Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Public Suffering with Power Cuts In Chandrababu TDP Govt1
నిరంతర ‘కోత’లు!.. అల్లాడుతున్న ప్రజలు

చంటిపిల్లలతో అల్లాడిపోతున్నాం.. విద్యుత్‌ కోత వల్ల మేం సక్రమంగా నిద్రపోయి చాలా రోజులైంది. ఏ పనీ చేసుకోలేక పోతున్నాం. ఉక్కపోత వల్ల చంటి పిల్లలతో అల్లాడిపోతున్నాం. పట్టించుకునే నాధుడే లేడు. విద్యుత్‌ సరఫరా లేక వీధుల్లో నిరీక్షించాల్సి వస్తోంది. – చల్లపల్లి మంగ, తారకరామ కాలనీ, బొబ్బిలి.సాక్షి, అమరావతి: ఒకపక్క ముచ్చెమటలు పట్టిస్తున్న బిల్లులు.. మరోపక్క విద్యుత్తు కోతలతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారు. ఎండాకాలం ప్రారంభంలోనే డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను సరఫరా చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు సర్కారు మండు వేసవిలో అనధికారిక కోతలతో విసనకర్రలే శరణ్యమనే స్థితికి తెచ్చింది. అధికారంలోకి రాగానే వినియోగదారులపై ఏకంగా రూ.15,485 కోట్ల భారం మోపిన టీడీపీ కూటమి సర్కారు కరెంట్‌ సరఫరాలో దారుణంగా విఫలమైందని.. నిరంతర విద్యుత్తు దేవుడెరుగు.. నిరంతరం కోతలు విధిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలపై ‘సాక్షి గ్రౌండ్‌ రిపోర్ట్‌’లో అన్నదాతల అగచాట్లు, పట్టణాలు, పల్లెల్లో ప్రజల దుస్థితి వ్యక్తమైంది. ఏప్రిల్‌ నెలలో విద్యుత్తు సరఫరాకు సంబంధించి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డిమాండ్‌ తక్కువగానే ఉన్నా అది కూడా సరఫరా చేయలేక కూటమి సర్కారు ఎడాపెడా కోతలు విధిస్తోంది. పల్లెల్లో అగమ్యగోచరం..నగరాల్లో గృహాలకు రోజుకు కనీసం మూడు గంటలు, పట్టణాల్లో నాలుగు గంటల పాటు అనధికా­రికంగా విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. వారంలో ఒక రోజు నిర్వహణ పనుల పేరుతో సరఫరా నిలిపి వేస్తున్నారు. పట్టణాల్లో ప్రాంతాలవారీగా రాత్రిళ్లు రెండు గంటలు విద్యుత్‌ కోత పెడుతున్నారు. ఇక గ్రామాల్లో పరిస్థితి గురించి చెప్పనవసరం లేదు. విద్యుత్‌ సరఫరా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి తలెత్తింది. గంటల తరబడి విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. గతంలోనూ చంద్రబాబు హయాంలో ఇదే దుస్ధితి నెలకొందని గుర్తు చేసుకుంటున్నారు. ఎల్‌సీ, లైన్ల మరమ్మతులు, సబ్‌ స్టేషన్‌ నిర్వహణ సాకులు చెబుతూ కోతలు పెడుతున్నారు. ఎవరైనా ఇదేమిటని ప్రశ్నిస్తే పార్టీ ముద్ర వేసి పథకాలు రాకుండా చేస్తామని కూటమి నేతలు బెదిరిస్తున్నారు. బాబు హయాంలో పరిశ్రమలకు పవర్‌ హాలిడే..రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 242.849 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉంది. గతేడాది ఇదే సమయంలో 250.804 మిలియన్‌ యూనిట్ల వినియో­గం నమోదైంది. గతేడాదితో పోలిస్తే 3.17 మిలియన్‌ యూనిట్ల వినియోగం తక్కువే ఉన్నా సరఫరా చేయలేక కూటమి సర్కారు అనధికారిక కోతలు విధిస్తోంది. సాధారణంగా వేసవిలో విద్యుత్‌ వాడకం పెరుగుతుంది. కానీ ప్రస్తుతం డిమాండ్‌ గతేడాది కంటే తక్కువగా ఉన్నా సరఫరా చేయలేకపోతోంది. ఇక మే నెలలో రోజువారీ వినియోగం 260 మిలియన్‌ యూనిట్లకు చేరే అవకాశం ఉందని అంచనా. ఇక అప్పడు పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ‘పవర్‌ హాలిడే’ పేరుతో పరిశ్రమలకు వారంలో రెండు రోజులు విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిపివేసింది. దీంతో కుటీర పరిశ్రమలు మూత­పడ్డాయి. మళ్లీ ఇప్పుడు అవే దుర్భర పరిస్థితులు దాపురిస్తున్నాయనే ఆందోళన పారిశ్రా­మిక వర్గాల్లో వ్యక్తమవుతోంది.విజయనగరం జిల్లా బొబ్బిలి తారకరామ కాలనీలో విద్యుత్‌ కోతల వల్ల ఇళ్లలో ఉక్కపోత భరించలేక అర్ధరాత్రి చంటి బిడ్డతో సహా ఆరుబయట కూర్చుని జాగారం చేస్తున్న జనం భవిష్యత్‌ కోసం..భవిష్యత్‌లో విద్యుత్‌ కోసం ఇబ్బంది పడకుండా ముందస్తు ప్రణాళికలు అమలుకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో పవర్‌ ప్రాజె­క్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. వ్యవసాయానికి 30 ఏళ్ల పాటు పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్‌ అందించేందుకు 7 వేల మెగావాట్లను సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సెకీ) నుంచి అత్యంత తక్కువ ధరకే తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకుంది.నాడు విద్యుత్తు వెలుగులుఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి విద్యుత్‌ డిమాండ్‌ ప్రధాన సూచి­కగా భావిస్తుంటారు. వినియోగ­దా­రులకు నాణ్యమైన విద్యుత్తును నిరంతరం సరఫరా చేయడంలో గత ప్రభుత్వం విజయం సాధించింది. తీవ్ర బొగ్గు కొరత కారణంగా పలు రాష్ట్రాలు సంక్షోభం ఎదుర్కొన్నప్పటికి ఏపీలో వినియోగానికి సరిపడా విద్యుత్‌ సరఫ­రాను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించింది. ఫలితంగా 2020 నుంచి 2024కి 22.5 శాతం విద్యుత్‌ సరఫరా వృద్ధి చెందింది. తాజాగా కేంద్ర విద్యుత్‌ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. 2020లో రాష్ట్రంలో ఏడాది మొత్తం మీద 65,414 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ సరఫరా ఉండగా 2024లో 80,151 మిలియన్‌ యూనిట్లకు పెరిగింది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా తీవ్ర విద్యుత్‌ సంక్షోభం తలెత్తింది. భారత్‌కు చైనా బొగ్గు దిగుమతులు పడిపోయాయి. ఆస్ట్రేలియా నుంచి కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి. జపాన్‌లోనూ విద్యుత్‌ సంక్షోభం తాండవించింది. శీతాకాలంలో వెచ్చదనాన్నిచ్చే దుస్తులు వాడి హీటర్లకు విద్యుత్‌ వినియోగం తగ్గించాలని అక్కడి ప్రభుత్వం అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. అమెరికాలో 15 శాతం విద్యుత్‌ వినియోగంతో పాటు సహజ ఇంధనం ధరలు పెరగడంతో ప్రతి ఆరు ఇళ్లలో ఒక ఇల్లు విద్యుత్‌ బకాయి చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మన రాష్ట్రంలో అవసరానికి తగ్గట్టు విద్యుత్‌ను ఎలాంటి కోతలు లేకుండా గత ప్రభుత్వం ప్రజలకు అందించింది.మా బతుకుల్లో వెలుగు కరువుపగలు రెండు గంటలు, రాత్రి రెండు గంటలు కరెంట్‌ తీసేస్తున్నారు. రాత్రిళ్లు సరిగ్గా భోజనాల వేళకు కరెంట్‌ పోతోంది. వారంలో ఒక రోజు రోజంతా కరెంట్‌ ఉండదు. ఈ ప్రభుత్వం వచ్చాక మా ఇంటికి ఎలాంటి మంచి జరగలేదు. నా భర్తకు పక్షవాతం వస్తే కనీసం పింఛన్‌ ఇవ్వడం లేదు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మా ఇంట్లో, మా బతుకుల్లో ఈ ప్రభుత్వం వల్ల వెలుగు లేకుండా పోయింది. –దిద్దె రత్నకుమారి, జ్యోతి కాలనీ, నిడదవోలు, తూర్పు గోదావరి జిల్లాఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందోఉపాధి కోసం పిండి మర పెట్టుకుని జీవనం సాగిస్తున్నా. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. ఓల్టేజ్‌ ఎక్కువ, తక్కువ అవుతోంది. దీనివల్ల మోటార్లు కాలిపోతున్నాయి. –కిశోర్, నాగమణి పిండిమిల్లు, టీఆర్‌ కాలనీ, బొబ్బిలితెల్లార్లూ కూర్చునే ఉంటున్నాం..కరెంటు కోసం రోజంతా ఎదురు చూడాల్సిందే. తెల్లార్లూ కూర్చునే ఉండాల్సిన పరిస్థితి. సాయంత్రం తీసి తెల్లవారు జామున 3 గంటలకు ఇస్తున్నారు. అందాకా మెలకువగానే ఉంటున్నాం. ఇదేనా నాణ్యమైన విద్యుత్తు? –సీహెచ్‌ లక్ష్మి, బొబ్బిలిఏం ప్రభుత్వమో ఏమో?గత ప్రభుత్వంలో నగరంలో విద్యుత్‌ సరఫరా ఆగడం ఎప్పుడూ చూడలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెట్టుకొమ్మలు నరుకుతున్నాం, ట్రాన్స్‌ ఫార్మర్‌ బాగు చేస్తున్నాం.. అంటూ ఏదో ఒక సాకుతో వారంలో ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ కరెంటు కట్‌ చేస్తున్నారు. ఇదేం ప్రభుత్వమో ఏమో? వేసవిలో విద్యుత్‌ కోతలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా..? మరి ఎందుకు పట్టించుకోరు? –డి.లలిత, విశాఖపట్నంపసిపాప అల్లాడుతోంది..మా అమ్మగారింటికి వచ్చా. ఇక్కడ కరెంట్‌ అసలు ఉండటం లేదు. అస్తమానూ తీసేస్తున్నారు. చిన్నపాప ఉక్కపోతకు అల్లాడి పోతోంది. మా పరిస్థితి ఏమని చెప్పుకుంటాం. కరెంటు కట్‌ చేయొచ్చు కానీ రాత్రిళ్లు కూడా లేకుండానా? కోతల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. –దివ్య, బొబ్బిలిబిల్లుల మోత.. విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తామని హామీలిచ్చి కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. విద్యుత్‌ బిల్లుల మోత మోగిస్తున్న ప్రభుత్వం కోతలను పట్టించుకోవడం లేదు. – షేక్‌ మహమ్మద్‌ అలి, కంభం, ప్రకాశం జిల్లారైతన్న కష్టం వృథా...!నాకున్న ఎకరం పొలానికి తోడు మూడెకరాలు కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తున్నా. చివరి నేలకు తడి లేకపోతే ఇన్ని నెలల కష్టం వృథా అవుతుంది. ఎకరాకు కనీసం రూ.35 వేలు చొప్పున కౌలు చెల్లించాలి. గత ప్రభుత్వంలో వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు విద్యుత్‌ ఒకే విడతలో ఇచ్చేవారు. ఇప్పుడు రోజులో రెండు, మూడు విడతలుగా ఇస్తున్నారు. అది కూడా 7 గంటలు మించడం లేదు. దీంతో తడిసిన నేలే మళ్లీ తడిచి పంటలు ఎండిపోతున్నాయి. గతంలో రైతు భరోసా వచ్చేది. ఇప్పుడు అదీ లేదు. –యాతం రామాంజనేయులు, కడియద్ద, పశ్చిమ గోదావరి జిల్లాఏ పురుగో పుట్రో కరిస్తే...!ఏం ప్రభుత్వమో ఏంటో..! చచ్చిపోతున్నాం ఆఫీసుల చుట్టూ తిరగలేక. నాలుగు రోజులుగా నరకం చూపిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయింది. పంట ఎండిపోతోందంటే ఎవరూ వినిపించుకోవడం లేదు. రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా కొత్తది ఇవ్వడం లేదు. గతంలో 9 గంటలు కరెంటు ఇచ్చేవారు. ఇప్పుడు 7 గంటలు ఇస్తే అదే ఎక్కువ. తెల్లవారుజామున 4 గంటలకు ఇస్తుండటంతో ఆ సమయంలో పొలానికి వచ్చి చేలకు నీరు పెట్టుకుంటున్నాం. ఏ పురుగో పుట్రో కరిస్తే మా పరిస్థితి ఏంటి? ఇదేం బాలేదు. ప్రభుత్వం ఇవన్నీ చూసుకోవాలి కదా!! –మదుకూరి కొండల రాజు, కృష్ణాపురం, పశ్చిమగోదావరి జిల్లా

YS Jagan Wishing speedy recovery For KTR2
బ్రదర్‌ కేటీఆర్‌.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: జిమ్‌లో వర్కౌట్‌ చేస్తుండగా గాయపడిన మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) త్వరగా కోలుకోవాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. బ్రదర్‌ కేటీఆర్‌.. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని వైఎస్‌ జగన్‌ పోస్టు చేశారు. ఇక, బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) జిమ్‌లో వర్కౌట్‌ చేస్తుండగా గాయపడ్డారు. దీంతో, కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేటీఆర్‌కు వైద్యులు ఆయనకు సూచించారు. ఈ విషయాన్ని కేటీఆర్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. వైద్యుల పర్యవేక్షణలో రికవరీ అవుతున్నట్లు పేర్కొన్నారు. త్వరగా కోలుకొని రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పలువురు నేతలు, అభిమానులు కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.Wishing you a speedy recovery, brother. Get well soon! @KTRBRS— YS Jagan Mohan Reddy (@ysjagan) April 29, 2025 Picked up a slip disc injury during a gym workout session. Have been advised a few days of bed rest and recovery by my doctorsHope to be back on my feet soon— KTR (@KTRBRS) April 28, 2025

India Warns Pakistan At UN Over Pahalgam Incident3
పాకిస్తాన్‌ను వదిలే ప్రసక్తే లేదు.. ఐరాసలో భారత్‌ హెచ్చరిక

న్యూయార్క్‌: అంతర్జాతీయ వేదికపై దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్‌ గట్టి షాకిచ్చింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ హింసకు పాల్పడుతున్న పాకిస్తాన్ కుట్రలను ఐక్యరాజ్యసమితిలో భారత్‌ ఎండగట్టింది. పాకిస్తాన్‌ ఇకపై ఏం చేసినా చూస్తూ ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరించింది.తాజాగా ఐక్యరాజ్యసమితిలో పహల్గాం ఉగ్రదాడి అంశాన్ని భారత్‌ లేవనెత్తింది. న్యూయార్క్‌లో ‘ఉగ్రవాద అనుబంధ నెట్‌వర్క్‌ బాధితుల’ కార్యక్రమంలో ఐరాసకు భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధిగా ఉన్న యోజన పటేల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పటేల్‌ మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్‌ ప్రపంచ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నామని స్వయంగా పాక్‌ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ బయటపెట్టారు. ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నట్లు ఏకంగా రక్షణ మంత్రి ఇటీవల అంగీకరించడాన్ని ప్రపంచం మొత్తం విన్నది. ఇలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా పాకిస్తాన్‌ను ఎందుకు క్షమించాలి. ప్రపంచం ఇకపై కళ్లు మూసుకొని చూస్తూ ఉండదు. భారత్‌పై నిరాధార ఆరోపణలు చేయడానికి ఈ అంతర్జాతీయ వేదికను పాక్‌ దుర్వినియోగం చేస్తోంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.VIDEO | Speaking at launch of Victims of Terrorism Associations Network, Deputy Permanent Representative of India in UN, Yojna Patel, said: "It is unfortunate that one particular delegation has chosen to misuse and undermine this forum to indulge in propaganda and make baseless… pic.twitter.com/I0tMhjjcmW— Press Trust of India (@PTI_News) April 29, 2025ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్, భారత్ మధ్య సంబంధాలు తెగిపోయి యుద్దం మేఘాలు కమ్ముకుంటున్న క్రమంలో పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో, ఉగ్రవాద గ్రూపులకు నిధులు, మద్దతునివ్వడంతో పాకిస్తాన్ పాత్ర ఉందని అంగీకరించారు. సుమారు మూడు దశాబ్దాలుగా అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాలకోసం ఈ నీచమైన పని చేశామంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే, సోవియట్ యూనియన్ యుద్ధం, భారత్‌లో జరిగిన 9/11 దాడుల్లో పాల్గొనకపోయి ఉంటే పాకిస్తాన్ ట్రాక్ రికార్డు మరోలా ఉండేది. భారత్ నుంచి దాడి జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే మేము మా బలగాలను పటిష్టం చేశాం. ఈ పరిస్థితుల్లో కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది, ఆ నిర్ణయాలు తీసుకున్నాం అని చెప్పుకొచ్చారు.

IPL 2025, RR VS GT: Cricket Fraternity Praising Young Vaibhav Suryavanshi For His 35 Ball HUndred4
IPL 2025: 35 బంతుల్లో సెంచరీ.. వైభవ్‌ సూర్యవంశీపై ప్రశంసల వర్షం

ఐపీఎల్‌ 2025లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 28) గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 ఏళ్ల రాజస్థాన్‌ రాయల్స్‌ కుర్రాడు వైభవ్‌ సూర్యవంశీ 35 బంతుల్లో సెంచరీ కొట్టి యావత్‌ క్రికెట్‌ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు. ఈ విధ్వంసకర ప్రదర్శనతో సూర్యవంశీపై ప్రశంసల వర్షం​ కురుస్తుంది. సోషల్‌మీడియాలో ఎక్కడ చూసినా సూర్యవంశీ జపమే నడుస్తుంది. క్రికెట్‌ దిగ్గజాలు సూర్యవంశీ సృష్టించిన బీభత్సాన్ని వేనోళ్ల పొగుడుతున్నారు. క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, భారత మాజీ ఆల్‌రౌండర్లు ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసఫ్‌ పఠాన్‌.. ఇలా చాలామంది భారత మాజీలు వైభవ్‌ను ఆకాశానికెత్తారు. సోషల్‌మీడియాలో అభిమానులు వైభవ్‌కు 'బేబీ బాస్‌'గా బిరుదు ఇచ్చారు.స్కూల్‌కు వెళ్లాల్సిన వయసులో (14 ఏళ్ల 32 రోజులు) వైభవ్‌ సృష్టించిన ఈ విధ్వంసకాండ పొట్టి క్రికెట్‌ చరిత్రలో చిరకాలం​ గుర్తుండిపోతుంది. రాజస్థాన్‌ రాయల్స్‌ యాజమాన్యం వైభవ్‌ను ఎంతో నిశితంగా పరిశీలించి, ఈ కుర్రాడిలో ఎదో మ్యాజిక్‌ ఉందని భావించి ఈ సీజన్‌ మెగా వేలంలో రూ. 1.1 కోట్లకు కొనుక్కుంది. ఊహించినట్లుగానే వైభవ్‌ తొలి మ్యాచ్‌లోనే (లక్నోతో) విధ్వంకర ఇన్నింగ్స్‌ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడి ఆకట్టుకున్నాడు. ఆ ఇన్నింగ్స్‌లో వైభవ్‌ తొలి బంతికే సిక్సర్‌ బాది అందరినీ ఆశ్యర్యపరిచాడు. ఆతర్వాతి మ్యాచ్‌లో (ఆర్సీబీ) కాస్త నిరాశపరిచినా (12 బంతుల్లో 16; 2 సిక్సర్లు).. కెరీర్‌లో మూడో మ్యాచ్‌లోనే విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు.ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 38 బంతులు ఎదుర్కొన్న వైభవ్‌.. 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో వైభవ్‌ చాలా రికార్డులను కొల్లగొట్టాడు.- ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా- ఐపీఎల్‌లో సెకెండ్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా (క్రిస్‌ గేల్‌ (30 బంతుల్లో) తర్వాత)- ఐపీఎల్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా- ఐపీఎల్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా (మురళీ విజయ్‌తో కలిసి)- టీ20 క్రికెట్‌లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా - ఐపీఎల్‌లో హాఫ్‌ సెంచరీ (17 బంతుల్లో) చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులు నెలకొల్పాడు.ఈ మ్యాచ్‌లో ప్రదర్శనకు గానూ వైభవ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసులో ఈ అవార్డు అందుకున్న ఆటగాడిగానూ వైభవ్‌ రికార్డుల్లోకెక్కాడు.ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్‌ ఇషాంత్‌ శర్మపై ఎదురుదాడికి దిగిన వైనం మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఇషాంత్‌ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో వైభవ్‌ 3 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 28 పిండుకున్నాడు. అనుభవజ్ఞుడు, కోపిష్టి అయిన ఇషాంత్‌ 14 ఏళ్ల వైభవ్‌ షాట్లు ఆడుతుంటే నిస్సహాయస్థితిలో చూస్తుండిపోయాడు. వైభవ్‌ కరీమ్‌ జనత్‌ వేసిన ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌లోనూ శివతాండవం చేశాడు. ఆ ఓవర్‌లో అతను 3 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 30 పరుగులు రాబట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్‌ ఏ బౌలర్‌నూ వదల్లేదు. వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లో 2 సిక్సలు, 2 ఫోర్లు సహా 21 పరుగులు.. సిరాజ్‌ వేసిన తొలి ఓవర్‌లోనే భారీ సిక్సర్‌.. ప్రస్తుత సీజన్‌లో అద్భుతాలు చేస్తున్న ప్రసిద్ద్‌ బౌలింగ్‌లో మరో భారీ సిక్సర్‌ ఇలా ప్రతి ఒక్క బౌలర్‌ను ఊచకోత కోశాడు. రషీద్‌ ఖాన్‌ ఒక్కడే తప్పించుకున్నాడు.వైభవ్‌ సృష్టించిన విధ్వంసం ధాటికి గుజరాత్‌ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యం​ 15.5 ఓవర్లలోనే ఛేదించబడింది. ఐపీఎల్‌ చరిత్రలోనే 200 ప్లస్‌ టార్గెట్‌ ఇంత తక్కువ బంతుల్లో ఛేదించబడటం ఇదే మొదటిసారి. రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో జైస్వాల్‌ (40 బంతుల్లో 70 నాటౌట్‌; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రియాన్‌ పరాగ్‌ (15 బంతుల్లో 32 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.అంతకుముందు శుభ్‌మన్‌ గిల్‌ (50 బంతుల్లో 84), జోస్‌ బట్లర్‌ (26 బంతులోల​ 50 నాటౌట్‌) సత్తా చాటడంతో గుజరాత్‌ 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.

Gold Robbery in rayalaseema express At Gutti5
గుత్తి: రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ భారీ దొంగతనం.. 30 తులాల బంగారం..

సాక్షి, అనంతపురం: నిజామాబాద్‌-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ (Rayalaseema Express)లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఐదుగురు దుండగులు అర్ధరాత్రి రైలులోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు.వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా గుత్తి వద్ద రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో ఆగి ఉన్న రైలులోకి ఐదుగురు దుండగులు చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. దాదాపు 30 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్టు బాధితులు తెలిపారు. దీనిపై 20 మంది బాధితులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.కాగా, అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు లైన్‌క్లియర్‌ చేసేందుకు గుత్తి శివారులో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపిన సమయంలోనే దుండగులు చోరీకి పాల్పడ్డారు. రైలులోని 10 బోగీల్లో దోపిడీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దుండగుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.

Deputy Collector Audio Causing Uproar: Andhra pradesh6
డిప్యూటీ కలెక్టర్‌ని.. టీడీపీ కోసం ఎంతో చేశా

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘నేను టీడీపీ సానుభూతిపరుడిని.. పార్టీ కోసం ఎంతో పనిచేశా. అయినా భూ వివాదంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ పీఆర్వో మధు బెదిరించారు. అధికారిలా కాదు.. కనీసం మనిషిలా కూడా చూడలేదు’ అంటూ ఓ డిప్యూటీ కలెక్టర్‌ వాపోయాడు. ఈమేరకు ఓ ఆడియో కలకలం సృష్టిస్తోంది. సదరు డిప్యూటీ కలెక్టర్‌ గతంలో తాడికొండ ఎమ్మార్వోగా, కలెక్టర్‌ కార్యాలయంలో ఏవోగా పనిచేశారు.ప్రస్తుతం సెక్రటేరియేట్‌లో పని చేస్తున్నారు. ఆయన సమీప బంధువు విడాకులు తీసుకోవడంతో వారికి సంబంధించిన భూమిపై వివాదం నెలకొన్నట్లు తెలిసింది. చేబ్రోలు మండలంలోని సుమారు రూ.5 కోట్ల విలువ చేసే ఈ భూమి తనకు చెందేలా చూడాలని ఒక మహిళ.. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానిని ఆశ్రయించినట్లు సమాచారం. ఆయన ఆదేశాల మేరకు పీఆర్వో మధు సదరు డిప్యూటీ కలెక్టర్‌ను పెమ్మసాని కార్యాలయానికి పిలిపించుకున్నట్లు తెలిసింది. అక్కడ మధు మరో న్యాయవాదితో కలిసి తనను బెదిరించారంటూ డిప్యూటీ కలెక్టర్‌ ఓ వ్యక్తితో ఫోన్‌లో వాపోయారు. మినిస్టరే డీల్‌ చేయమన్నారంటూ బెదిరించారు! ‘నేను ఐదేళ్లు తాడికొండ ఎమ్మార్వోగా, రెండేళ్లు పెదకాకాని, ఒకటిన్నరేళ్లు వినుకొండ ఎమ్మార్వోగా పనిచేశా. తాడికొండలో ఉన్న టీడీపీ యంత్రాంగం మొత్తానికి నేను తెలుసు. టీడీపీకి ఎంత సేవ చేశానో అందరికీ తెలుసక్కడ. నేను డిప్యూటీ కలెక్టర్‌ కాకపోయి ఉంటే.. టీడీపీ నాయకులు నన్ను ఎమ్మార్వోగా అక్కడికి తీసుకెళ్లి ఉండేవారు. శ్రావణ్‌కుమార్‌ నా గురించి చెబుతారు. జీవీ ఆంజనేయులు నరసరావుపేట ఆర్డీవోగా నన్ను వేయాలని ఎన్నో సార్లు లోకేశ్‌ను అడిగారు. నన్ను ఎక్కడా.. ఎవరూ అగౌరవపరచలేదు. కానీ మధు(పెమ్మసాని పీఆర్వో) చాంబర్‌లో కూర్చోబెట్టి వ్యంగ్యంగా మాట్లాడారు. మినిస్టర్‌గారు ఉంటే ఇలా ఉండేది కాదన్నాను నేను. కానీ మినిస్టరే డీల్‌ చేయమన్నారంటూ పదేపదే బెదిరించారు. దీంతో నేను ఆ వారమంతా మెంటల్‌గా డిస్టర్బ్‌ అయ్యాను.నా హోదాకు గౌరవం ఇవ్వకపోగా.. కనీసం మనిషిలా కూడా చూడలేదు’ అంటూ డిప్యూటీ కలెక్టర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ ఘటన జరిగి చాలా రోజులయ్యింది. కానీ డిప్యూటీ కలెక్టర్‌ ఆడియో తాజాగా వైరల్‌ కావడంతో స్థానికంగా కలకలం రేగింది. కేంద్ర సహాయ మంత్రికి తెలియకుండా ఒక చిరుద్యోగి.. డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి వ్యక్తిని బెదిరించే అవకాశం లేదని.. అంతా ఆయనకు తెలిసే జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ఆడియో టేపు కలకలం సృష్టించడంతో.. ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేసేందుకు పలువురు రంగంలోకి దిగారు. పెమ్మసానికి తెలియకుండా జరిగి ఉంటుందని.. ఆయన సోదరుడు మీతో మాట్లాడతారని.. ఈ విషయాలను మరెక్కడా బయటపెట్టవద్దని డిప్యూటీ కలెక్టర్‌ను కోరారు. ఆడియోలోని వాయిస్‌ తనది కాదని చెప్పాలంటూ డిప్యూటీ కలెక్టర్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

Nawaz Sharif Warns Pakistan PM Shehbaz Sharif Over India7
భారత్‌తో జాగ్రత్త.. పాక్‌ ప్రధానికి నవాజ్‌ షరీఫ్‌ హెచ్చరిక

లాహోర్‌: పహల్గాం అమానవీయ ఉగ్రదాడి ఘటనను ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల సమసిపోవాలంటే దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని తమ్ముడు, పాక్‌ ప్రధాని షెహబాజ్‌కు నవాజ్‌ సలహా ఇచ్చారు.పాకిస్తాన్‌ స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. లాహోర్‌లో నవాజ్‌ షరీఫ్‌తో షహబాజ్‌ ఆదివారం భేటీ అయ్యారు. పహల్గాం దాడి తర్వాత భారత్‌ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా తన ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయనకు వివరించారు. సింధూ నదీజలాల ఒప్పందం నుంచి భారత్‌ వైదొలిగిన విషయాలను వెల్లడించారు. భారత్‌ తీరు వల్లే ఉద్రిక్తతలు పెరిగాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నవాజ్‌ షరీఫ్‌ స్పందించి.. దూకుడుగా వ్యవహరించకుండా, భారత్‌తో శాంతి పునరుద్ధరణ కోసం అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాలను వినియోగించుకోవాలని తన తమ్ముడికి సూచించినట్టు చెప్పుకొచ్చింది. మరోవైపు.. షరీఫ్‌ కుమార్తె, పంజాబ్‌ ప్రావిన్స్‌ ముఖ్యమంత్రి మర్యమ్‌ సైతం ఇంతవరకు ఉగ్రదాడి ఘటనను ఖండిస్తూ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ విషయంలో భారత్‌ కఠిన చర్యలు తీసుకుంది. దీనిపై దాయాది దేశం అక్కసు వెళ్లగక్కుతోంది. ఈ పరిణామాల నడుమ పాకిస్తాన్‌(Pakistan) రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్‌ ఆసిఫ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఘటన నేపథ్యంలో భారత్‌ ప్రతీకార దాడి చేపడుతుందని, త్వరలోనే ఇది జరిగే అవకాశం ఉందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతీకార దాడి జరగనున్న విషయం కాబట్టి.. మా బలగాలను అప్రమత్తం చేశాం. దాడుల జరిగే పరిస్థితుల్లో కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ మేరకు చర్యలు తీసుకున్నామని అన్నారు. అయితే, తన అంచనాలకు దారి తీసిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. భారత్‌ దాడులకు పాల్పడే అవకాశం ఉందని తమ సైన్యం ప్రభుత్వానికి వివరించిందని తెలిపారు. ఈ విషయమై పాక్‌ అత్యంత అప్రమత్తంగా ఉందని, తమ ఉనికికి ప్రత్యక్ష ముప్పు ఉందని భావిస్తే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని పేర్కొన్నారు.

Director Sampath Nandi TO Big Chance To Dimple Hayathi In Sharwanand Movie8
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్‌ ఇచ్చిన డైరెక్టర్‌

చిత్రపరిశ్రమలో రాణించాలంటే హిట్లు తప్పనిసరి.. అలా అయితేనే ఇక్కడ నిలదొక్కుకుంటారు. ముఖ్యంగా ఈ రూల్‌ హీరోయిన్లకు ఎక్కువగా వర్తిస్తుంది. ఫ్లాప్‌ ఇచ్చిన హీరోయిన్స్‌కు మళ్లీ అవకాశాలు రావడం కాస్త కష్టమే.. ఒకట్రెండు హిట్లు కొట్టి ఆ తర్వాత ప్లాపులు రావడంతో చాలామంది హీరోయిన్స్‌ కనిపించకుండా పోయారు. అయితే, ఆ జాబితాలోకి డింపుల్ హయతి(Dimple Hayathi) కూడా చేరిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ, ఈ తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్‌ తలుపుతట్టింది. మళ్లీ తన గ్లామర్‌తో ప్రేక్షకులకు దగ్గర కానుంది. ఈ ప్రాజెక్ట్‌ హిట్‌ అయితే, మళ్లీ పలు సినిమాల్లో తప్పకుండా అవకాశాలు రావచ్చని చెప్పవచ్చు.హీరో శర్వానంద్‌(Sharwanand) కెరీర్‌లో తొలి పాన్‌ ఇండియా సినిమాకు అంతా సిద్ధమైంది. శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ ఈ సినిమాను నిర్మిస్తుండగా సంపత్‌నంది దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఈ మూవీ ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, మరో కీలకమైన పాత్ర కోసం డింపుల్‌ హయాతిని దర్శకుడు సంపత్‌నంది ఎంపిక చేశారు. 2022, 2023లో (ఖిలాడీ, రామబాణం) వరుసగా ఫ్లాపులిచ్చిన డింపుల్ హయతికి మళ్లీ ఛాన్సులు దక్కలేదు. ఈ గ్యాప్‌లో రోజూ జిమ్‌కు వెళ్లి తన గ్లామర్‌ను కాపాడుకుంటూ వచ్చిన ఈ బ్యూటీ మరింత స్లిమ్‌గా అయింది. రెగ్యూలర్‌గా తన గ్లామర్‌ ఫోటోలను సోషల్‌మీడియాలో విడుదల చేస్తూ ఎప్పుడూ ప్రేక్షకులతో టచ్‌లో ఉంటూ వచ్చింది. అలా ఇప్పడు ఛాన్సులు దక్కించుకుంది.1960లో ఉత్తర తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన యధార్థ ఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందుతుందని మేకర్స్‌ ప్రకటించారు. షూటింగ్‌కు అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తామని ప్రకటించారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. View this post on Instagram A post shared by Dimple 🌟 (@dimplehayathi)

India alone App Store ecosystem facilitated Rs 44447 crore in 20249
యాప్‌ స్టోర్‌.. ఏడాదిలో రూ.44 వేల కోట్ల విక్రయాలు

టెక్‌ దిగ్గజం యాపిల్‌ యాప్‌ స్టోర్‌ ద్వారా గతేడాది రూ.44,447 కోట్ల విలువ చేసే డెవలపర్ల బిల్లింగులు, విక్రయాలు (ఉత్పత్తులు, సేవలు) నమోదయ్యాయి. యాపిల్‌కి కమీషన్లులాంటివి లేకుండా ఇందులో 94 శాతం భాగం నేరుగా డెవలపర్లు, వ్యాపార సంస్థలకే లభించింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (అహ్మదాబాద్‌)కి చెందిన ప్రొఫెసర్‌ విశ్వనాథ్‌ పింగళి నిర్వహించిన అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.నివేదికలోని అంశాల ప్రకారం గత అయిదేళ్లలో భారతీయ డెవలపర్లకు అంతర్జాతీయంగా వచ్చే ఆదాయాలు రెట్టింపయ్యాయి. ఫుడ్‌ డెలివరీ, ట్రావెల్, గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్‌ తదితర రంగాలకు చెందిన యాప్‌ల వినియోగం గణనీయంగా పెరిగింది. గతేడాది భారతీయ డెవలపర్ల ఆదాయాల్లో దాదాపు 80 శాతం వాటా ఇతర దేశాల్లోని యూజర్ల నుంచే వచ్చింది. ఏడాది పొడవున యాప్‌ స్టోర్‌ నుంచి 75.5 కోట్ల సార్లు మన డెవలపర్ల యాప్‌లను యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.ఇదీ చదవండి: వ్యాపార ‘పద్మా’లు..భారతదేశంలోని డెవలపర్ల సృజనాత్మకత, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంలో యాప్ స్టోర్ కీలక పాత్ర పోషిస్తుంది. యాపిల్ వ్యాపార నమూనాలో ‘ఫ్రీ’మియం(ఉచితం) యాప్‌లు, పెయిడ్ యాప్‌లు, ఇన్-యాప్ పర్చేజ్‌లు లేదా సబ్‌స్క్రిప్షన్‌లతో కూడిన యాప్‌లు వంటి వివిధ మానిటైజేషన్ విధానాలు ఉన్నాయి. ఇది డెవలపర్లను వారి లక్ష్యాలకు అనుగుణంగా టార్గెటెడ్‌ ఆడియన్స్‌ను ఎంచుకునేందుకు వీలు కల్పిస్తుంది.

When Broken Bones Dont Set Properly Diagnosing NonHealing Fractures10
Bone Fractures: కట్టుకట్టినా సెట్టవ్వలేదా..?

అది రోడ్డు ప్రమాదాలు గానీ, ఇంట్లో ఎత్తు నుంచి పడిపోవడంగానీ బాత్‌రూమ్‌లో జారిపడటం గానీ జరిగినప్పుడు మొదట అందరూ అడిగేది... ఎవరివైనా ఎముకలు విరిగాయా అని. ఇంగ్లిష్‌లో ఫ్రాక్చర్‌ అని పిలిచే ఈ ఎముకలు విరిగినప్పుడు ఆపరేషన్‌తో విరిగిన ఎముకల్ని దగ్గర చేయడం, ప్లేట్స్‌ వేయడం, సిమెంట్‌ కట్టు వేసి అతికించడానికి ప్రయత్నించడం వంటి వైద్య ప్రక్రియల్ని అనుసరిస్తూ ఉంటారు. విరిగిన ఎముకల్ని దగ్గరగా వచ్చేలా సెట్‌ చేసినప్పుడు చాలామందిలో సరిగ్గా అతుక్కునే ఎముకలు కొందరిలో అంతగా సెట్‌ కాకపోవచ్చు. దాంతో ఎముకలు సరిగా సెట్‌ కాలేదనీ, అతుక్కోలేదనీ కొందరు ఫిర్యాదు చేస్తుంటారు. ఇలాంటి కేసులనే ఫెయిల్యూర్‌ ఆర్థోపెడిక్స్‌ అని సాధారణ ప్రజలు చెబుతున్నప్పటికీ... వాస్తవానికి ఇలా సరిగా సెట్‌ కాని సందర్భాల్లో దీన్ని ‘నాన్‌ యూనియన్‌ ఆఫ్‌ ఫ్రాక్చర్‌’గా చెబుతున్నారు. ఇలా సరిగా అతకనప్పుడు ఎముకలు ఉన్న సదరు అవయవం సరిగా పనిచేయకపోవడం, నొప్పి రావడంతో పాటు కొన్నిసార్లు ఆ కండిషన్‌ ప్రాణాంతకం కావడం అనే ముప్పు కూడా రావచ్చు. ఇలా ఎముకలు సరిగా అతకని సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందించాల్సిన చికిత్సల వంటి పలు అంశాల గురించి తెలుసుకుందాం. వాటంతట అవే అతుక్కునే ఎముకలు...విరిగిన ఎముక సరిగా అతకకపోవడం జరిగినప్పుడు అందుకు కారణాలూ, అందులో ఇన్‌వాల్వ్‌ అయిన అంశాలూ ఎన్నో ఉండవచ్చు. ఉదాహరణకు ఒక ఎముక రెండుగా విరిగినప్పుడు దాన్ని సరిగా కూర్చలేకపోతే (సెట్‌ చేయలేకపోతే) ఆ కండిషన్‌ను ‘ఇన్‌సఫిషియెంట్‌ రిడక్షన్‌’ అంటారు. అలాంటి పరిస్థితుల్లో విరిగిన ఎముక చక్కగా అతకదు. ఫలితంగా పూర్తిగా, సరిగా నయం కాదు. ఆ పరిస్థితినే ‘నాన్‌యూనియన్‌’ అంటారు.ఏదైనా ఎముక విరిగినప్పుడు వాటిని సరిగా అమర్చి పెట్టి అలా కాలానికి వదిలేస్తే అవి వాటంతట అవే కుదురుకుని చక్కగా అతుక్కునే శక్తిని ప్రకృతి ఎముకకు ఇచ్చింది. అందుకే విరిగిన ఎముకను సరిగా సెట్‌ చేసి (అమర్చి) అలా వదిలేస్తే కాలం గడిచే కొద్దీ ఎముక దానంతట అదే నయమవుతుంది. ఇందుకు కావల్సినదల్లా ఆ విరిగిన ఆ ఎముక ముక్కల్ని సరిగా కూర్చడం / పేర్చడంలో నైపుణ్యమే. అయితే కొన్ని సందర్భాల్లో కాస్తంత ప్రత్యేక శ్రద్ధ, కొద్దిపాటి చికిత్స మాత్రం అవసరమవుతాయి. అందుకే చాలా సందర్భాల్లో అత్యంత నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స జరగకపోయినా ఎముకలు కుదురుకుంటాయి. ఎముకకు ఉన్న ఈ గుణం మూలానే కొన్నిచోట్ల సంప్రదాయ వైద్యం పేరిట ఎముకలను సెట్‌ చేసేవారూ ఎముకల్ని అతకగలుగుతుంటారు. తనంతట తానే అతుక్కునే సామర్థ్యం ఎముకకు ఉన్నప్పటికీ నిపుణులైన వైద్యుల అవసరం ఎందుకు అవసరమంటే... విరిగిన ఎముకలకు కట్టు కట్టి పూర్తిగా సెట్‌ అయ్యేందుకు వదలాలంటే విరిగిన ప్రదేశంలో అవి సరిగా అమరేటట్లుగా ఉంచడమన్నది చాలా ప్రధానం. ఇది సరిగా జరగక΄ోతే విరిగిన ఎముక సరిగా (ఖచ్చితంగా) అతుక్కోకపోవచ్చు లేదా నయం కావడమన్నది చాలా ఆలస్యంగా జరగవచ్చు. ఇలా ఎముక అతుక్కోవడంలో జాప్యం జరిగితే దాన్ని ‘డిలేయ్‌డ్‌ యూనియన్‌’ అంటారు. ఈ పరిస్థితిని కొందరు ఎదుర్కొంటారు. ఇక కొందరిలో ఎముక సరిగా అతకనే అతకదు. ఈ పరిస్థితిని ‘నాన్‌ యూనియన్‌’ అంటారు.డిలేయ్‌డ్‌ యూనియన్‌ / నాన్‌ యూనియన్‌కు కారణాలుఎముక విరిగిన చోట కణజాలం కూడా తీవ్రంగా దెబ్బతినడం. ఎముక విరిగిన చోట మృదు కణజాలానికి కోలుకోలేనంత నష్టం జరగడం. ఎముక సరిగా అతకని ప్రాంతానికి తగినంత రక్తసరఫరా జరగకపోవడం. ఎముక సరిగా అతకని ప్రాంతంలో ఇన్ఫెక్షన్‌ రావడం. విరిగిన ఎముకను తగినంత సేపు కదలకుండా ఉంచక΄ోవడం, స΄ోర్టు తగినంతగా లభించక΄ోవడం (ఇన్‌సఫిషియెంట్‌ స్ప్లింటేజ్‌). రెండు ఎముకలు అతుక్కునేలా తగినంత ఒత్తిడి (కంప్రెషన్‌) కలిగించక΄ోవడం (ఒక ఎముక మరో ఎముకపై జారకుండా ఉండేలా... ఒకదానితో మరొకటి సరిగ్గా అమరిపోయేలా లేదా కలిసిపోయేలా ఉపయోగించే గరిష్ఠ ఒత్తిడిని కంప్రెషన్‌ అంటారు). ఎముక అతుక్కోకపోవడానికి కారణాలుఎముక అసలే అతుక్కోక΄ోవడాన్ని నాన్‌యూనియన్‌ అంటారు. సాధారణంగా ఆలస్యంగా అతుక్కోడానికి కారణమయ్యే అంశాలే ఎముక అసలు అతుక్కోక΄ోవడానికీ చాలావరకు కారణం కావచ్చు. దానితోపాటు మరికొన్ని కారణాలూ ఉండవచ్చు. అవేమిటంటే... ∙క్యాలస్‌ బ్రిడ్జ్‌ ఏర్పడకపోవడం : రెండు ఎముకలు అతికించేందుకు దగ్గర చేసినప్పుడు వాటి మధ్య కొంత గ్యాప్‌ రావడం. దీని గురించి ఇంగ్లిష్‌లో చె΄్పాలంటే... టూ లార్జ్‌ స్పేస్‌ ఫర్‌ ఫార్మేషన్‌ ఆఫ్‌ క్యాలస్‌ బ్రిడ్జ్‌గా దీన్ని పేర్కొంటారు... అంటే ఎముక అతుక్కునే ముందర రెండు ముక్కల మధ్య ఒక బ్రిడ్జ్‌లాంటిది ఏర్పడుతుంది. దాన్నే ‘క్యాలస్‌ బ్రిడ్జ్‌’ అంటారు. గ్యాప్‌ రావడం వల్ల అది ఏర్పడదు. ఇంటర్‌΄ పొజిషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌ టిష్యూ : అతుక్కోవాల్సిన రెండు ఎముకల మధ్య మృదుకణజాలం అడ్డుగా రావడం వల్ల ఎముక అతుక్కోదు. ఇలా జరగడాన్ని ఇంటర్‌పొజిషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌ టిష్యూ గా పేర్కొంటారు. అవసరమైన పరీక్షలు విరిగిన ఎముక సరిగా అతుక్కుందా లేక సరిగా అతుక్కోలేదా లేదా అతుక్కునే ప్రక్రియ ఆలస్యం అవుతోందా అన్న విషయాన్ని నిర్ధారణ చేయడానికి ఎక్స్‌–రే పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. శస్త్రచికిత్స రహిత విధానాలుఇందులో సర్జరీ లేకుండానే క్యాల్షియమ్‌ సప్లిమెంటేషన్‌ ఇవ్వడం, తొడుగులు వంటి ఉపకరణాలను అమర్చడం వంటి ప్రక్రియలను అవలంబిస్తారు. చికిత్సఎముకలు సరిగా అతుక్కోకపోవడం లేదా ఆలస్యంగా అతుక్కోవడం వంటి సమస్య ఎదురైనప్పుడు అందుకు కారణమైన అంశాలను చూడాల్సి ఉంటుంది. కారణాన్ని బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఎముక అతుక్కోవడంలో ఆలస్యం జరిగినప్పుడు ఎముక పెరిగేలా బోన్‌గ్రాఫ్ట్‌ వంటి ప్రక్రియలను కూడా అవలంబించాల్సి రావచ్చు. శస్త్రచికిత్సఎముక సరిగా అతకని చోట బాధితులకు అవసరమైన శస్త్రచికిత్సను చేయడం. ఎముకలు అతకని పరిస్థితి నివారణ ఇలా... ఇక ఎముక సరిగా అతకకపోవడం వంటి పరిస్థితిని నివారించడానికి... ఇలాంటి పరిస్థితిని నివారించాలంటే... ఎముక ఫ్రాక్చర్‌ అయిన వ్యక్తికి పొగతాగే అలవాటు ఉంటే దాన్ని తప్పనిసరిగా మానేయాలి. డాక్టర్‌ చెప్పిన చికిత్స ప్రక్రియను తప్పనిసరిగా అనుసరించాలి. అన్ని పోషకాలు అందేలా అన్ని ΄ోషకాలు ఉన్న ఆహారాన్ని వేళకు తింటుండాలి. పొగతాగేవారు, స్థూలకాయులు, మధుమేహం (డయాబెటిస్‌) సమస్య ఉన్నవారిలో నాన్‌–యూనియన్‌కు అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ సమస్యలున్నవారు మరింత జాగ్రత్తగా ఉంటూ డాక్టర్‌ చెప్పే అని సూచనలనూ పాటించాల్సి ఉంటుంది.అతుక్కోని భాగాలు ఏవంటే...నిజానికి శరీరంలోని ఏ ఎముక అయినా సరిగా అతుక్కోక΄ోవడానికి ఆస్కారం ఉంది. అయితే మన శరీరంలో కొన్ని ఎముకలు మాత్రం ఒకపట్టాన అతుక్కోకుండా ఇబ్బంది పెడుతుంటాయి. అందుకు పలు అంశాలు కారణమవుతుంటాయి. ఉదాహరణకు మిగతా ఎముకలతో ΄ోలిస్తే ఆ ఎముకలకు రక్తసరఫరా సరిగా ఉండక΄ోవడం వంటివి. అందుకే ఆ ఎముకల విషయంలో తరచూ ఇలాంటి ఇబ్బంది కలుగుతుంది. ఆ ఎముకలు లేదా ఫ్రాక్చర్లు ఏవంటే... లాటెరల్‌ కాండైల్‌ హ్యూమరస్‌ ఫ్రాక్చర్‌: మోచేతిలో బయటవైపు ఉండే ఎముక విరిగితే దాన్ని లాటరల్‌ కాండైల్‌ హ్యూమరస్‌ ఫ్రాక్చర్‌ అంటారు. ఇది సరిగ్గా అతుక్కోవడంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు.ఫీమోరల్‌ నెక్‌ ఫ్రాక్చర్‌: తుంటి ఎముకలో తొడలో ఉండే కాలి ఎముక సరిగ్గా ఓ గిన్నెలాంటి భాగంలో బంతిలా కూర్చుంటుంది. ఈ బంతికీ, మిగతా ఎముకకూ మధ్య ఉండే సన్నటి భాగం (నెక్‌) విరిగినప్పుడు అది అంత త్వరగా సెట్‌ కాకపోవచ్చు. ఫిఫ్త్‌ మెటాటార్సల్‌ (జోన్స్‌ ఫ్రాక్చర్‌)అరికాలిలో ఉండే ఎముకల్లో ఒకటైన ఈ ఎముక ఫ్రాక్చర్‌ అయినప్పుడు అతుక్కోవడం ఒకింత కష్టం కావచ్చు.టాలస్‌ ఫ్రాక్చర్‌చీలమండ ఎముకల మధ్య ఉండే ఎముకకు అయిన ఫ్రాక్చర్‌. స్కేఫాయిడ్‌ ఫ్రాక్చర్‌మణికట్టుపై బరువు పడినప్పుడు అయిన ఫ్రాక్చర్‌లు. సరిగా అతుక్కోకపోవడమన్నది చాలా కొద్దిమందిలోనే... ఫ్రాక్చర్‌ అయినవాళ్లలో కేవలం ఒక శాతం కేసుల్లోనే ఎముక అసలు అతుక్కోక΄ోవడం (నాన్‌–యూనియన్‌) జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితి చాలావరకు కాళ్ల ఎముకల విషయంలోనే ఎక్కువ. ఎందుకంటే కాలి ఎముక విరిగాక మళ్లీ కాళ్లు కదిలించాల్సి వచ్చినప్పుడు తగిలిన చోటే మళ్లీ మళ్లీ దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ కండిషన్‌ పునరావృతమయ్యే అవకాశాలెక్కువ. ఎముక సరిగా అతకకపోయినా (నాన్‌యూనియన్‌లోనైనా) లేదా ఆలస్యంగా అతికినా (డిలేయ్‌డ్‌ యూనియన్‌లో) కనిపించే సాధారణ లక్షణాలివి... ఎముక విరిగిన చోట (ఫ్రాక్చర్‌ ప్రాంతంలో) నొప్పి తగ్గక΄ోవడం లేదా అదేపనిగా నొప్పి వస్తుండటం. ఎముక విరిగిన శరీర భాగాన్ని మునుపటిలా ఉపయోగించలేక΄ోవడం. ఎముక ఫ్రాక్చర్‌ అయిన చోట వాపు (స్వెల్లింగ్‌) రావడం. విరిగిన ఎముకకు సంబంధించిన కీలు (జాయింట్‌)ను కదల్చలేక΄ోవడం. విరిగిన ఎముక సరిగా అతుక్కోక కాస్త అటు ఇటు కదులుతుండటం. విరిగిన ఎముకలు అతుక్కోవడంలో ఎదురయ్యే సమస్యలివి... విరిగిన ఎముక నయమయ్యే సమయంలో ఇతరత్రా అనేక సమస్యలు ఎదురుకావచ్చు. అసలు ఒక ఎముక అతుక్కోనేలేదని ఎప్పుడు చెప్పవచ్చంటే... ∙మూడు నుంచి ఆర్నెల్ల తర్వాత కూడా విరిగిన ఎముక అతుక్కోకుండా ఉంటే దాన్ని ఎముక అతుక్కోవడంలో ఆలస్యం (డిలేయ్‌డ్‌ యూనియన్‌)గా చెప్పవచ్చు. ఒకవేళ ఆర్నెల్ల తర్వాత కూడా అతుక్కోకపోతే దాన్ని ‘నాన్‌యూనియన్‌’గా పేర్కొనవచ్చు. ∙ఒక చోట ఎముక అతకడంలో తీవ్రమైన ఆలస్యం జరుగుతోందంటే అక్కడ ఎముక అతుక్కోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అర్థం. జాప్యం తీవ్రంగా ఉందంటే దాన్ని కొంతమేర అతకని ఎముక (నాన్‌యూనియన్‌)గానే పరిగణించాల్సి ఉంటుంది. ∙రెండుగా విరిగిన భాగాలు ఒకదానితో ఒకటి అతుక్కుపోయినప్పటికీ అది సరిగా ఖచ్చితమైన రీతిలో కూర్చినట్లుగా అతుక్కోక΄ోతే దాన్ని ‘మాల్‌యూనియన్‌’ అంటారు. సాధారణంగా ఎముక సరిగ్గా రెండు ముక్కలుగా విరిగినప్పుడు దాన్ని సరిగా కూర్చుండబెట్టినప్పుడు సరిగానే అతుక్కుంటుంది. అయితే కొన్నిసార్లు దెబ్బ చాలా బలంగా పడి కొన్ని ఎముక విరిగిన చోట ముక్కలుగా అయి΄ోవడం వల్ల అతికించే ప్రక్రియలో ఖచ్చితంగా కూర్చలేని పరిస్థితులు ఏర్పడవచ్చు. దాని వల్ల ఎముక నిడివి కాస్త తగ్గవచ్చు. దీన్ని ‘ఇన్‌సఫిషియెంట్‌ రిడక్షన్‌’గా పేర్కొంటారు. పైన వివరించిన పరిస్థితులు ఏవైనప్పటికీ విరిగిన ఎముక సరిగా అతకక΄ోయినా లేదా అతుక్కోవడంలో ఆలస్యం జరిగినా బాధితులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. డాక్టర్‌ బాలవర్థన్‌ రెడ్డిసీనియర్‌ కన్సల్టెంట్‌ఆర్థోపెడిక్‌ సర్జన్‌ (చదవండి: ఎనర్జిటిక్‌ హేమంగి..! న్యూక్లియర్‌ సైన్స్‌లో..)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement