురించి తెలిసిందే. ఈ వ్యవహారంపై డీఎంకే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. క్యాష్ ఫర్ జాబ్స్, మనీల్యాండరింగ్ లాంటి తీవ్రమైన అవినీతి ఆరోపణల కేసుల నేపథ్యంలో మంత్రివర్గం నుంచి మంత్రిని సెంథిల్‌ను తొలగిస్తున్నట్లు.. అందుకోసం గవర్నర్ ఆర్ఎన్ రవి తన విచక్షణ అధికారం ఉపయోగించినట్లు రాజ్‌భవన్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే.. ఈ నిర్ణయంపై డీఎంకే ప్రభుత్వం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన న్యాయ నిపుణుల సలహా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అర్ధరాత్రి అటార్నీ జనరల్‌తో భేటీ అయిన గవర్నర్ ఆర్ఎన్ రవి.. ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని నిలుపుదల చేసినట్లు సమాచారం. దీంతో బాలాజీ ప్రస్తుతానికి మంత్రిగానే కొనసాగనున్నారు. ఇదిలా ఉంటే.. బాలాజీని మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్ జారీ చేసిన ఆదేశాలపై స్టాలిన్ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. అంతకు ముందు ఈ పరిణామంపై ముఖ్యమంత్రి స్టాలిన్ మీడియాతో మాట్లడారు. గవర్నర్‌పై ధ్వజమెత్తిన ఆయన.. తన మంత్రివర్గంలోని వ్యక్తిని తొలగించే హక్కు గవర్నర్‌కు ఉండదని మండిపడ్డారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని న్యాయపరంగానే దీనిని ఎదుర్కొంటుందని తెలిపారు. న్యాయ నిపుణులతో చర్చించేందుకు గానూ సీనియర్ నేతలను ఆహ్వానించారాయన. శుక్రవారం ఉదయం ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం. మరోవైపు బుధవారం బాలాజీ జ్యూడీషియల్ కస్టడీని జులై 12వ తేదీ వరకు పొడిగించింది స్థానిక కోర్టు. మనీల్యాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఆయన్ని ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన చేతిలో ఉన్న శాఖలను ఇది వరకే మరో ఇద్దరు మంత్రులకు సీఎం స్టాలిన్ అందజేయగా.. మంత్రిత్వ శాఖ మంత్రిగా ప్రస్తుతం సెంథిల్ కొనసాగుతుండడం గమనార్హం. -
మంత్రిపై అవినీతి ఆరోపణలు.. డిస్మిస్ చేసిన గవర్నర్
చెన్నై: తమిళనాడులో మరోసారి ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఆవినీతి ఆరోపణల నేపథ్యంతో అరెస్ట్ అయిన మంత్రి సెంథిల్ బాలాజీని మంత్రి పదవి నుంచి తొలగించారు ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి. ఈ మేరకు గురువారం రాజ్‌భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ‘జాబ్స్ పర్ క్యాష్, మనీలాండరింగ్‌తో సహా అనేక అవినీతి కేసుల్లో మంత్రి సెంథిల్ బాలాజీ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సెంథిల్‌ను గవర్నర్ మంత్రివర్గం నుంచి ఆయన్ను తొలగించారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయి’ అని రాజ్ భవన్ ప్రకటనలో పేర్కొంది. కాగా జూన్ 14న తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖల మంత్రి వి. సెంథిల్ బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చెన్నైలోని మంత్రి అధికారిక నివాసాలు, కార్యాలయాల్లో 18 గంటలపాటు సోదాలు, విచారణ అనంతరం అదుపులోకి తీసుకుంది. ఈ సమయంలో గుండెపోటు రావడంతో ఆయనకు శస్త్ర చికిత్స అనివార్యమైంది. కావేరి ఆస్పత్రిలో డాక్టర్ ఏఆర్ రఘురాం బృందం ఐదు గంటల పాటు శ్రమించి సెంథిల్ బాలాజీకి బైపాస్ సర్జరీ విజయవంతం చేశారు. ప్రస్తుతం ఆయన ఈడీ దర్యాప్తు చేస్తున్న క్రిమినల్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. దివంగత సీఎం జయలలిత హయాంలో(2011-2016) రవాణా శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీపై లంచాలు తీసుకుని ఉద్యోగాలిచ్చినట్లు (క్యాష్ పర్ జాబ్స్) కుంభకోణం కేసు ఉంది. ఇందులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. చదవండి: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు.. ఆ రోజే వరంగల్‌కు రాక సెంథిల్ బాలాజీ రాజకీయ ప్రస్థానం బాలాజీ 2006 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ తరపున కరూర్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2011లో కరూర్ నుంచి ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచి దివంగత జె. జయలలిత నేతృత్వంలోని ఏఐఏడీఎంకే ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2015లో జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ కుటుంబ సభ్యుడితో విభేదాలు రావడంతో కేబినెట్ నుంచి తొలగించారు. 2016 ఎన్నికల్లో అరవకురిచ్చి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ అన్నాడీఎంకే ప్రభుత్వంలో కేబినెట్ హోదా లభించలేదు. 2017లో అనర్హత వేటు అన్నాడీఎంకేలో చీలిక తర్వాత బాలాజీ శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌కు మద్దతు తెలిపాడు. 2017లో ముఖ్యమంత్రిని మార్చాలంటూ అప్పటి గవర్నర్‌కు పిటిషన్ అందించినందుకు.. అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేసిన 18 మంది ఎమ్మెల్యేల్లో ఆయన ఒకరు. బాలాజీ 2018లో డీఎంకేలో చేరి అరవకురిచ్చి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. మళ్లీ 2019లో అదే నియోజకవర్గం నుంచి, 2021లో కరూర్ నుంచి గెలిచారు. సీఎంకు సన్నిహిత వ్యక్తిగా బాలాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌కు సన్నిహిత వ్యక్తిగా పేరుగాంచడంతో మంత్రి బాధ్యతలు అప్పగించారు. ఇటీవల అన్నాడీఎంకే నుంచి మారినప్పటికీ అతనికి ముఖ్యమైన శాఖలను కేటాయించాడు. అనంతరం బాలాజీపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. డీఎంకే-కాంగ్రెస్ కూటమి అభ్యర్థి గెలుపొందిన ఈరోడ్ ఈస్ట్ ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లకు నగదు పంపిణీ చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. టెండర్ల కేటాయింపులో కూడా అవకతవకలు జరిగాయని బార్ యజమానులు ఆయనపై ఆరోపణలు గుప్పించారు. కొంతమంది బార్ యజమానులు అతని పేరు మీద నెలవారీ రక్షణ డబ్బును డిమాండ్ చేశారని కూడా ఆరోపించారు. -
కస్టడీకి అవకాశం ఇవ్వండి
సాక్షి, చైన్నె: సెంథిల్ బాలాజీని చట్టబద్ధంగానే అరెస్టు చేశామని, ఆయన్ను విచారించేందుకు అవకాశం ఇవ్వాలని కోరు తూ ఈడీ వర్గాలు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాయి. ఆగమేఘాలపై ఆదివారం కోర్టుకు పిటిషన్ రూపంలో వివరాలను సమర్పించాయి. మంత్రి సెంథిల్ బాలాజీని మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో గుండెపోటు రావడంతో ఆయనకు శస్త్ర చికిత్స అనివార్యమైంది. ప్రస్తుతం బైపాస్ సర్జరీ అనంతరం ఆయన కావేరి ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో ఉన్నారు. ఈ పరిస్థితులలో తన భర్తను ఈడీ చట్టవిరుద్ధంగా అరెస్టు చేసినట్టు సెంథిల్‌బాలాజి సతీమణి మేఘల కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ సమయంలో మేఘల తరఫున వాదనలు ముగిశాయి. ఇందుకు వివరణ ఇవ్వాలని ఈడీని హైకోర్టు ఆదేశించింది. తర్వాత విచారణ 27వ తేదీ జరగాల్సిన నేపథ్యంలో ఆదివారమే ఆగమేఘాలపై ఈడీ వర్గాలు రిట్ పిటిషన్‌ను సిద్ధం చేసి కోర్టుకు సమర్పించడం గమనార్హం. ఇందులో సెంథిల్‌ను చట్టబద్ధంగానే అరెస్టు చేశామని వివరించారు. ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా అరెస్టు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. ఆయన్ను ఇంతవరకు తాము విచారించలేదని, కస్టడీకి అవకాశం ఇవ్వాలని కోర్టును కోరారు. అలాగే, అరెస్టుకు ముందుగా అధికారులతో సెంథిల్ దురుసుగా ప్రవర్తించారని, ఆయనకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, వాటిని తారుమారు చేసే పరిస్థితులు ఉన్నట్టు కోర్టుకు ప్రత్యేకంగా వివరించడం గమనార్హం. అదే సమయంలో మేఘల తరఫున అనుబంధంగా మరో పిటిషన్ దాఖలు చేశారు. చట్టంలో పేర్కొనలేని అంశాలతో సమాచారం ఇచ్చినట్టు ఈడీ సూచించిందని వివరించారు. అలాగే, 13వ తేదీ రాత్రే విచారణ ముగించినట్టు పేర్కొన్నారని, రెండు గంటల అనంతరం అరెస్టు చూపించారని, రెండుగంటల పాటు తన భర్తను ఎక్కడ ఉంచారో వివరాలను కోర్టుకు ఈడీ తెలియజేయాలని పిటిషన్లో పేర్కొనడం గమనార్హం. -
ఈడీకి చుక్కెదురు! సెంథిల్ బాలాజీకి ముగిసిన శస్త్ర చికిత్స
సాక్షి, చైన్నె: సుప్రీంకోర్టులో బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్గాలకు చుక్కెదురైంది. సెంథిల్ బాలాజీ వ్యవహారంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు బెంచ్ నిరాకరించింది. ఇదిలాఉండగా, చైన్నె కావేరి ఆస్పత్రిలో మంత్రి సెంథిల్ బాలాజీకి బైపాస్ సర్జరీ విజయవంతంగా ముగిసింది. వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో ఆయన ఉన్నారు. క్యాష్ ఫర్ జాబ్స్ కేసులో మంత్రి సెంథిల్‌బాలాజి అరెస్టయిన విషయం తెలిసిందే. గుండెపోటుతో ఆయన ఆస్పత్రిలో చేరడంతో ఈడీ వర్గాలకు ముచ్చెమటలు తప్పలేదు. ఎలాగైనా తమ కస్టడీకి తీసుకుని ఆయన్ను విచారించేందుకు విశ్వ ప్రయత్నాలు మొదలెట్టారు. సెంఽథిల్ను కావేరి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేందుకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఈడీ దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. విచారణ నుంచి తప్పించుకునేందుకే సెంథిల్ బాలాజి ఆస్పత్రిలో చేరినట్టుందని సుప్రీంకోర్టుకు ఈడీ న్యాయవాదులు వివరించారు. ఆయనకు జరుగుతున్న చికిత్స ఓ ప్రశ్నార్థకంగా పేర్కొన్నారు. దీంతో సెంథిల్ బాలాజి తరఫు న్యాయవాదులు తమ వాదనలో ఈడీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాలుగు చోట్ల గుండెకు వెళ్లే నాళాల్లో బ్లాక్‌లు ఉన్నట్టు వైద్యులు తేల్చినట్టు వివరించారు. దీనిని కూడా ఈడీ వక్రీకరించే ప్రయత్నం చేయడం, అనుమానాలు వ్యక్తం చేయడం శోచనీయమన్నారు. ఆస్పత్రిలో చికిత్సలో వ్యక్తి ఉంటే, అప్పీలుకు ఈడీ వెళ్లడం వెనుక ఆంతర్యమేమిటో అని ప్రశ్నించారు. వాదనల అనంతరం సుప్రీంకోర్టు ఈడీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ, ఈ వ్యవహారంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అలాగే, మద్రాసు హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. దీంతో ఈడీకి చుక్కెదురైనట్టైంది. విజయవంతంగా శస్త్ర చికిత్స.. బుధవారం ఉదయం కావేరి ఆస్పత్రిలో డాక్టర్ ఏఆర్ రఘురాం బృందం ఐదు గంటల పాటు శ్రమించి సెంథిల్ బాలాజీకి బైపాస్ సర్జరీ విజయవంతం చేశారు. ఆయన ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు బులిటెన్ విడుదల చేశాయి. నాళాలలో బ్లాక్‌లు అన్నీ బైపాస్ సర్జరీతో తొలగించామని, ఆయన పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు వివరించారు. కనీసం పది రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో సెంథిల్ ఉండాల్సిన అవసరం ఉన్నట్టు సమాచారం. -
సుప్రీం కోర్టులో విజ్ఞప్తి తిరస్కరణ.. సెంథిల్‌కు శస్త్ర చికిత్స ఏర్పాట్లు
సాక్షి, చైన్నె : క్యాష్ ఫర్ జాబ్స్ కేసులో తమిళనాడు విద్యుత్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని ఎలాగైనా తమ కస్టడీకి తీసుకుని విచారించేందుకు ఈడీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మద్రాసు హైకోర్టు ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ సోమవారం సుప్రీం కోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిని అత్యవసరంగా విచారించాలన్న ఈడీ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. మనీ లాండరింగ్ కేసులో గత వారం మంత్రి సెంథిల్‌బాలాజీని ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన గుండెపోటుతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. మంత్రికి బుధవారం బైపాస్ సర్జరీ చేయడానికి వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో సెంథిల్ బాలాజీని విచారించలేని పరిస్థితిలో ఈడీ తలలు పట్టుకుంటోంది. చైన్నె జిల్లా కోర్టు 8 రోజుల కస్టడీకి అవకాశం కల్పించినా ఇంతవరకు సెంథిల్ బాలాజీని ఈడీ సమీపించలేని పరిస్థితి. హైకోర్టు ఆదేశాలు, ఆంక్షల నడుమ సెంథిల్ బాలాజీ ప్రైవేటు ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన్ను విచారించాలంటే ఆసుపత్రి వైద్యుల సలహాలు, సూచనలు అవసరం. సెంథిల్ బాలాజీ ఐసీయూలో ఉండడంతో ఇంతవరకు వైద్యుల నుంచి ఈడీకి అనుమతి దక్కలేదు. దీంతో హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయించి, ఎలాగైనా సెంథిల్‌బాలాజీని తమ కస్టడీకి తీసుకుని విచారించాలన్న లక్ష్యంగా డెప్యూటీ డైరెక్టర్ నేతృత్వంలోని ఈడీ బృందం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. సుప్రీం కోర్టులో అప్పీలు పిటిషన్ ప్రైవేటు ఆసుపత్రిలో ఉన్న సెంథిల్‌ను ప్రభుత్వ ఆసుపత్రిలోకి తీసుకొచ్చే దిశగా ఈడీ వర్గాలు వ్యూహ రచన చేయడం గమనార్హం. సెంథిల్ బాలాజీ సతీమణి విజ్ఞప్తి మేరకు ఆయన్ను ప్రైవేటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ అనుమతిని రద్దు చేయించేందుకు ఈడీ ప్రయత్నాలు మొదలెట్టింది. ఇందులో భాగంగా అధికారులు సోమవారం సుప్రీం కోర్టులో అప్పీలు పిటిషన్ వేశారు. ఈ వ్యవహారం ఇప్పటికే హైకోర్టుతో పాటు, సుప్రీం కోర్టులో మరో బెంచ్‌లో విచారణలో ఉన్న నేపథ్యంలో అత్యవసరంగా తాము విచారించలేమని వేసవి సెలవుల ప్రత్యేక బెంచ్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ నెల 21వ తేదీన పిటిషన్‌ను విచారిస్తామని న్యాయమూర్తులు ప్రకటించారు. అదే రోజున సెంథిల్ బాలాజీకి శస్త్ర చికిత్స ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఆయన్న ఈడీ కస్టడీకి తీసుకునే అవకాశాలు దక్కేనా అన్నది వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా, సెంథిల్‌ను తమ కస్టడీకి తీసుకునేందుకు ఈడీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో కావేరి ఆసుపత్రి పరిసర మార్గాలలో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేయడం గమనార్హం. -
విచారణలో జాప్యం... అయోమయంలో ఈడీ
సాక్షి, చైన్నె: కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చినా సెంథిల్ బాలాజీని సమీపించలేని పరిస్థితులలో ఈడీ వర్గాలు ఉన్నాయి. దీంతో విచారణలో జాప్యం తప్పడం లేదు. సెంథిల్ బాలాజి ఆరోగ్యపరిస్థితిపై జిప్మర్, ఎయిమ్స్ వైద్యబృందంతో ఈడీ వర్గాలు సమావేశమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం సెంథిల్ బాలాజీకి బైపాస్ శస్త్ర చికిత్స నిర్వహణకు కావేరి వైద్యులు నిర్ణయించినట్టు తెలిసింది. క్యాష్ ఫర్ జాబ్స్ కేసులో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. గుండెపోటు రావడంతో సెంథిల్ బాలాజి ఆస్పత్రిలో చేరారు. అయినా సెంథిల్ బాలాజీని ఈడీ వర్గాలు వెంటాడుతున్నాయి. ఆయన్ను తమ కస్టడీలో ఉంచి విచారించేందుకు కోర్టు అనుమతి సైతం పొందాయి. ఆయన్ను విచారించేందుకు సర్వం సిద్ధం చేసుకున్న ఈడీ వర్గాలకు కోర్టు విధించిన ఆంక్షలు అడ్డంకిగా మారాయి. డాక్టర్ల అనుమతితో సెంథిల్ బాలాజీని విచారించాలని ఈడీకి కోర్టు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆ మేరకు సెంథిల్ బాలాజి వద్ద విచారణ జరిపేందుకు, కోర్టు ఉత్తర్వుల నకలును శనివారం వైద్యులకు ఈడీ వర్గాలు అందజేశాయి. అయితే, సెంథిల్ బాలాజి ఐసీయూలో ఉన్న దృష్ట్యా, ఆయన వద్ద విచారణ కష్టతరంగా మారింది. విచారణకు విశ్వప్రయత్నం.. ఆస్పత్రి వైద్యుల నుంచి ఎలాంటి సమాధానం లేకపో వడం, కోర్టు ఇచ్చిన 8 రోజుల గడువులో రెండు రోజు లు వృథాకావడంతో ఈడీ వర్గాలు అయోమయంలో పడ్డాయి. సెంథిల్ బాలాజీని ఎలాగైనా విచారించి తీ రాలని ఈడీ డెప్యూటీ డైరెక్టర్ నేతృత్వంలోని బృందం విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే, కావేరి వైద్యుల నుంచి సరైన సమాధానం లేనట్టు సమాచారం. దీంతో తమ నేతృత్వంలో రంగంలోకి దిగిన జిప్మర్, ఎయిమ్స్వైద్యబృందతో ఆదివారం ఈడీ వర్గాలు సమావేశమయ్యాయి. తదుపరి చర్యలపై దృష్టిపెట్టాయి. ఇంతవరకు విచారణ ముందుకు సాగని నేపథ్యంలో ఆదివారం కావేరి వై ద్యుల నుంచి వెలువడిన సమా చారం ఈడీకి మరింత షాక్‌గా మారినట్టుంది. బుధవా రం సెంథిల్ బాలాజీకి బైపాస్ శస్త్ర చికిత్స నిర్వహణకు కావేరి వైద్యులు సిద్ధమయ్యారు. ఈ సమయంలో ఆయన వద్ద విచారణ చేపట్టడం అసాధ్యంగా మారింది. దీంతో తమ వైద్యుల బృందంతో సమావేశమై సోమవారం కోర్టును ఆశ్రయించి తర్వాత అడుగులు వేయడానికి ఈడీ వర్గాలు కసరత్తుల్లో మునిగాయి. విమర్శ... సెంథిల్ బాలాజీని వెనకేసుకొచ్చి విచారణ ఖైదీకి అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరించడం శోచనీయమని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి మండిపడ్డారు. సెంథిల్ బాలాజీని పదవి నుంచి తప్పించకుండా, ఇంకా మంత్రి పదవిలో కొనసాగించడం అనుమానాలకు దారితీస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఇదిలాఉండగా, సెంథిల్ బాలాజి వ్యవహారంలో గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రకటనపై డీఎంకే పత్రిక మురసోలి ఆదివారం తీవ్రంగానే స్పందించింది. కేవలం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మంత్రి పదవి తప్పించాలని గవర్నర్ ఒత్తిడి తీసుకురావడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. గవర్నర్ తీరు శాడిజాన్ని తలపిస్తున్నట్టు ధ్వజమెత్తారు. కేవలం ఆరోపణలకే ఒకరికి మంత్రి పదవి నుంచి తప్పించాల్సి వస్తే, ఆ జాబితాలో ఎందరో ఉంటారన్న విషయన్ని గుర్తెరగాలని హితవు పలికారు. గతంలో కేరళ గవర్నర్‌కు ఇలాంటి వ్యవహారంలో ఎదురైన ఎదురుదెబ్బను డీఎంకే పత్రిక మురసోలి గుర్తు చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గవర్నర్ తీరును వ్యతిరేకిస్తూ ఎండీఎంకే నేతృత్వంలో సంతకాల సేకరణకు ఆ పార్టీ నేత వైగో నిర్ణయించారు. -
ఈడీ కస్టడీకి సెంథిల్ బాలాజీ
సాక్షి, చెన్నై: మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని 8 రోజుల ఈడీ కస్టడీకి అప్పగిస్తూ చెన్నై జిల్లా మొదటి Ðమేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి లిల్లీ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. క్యాష్ ఫర్ జాబ్స్ కేసులో మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గుండెపోటు రావడంతో ఆయన్ను కావేరీ ఆస్పత్రిలో చేర్చారు. శుక్రవారం డాక్టర్ ఏఆర్ రఘురాం నేతృత్వంలోని బృందం రెండు మూడు రోజులలో ఆయనకు బైపాస్ సర్జరీ చేయడానికి చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో సెంథిల్ బాలాజీని 15 రోజులు తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ వేసిన పిటిషన్‌పై చెన్నై జిల్లా మొదటి మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి లిల్లీ విచారణ చేపట్టి..ఎనిమిది రోజుల పాటు సెంథిల్ బాలాజీని కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆస్పత్రిలో ఉన్న దృష్ట్యా, విచారణ అక్కడే జరగాలని ఆదేశించారు. సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్‌ను నిరాకరించారు. సెంథిల్ బాలాజీ సోదరుడు అశోకన్‌ను విచారించేందుకు ఈడీ సమన్లు జారీ చేసింది. -
గవర్నర్ Vs సీఎం స్టాలిన్:సెంథిల్ బాలాజీ అంశంలో మరో వివాదం..
తమిళనాడు:తమిళనాడులో గవర్నర్, రాష్ట్ర సీఎం మధ్య వివాదం.. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మంత్రి సెంథిల్ బాలాజీ విషయంలో మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆరోగ్యం బాగులేని కారణంగా మంత్రి సెంథిల్ బాలాజీ నిర్వహిస్తున్న శాఖలను ఇతర మంత్రులకు కేటాయించే అంశాన్ని గవర్నర్ తోసిపుచ్చారు. రాష్ట్రంలో విద్యుత్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలను ప్రస్తుతం మంత్రి సెంథిల్ బాలాజీ నిర్వహిస్తున్నారు. ఈ శాఖలను ఆర్థిక శాఖ మంత్రి తంగం తెన్నెరసు, గృహ శాఖ మంత్రి ఎస్. ముత్తుస్వామికి కేటాయిస్తున్నట్లు పేర్కొని సీఎం స్టాలిన్.. గవర్నర్‌కు లేఖ పంపారు. దీనిపై స్పందించిన గవర్నర్ ఆర్.ఎన్. రవి.. ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. ఈ ప్రతిపాదన మనీలాండరింగ్ కేసును తప్పదారిపట్టించేదిగా ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని అధికార డీఎంకే వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. గవర్నర్ పూర్తిగా బీజేపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని మంత్రి పొన్ముడి ఆరోపించారు. మనీలాండరింగ్ కేసులో మంత్రి సెంథిల్ బాలాజీ హస్తం ఉందనే ఆరోపణలపై ఆయన్ని కేబినెట్ నుంచి తొలగించాలని గవర్నర్ మే31 న సీఎం స్టాలిన్‌కు లేఖ రాశారని పొన్ముడి ఆరోపించారు. కేవలం ఆరోపణలపై ఎలాంటి చర్య తీసుకోబోమని సీఎం స్టాలిన్ తిరిగి లేఖలో అప్పుడే సమాధానమిచ్చినట్లు చెప్పారు. సెంథిల్ బాలీజీ కేసు.. ‘క్యాష్ ఫర్ జాబ్స్’ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు విద్యుత్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ(47)ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం అరెస్టు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద ఆయనను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రవాణా శాఖలో ఉద్యోగాలిప్పిస్తానంటూ మంత్రి సెంథిల్ బాలాజీ పలువురి నుంచి భారీఎత్తున నగదు తీసుకున్నారని ఈడీ ఆరోపించింది. తమిళనాడు సీఎం స్టాలిన్ మంత్రివర్గంలో ఈ చట్టం కింద అరెస్టయిన తొలి మంత్రి సెంథిల్ కావడం విశేషం. ఇదీ చదవండి:తమిళ మంత్రి అరెస్టు -
ఈడీ అరెస్ట్ వేళ సెంథిల్ తలకు గాయం?
సాక్షి, చెన్నై: ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలపై నమోదైన కేసులో తమిళనాడు విద్యుత్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీని అరెస్ట్చేసినపుడు ఈడీ ఆయన పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తించిందా అనే అనుమానాలను తమిళనాడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(టీఎన్ఎస్హెచ్ఆర్సీ) సభ్యుడొకరు వ్యక్తంచేశారు. అదే జరిగితే ఆ అంశాన్ని టీఎన్ఎస్హెచ్ఆర్సీ తప్పక పరిశీలిస్తుందని సంస్థ సభ్యుడు కన్నదాసన్ చెప్పారు. రవాణా శాఖలో ఉద్యోగాలిప్పిస్తానంటూ పలువురి నుంచి భారీఎత్తున నగదు తీసుకున్నారనే ఆరోపణలపై సెంథిల్‌ను విచారించిన ఈడీ అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాటాక అరెస్ట్‌చేశారు. అరెస్ట్వేళ సెంథిల్ బిగ్గరగా రోదించడం, వెంటనే ఆస్పత్రిలో చేర్పించి యాంజియోగ్రామ్ చేయించడం, గుండె నాళంలో బ్లాక్‌లను గుర్తించడం విదితమే. అయితే అర్ధరాత్రి అరెస్ట్ సందర్భంగా తన పట్ల ఈడీ అధికారులు దురుసుగా ప్రవర్తించారని తనను ఆస్పత్రికి కలవడానికి వచ్చిన కన్నదాసన్‌కు సెంథిల్ ఫిర్యాదుచేశారు. ‘ ఈడ్చుకెళ్లారని ఆయన చెప్తున్నారు. లాక్కెళ్లినపుడే ఆయన తలకు గాయమైందట. ఈడీ దురుసు ప్రవర్తన అంశాన్ని టీఎన్ఎస్హెచ్ఆర్సీ పరిశీలిస్తుంది’ అని కన్నదాసన్ చెప్పారు. కాగా, చెన్నై ఓమందూరార్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భర్తను కావేరి ఆస్పత్రికి తరలించి శస్త్ర చికిత్సకు అనుమతి ఇవ్వాలని మంత్రి భార్య మేఘల మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కావేరి ఆస్పత్రికి తరలించి శస్త్రచికిత్స, వైద్య సేవలకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఈడీ అధికారులను ఆదేశించింది. రెచ్చ గొట్టొద్దు: కేంద్రంపై స్టాలిన్ ఫైర్ ఈడీ దాడులు, మంత్రి అరెస్టు నేపథ్యంలో డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్‌చేశారు. ‘డీఎంకే వాడిని. రెచ్చగొట్టొద్దు తట్టుకోలేరు’ అని కేంద్రాన్ని హెచ్చరించారు. కరుణానిధి చేసిన హెచ్చరికలను ఉటంకిస్తూ.. ‘డీఎంకే వాళ్లు తిప్పి కొట్టడం మొదలెడితే భరించలేరు. రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు మేం చేయని రాజకీయాలు లేవు. మేం చూడని పోరాటాలు లేవు. ఒకసారి చరిత్రను చూసుకోండి’ అని హెచ్చరించారు. ‘ఇది బెదిరింపు కాదు. హెచ్చరిక’ అని అన్నారు. సెంథిల్ అరెస్ట్‌పై స్పందించారు. ‘ ఈడీ ద్వారానే రాజకీయాలు చేద్దామని బీజేపీ చూస్తోంది. ఈడీని అడ్డుపెట్టుకుని పదేళ్లనాటి పాత కేసులో మానసికంగా, శారీరకంగా సెంథిల్‌ను వేధిస్తున్నారు. ఈడీ అధికారులు పెట్టిన మానసిక ఒత్తిడితోనే ఆయనకు హృద్రోగ సమస్యలొచ్చాయి. 18 గంటలు నిర్బంధించిమరీ ప్రశ్నల పరంపర కొనసాగించారు. ఎవ్వరినీ కలవనివ్వలేదు. దాంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించాక ఆస్పత్రికి తరలించారు’ అని ఆరోపించారు. -
గుండెపోటు వచ్చేంతగా ఒత్తిడి..
మనీలాండరింగ్ కేసులో అత్యంత నాటకీయ పరిణామాలు, ఉత్కంఠ భరిత వాతావరణం నడుమ రాష్ట్ర విద్యుత్, ఎకై ్సజ్ శాఖా మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ బుధవారం అరెస్టు చేసింది. అర్ధరాత్రి వరకు కొన్ని గంటల పాటు తనను నిర్బధించి విచారించడంతో ఆందోళనకు గురైన సెంథిల్ బాలాజీకి గుండెపోటు సైతం వచ్చింది. ఆయన్ను ఆస్పత్రికి తరలించగా, అత్యవసరంగా బైపాస్ సర్జరీ చేయాల్సిందేనని వైద్యులు నిర్ధారించారు. అయినా, ఈడీ తగ్గలేదు. ఆయన్ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే హయాంలో రవాణాశాఖలో ఉద్యోగాల పేరిట జరిగిన మోసం వ్యవహారం ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వంలో విద్యుత్, ఎకై ్సజ్ శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీ మెడకు ఉచ్చుగా మారిన విషయం తెలిసిందే. గతంలో ఆయన రవాణా మంత్రిగా ఉన్న కాలంలో జరిగిన ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ ఆరోపణలను ఈడీ అస్త్రంగా చేసుకుంది. దీంతో ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాలతో సెంథిల్ బాలాజీని టార్గెట్ చేసింది. మంగళవారం ఆయన నివాసం, సన్నిహితులు, సోదరుడి నివాసం కార్యాలయాలో ఈడీ సోదాలు పొద్దుపోయే వరకు జరిగాయి. కొన్ని గంటల పాటు ఈడీ వర్గాలు విచారణ పేరిట సెంథిల్ బాలాజీని ఉక్కిరి బిక్కిరి చేసినట్టు సమాచారం. అర్ధరాత్రి మూడు గంటల పాటు ఆయన్ను ప్రత్యేక గదిలో ఉంచి నిర్బంధించి మరీ విచారించినట్టు ప్రచారం. దీంతో ఆయన ఆందోళనకు గురై గుండెపోటు తెచ్చుకున్నట్టున్నారు. అదే సమయంలో ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచేందుకు ఈడీ ప్రయత్నించినా, చివరకు సెంథిల్ బాలాజీ నొప్పితో పెడుతున్న కేకలతో సీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ భద్రతా బలగాలు, ఈడీ వర్గాలు తమ వాహనంలో ఎక్కించుకుని ఓమందూరార్ ప్రభుత్వ మల్టీ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. మూడు చోట్ల బ్లాక్‌లు.. పరీక్షించిన వైద్యులు సెంథిల్‌బాలాజీకి గుండెపోటుగా ధ్రువీకరించారు. ఆయన గుండెలోని నాళాలలో మూడు చోట్ల రక్తం బ్లాక్ అయినట్టు తేల్చారు. అత్యవసరంగా ఆయనకు బైపాస్ సర్జరీ చేయాల్సిందేనని సూచించారు. అయితే, ఆయన తమ ఆధీనంలో ఉండడంతో ఈడీ వర్గాలు వైద్యుల సూచనలపై అనుమానాలు వ్యక్తం చేశాయి. చివరకు ఈఎస్ఐ వైద్యులు పరిశోధించి నిర్ధారించారు. అయినా, ఈడీ ఏ మాత్రం తగ్గలేదు. ఆయన్న అరెస్టు చేయడం లక్ష్యంగా దూకుడుగానే ముందుకు సాగింది. సెంథిల్ బాలాజీకి గుండెపోటు సమాచారంతో సీఎం స్టాలిన్, మంత్రులు ఓమందూరార్ ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులతో మాట్లాడారు. ఆయన్ను కావేరి ఆస్పత్రికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే, ఈడీ అడ్డుపడడంతో కావేరి వైద్యులు ఓమందూరార్కు వచ్చి మరీ పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. ఉత్కంఠ నడుమ అరెస్ట్.. సెంథిల్ బాలాజీ అరెస్టుపై ఈడీ దూకుడును ఏమాత్రం తగ్గించలేదు. చైన్నె జిల్లా మొదటి మెజిస్ట్రేట్ న్యాయమూర్తి లిల్లీని ఆశ్రయించారు. ఆమె స్వయంగా ఆస్పత్రికి వచ్చి సెంథిల్ బాలాజీని విచారించారు. వెళ్తూ వెళ్తూ సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసినందుకు తన వద్ద ఆధారాలు సమర్పించినట్టు ఈనెల 28వ తేదీ వరకు రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించి వెళ్లారు. దీంతో సాయంత్రం ఆమె కోర్టులో ఈడీ తరఫు, డీఎంకే తరఫు న్యాయవాదులు వాదనలు వాడి వేడిగా జరిగాయి. ఒక మంత్రి పదవిలో ఉన్న వ్యక్తికి కనీసం సమన్లు కూడా ఇవ్వకుండా సోదాల పేరిట వచ్చి అరెస్టు చేయడమే కాకుండా, మానవత్వాన్ని మరిచి మరీ ఈడీ వ్యవహరిస్తున్నదని వాదనలు వినిపించారు. అత్యవసరంగా బైపాస్ సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు పేర్కొంటున్నా, కస్టడీకి ఈడీ కోరడం వెనుక కక్ష సాధింపు ధోరణి ఉన్నట్టు అనుమానాలు కలుగుతున్నాయని డీఎంకే సీనియర్ న్యాయవాదులు వాదన వినిపించారు. అలాగే, అరెస్టును వ్యతిరేకిస్తున్నామని, రిమాండ్‌ను రద్దు చేయాలని కోరారు. లేదా బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈడీ తరఫు న్యాయవాదులు తమ వాదనలో అరెస్టుకు సంబంధించిన సమాచారం, సెంథిల్‌బాలాజీ, ఆయన కుటుంబానికి తెలియజేశామని, ఆయన్ను కస్టడీకి అప్పగించాలని కోరారు. వాదనల అనంతరం న్యాయమూర్తి తర్వాత ఉత్తర్వులను రిజర్వుడ్‌లో ఉంచారు. గురువారం న్యాయమూర్తి తీర్పు వెలువరించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఆయన్ను శస్త్ర చికిత్స నిమిత్తం కావేరి ఆస్పత్రికి తరలించే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో తన భర్తను ఎందుకు అరెస్టు చేశారో, ఏ కేసులో అరెస్టు చేశారో, ఆయన్ను గుండె పోటు వచ్చేంతగా నిర్బంధించాల్సిన పరిస్థితి ఎమిటో అని ప్రశ్నిస్తూ సెంథిబాలాజీ సతీమణి మేఘల హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను తొలుత ఓబెంచ్కు అప్పగించగా, అందులోని ఓ న్యాయమూర్తి తాను విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు పేర్కొనడం చర్చకు దారి తీసింది. రిమాండ్‌కు కోర్టు ఆదేశాలు ఇచ్చిన దృష్ట్యా, ఓమందూరార్ ఆస్పత్రి పరిసరాలలో పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు నిఘా పెంచారు. ఈడీ పర్యవేక్షణలో సెంథిల్ బాలాజీకి చికిత్స అందిస్తున్నారు. నిఘా కట్టుదిట్టం... మంత్రి అరెస్టు సమాచారంతో ఆయన సొంత జిల్లా కరూర్‌లో, కొంగు మండలంలోని జిల్లాలో భద్రత పెంచారు. కోయంబత్తూరు జిల్లాకు డీఎంకే ఇన్చార్జ్గా సెంథిల్ బాలాజీ దూసుకెళ్తున్నారు. దీంతో అక్కడ ఆయనకు మద్దతు పెరిగింది. అలాగే, ఆయన సామాజిక వర్గం కూడా అధికంగా ఈ మండలంలో ఉండడంతో పోలీసులు ముందు జాగ్రత్తగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే, ఓమందూరార్ ఆస్పత్రి పరిసరాలను నిఘా నీడలోకి తెచ్చారు. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు అవస్థలు తప్పలేదు. గుండెపోటు వచ్చేంతగా ఒత్తిడి.. సెంథిల్‌బాలాజీకి గుండెపోటు వచ్చేంతగా ఈడీ ఒత్తిడి చేసినట్టుందని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వాన్ని మరిచి మరీ తమ యజమానుల కోసం (కేంద్రం) ఈడీ వ్యవహరిస్తున్నట్టు స్పష్టం అవుతోందని ధ్వజమెత్తారు. మంత్రులు ఎం సుబ్రమణియన్, నెహ్రూ, ఉదయనిధి స్టాలిన్, గీతా జీవన్ సెంథిల్ బాలాజీని పరామర్శించినానంతరం కేంద్రం తీరుపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. బీజేపీ హద్దులు దాటి వ్యవహరిస్తున్నదని 2024 ఎన్నికలలో ప్రజలు ఆ పార్టీకి గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. కోయంబత్తూరు , తిరుప్పూర్, ఈరోడ్ కొంగు మండలంలోని జిల్లాలో బీజేపికి వణుకు పుట్టించే విధంగా సెంథిల్‌బాలాజీ పనితీరు ఉండడంతో, ఆయన్ను అడ్డు తొలగించుకునేందుకే అరెస్టు అని మండిపడ్డారు. డీఎంకే మిత్ర పక్ష పార్టీలు సీపీఐ నేత రాజా, సీపీఎం నేత బాలకృష్ణన్ అరెస్టును ఖండించారు. అయితే, ఈ అరెస్టును అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సమర్థించారు. ఈడీని వెనకేసుకొచ్చారు. తప్పు చేసిన వాళ్లు శిక్షించ బడాల్సిందేనని వ్యాఖ్యలు చేశారు. -
తమిళ మంత్రి అరెస్టు
సాక్షి, చెన్నై: ‘క్యాష్ ఫర్ జాబ్స్’ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు విద్యుత్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ(47)ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం అరెస్టు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద ఆయనను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ మంత్రివర్గంలో ఈ చట్టం కింద అరెస్టయిన తొలి మంత్రి సెంథిల్ కావడం విశేషం. సుదీర్ఘంగా ప్రశ్నించిన అనంతరం అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం హైడ్రామా చోటుచేసుకుంది. తనకు అనారోగ్యంగా ఉందని చెప్పడంతో సెంథిల్‌ను సిటీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో చేర్పించారు. ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో సెంథిల్ బాలాజీ బిగ్గరగా రోదిస్తున్న దృశ్యాలు టీవీల్లో ప్రసారమయ్యాయి. గుండెకు సంబంధించిన కరోనరీ యాంజియోగ్రామ్ పరీక్ష వైద్యులు నిర్వహించారు. గుండె నాళంలో మూడు చోట్ల బ్లాక్‌లు ఉన్నట్టు గుర్తించారు. అత్యవసరంగా బైపాస్ సర్జరీకి సిఫారసు చేశారు. బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్న కేంద్రం: స్టాలిన్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సెంథిల్ బాలాజీ నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. చెన్నై, కరూర్, ఈరోడ్‌లో ఈ సోదాలు జరిగాయి. తదుపరి విచారణ కోసం ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం. అరెస్టుపై తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన కేబినెట్ సహచరుడిని పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ నెల 28 దాకా జ్యుడీషియల్ కస్టడీ బాలాజీని ఈ నెల 28 దాకా జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ సెషన్స్ కోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేసింది. తన భర్తను ఎందుకు అరెస్టు చేశారో, ఏ కేసులో అరెస్టు చేశారో చెప్పాలని ఈడీని ప్రశ్నిస్తూ సెంథిల్ బాలాజీ సతీమణి మేఘల హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేశారు. -
బాలాజీని విమర్శించిన స్టాలిన్.. పాత వీడియో పోస్ట్ చేసిన అన్నామలై
చెన్నై: దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రతీకార చర్యలకు బీజేపీ దిగుతోంది. విపక్షాలు మొదటి నుంచి బీజేపీపై చేస్తున్న ప్రధాన ఆరోపణ ఇదే. అందుకు తగ్గట్లుగా తాజాగా తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడం.. తదనంతర నాటకీయ పరిణామాలపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో బీజేపీ కౌంటర్‌కు దిగింది. బాలాజీని ఆస్పత్రికి వెళ్లి మరీ పరామర్శించిన స్టాలిన్.. ఆయన్ని బాధితుడిగా పేర్కొనడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఓ వీడియో పోస్ట్ చేశాడు. గతంలో బాలాజీ అవినీతి విమర్శలు స్టాలిన్ చేసిన సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. తద్వారా స్వరం ఎందుకు మారిందంటూ స్టాలిన్‌ను నిలదీశాడు అన్నామలై. గతంలో క్యాష్ ఫర్ జాబ్ స్కామ్‌లో సెంథిల్ బాలాజీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఆ టైంలో ఆయన డీఎంకేలో లేరు. అన్నాడీఎంకే ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. స్టాలిన్ సహా డీఎంకే కీలక నేతలంతా బాలాజీని అవినీతిపరుడంటూ ఏకిపారేశారు ఆ టైంలో. ఇదే అన్నామలై సదరు వీడియో ద్వారా గుర్తు చేశాడు. కరూర్జిల్లాలో ఓ మంత్రి ఉన్నాడు. ఆయన పేరు సెంథిల్ బాలాజీ. కేబినెట్ ఇప్పటిదాకా 15సార్లు పునర్వ్యవస్థీకరణ అయ్యింది. కానీ, సెంథిల్‌ను మాత్రం కేబినెట్లో అలాగే కొనసాగించారు. ఆయనొక జూనియర్ మంత్రి. సీనియర్లను పక్కనపెట్టి మరీ ఆయన కొనసాగిస్తూ వస్తున్నారు. జయలలిత జైల్లో ఉన్న టైంలో.. ఆయన పేరు సీఎం పదవికి కూడా వినిపించింది. ఆయన, ఆయన సోదరుడు ఇద్దరూ జిల్లాను దోచుకునేందుకే ఉన్నారు.. ఇవీ స్టాలిన్ ఆ వీడియోలో చెప్పిన మాటలు. అయితే ఆ తర్వాత అన్నాడీఎంకేలో నెలకొన్న అంతర్గత సంక్షోభంతో పార్టీని వీడి.. 2018లో సెంథిల్ బాలాజీ డీఎంకేలో చేరారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని మంత్రి సెంథిల్ బాలాజీ చెప్పిన తర్వాత కూడా ఛాతిలో నొప్పి వచ్చేలా చిత్రహింసలకు గురిచేసిన ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఏం సాధించాలనుకుంటోంది. కేసుకు అవసరమైన చట్టపరమైన విధానాలను ఉల్లంఘిస్తూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మానవత్వం లేని విధంగా వ్యవహరించడం అవసరమా? బీజేపీ బెదరింపులకు డీఎంకే భయపడదు. 2024 ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు అంటూ సెంథిల్‌ను కలిశాక ఓ ట్వీట్ చేశారు స్టాలిన్. ఇదిలా ఉంటే.. చెన్నై, కోయంబత్తూరు ఇల్లు, ఇతర ప్రాంతాల్లో 18 గంటల తనిఖీలు నిర్వహించిన అనంతరం ఆయన్ని అర్ధరాత్రి అరెస్ట్ చేసింది ఈడీ. 2011-15 మధ్య అన్నాడీఎంకే ప్రభుత్వంలో రవాణా శాఖా మంత్రిగా ఉన్న టైంలో ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన వ్యవహారంలో మనీలాండరింగ్ ఆరోపణల ఆధారంగా దర్యాప్తు చేసి ఈ అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది ఈడీ. అయితే అరెస్ట్ సమయంలో ఆయన ఛాతీ నొప్పితో కుప్పకూలి స్పృహ కోల్పోవడంతో చెన్నైలోని ఓ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. ఆయనకు బైపాస్ సర్జరీ అవసరమని వైద్యులు ఇప్పటికే ప్రకటించారు కూడా. விசாரணைக்கு முழு ஒத்துழைப்பு தருகிறேன் என்று சொன்ன பிறகும் அமைச்சர் செந்தில் பாலாஜிக்கு நெஞ்சு வலி ஏற்படும் வகையில் சித்ரவதை கொடுத்த அமலாக்கத்துறையின் நோக்கம் என்ன? வழக்கிற்குத் தேவையான சட்ட நடைமுறைகளை மீறி மனிதநேயமற்ற முறையில் அமலாக்கத்துறை அதிகாரிகள் நடந்து கொண்டிருப்பது… pic.twitter.com/D2EIs5vvWN — M.K.Stalin (@mkstalin) June 14, 2023 A gentle reminder to Thiru @mkstalin on what he spoke a few years back about the #CashForJobScam tainted Thiru Senthil Balaji. Are you going to refute this, Thiru @mkstalin? Why are you playing victim card today? https://t.co/ybFUtqrFov pic.twitter.com/c1YeCyhvFn — K.Annamalai (@annamalai_k) June 14, 2023 Netaji used to say “tum mujhe khoon do main tumhe Azadi doonga” These parties say “tum mujhe cash do main tumhe job doonga” The U turn of Stalin ji on corruption & cash-4-job scam isn’t surprising for those who have mastered art of 2G,3G corruption! https://t.co/fgIAqfpUof — Shehzad Jai Hind (@Shehzad_Ind) June 14, 2023 ఇదీ చదవండి: తమిళనాడు మంత్రి అరెస్ట్ సమయంలో జరిగింది ఇదే!