
కరూర్‌లో రచ్చ..కారు ధ్వంసం, (ఇన్‌సెట్) సెంథిల్ బాలాజి
సాక్షి, చైన్నె: రాష్ట్ర విద్యుత్, ఎకై ్సజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని టార్గెట్ చేసే రీతిలో శుక్రవారం ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. చైన్నె, కరూర్, కో యంబత్తూరు, ఈరోడ్‌లోని ఆయన సోదరుడు, స్నే హితులు బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కరూర్‌లో డీఎంకే వర్గాలు తిరగబడడంతో ఐటీ అధికారులు బెంబేలెత్తిపోయారు. రక్షణ కోసం ఎస్పీ కార్యాలయానికి పరుగులు తీశారు. ఆతర్వాత వందలాది మంది పోలీసుల నిఘా నీడలో తనిఖీల్లో నిమగ్నమయ్యారు. తన ఇంట్లో ఐటీ సోదాలు జరగలేదని మంత్రి సెంథిల్ బాలాజీ స్పష్టం చేశారు.
అన్నాడీఎంకే హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగం పేరిట మోసం చేశారంటూ సెంథిల్ బా లాజీపై దాఖలైన కేసులు ప్రస్తుతం మళ్లీ మొదటి నుంచి విచారించే విధంగా గతవారం సుప్రీంకోర్టు ఆదే శించిన విషయం తెలిసిందే. అలాగే, ప్రస్తుతం డీఎంకే కెబినెట్‌లో మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీని టార్గెట్ చేసి అన్నాడీఎంకే, బీజేపీ, పుదియతమిళగంలను తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. గవర్నర్ ఆర్‌ఎన్ రవిని కలి సి ఫిర్యాదు కూడా చేశాయి.
లక్షల కోట్ల అవినీతి అంటూ వ్యాఖ్యలు చేశాయి. తన చుట్టూ ఉన్న వారిని సెంథిల్ బాలాజి ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాడని, వి ద్యుత్, టాస్మాక్ బార్ల కాంట్రాక్టులు, ఖాళీ బాటిళ్ల కొ నుగోళ్ల బాధ్యతలను అప్పగిస్తున్నారని ఆరోపించా యి. వీటిని సెంథిల్ బాలాజి ఖండించారు. అలాగే, బీజేపీ, పుదియ తమిళగం కట్చి నేతలపై గురువారం పరువునష్టం దావా కూడా వేశారు. ఈ వ్యవహారం ఓ వైపు ఇలా ఉంటే, మరో వైపు శుక్రవారం ఉదయాన్నే పదుల సంఖ్యలో ఐటీ అధికారులు రంగంలోకి దిగా రు. సెందిల్ బాలాజీని వ్యక్తిగతంగా టార్గెట్ చేయకుండా ఆయన చుట్టూ ఉన్న వారిపై గురి పెట్టారు.
40 చోట్ల సోదాలు..
కోయంబత్తూరు, ఈరోడ్, చైన్నె, కరూర్‌లలో ఏక కాలంలో ఉదయాన్నే పదుల సంఖ్యలో ఐటీ అధికారులు పలు బృందాలుగా సోదాల్లో నిమగ్నమయ్యారు. కోయంబత్తూరులో డీఎంకే నేత, సెంథిల్ బాలాజీ సన్నిహితుడు, కాంట్రాక్టర్ సెంథిల్ కార్తికేయన్ ఇంట్లో తొలుత సోదాలకు దిగారు. ఈ సమాచారంతో అక్కడకు పెద్ద సంఖ్యలో డీఎంకే వర్గాలు చేరుకుని సోదాలను ఖండిస్తూ నినదించాయి. అలాగే, కోవైలోని మరో సన్నిహితుడు ఈశ్వరమూర్తి నివాసం, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఈరోడ్‌లోని మరో సన్నిహితుడు ఆనందన్, సచ్చినానందన్‌తో పాటు పలుచోట్ల విద్యుత్, టాస్మాక్ కాంట్రాక్టర్లను టార్గెట్ చేసి సోదాలు చేపట్టారు.
కరూర్‌లో రచ్చ..ఐటీ అధికారుల బెంబేలు
సెంథిల్ బాలాజి సొంత జిల్లా కరూర్‌లో ఐటీ సోదాలు రచ్చకు దారి తీశాయి. కరూర్‌లోని సెంథిల్ బాలాజీ సోదరుడు అశోకన్, గణపతి నగర్‌లోని సన్నిహితులు శంకర్, తంగరాజ్, రామకృష్ణన్‌తో పాటు మరి కొందరు బంధువులను గురి పెట్టి అధికారులు సోదాలకు దిగారు. తంగరాజ్ ఇంట్లోకి గోడ దూకి మరీ అధికారులు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అక్కడ వేచి ఉండక తప్పలేదు. అలాగే, అశోకన్ నివాసంలో సోదాలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఓ మహిళా అధికారినిని డీఎంకే వర్గాలు చుట్టు ముట్టేశాయి. దాడికి ప్రయత్నించే సంఘటన ఇక్కడ జరగడంతో ఐటీ అధికారులు బెంబేలెత్తారు. ఓ వాహనం అద్దాలను సైతం డీఎంకే వర్గాలు ధ్వంసం చేశాయి. దీంతో కరూర్‌లో పది చోట్ల సోదాలకు సిద్ధమైన అధికారులు ఆందోళనతో ఎస్పీ సుందరవదనన్ కార్యాలయాన్ని రక్షణ కోసం ఆశ్రయించారు.
అంతా రహస్యం...
సాధారణంగా ఐటీ సోదాలకు వెళ్లే సమయంలో స్థానికంగా ఉన్న పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వడం లేదా, సీఆర్‌పీఎఫ్ బలగాలను అధికారులు వెంట బెట్టుకెళ్లడం జరిగేది. అయితే, ఈ సారి కనీసం పోలీసు అధికారులకు కూడా సమాచారం ఇవ్వకుండా దాడుల వ్యవహారాన్ని రహస్యంగా ఉంచారు. దీంతో తనిఖీలకు వెళ్లిన అనేక చోట్ల ఐటీ అధికారులకు ముచ్చెమటలు తప్పలేదు. ఐటీ అధికారులను డీఎంకే వర్గాలు చుట్టుముట్టడంతో వివాదం రాజుకుంది. చివరకు గట్టి భద్రత నడమ మళ్లీ అధికారులకు సోదాలకు వెళ్లారు. ఈ విషయంగా కరూర్ ఎస్పీ సుందరవదనన్ మీడియాతో మాట్లాడుతూ, ఐటీ దాడుల విషయంగా తమకు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం అందలేదన్నారు. తమను ఆశ్రయించినానంతరం భద్రతను కల్పించామన్నారు. చైన్నెలోని అశోకన్ ఇళ్లు, అతడి సన్నిహితుల కార్యాలయాలు అంటూ ఐదు ప్రాంతాలతో పాటు మొత్తంగా 40 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. వీటితో పాటు కేరళ రాష్ట్రం పాలక్కాడు, తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్, బెంగళూరులో ఉన్న మంత్రి సన్నిహితులను కూడా ఐటీ టార్గెట్ చేసి ఉండడం గమనార్హం.
నా ఇంట్లో జరగలేదు.
ఐటీ దాడులపై మంత్రి సెంథిల్ బాలాజి స్పందించారు. తన ఇంట్లో, కార్యాలయాలలో ఎలాంటి సోదాలు జరగలేదన్నారు. తన సోదరుడు, అతడి సన్నిహితుడు ఇళ్లు, కార్యాలయాలలో సోదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వారంతా పలు చోట్ల కాంట్రాక్టర్లుగా వృత్తిని కొనసాగిస్తున్నారని, వారిని టార్గెట్ చేసి ఐటీ అధికారులు సోదాలలో నిమగ్నమై ఉన్నారని వివరించారు. డీఎంకే నేత ఆర్‌ఎస్ భారతీ స్పందిస్తూ, సీఎం స్టాలిన్ విదేశాలకు వెళ్లిన నేపథ్యంలో పథకం ప్రకారం ఈ ఐటీ దాడులకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల నుంచి తమిళనాడులోకి పెట్టుబడులు రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే బీజేపీ ఈ దాడులను చేయిస్తున్నదని ధ్వజమెత్తారు. కాగా, సోదాలకు వచ్చిన ఐటీ అధికారులపై డీఎంకే సేనలు తిరగబడడం, దాడికి ప్రయత్నించడాన్ని అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, రాష్ట్ర కోఇన్‌చార్జ్ సుధాకర్‌రెడ్డి, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ఖండించారు.

ఈరోడ్‌లో సెంథిల్‌బాలాజి స్నేహితుడిఇంట్లో సోదాలు

Comments
Please login to add a commentAdd a comment