వివాదాస్పదంగా మారిన ఐటీ దాడులు | - | Sakshi
Sakshi News home page

వివాదాస్పదంగా మారిన ఐటీ దాడులు

Published Sun, May 28 2023 6:32 AM | Last Updated on Sun, May 28 2023 6:43 AM

- - Sakshi

తనిఖీలు తగరారుకి కారణమయ్యాయి. సోదాలు సవాళ్లకు దారి తీశాయి. కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలోని ఆదాయపు పన్ను శాఖ రెండు రోజులుగా చైన్నెలో చేపడుతున్న తనిఖీలు వివాదాస్పదం అయ్యాయి. తొలుత మంత్రి సెంథిల్‌ బాలాజీ టార్గెట్‌గా ఐటీ అధికారులు దాడులు చేయడం.. వారిని డీఎంకే వర్గాలు అడ్డుకోవడం.. ఓ దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఆ పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదుకాగా.. ఐటీ అధికారులు తమతో అనవసరంగా ఘర్షణకు దిగారంటూ డీఎంకే వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

సాక్షి, చైన్నె: విద్యుత్‌, ఎకై ్సజ్‌ శాఖ మంత్రి రాష్ట్ర మంత్రి సెంథిల్‌ బాలాజీపై ఐటీ దాడులు చేపట్టడం.. ప్రతిగా డీఎంకే నాయకులు ఎదురుతిరగడం వివాదానికి దారితీస్తోంది. ఈ క్రమంలో కరూర్‌లో ఐటీ అధికారులు డీఎంకే నాయకులపై కేసు పెట్టాయి. అలాగే, తమ మీద ఐటీ అధికారులు అకారణంగా దాడులు చేసినట్టు డీఎంకే వర్గాలు ఆరోపిస్తూ ఫిర్యాదు చేశాయి. దీంతో ఇరువర్గాలపై శనివారం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక రెండు రోజైన శనివారం తుపాకీ నీడలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈరోడ్‌లోని కాంట్రాక్టర్‌ సచ్చిదానందం ఇంట్లో రూ. 2.10 కోట్లు నగదు బయట పడ్డట్టు తెలిసింది.

నువ్వా..నేనా..?
మంత్రి సెంథిల్‌ బాలాజీని టార్గెట్‌ చేస్తూ, ఆయన సోదరుడు, మిత్రులు, సన్నిహితులు, ఎకై ్సజ్‌, విద్యుత్‌ శాఖల కాంట్రాక్టర్లపై శుక్రవారం ఐటీ అఽధికారులు గురి పెట్టిన విషయం తెలిసిందే. చైన్నె, కోయంబత్తూరు, కరూర్‌, ఈరోడ్‌లలోని 40 చోట్ల సోదాలకు దిగారు. ఇందులో 10 చోట్ల సోదాలు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. డీఎంకే వర్గాలు, సెంథిల్‌బాలాజీ మద్దతు దారులు తిరగబడడంతో రక్ష ణ కల్పించాలంటూ ఎస్పీ సుందరవదనన్‌ను ఐటీ అధికారులు ఆశ్రయించారు. దీంతో ఐటీ అధికారు లకు పోలీసులు భద్రతను కల్పించారు. కరూర్‌లోని సెంథిల్‌ బాలాజీ సోదరుడు అశోకన్‌, మరో మిత్రు డు ఇంటి ముందు ఐటీ అధికారులు శనివారం కూడా పడిగాపులు కాయక తప్పలేదు. ఆ ఇళ్లు తాళం వేసి ఉండటం, ఎవ్వరూ లేకపోవడంతో సోదాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక, ఈరోడ్‌లోని టాస్మాక్‌ కాంట్రాక్టర్‌ సచ్చిదానందం ఇంట్లో రూ. 2.10 కోట్లు నగదు బయట పడ్డట్టు సమాచారం. కరూర్‌లో సెంథిల్‌ బాలాజీ సన్నిహిత మిత్రుడు ప్రేమ్‌కుమార్‌ ఇంట్లో తుపాకీ నీడ నడుమ ఐటీ అధికారులుసోదాలు కొనసాగిస్తున్నారు. కోయంబత్తూరులోని సెంథిల్‌ కార్తికేయన్‌ నివాసం, ఆయన మిత్రుడు అరవింద్‌, గాయత్రిల నివాసాలు, కార్యాలయాలు, పునరావాస కేంద్రాలలో నిఘా నీడలో సోదాలు జరుగుతున్నాయి. పొల్లాచ్చిలోని ఎం శాండ్‌ పరిశ్రమలో, అరివింద్‌ ఫామ్‌ హౌస్‌లలో తుపాకీ నీడలో సోదాలు సాగాయి.

సీబీఐ విచారణకు పట్టు..
కరూర్‌లో ఐటీ అధికారులపై దాడులు, వాహనాల ధ్వంసం, కేసుల నమోదు వంటి వ్యవహారాలను అస్త్రంగా చేసుకుని చైన్నె కొళత్తూరుకు చెందిన న్యాయవాది రామచంద్రన్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అధికారులను అడ్డుకోవడం, దాడులకు దిగడం వంటి అంశాలను ప్రస్తావించారు. తనిఖీలకు వచ్చిన అధికారులు రక్షణ కోరుతూ ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన సమయంలో ఆ ఇళ్లల్లో ఉన్న నగదు, కంప్యూటర్లు, రికార్డులు అన్ని గంటల వ్యవధిలో మాయం చేసినట్లు పేర్కొన్నారు. తొమ్మిది చోట్ల ఈ పరిస్థితి నెలకొన్నట్లు ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసుల ద్వారా కాకుండా సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. ఇదిలా ఉండగా, కరూర్‌ నగరంలో అనేక చోట్ల సెంథిల్‌ బాలాజీ మద్దతు దారులు ఐటీ అధికారులకు సవాల్‌ విసురుతూ పోస్టర్లను ఏర్పాటు చేశారు. సింహం పక్కన కూర్చీలో సెంథిల్‌ బాలాజీ కూర్చున్న తరహాలో ఫొటోలు వేసి, ఐటీ అధికారులకు సవాల్‌ విసిరే వ్యాఖ్యలను అందులో పొందు పరచడం తీవ్ర వివాదానికి దారి తీసింది. డీఎంకే వర్గాలు ఏ మేరకు రెచ్చగొడుతున్నారో అందుకు భిన్నంగా ఐటీ సోదాలను అధికారులు మరింత క్షుణ్ణంగా సోదాలు చేయడం గమనార్హం.

పరస్పరం కేసుల నమోదు..
కరూర్‌లో ఐటీ అధికారులపై డీఎంకే వర్గాలు తిరగబడటం, కారు ధ్వంసం చేయడం వంటి పరిణామాలపై కేసులు నమోదు అయ్యాయి. ఐటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో డీఎంకే వర్గాలపై పోలీసులు కేసులు పెట్టారు. విధుల్లో ఉన్న అధికారులను అడ్డుకోవడం, వాహనాలను ధ్వంసం చేయడం తదితర సెక్షన్లను నమోదు చేశారు. అదే సమయంలో ఐటీ అధికారులపై డీఎంకే వర్గాలు కేసు పెట్టాయి. ఇంట్లోకి చొరబడి.. గోడలు దూకిన వారిని ఐడీ కార్డులు చూపించాలని ప్రశ్నిస్తే, తమను కొట్టి మరీ లోనికి వెళ్లినట్టు ఐటీ అధికారులపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం చివరకు హైకోర్టుకు సైతం చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement