తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీకి బెయిల్‌ | Supreme Court Grant Bail To Tamil Nadu Ex Minister Senthil Balaji | Sakshi
Sakshi News home page

తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీకి బెయిల్‌

Published Thu, Sep 26 2024 11:25 AM | Last Updated on Thu, Sep 26 2024 11:36 AM

Supreme Court Grant Bail To Tamil Nadu Ex Minister Senthil Balaji

ఢిల్లీ: తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీకి బెయిల్‌ మంజూరైంది. క్యాష్‌ ఫర్‌ జాబ్స్‌(మనీల్యాండరింగ్‌) కుంభకోణం కేసులో అరెస్ట్‌ అయ్యి జైలులో ఉన్న సెంథిల్‌ బాలాజీకి తాజాగా సుప్రీంకోర్టు బెయిల్‌ ఇచ్చింది. దీంతో, ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు.

తమిళనాడుకు చెందిన మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీని మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) గతేదాడి జూన్‌లో అరెస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా తమిళనాడులోని రవాణాశాఖలో ఉద్యోగాలు ఇస్తామని(అన్నాడీఎంకే ప్రభుత్వంలో 2011-15 మధ్య) నిరుద్యోగుల నుంచి సెంథిల్ బాలాజీ భారీగా డబ్బులు వసూలు చేశారని ఈడీ ఆరోపించింది. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై జూన్ 15న ఆయనను ఈడీ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ అరెస్టుతో ఆయన మంత్రిత్వ శాఖను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.

అయితే, ఈ కేసులో బెయిల్ కోసం సెంథిల్‌ బాలాజీ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. గతేడాది అక్టోబర్ 19న బాలాజీ ముందస్తు బెయిల్ పిటిషన్‌ వేయగా హైకోర్టు కొట్టివేసింది. స్థానిక కోర్టు కూడా అతని బెయిల్ పిటిషన్లను మూడుసార్లు కొట్టివేసింది. ఈక్రమంలో బెయిల్‌ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాజాగా బెయిల్‌ మంజూరు చేసింది.

 

 

ఇది కూడా చదవండి: బెంగళూరు మహాలక్ష్మి కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement