Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Pakistan PM Shehbaz Sharif Reacts To Pahalgam Incident1
అంతా భారత్‌ ఇష్టమేనా?.. దేనికైనా రెడీ.. పాక్‌ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

ఇస్లామాబాద్‌: భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాక్‌ ప్రధాని షెహబాబ్‌ షరీఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌ ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. భారత్‌ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు అంటూ కామెంట్స్‌ చేశారు.జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్‌ పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌ పౌరులు భారత్‌ను విడిచి వెళ్లిపోవాలని, నదుల విషయంలో కూడా నీటిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ పరిణామాలపై పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీష్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామంటూ ఇటీవల భారత ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై షరీఫ్‌ పరోక్షంగా స్పందించారు.Prime Minister Shehbaz Sharif has offered India cooperation in an impartial investigation of the Pahalgam incident, stating that there will be no compromise on Pakistan's security and dignity.#ShehbazSharif #Pakistan #India #Pahalgam #PakistanArmy #TOKReports pic.twitter.com/5vh6y1O63T— Times of Karachi (@TOKCityOfLights) April 26, 2025ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని పాకిస్తాన్‌ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్‌ వేడుకల్లో పాక్‌ ప్రధాని షరీఫ్‌ మాట్లాడుతూ..‘మా దేశ భద్రత, సార్వభౌమత్వంపై ఎన్నటికీ రాజీపడబోం. ఎలాంటి ముప్పును ఎదుర్కోడానికైనా సంసిద్ధంగా ఉన్నాం. పహల్గాంలో ఇటీవల జరిగిన విషాదకర ఘటనతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది. ఆ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. శాంతికే మా ప్రాధాన్యం. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశం కరెక్ట్‌ కాదు. భారత్‌ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు. ఈ చర్యతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మేం కోరుకుంటున్నాం’ అంటూ భారత్‌ను నిందించే ప్రయత్నం చేశారు. చివరగా.. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామంటూ చెప్పుకొచ్చారు. పహల్గాం దాడి (Pahalgam)పై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధమేనని ప్రకటించారు.Pakistan's PM Shehbaz Sharif says the country’s armed forces are "prepared to defend the country’s sovereignty" after Delhi accused Islamabad of being linked to the attack on tourists in Kashmir. #RUKIGAFMUpdates pic.twitter.com/qtJic92uZU— Rukiga F.M (@rukigafm) April 26, 2025

Pakistan Official Taimur Rahat Over Action With Protestors In UK2
పాక్‌ అధికారి బలుపు సైగలు.. భారతీయుల పీక కోస్తా అంటూ.. (వీడియో)

లండన్‌: పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాద చర్యకు వ్యతిరేకంగా పలు దేశాల్లో భారతీయులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భారతీయులపై పలుచోట్ల కవ్వింపు చర్యలకు దిగుతున్నారు పాకిస్తానీలు. తాజాగా యూకేలో(Pakistan High Commission in London) ప్రవాస భారతీయులను ఉద్దేశించి.. పాక్‌ చెందిన ఓ అధికారి ఓవరాక్షన్‌కు దిగాడు. పీక కోస్తానంటూ బహిరంగా సైగలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ భారతీయులు లండన్‌లోని పాకిస్థాన్ హైకమిషన్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం, యూకేలో పాకిస్థాన్ హైకమిషన్‌కు చెందిన కల్నల్ తైమూర్ రహత్(Colonel Taimur Rahat) నిరసనలు తెలుపుతున్న ప్రదేశానికి వచ్చారు. అందరూ చూస్తుండగాకల్నల్ తైమూర్ రహత్.. భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ ఫ్లెక్సీని భారతీయులకు చూపిస్తూ.. పీక కోస్తామంటూ సైగలు చేశాడు. ప్రవాస భారయుతీలను ఉద్దేశించి ఇలా ప్రవర్తించాడు. దీంతో, అక్కడున్న భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.JUST IN: 🇬🇧 Pakistan Army Officer Makes Throat-Slitting Gesture at Indian Protestors in London.Col. Taimur Rahat, Defence Attaché at Pakistan's UK Mission, caught behaving like a street thug — no difference between a uniformed officer and a terrorist.Shameful and cowardly… pic.twitter.com/gy5wY7dH48— Asia Nexus (@Asianexus) April 26, 2025ఇక, పాకిస్థాన్ హైకమిషన్ వద్ద భారతీయులు నిరసనలు తెలుపుతున్న సమయంలో ఆఫీసులో ఉన్న పాక్‌ అధికారులు భారీ సౌండ్‌తో మ్యూజిక్‌ వింటున్న శబ్దాలు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. నిరసనలు వారికి వినిపించకుండా ఉండేందుకే ఇలా చేసినట్టు సమాచారం. లండన్‌లోని పాక్‌ హైకమిషన్‌ వద్ద దాదాపు 500 మంది భారతీయులు నిరసనలు చేపట్టినట్టు సమాచారం. మరోవైపు, పహల్గాం దాడి తర్వాత.. ఢిల్లీలోని పౌక్ దౌత్య కార్యాలయంలో కేక్ తెచ్చుకుని సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీన్ని బట్టి చూస్తే భారతీయుల విషయంలో పాక్ అధికారులు ఎంత క్రూరంగా ఉన్నారో అర్థమవుతోంది. పాక్‌ అధికారుల తీరుపై అక్కడున్న సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. Pakistan High Commission London Military Attache Commander Muhammad Zeeshan Nabi Sheikh SI(M) Colonel Taimur Rahat Tea is Fantastic pic.twitter.com/7vz68nHTFk— Malik islam Awan (@MalikIslam_1) April 25, 2025 Indians in London were protesting against the Pahalgam attack outside the Pakistani embassyThen Colonel Taimur Rahat, Pakistan's military attache in Britain, came to the embassy balcony and signaled Indians to slit Abhinandan's throat with a photo of AbhinandanNow you think… pic.twitter.com/rbGpK81kj1— 🇮🇳Jitendra pratap singh🇮🇳 (@jpsin1) April 26, 2025సింధూ నదిలో పారేది రక్తమే.. ఇక, అంతకుముందు.. పాక్‌ మాజీ విదేశాంగ మంత్రి, పాక్‌ పీపుల్స్‌ పార్టీ చీఫ్‌ భిలావల్ భుట్టో (Bilawal Bhutto) జర్దారీ భారత్‌పై నోర పారేసుకున్నారు. సింధూ (Indus Water treaty) నదిలో నీరు పారకపోతే.. రక్తం పారుతుందంటూ ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధూ నది తమదేనని, ఆ నాగరికతకు నిజమైన సంరక్షకులం తామేనంటూ భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు.కాగా.. అంతకుముందు పాక్‌ (Pakistan) రక్షణ మంత్రి కూడా ఇదేతరహా ప్రేలాపనలు చేశారు. సింధూ నదిలో ప్రతి చుక్కా తమదేనని, భారత్‌ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని మరో మంత్రి ఆరోపించారు. ఇక, మన దేశంపై విషం చిమ్ముతూ లష్కరే తోయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ సింధూ నది (Indus River) గురించి మాట్లాడిన వీడియో బయటికొచ్చింది. ‘కశ్మీర్‌లో డ్యాం నిర్మించడం ద్వారా పాక్‌కు నీళ్లు ఆపేస్తామని మీరంటున్నారు. పాక్‌ను నాశనం చేయాలని, చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా ప్రణాళికలను విఫలం చేయాలని కోరుకుంటున్నారు. కానీ మీరు నీళ్లు ఆపేస్తే.. నదుల్లో మళ్లీ రక్తం పారుతుంది’ అని హఫీజ్‌ అందులో బెదిరింపులకు పాల్పడటం గమనార్హం.

YS Jagan Shocking Comments On TDP Government In PAC Meeting3
పోలీసు కేసులు ప్రజాదరణను దూరం చేయలేవు!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఒక వ్యాఖ్య చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఏమవుతుందని ప్రశ్నించారు. జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచి వేయలేరని ఆయన స్పష్టం చేశారు. గతంలో తనను 16 నెలలు జైలులో పెట్టారని, పార్టీని నడిపే పరిస్థితి లేకుండా చేశారని, అయినా ప్రజలు ఆశీర్వదించారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో పార్టీ ఉందని, ఎన్ని కేసులు పెడితే ప్రజలు అంత తీవ్రంగా స్పందిస్తారని పేర్కొన్నారు. జగన్ వ్యాఖ్యలు హేతుబద్దమైనవి. మద్యం కేసుతో పాటు సీనియర్ పోలీసు అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును అరెస్టు చేయడంపై ఆయన స్పందించారు. ఒక్కసారి గతంలోకి వెళితే 2011లో జగన్ కాంగ్రెస్ ఎంపీగా ఉండే వారు. తండ్రి మరణం తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన సొంతంగా పార్టీని స్థాపించుకోవాలని నిర్ణయించుకుని పదవికి రాజీనామా చేశారు. కడప లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో 5.45 లక్షల ఓట్ల అధిక్యతతో విజయం సాధించి జగన్ సంచలనం సృష్టించారు. అప్పుడు కూడా కాంగ్రెస్, టీడీపీలు కలిసే కుట్ర చేశాయి. జగన్‌ను ప్రజా క్షేత్రంలో ఓడించాలేమన్న భయంతో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా వ్యవహరించి కాంగ్రెస్‌కు అండగా నిలిచారు. ఆ తర్వాత జగన్ కంపెనీలతో సంబంధం లేని కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరరావుతో హైకోర్టులో ఫిర్యాదు చేయించడం, దానికి టీడీపీ మద్దతివ్వడం, ఆ వెంటనే హైకోర్టు ఆ కేసును సీబీఐకి అప్పగించడం జరిగిపోయాయి.తదుపరి సీబీఐ కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ముఖ్యంగా సోనియాగాంధీ ఆదేశాల ప్రకారం వ్యవహరించి జగన్‌ను జైలులో పెట్టింది. బెయిల్ రాకుండా కూడా అడ్డుపడ్డారు. చివరికి 16 నెలల తర్వాత బెయిల్ లభించింది. అయినా ఆయన రాజకీయంగా నిలబడ్డారు. జైలులో ఉన్నప్పుడు జరిగిన 18 ఉప ఎన్నికలలో 15 చోట్ల జగన్ పార్టీ విజయ దుంధుభి మొగించింది. ఆ అనుభవాలను మననం చేసుకుంటే సరిగ్గా అదే రీతిలో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వైసీపీ నేతలపై, కొందరు అధికారులపై కేసులు పెడుతున్నట్లు కనిపిస్తుంది. కూటమి అధికారంలోకి రాగానే రాజకీయ ముద్ర వేసి కొందరు అధికారులను సస్పెండ్ చేయడం చేశారు. పోస్టింగులు ఇవ్వకుండా వేధించారు. ఒక మోసకారి నటిని పట్టుకు వచ్చి పోలీసు ఉన్నతాధికారిపై కేసు పెట్టించి, తదుపరి ఆయనను జైలులో పెట్టారు. మరో వైపు అనేక మంది వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడుతూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇందు కోసం కొందరు రిటైర్డ్ పోలీసు అధికారులను కూడా ఉపయోగించుకుంటున్నారని చెబుతారు. ఆ తర్వాత తమ రెడ్‌బుక్‌ను పై స్థాయికి తీసుకు రావడానికి ప్రయత్నాలు ఆరంభించారు. దీనికి తగ్గట్లే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో కూడా ఈ కేసుపై చర్చించారని అనుకోవాలి. పైకి పోలవరం-బనకచర్ల తదితర అంశాలపై షా ను కలిసినట్లు ఎల్లో మీడియాలో వార్తలు రాయించుకున్నారు. ఆ పత్రికలలోనే జగన్‌పై మద్యం కేసు విషయంపై కూడా మాట్లాడారని తెలిపారు. అంటే గతంలో కాంగ్రెస్‌తో కుమ్మక్కై పెట్టినట్లుగానే, ఈసారి బీజేపీతో ఒప్పందమై ఇలాంటిదేదో చేయాలని చూస్తున్నట్లు ఉన్నారు.2014 టర్మ్‌లో బీజేపీతో పొత్తులో ఉన్నపుడు ప్రధాని మోడీని చంద్రబాబు కలిసినప్పుడల్లా కేవలం జగన్ కేసులపై ఏదో ఒకటి చేయాలని కోరుతుండేవారని, అప్పటి బీజేపీ అధ్యక్షుడు, ఇప్పటి టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆ రోజుల్లో పలుమార్లు చెప్పేవారు. అదే తరహాలో ఇప్పుడు కూడా బీజేపీ పెద్దలతో సంప్రదించి తన కుట్ర ప్లాన్ అమలు చేయాలని తలపెట్టినట్లు అనుమానాలు వస్తున్నాయి. జగన్ పై 2011 లో పెట్టిన కేసులు ఏమిటి? ఆయన కంపెనీలలో కొందరు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారని అందులో క్విడ్ ప్రోక్ జరిగిందని సీబీఐ ఆరోపించింది. అయితే ఇందుకు సంబంధించిన ఏ కంపెనీ కూడా జగన్‌పై ఫిర్యాదు చేయలేదు. అలాగే ప్రభుత్వం, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలతో జగన్‌కు సంబంధం లేదు. అయినా తన కంపెనీలు ఏర్పాటైన మూడేళ్ల తర్వాత కక్షపూరితంగా కేసులు పెట్టారు. ఇప్పుడు కూడా అదే మోడల్ కనిపిస్తుంది. మద్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఏ డిస్టిలరీ ఫిర్యాదు చేయలేదు. ఎవరో దారినపోయే వ్యక్తి లెటర్ రాయడం, ఆ వెంటనే దానిపై ప్రభుత్వ కార్యదర్శి ఏసీబీ విచారణకు విచారించాలని పంపడం, తదుపరి ఆగమేఘాల మీద కేసు పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులను బెదిరించి వాంగ్మూలాలను తీసుకోవడం, వారు హైకోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత వేధింపులు తట్టుకోలేక పోలీసు అధికారులు కోరిన స్టేట్మెంట్ పై సంతకాలు చేశారట. తదుపరి మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డిని ఒక పావుగా వాడుకున్నట్లు అనిపిస్తుంది. ఆయన తనకేదో దీని నుంచి రక్షణ కలుగుతుందని అనుకున్నారో ,ఏమో కాని, రాజ్ కెసిరెడ్డి అన్న మాజీ ఐటి సలహాదారుపై ఆరోపణలు చేశారు.దాంతో విజయసాయిని అదుపులోకి తీసుకోకుండా సిట్ బృందం వదలి వేసింది. ఆ తర్వాత సుప్రీం కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన ఎంపీ మిథున్‌ రెడ్డిని విచారించారు. ఆయన తన వాదన చాలా స్పస్టంగా వినిపించగలిగారు. ఆధారాలు ఉంటే కోర్టులో రుజువు చేయండని సవాల్ చేశారు. తమ కుటుంబంపై చంద్రబాబు కాని, ఎల్లో మీడియా కాని పగపట్టి ఇటీవలి కాలంలో ప్రచారం చేసిన ఉదంతాలను ఆయన మీడియా ముందు ప్రస్తావించి వాటిలో ఒక్కదానిని కూడా నిరూపించలేకపోయిన విషయాన్ని తెలిపారు. ఆ తర్వాత గోవా నుంచి హైదరాబాద్ వచ్చిన రాజ్ కెసిరెడ్డిని హడావుడిగా అదుపులోకి తీసుకున్నారు. ఎల్లో మీడియాలో ఆయనపై పలు కథనాలు రాయించారు. గోవా నుంచి హైదరాబాద్ వచ్చి, అక్కడ నుంచి చెన్నై ద్వారా విదేశాలకు వెళ్లాలని ఆయన ప్లాన్ చేశారని అర్థం, పర్థం లేని రాతలు రాశారు. నిజంగానే అలా వెళ్లదలిస్తే నేరుగా గోవా నుంచో, లేక దగ్గరలో ఉన్న ముంబై, లేదా చెన్నై వెళ్లి విదేశాలకు పోయి ఉండవచ్చు కదా అన్న ప్రశ్నకు జవాబు దొరకదు. కెసిరెడ్డిని విచారించిన సందర్భంలో కూడా పలు పరస్పర విరుద్దమైన అంశాలను సిట్ రిమాండ్ రిపోర్టులో కనిపించాయి. ఒకసారి ఆయన సీఎంఓ అధికారులకు మద్యం డబ్బు చేరవేసినట్లు, మరోసారి ఆయనే ఆయా కంపెనీలలో పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారట. నాలుగు డిస్టిలరీల నుంచే మద్యం ఎక్కువగా తీసుకోవడంపై రిమాండ్ రిపోర్టులో సందేహం వ్యక్తం చేశారు. మరి అదే తరహాలో చంద్రబాబు ప్రభుత్వంలోను జరిగింది కదా అన్నదానికి రిప్లై లేదు.అన్నిటికి మించి రిమాండ్ రిపోర్టుపై రాజ్ సంతకం పెట్టడానికి నిరాకరించారని కూడా సిట్ తెలియ చేసింది. అలాంటప్పుడు ఆ రిపోర్టుకు ఎంత విలువ ఉంటుంది? కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియాలో బానర్లు పెట్టుకుని ఆనందపడడానికి తప్ప. జగన్ పేరేదో ఆయన నేరుగా చెప్పారన్నట్లుగా ప్రచారం చేసిన ఈ మీడియా దానిపై రాజ్ సంతకం లేదన్న అంశానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా జాగ్రత్తపడింది. అంటే దీనర్థం ఏదో రకంగా జగన్‌ను జనంలో పలచన చేయడం ద్వారా ప్రజలు ఆ అంశంపై చర్చించుకుంటూ, చంద్రబాబు అండ్ కో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను మర్చిపోవాలనే కదా! మరో సంగతి చెప్పాలి. విజయసాయి తననేదో వదలి వేస్తారని అనుకున్నట్లు ఉన్నారు. రాజ్ అరెస్టు కాగానే ఆయన ఒక కామెంట్ చేశారట. దొరికిన దొంగలు, దొరకని దొంగలు అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన కూడా నిందితుడే అయినందున ఏ తరహా కిందకు వస్తారో తేల్చుకోవాలి. ఒకటి మాత్రం వాస్తవం. ప్రజలలో కూటమి సర్కార్ పై విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోంది. అదే టైమ్‌లో జగన్ ఎక్కడకు వెళ్లిన వేల సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. అంటే భవిష్యత్తులో తన పార్టీకి, తన వారసులకు జగన్ పెద్ద బెడద అవుతారని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే ఈ రకమైన కక్ష రాజకీయాలు చేస్తున్నారు.అమిత్ షా తో కూడా ఇదే అంశంపై మాట్లాడడానికి ఢిల్లీ వెళ్లారంటే ఆయనకు ప్రజలకు ఇచ్చిన హామీలకన్నా, జగన్‌ను ఎలాగొలా ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యం ఉన్నట్లు అర్థం అవుతోంది కదా! ఇవన్ని గమనించిన తర్వాత జగన్ పీఏసీ సమావేశంలో మాట్లాడినట్లు ఆయన కాని, వైసీపీ శ్రేణులు కాని అన్నిటికి సిధ్దమైనట్ల స్పష్టం అవుతోంది కదా! ఇదే చంద్రబాబుకు అతి పెద్ద సవాల్!- కొమ్మినేని శ్రీనివాస రావు సీనియర్‌ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

IPL 2025 SRH to Give Crack At Making It To Playoffs: Pat Cummins4
IPL 2025: ‘ఇదొక అద్భుత విజయం.. ప్లే ఆఫ్స్‌ చేరతాం’

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఆరంభ మ్యాచ్‌లో గెలుపొందిన కమిన్స్‌ బృందం.. ఆ తర్వాత మళ్లీ ఒకే ఒక్కటి గెలిచి.. వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడింది. దీంతో ప్లే ఆఫ్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.ఈ నేపథ్యంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK vs SRH)తో శుక్రవారం తలపడ్డ సన్‌రైజర్స్‌.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో జయభేరి మోగించింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో రాణించి పన్నెండేళ్ల తర్వాత చెపాక్‌ స్టేడియంలో తొలి విజయం నమోదు చేసింది. అంతేకాదు.. ప్లే ఆఫ్స్‌ ఆశలను కూడా సజీవం చేసుకుంది.ఇదొక అద్భుత విజయంఈ క్రమంలో విజయానంతరం సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins) హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఈరోజు మాకు అన్నీ కలిసివచ్చాయి. మా వాళ్లు గొప్పగా ఆడారు. ఇదొక అద్భుత విజయం. కష్టపడినందుకు ఫలితం దక్కింది.సీఎస్‌కేలో ప్రతిభావంతులైన టాపార్డర్‌ బ్యాటర్లు ఉన్నారు. మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా వారికి ఉంది. అయితే, మా బౌలర్లు మొమెంటమ్‌ను మార్చేశారు. పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్‌ చేసి ఇన్నింగ్స్‌ దిశను మార్చివేశారు.ప్లే ఆఫ్స్‌ చేరేందుకు కృషి చేస్తాంవారి ప్రదర్శన పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను. సీఎస్‌కేపై మాకు మంచి రికార్డు లేదు. కానీ ఈరోజు మేము గత పరాభవాలకు చెక్‌ పెట్టగలిగాం. ఈ సీజన్‌లో మాకు ఇంకా ఐదు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఎంత కష్టమైనా ప్లే ఆఫ్స్‌ చేరేందుకు కృషి చేస్తాం.ఇంతకంటే గొప్పగా గెలిచేందుకు ప్రయత్నిస్తాం. అయితే, ఏదేమైనా ఈనాటి విజయం మాకు ప్రత్యేకమైనది’’ అని కమిన్స్‌ చెప్పుకొచ్చాడు. ఈసారి కూడా ప్లే ఆఫ్స్‌ చేరతామనే నమ్మకం ఉందని పరోక్షంగా వెల్లడించాడు.వ్యూహంలో భాగమేఅదే విధంగా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పుల గురించి చెబుతూ.. ‘‘వ్యూహం ప్రకారమే హెన్రిచ్‌ క్లాసెన్‌ను నాలుగో స్థానంలో పంపించాం. మధ్య ఓవర్లలో వారు స్పిన్‌ మంత్రంతో ముందుకు వస్తారని తెలుసు.అందుకే క్లాసెన్‌ ముందుగా బ్యాటింగ్‌కు వచ్చాడు. అదే విధంగా నితీశ్‌ రెడ్డికి ఫినిషర్‌ పాత్ర ఇచ్చాము’’ అని కమిన్స్‌ తెలిపాడు. కాగా ఐపీఎల్‌-2024లో సన్‌రైజర్స్‌ రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఈ సీజన్‌లో ఇప్పటికి ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం మూడే గెలిచి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ప్లే ఆఫ్స్‌ చేరే అవకాశాలు లేవు.ఐపీఎల్‌-2025: సీఎస్‌కే వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌👉టాస్‌: ఎస్‌ఆర్‌హెచ్‌.. మొదట బౌలింగ్‌👉సీఎస్‌కే స్కోరు: 154 (19.5)👉ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోరు: 155/5 (18.4)👉ఫలితం: సీఎస్‌కేపై ఐదు వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌ విజయం👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: హర్షల్‌ పటేల్‌ (4/28).చదవండి: CSK vs SRH: ‘బుర్ర పనిచేయడం లేదా’?!.. మెండిస్‌పై కావ్యా మారన్‌ ఫైర్‌!

Indian Forces operation kagar karreguttalu Full Details5
కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌.. 38 మంది మావోయిస్టులు మృతి!

సాక్షి, ములుగు: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఐదో రోజు కూంబింగ్‌లో భాగంగా మావోయిస్టులకు భారీ షాక్‌ తగిలింది. భద్రతా బలగాల ఆపరేషన్‌లో ఛత్తీస్‌గఢ్‌వైపు భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు దూసుకెళ్తున్నాయి. ఐదో రోజులుగా కూంబింగ్‌ కొనసాగుతోంది. బలగాలకు దిశానిర్దేశం చేస్తూ గగనతలంలో హెలికాప్టర్లు, డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో శనివారం దాడుల్లో భాగంగా 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. శుక్రవారం తుపాకులు, బాంబుల శబ్దాలు మారుమోగాయి. ఉదయం ఏడు గంటల నుంచే నాలుగు వైమానిక దళ హెలికాప్టర్లు చక్కర్లు కొట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. గత రాత్రి 10 గంటల వరకు భారీ కాల్పులు, బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని అన్నారు. దీంతో, సమీప గ్రామాల ప్రజల్లో ఆందోళన చెందుతున్నారు.మరోవైపు.. కూంబింగ్‌లో నిమగ్నమైన జవాన్లు ఎండల బారినపడుతున్నారు. నాలుగు రోజులుగా అడవుల్లోనే మకాం వేయడంతో ఇప్పటికే 15 మంది అస్వస్థతకు గురికాగా, శుక్రవారం మరో ఐదుగురిని హెలికాప్టర్‌లో వెంకటాపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ముగ్గురిని మెరుగైన చికిత్సకు భద్రాచలం తరలించారు. ఆపరేషన్‌ కర్రెగుట్టల గాలింపుతో అభయారణ్యం పరిసర గ్రామాల్లో జవాన్లు ఆంక్షలను విధించడం చర్చనీయాంశంగా మారింది. సమీప వ్యవసాయ క్షేత్రాలు, నీటి నిల్వ ప్రాంతాలకు వెళ్లినా హెచ్చరిస్తున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు.ఇక, తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కొనసాగుతున్న కర్రెగుట్ట ఆపరేషన్ ను వెంటనే ఆపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టులు లేఖ రాశారు. తక్షణమే ఆ ఆపరేషన్ ఆపి శాంతి చర్చలకు ముందుకు రావాలని మావోయిస్టులు విజ‍్క్షప్తి చేశారు. మావోయిస్టు బస్తర్ ఇంచార్జి రూపేష్ పేరిట ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. తెలంగాణ సరిహద్దుల్లో కొనసాగుతున్న సైనిక ఆపరేషన్ ను వెంటనే ఆపాలని ఆ లేఖలో విజ‍్క్షప్తి చేశారు.గత కొంతకాలం నుంచి మావోయిస్టుల, కేంద్ర ప్రభుత్వం మధ్య శాంతి చర్చలు జరగాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి మావోయిస్టులో శాంతి చర్చలు జరపాలని ఏఐటీయూసీ కోరుతోంది. దీనిలో భాగంగా ఈనెల రెండో వారంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టులు శాంతి చర్చలు జరుపుకోవాలని భేషరతుగా ఎదురు కాల్పులు విరమించుకోవాలని సూచించారు. అయితే తాజాగా మావోయిస్టులు.. ఈ మేరకు లేఖ రాశారు. తమతో శాంతి చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు.

Pahalgam Incident: Elvish Yadav Emotional Connection to Navy Officer Widow6
30 సార్లు ఫోన్‌ చేసినా హిమాన్షి లిఫ్ట్‌ చేయలేదు.. బిగ్‌బాస్‌ విన్నర్‌

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 26 మంది కన్నుమూశారు. వారిలో ఇండియన్‌ నేవీ లెఫ్టినెంట్‌ కల్నల్‌ వినయ్‌ నర్వాల్‌ ఒకరు. ఏప్రిల్‌ 16న వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ నేవీ అధికారి.. హనీమూన్‌ కోసం ఏప్రిల్‌ 21న కశ్మీర్‌ వెళ్లారు. భార్యతో కలిసి కొత్త లైఫ్‌ను ప్రారంభించాలనుకున్నారు. కానీ, ఆ మరుసటి రోజు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో వినయ్‌ నర్వాల్‌ నేలకొరిగారు.పెళ్లయిన ఆరు రోజులకే..కళ్ల ముందే భర్త ప్రాణాలు కోల్పోవడం చూసి గుండెలు పగిలేలా రోదించింది భార్య హిమాన్షి. అందుకు సంబంధించిన ఫోటో, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి. బిగ్‌బాస్‌ విన్నర్‌ ఎల్విష్‌ యాదవ్‌ (Elvish Yadav) అయితే ఆ వీడియోలు చూసి మరింత షాక్‌కు గురయ్యాడు. హిమాన్షి కాలేజీలో రోజుల్లో తన క్లాస్‌మేట్‌ అని గుర్తు చేసుకున్నాడు. ఇంకా షాక్‌లోనే ఉన్నా..ఎల్విష్‌ మాట్లాడుతూ.. నేను హన్సరాజ్‌ కాలేజీలో చదువుకున్నాను. 2018లో నా చదువు పూర్తయింది. హిమాన్షిది కూడా అదే కాలేజ్‌.. ఆ రోజుల్లో మేము చాలా ఎంజాయ్‌ చేసేవాళ్లం. మెట్రో స్టేషన్‌కు కూడా కలిసి వెళ్లేవాళ్లం. కాలేజ్‌ అయిపోయాక మళ్లీ మేము మాట్లాడుకోలేదు. కాకపోతే తన నెంబర్‌ నా దగ్గర ఇప్పటికీ ఉంది. కానీ, ఇప్పుడామె ఫోన్‌ ఎత్తి మాట్లాడే పరిస్థితిలో లేదనుకుంటున్నాను. పైగా నేనే ఇంకా షాక్‌లో ఉన్నా.. అలాంటిది తన పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండి ఉంటుంది!31వ సారి ఫోన్‌ ఎత్తిందిఅందుకే ఇది సరైన సమయం కాదేమో అనిపించి తనకు ఫోన్‌ చేసి మాట్లాడలేదు. నా ఫ్రెండ్‌ ఒకరు తనకు 30 సార్లు కాల్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదు. 31వ సారి ఫోన్‌ ఎత్తింది. మీడియాలో వస్తున్నట్లుగానే మతం అడిగి తెలుసుకుని మరీ హిందువులను చంపేశారన్నది నిజం అని చెప్పుకొచ్చాడు. కాగా ఎల్విష్‌ యాదవ్‌.. హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ రెండో సీజన్‌ విజేతగా నిలిచాడు.చదవండి: పారితోషికంగా నోట్ల కట్టలు.. హైదరాబాద్‌ కింగ్‌ నేనే: నాని

Sania Mirza says breastfeeding was harder than pregnancy7
మూడు సార్లు ప్రెగ్నెన్సీ అయినా ఓకే కానీ : సానియా మీర్జా భావోద్వేగ జర్నీ

ఒకపుడు గర్భం దాల్చడం, ప్రసవించడం, పిల్లలకు పాలివ్వడం ఇవన్నీ చాలా గోప్యమైన వ్యవహారాలుగా భావించేవారు. గర్భధారణ, మాతృత్వం, ప్రసవవేదన, పిల్లల పెంపకం అంత ఈజీ కాదనీ, ఎంతో భావోద్వేగంతో కూడుకున్న ఈ సవాళ్ల గురించి సమాజం తెలుసుకోవాలనే చర్చ ఇటీవలి కాలంలో బాగా జరుగుతోంది. తల్లిపాలు ఇవ్వడం (Breastfeeding)-తల్లుల మానసిక ఆరోగ్యంపై ప్రభావంపై ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు దీని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటికే నటీమణులు రాధికా ఆప్టే, బిపాసా బసు ప్రెగ్నెన్సీ అంటే ఫ్యాన్సీ కాదని దీని వెనుక ఎంతో శారీరక,మానసిక ఆందోళనతో పాటు, భావోద్వేగ పూరిత జర్నీ గురించి చర్చించారు. తాజాగా ఇండియన్‌ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా గర్భంతో ఉన్న సమయంలోనూ, పాలిచ్చే సమయంలోనే తాను అనుభవించిన సమస్యలు, సవాళ్ల గురించి మాట్లాడటం విశేషం.భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza) తన నవజాత కొడుకును చూసుకునే బాధ్యత తనను చాలా బాధపెట్టిందని సానియా మీర్జా చెప్పింది. మాతృత్వం అనుభవాలను, ఆటనుంచి రిటైర్ కావడానికి గల కారణాల గురించి ఓ పాడ్ కాస్ట్ లో పంచుకుంది. నిజంగా బిడ్డకు పాలివ్వడం అనేది గర్భధారణకంటే అత్యంత కష్టతరమైనదిగా అనిపించిందని కూడా చెప్పింది. అంతేకాదు మరో మూడు సార్లు అయినా గర్భవతి అవుతానేమో కానీ, పిల్లలకు పాలివ్వడం, వారి ఆకలి తీర్చడం అనే పని మాత్రం తన వల్ల కాదని స్పష్టం చేసింది. ఎందుకంటే ఈ డ్యూటీ శరీరంలో భాగం కాదు, పైగా పిల్లలు మనపై ఆధారపడి ఉంటారు. ఇది నిజంగా మిమ్మల్ని కట్టివేస్తుంది. అందుకు సమయం కేటాయించాలి, తగినంత నిద్ర ఉండదు . బిడ్డకు పాలిచ్చే సమయానికి ఆటపరంగానో, లేదా ఇంకేదో పనుల్లోనో ఉండాల్సి వస్తుంది అంటూ తన బాధల్ని పంచుకుంది. మానసిక భావోద్వేగం, మతిపోయేంత ఆందోళనగర్భధారణ అనేది అనేక హార్మన్లతో కూడుకున్న అంశం. ప్రెగ్నెన్సీఅనేది అందమైన అనుభవం కంటే, కానీ ఆ సమయంలో కంటే తన కొడుకు ఇజాన్‌కు తల్లిపాలు ఇస్తున్నప్పుడు తాను ఎక్కువగా అలసిపోయానని సానియా తెలిపింది. తాను దాదాపు మూడు నెలలు తల్లిపాలు ఇచ్చాననీ, కానీ తన బిడ్డకు పోషకాహారం అందించే ఏకైక వ్యక్తిగా ఉండటం అనేక మానసిక ఆందోళన కలిగించిందని వివరించింది. అలాగే పసిబిడ్డతో నిద్ర లేకపోవడం, బిడ్డ కడుపు నింపే క్రమంలో తాను బాగా అలిసిపోయే దాన్నని చెప్పుకొచ్చింది. శారీరక అంశాల కంటే మానసిక భావోద్వేగం ఎక్కువ ఉంటుందని, ఉద్యోగం చేసే మహిళలకు తల్లిపాలు ఇవ్వడం చాలా కష్టమైన పని అని ఆమె చెప్పుకొచ్చింది. ఒక దశలో తనకు పిచ్చెక్కిపోతోందనే భావన కలిగిందనీ, దీంతో నేపథ్యంలోనే పిల్లల వైద్యుడిని సంప్రదించా.. ఇంకో నెల కొనసాగించమని చెప్పినా తన వల్ల కాదని చెప్పేశానని తెలిపింది. అలాగే బాడీ షేమ్ చేస్తారనే అంశాన్ని కూడా గుర్తు చేసుకుంది. ప్రొఫెషనల్ టెన్నిస్ నుండి రిటైర్ కావడానికి గల కారణాలను పంచుకుంటూ సానియా ఇలా చెప్పింది. తన కుమారుడితో ఎక్కువ క్వాలిటీ సమయాన్ని గడపాలనే ఆలోచనతోనే రిటైర్‌మెంట్‌నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇజాన్ బాల్యంలో అతనికి అవసరమైనసంరక్షణ అందించాలని భావిస్తున్నట్టు స్పష్టం చేసింది.కాగా సానియా మీర్జా , షోయబ్ మాలిక్(మాజీ భర్త) దంపతులకు 2018లో కొడుకు ఇజాన్‌ జన్మించారు. ప్రస్తుతం సానీయా, షోయబ్‌ విడాకులు తీసుకోగా, షోయబ్‌ మరో వివాహం కూడా చేసుకున్నాడు.

TDP Ganta Versus BJP Vishnu Kumar Raju Angry With Each Other8
నా నియోజకవర్గంలో నువ్వు వేలు పెట్టడం ఏంటి?

విశాఖపట్నం, సాక్షి: కూటమి కీలక నేతలు బహిరంగంగానే.. అదీ కార్యకర్తల సమక్షంలో గొడవకు దిగారు. ఇంతకాలం టీడీపీ-జనసేన గొడవలు మాత్రమే చూస్తున్న ఏపీ ప్రజలకు ఇవాళ్టి కొత్త వివాదం ఆసక్తికరంగా అనిపించింది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజుపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్‌ అయ్యారు. బహిరంగంగా చోటు చేసుకున్న ఈ పరిణామం కెమెరా కంటికి చిక్కింది.శనివారం బహిరంగంగానే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విష్ణు కుమార్ రాజు మధ్య వాగ్వాదం జరిగింది. ‘‘నా నియోజకవర్గంలో నాకు తెలియకుండానే వేలు పెడుతున్నారు. మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదు. ఫిలిం నగర్ క్లబ్ అనేది భీమిలి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. నాకు తెలియకుండా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకువెళ్తారు?’’ అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్‌ను ప్రశ్నించారు. అయితే.. లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లే సమయంలో మీరు ఆరోజు అందుబాటులో లేరని, మీరు లేకపోవడంతో కలెక్టర్ ని కలిసి వినత పత్రం సమర్పించామని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ సర్దిచెప్పబోయారు. అయినా కూడా వినకుండా గంటా విష్ణుతో వాగ్వాదం కొనసాగించారు. వాహనంలో కూర్చొనో గంటా విష్ణుపై కేకలు వేయగా.. దానికి బయటి నుంచే విష్ణుకుమార్‌ కూడా అంతే దీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోటి నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా.. గంటా అదేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

US Court Given Relief To 1200 Students Over Deportation9
ట్రంప్‌ యూటర్న్‌.. అమెరికాలో విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు విదేశీ విద్యార్థుల బహిష్కరణపై ట్రంప్‌ వెనక్కి తగ్గారు. తమ వీసాలు రద్దు చేయడంతో విదేశీ విద్యార్థులు అక్కడి న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో, విద్యార్థులకు అనుకూలంగా తీర్పులు రావడంతో ట్రంప్‌ యూటర్న్‌ తీసుకున్నారు.వివరాల ప్రకారం.. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్న వందల మంది విద్యార్థులకు ఊరట లభించింది. అయితే, అమెరికాలో విదేశీ విద్యార్థులపై ట్రంప్‌ బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వివిధ కారణాలతో 187 కాలేజీలకు చెందిన 1200 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసా (Student Visa) లేదా వారి చట్టబద్ధ హోదాలను ట్రంప్‌ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తమ వీసాల రద్దుపై విద్యార్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారు.అనంతరం.. కాలిఫోర్నియా, బోస్టన్‌ కోర్టుల్లో విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ఆయా న్యాయస్థానాలు.. విద్యార్థుల వీసా రద్దును ఆపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రంప్‌ యంత్రాంగం చర్యలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్.. ఆయా విద్యార్థుల చట్టబద్ధ హోదాను తాత్కాలికంగా పునరుద్ధరించింది. ఈమేరకు అమెరికా ప్రభుత్వానికి చెందిన ఓ న్యాయవాది తాజాగా వెల్లడించారు. దీంతో ఆయా విద్యార్థులకు చట్టబద్ధ హోదా లభిస్తుందన్నారు.ఇదిలా ఉండగా.. విదేశీ విద్యార్థులపై బహిష్కరణ వేటు కారణంగా డిపోర్టేషన్‌, నిర్బంధం ముప్పు పొంచి ఉండటంతో ఆ విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వీరిలో కొంతమంది ఇప్పటికే అమెరికాను వీడగా.. కొందరు రహస్య ప్రదేశాల్లో తల దాచుకున్నారు. తాజాగా కోర్టు వ్యాఖ్యలతో ట్రంప్‌ (Donald Trump) సర్కారు వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Cars24 Implements Strategic Reset Amid Layoffs and Expansion10
ధోనీ కంపెనీలో 200 మందికి లేఆఫ్స్‌

పాత కార్ల కొనుగోలు, అమ్మకానికి వేదికగా ఉన్న ‘కార్స్ 24’ సంస్థ ఇటీవల 200 మంది ఉద్యోగులకు లేఆఫ్స్‌ ప్రకటించింది. కంపెనీ కార్యకలాపాలను పునర్నిర్మించడానికి ఉద్దేశించిన చర్యల్లో భాగంగా ఈ తొలగింపులు జరిగాయని సంస్థ సహ వ్యవస్థాపకులు, సీఈఓ విక్రమ్ చోప్రా ఉద్యోగులకు అంతర్గత నోట్‌లో స్పష్టం చేశారు. ఈ తొలగింపులు నిరంతర లేఆఫ్స్‌ ప్రక్రియకు ప్రారంభం కాదని, కంపెనీ దీర్ఘకాలిక లక్ష్యాలకు అవసరమైన చర్యగా ఆయన ఉద్యోగులకు హామీ ఇచ్చారు. కార్స్‌24 సంస్థలో ప్రముఖ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనీకి వాటాలుండడం గమనార్హం.కఠినంగా నియామకాలుకార్స్24 మరింత కఠినమైన విధానాన్ని అనుసరిస్తూ నియామకాల ‍ప్రక్రియ చేపడుతుందని చోప్రా నొక్కి చెప్పారు. ప్రస్తుత లేఆఫ్స్‌ కంపెనీ వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు తోడ్పడుతాయని తెలిపారు. కార్స్ 24 కొత్త వ్యాపార విభాగాలకు విస్తరిస్తున్న సమయంలో ఈ తొలగింపులు జరిగాయి. కంపెనీ తన ప్లాట్‌ఫామ్‌ సామర్థ్యాలను పెంచడానికి, ఆటోమోటివ్ కమ్యూనిటీని బలోపేతం చేయడానికి దేశపు అతిపెద్ద ఆటోమోటివ్ ఫోరమ్ ‘టీమ్-బీహెచ్‌పీ’ని ఇటీవల కొనుగోలు చేసింది. అదనంగా, కార్స్ 24 వాహన మరమ్మతులు, ఫైనాన్సింగ్, బీమాతో సహా కొత్త కార్ల అమ్మకాలు, అనుబంధ సేవల కోసం ఆన్‌లైన్‌ సర్వీసులను ప్రారంభించింది.ఇదీ చదవండి: లేటరల్‌ ఎంట్రీ నియామకాలకు నోటిఫికేషన్‌ఆర్థిక పనితీరు, వ్యూహాత్మక సర్దుబాట్లుకార్స్ 24 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.498 కోట్ల నికర నష్టాన్ని నివేదించింది. ఇది వ్యూహాత్మక సర్దుబాట్ల అవసరాన్ని ఎత్తిచూపింది. యూనిట్ల అమ్మకాలు, సగటు అమ్మకపు ధరల పెరుగుదలతో కంపెనీ నిర్వహణ ఆదాయం 25 శాతం పెరిగి రూ.6,917 కోట్లకు చేరుకుంది. దాంతో కంపెనీ వ్యయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement