income tax raids
-
ఇంట్లో బంగారం.. ఇదిగో వచ్చేస్తున్నాం!
భారతదేశంలో బంగారం అనేది కేవలం లోహం మాత్రమే కాదు.. అది వారసత్వం, సంప్రదాయం, విశ్వాసానికి చిహ్నం. ఉత్తరం నుంచి దక్షిణం వరకు భారతీయులకు బంగారంతో ప్రత్యేక అనుబంధం ఉంది. పెళ్లి అయినా, పండుగ అయినా బంగారం లేకుండా పూర్తవదు. ఈ కారణంగానే భారతీయ కుటుంబాలు తరతరాలుగా బంగారాన్ని కూడబెట్టుకుంటున్నాయి.అయితే ఆదాయపు పన్ను శాఖ కూడా మీ బంగారం కొనుగోళ్లపై ఓ కన్నేసి ఉంచుతుందన్న విషయం మీకు తెలుసా? నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ బంగారం ఉంటే, దాని చట్టబద్ధతను మీరు నిరూపించలేకపోతే ఆదాయపు పన్ను నోటీసు లేదా దాడులు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ నేపథ్యంలో మీరు చట్టబద్ధంగా ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చో తెలుసుకోవడం చాలా ముఖ్యం.నిబంధనలేంటి?భారతదేశంలో బంగారం కొనుగోలు, నిల్వకు సంబంధించి ప్రభుత్వం కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసింది. ఈ నిబంధనల ప్రకారం వివాహిత మహిళలు ఇంట్లో 500 గ్రాముల బంగారాన్ని ఉంచుకోవచ్చు.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ప్రకారం ఇంట్లో నిర్ణీత మొత్తంలో బంగారాన్ని ఉంచుకోవచ్చు. అయితే మీ వద్ద ఎంత బంగారం ఉన్నా, అది మీకు ఎలా వచ్చిందో రుజువు ఉండాలి.వివాహిత మహిళ తన వద్ద 500 గ్రాముల బంగారాన్ని ఉంచుకోవచ్చని ఆదాయపు పన్ను చట్టాలు చెబుతున్నాయి. పెళ్లికాని మహిళలైతే 250 గ్రాముల పసిడిని తమ వద్ద ఉంచుకోవచ్చు. ఇక కుటుంబంలోని పురుషులు 100 గ్రాముల వరకు మాత్రమే బంగారాన్ని ఉంచువడానికి అనుమతి ఉంది.పన్నులేమైనా ఉంటాయా?మీరు ప్రకటించిన ఆదాయం లేదా పన్ను మినహాయింపు ఆదాయం (వ్యవసాయం వంటివి) నుంచి బంగారాన్ని కొనుగోలు చేసినట్లయితే లేదా చట్టబద్ధంగా వారసత్వంగా పొందినట్లయితే దానిపై ఎటువంటి పన్ను ఉండదు. దాడులు నిర్వహిస్తే నిర్ణీత పరిమితిలో దొరికిన బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకోలేరు. బంగారాన్ని ఇంట్లో పెట్టుకుంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేనప్పటికీ, బంగారాన్ని విక్రయిస్తే మాత్రం దానిపై పన్ను చెల్లించాలి.2024 జూలైలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024లో ప్రభుత్వం స్వల్పకాలిక మూలధన లాభాలు, దీర్ఘకాలిక మూలధన లాభాలకు అర్హత పొందడానికి భౌతిక బంగారంతో సహా కొన్ని ఆస్తుల హోల్డింగ్ పీరియడ్ ప్రమాణాలను మార్చింది. ఫిజికల్ గోల్డ్ కోసం, స్వల్పకాలిక మూలధన లాభాల హోల్డింగ్ వ్యవధిని 3 ఏళ్ల నుండి 2 సంవత్సరాలకు తగ్గించింది. దీర్ఘకాలిక మూలధన లాభాలకు అర్హత సాధించడానికి, హోల్డింగ్ వ్యవధి 2 ఏళ్లు కంటే ఎక్కువ ఉండాలి. అంటే మీరు బంగారాన్ని 2 సంవత్సరాలు నిల్వ చేసిన తర్వాత అమ్మితే వచ్చిన లాభం ఎటువంటి ఇండెక్సేషన్ ప్రయోజనం లేకుండా 12.5% దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుకు లోబడి ఉంటుంది. -
దేశవ్యాప్తంగా శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు.. ఎందుకో తెలుసా?
సాక్షి,హైదరాబాద్: దేశ వ్యాప్తంగా శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఏపీ,తెలంగాణ చెన్నై,బెంగళూరు,ఢిల్లీ,ముంబై నగరాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పెద్ద మొత్తంలో అక్రమలావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. శ్రీచైతన్య సంస్థ పన్నులు ఎగవేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.హైదరాబాద్ ప్రధానంగా మొత్తం ఆరు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న శ్రీచైతన్య యాజమాన్యం పెద్ద మొత్తంలో అక్రమలావాదేవీలు జరుపుతుందనే సమాచారంతో ఐటీ అధికారులు సోమవారం ఏక కాలంలో శ్రీచైతన్య కాలేజీల కార్పొరేట్ కార్యాలయాలపై దాడులు చేశారు.విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకుని ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేతకు పాల్పడినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ ఐటీ రైడ్ నిర్వహించినట్లు సమాచారం. ఐటీ అధికారుల సోదాల్లో భారీ ఎత్తున అక్రమ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. -
ఐటీ సోదాలపై దిల్ రాజు స్పందన
-
ముగిసిన ఐటీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం
-
దిల్‌రాజు వాంగ్మూలం నమోదు చేసిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్ దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాలపై వరుసగా నాలుగో రోజూ ఆదాయపన్నుశాఖ అధికారుల సోదాలు కొనసాగాయి. మంగళవారం నుంచి పలువురు టాలీవుడ్ నిర్మాతలు, నిర్మాణ సంస్థలకు చెందిన వ్యక్తులు, ఫైనాన్షియర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల బృందాలు తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ సహా పలువురి ఇళ్లలోనూ గురువారం వరకు సోదాలు జరిగాయి.దిల్ రాజు ఇంట్లో మాత్రం ఐటీ సోదాలు శుక్రవారంతో ముగిశాయి. 5 రోజుల సెర్చ్ వారెంట్‌తో ప్రారంభించిన సోదాలకు సంబంధించి శుక్రవారం దిల్ రాజు వాంగ్మూలం నమోదు చేశారు. ఈ క్రమంలో ఐటీ అధికారులు దిల్ రాజును శ్రీనగర్ కాలనీలోని శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్‌కు తీసుకెళ్లారు. ఆయన సమక్షంలోనే డాక్యుమెంట్లను పరిశీలించి వాటిని స్వా«దీనం చేసుకున్నారు. గేమ్‌ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సహా ఇటీవల నిర్మించిన సినిమాల గురించి ఆరా తీసినట్లు తెలిసింది.డాకు మహారాజ్ సినిమాకు దిల్‌రాజు డి్రస్టిబ్యూటర్‌గా ఉండటంతో ఆ సినిమా కలెక్షన్లపైనా కొన్ని వివరాలు తీసుకున్నట్టు సమాచారం. అనంతరం పలు డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీలు, సినిమాలకు ఖర్చు చేసిన సొమ్ము, వచ్చిన లాభాలు వంటి అంశాలపై ఐటీ అధికారులు దిల్ రాజుతోపాటు ఎస్వీసీ ఆడిటర్, అకౌంటెంట్ వాంగ్మూలాలను నమోదు చేసినట్లు తెలిసింది. ఆదాయ పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలకు సంబంధించి వివరణ కోరినట్లు సమాచారం. సినీ ప్రముఖుల ఇళ్లలో ముగిసిన ఐటీ సోదాలుసినీ ప్రముఖుల ఇళ్లలో నాలుగు రోజుల పాటు కొనసాగిన ఐటీ సోదాలు.. శనివారం తెల్లవారుజామున ముగిశాయి. ఈ సోదాల్లో కీలక ాడాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. -
ఎస్వీసీ ఆఫీస్‌కు దిల్ రాజును తీసుకెళ్లిన ఐటీ అధికారులు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) ఇళ్లు, ఆఫీసులలో నాలుగోరోజు కూడా ఐటీ సోదాలు(Income Tax Officer) జరుగుతున్నాయి. తనిఖీల్లో భాగంగా ఇప్పటికే భారీగా పలు డాక్యుమెంట్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా దిల్రాజును ఆయన నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌కు సంబంధించిన ఆఫీస్‌కు ఆదాయపన్ను శాఖ అధికారులు తీసుకెళ్లారు.దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు దాదాపు ముగిశాయి. నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ సోదాలలో పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక మహిళా అధికారి సమక్షంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. దిల్ రాజు నివాసం నుంచి వారు తాజాగా సాగర్ సొసైటీలోని తన ఎస్వీసీ కార్యాలయానికి వెళ్లారు. తమ వాహనంలోనే దిల్ రాజును వారు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎస్వీసీ ఆఫీస్‌లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు దిల్ రాజు సోదరుడు శిరీశ్ నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. వారు నిర్మించిన పలు సినిమాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపుల విషయంలో అవకతవకలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ రైడ్స్ గురించి అధికారులు ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి విషయాలు ప్రకటించలేదు. -
సినీ ప్రముఖులపై ముగిసిన ఐటీ సోదాలు
-
ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు
-
ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు గురువారం ముగిశాయి. మూడురోజుల పాటు సాగిన తనిఖీల్లో భాగంగా.. పన్నుల చెల్లింపులు, బ్యాంకు లావాదేవీల వివరాలు, చిత్ర నిర్మాణంలో పలురకాల చెల్లింపులు, సినిమాల ద్వారా వచ్చిన ఆదాయం..ఇలా అనేక అంశాలపై అధికారులు ఆరా తీశారు. భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి ఐటీ చెల్లింపుల్లో అవకతవకలను ఈ సందర్భంగా గుర్తించినట్లు తెలిసింది. పలు డాక్యుమెంట్లు, హార్డ్ డిస్‌్కలు, ఆడిట్ రిపోర్టులు స్వా«దీనం చేసుకున్న అధికారులు.. వీటి ఆధారంగా పలువురి స్టేట్మెంట్లు రికార్డు చేసినట్టు సమాచారం. భారీ చిత్రాల నిర్మాతలు, ఫైనాన్షియర్లే లక్ష్యంగా.. ఇటీవల విడుదలైన భారీ తెలుగు చిత్రాలను నిర్మించిన సంస్థలు, వాటి నిర్మాతలు, ఫైనాన్షియర్లే లక్ష్యంగా పలు బృందాలు సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం నుంచి దాడులు ప్రారంభం కాగా.. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్, నిర్మాత దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మైత్రీ మూవీస్ సీఈఓ చెర్రీ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లో, ప్రముఖ గాయని సునీత భర్త రామ్‌కు చెందిన మ్యాంగో మీడియా సంస్థ, భారీ బడ్జెట్ సినిమాలకు ఫైనాన్స్ చేసే సత్య రంగయ్య, అభిషేక్ అగర్వాల్ ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరిగాయి.జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి సహా నగరంలోని ఎనిమిది చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మొదటి రోజు సోదాల్లో దిల్‌రాజు ప్రొడక్షన్స్, మైత్రీ మూవీ మేక ర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో స్వా«దీనం చేసుకున్న డాక్యుమెంట్లు ఆధారంగా..బుధవారం ఉద యం నుంచి పుష్ప2 డైరెక్టర్ సుకుమార్ సహా మరికొంత మంది డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు చేపట్టారు. గురువారం సైతం సుకుమార్‌తో పాటు మరో బడా నిర్మాత నెక్కంటి శ్రీధర్ ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఒకపక్క సోదా లు సాగుతుండగానే దిల్‌రాజు తల్లి అస్వస్థతకు గురికావడంతో ఐటీ అధికారుల వాహనంలోనే ఆమెను ఆసుపత్రికి తరలించినట్టు తెలిసింది. -
ఐటీ దాడులపై స్పందించిన వెంకటేశ్, అనిల్ రావిపూడి
తెలుగు చలనచిత్ర నిర్మాతల ఇళ్లు, కార్యాలయల్లో మూడు రోజులుగా ఐటీ సోదాలు (Income Tax Raids) జరుగుతున్నాయి. పుష్ప 2, గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిర్మాతల ఇళ్లలో ప్రధానంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే దిల్‌రాజు ఇంట్లో, ఆఫీసులో.. సుకుమార్ ఇంట్లో.. అలాగే మైత్రీమూవీ మేకర్స్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.పండక్కొచ్చారుతాజాగా ఈ ఐటీ సోదాలపై విక్టరీ వెంకటేశ్ (Daggubati Venkatesh) స్పందించారు. మొదట ఈ ప్రశ్న ఎదురవగానే.. అవునా? నిజమా? అంటూ ఆశ్చర్యపోతున్నట్లు నటించారు. ఆ తర్వాత అన్నీ బానే జరిగిపోతాయన్నారు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) మాట్లాడుతూ.. సంక్రాంతికి వస్తున్నామని మేము టైటిల్ పెట్టాం కదా.. వాళ్లు కూడా మేమూ సంక్రాంతికి వస్తున్నామని వచ్చారని చమత్కరించారు. ఇది సాధారణమేదిల్ రాజుపైనే కాదు, చాలామంది ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయన్నారు. రెండేళ్లకోసారి ఐడీ రైడ్స్ జరగడం సర్వసాధారణమేనని పేర్కొన్నారు. తన ఇంట్లో ఎలాంటి ఐటీ సోదాలు జరగలేవన్నారు. ఇకపోతే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పటివరకు రూ.230 కోట్లు రాబట్టింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు.చదవండి: రామ్‌గోపాల్‌వర్మకు మూడు నెలల జైలు శిక్ష -
సినీ ప్రముఖులపై 3 రోజులుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు
-
టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో మూడోరోజు ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: సినీప్రముఖుల ఇళ్లలో వరుసగా మూడోరోజు ఐటీ సోదాలు (Income Tax department Raids) కొనసాగుతున్నాయి. నిర్మాతలతో పాటు నిర్మాణ సంస్థలకు ఫైనాన్స్ చేసిన వారి నివాసాలు, ఆఫీసుల్లోనూ అధికారులు తనిఖీ చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్, నిర్మాత నెక్కింటి శ్రీదర్, దిల్ రాజు (Dil Raju) ఇళ్లు, కార్యాలయల్లో సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి.టాలీవుడ్‌పై టార్గెట్తెలుగు సినీ నిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ మంగళవారం సోదాలు మొదలుపెట్టింది. దాదాపు 55 బృందాలతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లో, ప్రముఖ గాయని సునీత భర్త రామ్‌కు చెందిన మ్యాంగో మీడియా ఆఫీస్‌లోనూ సోదాలు చేశారు. పుష్ప 2 సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టిన నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. వసూళ్లకు తగ్గట్లుగా ఆదాయపన్ను చెల్లించలేదని గుర్తించారు.బుధవారం నాడు సుకుమార్ ఇంటికీ ఐటీ అధికారులు వెళ్లారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన సుకుమార్‌ను నేరుగా ఇంటికి తీసుకెళ్లిన అధికారులు ఆయన బ్యాంకు లావాదేవీలు, లాకర్ల గురించి ఆరా తీశారు. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్ ఇంట్లోనూ సోదాలు చేశారు. దిల్ రాజు కూతురు హన్సిత, సోదరుడు నర్సింహ ఇంట్లోనూ తనిఖీలు చేశారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ వారం రోజుల్లో రూ. 203 కోట్లు వసూళ్లు చేసిందని, కానీ లాభాలకు తగ్గట్లు పన్నులు చెల్లించలేదని ఐటీ శాఖ గుర్తించింది.మరోవైపు ఈ వ్యవహారంపై దిల్‌రాజు బుధవారం స్పందిస్తూ.. ఐటీ రైడ్స్ తన ఒక్కడిపైనే0 జరగట్లేదని.. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు తెలిపారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు అధికారులకు సహకరిస్తున్నారని చెప్పారు. -
రెండోరోజూ ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు రెండోరోజూ కొనసాగాయి. ప్రముఖ నిర్మాత, తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి మండలి చైర్మన్ దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌తోపాటు మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థల కార్యాలయాలు, కొందరు సినీ ఫైనాన్షియర్ల ఇళ్లలో మంగళవారం ఉదయం నుంచి మొదలైన సోదాలు, బుధవారం రాత్రి వరకు కొనసాగాయి. భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందించే వారిపై ఐటీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. అధికారులు 55 బృందాలుగా మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఈ సోదాలు సాగించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో సోదాలు కొనసాగాయి. దిల్‌రాజు, ఆయన కూతురు హన్సిత, సోదరుడు శిరీష్ నివాసాల్లో సోదాలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయం, నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఇళ్లు, మ్యాంగో సంస్థల యజమాని యరపతినేని రామ్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. సినీ ఫైనాన్షియర్స్ సత్య రంగయ్య, అభిషేక్ అగర్వాల్ ఇళ్లల్లోనూ సోదాలు జరిపారు. ఆయా సంస్థల బ్యాలెన్స్ షీట్స్, బ్యాంకు లావాదేవీలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం. తనిఖీలు జరిగిన ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. ఐటీ దాడులపై దిల్‌రాజు స్పందించారు. తన ఒక్కరి ఇళ్లు, కార్యాలయాల్లోనే సోదాలు జరగడం లేదని.. సినీ ఇండస్ట్రీ మొత్తంపై జరుగుతున్నాయని తెలిపారు. -
ఐటీ రైడ్స్ పై స్పందించిన దిల్ రాజు
తన ఇంటిపై ఐటీ శాఖ అధికారుల జరుపుతున్న సోదాలపై ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju)స్పందించారు. ఐటీ రైడ్స్ తన ఒక్కడిపైన మాత్రమే జరగట్లేదని.. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారని ఆయన అన్నారు. వారికి తనతో పాటు తన కుటుంబ సభ్యులు మొత్తం సహకరిస్తున్నామని అని చెప్పారు. బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాకు అభివాదం చేస్తూ పై వ్యాఖ్యలు చేశారు. కాగా, టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం ఉదయం మొదలైన ఈ సోదాలు.. బుధవారం కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు.సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్(sukumar) ఇంటిపై కూడా ఐటీ అధికారులు సోదాలు(IT Rids) నిర్వహించారు. . శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సుకుమార్‌ను ఐటీ అధికారులు నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. ఆయనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, లాకర్లు వంటి వివరాల గురించి ఆరా తీస్తున్నారు. పుష్ప2 చిత్రం రూ. 1850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఆదాయ పన్నుశాఖ అధికారులు ఈ లెక్కలపైనే ప్రధానంగా గురి పెట్టారు.వెలుగులోకి కీలక ఆంశాలు..ఐటీ సోదాల్లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను కూడా ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. పుష్ప 2 మూవీ వసూళ్లకు తగ్గట్లుగా ఐటీ చెల్లింపులు జరగలేదని నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. అలాగే దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్స్ విషయంలో అవకతవకలు జరిగినట్లు వస్తుంది. ఈ సినిమా వారం రోజుల్లో రూ.203 కోట్లు వసూళ్లు సాధించినట్లు అధికారులు గుర్తించారు. అయితే వచ్చిన లాభాలకు తగ్గట్లుగా ఐటీ చెల్లింపులు జరగలేదని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. -
డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు
-
హైదరాబాద్ లో సినీ నిర్మాతల ఇళ్లల్లో ఐటీ సోదాల్లో వెలుగులోకి కీలకాంశాలు
-
హైదరాబాద్ లో వరుసగా రెండో రోజు ఐటీ సోదాలు
-
తెలుగు సినీ నిర్మాతల ఇళ్లలో ఐటీ సోదాలు
-
ఏపీ, తెలంగాణాలో ఐటీ సోదాలు
-
HYD: రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రముఖ రియల్ ఎస్టేట్‌కు చెందిన కంపెనీల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్, చేవెళ్ల, షాద్‌నగర్ సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. నగరంలోని స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో తనిఖీలు కొనసాగుతున్నాయి. బంజారాహిల్స్, చేవెళ్ల, షాద్ నగర్లో కంపెనీ చెందిన నివాసాల్లో సోదాలు చేస్తున్నారు అధికారులు. కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ నివాసాల్లో ఏక కాలంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇటీవల ఓ ఎంఎన్సీ కపెంనీకి రూ.300 కోట్లతో భూమి విక్రయించిన సదరు సంస్థ. షాద్ నగర్లో ఈ భూమిని అమ్మిన స్వస్తిక్ గ్రూప్. అయితే, ఈ భూమి విక్రయానికి సంబంధించి బ్యాలెన్స్ షీట్స్‌లో చూపలేదని అధికారులు ఆరోపిస్తున్నారు. ఇక, ఐటీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ట్రూకాలర్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు.. అసలేమైంది?
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కాలర్ ఐడీ ప్లాట్‌ఫాం ట్రూకాలర్ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్‌లో లొసుగులు, పన్ను ఎగవేతల ఆరోపణలకు సంబంధించి సమాచారాన్ని సమీకరించేందుకు, పత్రాలను పరిశీలించేందుకు సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు.విచారణకు పూర్తిగా సహకారం అందిస్తున్నట్లు కంపెనీ వర్గాలు వివరించాయి. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ విషయంలో అంతర్జాతీయంగా ఆమోదయోగ్యమైన విధానాలనే పాటిస్తున్నట్లు పేర్కొన్నాయి. స్వీడిష్ కంపెనీ అయిన ట్రూకాలర్‌కు భారత్‌లో ముంబై, గురుగ్రామ్, బెంగళూరులో కార్యాలయాలు ఉన్నాయి.ఇదీ చదవండి: అంబానీ, మిట్టల్‌లకు షాక్.. మస్క్ వైపే కేంద్రం మొగ్గు! -
హైదరాబాద్ లో ఐటీ సోదాలు
-
HYD: ఏక కాలంలో 30 చోట్ల ఐటీ సోదాలు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. 30 చోట్ల ఏక కాలంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్, అన్విత బిల్డర్స్ అధినేత అచ్చుత్‌రావు ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.హైదరాబాద్‌లో మరోసారి ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్, అన్విత బిల్డర్స్ అధినేత బొప్పన అచ్చుత్‌రావు, బొప్పన శ్రీనివాస రావు, బొప్పన అనుప్ ఇంట్లో ఐటీ అధికారులు గురువారం తెల్లవారుజాము నుంచే సోదాలు నిర్వహిస్తున్నారు. ఏక కాలంలో 30 చోట్ల తనిఖీలు చేపట్టారు అధికారులు. ప్రస్తుతం కొల్లూరు, రాయదుర్గంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.రాయదుర్గంలోని అన్విత బిల్డర్స్ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారుల సోదాలు చేస్తున్నారు. జీ స్క్వేర్ కమర్షియల్ కాంప్లెక్స్‌లోని ఆరో అంతస్తులో అన్విత బిల్డర్ సంబంధించిన ప్రధాన కార్యాలయం ఉంది. ఇతరులను లోపలికి అనుమతించని సీఆర్పీఎఫ్ సిబ్బంది. సింగపూర్, దుబాయ్‌లో ఇంటీరియర్ వ్యాపారం చేస్తున్న బొపన్న కుటుంబ సభ్యులు. విదేశాల నుండి అన్విత బిల్డర్స్ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడులను ఐటీ అధికారులు గుర్తించారు. మనీ లాండరింగ్ ద్వారా పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ గుర్తించింది. ఇక, ఇటీవలే కొల్లూరులో ఫ్రీ లాంచ్ ఆఫర్‌ను కూడా అన్విత బిల్డర్స్ ప్రకటించింది. ఇక, ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. -
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం
సాక్షి, హైదారాబాద్: నగరంలో మరోసారి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ కలకలం రేగింది. తెల్లవారుజాము నుంచే 10 బృందాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేపట్టాయి. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, మాదాపూర్, మూసాపేట్, కూకట్పల్లి ఏరియాల్లో పలువురు ప్రముఖుల నివాసాలు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. కూకట్ పల్లిలోని రెయిన్బో విస్టాస్లోని ఓ అపార్ట్మెంట్లో 8 మంది ఐటీ సభ్యుల బృందం ఉదయం 5గం.30ని. నుంచే సోదాలు నిర్వహిస్తోంది. ఆ ఇంటి ఓనర్ ఓ మీడియా సంస్థకు ఓనర్ అని సమాచారం. -
నాసిక్‌లోని బులియన్ వ్యాపారి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు
-
రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
ముంబై: మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణంలో ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) 72 గంటలపాటు నిర్వహించిన సోదాల్లో రూ.170 కోట్ల విలువైన సొత్తు లభ్యమైంది. పట్టణంలోని భండారీ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆదినాథ్ అర్బన్ మలీ్టస్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంకు కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఈ నెల 10వ తేదీన సోదాలు ప్రారంభించారు. 12వ తేదీ ఈ సోదాలు ముగిశాయి. వందలాది మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. రూ.14 కోట్ల నగదు, 8 కిలోల బంగారం సహా మొత్తం రూ.170 కోట్ల విలువైన సొత్తు స్వా«దీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నగదును లెక్కించడానికి 14 గంటలు పట్టినట్లు సమాచారం. పెద్ద ఎత్తున పన్ను ఎగవేసినట్లు భండారీ ఫైనాన్స్, ఆదినాథ్ బ్యాంకుపై ఆరోపణలున్నాయి. నాందేడ్ టౌన్లో ఈ స్థాయిలో ఐటీ సోదాలు జరగడం, భారీగా సొమ్ము దొరకడం ఇదే మొదటిసారి. -
అభిషేక్ బెనర్జీ హెలికాప్టర్లో ఐటీ సోదాలు
కలకత్తా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రధాన కార్యదర్శి, సీఎం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ హెలికాప్టర్‌ను ఆదివారం(ఏప్రిల్14) ఇన్కమ్ ట్యాక్స్(ఐటీ) అధికారులు తనిఖీ చేశారు. కలకత్తాలోని బెహలా ఫ్లైయింగ్ క్లబ్లో ఈ తనిఖీలు జరిగాయి. హెలికాప్టర్ వెళ్లకుండా ఐటీ అధికారులు చాలా సేపు అడ్డుకున్నారని టీఎంసీ వర్గాలు తెలిపాయి. తనిఖీల సందర్భంగా అభిషేక్ బెనర్జీ సెక్యూరిటీ సిబ్బందికి ఐటీ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. తనిఖీలపై అభిషేక్‌బెనర్జీ ట్విటర్(ఎక్స్)లో స్పందించారు.‘ఇటీవల ప్రజల ఆగ్రహానికి గురైన ఎన్ఐఏ స్థానిక డీజీ, ఎస్పీలను తొలగించకుండా నా హెలికాప్టర్లో తనిఖీలకు ఐటీ అధికారులను పంపించారు. వారికి తనిఖీల్లో ఏం దొరకలేదు. జమీందార్లు ఎన్నిరకాల ఒత్తిళ్లు పెట్టినా బెంగాల్ తలవంచదు’ అని పోస్టులో బెనర్జీ పేర్కొన్నారు. అభిషేక్ బెనర్జీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఇదీ చదవండి.. బీజేపీ మేనిఫెస్టోపై మల్లిఖార్జున ఖర్గే విమర్శలు -
IT, ED: నేతలు, సినీ ప్రముఖుల ఇళ్లలో సోదాలు
సాక్షి, చెన్నై: తమిళనాడులో జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు కలకలం రేపుతున్నాయి. అధికార పార్టీ డీఎంకేకు చెందిన కొందరు నేతలతో పాటు పలువురు సినీ ప్రముఖుల ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. అదే సమయంలో.. మరోవైపు కొందరు వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్ని లక్ష్యంగా చేసుకుని ఆదాయ పన్నుల శాఖ దాడులు కొనసాగిస్తోంది. చెన్నై సహా 35కు పైగా ప్రాంతాల్లో ఈడీ మంగళవారం ఉదయం ఏకకాలంలో సోదాలకు దిగింది. డీఎంకే బహిష్కృత నేత.. సినీ నిర్మాత జాఫర్ సాదిక్‌కు సంబంధించిన ఆఫీసులతో పాటు, అతనితో పరిచయం ఉన్నవాళ్ల ఇళ్లు, ఆఫీసులకు ఈడీ బృందాలు చేరుకున్నాయి. ఇందులో డీఎంకే నేతలతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు. భారీ డ్రగ్స్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ విచారణలో భాగంగా ఈడీ ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక, రూ.2,000 కోట్ల డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో జాఫర్ సాదిక్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు మార్చి 9వ తేదీన అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. డీఎంకేలో పని చేసిన సాదిక్ పలు తమిళ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అయితే అరెస్ట్ తర్వాత డీఎంకే అతన్ని పార్టీ నుంచి తొలగించింది. మరోవైపు సినీ పరిశ్రమలో, వ్యాపార వర్గాల్లో సాదిక్‌తో పరిచయాలు ఉన్నవారిపై కూడా ఎన్సీబీ దృష్టి సారించింది. ఈ కేసుకు సంబంధించి చిత్ర దర్శకుడు, నటుడు అమీర్‌తో పాటు మరో ఇద్దరు వ్యాపారవేత్తలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఇటీవలె ఢిల్లీలో విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా దర్శన నటుడు అమీర్ ఇంట్లో ఈడీ అధికారులు కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అమీర్ తీసిన మూడు చిత్రాల్లోనూ సాదిక్ నిర్వాణ భాగస్వామ్యం ఉండడం గమనార్హం. అలాగే పలువురు డీఎంకే ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్సీబీ నమోదు చేసిన కేసును, మరికొన్ని ఎఫ్ఐఆర్లను పరిగణలోకి తీసుకుని సాదిక్, ఇతరులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. రూ.32 కోట్లు స్వాధీనం మరోవైపు.. తమిళనాడులో ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కొనసాగుతున్నాయి. పొల్లాచ్చిలో ఎంబీఎస్ పౌల్ట్రీ ఫామ్స్ నడుపుతున్న వ్యాపారవేత్తల ఇళ్లలో ఐటీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. అరుల్‌మురుగన్, శరవణ మురుగన్, ఇళ్లు, కార్యాలయాలు ఉన్నాయి. ఈ సోదాల్లో రూ.32 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. -
హైదరాబాద్‌లో ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మంగళవారం ఉదయం ఐటీ సోదాల కలకలం రేగింది. ప్రముఖ ఫుడ్ ఫ్రాంచైజీ చట్నీస్ హోటల్స్‌లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హోటల్స్‌తో పాటు వాటి యజమాని ఇండ్లలోనూ ఐటీ బృందం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మేఘనా ఫుడ్స్ ఈటరీస్‌లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌తో పాటు బెంగళూరులోనూఈ ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఈ ఐటీ సోదాలకు సంబంధించిన అదనపు సమాచారం అందాల్సి ఉంది. -
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం విధానం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అధికారుల బృందం శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసింది. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన, పోలీసుల స్వల్ప లాఠీచార్జ్, నాటకీయ పరిణామాల మధ్య ఈడీ అధికారులు రాత్రి 8:45 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లి.. విమానంలో ఢిల్లీకి తరలించారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ జోగిందర్ నేతృత్వంలోని 12 మంది ఢిల్లీ అధికారుల బృందం హైదరాబాద్ ఈడీ అధికారుల సహకారంతో శుక్రవారం మధ్యాహ్నమే హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లోని ఎమ్మెల్సీ కవిత నివాసానికి చేరుకుంది. సుమారు 1.45 గంటల సమయంలో సోదాలు ప్రారంభించారు. కవిత, ఆమె భర్త అనిల్‌కుమార్ సహా అక్కడున్నవారి సెల్ఫోన్లను సీజ్ చేశారు. సోదాల్లో పలు పత్రాలను స్వాదీనం చేసుకున్నారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో కవిత మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఆధారాలు లభించాయని, పీఎంఎల్ఏ యాక్ట్ (ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్–2002)లోని 3, 4 సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నట్టు ఎమ్మెల్సీ కవితకు, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అరెస్టుకు కారణాలను తెలియజేస్తూ 14 పేజీల కాపీని కవితకు అందజేశారు. తర్వాత సాయంత్రం 5.20 గంటల సమయంలో కవితను ఈడీ బృందం అరెస్టు చేసింది. దీనికి సంబంధించిన సమాచార లేఖను ఆమె భర్త అనిల్‌కుమార్‌కు అందించింది. కవితను ఢిల్లీకి తరలించేందుకు సిద్ధమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన 12 మంది ఈడీ అధికారుల బృందంలో ఇద్దరు మహిళా అధికారులు ఉన్నారు. తీవ్ర ఉద్రిక్తత మధ్య తరలింపు.. ఈడీ సోదాల విషయం తెలుసుకుని భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కవిత నివాసం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈడీ సోదాలు కొనసాగినంత సేపూ నిరసన తెలిపారు. బీజేపీ, ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, హరీశ్‌రావు, ఇతర నేతలు, న్యాయవాదులు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు. వారు లోనికి వెళ్లకుండా ఈడీ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. దీనితో సుమారు ఇరవై నిమిషాల పాటు కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర నేతలు గేటు వద్దే వేచి ఉన్నారు. ఒకదశలో బీఆర్ఎస్ శ్రేణులు గేటు తోసుకుని కవిత నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాయి. దీనితో పోలీసులు బందోబస్తు పెంచారు. రోప్ పారీ్టలను పిలిపించారు. స్వల్పంగా లాఠీచార్జి చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అక్రమమంటూ వాగ్వాదం! కొంతసేపటి తర్వాత కేటీఆర్, ఇతర నేతలు కవిత నివాసం లోపలికి వెళ్లారు. కవిత అరెస్టు అక్రమం, చట్టవ్యతిరేకమని ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఈడీ అధికారి భానుప్రియ మీనా కల్పించుకుని కేటీఆర్, ఇతర నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీలు జరుగుతున్నప్పుడు అనుమతి లేకుండా లోపలికి వచ్చారని మండిపడ్డారు. వారందరినీ వీడియో తీయాలంటూ మరో ఈడీ అధికారిని ఆదేశించారు. ఈ సమయంలో కేటీఆర్ కలగజేసుకుని.. ‘‘మేడం.. సెర్చ్ చేయడం అయిపోయింది. అరెస్టు వారెంట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు లోపలికి రావొద్దని ఎలా చెప్తున్నారు? ఎలాంటి ట్రాన్సిట్ వారెంట్ లేకుండా, మెజి్రస్టేట్ ముందు హాజరుపర్చకుండానే కేసు చేస్తాను అంటున్నారు. కావాలనే శుక్రవారం వచ్చి అరెస్టు చేస్తున్నారు. మీరు (ఈడీ అధికారులు) ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోబోమని సుప్రీంకోర్టుకు అండర్‌టేకింగ్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని మీరే ఉల్లంఘిస్తున్నారు. దీనివల్ల సీరియస్ ట్రబుల్లో పడతారు..’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. అందరికీ అభివాదం చేసి.. సుమారు 7 గంటల సమయంలో ఈడీ అధికారులు కవితను శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకెళ్లేందుకు బయటికి వచ్చారు. ఈ సమయంలో కవిత ఉద్వేగానికి లోనయ్యారు. అక్కడే ఉన్న తన కుమారుడిని హత్తుకుని ముద్దుపెట్టుకున్నారు. కుమారుడి కన్నీటిని తుడిచి, త్వరగా వస్తానని చెప్పారు. ఆందోళన చేస్తున్న అభిమానులకు నమస్కరించారు. కవితను విమానాశ్రయానికి తీసుకెళ్లేందుకు ఈడీ అధికారులు పోలీసులతో కలసి ప్రత్యేక కాన్వాయ్ సిద్ధం చేశారు. అయితే కవిత తన భర్త అనిల్‌కుమార్ కారులో వస్తానని చెప్పారు. ఈడీ అధికారులు అంగీకరించడంతో భర్తతో కలసి కారులో బయలుదేరారు. ఈ కారు ముందు వెనుక ఈడీ, పోలీసు వాహనాలు కాన్వాయ్‌గా శంషాబాద్‌కు చేరుకున్నాయి. విమానాశ్రయం లోపలికి వెళ్లే సమయంలోనూ కవిత పిడికిలి ఎత్తి అభివాదం చేశారు. ఈడీ అధికారుల బృందం విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన యూకే–870 విమానంలో రాత్రి 8.58 గంటలకు కవితను ఢిల్లీకి తరలించింది. నేడు కోర్టు ఎదుట హాజరు కవితను ఢిల్లీకి తరలించిన ఈడీ అధికారులు శుక్రవారం రాత్రి ఆమెను ఈడీ కార్యాలయంలోనే ఉంచారు. శనివారం మధ్యాహ్నం ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నట్టు సమాచారం. లిక్కర్ కేసులో అరెస్టులు ఇవీ.. సమీర్ మహేంద్రు (ఇండో స్పిరిట్ యజమాని) సెప్టెంబర్ 27, 2022 శరత్‌చంద్రారెడ్డి (ట్రైడెంట్ కెంఫర్ లిమిటెడ్) నవంబర్ 10, 2022 వినయ్‌బాబు (ఫెర్నాడ్ రికార్డ్ కంపెనీ) నవంబర్ 10, 2022 అభిషేక్ బోయినపల్లి (రాబిన్ డిస్ట్రిబ్యూషన్) నవంబర్ 14, 2022 విజయ్ నాయర్ (మద్యం వ్యాపారి) నవంబర్ 14, 2022 అమిత్ అరోరా (బడ్డీ రిటైల్ డైరెక్టర్) నవంబర్ 30, 2022 గోరంట్ల బుచ్చిబాబు (కవిత మాజీ ఆడిటర్) ఫిబ్రవరి 9, 2023 గౌతం మల్హోత్రా (మద్యం వ్యాపారి) ఫిబ్రవరి 9, 2023 మాగుంట రాఘవ (మద్యం వ్యాపారి) ఫిబ్రవరి 11, 2023 మనీష్ సిసోదియా (ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం) ఫిబ్రవరి 26, 2023 కల్వకుంట్ల కవిత (ఎమ్మెల్సీ) మార్చి 15, 2024 నేడు కేసీఆర్, కేటీఆర్ ఢిల్లీకి.. ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతోపాటు మరికొందరు కీలక నేతలు శనివారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. తండ్రిగా కేసీఆర్, సోదరుడిగా కేటీఆర్ నైతికంగా కవితకు అండగా నిలబడేందుకు, న్యాయ నిపుణులతో చర్చించేందుకు వెళ్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణలో ఉన్న సమయంలో ఈడీ అరెస్టు చేసిన అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని వారు భావిస్తున్నట్టు తెలిసింది. కవిత అరెస్టుతోపాటు తెలంగాణ, జాతీయ రాజకీయాలు, మోదీ–బీజేపీ విధానాలపై కేసీఆర్ జాతీయ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. ఈడీ తీరు చట్టవిరుద్ధం: కవిత న్యాయవాది మోహిత్‌రావు సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత అరెస్టు విషయంలో ఈడీ చట్టవిరుద్ధంగా వ్యవహరించిందని సుప్రీంకోర్టులో ఆమె తరఫున వాదిస్తున్న న్యాయవాది మోహిత్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కవిత అరెస్టు నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ మంగళవారానికి వాయిదాపడిందని.. ఈ కేసులో కవితపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోబోమని ఈడీ గతంలో కోర్టుకు హామీ ఇచ్చిందని వివరించారు. సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు కఠిన చర్యలు తీసుకోబోమన్న ఈడీ హామీ వర్తిస్తుందని చెప్పారు. అయినా ముందస్తు పథకంలో భాగంగా సోదాల పేరిట వచ్చి కవితను అరెస్ట్ చేశారని.. విమానం టికెట్లు కూడా ముందుగానే బుక్ చేశారని ఆరోపించారు. కవిత ముందు న్యాయపరంగా చాలా అవకాశాలు ఉన్నాయని, అరెస్ట్‌ను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు. -
కవిత ఇంట్లో సోదాలు.. కేసీఆర్ ఆకస్మిక భేటీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం పార్టీ నేతలు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ కుమార్‌లతో భేటీ అయ్యారు. నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద కొనసాగుతున్న ఐటీ, ఈడీ సోదాలపై ఆరా తీశారు. ఇక హైదరాబాద్‌లో ఒకేసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన, కవిత నివాసంలో సోదాలు జరగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఐటీ, ఈడీ శుక్రవారం సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. మూడు గంటలకుపైగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇద్దరు మహిళా అధికారులతో కలిపి మొత్తం 12 మంది అధఙకారులు సోదాలు జరుపుతున్నారు. కవిత రెండు ఫోన్లును ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కవిత సిబ్బంది ఫోన్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర బలగాలు కవిత ఇంట్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. సోదాలు జరుగుతున్న కవిత ఇంటికి ఆమె అడ్వకేట్ భరత్ చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అధికారులు అడ్డుకున్నారు. ఈడీ సోదాలు జరుగుతున్నాని, ఇప్పుడు అనుమతించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తనిఖీలు మరికొంత సమయం కొనసాగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈడీ సోదాలు ముగిసిన తర్వాత సమాచారం ఇస్తామని, అప్పుడు లోపలికి పిలుస్తామని కేంద్ర బలగాలు చెప్పాయి. -
BRS MLC Kavitha Arrest: లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్.. ఢిల్లీకి తరలింపు
IT ED Raids, MLC Kavitha Arrest Updates: BREAKING @ 09.00 PM అరెస్ట్ ప్రొసీజర్‌కు సంబంధించి పంచనామా తయారుచేసిన ఈడీ లాఠీచార్జ్ మధ్య కవిత అరెస్ట్ కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసి రూట్ క్లియర్ చేసిన పోలీసులు కవితను ఢిల్లీకి తీసుకెళ్తున్న పోలీసులు. మధ్యాహ్నం 1:45 నుంచి సాయంత్రం 6:40 వరకు సెర్చ్ చేసినట్లు పేర్కొన్న ఈడీ. సాయంత్రం 5.20కి కవితను అరెస్ట్ చేసినట్లు పంచనామాలో తెలిపిన ఈడీ పీఎమ్ఎల్ఏ యాక్ట్ 19 కింద కవితను అరెస్ట్ చేసిన ఈడీ. అనుమతి లేకుండా వచ్చి గొడవపడ్డారు: ఈడీ సాయంత్రం 6 గంటలకు అనుమతి లేకుండా 20 మంది లోపలికి వచ్చారు: ఈడీ BREAKING @ 08.31 PM ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయం ఢిల్లీ వెళ్లనున్న కేటీఆర్ ఈడీ ప్రధాన కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించిన ఢిల్లీ పోలీసులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఈడీ కేసు నమోదు. కవిత నివాసం వద్ద తమ విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేసిన ఈడీ. ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం కవిత అరెస్టు రాజకీయ ప్రేరేపితం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కేసు సుప్రీంకోర్టులో ఉండగా ఈ చర్యలు అనైతికం. విపక్ష పార్టీలు లక్ష్యంగా చేసే ఈ చర్యలు ప్రభుత్వ వ్యవస్థల మీద ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. కేసీఆర్‌ను మానసికంగా దెబ్బతీయాలనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు ప్రతి విషయాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటాం.. రాజకీయ ప్రయోజనాలకోసమే ఈ అరెస్టు. ఈ పరిణామాలు వారికి తాత్కాలిక ఆనందమే.. భవిష్యత్‌లో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. కవిత అరెస్టుపై ఒక ప్రకటనలో స్పందించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. BREAKING @ 08.11 PM కుట్రతోనే కవితను అరెస్ట్ చేశారు: హరీష్‌రావు అంతా పథకం ప్రకారమే జరిగింది ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటాం కవితను అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాం 19కి కేసు విచారణ ఉన్నప్పటికి ఇవాళ అరెస్ట్ చేశారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ను దెబ్బతీయాలన్నదే ప్లాన్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ రాజకీయ కుట్ర చేస్తోంది BREAKING @ 08.00pm రేపు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ పిటిషన్ వేయనున్న కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం నిందితుడు అమిత్ అరోరా సమాచారంతో కవిత అరెస్ట్ 4 రోజుల నుంచి అమిత్ అరోరాను ప్రశ్నిస్తున్న ఈడీ సౌత్ లాబీ కీలక సమాచారాన్ని ఈడీకి అందించిన అరోరా లిక్కర్ కేసులో కీలకంగా వ్యవహరించిన సౌత్ లాబీ రేపు ఉదయం అమిత్ అరోరాతోపాటు కవితను ప్రశ్నించనున్న ఈడీ రేపు మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో కవిత హాజరు ఢిల్లీ ఎయిర్‌పోర్టు నేరుగా ఈడీ ఆఫీస్‌కు కవిత రాత్రంతా ఢిల్లీ ఈడీ కార్యాలయంలోనే బీఆర్ఎస్ నాయకురాలు రేపు ఉదయం కవితకు మెడికల్ టెస్టు రేపు మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్న ఈడీ విచారణ కోసం కవితను కస్టడీ కోరనున్న ఈడీ BREAKING @ 07.20pm కవితను ఢిల్లీ తరలిస్తున్న ఈడీ అధికారులు కాసేపట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కవిత. రాత్రి. 8:45కి విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లనున్న అధికారులు. రేపు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్న ఈడీ. కవిత ఇంటి దగ్గర ఈడీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు. కవితను తీసుకెళుతున్న వాహనాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ యత్నం. బీఆర్ఎస్ శ్రేణులను చెదరగొట్టి వాహనానికి రూట్ క్లియర్ చేసిన పోలీసులు. పార్టీ శ్రేణులకు అభివాదం చేసిన కవిత పార్టీ శ్రేణులను సముదాయించిన సీనియర్ నాయకులు ఇలాంటి అణిచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటామన్న కవిత. శ్రేణులు బలంగా మనోదైర్యంతో ఉండాలని విజ్ఞప్తి. BIG BREAKING @ 07.00pm కవితను ఢిల్లీకి తరలిస్తున్న ఈడీ అధికారులు ఇంటి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్తున్న ఈడీ అధికారులు. కవితను తీసుకెళ్లే రూట్ క్లియర్ చేస్తున్న పోలీసులు రాత్రి. 8:55కి ఫ్లైట్ బుక్ చేసిన అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తల హెచ్చరికతో పోలీసుల భారీ బందోబస్తు. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి వివరాలు BIG BREAKING @ 6.30pm ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై ఈడీ ప్రకటన సాయంత్రం 5:20 నిమిషాలకు కవిత అరెస్ట్ చేశాం. మనీలాండరింగ్ యాక్ట్ కింద అరెస్ట్ చేశాం. ఆమె అరెస్ట్ చేసినట్లు భర్త అనిల్‌కు తెలిపాం. BIG BREAKING @ 5.45pm ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత అరెస్ట్ కవిత ఫోన్లు, పీఏ ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఈడీ ప్రస్తుతం తెలంగాణ శాసనమండలి సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు రాత్రి 8.45గంటల విమానంలో కవితను ఢిల్లీకి తరలించనున్న ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్‌కు ముందు ED అధికారులు.. ఆమెకు అరెస్ట్ వారంట్‌తో పాటు సెర్చ్ వారెంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి కవితతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు నోటీసులిచ్చినట్టు తెలిసింది. కవితను ఢిల్లీ తరలించే అవకాశముంది. BRS MLC K Kavitha is being brought to Delhi by ED: Sources (file pic) pic.twitter.com/23NM1P7cEc — ANI (@ANI) March 15, 2024 ఛార్జ్‌షీట్‌లో కవితపై మోపిన అభియోగాలు ఏంటంటే.? ఆప్ నేతలకు సౌత్‌గ్రూపు రూ.100 కోట్లు హవాలా రూపంలో ముడుపులిచ్చింది. తద్వారా మద్యం విధానం తమకు అనుకూలంగా ఉండేలా చూసుకుంది. అరుణ్పిళ్లైకి క్రియేటివ్ డెవలపర్స్ భాగస్వాములు, రవిశంకర్ చెట్టి రూ.5 కోట్లకు హైదరాబాద్‌లో భూమి అమ్మారన్న ఆరోపణలున్నా వారెవరూ అరుణ్పిళ్లైను కలవలేదు. ఈ ఒప్పందాన్ని ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ గ్రూప్‌నకు చెందిన శ్రీహరి చర్చలు జరిపి ఖరారు చేశారు. భూమి కొనుగోలు నిమిత్తం సంస్థకు ఒకరు డబ్బులు బదిలీ చేస్తారని చెప్పిన శ్రీహరి.. ఎవరు డబ్బులు బదిలీ చేశారనేది రవిశంకర్ చెట్టికి చెప్పలేదు. అయితే, ఎన్‌గ్రోత్ కాపిటల్ పేరుతో ఫీనిక్స్ గ్రూపునకు చెందిన శ్రీహరి ఆ భూమిని కొనుగోలు చేసినట్లు బుచ్చిబాబు తన వాంగ్మూలంలో చెప్పారు. ఆ సమయంలో ఫీనిక్స్ గ్రూపునకు సీవోవోగా శ్రీహరి ఉన్నారు. దీంట్లో కవిత భర్త అనిల్‌కుమార్ కూడా భాగస్వామి. కవిత తెలంగాణలో పెద్ద రాజకీయ నాయకురాలు కావడంతో మార్కెట్ రేటు కంటే తక్కువకే భూమి కొనుగోలు చేశారు. దీంతోపాటు కవిత మరో ప్రాపర్టీ కూడా కొనుగోలు చేశారు. 25వేల చదరపు అడుగుల ప్రాపర్టీకి సంబంధించిన పేపర్ వర్క్‌ను బుచ్చిబాబు, శ్రీహరి పూర్తిచేశారు. మార్కెట్ ధర చదరపు అడుగు రూ.1,760 ఉంటే రూ.1,260 మాత్రమే చెల్లించారు. కవితతో గణనీయమైన ఆర్థిక లావాదేవీలున్న వ్యక్తి రవిశంకర్‌తో భూమి కొనుగోలుకు చర్చలు జరిపినట్లు నిర్ధారణకు వచ్చాం. ఇండోస్పిరిట్స్‌లో కవిత తరఫున అరుణ్ పిళ్లై ప్రతినిధిగా వ్యవహరించి రూ.32.86 కోట్లు అందుకున్నారు. పిళ్లై సూచన మేరకు రూ.25.5 కోట్లు నేరుగా ఇండోస్పిరిట్స్ నుంచి పిళ్లై ఖాతాకు బదిలీ అయ్యాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మద్యం దుకాణం నిమిత్తం ఎన్వోసీ కోసం జీఎంఆర్ గ్రూపునకు చెందిన బీవీ నాగేశ్వరరావుతో మాగుంట రాఘవ, ఎంపీ ఎంస్ రెడ్డి చర్చలు జరిపారు. ఎంఎస్ రెడ్డి వాట్సాప్ సందేశాల ద్వారా ఇది వెల్లడైంది. వ్యాపారంలో భాగస్వాములై ఎన్వోసీ ఇవ్వాలని జీఎంఆర్‌ను కోరినట్లు తేలింది. ఇండోస్పిరిట్స్‌లో అరుణ్ పిళ్లై ప్రాక్సీ భాగస్వామి. ఇండోస్పిరిట్స్ నుంచి లాభాలు తన నుంచి కవితకు చేరడంపై అరుణ్పిళ్లై సేట్మెంట్ల ద్వారా వెల్లడైంది. ఏప్రిల్ 2022లో ఢిల్లీలోని ఓ హోటల్లో విజయ్‌నాయర్‌తో కవిత, అరుణ్పిళ్లై సమావేశమయ్యారు. వ్యాపార కార్యకలాపాలు కుంటుపడుతున్న నేపథ్యంలో చెల్లించాల్సిన లంచాలు రికవరీ చేయడంపై చర్చించారు. హోటల్ రికార్డుల దీన్ని ధ్రువీకరించుకున్నాం. దినేష్ ఆరోరా, అరుణ్పిళ్లై వాంగ్మూలాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. కిక్‌బ్యాక్‌ల రూపంలో సొమ్ములు వెనక్కి మళ్లించే పనులను అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లై నిర్వహించినట్లు ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలమిచ్చారు. సౌత్‌గ్రూప్ నుంచి కిక్‌బ్యాక్‌లను విజయనాయర్ అందుకుంటున్నారన్నారు. విజయ్నాయర్కు డబ్బు అవసరమని బుచ్చిబాబు ఫోను నంబర్ల ద్వారా చేసిన వాట్సాప్ సందేశాల ద్వారా ధ్రువీకరణ అయింది. దీంట్లో ‘వీ’కి డబ్బు కావాలి అంటే విజయ్నాయర్కు డబ్బు అవసరమని అర్థమని బుచ్చిబాబు తెలిపారు. ఢిల్లీ, హైదరాబాద్ హోటళ్లలో జరిగిన సమావేశాల్లో సౌత్‌గ్రూపు నుంచి విజయ్నాయర్కు డబ్బులు పంపడంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు కూడా బుచ్చిబాబు తెలిపారు. క్రియేటివ్ డెవలపర్స్ ఖాతాకు డబ్బు మళ్లించడం కూడా బుచ్చిబాబు నోట్స్ ద్వారా తెలిసింది. కవిత తరఫున ఇండోస్పిరిట్స్ నుంచి వచ్చిన లాభాలను అరుణ్ పిళ్లై అందుకొని ఆమె ఆదేశాల మేరకు పెట్టుబడులు పెట్టాల్సి ఉందని ధ్రువీకరణ అయింది. భూముల కొనుగోలులో శ్రీహరి సూచనల మేరకు కవిత తరఫున సొమ్ములు బదిలీ చేయడం వరకే పిళ్లై పాత్ర పరిమితమని తేలింది. అయితే, మే 2022 నుంచి రిజిస్టర్ కాకుండా ఉన్న భూమి 11.10.22న అరుణ్పిళ్లై భార్య పేరు మీద రిజిస్టర్ కావడం అరుణ్పిళ్లై ప్రయోజనం కోసమేనని, కవితకు లాభదాయకం కాదని దర్యాప్తులో తేలింది. అరుణ్పిళ్లై ఆదేశాల మేరకే ఇండో స్పిరిట్స్ నుంచి ఆంధ్రప్రభ పబ్లికేషన్స్, ఇండియా అహెడ్లకు రూ.కోటి, రూ.70 లక్షలు బదిలీ చేసినట్లు సమీర్ మహేంద్రు తెలిపారు. దీనికి మద్దతుగా ఎలాంటి రికార్డు లేదు. అయితే, అరుణ్ పిళ్లై చెప్పినట్లుగా ఈ సంస్థలు ఇండో స్పిరిట్స్ లేదా అరుణ్ పిళ్లైకి ఎలాంటి ఈవెంట్ నిర్వహించలేదు. ఆయా సంస్థలకు ఇచ్చిన సొమ్ము ఇప్పటివరకూ వెనక్కి ఇవ్వలేదు. గౌతమ్ ముత్తాకు అరుణ్పిళ్లై బదిలీ చేసిన రూ.4.76 కోట్లు, అభిషేక్‌కు రూ.3.85 కోట్లు బదిలీ రుణం తిరిగి ఇవ్వమని చెప్పినప్పటికీ కాలక్రమేణా ఎలాంటి రుణం లేదని పిళ్లై పేర్కొన్నారు. BIG BREAKING @ 5.30pm కవితకు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ED కాసేపట్లో కవితను అరెస్ట్ చేసే అవకాశం కవిత నివాసం వద్ద కవిత అనుచరుల నిరసన బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు కవిత ఇంటి ముందు గేటు బయట బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసే దిశగా ED అడుగులు వేస్తోంది. ఇప్పటికే కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు.. ఆమెకు అరెస్ట్ వారంట్‌తో పాటు సెర్చ్ వారెంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి కవితతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు నోటీసులిచ్చినట్టు తెలిసింది. లాయర్లు, కవిత వర్గం ఏమంటోంది? ఒక మహిళను సాయంత్రం 6గంటలకు అరెస్ట్ చేయరాదు సుప్రీంకోర్టుకు ఇచ్చిన మెమోను ఈడీ ఉల్లంఘించారు CrPC సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదు, 2022 డిసెంబరులో అప్పటి విచారణ అధికారి ఇదే తరహా నోటీసు సెక్షన్ 160 కింద ఇచ్చారు, గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉంది. సెక్షన్ 41ఏ కింద ఎందుకు, ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదు దర్యాప్తు సంస్థకు ఏవైనా ప్రశ్నలకు సమాధానం లేదా సమాచారం కావాలంటే వర్చువల్ పద్ధతిలో ఇస్తారు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అరెస్ట్ చేయడం రాజకీయ కక్షే నాలుగు గంటలుగా కొనసాగుతున్న సోదాలు ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు మూడు గంటలకుపైగా కొనసాగుతున్న తనిఖీలు కవిత ఇంట్లో సోదాలు చేస్తున్న 12 మంది అధికారులు. ఇద్దరు మహిళా అధికార్లతోపాటు పదిమంది అధికారుల తనిఖీలు. కవిత ఇంట్లో 16 ఫోన్లు సీజ్ చేసిన ఈడీ అధికారులు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఈడీ అధికారులు కవిత సిబ్బంది ఫోన్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం ఇంట్లోకి ఎవరినీ అనుమతించని ఈడీ కేసు కోర్టులో ఉండగా.. దాడులు ఎలా చేస్తారు?: సోమ భరత్ కుమార్, బీఆర్ఎస్ లీగల్ సెల్. సుప్రీంకోర్టులో కవిత కేసు పెండింగ్‌లో ఉంది. కేసు పెండింగ్‌లో ఉండగా ఈడీ అధికారులు కవిత ఇంటికి ఎలా వస్తారు? ఢిల్లీ నుంచి ఈడి అధికారులు ఇలా రావడం కరెక్ట్ కాదు. ఎలాంటి చర్యలు తీసుకోమని కోర్టులో ఈడీ చెప్పింది. ఈనెల 19న సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో కవితను అరెస్ట్ చేసే అవకాశం లేదు. కవిత ఇంటికి చేరుకున్న అడ్వకేట్ భరత్ కవిత నివాసంలోకి అనుమతించని అధికారులుజ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించినా అడ్వకేట్ భరత్ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు అనుమతించే ప్రసక్తి లేదని తెలిపిన అధికారులు. మరికొంత సమయం పాటు సోదాలు కొనసాగే అవకాశం ఉందని వెల్లడి ఈడీ సోదాలు ముగిసిన తర్వాత సమాచారం ఇస్తామన్న అధికారులు. అప్పుడు లోపలికి పిలుస్తామని అడ్వకేట్‌కు చెప్పిన అధికారులు. మూడు గంటలుగా కొనసాగుతున్న సోదాలు ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు మూడు గంటలకుపైగా కొనసాగుతున్న తనిఖీలు కవిత ఇంట్లో సోదాలు చేస్తున్న 12 మంది అధికారులు. ఇద్దరు మహిళా అధికార్లతోపాటు పదిమంది అధికారుల తనిఖీలు. కవిత ఇంట్లో 16 ఫోన్లు సీజ్ చేసిన ఈడీ అధికారులు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఈడీ అధికారులు కవిత సిబ్బంది ఫోన్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం ఇంట్లోకి ఎవరినీ అనుమతించని ఈడీ సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సంయుక్తంగా సోదాలు చేపట్టాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారులు తనిఖీలు జరుపుతున్నాయి. నాలుగు బృందాలుగా ఈడీ, ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత ఇంట్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. కవితతోపాటు ఆమె భర్త వ్యాపారాలపై దర్యాప్తు సంస్థ అధికారుల ఆరా తీస్తున్నారు. ఐటీ, ఈడీ సోదాల నేపథ్యంలో కవిత నివాసం దగ్గర కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. కవిత ఇంట్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. చదవండి: కవిత పిటిషన్‌పై విచారణ 19కి వాయిదా -
పాతబస్తీ: కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇంట్లో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచి ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కాగా గతంలోనూ షానవాజ్ ఇంట్లో ఐటీ దాడులు చేసింది. అయితే ఆ సమయంలో షానవాజ్ దుబాయ్ వెళ్లిపోయాడు.. తాజాగా ఆయన్ను దుబాయ్ నుంచి తీసుకొచ్చిన అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయపు పన్ను కట్టకుండా తప్పించుకున్నారన్న సమాచారంతోనే ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. చదవండి: కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదంటే.. -
IT Raids: ఆ డబ్బు నాది కాదు: ఎంపీ ధీరజ్ ప్రసాద్
ఢిల్లీ: ఒడిశా కేంద్రంగా మద్యం వ్యాపారం చేస్తున్న ఓ సంస్థకు సంబంధించి పలు ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖ(ఐటీ) సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటన అధికారులు ఆశ్చర్యపోయే విధంగా ఏకంగా రూ.351 కోట్లు పట్టుబడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఆ మద్యం వ్యాపార సంస్థతో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ ప్రసాద్ సాహూకు సంబంధం ఉన్నట్లు బీజేపీ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై మొదటిసారిగా కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ప్రసాద్ స్పందించారు. ఐటీ దాడుల్లో పట్టుబడిన డబ్బు తనది కాదని తెలిపారు. ఆ డబ్బు తన కుటుంబ సభ్యులు, వారి వ్యాపార సంస్థలకు చెందినవని స్పష్టం చేశారు. కావాలంటే తన అకౌంట్ వివరాలను వెల్లడించడానికి సిద్ధమని తెలిపారు. #WATCH | Delhi | First reaction of Congress MP Dhiraj Prasad Sahu on I-T raids and recovery of hundreds of crores of rupees in cash from premises linked to him. On BJP's allegation of the cash being black money, he says, "I have already said that the money is from the business… pic.twitter.com/W8PEx1DHlN — ANI (@ANI) December 15, 2023 ‘నాపై వస్తున్న ఆరోపణలకు విచారం వ్యక్తం చేస్తున్నా. ఐటీ దాడుల్లో పట్టుబడిన డబ్బు నాకు చెందినవి కావు. దాడుల్లో పట్టబడిన డబ్బుకు కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలతో ఎటువంటి సబంధం లేదు. ఆ సొమ్ము నాది కాదు. నా కుటుంబ సభ్యులకు చెందిన మద్యం సంస్థలది. నేను నా అకౌంట్ వివరాలు ఇవ్వడానికి సిద్ధం’ అని అన్నారు. ఐడీ దాడుల్లో పట్టుబడ్డ సొమ్ము తనది కాదని, అది తన కుటుంబ సభ్యులకు చెందినవారిదని తాను ముందే చెప్పినట్లు తెలిపారు. ఐటీ శాఖ ఆ ధనాన్ని.. నల్లధనం అంటుందని తెలిపారు. తాన వ్యాపార రంగంలో లేనని స్పష్టం చేశారు. ఆ డబ్బుపై తన కుటుంబ సభ్యులు సమాధానం చెబుతారని అన్నారు. ఈ విషయంలో ఎవరు ఏం అనుకున్న పట్టుబడిన డబ్బు.. కాంగ్రెస్‌పార్టీకి గానీ, మరే ఇతర పార్టీలకు గాని సంబంధం లేదనని వెల్లడించారు. #WATCH | Delhi | First reaction of Congress MP Dhiraj Prasad Sahu on I-T raids and recovery of hundreds of crores of rupees in cash from premises linked to him. On BJP's allegation of the cash being black money, he says, "I have already said that the money is from the business… pic.twitter.com/W8PEx1DHlN — ANI (@ANI) December 15, 2023 -
ఒడిశా ఐటీ దాడుల మొత్తం రూ.351 కోట్లు
న్యూఢిల్లీ/భువనేశ్వర్: ఒడిశా కేంద్రంగా మద్యం వ్యాపారం చేస్తున్న సంస్థకు సంబంధించిన ప్రాంతాల్లో ఆదాయ పన్ను(ఐటీ) అధికారులు చేసిన సోదాల్లో దొరికిన నగదు మొత్తం రూ.351 కోట్లకు చేరింది. దేశంలో ఒక దర్యాప్తు సంస్థ ఒకేసారి చేసిన సోదాల్లో ఇంతటి భారీస్థాయిలో కరెన్సీ బయటపడటం ఇదే తొలిసారి! బౌద్ధ్ డిస్టిల్లరీ ప్రైవేట్ లిమిటెడ్, దాని ప్రమోటర్లు, ఇతరులకు సంబంధించిన చోట్ల ఐటీ అధికారుల సోదాలు ఐదోరోజైన ఆదివారమూ కొనసాగాయి. మద్యం వ్యాపారం ద్వారా పొందిన దాంట్లో లెక్కల్లో చూపని ఆదాయం గుట్టుమట్లను ఐటీ శాఖ రట్టుచేస్తోంది. తనిఖీల్లో భాగంగా రాంచీలోని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ ప్రసాద్ సాహూ సంబంధిత ప్రాంతాల్లోనూ ఐటీ అధికారులు చెక్‌చేశారు. ఇక్కడ ఎంత మొత్తంలో నగదు, ఇతర పత్రాలు లభించాయనేది అధికారులు వెల్లడించలేదు. ‘ఈ అంశం ధీరజ్ సాహూ కుటుంబ విషయం. దాదాపు వందేళ్లకు పైగా వారి కుటుంబం ఉమ్మడి వ్యాపారం చేస్తోంది. అందులో సాహూకు చిన్న వాటా ఉంది. ఏదేమైనా ఆయనకు సంబంధించిన చోట్ల సోదాలు జరిగాయికాబట్టి ఆయన ఈ విషయంలో వివరణ ఇవ్వాల్సిందే. అందుకే ఆయన నుంచి వివరణ తీసుకున్నాం. కాంగ్రెస్ పారీ్టకి ఈ సోదాలకు సంబంధం లేదు’’ అని జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్చార్జ్ అవినాశ్ పాండే ఆదివారం స్పష్టంచేశారు. విపక్షాలపై అమిత్ విమర్శలు ఐటీ దాడులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ‘‘ దర్యాప్తు సంస్థలను కేంద్రం దురి్వనియోగం చేస్తుందని ఇన్నాళ్లూ విపక్షాలు ఎందుకు అన్నాయో ఇప్పుడు అర్థమవుతోంది. విపక్షాలు తమ అవినీతి, అక్రమ సొమ్ము వ్యవహారం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే ఇన్నాళ్లూ విషప్రచారం చేశాయి. తీరా ఇప్పుడు కరెన్సీ కట్టలు బయటపడ్డాక కాంగ్రెస్, టీఎంసీ, జేడీయూ, డీఎంకే, ఆర్జేడీలు మౌనం వహిస్తున్నాయి’’ అమిత్ వ్యాఖ్యానించారు. -
ఐదో రోజుకు ఒడిషా ఐటీ దాడులు..బయటపడ్డ సంచలన విషయం
భువనేశ్వర్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఒడిషా ఇన్‌కమ్‌ట్యాక్స్(ఐటీ) దాడులు ఐదో రోజు ఆదివారం కూడా కొనసాగుతున్నాయి.జార్ఖండ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత ధీరజ్‌సాహుకు చెందిన లిక్కర్ కంపెనీ కార్యాలయాల్లో జరుగుతున్న ఈ సోదాల్లో ఇప్పటివరకు రూ.300 కోట్ల లెక్కల్లోకి రాని నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ధీరజ్‌సాహుకు చెందిన బౌధ్ డిస్టిలరీతో పార్టనర్‌షిప్‌లో ఉన్న బల్దేవ్ సాహు గ్రూపు కంపెనీల్లో ఉన్న ఐటీ అధికారులు ఇవాళ ఉదయం సోదాలు నిర్వహించారు.ఐటీ అధికారులు ఈ కంపెనీల కార్యాలయాల నుంచి మరింత నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోపక్క సాహు, ఆయన బంధువుల కంపెనీల కార్యాలయాలు, ఇళ్ల నంచి బయటపడుతున్న గుట్టలు గుట్టల సొమ్మును లెక్కించడానికి ఐటీ అధికారులు చెమటోడ్చాల్సి వస్తోంది. ఇప్పటికే ఈ డబ్బు లెక్కించేందుకు 40 కౌంటింగ్ మెషీన్లు వినియోగిస్తుండగా తాజాగా మరిన్ని మెషీన్లను, సిబ్బందిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నుంచి రప్పించారు.సోదాల్లో దొరికిన మొత్తం అక్రమ నగదు రూ.350 కోట్ల వరకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఐదో రోజు సాహూ కంపెనీలపై జరుగుతున్న ఐటీ సోదాల్లో సంచలన విషయం బయటపడింది.నగదులోఉన్న రూ.5 లక్షల పాలిథిన్ బ్యాగుపై ఇన్స్పెక్టర్ తివారీ అని పేరు రాసి ఉండడం విశేషం. కాగా, ఇదే విషయమై బీజేపీ నేషనల్ చీఫ్ జగత్ ప్రకాష్ నడ్డా ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. ‘మీరు పరిగెత్తి పరిగెత్తి అలసిపోవాల్సిందే..మిమ్మల్ని విడిచిపెట్టం’ అని పోస్టులో నడ్డా పేర్కొన్నారు. ఇదీచదవండి..యువకుడి సెల్ఫ్ ‘రిప్’ పోస్టు..వెంటనే సూసైడ్ -
దాడుల్లో దొరికింది 290 కోట్లు
న్యూఢిల్లీ/భువనేశ్వర్: ఒడిశా కేంద్రంగా పనిచేస్తున్న డిస్టిలరీ గ్రూప్, అనుబంధ సంస్థల్లో ఆదాయ పన్ను(ఐటీ) అధికారు లు చేపట్టిన సోదాల్లో భారీ మొత్తంలో నల్లధనం వెలుగులోకి వస్తోంది. మొత్తంగా రూ. 290 కోట్ల వరకు ఇక్కడ ఉండొచ్చని చెబుతున్నారు. ఇప్పటి వరకు లెక్కించిన రూ. 250 కోట్లను అధికారులు వాహనాల ద్వారా తరలించి ఒడిశాలోని ఎస్బీఐ శాఖల్లో జమ చేశారు. ఒకే కేసులో ఒకే దర్యాప్తు సంస్థకు ఇంత భారీ మొత్తంలో లెక్కల్లో చూపని నగదు పట్టుబ డటం ఇదే మొదటిసారని అధికార వర్గాలు తెలిపాయి. మొరాయిస్తున్న కౌంటింగ్ మెషిన్లు ‘ఈనెల 6వ తేదీ నుంచి మొదలైన సోదాల్లో బౌధ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థల్లో దొరికిన డబ్బుల కట్టలను లెక్కించడం కష్టసాధ్యమైన విషయంగా మారింది. విరామం లేకుండా లెక్కింపు కొనసాగించడంతో కౌంటింగ్ మిషన్లు మొరాయిస్తున్నాయి. దీంతో, ఇతర బ్యాంకుల నుంచి 40 వరకు చిన్నా పెద్దా కౌంటింగ్ యంత్రాలను తీసుకువచ్చాం. నగదంతా దాదాపుగా రూ. 500 నోట్ల రూపంలోనే ఉంది. ఇప్పటి వరకు రూ. 250 కోట్లను లెక్కించి బ్యాంకుల తరలించాం. శనివారం సాయంత్రానికి లెక్క పెట్టడం పూర్తవుతుంది. మొత్తం రూ. 290 కోట్ల వరకు ఉండొచ్చని అనుకుంటున్నాం. అదేవిధంగా, ఈ డబ్బును సంభాల్పూర్, బొలంగీర్ ఎస్బీఐ ప్రధాన శాఖలకు తరలించేందుకు మరిన్ని వాహనాలను కూడా తీసుకువచ్చాం. నగదును సర్దేందుకు 200 బ్యాగులను వినియోగించాం’ అని అధికారులు వివరించారు. స్పందించని కాంగ్రెస్ ఎంపీ ఇప్పటి వరకు సోదాలు జరిపిన ప్రాంతాల్లో జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహుకు చెందింది కూడా ఉందని ఐటీ వర్గాలు తెలిపాయి. ‘మద్యం పంపిణీదారులు, విక్రేతలు, వ్యాపారుల ద్వారా భారీ మొత్తంలో నమోదు కాని విక్రయాలు, నగదు బట్వాడా జరుగుతున్నాయన్న ఐటీ నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ సోదాలు చేపట్టాం’అని ఐటీ వర్గాలు వివరించాయి. సోదాల్లో పాల్గొన్న 150 మంది అధికారులతోపాటు ఆయా ప్రాంతాల్లో లభ్యమైన డిజిటల్ డాక్యుమెంట్ల పరిశీలనకు హైదరాబాద్ నుంచి మరో 20 మంది అధికారులు కూడా వచ్చారన్నారు. దాడులు జరిగిన కంపెనీల అధికారుల వాంగ్మూలాలను సేకరిస్తున్నామన్నారు. ఐటీ దాడుల్లో భారీ మొత్తంలో నగదు వెలుగులోకి రావడంపై ఎంపీ సాహు స్పందన కోసం తమ ప్రతినిధి చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు పీటీఐ తెలిపింది. 10 అల్మారాల నిండా డబ్బుల కట్టలు ‘బొలంగీర్ జిల్లాలోని ఓ కంపెనీ ఆవరణలోని సుమారు 10 అల్మారాల్లో రూ. 230 కోట్ల నగదు దొరికింది. మిగతాది తిత్లాగఢ్, సంబల్పూర్, రాంచీల్లో లభ్యమైంది. శనివారం బొలంగీర జిల్లా సుదపారకు చెందిన దేశవాళీ మద్యం తయారీదారుకు చెందిన ఇంట్లో మరో 20 బ్యాగుల నిండా ఉన్న డబ్బు లభ్యమైంది. ఇందులో రూ. 50 కోట్ల వరకు ఉంటుందని అనుకుంటున్నాం. దీన్ని లెక్కించాల్సి ఉంది. అదేవిధంగా, శుక్రవారం వెలుగు చూసిన 156 బ్యాగుల్లోని డబ్బును బొలంగీర్ ఎస్బీఐ ప్రధాన బ్రాంచికి తరలించి, లెక్కిస్తున్నాం’అని వివరించారు. ఐటీ డీజీ సంజయ్ బహదూర్ మూడు రోజులుగా భువనేశ్వర్‌లో మకాం వేసి, పర్యవేక్షిస్తున్నారు. దాడులకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. కాంగ్రెస్ అవినీతి సంప్రదాయాన్ని పెంచి పోషిస్తోంది: బీజేపీ ఐటీ దాడుల్లో నమ్మశక్యం కాలేని రీతిలో నగదు బయటపడటంపై బీజేపీ స్పందించింది. కాంగ్రెస్ అవినీతి సంప్రదాయాన్ని తరాలుగా ఎలా సజీవంగా ఉంచిందో దీన్ని బట్టి తెలుస్తోందని వ్యాఖ్యానించింది. శనివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేత, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి మీడియాతో మాట్లాడారు. ‘కేవలం ఒక్క కాంగ్రెస్ నేత వద్ద రూ.300 కోట్ల నగదు దొరికింది. కాంగ్రెస్ నేతలందరి దగ్గరా కలిపితే ఎంత డబ్బు దొరుకుతుందో దీన్నిబట్టి ఊహించుకోవచ్చు’అని ఆమె అన్నారు. వ్యవస్థలో లోపాలను ఆసరాగా చేసుకుని, ఎంతగా అవినీతికి పాల్పడొచ్చో కాంగ్రెస్ నేతలు నిరంతరం అన్వేషిస్తుంటారని పేర్కొన్నారు. రాజ్యసభకు కాంగ్రెస్ తరఫున మూడుసార్లు ఎంపీ అయిన సాహ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ఆ పార్టీకి ఏటీఎంలుగా మాదిరిగా పనిచేస్తున్నారని విమర్శించారు. రూ.300 కోట్లకుపైగా అవినీతికి పాల్పడిన మద్యం వ్యాపారి ధీరజ్ సాహు ఏటీఎం ఎవరిదని ఆమె ప్రశ్నించారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు
-
పాతబస్తీ బడా వ్యాపారులు టార్గెట్ గా ఐటీ సోదలు
-
పాతబస్తీలో బడా వ్యాపారులే టార్గెట్‌గా ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. పాతబస్తీలో బడా వ్యాపారులే లక్ష్యంగా శనివారం తెల్లవారుజామునుంచే ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కోహినూర్ గ్రూప్స్ ఎండీ మజీద్‌ఖాన్ ఇళ్లు, కార్యలయాల్లో విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. కింగ్స్ గ్రూప్ ఓనర్ షానవాజ్ ఇంటితోపాటు పలువురు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. కోహినూర్, కింగ్స్ గ్రూపుల పేరుతో ఫంక్షన్ హాల్స్, హోటల్స్ నిర్వహిస్తున్న ఈ వ్యాపారులు ఓ రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుతున్నట్లు అనుమానం రావడంతో దాడులకు దిగారు. మరోవైపు వికారాబాద్ జిల్లా తాండూరులో ఐటి అధికారుల దాడులు చేపట్టారు. పట్టణంలోని శ్రీ దుర్గా గ్రాడ్యుర్ హోటల్, బార్ అండ్ రెస్టారెంట్‌పై ఐటీ సోదాలు జరుపుతున్నారు. హోటల్ యజమాని శేఖర్ గౌడ్ హైదరాబాద్ చెందిన వ్యక్తి కాగా.. యజమాని ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డికి డబ్బులు మరుతాయని ఆరోపణలతో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లుగా ప్రచారం. చదవండి: సోనియా దీవిస్తే సీఎం అవుతా: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
నా పై ఐటీ దాడులు వారి కుట్రే : వివేక్
సాక్షి, మంచిర్యాల : ఎన్నికల్లో గెలవలేకే తనపై ఐటీ దాడులు చేయిస్తున్నారని మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. బీఆర్ఎస్ చెన్నూరు అభ్యర్థి బాల్క సుమన్ ఫిర్యాదు చేయడం వల్లే ఐటీ దాడులు జరిగాయని తెలిపారు. మంచిర్యాలలోని వివేక్ ఇంట్లో మంగళవారం ఉదయం ప్రారంభమైన ఐటీ సోదాలు పదిగంటలకుపైగా జరిగి సాయంత్రం ముగిశాయి. అనంతరం బయటకు వచ్చి కార్యకర్తలకు అభివాదం చేసిన వివేక్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసిన కేసీఆర్‌పై ఐటీ దాడులు జరిపే దమ్ము లేదు కానీ తనపై మాత్రం చేశారని ఫైరయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తన మీద కుట్ర చేశాయని, తనపై ఎన్ని దాడులు చేసినా ఏం కాదన్నారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 సీట్లు గెలవబోతోందని, చెన్నూరు నుంచి తాను గెలవబోతున్నానని వివేక్ తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి తన ఇంట్లో ఐటీ దాడులు చేశారని ఆరోపించారు. ఇటీవలే విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీ ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో జమైన నగదు గురించి ఐటీ అధికారులు ఈ సోదాల్లో వివేక్‌ను ఆరా తీసినట్లు సమాచారం. కాగా, సోమాజీగూడలోని వివేక్ నివాసంలో ఐటీ సోదాలు ఉదయమే ముగిశాయి. నాలుగున్నర గంటలపాటు తనిఖీలు నిర్వహించారు. ఇటీవలే వివేక్ వెంకటస్వామి బీజేపీని వీడి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత వెంటనే ఆయనకు చెన్నూరు నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వీడిన కొద్ది రోజులకే ఆయనపై ఐటీ దాడులు జరగడం ఆయన అనుచరులను కలవరానికి గురి చేస్తోంది. తెలంగాణలో పవర్లో ఉన్న బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేయకుండా కాంగ్రెస్ నేతలపైనే ఐటీ దాడులు జరుగుతుండడాన్ని కాంగ్రెస్ నేతలు రాజకీయంగా అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఐటీ సోదాలు ముగిసిన వెంటనే వివేక్ కూడా ఇదే రకమైన స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి కుట్ర చేసి తనపై ఐటీ దాడులు చేయించాయని ఆరోపించారు. ఇదీచదవండి.. కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంట్లో ఐటీ సోదాలు -
మాజీ ఎంపీ వివేక్ ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు
-
మంచిర్యాలలోని వివేక్ ఇంటి దగ్గర కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
-
ఐటీ సోదాల్లో రూ. 5 కోట్ల నగదు పట్టివేత.. ఎన్నికల కోసమేనా?
నల్లగొండ: జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఐటీ సోదాల్లో భారీగా నగదు పట్టుబడింది. జిల్లాకు చెందిన పలువురు రైస్ మిల్లర్ల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ. 5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. మహాశక్తి, వైదేహి, వజ్రతేజ, సుమాంజలి, కీర్తి, వెంకటసాయి రైస్ మిల్లర్ల వద్ద నుంచి డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఎన్నికల కోసం ఈ డబ్బును సిద్ధం చేసినట్లుగా ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో నల్లగొండ, మిర్యాలగూడ, హాలియా, నిడమనూరు, త్రిపురారంలో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. -
ఐటీ దాడులపై స్పందించిన బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు
-
ఎన్నికల వేళ తెలంగాణలో ఐటీ సోదాల కలకలం
-
బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు ఇంటిపై ఐటీ సోదాలు
-
ఎన్నికల వేళ ట్విస్ట్.. బీఆర్ఎస్ అభ్యర్థి ఇంట్లో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఐడీ దాడులు రాజకీయంగా తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ఇంట్లో, ఆయన బంధువుల నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏక కాలంలో 40 బృందాలు దాడులు చేస్తున్నాయి. దీంతో, పొలిటికల్‌గా ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాల ప్రకారం.. మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గురువారం తెల్లవారుజాము నుంచే ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మిర్యాలగూడతో పాటు నల్గొండ, హైదారాబాద్‌లోని ఆయన నివాసాల్లో ఏక కాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిన్నారు. మొత్తం 40 బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. నల్లమోతు భాస్కర్ రావుకు దేశ వ్యాప్తంగా పలు వ్యాపారాలు ఉన్నాయి. పవర్ ప్రాజెక్టుల్లో ఆయన పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. అయితే ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు భారీగా డబ్బు నిల్వచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న ఐటీ అధికారులు ఆయన ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేశారు. బంధువుల ఇళ్లలో సోదాలు.. మరోవైపు.. ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భాస్కర రావు బావమరిది రంగా శ్రీధర్‌తో పాటు మరొక నాలుగు చోట్ల మిర్యాలగూడలో సోదాలు జరుగుతున్నాయి. భాస్కర రావు ప్రధాన అనుచరులు, రైస్ మిల్ అసోసియేషన్ నేతల ఇళల్లో సోదాలు కొనసాగుతున్నాయి. విజయం శ్రీధర్, కుశలయ్య ఇళ్లలో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవలే తెలంగాణలో ఎన్నికల సందర్బంగా ఐటీ అధికారులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరుల ఇళ్లపై కూడా ఇటీవల ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ సోదాల్లో సబితా అనుచరులుగా ప్రచారం జరుగుతున్న నరేందర్ రెడ్డి ఇంట్లో 7.50 కోట్లు, ప్రదీప్ రెడ్డి ఇంట్లో రూ.5 కోట్లకు పైగా డబ్బును ఐటీ అధికారులు సీజ్ చేశారు. ఈ నగదును మహేశ్వరం ఎన్నికల కోసం సమకూర్చుకున్నదిగా ప్రచారం జరుగుతోంది. ప్రదీప్ రెడ్డి, నరేందర్ రెడ్డికి మంత్రి సబితా కుమారుడితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా ఐటీ అధికారులు విచారణలో గుర్తించారు. అటు, పొంగులేటి ఇంట్లో కూడా ఐటీ దాడులు జరిగాయి. -
ఎన్నికల వేళ భారీగా సొత్తు సీజ్: సీబీడీటీ
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరంలలో లెక్కల్లో చూపించని నగదు భారీగా పట్టుబడుతున్నట్లు ఆదాయ పన్ను విభాగం సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్)తెలిపింది. ఆయా రాష్ట్రాల్లో 2019లో జరిగిన లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు సీబీడీటీ చైర్మన్ నితిన్ గుప్తా బుధవారం తెలిపారు. సోదా, నిఘా చర్యలను ఎన్నికల కమిషన్ సమన్వయంతో చేపడుతున్నామని వివరించారు. అసెంబ్లీ ఎన్నికలున్న రాజస్తాన్‌లో పట్టుబడిన అక్రమ నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి తదితరాల మొత్తం విలువ మూడింతలయిందన్నారు. 2021లో సీజ్ చేసిన మొత్తం సొత్తు విలువ రూ.322 కోట్లు కాగా, 2022లో అది రూ.322 కోట్లకు, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.1,021 కోట్లకు పెరిగిందని గుప్తా పేర్కొన్నారు. -
IT Raids: మంత్రి సబిత బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌లో 15 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలోని ఫార్మా కంపెనీలకు చెందిన ఛైర్మన్, సీఈవో, కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. అలాగే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల నివాసాల్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నట్టు సమాచారం. గచ్చిబౌలిలోని మై హోం బూజాలో ఉంటున్న ప్రదీప్ అనే వ్యక్తి నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కాగా, ఐటీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ప్రైవేట్ లాకర్లలో భారీగా బ్లాక్ మనీ.. కొనసాగుతున్న సోదాలు
రాజస్తాన్‌లోని జైపూర్ గణపతి ప్లాజా ప్రైవేటు లాకర్లలో మళ్లీ లక్షల్లో బ్లాక్ మనీ దొరికింది. ఆ లాకర్లలో కోట్లాది రూపాయల నల్ల డబ్బు దాచారన్న ఆరోపణల నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. శుక్రవారం ఇక్కడికి చేరుకున్న ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల బృందం రైడ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఒక లాకర్లో రూ.7.5 లక్షల అనధికార సొమ్మును ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరో లాకర్‌లోనూ భారీగా నగదును గుర్తించారు. ప్రస్తుతం లెక్కింపు కొనసాగుతోంది. అధికారులు మరిన్ని లాకర్లను తెరవనున్నారు. అదంతా పేపర్‌లీక్ సొమ్ము రాజస్తాన్‌లో గత డిసెంబర్లో గ్రేడ్-2 టీచర్ నియామకానికి సంబంధించిన పేపర్‌లీక్ ఉదంతం బయటపడింది. 37 మంది అభ్యర్థులు సహా మొత్తం 55 మంది నిందితులు అరెస్టయ్యారు. కాగా ఈ పేపర్‌లీక్ ద్వారా సంపాదించిన అక్రమ సొమ్మునంతా జైపూర్ గణపతి ప్లాజా ప్రైవేటు లాకర్లలో దాచారని ఆ రాష్ట్ర బీజేపీ నాయకుడు కిరోరిలాల్ మీనా సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటిదాకా రూ.7 కోట్ల నగదు, 12 కేజీల బంగారం జైపూర్ గణపతి ప్లాజాలో మొత్తం 1100 లాకర్లు ఉన్నాయి. గత అక్టోబర్ 17న చేసిన సోదాల్లో రూ.30 లక్షలు స్వాధీనం చేసుకున్న ఆదాయపు పన్ను శాఖ బృందం.. అక్టోబర్ 21న చేపట్టిన సోదాల్లో ఏకంగా రూ.2.46 కోట్లు స్వాధీనపరుచుకున్నారు. ఆ లాకర్లు నుంచి ఇప్పటిదాకా రూ.7 కోట్లకు పైగా నగదు, 12 కేజీలకు పైగా బంగారాన్ని ఇన్కమ్ ట్యాక్స్ శాఖ స్వాధీనం చేసుకుంది. -
పొంగులేటి నివాసం నుంచి కీలక పత్రాలు స్వాధీనం?
సాక్షి, హైదరాబాద్: పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఆదాయపన్నుల విభాగం(ఐటీ) సోదాలు ముగిశాయి. సోదాల అనంతరం అధికారులు తమ వెంట కొన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్లినట్లు సమాచారం. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి నివాసంలో రెండు బృందాలుగా అధికారులు తనిఖీలు నిర్వహించారు. నివాసంలోని ఓ రూంలో అధికారులు చాలాసేపు ఉన్నారు. ఆఖర్లో ఆ గది నుంచి మూడు బ్యాగులు, బ్రీఫ్ కేసు, ప్రింటర్, కీలక డాక్యుమెంట్లు తమ వెంట తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఉన్న రాఘవా ప్రైడ్ ఆఫీస్‌లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ఇదిలా ఉంటే.. గురువారం ఉదయం నుంచి ఖమ్మంలోని పొంగులేటి నివాసం, ఆయనకు చెందిన కంపెనీలు, బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్, లాంకోహిల్స్, రాయదుర్గం, బషీర్‌బాగ్ ప్రాంతాలతోపాటు ఖమ్మం టౌన్, ఖమ్మం రూరల్, పాలేరు, స్వగ్రామం కల్లూరులోని నారాయణపురంలో ఈ సోదాలు జరిగాయి. కాంగ్రెస్ ఈ ఐటీ రైడ్స్‌ను ప్రతీకార రాజకీయ చర్యగా అభివర్ణించింది. తాను నామినేషన్ వేసిన సమయంలోనే ఐటీ దాడులు ఉద్దేశపూర్వకంగా జరిగాయని, అధికారులు తమల్ని ఇబ్బందిపెట్టారంటూ సోదాలు ముగిసిన అనంతరం పొంగులేటి సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బెంగళూరు, చెన్నైకి చెందిన 200 మందికిపైగా అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్టు సమాచారం. -
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో రెండో రోజు ఐటీ సోదాలు
-
ఐటీ దాడులకు బీజేపీకి సంబంధం లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేసీఆర్ పాలన తడిబట్టలతో గొంతుకోసేలా తయారైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు ప్రజలపై కంటే మాఫియాపైనే ఎక్కువ నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ దున్నపోతులను తినే రకం అయితే... కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఏనుగులను తినే రకం అని విమర్శించారు. గురువారం పార్టీ కార్యాలయంలో బీజేపీ తరపున పోటీచేసే లంకల దీపక్‌రెడ్డి (జూబ్లీహిల్స్), నవీన్‌కుమార్ (వికారాబాద్), శ్రీకాంత్‌రెడ్డి (సిద్దిపేట), మొగిలయ్య (నకిరేకల్), పూస రాజు (ముషీరాబాద్)కు బీ–ఫారాలను అందచేసిన సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. దీపావళి తర్వాత ఈనెల 13వ తేదీ నుంచి బీజేపీ ప్రచారాన్ని ఉరకలెత్తిస్తామని చెప్పారు. ఐటీ దాడులు ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయని, వారున్నదే దాడులు చేయడానికని వ్యాఖ్యానించారు. ఆదాయ పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టారని సమాచారం వచ్చిన వారిపై దాడులు చేస్తారని, ఆ దాడులకు బీజేపీకి, కేంద్రానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఐటీ దాడులు జరుగుతాయని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ముందే ఎలా తెలుసని నిలదీశారు. జనంలోకి వెళ్లకుండా, మాట్లాడకుండా కొన్ని సంస్థలు సెల్‌ఫోన్, కంప్యూటర్ల ముందు కూర్చుని సర్వే నివేదికలు ఇస్తున్నాయని, అవన్నీ దొంగ సర్వేలని కిషన్‌రెడ్డి కొట్టిపారేశారు. ఈ సర్వేలపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 11న మోదీ.. : ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఈనెల 11న రాష్ట్రానికి వస్తున్నారని, ఆ తరువాత మరో రెండు మూడు సభల్లో పాల్గొంటారని కిషన్‌రెడ్డి తెలిపారు. -
ఐటీ దాడులపై పొంగులేటి రియాక్షన్
-
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. భయపడేది లేదు: పొంగులేటి
సాక్షి, ఖమ్మం: పొంగులేటి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఐటీ దాడులకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పొంగులేటి అనుచరుడు ఉపేందర్ ఆయన ఇంటి ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. కాగా, ఉదయం 5 గంటల నుండి పొంగులేటి నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పొంగులేటికి మద్దతుగా అభిమానులు, కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకున్నారు. పొంగులేటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష సాధిస్తున్నాయంటూ నిరసన తెలిపారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఉద్దేశపూర్వకంగానే ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి జరిగిన పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారు. నేను ఇవాళ నామినేషన్ వేస్తున్నానని తెలిసే ఐటీ దాడులు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లపైనే ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేకపోయారు’’ అంటూ పొంగులేటి వ్యాఖ్యానించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కనుసైగల్లో వ్యవస్థలు నడుస్తున్నాయి. ఎన్నికలకు ఈ రోజు నామినేషన్ వేస్తున్నానని ప్రకటించాను. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి నా ఇళ్లు, బంధువుల ఇళ్లపై, సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. నా బంధువులు, మిత్రుల 30 మంది ఇళ్లపై 400మంది అధికారులు దాడులు చేస్తున్నారు. నారాయణపురంలోని మా తల్లి ఉంటున్న ఇంట్లోనూ సోదాలు జరిపారు. కనీసం లక్ష రూపాయలు కూడా పట్టుకోలేకపోయారు. నా దగ్గర పని చేస్తున్న ఉద్యోగులు, బంధువులపై మాన్ హ్యండలింగ్ చేశారు. నా భార్యను, కుమారుడిని వాళ్ల ఆఫీస్‌కి తీసుకెళ్లారు. నన్ను ఈ రోజు ఎన్నికల ప్రచారానికి వెళ్లవద్దని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లపై సోదాలు ఎందుకు జరగట్లేదు?. ఈ పరిణామాలను ప్రజలంతా గమనించాలి. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. భయపడేది లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వేస్తే బీఆర్ఎస్ దోచుకున్న లక్షల కోట్లు కక్కిస్తాం’’ అని పొంగులేటి పేర్కొన్నారు. చదవండి: ఇదేందయ్యా... ఒక్క సీటు మురిపెం -
నన్ను జైలుకు పంపుతారా?.. ఐటీ దాడులపై పొంగులేటి రియాక్షన్
సాక్షి, ఖమ్మం జిల్లా: పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూరల్ మండల తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. పొంగులేటి క్యాంపు కార్యాలయం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ఆర్వో కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలివచ్చారు. శ్రీనివాసరెడ్డి నామినేషన్‌కు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. తన నామినేషన్ పత్రాలను ఆర్వోకు అందించారు. శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలను దూరంగా పంపించడంతో పోలీసులు డౌన్, డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా, నామినేషన్ దాఖలు అనంతరం సాక్షి టీవీతో మాట్లాడిన పొంగులేటి.. తన ఇంటిపై జరుగుతున్న ఐటీ సోదాలపై స్పందించారు. ఈ రోజు ఉదయం ఐదు గంటల నుంచి నా ఇళ్లు, బంధువుల ఇళ్లపై, సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. నా బంధువులు, మిత్రులు 32 ఇళ్లపై 400 మంది అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు’’ అని తెలిపారు. నామినేషన్ వేస్తానని తెలిసి ఐటీ అధికారులు వచ్చారు. నన్ను నామినేషన్ వేయడానికి వెళ్లకూడదన్నారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న 10వేల మంది కార్యకర్తలు, నాయకులు నా ఇంటికి వచ్చారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుందని రాష్ట్రంలోని ఆపద్ధర్మ, కేంద్ర ప్రభుత్వాలు భయపడ్డాయి. అందుకే నాకు నామినేషన్ వేయడానికి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ భయపడుతున్నారు’’ అంటూ పొంగులేటి వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వేస్తే బీఆరెస్ దోచుకున్న లక్షల కోట్లు కక్కిస్తాం. ఏ వ్యక్తి ఎప్పుడైనా, ఎక్కడైనా నామినేషన్ వేయవచ్చు. ఐటీ అధికారులకు సహకరిస్తాను. నియోజకవర్గంలో పర్యటిస్తాను. నా ఆస్తులను సీజ్ చేస్తారా? నన్ను జైలుకు పంపుతారా.? నన్ను ఏం చేసినా వెనుకడుగు వేయను. ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది’’ అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చదవండి: పొలిటికల్ గేమ్.. పొంగులేటి ఇంట్లో ఐటీ సోదాలు -
ఐటీ దాడులపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
-
కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు.. పొంగులేటి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, ఖమ్మం: కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఐటీ దాడులపై పొంగులేటి స్పందించారు. తనను ఇబ్బంది పెట్టేందుకే ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ దాడులపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, తాజాగా పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ..‘కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ నాయకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయి. వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం, నాయకుల వద్ద ఉన్నాయి. వారిపై దాడులు చేయకుండా.. నాపై, కాంగ్రెస్ నేతలపై దాడులు చేస్తున్నారు. ఇది హేయమైన చర్య. నాపై ఫోకస్ పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. తనను విమర్శించే వారిని వేధించడం కేసీఆర్‌కు అలవాటే. . బీఆర్ఎస్ లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటే తనిఖీలు ఎందుకు చేయడంలేదు. ఐటీ దాడులు ఊహించినవే. కాంగ్రెస్ నేతలే టార్గెట్ ఐటీ దాడులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నేతలపైనే దాడులపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. ఈరోజు నేను నామినేషన్ దాఖలు చేయాలి. నామినేషన్ దాఖలు చేసే అధికారం ప్రతి ఒక్కరికీ ఉంటుందని తెలిపారు. అర చేతిని అడ్డు పెట్టుకుని సూర్యకాంతిని ఆపలేరు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం’ అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: పొలిటికల్ గేమ్.. పొంగులేటి ఇంట్లో ఐటీ సోదాలు -
కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు.. రేవంత్ రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. అయితే, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసాల్లో ఐటీ దాడులతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక, కాంగ్రెస్ నేతల ఇళ్లపై దాడుల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రధాని మోదీ, కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఐటీ దాడులపై రేవంత్ ట్విట్టర్ వేదికగా..‘నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు దేనికి సంకేతం!? బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు!? రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ - కేడీ బెంబేలెత్తుతున్నారు. ఆ సునామీని ఆపడానికి చేస్తోన్న కుతంత్రం ఇది. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతవడం ఖాయం’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్ల పై ఐటీ దాడులు దేనికి సంకేతం!? బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు!? రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ - కేడీ బెంబేలెత్తుతున్నారు. ఆ సునామీని… — Revanth Reddy (@revanth_anumula) November 9, 2023 మరోవైపు.. ఖమ్మం, హైదరాబాద్‌లోని పొంగులేటి నివాసం, కార్యాలయాల్లో దాడులు జరుగుతున్నాయి. ఎనిమిదికిపైగా వాహనాల్లో ఐటీ అధికారులు ఖమ్మం చేరుకుని పొంగులేటీ ఆఫీస్, ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. అధికారులకు పొంగులేటి సహకరిస్తున్నట్టు సమాచారం. దీంతో, పొంగలేటి అనుచరులు ఆయన ఇంటి వద్దకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో, ఖమ్మం పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. ఇది కూడా చదవండి: పొలిటికల్ గేమ్.. పొంగులేటి ఇంట్లో ఐటీ సోదాలు -
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ రైడ్స్
-
పొంగులేటి ఇంట్లో ఐటీ సోదాలు
-
పొలిటికల్ గేమ్.. పొంగులేటి ఇంట్లో ఐటీ సోదాలు
సాక్షి, ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఏక కాలంలో పొంగులేటి ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వివరాల ప్రకారం.. కాంగ్రెస్ నేత పొంగులేటికి ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గురువారం తెల్లవారుజామునే ఎనిమిది వాహనాల్లో ఐటీ అధికారులు వాహనాల్లో పొంగులేటి ఇంటికి చేరుకున్నారు. ఖమ్మంలోని ఆయన ఇంట్లో, పాలేరులోని క్యాంపు ఆఫీసులు దాడులు తనిఖీలు జరుపుతున్నారు. ఇక, త్వరలోనే తనపై ఈడీ, ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని పొంగులేటి బుధవారం మీడియాలో మాట్లాడుతూ చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు, నేడు పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి నేడు నామినేషన్ వేసేందుకు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. -
అవి రాజకీయ దాడులే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘అవి ఆదాయపన్ను శాఖ (ఐటీ) రైడ్స్ కాదు.. రాజకీయ దాడులు. ఎన్నికల్లో ఓటమికి భయపడే అధికార బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి బీజేపీతో కలిసి మా ఇళ్లపై దాడులు చేయించారు. 48 గంటలు నిర్బంధించి, సోదాలు జరిపించారు.’అని మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎ మ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆరోపించారు. ‘‘అయినా అధికారులు మా వద్ద ఏం పట్టుకోలేకపోయారు. నా వ్యాపారాలన్నీ పారదర్శకమే. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు కనీస డిపాజిట్ కూడా దక్కనివ్వం’’అని తేల్చి చెప్పారు. రెండు రో జుల ఐటీ దాడుల అనంతరం శనివారం ఆయన ‘సాక్షి ప్రతి నిధి’తో మాట్లాడారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎన్నో భూ దందాలు, అక్రమాలకు పాల్పడినా ఐటీ దాడులు చేయలేద నీ, తాను నిజాయితీ గల అభ్యర్థి కావడం వల్లే ఐటీ దాడులు చేశారని పేర్కొన్నారు. ఓ విధంగా దాడుల వల్ల నాకు మంచే జరిగింది ‘‘ఈ దాడులు నాకు మంచే చేశాయి. పైసా ఖర్చు లేకుండా తక్కువ కాలంలో నన్ను ప్రజల్లోకి తీసుకెళ్లాయి. రెండు రోజుల పాటు ఇంటింటా తిరిగినా రాని ప్రచారం కేవలం ఈ దాడులతో వచ్చింది. ఇందుకు ఐటీశాఖ అధికారులకు నేను కృతజ్ఞతలు చెబుతున్నా.’’అని లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. ’’మంత్రి సబిత కాంగ్రెస్‌లో గెలిచి, ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి నమ్మి ఓట్లేసిన ప్రజలను మోసం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఎన్నికల్లో ఆమెను కచ్చితంగా ఓడించి తీరుతా... సేవకుడిగా ప్రజల్లో నాకు మంచి గుర్తింపు ఉంది. ఆ గుర్తింపే నన్ను ఎన్నికల్లో గెలిపిస్తుంది.’’అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
తిరుపతిలో డాలర్స్ గ్రూప్ పై ఐటీ సోదాలు
-
కాంగ్రెస్ నేత ఇళ్లల్లో ఐటీ సోదాలు
-
జానారెడ్డి కుమారుడి ఇంట ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ జరుగుతున్న ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ప్రత్యేకించి కాంగ్రెస్ నేతల్ని లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఆదాయపన్ను శాఖ దాడులు రాజకీయపరమైన చర్చకు దారి తీశాయి. గురువారం ఉదయం మొదలైన ఐటీ సోదాలు అర్ధరాత్రి దాకా జరగ్గా.. శుక్రవారం ఉదయం కూడా అవి కొనసాగుతున్నాయి. పలు బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు నగరంలో, నగర శివారుల్లో కాంగ్రెస్ నేతలకు సంబంధించిన 18 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. విప్సర్ వ్యాలీలో ఉన్న సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి ఇంట ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు నిన్న అర్ధరాత్రి దాకా మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్ఆర్) ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. ఉదయం మరోసారి చేపట్టారు. నార్సింగ్‌లోని ఇంటితో పాటు మదాపూర్‌లోని కేఎల్ఆర్ హెడ్‌క్వార్టర్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. బడంగ్ పేట్ మేయర్ పారిజాతం ఇంట అర్ధరాత్రి దాకా ఐటీ సోదాలు కొనసాగాయి. ఈ క్రమంలో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. 6వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్‌నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరి బంధువుల ఇళ్లలో కూడి నిన్న ఆదాయపన్ను శాఖ సోదాలు కొనసాగాయి. -
నగరంలో ఐటీ దాడుల కలకలం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులు, వారి బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు గురువారం విస్తృత సోదాలు నిర్వహించారు. ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న సమయంలో జరిగిన తనిఖీలు నగరంలో కలకలం రేపుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచే ప్రత్యేక బృందాలు దాడులు ప్రారంభించాయి. కోకాపేటలోని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోడల్లుడు, రియల్ ఎస్టేల్ వ్యాపారి గిరిధర్‌రెడ్డి ఇంట్లో సోదాలు చేశాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్)కి చెందిన ఇళ్లు, విల్లా, ఫామ్‌హౌసుల్లో తనిఖీలు చేపట్టాయి. బాలాపూర్‌లోని బడంగ్పేట్ మేయర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, వారి బంధువులు, అనుచరుల ఇళ్లలో, బాలాపూర్ గణపతి లడ్డూను వేలంలో కొనుగోలు చేసిన వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. సీఆర్పిఎఫ్ బలగాల బందోబస్తు మధ్య దాదాపు 14 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగాయి. ఇవి శుక్రవారం సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏకకాలంలో ఇద్దరి ఇళ్లపై దాడి తుక్కుగూడ సమీపంలో కేఎల్ఆర్ అక్బర్ ఫాం హౌస్‌లోని ఇంట్లో, ఆయన సొంత గ్రామమైన రంగారెడ్డి జిల్లా మాసానిగూడ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో, చర్లపల్లి, మొయినాబాద్ ఫామ్ హౌసుల్లో, గచ్చిబౌలి ఎన్సీసీలోని విల్లాలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఉదయం ఐదు గంటలకు మూడు ప్రైవేటు వాహనాల్లో ఐటీ అధికారులు కేఎల్ఆర్ నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగాయి. కొద్దిపాటి నగదు సహా కీలక డాక్యుమెంట్లు స్వాదీనం చేసుకున్నట్లు తెలిసింది. కేఎల్ఆర్ పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం అందడంతో పాటు, ఆదాయం, పన్ను చెల్లింపుల్లో భారీ వ్యత్యాసం కనిపించడం, ఆయన వ్యాపార లావాదేవీలకు సంబంధించి పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో పారిజాత నర్సింహారెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగాయి. ఆ సమయంలో పారిజాత, ఆమె భర్త నర్సింహారెడ్డి ఇంట్లో లేరు. పారిజాత తిరుపతికి వెళ్లగా, నర్సింహారెడ్డి ఢిల్లీలో ఉన్నట్టు తెలిసింది. ఇంట్లో ఉన్న కుమార్తె నుంచి మొబైల్ ఫోన్‌ను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. పారిజాత, నర్సింహారెడ్డికి సమాచారం ఇచ్చారు. ఇంట్లో లభించిన బ్యాంక్ పాస్‌బుక్కులు, డాక్యుమెంట్లను పరిశీలించారు. మరోవైపు కొందరు అధికారులు మేయర్‌ను తిరుపతిలో అదుపులోకి తీసుకుని చెన్నై మీదుగా సాయంత్రానికి నగరానికి తీసుకొచ్చారు. సాయంత్రం 4.56కు శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన నర్సింహారెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని ఇంటికి తీసుకువచ్చి విచారణ మొదలుపెట్టారు. గత కొంతకాలంగా వారు చేసిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. పొద్దుపోయే వరకు సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొంత నగదుతో పాటు కీలక డాక్యుమెంట్లు లభ్యమైనట్లు సమాచారం. కాగా మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ ఆశించిన వారిలో పారిజాత కూడా ఉన్నారు. మహేశ్వరం టికెట్ కోసం భారీ ఎత్తున లాబీయింగ్ జరగడంతో కేఎల్ఆర్, పారిజాతల ఆర్థిక లావాదేవీలపై ఐటీ నిఘా పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. కోకాపేట హిడెన్ గార్డెన్లో.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోడల్లుడు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎంపీపీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం కో ఆర్డినేటర్ గిరిధర్‌రెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు కొనసాగాయి. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. హైదరాబాద్ కోకాపేటలోని హిడెన్ గార్డెన్లో ఆయన నివాసం ఉంటున్నారు. గిరిధర్ రెడ్డి గత కొంతకాలంగా చేసిన ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు దృష్టి పెట్టినట్టు తెలిసింది. మరోవైపు బాలాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు కొనసాగాయి. ఈ సమయంలో లక్ష్మారెడ్డితో పాటు కుటుంబసభ్యులు.. లక్ష్మారెడ్డి అన్న కొడుకు 3 రోజుల క్రితం మరణించడంతో అస్తికలు గంగలో కలిపేందుకు బయలుదేరుతున్నారు. దీంతో లక్ష్మారెడ్డితో కొద్దిసేపు మాట్లాడిన అధికారులు ఓ కాగితంపై సంతకం తీసుకుని ఆయన బయటకు వెళ్లేందుకు అనుమతించినట్లు తెలిసింది. రాజకీయ కక్షలో భాగంగానే..: కేఎల్ఆర్ ♦ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తన ఇల్లు, కార్యాలయాలు, తన బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని కేఎల్ఆర్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి కుట్రపన్ని ఐటీ దాడులు చేయిస్తున్నాయని ఆరోపించారు. మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ తనకు కేటాయించిన తరువాత, ఉద్దేశపూర్వకంగా ఈ సోదాలు చేస్తున్నారని చెప్పారు. మంత్రి సబిత ప్రోద్బలంతోనే..: మేయర్ పారిజాత కాంగ్రెస్ పార్టీ బీ ఫాం కోసం ఎదురు చూస్తున్నా. ఈ సమయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ఐటీ రైడ్స్ చేస్తున్నారు. రాజకీయ కుట్రలో భాగంగా, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతోంది. మంత్రిగా ఆమె వేల కోట్లు సంపాదించారు. ఎన్నో ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా చేశారు. ఆమె ఇంటిపై దాడులు చేయకుండా కేవలం కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న నాపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం?. -
కాంగ్రెస్ నేత పారిజాత నర్సింహారెడ్డి ఇంటిపై ఐటీ దాడులు
-
ఐటీ సోదాల్లో రూ.102 కోట్ల సొత్తు స్వాధీనం
న్యూఢిల్లీ: కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాల్లో ఇప్పటి వరకు రూ.102 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం ఆదాయ పన్ను(ఐటీ)శాఖ తెలిపింది. ఈ నెల 12వ తేదీ నుంచి బెంగళూరు సహా 55 ప్రాంతాల్లో దాడులు జరిపి లెక్కల్లో చూపని రూ.94 కోట్ల నగదుతోపాటు రూ.8 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు, 30 ఖరీదైన విదేశీ తయారీ గడియారాలు కలిపి మొత్తం రూ.102 కోట్ల సొత్తును పట్టుకున్నామని వివరించింది. అక్రమ సొత్తుకు సంబంధించి డాక్యుమెంట్ల హార్డు కాపీ, డిజిటల్ డేటా తదితర సాక్ష్యాధారాలను కూడా చేజిక్కించుకున్నామని తెలిపింది. బోగస్ కొనుగోలు రసీదుల ద్వారా భారీగా పన్ను ఎగవేతకు గురైనట్లు కూడా గుర్తించామంది. -
పరుపు కింద నోట్ల కట్టలు.. కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ఓట్లను కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ నాయకత్వం కర్ణాటక నుంచి వందల కోట్ల రూపాయలు పంపిస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఓటుకు నోటు కుంభకోణంలో నాడు లంచం ఇస్తూ కెమెరాకు చిక్కిన నేటి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఇప్పుడు దొంగల ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని, ఇది ఊహించిందేనని విమర్శలు గుప్పించారు. తెలంగాణలో 'స్కామ్ గ్రెస్'కు చోటు లేదని చెబుదామంటూ ట్వీట్ లో మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ నుంచి చేసిన మరో ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. కర్ణాటకలో అక్రమంగా సంపాదించిన డబ్బును తెలంగాణ ఎన్నికల్లో ప్రలోభాల కోసం తరలిస్తూ కాంగ్రెస్ నేతలు దొరికిపోయారంటూ బీఆర్ఎస్ చేసిన ట్వీట్‌నూ రీట్వీట్ చేశారు. The intellectually bankrupt Congress and it’s leadership is pumping hundreds of crores of rupees from Karnataka to purchase votes in Telangana Their PCC Cheap was the one who was caught on camera bribing in Vote for Note scam and now since this criminal is now leading the pack… https://t.co/tVX3MnpyFu — KTR (@KTRBRS) October 13, 2023 పరుపు కింద నోట్ల కట్టలు.. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో పరుపు కింద దాచి ఉంచిన నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లెక్కిస్తే.. రూ.42 కోట్లుగా తేలింది అది. ఈ డబ్బు వ్యవహారానికి సంబంధించి.. స్థానికంగా ఓ మాజీ మహిళా కార్పొరేటర్, ఆమె భర్తను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. నగల దుకాణాల యజమానులు, ఇతరుల నుంచి ఈ భారీ మొత్తాన్ని వారు సేకరించినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న ఐటీ అధికారులు ఇవాళ బెంగళూరు నగరంలో దాడులు నిర్వహించారు. ఆర్టీ నగర్‌లోని ఆత్మానంద కాలనీలోని ఓ ఫ్లాట్‌లో తనిఖీలు చేపట్టి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెడ్ కింద 23 పెట్టెల్లో దాచిపెట్టిన రూ.500 నోట్ల కట్టలను అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఈ మొత్తం రూ.42 కోట్లని తేలింది. ఈ ఫ్లాట్ ఖాళీగా ఉందని, ఇక్కడ ఎవరూ నివసించట్లేదని సమాచారం. ఈ ఫ్లాట్ యజమాని ఎవరన్నది ఐటీ అధికారులు వెల్లడించలేదు. కాగా.. ఆ మాజీ కార్పొరేటర్ భర్త ఓ కాంట్రాక్టర్ అని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఐటీ అధికారులు తదుపరి దర్యాప్తు చేపట్టారు. -
హైదరాబాద్ లో రెండోరోజు ఐటీ అధికారుల సోదాలు
-
ఫైనాన్స్, చిట్‌ఫండ్ సంస్థలపై ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్/శ్రీనగర్ కాలనీ/శంషాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని పలు ఫైనాన్స్, చిట్‌ఫండ్, ఈ–కామర్స్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపన్నుశాఖ మెరుపు దాడులు చేసింది. గురువారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని 24 చోట్ల ఏకకాలంలో 100 బృందాలతో తనిఖీలు చేపట్టింది. ఆదాయపన్ను చెల్లింపులో అవకతవకల ఆరోపణలపై సోదాలు కొనసాగినట్లు సమాచారం. హైదరాబాద్‌తోపాటు కర్ణాటక, ఒడిశా, తమిళనాడుకు చెందిన ఐటీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు తెలిసింది. బీఆర్ఎస్కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరుడి ఇల్లు, ఆఫీసులు, కూకట్పల్లి హిందూ ఫారŠూచ్యన్ విల్లాలోని అరికపూడి కోటేశ్వరరావు, రైల్వే కాంట్రాక్టర్ వరప్రసాద్ ఇళ్లతోపాటు వారి బంధువుల ఇళ్లలో సోదాలు జరిగినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే మాగంటి బంధువులు, స్నేహితుల వ్యాపారాలు లక్ష్యంగానే సోదాలు జరిగినట్లు ప్రచారం సాగింది. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వా«దీనం చేసుకున్నట్లు తెలియవచ్చింది. పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసంపై ఆరా.. ఎల్లారెడ్డిగూడలోని పూజకృష్ణ చిట్‌ఫండ్స్‌లో 40 మంది ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. చిట్‌ఫండ్స్ డైరెక్టర్స్ నాగరాజేశ్వరి, పూజాలక్ష్మి, ఎండీ కృష్ణప్రసాద్ ఇళ్లలోనూ తనిఖీలు జరిగాయి. అమీర్‌పేట్‌లోని సన్‌షైన్ అపార్ట్మెంట్లోనూ తనిఖీలు చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఈ–కామర్స్ వ్యాపారవేత్త రఘువీర్ ఇంటితోపాటు జూబ్లీహిల్స్‌లోని ఆఫీసుల్లో సోదాలు జరిగాయి. ఐదేళ్ల ఐటీ లావాదేవీలను పరిశీలించారు. చిట్‌ఫండ్స్, ఫైనాన్స్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన వారి వివరాలు సేకరించారు. ఆర్థిక లావాదేవీలకు చెందిన రికార్డులతోపాటు ఆఫీసుల్లోని కంప్యూటర్ హార్డ్‌డిస్‌్కలు, పలు ల్యాప్‌టాప్‌లను స్వా«దీనం చేసుకున్నారు. మరోవైపు జీవనశక్తి చిట్‌ఫండ్, ఈ–కామ్ చిట్‌ఫండ్ సంస్థలపైనా సోదాలు జరిగాయి. ఐటీ రిటర్న్‌లపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. సోదాలకు సంబంధించి ఐటీ అధికారులు ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. -
హైదరాబాద్ లో కొనసాగుతున్న ఐటీ సోదాలు
-
100 టీమ్ లతో ఐటీ సోదాలు
-
హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కలకలం
-
ఐటీ నోటీసులతో కంటిమీద కునుకు కరవైన చంద్రబాబు
‘ఐటీ నోటీసులతో చంద్రబాబులో భయం మొదలైంది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. తనను ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేయచ్చన్న భయంతో కుత కుత లాడిపోతున్నారు. అరెస్టే కాదు 118 కోట్ల రూపాయల మేరకు బయట పడ్డ లూటీ వ్యవహారంపై ఈడీ.. సీబీఐ దాడులు కూడా జరగచ్చని ఆయన ఆందోళన చెందుతున్నారు. నాలుగేళ్ల క్రితం 2019 ఎన్నికల ముందు కూడా చంద్రబాబు ఇలానే తనను అరెస్ట్ చేసి జైలుకు పంపే అవకాశాలున్నాయని ప్రజల సాక్షిగానే అన్నారు. తనని అరెస్ట్ చేస్తే తనకి సంఘీభావంగా రక్షణ వలయంలా మీరే ఉండాలంటూ ప్రజలకు పిలుపు నిచ్చారు. ఇపుడు మళ్లీ ఎన్నికల ఏడాదిలో చంద్రబాబుకు అరెస్ట్ భయం పట్టుకుంది. వెలుగులోకి నిజస్వరూపం కేంద్ర ఐటీ శాఖ అధికారులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ల లూటీ వ్యవహారానికి సంబంధించి సాక్ష్యాధారాలతో సహా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐటీ నోటీసులు రావడంతోనే దేశ వ్యాప్తంగా చంద్రబాబు నిజస్వరూపం వెలుగులోకి వచ్చింది. ఐటీ నోటీసుల్లోని అంశాల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా చంద్రాబును దర్యాప్తు చేసే అవకాశాలున్నాయి. దుబాయ్‌లో అక్కడి కరెన్సీ రూపంలో కొన్ని కోట్ల రూపాయలు అందుకున్న చంద్రబాబుపై ఈడీ కేసులు పెట్టే అవకాశాలున్నాయి. ఏం చేయాలో పాలుపోక.. రేపో మాపో అరెస్ట్ అంటూ మనీ లాండరింగ్ కోణంలోనూ దర్యాప్తులు జరుగుతాయంటున్నారు. ఈ పరిణామాలన్నింటినీ ఊహించుకుంటోన్న చంద్రబాబు నాయుడు కొద్ది రోజులుగా మౌన వ్రతంలో ఉండిపోయారు. అయితే రోజు రోజుకీ తనపై వచ్చిన ఆరోపణలకు సరిపడ సాక్ష్యాలు కూడా బయట పడ్డంతో చంద్రబాబుకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. కచ్చితంగా తనను అరెస్ట్ చేస్తారని ఆయనకు సిక్త్స్ సెన్స్ హెచ్చరిస్తోన్నట్లుంది. అందుకే నన్ను రేపో మాపో అరెస్ట్ చేయచ్చు అంటూ చంద్రబాబు చాలా ఆందోళనగా భయం భయంగా అంటున్నారు. చదవండి: ‘జనం నిద్రపోయే టైంలో యాత్రలు ఏంటో అర్థం కాదు’ అప్పుడు కూడా అదే మాట 2019 ఎన్నికలకు ఏడాది ముందు చంద్రబాబు నాయుడు ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన కొత్తలో కూడా తనపై ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు జరిగే అవకాశాలున్నాయని ప్రతీ సభలోనూ భయం వ్యక్తం చేసేవారు. తనను అరెస్ట్ చేస్తే జైలుకెళ్తానని కూడా అన్నారు. తనకు రక్షణ వలయంగా ఉండి కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలపైనే ఉందని దబాయించారు కూడా. రూ. 118 కోట్లు పైనే లూటీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు ఇంచుమించు 400 కోట్ల రూపాయలను తన ఖాతాలో జమ చేయించుకున్న వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఐటీ నోటీసుల్లో చంద్రబాబు అమరావతిలో నిర్మాణాల కాంట్రాక్టులు అప్పగించిన షాపూర్ జీ పల్లోంజీ నుంచి డొల్ల కంపెనీల ద్వారా రూ. 118 కోట్లు పైనే లూటీ చేసినట్లు సాక్ష్యాలు బయటకు వచ్చాయి. చదవండి: చంద్రబాబు ఐటీ స్కాంపై రంగంలోకి ఏపీ సీఐడీ అవినీతికి సాక్ష్యాలు లేకుండా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినా చంద్రబాబు తాను నిప్పే అంటున్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా తాను దొరక్కపోడానికి కారణం తనపై ఆరోపణలకు సాక్ష్యాలు పట్టుకోలేకపోవడమేనని చంద్రబాబు గడుసుగా అన్నారు. తద్వారా తాను అరెస్ట్ కాకపోడానికి కారణం తాను తన అవినీతికి సాక్ష్యాలు లేకుండా జాగ్రత్తపడటమేనని చాటి చెప్పారు. సీబీఐ అడుగు పెట్టకుండా ప్రత్యేక జీవో తాను నిప్పు అని పదే పదే చెప్పుకునే చంద్రబాబు గత ఎన్నికల ముందు తన అవినీతి కుంభకోణాలపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తుందేమోనని భయపడ్డారు. ఎందుకైనా మంచిదని ఏపీలో సీబీఐ అడుగు పెట్టడానికి వీల్లేకుండా ప్రత్యేక జీవో జారీ చేసిన ఘన చరిత్ర చంద్రబాబుది. ఆయన ఏ తప్పూ చేయకపోతే సిబిఐ అంటే అంత భయం దేనికని ఆర్ధిక రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఐటీ నోటీసుల నేపథ్యంలో తన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి కాబట్టి ఇక తనను అరెస్ట్ చేయచ్చని చంద్రబాబుకు అర్ధం అవుతోన్నట్లుంది. అందుకే ఆయన ముందస్తుగానే తనపై అక్రమ కేసులు పెడుతున్నారని అరెస్టు చేస్తారని.. ఈడీ, సీబీఐ దాడులు కూడా చేయించవచ్చునని ముందస్తుగానే భయపడుతున్నారుని విశ్లేషకులు అంటున్నారు. -యాజులు, సీనియర్ జర్నలిస్టు -
..సోదాలను కూడా వీడియోలు చేస్తూ క్యాష్ చేసుకుంటున్నాడు సార్!
..సోదాలను కూడా వీడియోలు చేస్తూ క్యాష్ చేసుకుంటున్నాడు సార్! -
హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ కుంభకోణం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ స్కాం వెలుగులోకి వచ్చింది. రూ. 40 కోట్ల ఆదాయపుశాఖ పన్ను రీ ఫండ్ కుంభకోణాన్ని ఐటీ అధికారులు గురువారం బట్టబయలు చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ పొందేందుకు బోగస్ డాక్యుమెంట్లు, తప్పుడు కారణాలు చూపించినట్లు ఐటీ అధికారుల సోదాల్లో బయటపడింది. ఈ స్కాం వెనక 8 మంది ట్యాక్స్ కన్సల్టెంట్లతోపాటు, రైల్వే, పోలీస్‌శాఖలకు చెందిన పలువురు ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఈ మేరకు హైదరాబాద్, విజయవాడలోని పలు ఐటీ కంపెనీల్లో అధికారులు సోదాలు జరిపారు. నిజాంపేట్, ఎల్బీనగర్, వనస్థలిపురంలోని ఐటీ కన్సల్టెంట్స్‌పై దాడులు చేపట్టారు.ఐటీ శాఖనే బురిడి కొట్టించిన కంపెనీలు, వ్యక్తులపై కేసులు నమోదు చేసేందుకు ఐటీ అధికారులు రంగం సిద్దం చేశారు. నోటీసులు జారీ చేసి విచారించనున్నారు. ఏజెంట్ల రీఫండ్ మొత్తంపై 10శాతం కమీషన్ కోసం ఐటీ కన్సల్టెంట్లు తప్పుడు రిటర్న్‌లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. 2017లో ఇదే తరహా మోసాన్ని ఐటీ గుర్తించిన అధికారులు.. 200 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యుల్లో ఉన్న వైకల్యాలు, దీర్ఘకాలిక అనారోగ్యాల ద్వారా తప్పుడు రీఫండ్లను క్లెయిమ్ చేసినట్లు పేర్కొన్నారు. ఉద్యోగులకు అర్హత లేకపోయినా కన్సల్టెంట్లు బోగస్ డాక్యుమెంట్లతో మోసం చేసినట్లు గుర్తించారు. చదవండి: సాయి చంద్ భార్యను ఓదార్చిన సీఎం కేసీఆర్ -
నాకు ఇతర ఏ వ్యాపారాలు లేవు: పైళ్ల రాజశేఖర్ రెడ్డి
-
హైదరాబాద్: నేతల ఇళ్లలో ముగిసిన ఐటీ సోదాలు
-
ఐటీ సోదాల పేరిట హడావిడి చేశారంతే!: పైళ్ల శేఖర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ(ఐటీ) సోదాలు ముగిశాయి. ఈ నెల 14వ తేదీన ఉదయం ఆరుగంటల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్థన్‌రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారుల తనిఖీలు మొదలైన సంగతి విదితమే. శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో సోదాలు ముగిసినట్లు ప్రకటించి అధికారులు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఐటీ అధికారుల తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మూడు రోజుల సోదాల్లో.. కంపెనీ లావాదేవీలు, బ్యాంక్ లాకర్లు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లపై ఐటీ ఆరా తీసినట్లు స్పష్టమవుతోంది. అలాగే పలు డాక్యుమెంట్లను ఐటీ అధికారులు తీసుకెళ్లడం గమనార్హం. ఇక చివరగా సోదాల అనంతరం ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐటీ సోదాల పరిణామంపై ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి స్పందించారు. బురదజల్లే ప్రయత్నం BRS నేతలను లక్ష్యంగా చేసుకుని.. కక్ష్య పూరితంగానే ఐటీ దాడులు జరిగాయన్న ఆయన.. సోదాల వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసని చెప్పారు. ‘‘ఐటీ సోదాల గంటలోనే ముగిసినప్పటికీ.. అధికారులు 3రోజుల పాటు కాలయాపన చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప మిగతా వ్యాపారలతో నాకు సంబంధం లేదు. విదేశాల్లో మైనింగ్ వ్యాపారాలున్నాయన్నది పచ్చి అబద్ధం. మర్రి జనార్దన్, కొత్త ప్రభాకర్లతో మాత్రం వ్యాపార సంబంధాలు ఉన్నాయి. కావాలనే నాపై బురద జల్లే ప్రయత్నం జరిగింది. నేను, నా భార్య ఇద్దరం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం. దానికి సంబంధించి పైల్స్ తీసుకున్నారంతే. సక్రమంగా ఆదాయపన్ను చెల్లిస్తున్నాం. నేను కొన్న ఆస్తులపై వివరాలు తీసుకున్నారు అధికారులు బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేశారు...అందులో ఉన్న డాక్యుమెంట్ లపై వివరాలు అడిగారు. ఏదో ఊహించుకుని ఐటీ అధికారులు వచ్చారు... కానీ ఏమీ దొరకలేదు. ఐటీ అధికారులకు మా సీఏ పూర్తి వివరాలు ఇచ్చారు. మంగళవారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణకు హాజరవుతాను అని స్పష్టం చేశారాయన. డాక్యుమెంట్లు కీలకమైనవే! ఇదిలా ఉంటే.. ఐటీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మరోలా ఉంది. ఎమ్మెల్యేకు కంపెనీలు, వ్యాపార వ్యవహారాలు, వారు చెల్లిస్తోన్న పన్నులుకు మధ్య భారీ వ్యత్యాసాన్ని ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. పైళ్ల శేఖర్ భార్య వనితా రెడ్డికి చెందిన తీర్థా గ్రూప్ సంస్థ, వైష్ణవి వ్యాపార సంస్థలకు సంబంధించిన లావాదేవీలను కూడా ఐటీ శాఖ పరిశీలించినట్లు తెలుస్తోంది. తీర్థా గ్రూప్‌కు డైరెక్టర్‌గా ఉన్న వనితా రెడ్డి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరిపి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి హైదరాబాద్, బెంగళూరులో సాగించిన వెంచర్లు, విల్లాల అమ్మకాల్లో నగదు లావాదేవీలను గుర్తించినట్టు సమాచారం. ఇద్దరు ఎమ్మెల్యేలు వారి కుటుబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు గుర్తించారు. కీలక డాక్యుమెంట్లు, విలువైన ఆభరణాలను ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: సుప్రీంకోర్టు ఉత్తర్వులు పాటించారా? లేదా? -
లైఫ్‌స్టైల్ గ్రూప్ డైరెక్టర్ ఇంట్లో సోదాలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాల్లో వరుసగా మూడోరోజూ ఐటీ దాడులు కొనసాగాయి. అయితే శుక్రవారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మర్రి జనార్ధన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డితో పాటు లైఫ్‌స్టైల్ గ్రూప్ కంపెనీల డైరెక్టర్ గజ్జల మధుసూదన్‌రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం నాటి సోదాల్లో మొత్తం 70 బృందాలు పాల్గొన్నట్టు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మధుసూదన్‌రెడ్డి చేసిన భూ లావాదేవీలు, ఇందుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారా లపై ఐటీ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఎల్బీనగర్లో 23 ఎకరాల ప్రాజెక్ట్ విషయంలో జరిగిన భారీ నగదు లావాదేవీపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మధుసూధన్ రెడ్డితో పాటు అతడి భార్య, కుమారుడిని సైతం ప్రశ్నించినట్టు తెలిసింది. లైఫ్‌స్టైల్ గ్రూప్ కంపెనీల్లో మధుసూదన్‌రెడ్డి కుమారుడు సుదేశ్రెడ్డి ౖడైరెక్టర్‌గా ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి వీరంతా సిండికేట్‌గా రియల్ ఎస్టేట్ వ్యా పారాలు చేస్తున్నట్టు లభించిన ఆధారాల మేరకు సోదాలు జరుపుతున్నట్టు తెలిసింది. ఇలావుండ గా వైష్ణవి గ్రూప్ స్థిరాస్థి సంస్థ, హోటల్ ఎట్ హోం, వాటి అనుబంధ సంస్థల్లోనూ ఐటీ సోదా లు జరిగాయి. మరోవైపు ఐటీ అధికారులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళనలు శుక్రవారం కూడా కొనసాగాయి. కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంటివద్ద కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యేని చూపించాలని అభిమానులు, కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఆయన బాల్కనీలోకి వచ్చి కా ర్యకర్తలకు అభివాదం చేశారు. ఇంటి వద్ద ఎలాంటి ఆందోళనలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. -
బీఆర్ఎస్ నేతలపై ఐటీ దాడులు.. 23 ఎకరాల ప్రాజెక్ట్ విషయంలో..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేతల నివాసాల్లో మూడో రోజు కూడా ఐటీ అధికారుల తనిఖీలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్థన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి సహా లైఫ్‌స్టైల్ మధుసూదన్ రెడ్డి నివాసంలోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా వారి ఫోన్లను స్వాధీనం చేసుకుని ఐటీ అధికారులు విచారిస్తున్నారు. కాగా, ఐటీ శాఖ అధికారులు మధుసూదన్ రెడ్డి భార్య, కుమారుడిని ప్రశ్నిస్తున్నారు. రియల్ ఎస్టేట్ భాగస్వామ్యం, వ్యాపార లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బీఆర్ఎస్ నేతలతో మధుసూదన్‌రెడ్డి లావాదేవీలపైనా విచారణ చేస్తున్నారు. ఎల్బీనగర్లో 23 ఎకరాల ప్రాజెక్ట్ విషయంలో భారీగా నగదు చేతులు మారినట్టు ఐటీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో భారీ ప్రాజెక్ట్ చేపట్టిన సంస్థతో ఒప్పందాలపై దర్యాప్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతల రియల్ ఎస్టేట్ సిండికేట్పైనా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక, గురువారం కూడా వారి కంపెనీల లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆరా తీశారు. కంపెనీల ఆదాయం, ఐటీ రిటర్న్స్ వ్యత్యాసాలపై పత్రాలను పరిశీలిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు, లాకర్స్ వివరాలను అధికారులు సేకరించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. ఐటీ సోదాలు ముగిసిన అనంతరం అధికారులు.. గురువారం రోజున ఎంపీ ప్రభాకర్ రెడ్డికి నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు. అవసరమైనప్పుడు విచారణకు సహకరించాలని అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని కావాలి: బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు -
ముగిసిన సోదాలు.. బీఆర్ఎస్ ఎంపీకి నోటీసులిచ్చిన ఐటీ అధికారులు
సాక్షి, మెదక్: తెలంగాణ బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటీ దాడులు పొలిటికల్‌గా కలకలం సృష్టించాయి. ఈ క్రమంలో కేంద్రంలో ఉన్న బీజేపీపై బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ దాడులకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. మరోవైపు.. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. ఇక, ఐటీ సోదాలు ముగిసిన అనంతరం అధికారులు.. ఎంపీ ప్రభాకర్ రెడ్డికి నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు. అవసరమైనప్పుడు విచారణకు సహకరించాలని అధికారులు తెలిపారు. మరోవైపు, పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి నివాసాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కాగా, కంపెనీల లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆరా తీస్తున్నారు. కంపెనీల ఆదాయం, ఐటీ రిటర్న్స్ వ్యత్యాసాలపై పత్రాలను పరిశీలిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు, లాకర్స్ వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఐటీ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన నివాసం, భువనగిరి, హైదరాబాద్ కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలోని కార్యాలయాలతో పాటు 12 చోట్ల అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎమ్మెల్యేతో పాటుగా ఆయన మామ మోహన్‌రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు అధికారులు. ఈ తనిఖీల్లో భాగంగా భారీగా నగదు, కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు సీజ్ చేశారు. కాగా, కొత్త ప్రభాకర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. మెయిన్ ల్యాండ్స్ డిజిటల్ టెక్నాలజీ సంస్థకు డైరెక్టర్‌గా శేఖర్ రెడ్డి భార్య పైళ్ల వనిత రెడ్డి ఉన్నారు. ఇదే కంపెనీకి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి భార్య మంజులత కూడా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా, పన్నులు చెల్లింపులలో అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఇది కూడా చదవండి: వచ్చే ఎన్నికల్లో తుపాను రాబోతోంది.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు -
బీఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లలో రెండో రోజు ఐటీ సోదాలు
-
తెలంగాణలో బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల నివాసాల్లో ఐటీ సోదాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
బీఆర్ఎస్ నేతల ఇళ్లలో రెండో రోజు కొనసాగుతున్న ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలపై రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి నివాసాలపై సోదాలు కొనసాగుతున్నాయి. మెయిన్ లాండ్ డిజిటల్ టెక్నాలజీలో ముగ్గురు నేతలు భాగస్వాములుగా ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. జేపీ బ్రదర్స్ షోరూమ్స్ తో పాటు అమిర్‌పేట్‌లో కార్పొరేట్ ఆఫీసులో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. జేసీ స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేసీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మర్రి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో పలు వ్యాపారాలు మర్రి జనార్థన్‌రెడ్డి నిర్వహిస్తున్నారు. మర్రికి చెందిన కొత్తూరు పైపుల కంపెనీలో సైతం ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. పైళ్లకు చెందిన తీర్ధా ప్రాజెక్ట్స్ పై ఐటీ నజర్ నేతల సతీమణులు, కుటుంబ సభ్యులు డైరెక్టర్లగా ఉన్న కంపెనీలపై ఐటీ ఫోకస్ పెట్టింది. ముగ్గురు నేతలు కలిసి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు ఐటీ గుర్తించింది. బ్యాంకు లాకర్స్‌ను సైతం ఓపెన్ చేసిన ఐటీ అధికారులు.. కీలకపత్రాలు, సమాచారం సేకరించారు. చదవండి: ‘బండి’ మార్పు లేదు -
వివాదాస్పదంగా మారిన ఐటీ దాడులు
తనిఖీలు తగరారుకి కారణమయ్యాయి. సోదాలు సవాళ్లకు దారి తీశాయి. కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలోని ఆదాయపు పన్ను శాఖ రెండు రోజులుగా చైన్నెలో చేపడుతున్న తనిఖీలు వివాదాస్పదం అయ్యాయి. తొలుత మంత్రి సెంథిల్ బాలాజీ టార్గెట్‌గా ఐటీ అధికారులు దాడులు చేయడం.. వారిని డీఎంకే వర్గాలు అడ్డుకోవడం.. ఓ దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఆ పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదుకాగా.. ఐటీ అధికారులు తమతో అనవసరంగా ఘర్షణకు దిగారంటూ డీఎంకే వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. సాక్షి, చైన్నె: విద్యుత్, ఎకై ్సజ్ శాఖ మంత్రి రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీపై ఐటీ దాడులు చేపట్టడం.. ప్రతిగా డీఎంకే నాయకులు ఎదురుతిరగడం వివాదానికి దారితీస్తోంది. ఈ క్రమంలో కరూర్‌లో ఐటీ అధికారులు డీఎంకే నాయకులపై కేసు పెట్టాయి. అలాగే, తమ మీద ఐటీ అధికారులు అకారణంగా దాడులు చేసినట్టు డీఎంకే వర్గాలు ఆరోపిస్తూ ఫిర్యాదు చేశాయి. దీంతో ఇరువర్గాలపై శనివారం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక రెండు రోజైన శనివారం తుపాకీ నీడలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈరోడ్‌లోని కాంట్రాక్టర్ సచ్చిదానందం ఇంట్లో రూ. 2.10 కోట్లు నగదు బయట పడ్డట్టు తెలిసింది. నువ్వా..నేనా..? మంత్రి సెంథిల్ బాలాజీని టార్గెట్ చేస్తూ, ఆయన సోదరుడు, మిత్రులు, సన్నిహితులు, ఎకై ్సజ్, విద్యుత్ శాఖల కాంట్రాక్టర్లపై శుక్రవారం ఐటీ అఽధికారులు గురి పెట్టిన విషయం తెలిసిందే. చైన్నె, కోయంబత్తూరు, కరూర్, ఈరోడ్లలోని 40 చోట్ల సోదాలకు దిగారు. ఇందులో 10 చోట్ల సోదాలు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. డీఎంకే వర్గాలు, సెంథిల్‌బాలాజీ మద్దతు దారులు తిరగబడడంతో రక్ష ణ కల్పించాలంటూ ఎస్పీ సుందరవదనన్ను ఐటీ అధికారులు ఆశ్రయించారు. దీంతో ఐటీ అధికారు లకు పోలీసులు భద్రతను కల్పించారు. కరూర్‌లోని సెంథిల్ బాలాజీ సోదరుడు అశోకన్, మరో మిత్రు డు ఇంటి ముందు ఐటీ అధికారులు శనివారం కూడా పడిగాపులు కాయక తప్పలేదు. ఆ ఇళ్లు తాళం వేసి ఉండటం, ఎవ్వరూ లేకపోవడంతో సోదాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక, ఈరోడ్‌లోని టాస్మాక్ కాంట్రాక్టర్ సచ్చిదానందం ఇంట్లో రూ. 2.10 కోట్లు నగదు బయట పడ్డట్టు సమాచారం. కరూర్‌లో సెంథిల్ బాలాజీ సన్నిహిత మిత్రుడు ప్రేమ్‌కుమార్ ఇంట్లో తుపాకీ నీడ నడుమ ఐటీ అధికారులుసోదాలు కొనసాగిస్తున్నారు. కోయంబత్తూరులోని సెంథిల్ కార్తికేయన్ నివాసం, ఆయన మిత్రుడు అరవింద్, గాయత్రిల నివాసాలు, కార్యాలయాలు, పునరావాస కేంద్రాలలో నిఘా నీడలో సోదాలు జరుగుతున్నాయి. పొల్లాచ్చిలోని ఎం శాండ్ పరిశ్రమలో, అరివింద్ ఫామ్ హౌస్‌లలో తుపాకీ నీడలో సోదాలు సాగాయి. సీబీఐ విచారణకు పట్టు.. కరూర్‌లో ఐటీ అధికారులపై దాడులు, వాహనాల ధ్వంసం, కేసుల నమోదు వంటి వ్యవహారాలను అస్త్రంగా చేసుకుని చైన్నె కొళత్తూరుకు చెందిన న్యాయవాది రామచంద్రన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అధికారులను అడ్డుకోవడం, దాడులకు దిగడం వంటి అంశాలను ప్రస్తావించారు. తనిఖీలకు వచ్చిన అధికారులు రక్షణ కోరుతూ ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన సమయంలో ఆ ఇళ్లల్లో ఉన్న నగదు, కంప్యూటర్లు, రికార్డులు అన్ని గంటల వ్యవధిలో మాయం చేసినట్లు పేర్కొన్నారు. తొమ్మిది చోట్ల ఈ పరిస్థితి నెలకొన్నట్లు ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసుల ద్వారా కాకుండా సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. ఇదిలా ఉండగా, కరూర్ నగరంలో అనేక చోట్ల సెంథిల్ బాలాజీ మద్దతు దారులు ఐటీ అధికారులకు సవాల్ విసురుతూ పోస్టర్లను ఏర్పాటు చేశారు. సింహం పక్కన కూర్చీలో సెంథిల్ బాలాజీ కూర్చున్న తరహాలో ఫొటోలు వేసి, ఐటీ అధికారులకు సవాల్ విసిరే వ్యాఖ్యలను అందులో పొందు పరచడం తీవ్ర వివాదానికి దారి తీసింది. డీఎంకే వర్గాలు ఏ మేరకు రెచ్చగొడుతున్నారో అందుకు భిన్నంగా ఐటీ సోదాలను అధికారులు మరింత క్షుణ్ణంగా సోదాలు చేయడం గమనార్హం. పరస్పరం కేసుల నమోదు.. కరూర్‌లో ఐటీ అధికారులపై డీఎంకే వర్గాలు తిరగబడటం, కారు ధ్వంసం చేయడం వంటి పరిణామాలపై కేసులు నమోదు అయ్యాయి. ఐటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో డీఎంకే వర్గాలపై పోలీసులు కేసులు పెట్టారు. విధుల్లో ఉన్న అధికారులను అడ్డుకోవడం, వాహనాలను ధ్వంసం చేయడం తదితర సెక్షన్లను నమోదు చేశారు. అదే సమయంలో ఐటీ అధికారులపై డీఎంకే వర్గాలు కేసు పెట్టాయి. ఇంట్లోకి చొరబడి.. గోడలు దూకిన వారిని ఐడీ కార్డులు చూపించాలని ప్రశ్నిస్తే, తమను కొట్టి మరీ లోనికి వెళ్లినట్టు ఐటీ అధికారులపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం చివరకు హైకోర్టుకు సైతం చేరింది. -
ఐటీ ఎటాక్ ! టార్గెట్ సెంథిల్ బాలాజి
సాక్షి, చైన్నె: రాష్ట్ర విద్యుత్, ఎకై ్సజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని టార్గెట్ చేసే రీతిలో శుక్రవారం ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. చైన్నె, కరూర్, కో యంబత్తూరు, ఈరోడ్‌లోని ఆయన సోదరుడు, స్నే హితులు బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కరూర్‌లో డీఎంకే వర్గాలు తిరగబడడంతో ఐటీ అధికారులు బెంబేలెత్తిపోయారు. రక్షణ కోసం ఎస్పీ కార్యాలయానికి పరుగులు తీశారు. ఆతర్వాత వందలాది మంది పోలీసుల నిఘా నీడలో తనిఖీల్లో నిమగ్నమయ్యారు. తన ఇంట్లో ఐటీ సోదాలు జరగలేదని మంత్రి సెంథిల్ బాలాజీ స్పష్టం చేశారు. అన్నాడీఎంకే హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగం పేరిట మోసం చేశారంటూ సెంథిల్ బా లాజీపై దాఖలైన కేసులు ప్రస్తుతం మళ్లీ మొదటి నుంచి విచారించే విధంగా గతవారం సుప్రీంకోర్టు ఆదే శించిన విషయం తెలిసిందే. అలాగే, ప్రస్తుతం డీఎంకే కెబినెట్లో మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీని టార్గెట్ చేసి అన్నాడీఎంకే, బీజేపీ, పుదియతమిళగంలను తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. గవర్నర్ ఆర్ఎన్ రవిని కలి సి ఫిర్యాదు కూడా చేశాయి. లక్షల కోట్ల అవినీతి అంటూ వ్యాఖ్యలు చేశాయి. తన చుట్టూ ఉన్న వారిని సెంథిల్ బాలాజి ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాడని, వి ద్యుత్, టాస్మాక్ బార్ల కాంట్రాక్టులు, ఖాళీ బాటిళ్ల కొ నుగోళ్ల బాధ్యతలను అప్పగిస్తున్నారని ఆరోపించా యి. వీటిని సెంథిల్ బాలాజి ఖండించారు. అలాగే, బీజేపీ, పుదియ తమిళగం కట్చి నేతలపై గురువారం పరువునష్టం దావా కూడా వేశారు. ఈ వ్యవహారం ఓ వైపు ఇలా ఉంటే, మరో వైపు శుక్రవారం ఉదయాన్నే పదుల సంఖ్యలో ఐటీ అధికారులు రంగంలోకి దిగా రు. సెందిల్ బాలాజీని వ్యక్తిగతంగా టార్గెట్ చేయకుండా ఆయన చుట్టూ ఉన్న వారిపై గురి పెట్టారు. 40 చోట్ల సోదాలు.. కోయంబత్తూరు, ఈరోడ్, చైన్నె, కరూర్‌లలో ఏక కాలంలో ఉదయాన్నే పదుల సంఖ్యలో ఐటీ అధికారులు పలు బృందాలుగా సోదాల్లో నిమగ్నమయ్యారు. కోయంబత్తూరులో డీఎంకే నేత, సెంథిల్ బాలాజీ సన్నిహితుడు, కాంట్రాక్టర్ సెంథిల్ కార్తికేయన్ ఇంట్లో తొలుత సోదాలకు దిగారు. ఈ సమాచారంతో అక్కడకు పెద్ద సంఖ్యలో డీఎంకే వర్గాలు చేరుకుని సోదాలను ఖండిస్తూ నినదించాయి. అలాగే, కోవైలోని మరో సన్నిహితుడు ఈశ్వరమూర్తి నివాసం, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఈరోడ్‌లోని మరో సన్నిహితుడు ఆనందన్, సచ్చినానందన్తో పాటు పలుచోట్ల విద్యుత్, టాస్మాక్ కాంట్రాక్టర్లను టార్గెట్ చేసి సోదాలు చేపట్టారు. కరూర్‌లో రచ్చ..ఐటీ అధికారుల బెంబేలు సెంథిల్ బాలాజి సొంత జిల్లా కరూర్‌లో ఐటీ సోదాలు రచ్చకు దారి తీశాయి. కరూర్‌లోని సెంథిల్ బాలాజీ సోదరుడు అశోకన్, గణపతి నగర్‌లోని సన్నిహితులు శంకర్, తంగరాజ్, రామకృష్ణన్‌తో పాటు మరి కొందరు బంధువులను గురి పెట్టి అధికారులు సోదాలకు దిగారు. తంగరాజ్ ఇంట్లోకి గోడ దూకి మరీ అధికారులు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అక్కడ వేచి ఉండక తప్పలేదు. అలాగే, అశోకన్ నివాసంలో సోదాలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఓ మహిళా అధికారినిని డీఎంకే వర్గాలు చుట్టు ముట్టేశాయి. దాడికి ప్రయత్నించే సంఘటన ఇక్కడ జరగడంతో ఐటీ అధికారులు బెంబేలెత్తారు. ఓ వాహనం అద్దాలను సైతం డీఎంకే వర్గాలు ధ్వంసం చేశాయి. దీంతో కరూర్‌లో పది చోట్ల సోదాలకు సిద్ధమైన అధికారులు ఆందోళనతో ఎస్పీ సుందరవదనన్ కార్యాలయాన్ని రక్షణ కోసం ఆశ్రయించారు. అంతా రహస్యం... సాధారణంగా ఐటీ సోదాలకు వెళ్లే సమయంలో స్థానికంగా ఉన్న పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వడం లేదా, సీఆర్పీఎఫ్ బలగాలను అధికారులు వెంట బెట్టుకెళ్లడం జరిగేది. అయితే, ఈ సారి కనీసం పోలీసు అధికారులకు కూడా సమాచారం ఇవ్వకుండా దాడుల వ్యవహారాన్ని రహస్యంగా ఉంచారు. దీంతో తనిఖీలకు వెళ్లిన అనేక చోట్ల ఐటీ అధికారులకు ముచ్చెమటలు తప్పలేదు. ఐటీ అధికారులను డీఎంకే వర్గాలు చుట్టుముట్టడంతో వివాదం రాజుకుంది. చివరకు గట్టి భద్రత నడమ మళ్లీ అధికారులకు సోదాలకు వెళ్లారు. ఈ విషయంగా కరూర్ ఎస్పీ సుందరవదనన్ మీడియాతో మాట్లాడుతూ, ఐటీ దాడుల విషయంగా తమకు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం అందలేదన్నారు. తమను ఆశ్రయించినానంతరం భద్రతను కల్పించామన్నారు. చైన్నెలోని అశోకన్ ఇళ్లు, అతడి సన్నిహితుల కార్యాలయాలు అంటూ ఐదు ప్రాంతాలతో పాటు మొత్తంగా 40 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. వీటితో పాటు కేరళ రాష్ట్రం పాలక్కాడు, తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్, బెంగళూరులో ఉన్న మంత్రి సన్నిహితులను కూడా ఐటీ టార్గెట్ చేసి ఉండడం గమనార్హం. నా ఇంట్లో జరగలేదు. ఐటీ దాడులపై మంత్రి సెంథిల్ బాలాజి స్పందించారు. తన ఇంట్లో, కార్యాలయాలలో ఎలాంటి సోదాలు జరగలేదన్నారు. తన సోదరుడు, అతడి సన్నిహితుడు ఇళ్లు, కార్యాలయాలలో సోదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వారంతా పలు చోట్ల కాంట్రాక్టర్లుగా వృత్తిని కొనసాగిస్తున్నారని, వారిని టార్గెట్ చేసి ఐటీ అధికారులు సోదాలలో నిమగ్నమై ఉన్నారని వివరించారు. డీఎంకే నేత ఆర్ఎస్ భారతీ స్పందిస్తూ, సీఎం స్టాలిన్ విదేశాలకు వెళ్లిన నేపథ్యంలో పథకం ప్రకారం ఈ ఐటీ దాడులకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల నుంచి తమిళనాడులోకి పెట్టుబడులు రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే బీజేపీ ఈ దాడులను చేయిస్తున్నదని ధ్వజమెత్తారు. కాగా, సోదాలకు వచ్చిన ఐటీ అధికారులపై డీఎంకే సేనలు తిరగబడడం, దాడికి ప్రయత్నించడాన్ని అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, రాష్ట్ర కోఇన్‌చార్జ్ సుధాకర్‌రెడ్డి, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ఖండించారు. -
తమిళనాడులో ఐటీ శాఖకు చేదు అనుభవం
చెన్నై: ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు తమిళనాడులో చేదు అనుభవం ఎదురైంది. మంత్రి సెంథిల్ బాలాజీ ఇంట్లో సోదాలకు వెళ్లింది ఐటీ శాఖ. మంత్రితో పాటు ఆయనకు సంబంధం ఉన్న కాంట్రాక్టర్లు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించింది. అయితే.. ఆయన సోదరుడి ఇంటి దగ్గర తనిఖీలకు వెళ్లగా.. అక్కడ ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. ఐటీ రైడ్స్ సందర్భంగా.. కారూర్ జిల్లాలోని మంత్రి బాలాజీ సోదరుడు అశోక్ ఇంటి వద్ద డీఎంకే కార్యకర్తలు భారీగా గుమిగూడారు. వాళ్లను దాటుకుని అధికారులు ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో డీఎంకే నేతలు ఐటీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దాడితో పాటు వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో అధికారులు సోదాలు చేయకుండానే వెనుదిరిగారు. తనిఖీల బృందానికి ఓ మహిళా ఆఫీసర్ నేతృత్వం వహించినట్లు తెలుస్తోంది. దాడి భయంతో భీతిల్లిపోయారామె. ఐటీ సంస్థపై డైరెక్ట్ ఎటాక్.. ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఇదిలా ఉంటే.. తమిళనాడులో గత కొంతకాలంగా ఐటీ దాడుల పర్వం కొనసాగుతోంది. అధికార పక్షం నేతలనే లక్ష్యంగా చేసుకుని ఈ సోదాలు కొనసాగుతుండడం గమనార్హం. శుక్రవారం ఒక్కరోజే చెన్నై, కోయంబత్తూరు సహా 125 ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. -
హైదరాబాద్ లో పలు చోట్ల ఐటీ సోదాలు
-
HYD: కోహినూర్ ఇన్ఫ్రా కంపెనీలో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచే కోహినూర్ ఇన్ఫ్రా కంపెనీలపై ఇన్‌కం ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌లోని మాదన్నపేట, శాస్త్రీపురం, బంజారాహిల్స్, శంషాబాద్ సహా పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. అయితే, ఆదాయపు పన్ను చెల్లింపుల విషయంలో కోహినూర్ ఇన్ఫ్రా కంపెనీ అవకతవకలకు పాల్పడినట్టు ఐటీ అధికారులు ఆరోపించారు. ఏకకాలంలో 30 బృందాలతో అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే సుమారు 100 వాహనాల్లో ఐటీ అధికారులు సోదాలకు తరలి వెళ్లారు. ఇది కూడా చదవండి: దుబాయ్ కేంద్రంగా చైనీయుల దందా -
Karnataka Assembly elections 2023: కర్ణాటకలో ఐటీ దాడులు..
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆదాయ పన్ను శాఖ అధికారులు వివిధ ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో భారీగా సొత్తు బయటపడింది. రూ.15.3 కోట్ల నగదుతోపాటు రూ.7.08 కోట్ల విలువైన 10.14 కిలోల బంగారాన్ని పట్టుకున్నట్లు ఐటీ సీఈవో కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మార్చి 29 నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ.365 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లయిందని పేర్కొంది. -
కర్నాటక: ఎన్నికల సిత్రం.. మామిడిచెట్టులో కరెన్సీ కట్టల బ్యాగు
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల వేళ కర్నాటకలో ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార బీజేపీ సహా ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అటు, ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశాయి. ఇదిలా ఉండగా.. ఎన్నికల వేళ భారీ మొత్తంలో నగదు పట్టుబడటం సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. ఎన్నికల సమయంలో ప్రధాన రాజకీయపార్టీలు ఓటర్లకు పంచడానికి పెద్ద ఎత్తున నగదును సమకూర్చాయన్న సమచారం మేరకు ఐటీ శాఖ అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భాగంగా కాంగ్రెస్ నేత ఇంట్లో భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే, మైసూర్‌లోని సుబ్రమణ్య రాయ్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో మామిడి చెట్టుపై బాక్సులు ఉండటం గమనించారు. వాటిని తీసి చూడగా నోట్ల కట్టలు కనిపించాయి. మొత్తం డబ్బును అధికారులు సీజ్ చేశారు. వాటి విలువ కోటి రూపాయలు ఉన్నట్టు తెలిపారు. మొత్తం డబ్బును అధికారులు సీజ్ చేసినట్టు స్పష్టం చేశారు. రాయ్ పుత్తూరు కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ కుమార్ రాయ్ సోదరుడు కావడం విశేషం. ఇప్పటిదాకా రూ.300 కోట్లకు పైగా లెక్క చూపని డబ్బును ఈసీ సీజ్ చేసింది. ఇందులో ఒక్క బెంగళూరులోనే రూ.82 కోట్లను స్వాధీనం చేసుకుంది. అంతకుముందు ఏప్రిల్ 13న బెంగళూరు సిటీ మార్కెట్ ఏరియాలో రూ.కోటిని పోలీసులు జప్తు చేశారు. ఇద్దరు వ్యక్తులు ఆటోలో డబ్బు తీసుకెళ్తుండగా పట్టుకున్న పోలీసులు.. ఎలాంటి లెక్కలు చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్నాటకలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంది. దీంతో, సరైన పత్రాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదు తరలించరాదు. ఇక, కర్నాటకలో ఈనెల 10వ తేదీన పోలింగ్ జరుగనుంది. 13వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. ఇది కూడా చదవండి: యువకుడిని చితకబాదిన మంత్రి, సిబ్బంది.. వీడియో వైరల్ -
HYD: షాపింగ్ మాల్స్‌లో ఐటీ సోదాలు.. కస్టమర్లకు నో ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఐదు రోజుల సెర్చ్ వారెంట్‌తో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని వరమహాలక్ష్మీలో ఐటీ అధికారుల బృందం తనిఖీలు చేస్తోంది. ఇక, సోదాల సందర్బంగా సంస్థ ఇప్పటి వరకు చేసిన ఐటీ చెల్లింపులపై అధికారులు ఆరా తీస్తున్నారు. లాగ్ షీట్స్, ఆడిటింగ్ వివరాలను పరిశీలిస్తున్నారు. ఈ సందర్బంగా సంస్థ ఫైనాన్స్ మేనేజర్లను సైతం అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో సీఆర్పీఎఫ్ పోలీసులు.. కస్టమర్లను లోపలికి అనుమతించడం లేదు. ఫిలిం నగర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. కళామందిర్ గ్రూప్స్, వరమహాలక్ష్మీ, కేఎల్ఎం, కాంచీపురం అనుబంధ వ్యాపార సంస్థల లెక్కలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇది కూడా చదవండి: థాయ్‌లాండ్‌లో చికోటి ప్రవీణ్‌కు బెయిల్ మంజూరు -
కళామందిర్ సంస్థలో కొనసాగుతున్న ఐటీ సోదాలు
-
హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ సోదాలు
హైదరాబాద్: నగరంలో మరోసారి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో 35 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, మాదాపూర్,గచ్చిబౌలి తదితర ప్రాంతల్లో ఐటీ విభాగం సోదాలు చేస్తోంది. ప్రధానంగా వస్త్ర వ్యాపారుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. కళామందిర్, వరమహాలక్ష్మీ, కేఎల్ఎం షాపింగ్ మాల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని వస్త్ర వ్యాపారుల ఇళ్లుతో పాటు వారి షోరూమ్‌ల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
మైత్రీ మూవీ మేకర్స్‌కు రూ.700 కోట్ల విదేశి పెట్టుబడులు..!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పెట్టుబడులపై ఆదాయపన్ను శాఖ కీలక సమాచారం రాబట్టింది. మైత్రీ సంస్ద లోకి రూ.700 కోట్ల విదేశి పెట్టుబడులు వచ్చినట్లు గుర్తించింది. ఇవి తొలుత ముంబై బేస్డ్ కంపెనీకి బదిలీ అయినట్లుగా నిర్ధరించింది. ఆ తర్వాత ఈ డబ్బును ఏడు కంపెనీలకు తరలించినట్లు ఐటీ శాఖ అధికారిక వర్గాలు తెలిపాయి. వాటి నుంచి మైత్రీకి పెట్టుబడుల రూపంలో వచ్చినట్లు ఐడెంటిఫై చేసినట్లు పేర్కొన్నారు. హవాలా ద్వారా బాలీవుడ్ దర్శకుడికి మైత్రీ సంస్థ రూ.150కోట్ల చెల్లించినట్లు వెల్లడించారు. తాజాగా ఈ సంస్థ తీస్తోన్న ఓ సీక్వెల్ మూవీలో హీరోకు సైతం హవాలా రూపంలోనే పేమెంట్స్ ఇచ్చినట్లు సమాచారం. మైత్రీ సంస్థ గత రెండేళ్లలో ఇద్దరు బడా హీరోలకు సైతం అనుమానాస్పద రీతిలో చెల్లింపులు జరిపినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే హీరోల ఖాతాలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ హీరోలను విచారణ నిమిత్తం ముంబైకి పిలిచే అవాకశం ఉన్నట్లు జాతీయ మీడియా తెలిపింది. చదవండి: రామ్ చరణ్ దంపతులకు పుట్టబోయే బిడ్డ ఎవరంటే? -
తమిళనాడులో ఐటీ సోదాలు
-
ఐటీ సోదాలు.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతకు అస్వస్థత
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన ఎర్నేని నవీన్ అస్వస్థకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయననను కుటుంసభ్యులు ఆసుపత్రికి తరలించారు. బీపీ ఎక్కువ కావడంతో అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. సాయంత్రం లోగా డిశ్చార్జి చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా మైత్రీ మూవీ ఆఫీస్, నిర్మాతల ఇళ్లతో పాటు డైరెక్టర్ సుకుమార్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన కొన్ని భారీ చిత్రాల నిర్మాణానికి విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడిగా తీసుకోవడం, వాటికి సంబంధించి పన్నుల చెల్లింపుల్లో అవకతవకలపై ఐటీ అధికారులు ఈ సోదా లు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వరుస ఐటీ రైట్స్ నేపథ్యంలో నిర్మాత ఎర్నేని నవీన్ ఆందోళనకు గురైనట్లు సమాచారం. 2015లో ప్రారంభమైన మైత్రీ మూవీ మేకర్స్ శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, ఉప్పెన, పుష్ప, సర్కారు వారి పాట, వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించింది. ప్రస్తుతం పుష్ప2తో పాటు మరికొన్ని సినిమాలను నిర్మిస్తోంది. -
సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు
-
మైత్రి మూవీ మేకర్స్ పై రెండో రోజు ఐటీ సోదాలు
-
డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై ఐటీ దాడులు!
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ ఇల్లు, మైత్రి మూవీస్ కార్యాలయాల్లో ఆదాయపన్నుశాఖ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఇటీవల విడుదలైన కొన్ని భారీ చిత్రాల నిర్మాణానికి విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడిగా తీసుకోవడం, వాటికి సంబంధించి పన్నుల చెల్లింపుల్లో అవకతవకలపై ఐటీ అధికారులు ఈ సోదా లు చేపట్టినట్టు తెలిసింది. సదరు చిత్ర నిర్మాణ సంస్థ భారీ చిత్రాల నిర్మాణానికి అవసరమైన డబ్బులను విదేశాల నుంచి పెద్ద మొత్తంలో సేకరించిందని, ఈ సొమ్ము రూ.500 కోట్లకుపైగా ఉండడంతో ఐటీ అధికారులు ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. జీఎస్టీ చెల్లింపుల్లోనూ అవకతవకలు ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా విదేశాల నుంచి డబ్బులు పెట్టుబడుల రూపంలో సేకరించడంతోపాటు, జీఎస్టీ చెల్లింపులలోనూ అవకతవకలు ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. మైత్రి మూవీస్, డైరెక్టర్ సుకుమార్‌ల కాంబినేషన్లోనే పుష్ప–2 సినిమా తెరకెక్కుతోంది. ఈ క్రమంలోనే ఐటీ అధికారుల బృందాలు సుకుమార్ ఇల్లు, మైత్రి కార్యాలయాల్లో సోదాలు జరిపి పలు కీలక పత్రాలు స్వాదీనం చేసుకున్నట్టు తెలిసింది. (చదవండి: నందినికి పొగరు, పట్టుదల.. నాతో పోలికే లేదు: సంయుక్త మీనన్) మైత్రీ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు జనవరిలో విడుదలకు ముందు సమయంలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి విదితమే. ఇప్పుడు మరోసారి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోని మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. స్వా«దీనం చేసుకున్న పత్రాలు, డాక్యుమెంట్స్ ఆధారంగా గురువారం విచారణ కోసం కార్యాలయానికి రావాలని ఆదేశించినట్లు సమాచారం. (చదవండి: సూర్యగ్రహణం రోజు గర్భిణీలు పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు..!) -
రెండోరోజూ ‘బాలవికాస’పై ఐటీ దాడులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: బాలవికాస స్వచ్ఛంద సంస్థ, దాని అనుబంధ సంస్థలపై వరంగల్‌వ్యాప్తంగా రెండు రోజులుగా కొనసాగుతున్న ఐటీ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. సుమారు 15–20 వాహనాల్లో బుధవారం తెల్లవారుజామున హనుమకొండకు చేరుకున్న ఐటీ అధికారులు.. సీఆర్పిఎఫ్ భద్రత మధ్య తనిఖీలు మొదలుపెట్టారు. కాజీపేట ఫాతిమానగర్, హనుమకొండ సిద్ధార్థనగర్లలో ఉన్న బాలవికాస కార్యాలయాలు, నిర్వాహకుల ఇళ్లలో గురువారం రాత్రి వరకు 15 బృందాలుగా ఏర్పడిన అధికారులు సోదాలు నిర్వహించారు. తొలిరోజు తనిఖీల్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్‌్కలతోపాటు కీలక ఉద్యోగులు, వ లంటీర్లకు చెందిన సె ల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సుమా రు నాలుగైదేళ్లకు సంబంధించిన బాలవికాస ఆదాయ వ్యయాల పత్రాలు, వార్షిక నివేదికలపై ఆరా తీసినట్లు తెలిసింది. కాగా, బాలవికాస సంస్థపై ఐటీ దాడులను జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, కుడా చైర్మన్ సుందర్రాజు ఖండించారు. 9 రాష్ట్రాలు, 7 వేల గ్రామాలకు సేవలు... భారత్‌లో సమాజాభివృద్ధి సేవల కోసం ఫ్రెంచ్–కెనడా జాతీయుడైన ఆండ్రే గింగ్రాస్, ఆయన సతీమణి బాలథెరిసా గింగ్రాస్ 1977లో కెనడాలో సోపర్ సంస్థను ప్రారంభించారు. సేవా కార్యకలాపాలను మరింత సమర్థంగా చేపట్టేందుకు వీలుగా సోపర్‌కు అనుబంధంగా కాజీపేటలోని ఫాతిమానగర్‌లో 1991లో బాలవికాస సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం బాలవికాసకు అనుబంధంగా 9 సంస్థలు పనిచేస్తున్నాయి. తెలంగాణ, ఏపీతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లలోని 7 వేల గ్రామాలు, పలు స్వచ్ఛంద సంస్థలతో కలసి బాలవికాస సంస్థ తన సేవలు అందిస్తోంది. బాలవికాసలో సుమారు 300 మంది సిబ్బంది ఉండగా, క్షేత్రస్థాయిలో మరో 500 మంది పనిచేస్తున్నారు. గ్రామాల్లో నాణ్యమైన విద్య, సురక్షిత తాగునీరు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, నీటి సంరక్షణ, సుస్థిర వ్యవసాయం, మహిళా సాధికారత, ఆదర్శగ్రామాల ఏర్పాటు అంశాలు ప్రధాన లక్ష్యాలుగా 30 వేల మంది వలంటీర్లు బాలవికాస ద్వారా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు 60 లక్షల మంది పేదలకు మేలు కలిగేలా కార్యక్రమాలు నిర్వహించారు. 2014లో ఘట్కేసర్ వద్ద సెంటర్ ఫర్ సోషల్ రెస్పాన్స్ బిజినెస్ సెంటర్‌ను ప్రారంభించారు. సామాజిక వ్యవస్థాపకత, బాధ్యతాయుతమైన వ్యాపారాన్ని ప్రోత్సహించే శ్రేష్టత కేంద్రాలుగా 30 వినూత్న సోషల్ స్టార్టప్‌లను బాలవికాస ఏర్పాటు చేసింది. 125 మంది గ్రామీణ పారిశ్రామికవేత్తలకు మార్గనిర్దేశం చేసింది. -
HYD: గూగి రియల్ ఎస్టేట్ కంపెనీలో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: గూగి రియల్ ఎస్టేట్ కంపెనీలో ఐటీ అధికారులు సోదావు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఏకకాలంలో 20 చోట్ల రియల్ ఎస్టేట్ కంపెనీల డైరెక్టర్ల నివాసాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. వివరాల ప్రకారం.. గూగి కంపెనీ ఫార్మా హిల్స్, వండర్ సిటీ, రాయల్ సిటీ పేర్లతో హైదరాబాద్‌లో కార్యకలాపాలు సాగిస్తోంది. కాగా, మంగళవారం ఐటీ అధికారులు గూగికి సంబంధించిన కంపెనీల డైరెక్టర్ల నివాసాలపై 20 చోట్ల ఒకే సమయంలో సోదాలు నిర్వహించారు. ఇక, దిల్‌షుక్‌నగర్‌లోని గూగి ప్రధాన కార్యాలయంలో ఐదు బృందాలతో ఐటీ దాడులు జరుపుతోంది. -
బీబీసీలో సర్వేపై ఐటీ శాఖ ప్రకటన!
సాక్షి, ఢిల్లీ: ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఆఫీసుల్లో జరుగుతున్న సర్వేపై ఐటీ శాఖ శుక్రవారం సాయంత్రం అధికారిక ప్రకటన చేసింది. ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలు గుర్తించామని, ఇందుకు సంబంధించి ఆధారాలు సైతం సేకరించామని పేర్కొంది. అవి ఐటీ దాడులు, సోదాలు కాదని.. కేవలం సర్వేనే అని ఇంతకుముందు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బీబీసీ పేరును ప్రస్తావించకుండానే.. ఓ ప్రముఖ మీడియా సంస్థ అని పేర్కొంటూ సదరు సంస్థ లావాదేవీలపై సర్వే చేసినట్లు, అకౌంటింగ్ పుస్తకాల్లో అక్రమాలను గుర్తించినట్లు తాజాగా భారత ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. ముంబై, ఢిల్లీ కార్యాయాలల్లో చేసిన ఈ సర్వేల్లో ప్రధానంగా లావాదేవీల డాక్యుమెంట్స్ పరిశీలించామని.. ఎలక్ట్రానిక్ పరికరాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ అధికారులు తెలిపారు. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలో వివిధ విభాగాలు వెల్లడించిన ఆదాయం, లాభాలు భారతదేశంలో వాళ్ల కార్యకలాపాల స్థాయికి అనుగుణంగా లేవు అని ఆదాయపు పన్ను శాఖ సదరు ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు మీడియా సంస్థలోని ఉద్యోగుల స్టేట్మెంట్లు, డిజిటల్ ఫైల్లు, డాక్యుమెంట్లను పరిశీలించే ప్రక్రియలో ఇంకా కొనసాగుతోందని ప్రకటించింది. తమ దర్యాప్తును ఆలస్యం చేసేందుకు సిబ్బంది ప్రయత్నించినట్లు కూడా ఆరోపించింది ఐటీ శాఖ. అయితే ఈ ఆరోపణలపై బీబీసీ ఇంకా స్పందించాల్సి ఉంది. సదరు వార్తా సంస్థకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఈ నిధులు ఎలా ఖర్చు పెడుతున్నారు? ఇంకా ఏమైనా ఉందా? అనే కోణంలోనే సర్వే చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బీబీసీ ఆఫీసుల్లో మొదటి రెండు రోజులపాటు.. లోపలికి ఉద్యోగులను అనుమతించలేదు. లోపల ఉన్నవాళ్లను బయటకు పంపలేదు. మూడవ రోజు నుంచి ఉద్యోగులకు కార్యకలాపాలకు అనుమతించింది. అయితే అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ విభాగాలను మాత్రం ఐటీ శాఖ తమ ఆధీనంలో ఉంచుకుంది. ఆయా విభాగాల్లో వాళ్లను ప్రశ్నించడంతో పాటు పత్రాలతో పాటు కంప్యూటర్‌ల్లో ఉన్న డాక్యుమెంట్లను కూడా ఐటీ శాఖ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. బీబీసీ భారత ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ గుజరాత్ అల్లర్ల ప్రధానాశాంగా ఓ డాక్యుమెంటరీని రూపొందించగా.. అది దుమారం రేపింది. ఈ తరుణంలో బీబీసీ కార్యాలయాల్లో తనిఖీలపై రాజకీయంగానూ చర్చ జరిగిన సంగతి తెలిసిందే. -
మూడో రోజూ ఐటీ సోదాలు.. 2 రాత్రులుగా ఆఫీసులోనే బీబీసీ ఉద్యోగులు
బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ) ఇండియా కార్యాలయాలపై మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగాయి. సర్వే ఆపరేషన్ పేరుతో ఐటీ అధికారులు చేపట్టిన దాడుల కారణంగా ఢిల్లీలోని బీబీసీలో పనిచేసే దాదాపు 10 మంది సీనియర్లు ఉద్యోగులు రెండు రోజుల నుంచి ఆఫీస్‌లోనే ఉంటున్నారు. ఆదాయపు పన్ను శాఖ సర్వే ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటికి వెళ్లలేదు. బీబీసీ కార్యాలయ ఉద్యోగుల నుంచి ఐటీ అధికారులు తమకు కావల్సిన ఆర్ధిక లావాదేవీల సమాచారాన్ని, డాక్యుమెంట్లు, మెయిల్స్, ఇతర వివరాల్ని సేకరించారు. కాగా 2002 గుజరాత్ జరిగిన అల్లర్లకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ ఇటీవల ఓ డాక్యుమెంటరీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇండియా ది మోదీ క్వశ్చన్ పేరుతో రిలీజ్ అయిన ఈ డాక్యుమెంటరీ దేశ వ్యాప్తంగా వివాదస్పదమైంది. దీనిని భారత్‌లో ప్రసారం చేయనీయకుండా కేంద్రం బ్యాన్ చేసింది. సోషల్ మీడియా మాధ్యమాలైన యూట్యూబ్, ట్విటర్ వంటి వాటిల్లో సంబంధిత లింక్‌లను తొలగించింది. ఇది జరిగిన రెండు వారాల్లోనే ఈ ఐటీ దాడులు ప్రారంభమవడం గమనార్హం. ఐటీ దాడుల నేపథ్యంలో ఢిల్లీలోని బీబీసీ సిబ్బంది ఒకరు మాట్లాడుతూ.. ఐటీ సోదాలు జరుగుతున్న కూడా తాము వార్తలను ఎప్పటిలాగే ప్రసారం చేస్తున్నామని తెలిపారు. అయితే చాలా మంది ఉద్యోగులు ఇళ్ల నుంచి పని చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా పన్నుల ఎగవేత ఆరోపణలపై ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో మంగళవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన ఐటీ సోదాలు 44 గంటలు గడిచినా ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ దాడులు మరికొంత కాలం పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఈ ఆపరేషన్ ఎప్పుడు పూర్తవుతుందనేది చెప్పలేమని.. తమకు లభించే ఆధారాల్ని బట్టి ఉంటుందని పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీలు, కంపెనీ నిర్మాణం, ఇతర వివరాలపై ఐటీ సర్వే బృందాలు సమాధానాలు రాబడుతున్నాయి. సాక్ష్యాలను సేకరించే పనిలో భాగంగా ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి డేటాను కాపీ చేస్తున్నాయని ఐటీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా రాజకీయ ప్రతికారంతోనే బీబీసీ కార్యాలయాలపై కేంద్రం ఐటీ దాడులు జరిపిస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇక వివాదాస్పద డాక్యుమెంటరీ నేపథ్యంలో భారతదేశంలో బీబీసీపై పూర్తి నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గత వారం కొట్టివేసిన విషయం తెలిసిందే. అలాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో డాక్యుమెంటరీ లింక్‌లను బ్లాక్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన మరో పిటిషన్‌పై ఏప్రిల్‌లో విచారణ జరగనుంది. చదవండి: హిండెన్‌బర్గ్ ఆరోపణలు.. ‘అదానీ’పై మరో కేసు -
బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలపై అమెరికా కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రధానీ మోదీపై బీబీసీ వివాదాస్పద డాక్యుమెంటరీ రూపొందించిన తర్వాత ఈ తనిఖీలు చేపట్టడం చర్చనీయాంశమైంది. విపక్షాలు ఇప్పటికే కేంద్రంపై విమర్శలు గుప్పించాయి. తాజాగా అగ్రరాజ్యం అమెరికా ఈ వ్యవహారంపై స్పందించింది. బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగిన విషయం తమ దృష్టికి వచ్చిందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పత్రిక స్వేచ్ఛకు ప్రాధాన్యం ఉండాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భావ ప్రకటనా స్వేచ్చ, మతం లేదా విశ్వాసపరమైన స్వేచ్చ మానవహక్కులుగా దోహదపడుతాయన్నారు. భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని కూడా ఇవే బలోపేతం చేశాయని చెప్పారు. ఈ విషయాలను తాము ఎప్పుడు హైలైట్ చేస్తూనే ఉన్నామని వివరించారు. ఈ సార్వత్రిక హక్కులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యాలకు పునాది అని నొక్కి చెప్పారు. అయితే బీబీసీపై ఐటీ దాడులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకమా ? అని అడిగిన ప్రశ్నకు నెడ్ ప్రైస్ ఆచితూచి సమాధానమిచ్చారు. ఈ సోదాలపై నిజానిజాల గురించి తమకు తెలుసునని, అయితే దీనిపై తీర్పు చెప్పే స్థితిలో తాను లేనని వ్యాఖ్యానించారు. చదవండి: ‘లేఆఫ్స్’ తాత్కాలికమే.. అమెరికాలో భారీగా ఉద్యోగాలు..! -
బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలు..ఇది కేవలం సర్వేనే!
బీబీసీ ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన గుజరాత్ అల్లర్ల డాక్యుమెంటరీ పెను వివాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లోకి ఐటీ అధికారులు సడెన్ ఎంట్రీ ఇచ్చారు. సోదాలు నిర్వహించి..ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లు, ఫోన్లను తీసుకువెళ్లడమే కాకుండా కార్యాలయంలోని డెస్క్‌టాప్‌లను కూడా తనిఖీ చేశారు. ఐతే ఆదాయపు శాఖ మాత్రం పన్నుల అవకతవకల ఆరోపణలపై సర్వే చేస్తున్నమని, సోదాలు కాదని పేర్కొంది. కార్యాలయం లావాదేవీలకు సంబంధించి బ్యాలెన్స్ షీట్లు, ఖాతాల వివరాలను ఇవ్వాల్సిందిగా బీబీసీ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ని కోరినట్లు ఆదాయపు శాఖ వర్గాలు తెలిపాయి. ఈ తనిఖీలు ముగిసిన తర్వాతే ఉద్యోగులను కార్యాలయం నుంచి బయటకు వెళ్లేందుకు ఐటీ అధికారలు అనుమతించినటట్లు సమాచారం. కాగా, బీబీసీ ఈ ఘటనపై స్పందిస్తూ.."ఆదాయపు శాఖ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నాం. మా ఉద్యోగులందరూ క్షేమంగానే ఉన్నారు. బీబీసి వారికి అన్నివిధాలుగా సహకరిస్తుంది. ఈ వివాదం తొందరలోనే ముగిసిపోతుందని ఆశిస్తున్నా." అని తెలిపింది. ఇదిలా ఉండగా..గత నెలలో బీబీసీ మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన 2002 గుజరాత్ అల్లర్లుపై ఒక డాక్యుమెంటరీ తీసింది. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించిడమే గాక వలవాద విద్వేషపూరిత చర్యగా అభివర్ణించింది కూడా. (చదవండి: పార్లమెంట్లో ఒక ప్రధాని ఇలా అంగీకరించడం ప్రపథమం! సీఎం స్టాలిన్ సెటైర్లు) -
IT Raids on BBC: బీబీసీపై ఐటీ సర్వే
న్యూఢిల్లీ: బీబీసీ–మోదీ డాక్యుమెంటరీ వివాదం కొత్త మలుపు తిరిగింది. పన్ను ఎగవేత ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా ఢిల్లీ, ముంబైల్లోని బీబీసీ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ మంగళవారం ‘సర్వే’ జరిపింది! ఇవి దాడులు కావని, బీబీసీ సబ్సిడరీ కంపెనీలకు చెందిన అంతర్జాతీయ పన్ను విధానాలు తదితరాలకు సంబంధించిన సర్వే మాత్రమేనని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ‘‘ఈ అవకతవకలపై బీబీసీకి గతంలోనే నోటీసులిచ్చినా బేఖాతరు చేసింది. పైగా భారీగా లాభాలను దారి మళ్లించింది’’ అని ఆరోపించాయి. ఐటీ అధికారులు ఉదయం 11 గంటల సమయంలో ఢిల్లీలో కస్తూర్బా గాంధీ మార్గ్, ముంబైలోని శాంతాక్రుజ్ ప్రాంతంలో ఉన్న బీబీసీ కార్యాలయాలకు చేరుకున్నారు. సర్వే పూర్తయ్యేదాకా బీబీసీ సిబ్బందిని కార్యాలయ ఆవరణ వీడేందుకు అనుమతించలేదు. వారినుంచి సెల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నట్టు అనంతరం బీబీసీ ట్వీట్ చేసింది. గుజరాత్లో గోద్రా అనంతర అల్లర్లకు అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మోదీయే నేరుగా బాధ్యుడంటూ జనవరిలో బీబీసీ విడుదల చేసిన డాక్యుమెంటరీ పెను వివాదానికి దారి తీయడం, దాన్ని కేంద్రం నిషేధించడం తెలిసిందే. మండిపడ్డ విపక్షాలు బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సర్వేలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. మోదీ ప్రభుత్వం నిత్యం పత్రికా స్వేచ్ఛపై దాడి చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. ఇది కచ్చితంగా బెదిరింపు చర్యేనని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. వినాశకాలం దాపురించినప్పుడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడతాయంటూ ధ్వజమెత్తారు. కేంద్రం తీరు నియంతృత్వానికి పరాకాష్ట అని సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ దుయ్యబట్టాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు ‘ప్రేమికుల రోజు సర్వే’లకు దిగాయంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఎద్దేవా చేశారు. ‘‘ఇదే ఊపులో ఐటీ, సెబీ, ఈడీ తదితరాలన్నీ కలసి కేంద్రానికి అత్యంత ప్రియుడైన మిస్టర్ ఎ సంస్థలపైనా ఇలాంటి సర్వేలు చేస్తే ఎలా ఉంటుంది!’’ అని అదానీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సర్వేలతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్టు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా పేర్కొంది. పాలక వర్గం పట్ల విమర్శనాత్మకంగా ఉండే మీడియా సంస్థలను వేధించే ధోరణికి ఇది కొనసాగింపని ఒక ప్రకటనలో విమర్శించింది. నిశితంగా గమనిస్తున్నాం: బ్రిటన్ తాజా పరిణామాలు బ్రిటన్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ సర్వేకు బీబీసీ డాక్యుమెంటరీతో సంబంధముందన్న భావన బ్రిటన్ ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అధికారికంగా స్పందించకపోయినా, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు అవి పేర్కొన్నాయి. ఇవి కచ్చితంగా కక్షసాధింపు ధోరణితో కూడిన వేధింపు చర్యలేనని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లీడింగ్ ఆథర్ డాక్టర్ ముకులికా బెనర్జీతో పాటు బ్రిటన్‌కు చెందిన మానవ హక్కుల సంస్థ సౌత్ ఏషియా సాలిడారిటీ గ్రూప్ కూడా విమర్శించింది. వీటిని తక్షణం ఆపాలని డిమాండ్ చేసింది. అయితే, వార్తా సంస్థ ముసుగులో సామ్రాజ్యవాదులతో చేతులు కలిపిన బీబీసీ భారత్‌లో కచ్చితంగా ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని గ్లోబల్ హిందూ ఫెడరేషన్ చైర్పర్సన్ సతీశ్ శర్మ ఆరోపించారు. కాంగ్రెస్ రియాక్షన్.. బీబీసీ కార్యాలయంలో ఐటీ సోదాలపై కాంగ్రెస్ స్పందించింది. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెటంరీ కమిటీ(జేపీసీ) వేయాలని తాము డిమాండ్ చేస్తుంటే కేంద్రం మాత్రం బీబీసీ వెనకాల పడుతోందని విమర్శలు గుప్పించింది. ఈ మేరకు సీనియర్ నేత జైరాం రమేశ్ వీడియోను కాంగ్రెస్ ట్విట్టర్లో షేర్ చేసింది. यहां हम अडानी के मामले में JPC की मांग कर रहे हैं और वहां सरकार BBC के पीछे पड़ी हुई है। 'विनाशकाले विपरीत बुद्धि' : @Jairam_Ramesh जी pic.twitter.com/PvQ57tMTVP — Congress (@INCIndia) February 14, 2023 చదవండి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పోటీయే లేదు: అమిత్ షా -
తెలంగాణ: మరోసారి ఐటీ సోదాల కలకలం
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఇన్కమ్ ట్యాక్స్ సోదాల కలకలం రేగింది. మంగళవారం ఉదయం నుంచే తనిఖీలు నిర్వహిస్తున్నాయి ఐటీ బృందాలు.మొత్తం యాభై దాకా బృందాలు 40 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రముఖంగా హైదరాబాద్‌లోని వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్‌తో పాటు పలు చోట్ల కొనసాగుతున్నాయి ఐటీ సోదాలు. ఫార్మా కంపెనీకి చెందిన కార్పొరేట్ కార్యాలయాలు, చైర్మన్ ఇళ్ళు, డైరెక్టర్ల ఇళ్ళల్లో సోదాలు కొనసాగుతున్నాయి. వెంగళరావు నగర్ లో రెండు టీమ్ లు, మాదాపూర్ లోని మరో కార్పొరేట్ కార్యాలయంలో నాలుగు టీమ్ లు సోదాలు నిర్వహిస్తున్నాయి. వసుధ ఫార్మా చైర్మన్ వెంకటరామారాజుతో పాటు డైరెక్టర్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. వసుధ ఫార్మా పేరుతోనే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సుమారు 15 కంపెనీల పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. ఫార్మా కంపెనీ నుండి వచ్చిన లాభాలను రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. గతంలో పలు రియల్ ఎస్టేట్ కార్యాలయాల పై జరిపిన దాడుల్లో పలు పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలు లభించగా.. వాటి ఆధారంగా ఇప్పుడు సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. -
హైదరాబాద్ లో రెండోరోజు ఐటీ సోదాలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు.. ఒకేసారి 50కి పైగా ప్రాంతాల్లో
సాక్షి, హైదరాబాద్: గడిచిన నాలుగైదు నెలలుగా వరసబెట్టి ఆదాయపు పన్ను శాఖ అధికారులు చేస్తున్న దాడులు రియల్ ఎస్టేట్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. తాజాగా బుధవారం నగరంలోని పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. దాదాపు 30కి పైగా బృందాలు బుధవారం తెల్లవారుజాము నుంచే రియల్ ఎస్టేట్ సంస్థలు ఆదిత్య హోం, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో విల్లాలు నిర్మిస్తున్న ఉర్జిత్ కన్స్ట్రక్షన్స్, సీఎస్కే బిల్డర్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాయి. ఐదారు సంవత్సరాలుగా వారు చూపెడుతున్న లెక్కలకు, చెల్లిస్తున్న ఆదాయ పన్నుకు పొంతనలేని కారణంగానే ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. అదే విధంగా గురువారం కూడా కొన్ని సంస్థల్లో సోదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. బంజారాహిల్స్‌లోని శ్రీఆదిత్య హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కోటారెడ్డి, ఆయన కుమారుడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న ఆదిత్యరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలో గల లోధా బెల్లెజలో నివాసం ఉండే ఉర్జిత్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్స్ శ్రీనివాసరెడ్డి, వీరప్రకాష్ నివాసాల్లో బుధవారం ఉదయం రెండు వాహనాల్లో వచ్చిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్, పంజాగుట్ట ప్రాంతాల్లోని కార్యాలయాలు, నివాసాల్లో కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మరో బిల్డర్ మాధవరెడ్డి ఇంట్లో, సీఎస్కే కార్యాలయంలోనూ ఐటీ అధికారులు దాడులు కొనసాగించారు. ఈ సంస్థలన్నీ ఐటీ రిటర్న్స్‌లో పలు అవకతవకలకు పాల్పడినట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు గుర్తించారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండికొట్టినట్లు నిర్ధారణ కావడంతోనే ఆ శాఖ అధికారులు ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ దాడుల సందర్భంగా పలు కీలక పత్రాలు, డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్‌్కలు స్వా«దీనం చేసుకున్నారు. -
హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ దాడుల కలకలం.. ఆరు బృందాలుగా..
హైదరాబాద్: ఐటీ అధికారులు హైదరాబాద్‌లో మూడు చోట్ల విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. బాలానగర్‌లోని రెండు కెమికల్ కంపెనీల్లో తనిఖీలు చేపట్టారు. మొత్తం ఆరు బృందాలతో ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. ఈ కెంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు సమాచారం అందడంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘ఎక్సెల్ రబ్బర్’పై ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్: ఎక్సెల్ రబ్బర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌పై బుధవారం ఆదాయపన్ను శాఖ (ఐటీ) దాడులు నిర్వహించింది. హైదరాబాద్‌లోని మాదాపూర్, సంగారెడ్డి జిల్లా బొల్లారం సహా ఎనిమిది ప్రాంతాల్లో, చెన్నై, బెంగళూర్, ఏపీ సహా దేశవ్యాప్తంగా మొత్తం 20 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. హైదరాబాద్‌లో బుధవారం తెల్లవారుజాము నుంచి సుమారు 12 బృందాలు సోదాల్లో పాల్గొన్నాయి. సీఆర్పీఎఫ్ పోలీసుల బందోబస్తు మధ్య అధికారులు తనిఖీలు నిర్వహించారు. గచ్చిబౌలిలోని ఎక్సెల్ బ్రాంచ్ ఆఫీస్, కోకాపేట్లో ఆరుగురు డైరెక్టర్లు, సీఈఓల ఇళ్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా బాచుపల్లి, పాశమైలారంలోని ఎక్సెల్ రబ్బర్ యూనిట్ 5, విలాస్ పాలిమర్స్ ప్రైవేట్, ఎస్ టైర్స్ లిమిటెడ్ కంపెనీల్లో సోదాలు చేశారు. సెర్చ్ వారెంట్‌తో సోదాల్లో పాల్గొన్న అధికారులు రబ్బర్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్కు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించారు. ఈ కంపెనీలోకి బ్రిటన్ నుంచి రూ.500 కోట్ల పెట్టుబడులు రావడం, దానికి సంబంధించిన పన్నుల వివరాలను పొందుపర్చకపోవడం వంటి ఆరోపణలు ఈ సంస్థపై ఉన్నట్లు సమాచారం. టాక్స్ చెల్లింపులోనూ భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే గత ఐదేళ్లకు సంబంధించిన ఆదాయ వ్యయాలు, ఐటీ చెల్లింపులకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను ఐటీ అధికారులు పరిశీలించారు. ఎక్సెల్ దాని అనుబంధ సంస్థలపై విలాస్ పాలిమార్సహా మరో రెండు కంపెనీలకు చెందిన హార్డ్ డిస్క్‌లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను సీజ్ చేసినట్లు తెలిసింది. సోదాలు గురువారం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఐతే ఈ సోదాలకు సంబంధించిన వివరాలను ఐటీశాఖ అధికారులు వెల్లడించాల్సి ఉంది. -
హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా భారీగా ఐటీ రైడ్స్
-
HYD: భారీ స్థాయిలో ఐటీ రైడ్స్ కలకలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఐటీ దాడుల పర్వం మొదలైంది. ఇందులో భాగంగా రాజధాని నగరంలో భారీ స్థాయిలో సోదాలకు ఇన్కమ్ ట్యాక్స్ శాఖ సిద్ధమైనట్లు తెలుస్తోంది. బుధవారం వేకువ జామునే ఐటీ రైడ్స్‌తో ఉత్కంఠకు తెర తీసింది ఆర్థిక విభాగం. హైదరాబాద్‌లోని ఐటీ ఆఫీస్ నుంచి బయల్దేరారు ఐటీ అధికారులు. సుమారు 40 కార్లు, మూడు సీఆర్పీఎఫ్ వెహికిల్స్ లో ఐటీ బృందాలు రైడ్స్‌కు బయలుదేరాయి. తాజా సమాచారం ప్రకారం.. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ లక్ష్యంగా దాడులకు దిగినట్లు తెలుస్తోంది. గచ్చిబౌలిలోని ఐకియా షోరూం పక్కన ఉన్న ఎక్సెల్ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. 10:25AM ► ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌పై ఐటీ దాడులు సాగుతున్నాయి. బాచుపల్లిలోనూ ఐటీ తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం. అలాగే ఆరుగురు డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. 10:36AM ► 20 చోట్ల కొనసాగుతున్నాయి ఐటీ సోదాలు. ఆరుగురు డైరెక్టర్ల ఇళ్లతోపాటు చైర్మన్ సీఈఓ ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఎక్సెల్ గ్రూప్ కి అనుబంధంగా ఉన్న మరొక 10 కంపెనీలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలితో పాటు మాదాపూర్ బాచుపల్లిలోని కార్యాలయాల్లో సోదాలు సాగుతున్నాయి. మరోవైపు రబ్బర్ ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్‌లో భారీగా తేడాలతో పాటు ట్యాక్స్ చెల్లింపు లో అవకతవకలు జరిగినట్లు సమాచారం అందుతోంది. 10:45AM ► సంగారెడ్డి లోని నాలుగు కంపెనీలో సోదాలు కొనసాగుతున్నాయి. నార్సింగ్ లోని ఆరు చోట్ల, బాచుపల్లి దుండిగల్ లోని 4 కంపెనీలలో సోదాలు నడుస్తున్నాయి. 11:31AM ► లండన్ నుంచి 500 కోట్ల ఫండ్ exel కంపెనీలలో పెట్టుబడి పెట్టినట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఈ క్రమంలో.. ఆ లెక్కపై ఆరా తీస్తున్నారు ఐటీ అధికారులు. -
ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్..
మేడ్చల్ రూరల్: దేశంలో అతిపెద్ద ఐటీ దాడి తనపైనే జరిగిందని, అది కూడా రికార్డేనని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయలోని సీఎంఆర్ గ్రూప్స్ ఆడిటోరియంలో శుక్రవారం అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. తనపై ఇటీవల జరిగిన ఐటీ దాడి మూడోసారి కావడంతో.. హ్యాట్రిక్‌గా భావిస్తున్నానని పేర్కొన్నారు. తాను పాల వ్యాపారం నుండి మంత్రి స్థాయికి ఎదిగానని.. అందుకు ఎంతో కష్టపడ్డానని చెప్పుకున్నారు. తన విద్యాసంస్థల్లో పదివేల మంది అధ్యాపకులు, ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని వివరించారు. మనం ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చని.. అందుకు డిగ్రీలు అవసరం లేదని.. లక్ష్యం ఉంటే చాలని మంత్రి మల్లారెడ్డి ఉద్బోధించారు. -
ఐటీ దాడుల్లేని అద్భుత భారతం.. ఇప్పుడందరి చూపూ 2024 వైపే
నెట్లో ట్రెండ్ అవుతున్న తండ్రీ కూతుళ్ల సంభాషణ.. పనిచేసుకుంటున్న తండ్రిని ఏడేళ్ల పాప... ‘ఏం చేస్తున్నావ్ నాన్నా...’ అని అడుగుతుంది. ‘ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నానమ్మా..’ అని సమాధానం చెప్పగా, ‘ఇన్కమ్ ట్యాక్స్ అంటే...’ ఆ పాప ప్రశ్న. కొద్దిగా ఆలోచించి, కాస్త నిట్టూర్చి. ఇలా అంటాడు. ‘... నిన్నూ, అన్నను పోషిస్తున్నట్టే రాజకీయనాయకులను, అధికారులను పోషించాల్సిన బాధ్యత నా మీద ఉందమ్మా.. వాటికి డబ్బులు తీసిపెట్టడమే ఇన్కమ్ ట్యాక్స్..’ – ఈ జవాబులో నిజం కాస్తే ఉన్నా, కడుపు మంట ఎక్కువగా కనిపిస్తుంది. సగటు మనిషి, ఉద్యోగిపై ప్రతినెలా, ప్రతి ఏడాదీ ‘ఐటీ దాడులు’ జరుగుతూనే ఉంటాయిగా... అందుకే. ► చరిత్ర చూస్తే సగటుమనిషి కడుపు మంట నుంచి విప్లవాలు, లేదా విప్లవాత్మక ఆలోచనలు పుట్టుకురావడం కనిపిస్తుంది. కానీ, సాక్షాత్తూ ఓ మంత్రి కడుపుమంట నుంచి కూడా విప్లవాత్మక ఆలోచనలు రావడం ముదావహం, ఆహ్వానించదగ్గ విషయం. మంత్రి మల్లారెడ్డి పన్నులు లేని, ఐటీ దాడుల్లేని భారతావనిని స్వప్నిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీతో అది సాధ్యమని మనలో ఆశలు కల్పిస్తున్నారు. ఆయన మాటలు చూడండి. ‘‘కేసీఆర్ స్థాపించిన భారత రాష్ట్ర సమితి 2024లో అధికారంలోకి వస్తది. ఎవరిపైనా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఉండవు. మా పాలనలో ఎవరైనా, ఎట్లయినా సంపాదించుకోవచ్చు. ఎవరికి వారే స్వచ్ఛందంగా, తమకు ఇష్టమైతేనే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే విధంగా కొత్త రూల్స్ తీసుకొస్తాం..’ – వందల కొద్దీ ఐటీ అధికారులు రెండు మూడు రోజులపాటు దాడి చేసి, నానా ప్రశ్నలు వేసి, రక రకాల డాక్యుమెంట్లు అడిగి, కాస్తో కూస్తో దొరి కిన కరెన్సీని ఎక్కడిదని ప్రశ్నించిన ఫ్రస్టేషన్లో పుట్టిందే .. ‘బీఆర్ఎస్ నాయత్వంలో పన్నులు లేని భారతదేశం’ ఐడియా అని అందరూ అపోహ పడుతున్నా, వినడానికి ఎంత బావుందో... అని అందరూ ఆనందపడ్డారు. చాయ్ వాలా... మిల్క్వాలా ‘చాయ్‌వాలా’ మోదీ మన గొంతులో బలవంతంగా పోస్తున్న జీఎస్‘టీ’ కన్నా ‘మిల్క్వాలా’ మల్లారెడ్డి మాటలే మనకు ‘బూస్ట్’నిస్తాయి. ఇలా జనాన్ని ఆనంద పెట్టడంలో, ముఖ్యంగా కుర్రకారును ఉత్సాహపరచడంలో, మోటివేట్ చెయ్యడంలో మల్లారెడ్డికి పెట్టిందిపేరు. విజయానికి తానే మోడల్ నంటూ కుండ బద్దలు కొట్టేసి, 23 మూడేళ్ల వయస్సులో సైకిల్‌పై పాలమ్మిన తాను దేశంలోని టాప్ టెన్ ‘ఎడ్యుకేషనిస్టు’గా, మంత్రిగా ఎదగడంలో తన అవిర ళ కృషిని తరచూ యువతకు గుర్తుచేస్తుంటారు. బాగా ఎదగాలని మోటివేట్ చేస్తుంటారు. షార్ట్‌కట్స్ కూడా చెబుతుంటారు. పాతికేళ్ల వయస్సులో, అదికూడా ఎవరితో పడితే వాళ్లతో ప్రేమలో పడకూడదని ముఫ్పై ఏళ్లు దాటాకా ఆ పని చేయాలని సూచిస్తుంటారు. ప్రేమ, పెళ్లి అంటే ‘ఐశ్యర్యారాయ్ అమితాబ్ కొడుకును పట్టినట్టుగా, జాక్‌పాట్ కొట్టినట్టుగా...’ ఉండాలని అమ్మాయిలకు మార్గనిర్దేశనం చేస్తారీ ఎడ్యుకేషనిస్టు. అలాగే అబ్బాయిలు ఎలా పెళ్లి చేసుకోవాలో, ఎలా ఆర్థికంగా స్థిరపడాలో హీరో రామ్‌చరణ్‌ను చూసి నేర్చుకోవాలని సరదాగా చెబుతుంటారు. అలా రిచ్‌గా ఎలా రూపొందాలో తరచూ చెప్పే మంత్రిగారు, ఇప్పడు ఆ రిచ్‌నెస్‌ను ఎలా కాపాడుకోవాలో యోచించి.. అలా కష్టపడి సంపాదించిన దానికి ట్యాక్స్ కట్టకపోవడమే మార్గంగా ఊహించి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ‘ట్యాక్స్లెస్ కంట్రీ’గా ఇండియాను రూపొందించే పనిలో పడ్డారు. ఇక్కడ పన్ను బాధలేదు.. నిజానికి పన్ను బాధలేని దేశాలు చాలానే ఉన్నాయి. కొన్ని చోట్ల కాస్తో కూస్తో కడితే చాలు. మంత్రి గారి మాటలు నిజమైతే మనమూ ఇలా హ్యాపీగా ఉండొచ్చు.. మచ్చుకు కొన్ని.. ► యూఏఈలో వ్యక్తిగత ఆదాయ పన్ను మాటే లేదు. జనం ఎంత సంపాదించుకున్నా ఎలాంటి పన్నులూ ఉండవు. పైగా విదేశాల వారూ ఇక్కడ ఆస్తులు కొనుక్కోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. అందుకే చాలామంది యూఏఈలో సెటిల్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. ► దక్షిణ అమెరికా ఖండంలో అందమైన బీచ్‌లు, కేసినోలతో అలరారే పనామా దేశం పన్ను రహిత స్వర్గంగా పేరుపొందింది. ఇక్కడి జనం ఆదాయ పన్ను కట్టే పనిలేదు. విదేశాల్లో వ్యాపారం చేసి సంపాదించిన డబ్బుకూ పన్ను కట్టనక్కర లేదు. దేశంలో చేసే వ్యాపారంపై మాత్రం, అదీ స్వల్పస్థాయిలో పన్నులు కడితే చాలు. ► బహమాస్‌లోనూ వ్యక్తిగత ఆదాయ పన్ను లేదు. అక్కడ స్థిరాస్తులు కొనుగోలు చేస్తే శాశ్వత నివాస అవకాశమూ ఉంటుంది. ► గల్ఫ్ దేశాలైన ఖతార్, కువైట్ కూడా ప్రజల నుంచి ఎలాంటి ఆదాయ పన్ను వసూలు చేయవు. వాణిజ్య కార్యకలాపాలపై మాత్రం ఖతార్‌లో పదిశాతం, కువైట్‌లో 15 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. ► మరో గల్ఫ్ దేశం ఒమన్‌లో వ్యక్తిగత ఆదాయ పన్ను మాత్రమే కాదు.. ఆస్తి పన్ను, స్థిరాస్తులపై పన్ను వంటివీ లేవు. ► ఆధునిక సదుపాయాలకు నిలయమైన బెర్ముడాలోనూ పౌరులకు ఆదాయ పన్ను లేదు. ► మొనాకో, సైమన్ ఐలాండ్స్, వనౌటు వంటి దేశాల్లోనూ ఎలాంటి వ్యక్తిగత ఆదాయ పన్ను లేదు. వనౌటు దేశం అయితే డ్యూయల్ సిటిజన్ షిప్‌ను అధికారికంగానే అంగీకరిస్తుంది. ► యూరప్‌లో ఫ్రాన్స్, స్పెయిన్‌ల మధ్య స్వతంత్ర పాలిత ప్రాంతమైన ఆండోరాలో వ్యక్తిగత ఆదాయ పన్ను కేవలం పది శాతం, అదీ గరిష్ఠంగా 40 వేల యూరోలకే పరిమితం. వారసత్వ ఆస్తులు, బహుమతులపై ఎలాంటి ట్యాక్సులూ ఉండవు. ... మొన్నటికి మొన్న బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు జరుగుతుంటే, ఆ జెండా నుంచి గులాబీ రేకుల్లాగే... సగటు, వేతన జీవుల కళ్లల్లో, ఇంకా చెప్పాలంటే ధనిక, పేద తేడా లేకుండా అందరి కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలిపడ్డాయి. కళ్ల ముందు పైన చెప్పిన పన్నులేని దేశాలు యూఏఈ, ఖతార్, కువైట్ ఇత్యాదులు అక్కడి ప్రజల ఆనందం కళ్లముందు కదలాడాయి. మల్లారెడ్డి హామీ ఇచ్చిన ‘ఐటీ దాడుల్లేని స్వప్నలోకం’ ఆవిష్కృతమైంది. ఇక ప్రతి బడ్జెట్లో ఆదాయ పన్ను శ్లాబులు మారతాయా అని కామన్ మ్యాన్ ఆశగా చూడక్కర్లేదు. డోర్ బెల్ మోగితే ఐటీ పటాలమేమోనని రిచ్‌మ్యాన్ గాబరా పడక్కర్లేదు. మన డబ్బంతా మనకే.. ... ఇప్పుడందరి చూపూ 2024 వైపే, అందరి ఆశా ఒక్కటే.. బీఆర్ఎస్ ఎర్రకోట ఎక్కాలి.. మల్లారెడ్డి ఆర్థిక మంత్రి కావాలి.. అంతే. (క్లిక్ చేయండి: పొలిటికల్ తిట్లలో పోషకాలెక్కువ...) -
ముగిసిన మైత్రీ మూవీ మేకర్స్ ఐటీ రైడ్స్, కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థపై నిన్న(డిసెంబర్ 12న) ఆదాయపు పన్ను శాఖ (ఐటీ), జీఎస్టీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం నుంచి జరగగా రాత్రి 12 గంటలకు ఈ తనిఖీలు ముగిసినట్లు తెలుస్తోంది. ఏకకాలంలో 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ డైరెక్టర్స్ అయిన యలమంచిలి రవిశంకర, ఎర్నేనీ నవీన్‌కు సంబంధించిన ఇల్లు, కార్యాలయలపైన కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లతో పాటు పలు హార్డ్‌డిస్క్‌లను స్వాధినం చేసుకున్నట్లు సమాచారం.మైత్రీ మూవీ మేకర్స్ వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ హై బడ్జెట్ చిత్రాలకు నిర్మాణ వ్యయం, పెట్టుబడులను ఎలా సమకుర్చుతున్నారనే దానిపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. అంతేకాదు హీరోలకు ఇచ్చే రెమ్యునరేషన్, లాభాల గురించి కూడా సంస్థ అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాదు పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలను ఈ సందర్భంగా అధికారులు గుర్తించినట్లు సమాచారం. అయితే ఇది రెగ్యులర్ చెకింగ్‌లో భాగంగానే సోదాలు నిర్వహించినట్లు మైత్రీ మూవీ మేకర్స్ మీడియాతో పేర్కొన్నారు. కాగా పుష్ప, శ్రీమంతుడు, డియర్ కామ్రేడ్,సర్కారు వారి పాట, ఉప్పెన, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను ఈ సంస్థలోనే నిర్మించబడ్డాయి. చదవండి: నన్ను నమ్మిన మొదటి వ్యక్తి నువ్వే డార్లింగ్: ప్రభాస్‌పై జక్కన్న కామెంట్స్ అవకాశం వస్తే పాకిస్తాన్ సినిమాల్లోనూ నటిస్తా: రణ్‌బీర్ కపూర్ -
మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయాల్లో ముగిసిన సోదాలు
-
‘మైత్రీ’పై ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిన్నటివరకు రియల్ ఎస్టేట్ సంస్థలు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి విద్యా సంస్థల్లో దాడులు నిర్వహించిన ఆదాయ పన్ను శాఖ తాజాగా సినీ నిర్మాతలపై దృష్టి సారించింది. ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయాలపై సోమవారం జీఎస్టీ అధికారులతో కలిసి దాడులకు దిగింది. ఏకకాలంలో ప్రారంభమైన సోదాలు మొత్తం 15 చోట్ల కొనసాగుతున్నాయి. ఈ చిత్ర నిర్మాణ సంస్థలో యలమంచిలి రవిశంకర్, ఎర్నేనీ నవీన్ భాగస్వాములుగా ఉన్నారు. ప్రముఖ సినీ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే మైత్రీ మూవీ మేకర్స్.. భారీ లాభాలు ఆర్జించినా ఆ మేరకు పన్నులు చెల్లించకుండా ఎగవేసిందనే అనుమానాలతో ఐటీ తనిఖీ లకు దిగినట్లు తెలిసింది. ఈ సంస్థకు చెందిన తాజా చిత్రాలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి వచ్చే సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతున్నాయి. మంచి లాభాలు ఆర్జించిన పుష్ప సినిమా సీక్వెల్‌గా వస్తు న్న పుష్ప–2, వస్తాద్ భగత్‌సింగ్‌తో పాటు, మరో మూడు సినిమాలు లైన్లో ఉన్నట్టు సమాచారం. ఫైనాన్షియర్ల ఇళ్లల్లోనూ.. నిర్మాతల ఇళ్లు, కార్యాలయాలతో పాటు ఉద్యోగులు, వీరికి ఫైనాన్స్ చేస్తున్నారన్న అనుమానం ఉన్న వారి ఇళ్లల్లోనూ ఐటీ, జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. ప్రస్తుతం లైన్లో ఉన్న సినిమాల బడ్జెట్ ఆరేడు వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా. కాగా ఇందుకు అవసరమైన భారీ మొత్తం నిధులు ఏ విధంగా సమకూరాయి? ఎక్కడ నుంచి ఫైనాన్స్ తీసుకున్నారు? అందుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు సక్రమంగానే ఉన్నాయా.? పన్నుల చెల్లింపులు ఎలా ఉన్నాయి? చిత్రాల నిర్మాణానికి ఎంతెంత ఖర్చు చేస్తున్నారు.? అందుకు సంబంధించి జీఎస్టీ చెల్లింపులు చేశారా? లేదా? అన్న అంశాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ భారీ బడ్జెట్ సినిమాల్లో నటించే వారికి పారితోషికాలు ఏ విధంగా చెల్లిస్తున్నారు? పూర్తి పారదర్శకంగా ఉన్నాయా? లేదా? హవాలా లావాదేవీలు ఏమైనా ఉన్నాయా.? అన్న కోణంలోనూ కూలంకషంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ నిర్మాణ సంస్థకు వచ్చిన లాభాలకు, చెల్లించిన పన్నుల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లుగా వచ్చిన సమాచారం ఆధారంగానే అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు వ్యత్యాసాలు బయటపడినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఐటీ శాఖ నుంచి అధికారిక సమాచారం ఏదీ విడుదల కాలేదు. తలసాని శ్రీనివాస్‌యాదవ్ పీఏ విచారణ కేసినో కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతూనే ఉంది. సోమవారంమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వ్యక్తిగత సహాయకుడు అశోక్‌ను విచారించారు. కేసినో ఆడించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక విమానాల్లో నేపాల్, శ్రీలంకతో పాటు గోవాలకు తీసుకెళ్లిన చీకోటి ప్రవీణ్‌పై ఇదివరకే కేసులు నమోదైన సంగతి విదితమే. ఈ కేసులోనే అశోక్‌ను కూడా విచారణకు పిలిచారు. అయితే ఇప్పటివరకు ఈడీ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. -
ఆర్థిక అవకతవకలు..పన్ను ఎగవేత!
సాక్షి, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ సంస్థ వంశీరాం బిల్డర్స్పై ఐటీ అధికారుల దాడులు బుధవారం రెండోరోజు కూడా కొనసాగాయి. వంశీరాం బిల్డర్స్ పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లుగా అధికారులు గుర్తించినట్టు తెలిసింది. వినియోగదారులకు విక్రయించిన ఫ్లాట్లు, కమర్షియల్ ప్రాంతాలకు సంబంధించిన లావాదేవీల్లో పెద్ద ఎత్తున ఆదాయ పన్ను ఎగ్గొట్టినట్టుగా వెల్లడైందని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. కాగా సంస్థ చైర్మన్ సుబ్బారెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగించడంతో పాటు ఆయన బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు తెరిపించారు. వాటిల్లో భారీ ఎత్తున బంగారు ఆభరణాలు, విలువైన స్థిరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు తనిఖీలు చేసిన అధికారులు, బుధవారం ఉదయం నుంచి మొత్తం 19 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. సుబ్బారెడ్డితో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఈ సోదాలు కొనసాగినట్లు తెలుస్తోంది. ఆదాయానికి తగ్గట్టుగా లేని పన్ను చెల్లింపులు! వంశీరాం సంస్థలో పనిచేసే ఉద్యోగుల పేరిట తెరిపించిన ఖాతాల ద్వారా పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన అధికార యంత్రాంగం ఆ మేరకు పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. ఆదిత్య అనే వ్యక్తితో కలిసి సుబ్బారెడ్డి ఆరెంజ్ లైనర్ ప్రాపర్టీస్‌లో పెట్టుబడులు పెట్టినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఈ సంస్థలో వారిద్దరూ డైరెక్టర్లుగా కూడా ఉన్నట్టు తెలిసింది. దీంతో కావూరి హిల్స్‌లోని ఆదిత్య ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. సుబ్బారెడ్డి ఇంట్లో దొరికిన కీలక పత్రాలు, ఇతరుల భూముల అభివృద్ధి ఒప్పంద పత్రాలు, వారికి ఇచ్చిన అడ్వాన్స్‌లు తదితర పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కీలకమైన ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టి, వాటి విక్రయాలతో భారీ ఎత్తున ఆదాయం సమకూరినా.. ఆ స్థాయిలో పన్ను చెల్లింపులు చేయలేదని అధికారులు గుర్తించినట్టు తెలిసింది. అయితే ఈ సోదాల్లో ఎంత మొత్తం బంగారం, నగదు బయటపడిందీ, కీలక స్థిరాస్తి పత్రాల విలువ ఎంత? అన్న దానిపై ఐటీ అధికారుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఇలావుండగా ఐటీ అధికారులు నిర్వహిస్తున్న దాడులతో సుబ్బారెడ్డి కుటుంబంలోని వారు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, అందు కోసం ఓ ఆసుపత్రి నుంచి వచ్చిన డాక్టర్లతో ఐటీ అధికారులు వారికి బీపీ పరీక్షలు నిర్వహింప చేశారని తెలిసింది. -
వంశీరామ్ బిల్డర్స్: కొనసాగుతున్న ఐటీ సోదాలు.. హవాలా రూపంలో నగదు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ సంస్థల ఆర్థిక అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు వరుస దాడులు నిర్వహిస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ వంశీరామ్ బిల్డర్స్పై ఆదాయ పన్ను శాఖ అధికారులు రెండో రోజు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ సంస్థ చైర్మన్ సుబ్బారెడ్డి నివాసంతోపాటు కార్యాలయాల్లో మంగళవారం రాత్రి పొద్దుపోయే దాకా సోదాలు జరిపిన అధికారులు బుధవారం కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, సోదాల్లో భాగంగా వంశీరామ్ బిల్డర్స్ ఉద్యోగుల ఖాతాల్లో భారీగా లావాదేశీలు గుర్తించారు. 15 బృందాలతో 19 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ రియల్ ఎస్టేట్ సంస్థ రెండు రాష్ట్రాల్లోనూ నిర్మాణాలు సాగిస్తోంది. కాగా, మొదటి రోజు సోదాల్లో భాగంగా వంశీరామ్ బిల్డర్స్ పెద్దఎత్తున ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఐటీ అధికారులు తమ సోదాల్లో గుర్తించినట్లు సమాచారం. ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల ఖాతాల్లో నుంచి భారీగా నగదు బదిలీ అయినట్లు.. ఆ ఖాతాలన్నీ సంస్థ బినామీ ఖాతాలుగా గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ సంస్థ లావాదేవీల్లో మనీల్యాండరింగ్ కోణం కూడా అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలిసింది. ఈ సంస్థ తన వినియోగదారులకు విక్రయించిన నివాస, వాణిజ్య సముదాయాలకు సంబంధించిన లావాదేవీల్లో సగం మొత్తాన్ని వైట్‌గా, మరో సగం బ్లాక్‌గా వసూలుచేసినట్లు సమాచారం. తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులతో బ్యాంకు ఖాతాలు తెరిపించి వాటి నుంచి నిధులు మళ్లించారని చెబుతున్నారు. దాడుల్లో పలు కీలక పత్రాలు, పెద్దఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా సంస్థ పెద్దఎత్తున ఇతరులతో ఆస్తులకు సంబంధించి చేసుకున్న ఒప్పంద పత్రాలను కూడా అధికారులు తీసుకెళ్లినట్లు సమాచారం. అధికారులు మంగళవారం ఉదయం నుంచి మొత్తం 36 ప్రాంతాల్లో ఈ సోదాలు చేసినట్లు అధికారవర్గాల సమాచారం. వినియోగదారుల నుంచి నగదు రూపంలో తీసుకున్న మొత్తాన్ని యాజమాన్యం హవాలా ద్వారా తరలించినట్లు చెబుతున్నారు. ఈ దాడులకు సంబంధించి ఐటీ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. వంశీరామ్ సంస్థ నగరంలోనూ, ఇతర ప్రాంతాల్లో పెద్దఎత్తున వెంచర్లను వేసింది. నివాస ప్రాంతాల కంటే అధికంగా వాణిజ్య భవనాలను విలువైన ప్రాంతాల్లో నిర్మించింది. -
Hyderabad: వరుస ఐటీ దాడులు.. రియల్టీలో కల్లోలం!
సాక్షి, హైదరాబాద్: మూడు వెంచర్లు.. ఆరు ప్రాజెక్టులతో జోరు మీద ఉన్న రియల్టీ రంగం కుదుపునకు లోనైంది. వరుసగా జరుగుతున్న ఆదాయపన్ను దాడులు స్థిరాస్తి వ్యాపారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. రోజుకో సంస్థపై ఐటీ, ఈడీ సంస్థల దాడులతో స్థిరాస్తి రంగంలో అనిశ్చితి నెలకొంది. ఫీనిక్స్, వాసవి గ్రూప్, సుమధుర, హానర్ హోమ్స్, మంత్రి, అరబిందో, స్పెక్ట్రా, వంశీరామ్ బిల్డర్స్ వంటి నిర్మాణ సంస్థలపై ఆదాయపన్ను (ఐటీ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడుల నేపథ్యంలో డెవలపర్లలో అలజడి నెలకొంది. అనధికార లావాదేవీలు, ఆదాయ పన్ను, జీఎస్టీ ఎగవేతలే సోదాలకు ప్రధాన కారణాలని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలున్న డెవలపర్లలో వణుకు మొదలైంది. మరోవైపు ప్రీలాంచ్ పేరిట ముందస్తుగా సొమ్ము చెల్లించిన కొనుగోలుదారులకు ఆయా ప్రాజెక్ట్‌లు పూర్తవుతాయో లేదోననే ఆందోళన నెలకొంది. మొత్తంగా హైదరాబాద్ స్థిరాస్తి రంగం కల్లోల పరిస్థితిలో ఉంది. ప్రాజెక్ట్‌లు నిలిచిపోయి.. నగర రియల్టీ రంగంలో గుత్తాధిపత్యం సాధించేందుకు కొన్ని నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి. సామర్థ్యానికి మించి ఒకేసారి నివాస, వాణిజ్య సముదాయాలను ప్రకటిస్తున్నాయి. ఆయా ప్రాజెక్ట్‌లో విక్రయాల ద్వారా వచ్చే సొమ్మును ఎస్క్రో ఖాతాలో జమ చేసి, ఆ నిధులను అదే ప్రాజెక్ట్‌కు వినియోగించాలనే ‘రెరా’నిబంధనలు భేఖాతరు చేస్తూ నిధులను ఇతర ప్రాజెక్ట్‌లకు, అవసరాలకు మళ్లిస్తున్నాయి. దీంతో విక్రయాలు మందగించినా లేదా ఇతరత్రా లీగల్ సమస్యలు తలెత్తినా దాని ప్రభావం అన్ని ప్రాజెక్ట్‌ల మీద పడుతోంది. ఫార్మా రంగం నుంచి సడెన్‌గా రియలీ్టలోకి వచి్చన ఓ కంపెనీ.. వచ్చి రాగానే మాదాపూర్, కొండాపూర్‌లో పలు భారీ నివాస, వాణిజ్య సముదాయాలకు శ్రీకారం చుట్టింది. వీటిల్లో ప్రీలాంచ్ సందర్భంగా సంపన్నులు, ప్రవాసులు, బ్యూరోక్రాట్స్ పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. కానీ, ఊహించని రీతిలో ఆ కంపెనీ ప్రతినిధి అరెస్టు కావడంతో ఇప్పుడా ప్రాజెక్ట్‌ల భవిష్యత్తుపై కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఐటీ దాడులు జరిగిన మరో కంపెనీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంతో పుప్పాలగూడలో ఆ సంస్థ నిర్మిస్తున్న వాణిజ్య సముదాయం నిర్మాణ పనులకు నిధుల గ్రహణం పట్టుకుంది. లెక్కలు సరిదిద్దే పనిలో.. వరుస ఐటీ దాడుల నేపథ్యంలో ఆ కంపెనీలన్నీ నల్లధనాన్ని దారిమళ్లించేందుకు ప్రయతి్నస్తున్నాయి. బ్యాలెన్స్ షీట్లు, రికార్డ్‌లు, డేటా వంటి వాటిని ప్రత్యేకంగా నిపుణులను ఏర్పాటు చేసుకొని సమీక్షించుకునే పనిలో పడ్డాయి. ఈ పరిణామాలతో కొనుగోలుదారుల్లోనూ ఆందోళన నెలకొంది. విచారణలో కంపెనీల ఖాతాల్లోని లెక్కల్లో తమ పేర్లు ఎక్కడ బయట పడతాయోనని విల్లాలు, ఫ్లాట్లు కొనుగోలు చేసిన కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ విలువ కంటే పదింతల సొమ్మును కంపెనీలకు ముట్టజెప్పారు. ఈక్రమంలో ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచి్చందో చెప్పాలంటూ తమకెక్కడ నోటీసులు వస్తాయోనని మధనపడుతున్నారు. దీంతో ప్రీలాంచ్లో విల్లాలు, ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు డబ్బులు వాపసు ఇవ్వాలంటూ కంపెనీలపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. లెక్కల్లో దొరక్కుండా.. ఐటీకి చిక్కకుండా.. రిజి్రస్టేషన్ విలువ కొండాపూర్‌లో చదరపు అడుగు రూ.4,500 మించి లేదు. కానీ, రూ.12 వేల వరకు విక్రయిస్తున్నారు. పుప్పాలగూడలో చ.అ.కు రూ.2,200 ఉండగా.. రూ.10 వేలకుపైనే అమ్మకాలు చేస్తున్నారు. నగదు రూపంలో ఫ్లాట్లను విక్రయించేందుకే బిల్డర్లు ఆసక్తి చూపిస్తుంటారు. రిజి్రస్టేషన్ విలువకు, అమ్మే రేట్లకు మధ్య అంతులేని వ్యత్యాసం ఉంటుంది. కనీసం 20 శాతం కూడా స్టాంప్ డ్యూటీ చెల్లించరు. మిగిలినదంతా బ్లాక్ మనీగా మార్చుతారనే అభియోగాలున్నాయి. ప్రస్తుతం పశ్చిమ హైదరాబాద్‌లోనే సుమారు లక్ష ఫ్లాట్లు నిర్మాణంలో ఉన్నట్లు అంచనా కాగా వీటిల్లో చాలావరకు శంకుస్థాపన నాటి నుంచే విక్రయాలు సాగిస్తున్నవే. అటు స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టి, ఇటు నగదు లావాదేవీల లెక్కలు ఐటీకి దొరక్కుండా నిర్మాణ సంస్థల యజమానులు మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వెంచర్లలో నల్లధనం ఎక్కువ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్‌లతో పోలిస్తే ఓపెన్ ప్లాట్ల వెంచర్లలో అనధికార లావాదేవీలు, నల్లధన ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. కస్టమర్ల నుంచి వసూలు చేసే సొమ్ములో 90 శాతం వరకూ భవన నిర్మాణ పనులకే వెచి్చంచాల్సి ఉంటుంది. అలాగైతేనే నిర్మాణం పూర్తవుతుంది. పైగా కస్టమర్లు బ్యాంకు రుణం రూపంలో గృహాలను కొనుగోలు చేస్తారు కాబట్టి అవన్నీ లెక్కల్లోకి వస్తాయి. అదే వెంచర్లలో అయితే బిల్డర్ వెచి్చంచే వ్యయం చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఓపెన్ ప్లాట్లను ఎక్కువగా సామాన్య, మధ్యతరగతి వర్గాలు కొనుగోలు చేస్తుంటాయి. భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసిన సొమ్మునే పెట్టుబడి పెడతారే తప్ప రుణంతో కొనరు. దీంతో వెంచర్లలో అనధికార లావాదేవీలు ఎక్కువగా జరుగుతుంటాయని రామ్ డెవలపర్స్ ఎండీ రాము తెలిపారు. -
హైదరాబాద్ లో పలు చోట్ల ఐటీ తనిఖీలు
-
కీలక నేతతో పెట్టుబడుల లింక్.. బిల్డర్ సుబ్బారెడ్డి ఇంట ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు చోట్ల ఐటీ అధికారుల మంగళవారం తెల్లవారుజామునే తనిఖీలు నిర్వహించారు. బంజారాహిల్స్, జూబీహిల్స్‌లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. వంశీరామ్ బిల్డర్ సుబ్బారెడ్డి ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే బిల్డర్ సుబ్బారెడ్డి బంధువు జనార్ధన్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. ఏకకాలంలో 15 ఐటీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. దీంతో, వారి ఇంట్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాగా, తెలంగాణకు చెందిన కీలక రాజకీయ నేతకు సంబంధించిన పెట్టుబడుల విషయానికి సంబంధించి ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టినట్టు సమాచారం. అందులో భాగంగానే ఈ దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది. -
మల్లారెడ్డికి ఊహించని షాక్.. భారీ ట్విస్ట్ ఇచ్చిన ఐటీ అధికారులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడుల వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక, ఈ కేసులో భాగంగా ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో సహా కాలేజీల్లో పనిచేసే వారిని కూడా విచారిస్తున్నారు. అయితే, తాజాగా మంత్రి మల్లారెడ్డి కేసులో ఈడీకి ఐటీ అధికారులు లేఖ రాశారు. కాగా, మంత్రి మల్లారెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని అధికారులు గుర్తించారు. సోదాలకు సంబంధించి పూర్తి నివేదికతో ఈడీకి ఐటీ అధికారులు లేఖ పంపించారు. ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాలను ఐటీ.. ఈడీకి తెలిపింది. కాగా, ఈ కేసులో ఈడీ దర్యాప్తు అవసరం ఉందని ఐటీ అధికారులు భావిస్తున్నారు. ఇక, మెడికల్ సీట్లు, డొనేషన్లలో అవకతవకలు జరిగినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు జరపాలని ఐటీ అధికారులు ఈడీని కోరారు. ఇదిలా ఉండగా.. మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు, అల్లుడు ఇళ్లలో సోదాల సందర్భంగా ఐటీ అధికారులు 18 కోట్ల రూపాయలు, లాకర్లను పగులగొట్టి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక, దర్యాప్తులో భాగంగా విదేశాల్లో పెట్టుబడులు, విదేశాలకు డబ్బు తరలించినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. దీంతో, ఈడీకి ఐటీ అధికారులు లేఖ రాసినట్టు సమాచారం. ఈడీ విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఐటీ భావిస్తున్నది. కాగా, ఈ లేఖపై ఈడీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టాల్సి ఉంటుంది. -
Malla Reddy: రూ.వందకోట్ల డొనేషన్లు ఎక్కడ దాచారు?
సాక్షి, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి ఇంటిపై జరిగిన ఐటీ సోదాలకు సంబంధించి ఆ శాఖ అధికారులు మంగళవారం రెండోరోజు కూడా విచారణ కొనసాగించారు. మల్లారెడ్డి ఆడిటర్‌తోపాటు, కాలేజీల ప్రిన్సిపాళ్లు, అకౌంటెంట్లను అధికారులు దాదాపు నాలుగు గంటలపాటు విచారించారు. వైద్య, ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యార్థులను చేర్చుకునే సమయంలో ఫీజులు, డొనేషన్లను ఏ రూపంలో తీసుకుంటున్నారు? ఎంత తీసుకుంటున్నారు? ఎన్నిరకాల ఫీజులు వసూలు చేస్తున్నారంటూ అధికారులు వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. సోదాల్లో లభించిన కీలక పత్రాలు, పెట్టుబడులకు సంబంధించిన ఆధారాల ఆధారంగా ఆడిటర్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కళాశాలలకు మొత్తం ఎన్ని ఖాతాలున్నాయని, ఏ కళాశాలకు ఏయే బ్యాంకుల్లో ఖాతా లున్నాయని కూడా ప్రశ్నించారు. డొనేషన్ల రూపంలో వసూలు చేసిన వందకోట్ల నిధులను ఎక్కడ డిపాజిట్ చేశారన్న దానిపైనా ప్రశ్నించినట్లు తెలిసింది. విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజు కట్టించుకుని తక్కువ ఫీజుకు రశీదులు ఇస్తున్నట్లు అధికారుల దృష్టికి వచి్చన నేపథ్యంలో దానిపైనా ఆరా తీశారు. చదవండి: తెలంగాణలో జ్యోతిష్యం ప్రకారం ఎన్నికలు: సుప్రీం వ్యాఖ్య -
మల్లారెడ్డి ఆదాయాలపై ఐటీ విచారణ: 13 మంది హాజరు.. మరో 10 మందికి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి చెందిన విద్యాసంస్థల ఆదాయం, పన్నుల చెల్లింపులకు సంబంధించి ఈ నెల 22, 23 తేదీల్లో ఐటీ అధికారులు నిర్వహించిన సోదాలపై విచారణ ప్రారంభమైంది. అధికారులు మరో పదిమందికి నోటీసులు ఇచ్చారు. మల్లారెడ్డి విద్యాసంస్థలు, ఆయన బంధువుల ఇళ్లు, ఓ సహకార బ్యాంకు చైర్మన్ ఇంటిపై ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో కోట్లాది రూపాయల నగదు స్వాధీనంతోపాటు పలు కీలకపత్రాలు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు, బ్యాంకు అకౌంట్లు, లాకర్లను పరిశీలించిన విషయం తెలిసిందే. మంత్రి కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, సోదరుడు గోపాల్‌రెడ్డి, వియ్యంకుడు లక్ష్మారెడ్డి, వైద్య, ఇంజనీరింగ్ కళాశాలల డైరెక్టర్లు, కొందరు ప్రిన్సిపాళ్లు, అకౌంటెంట్లను మొత్తం 13 మందిని ఐటీ అధికారులు బషీర్‌బాగ్‌లోని ఐటీ కార్యాలయంలో దాదాపు ఆరు గంటలపాటు ప్రశ్నించారు. వైద్య కళాశాలల్లో డోనేషన్ల పేరుతో సుమారు వందకోట్ల రూపాయలు వసూలు చేసిన అంశానికి సంబంధించి ప్రధానంగా ఐటీ అధికారులు దృష్టి సారించినట్లు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు, వస్తున్న ఆదాయానికి చెల్లించిన పన్ను మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించి వాటిపై ప్రశ్నించారు. సొసైటీ పేరిట ప్రభుత్వం నుంచి రాయితీలు తీసుకుంటూ, విద్యార్థుల నుంచి నిర్దేశిత ఫీజుల కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసిన అంశంపై అధికారులకు లభించిన ఆధారాలను వారి ముందుంచి ప్రశ్నల వర్షం కురిపించారు. సోదాల్లో లభించిన అంశాలపై విడతలవారీగా ఐటీ అధికారులు విచారిస్తున్నారు. ఐటీ సోదాలు జరిగిన సమయంలో ఛాతీలో నొప్పితో ఆసుపత్రిలో చేరిన మహేందర్‌రెడ్డి కానీ, మంత్రి మల్లారెడ్డి కానీ సోమవారంనాటి విచారణలో లేరు. మంగళవారం మంత్రి మల్లారెడ్డి తరఫున ఆయన ఆడిటర్‌తోపాటు మరికొంతమంది విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి సమాచారం వచ్చేవరకు వారిని ప్రశ్నించనున్నట్లు ఓ అధికారి వ్యాఖ్యానించారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాం: రాజశేఖర్ రెడ్డి, భద్రారెడ్డి ఆదాయపన్ను శాఖ అధికారులు ఇచ్చిన నోటీసుల మేరకు సోమవారం తాము, తమ సంస్థల డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు, అకౌంటెంట్లు విచారణకు హాజరైనట్లు మర్రి రాజశేఖర్‌రెడ్డి, భద్రారెడ్డి విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. సోదాల్లో స్వా«దీనం చేసుకున్న పలు పత్రాలకు సంబంధించి ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చామన్నారు. కాల్‌డేటాను ఓ క్రమపద్ధతిలో ఇవ్వాలని కోరగా సరేనని చెప్పామని భద్రారెడ్డి వివరించారు. కాగా, మరో పదిమందికి ఐటీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. చదవండి: టీఆర్ఎస్లో భగ్గుమన్న వర్గపోరు.. కన్నీటి పర్యంతమైన కార్పొరేటర్ -
మల్లారెడ్డి ఐటీ దర్యాప్తులో మొదటిరోజు ముగిసిన విచారణ
-
మల్లారెడ్డి కేసులో మొదటి రోజు ముగిసిన విచారణ.. కొడుకు, అల్లుడు ఏమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈ మధ్య కాలంలో జరిగిన ఈడీ, ఐటీ దాడులు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ దాడులు పొలిటికల్ హీట్‌ను పెంచాయి. కాగా, పెద్ద మొత్తంలో నగదు దొరకడంతో మల్లారెడ్డి సహా మరో 16 మందిని ఐటీ అధికారులు విచారిస్తున్నారు. ఇక, ఈ నేపథ్యంలో మల్లారెడ్డి ఐటీ దర్యాప్తులో మొదటిరోజు ఐటీ అధికారులు చేపట్టిన విచారణ ముగిసింది. ఐటీ అధికారులు మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిని విచారించారు. కాగా, విచారణ అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ.. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాము. ఈరోజు ఎవరికైతే నోటీసులు ఇచ్చారో వారు మాత్రమే విచారణకు హాజరయ్యారు. విచారణ కోసం కాలేజీల ప్రిన్స్‌పాల్స్, అకౌంటెంట్స్ అందరూ విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా వారికి తెలిసిన వివరాలను అధికారులకు సవివరంగా చెప్పారు. ఐటీ అధికారులు ఇచ్చిన డేట్స్ ప్రకారంగా విచారణకు ప్రతీ ఒక్కరూ వస్తారు. అధికారులు చెప్పిన ఫార్మాట్ ప్రకారం కాలేజీ డేటాను వారికి అందించాము. ఇక, మొదటి రోజు 12 మంది విచారణకు వచ్చినట్టు తెలుస్తోంది. -
నేడు ఐటీ అధికారుల ఎదుట హాజరుకానున్న మంత్రి మల్లారెడ్డి
-
ఐటీ దాడుల వేళ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మల్లారెడ్డి.. కేసీఆర్ రెస్పాన్స్?
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో తెలంగాణలో ఈడీ, ఐటీ దాడులు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పొలిటికల్ లీడర్లే లక్ష్యంగా ఈ దాడులు జరగడం రాజకీయంగా పెను దుమారం రేగింది. కాగా, మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ దాడుల సందర్భంగా కోట్ల రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పెద్ద డ్రామానే జరిగింది. అయితే, రాష్ట్రంలో ఐటీ దాడుల నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసే వార్తల్లో నిలిచారు. కాగా, మల్లారెడ్డి ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఐటీ దాడులు చేయించేది లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పన్ను మినహాయింపు ఇస్తాము. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ స్వచ్చందంగా పన్నులు చెల్లించేలా సీఎం కేసీఆర్ కొత్త చట్టాన్ని తీసుకువస్తారు. అప్పుడు పన్ను మినహాయింపులు ఇస్తాము. కేసీఆర్ నా వెంట ఉన్నంత వరకు నేను ఏ రైడ్లకు భయపడను’ అని కామెంట్స్ చేశారు. -
మల్లారెడ్డి వర్సెస్ ఐటీ శాఖ.. కంచికి చేరని ల్యాప్‌టాప్ కథ!
సాక్షి, హైదరాబాద్/దుండిగల్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి వర్సెస్ ఆదాయపు పన్ను శాఖ డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ ఎపిసోడ్లో బోయిన్పల్లి ఠాణాకు చేరిన ల్యాప్‌టాప్ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. గురువారం తెల్లవారుజామున నాటకీయ పరిణామాల మధ్య పోలీసుస్టేషన్ వద్ద లభించిన ల్యాప్‌టాప్‌ను పోలీసులు తమ అధీనంలోనే ఉంచుకున్నారు. అది రత్నాకర్దన్న ఉద్దేశంతో ఐటీ అధికారులకు చూపించినా వారు నోరు మెదపకపోవడంతో కోర్టు అనుమతితో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి (ఎఫ్ఎస్ఎల్) పంపాలని యోచిస్తున్నారు. మల్లారెడ్డి సహా ఆయన కుటుంబీకులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పంచనామాపై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డితో అధికారులు సంతకం చేయించుకోవడంతో వివాదం మొదలైంది. దీనిపై మల్లారెడ్డి గురువారం రాత్రి బోయిన్పల్లి ఠాణాలో రత్నాకర్‌పై ఫిర్యాదు చేశారు. రెండు గంటల తర్వాత రత్నాకర్ కూడా అదే పీఎస్‌లో మరో ఫిర్యాదు ఇచ్చారు. ఆస్ప త్రి వద్ద తనను అడ్డుకున్న మల్లారెడ్డి తదితరులు ల్యాప్‌టాప్ లాక్కున్నారని అందులో పేర్కొన్నారు. ఎఫ్ఎస్ఎల్కు పంపే యోచనలో పోలీసులు మల్లారెడ్డి, రత్నాకర్ ఫిర్యాదులతో నమోదైన కేసులను దుండిగల్ ఠాణాకు బదిలీ చేసినా ల్యాప్‌టాప్ మాత్రం బోయిన్పల్లి ఠాణాలోనే ఉండిపోయింది. అది ఐటీ అధికారి రత్నాకర్ వ్యక్తిగత ల్యాప్‌టాప్‌గా భావిస్తున్నప్పటికీ ఆయన సహా ఎవరూ ధ్రువీకరించట్లేదు. తొలుత అది ఎక్కడ నుంచి? ఎలా వచ్చిందో తేలిస్తేనే మిగతా విషయాలు చెప్తామంటూ ఐటీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. తామే ఆ ల్యాప్‌టాప్ ఆన్ చేసి ఎవరిదో చూద్దామని పోలీసులు మొదట భావించినా.. అలా చేస్తే డేటాకు సంబంధించిన వివాదం తలెత్తే ప్రమాదం ఉందని మిన్నకుండిపోయారు. ఈ నేపథ్యంలోనే కోర్టు అనుమతితో సదరు ల్యాప్‌టాప్‌ను ఎఫ్ఎస్ఎల్కు పంపి తెరిపించాలని యోచిస్తున్నారు. సమీప సీసీ కెమెరాల్లోని ఫీడ్‌ను పరిశీలిస్తున్నామని, కానీ ల్యాప్‌టాప్‌ను అక్కడ ఎవరు పెట్టారనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియట్లేదని బోయిన్పల్లి పోలీసులు చెప్పారు. కాగా, మంత్రి మల్లారెడ్డి, ఐటీ అధికారి రత్నాకర్ ఫిర్యాదులకు సంబంధించిన రెండు కేసులు దుండిగల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యాయి. దీంతో ఇక్కడ కేసులు నమోదు చేసిన దుండిగల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాత్రంతా నాటకీయ పరిణామాలు రెండు ఫిర్యాదులు పోలీసుల వద్ద ఉండగానే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అప్పటికే బోయిన్పల్లి ఠాణా కేంద్ర బలగాల అ«దీనంలోకి వెళ్లిపోయింది. ఆ సందర్భంలో కొందరు వ్యక్తులు కారులో వచ్చి ఓల్యాప్టాప్ను ఠాణాలో అప్పగించాలని చూశారు. అది సాధ్యం కాకపోవడంతో వాళ్లు వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత మరో యువకుడు ద్విచక్ర వాహనంపై తీసుకువచ్చాడు. అప్పటికే ఠాణా గేట్లకు తాళాలు పడ్డాయి. సదరు యువకుడు ల్యాప్‌టాప్‌ను పోలీసులకు ఇవ్వాలని ప్రయత్నించాడు. వారు విముఖత చూపడంతో గేటు వద్ద పెట్టేసి వెళ్లిపోయాడు. ఈ తతంగం మొత్తం ఐటీ అధికారులు తమ ఫోన్లలో రికార్డు చేశారు. రోడ్డుపై వదిలేసిన ల్యాప్‌టాప్‌ను ఠాణాలోకి తీసుకువెళ్లిన పోలీసులు దాన్ని ఐటీ అధికారులకు చూపించారు. అది ఎవరిదన్న విష యం పక్కన పెట్టాలని, అసలు ఠాణాకు ఎలా వచి్చందో తేల్చాలని ఐటీ అధికారులు పట్టుబట్టారు. దీంతో పంచనామా నిర్వహించిన పోలీ సులు ల్యాప్‌టాప్‌ను ఠాణాలో భద్రపరిచారు. ఇదీ చదవండి: ముందస్తు మేఘాలు! అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్ దృష్టి -
మల్లారెడ్డి కేసులో ట్విస్ట్.. హైకోర్టులో భద్రారెడ్డికి షాక్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఐటీ దాడుల వ్యవహారం హాట్ టాపిక్ మారింది. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో, బంధువుల ఇళ్లలో ఐటీ శాఖ అనూహ్య దాడులు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. కాగా, దాడుల సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐటీ అధికారులపై మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి చేసిన ఫిర్యాదుపై హైకోర్టు స్టే విధించింది. దీంతో, భద్రారెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఫిర్యాదుపై నాలుగు వారాల పాటు కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. -
Malla Reddy: మల్లారెడ్డి ఇంటిపై ఐడీ దాడుల్లో కొత్త ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, భాగస్వాములపై జరిగిన ఐటీ దాడుల అంశంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐటీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సీఎండీ రత్నాకర్ పంచనామాపై తన అన్న మహేందర్‌రెడ్డితో బలవంతంగా సంతకం పెట్టించుకున్నారంటూ మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రత్నాకర్ కూడా ఫిర్యాదు చేశారు. మంత్రి తన విధులు అడ్డుకోవడంతో పాటు కీలక పత్రాలు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకున్న బోయిన్పల్లి పోలీసులు తదుపరి దర్యాప్తు నిమిత్తం దుండిగల్ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశారు. నా అన్నను బెదిరించారు.. మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి ఐటీ సోదాల నేపథ్యంలో అస్వస్థతకు గురై మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాగా బుధవారం రాత్రితో మహేందర్‌రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు పూర్తి చేసిన అధికారులు దానికి సంబంధించిన పంచనామా రూపొందించారు. దీనిపై సంతకం చేయించుకోవడానికి డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ ఆస్పత్రికి వెళ్లారు. అయితే గుండె నొప్పితో చికిత్స పొందుతున్న తన అన్న మహేందర్‌రెడ్డిని బెదిరించి, బలవంతంగా వాటిపై సంతకాలు తీసుకున్నారంటూ మల్లారెడ్డి చిన్న కుమారుడు, సీఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, మల్లారెడ్డి సొసైటీల అధ్యక్షుడు భద్రారెడ్డి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు రత్నాకర్‌పై ఐపీసీలోని 384 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు రూ.100 కోట్ల డొనేషన్లకు సంబంధిత పత్రాలపై కూడా ఐటీ అధికారులు మహేందర్‌రెడ్డి సంతకాలు తీసుకున్నట్టు సమాచారం. కాగా తమ వద్ద రూ.100 కోట్లు లేవని, మేనేజ్మెంట్ కోటా లేనప్పుడు డొనేషన్ ఎలా ఇస్తారని మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. చదవండి: Hyderabad: ట్రాఫిక్ చిక్కులకు చెక్.. ఐటీ కారిడార్‌లో ఇక రయ్ రయ్! ల్యాప్‌టాప్, హార్డ్‌డ్రైవ్‌లు ఉన్న బ్యాగులు దొంగిలించారు.. ఇలావుండగా.. తాను పంచనామాపై సంతకం చేయించుకోవడానికి ఆస్పత్రికి వెళ్లినప్పుడు అక్కడకు తన అనుచరులతో కలిసి వచ్చిన మంత్రి మల్లారెడ్డి తన విధులకు ఆటంకం కలిగించారంటూ రత్నాకర్ గురువారం తెల్లవారుజామున 3.40 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంచనామా సహా కొన్ని పత్రాలు చించేశారని, అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు బెదిరించారని పేర్కొన్నారు. ల్యాప్‌టాప్, హార్డ్ డ్రైవ్స్‌తో ఉన్న తన రెండు బ్యాగులు కూడా దొంగిలించారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా బోయిన్పల్లి పోలీసులు మల్లారెడ్డి తదితరులపై ఐపీసీలోని 342, 353, 201, 504, 506, 379 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ రెండు ఉదంతాలు చోటు చేసుకున్న మల్లారెడ్డి ఆస్పత్రి దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలోకి వస్తుంది. దీంతో జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన అధికారులు తదుపరి దర్యాప్తు నిమిత్తం ఆ ఠాణాకు బదిలీ చేశారు. ఠాణా గేటు వద్ద ప్రత్యక్షమైన ల్యాప్‌టాప్! ఈ 2 కేసులు నమోదైన కొద్దిసేపటికే ఓ ల్యాప్‌టాప్ నాటకీయంగా బోయిన్పల్లి పోలీసుస్టేషన్ వద్ద ప్రత్యక్షమైంది. రత్నాకర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆయన ల్యాప్‌టాప్ సహా ఇతర వస్తువులు మల్లారెడ్డి ఇంట్లో ఉన్నాయా? ఎవరైనా తీసుకున్నారా? తదితర అంశాలు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతంలో ఓ ల్యాప్‌టాప్ బోయిన్పల్లి పోలీసుస్టేషన్ గేటు వద్ద ప్రహరీని ఆనుకుని ఉండటం కానిస్టేబుళ్ల కంటపడింది. దీంతో వారు దాన్ని రత్నాకర్‌కు చూపించగా.. ఆ ల్యాప్‌టాప్ తనది కాదని, దాన్ని ఎవరో మార్చేశారని అన్నారు. దీంతో దాని పంచనామా నిర్వహించిన సిబ్బంది దుండిగల్ పోలీసులకు అప్పగించాలని నిర్ణయించారు. -
‘ఐటీ’ టెన్షన్.. రహస్య ప్రాంతాలకు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కొన్ని ఇంజినీరింగ్ కాలేజీలకు ‘ఐటీ’ టెన్షన్ పట్టుకుంది. ఎప్పుడు ఏ కాలేజీపై ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్లు దాడి చేయనున్నారో తెలియక ఆందోళన చెందుతున్నారు. అధికార, ప్రతిపక్ష నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ జరుగుతుండటం, శివారు జిల్లాల్లోని మెజార్టీ కాలేజీలు రాజకీయ నేతలు, వారి బినామీలు, బంధువులకు సంబంధించినవే కావడం ఇందుకు కారణం. శివారులోని ఓ ప్రముఖ ప్రజాప్రతినిధి సమీప బంధువుకు సంబంధించిన పెట్టుబడులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ ప్రజాప్రతినిధి సహా బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు నిర్వహిస్తుండటం, వారు పెట్టుబడులు పెట్టిన కాలేజీలు, ఆస్పత్రులు, ఇతర సంస్థలపై దాడులు నిర్వహిస్తుండటంతో యాజమాన్యాలు సహా పరిపాలనా విభాగంలో పని చేస్తున్న ఉద్యోగులు ఐటీ పేరు చెబితేనే హడలెత్తిపోతుండటం గమనార్హం. మెజార్టీ కాలేజీలు వారివే.. రాష్ట్ర వ్యాప్తంగా 179 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా, వీటిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే 80కిపైగా ఉన్నట్లు అంచనా. మెజార్టీ కాలేజీలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, వారి బంధువులకు సంబంధించినవే. ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు, ఆస్పత్రులు, ఇతర విద్యా సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు బంధువులు వాటాదారులుగా ఉన్న ఇతర కాలేజీల్లోని లావాదేవీలపై కూడా ఐటీ దృష్టి సారించింది. ఐటీ దాడులతో ఆయా యాజమాన్యాలు అప్రమత్తమవుతున్నాయి. ఇన్‌కం ట్యాక్స్ అధికారులు కాలేజీలో అడుగు పెట్టక ముందే కీలక డాక్యుమెంట్లు, రికార్డులు, హార్డ్ డిస్కులను రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత రెండు రోజుల నుంచి ఆయా కాలేజీలు గుర్తింపు కార్డు ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు మినహా ఇతర వ్యక్తులను వీటి ప్రాంగణంలోకి అడుగుపెట్టనివ్వకపోవడం గమనార్హం. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు.. ఇంజినీరింగ్ విద్యకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తమ పిల్లలను క్యాంపస్ ప్లేస్మెంట్లు ఎక్కువగా ఉండే కాలేజీల్లో చదివించేందుకు తల్లిదండ్రులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లోని ఈ బలహీనతను యాజమాన్యాలు ఆసరాగా చేసుకుంటున్నాయి. ఎంసెట్, జేఈఈలలో ఉత్తమ ర్యాంకులు సాధించి కన్వీనర్ కోటాలో సీటు పొందిన విద్యార్థుల నుంచి కూడా ల్యాబ్, ప్రాక్టికల్స్, లైబ్రరీ, ఇతర ఫీజుల పేరుతో అధిక మొత్తంలో వసూలు చేస్తున్నాయి. విద్యార్థులు చెల్లించిన ఫీజులకు సంబంధించిన రసీదులు కూడా ఇవ్వడం లేదు. ఇక మేనేజ్మెంట్ కోటాలో ఉన్న సీట్లను ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకు పది రెట్లకు అదనంగా అమ్ముతున్నారు. వీరు ఫీజు చెల్లింపు సమయంలో బ్యాంకు చెక్కులు, ఏటీఎం, పేటీఎం సేవలను నిరాకరిస్తున్నారు. నగదు రూపంలోనే ఈ ఫీజులు వసూలు చేస్తున్నారు. తాజాగా శివారులోని ఓ ప్రముఖ కాలేజీ యాజమాన్యం సహా మేడ్చల్ జిల్లాలోని కాలేజీల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు వస్తున్నాయి. ఐటీ అధికారులు ఫోన్ చేసి ఆరా తీస్తే.. అడ్మిషన్ సమయంలో ఎలాంటి డొనేషన్లు చెల్లించలేదని చెప్పాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తుండటం గమనార్హం. ‘వర్ధమాన్’లో సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం శంషాబాద్ రూరల్: మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడుల్లో భాగంగా శంషాబాద్ మండలంలోని కాచారం సమీపంలో ఉన్న వర్ధమాన్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంత్రి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి వర్ధమాన్ కళాశాలకు వైస్ చైర్మన్‌గా ఉన్నారు. దీంతో ఈ కళాశాలలో గురువారం మధ్యాహ్నం వరకు ఐటీ అధికారులు సోదాలు జరిపారు. విద్యార్థులు, కళాశాల సిబ్బందిని మాత్రమే లోపలికి అనుమతించి ప్రత్యేక పహారాతో ఐటీ సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వా«దీనం చేసుకున్నట్లు తెలిసింది. -
మల్లారెడ్డిపై ఐటీ దాడులు.. ఆ లాకర్స్‌లో ఏమున్నాయి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, భాగస్వాములపై ఐటీ దాడులు రాజకీయంగా సంచలనంగా మారింది. దాడుల సందర్భంగా మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. సోదాల సమయంలో రూ.18.5 కోట్ల నగదు, 15 కిలోల బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. ఆస్తులకు సంబంధించి పలు కీలక పత్రాలు, భారీ ఎత్తున ప్రాపర్టీ పేపర్స్ స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని లాకర్లను ఐటీ శాఖ అధికారులు తెరవనున్నారు. ఇక, దాడుల నేపథ్యంలో తాజాగా మంత్రి మల్లారెడ్డితో పాటు 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. సోమవారం నుంచి విచారణకు హాజరు కావాలని ఐటీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. 28, 29 తేదీల్లో ఐటీ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేశారు. చదవండి: (IT Raids: మల్లారెడ్డికి మరో షాకిచ్చిన ఐటీ అధికారులు!) -
పంచనామాపై బలవంతంగా సంతకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, భాగస్వాములపై జరిగిన ఐటీ దాడుల అంశంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐటీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సీఎండీ రత్నాకర్ పంచనామాపై తన అన్న మహేందర్‌రెడ్డితో బలవంతంగా సంతకం పెట్టించుకున్నారంటూ మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రత్నాకర్ కూడా ఫిర్యాదు చేశారు. మంత్రి తన విధులు అడ్డుకోవడంతో పాటు కీలక పత్రాలు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకున్న బోయిన్పల్లి పోలీసులు తదుపరి దర్యాప్తు నిమిత్తం దుండిగల్ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశారు. నా అన్నను బెదిరించారు.. మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి ఐటీ సోదాల నేపథ్యంలో అస్వస్థతకు గురై మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాగా బుధవారం రాత్రితో మహేందర్‌రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు పూర్తి చేసిన అధికారులు దానికి సంబంధించిన పంచనామా రూపొందించారు. దీనిపై సంతకం చేయించుకోవడానికి డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ ఆస్పత్రికి వెళ్లారు. అయితే గుండె నొప్పితో చికిత్స పొందుతున్న తన అన్న మహేందర్‌రెడ్డిని బెదిరించి, బలవంతంగా వాటిపై సంతకాలు తీసుకున్నారంటూ మల్లారెడ్డి చిన్న కుమారుడు, సీఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, మల్లారెడ్డి సొసైటీల అధ్యక్షుడు «భద్రారెడ్డి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు రత్నాకర్‌పై ఐపీసీలోని 384 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు రూ.100 కోట్ల డొనేషన్లకు సంబంధిత పత్రాలపై కూడా ఐటీ అధికారులు మహేందర్‌రెడ్డి సంతకాలు తీసుకున్నట్టు సమాచారం. కాగా తమ వద్ద రూ.100 కోట్లు లేవని, మేనేజ్మెంట్ కోటా లేనప్పుడు డొనేషన్ ఎలా ఇస్తారని మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. ల్యాప్‌టాప్, హార్డ్‌డ్రైవ్‌లు ఉన్న బ్యాగులు దొంగిలించారు.. ఇలావుండగా.. తాను పంచనామాపై సంతకం చేయించుకోవడానికి ఆస్పత్రికి వెళ్లినప్పుడు అక్కడకు తన అనుచరులతో కలిసివచి్చన మంత్రి మల్లారెడ్డి తన విధులకు ఆటంకం కలిగించారంటూ రత్నాకర్ గురువారం తెల్లవారుజామున 3.40 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంచనామా సహా కొన్ని పత్రాలు చించేశారని, అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు బెదిరించారని పేర్కొన్నారు. ల్యాప్‌టాప్, హార్డ్ డ్రైవ్స్‌తో ఉన్న తన రెండు బ్యాగులు కూడా దొంగిలించారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా బోయిన్పల్లి పోలీసులు మల్లారెడ్డి తదితరులపై ఐపీసీలోని 342, 353, 201, 504, 506, 379 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ రెండు ఉదంతాలు చోటు చేసుకున్న మల్లారెడ్డి ఆస్పత్రి దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలోకి వస్తుంది. దీంతో జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన అధికారులు తదుపరి దర్యాప్తు నిమిత్తం ఆ ఠాణాకు బదిలీ చేశారు. ఠాణా గేటు వద్ద ప్రత్యక్షమైన ల్యాప్‌టాప్! ఈ 2 కేసులు నమోదైన కొద్దిసేపటికే ఓ ల్యాప్‌టాప్ నాటకీయంగా బోయిన్పల్లి పోలీసుస్టేషన్ వద్ద ప్రత్యక్షమైంది. రత్నాకర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆయన ల్యాప్‌టాప్ సహా ఇతర వస్తువులు మల్లారెడ్డి ఇంట్లో ఉన్నాయా? ఎవరైనా తీసుకున్నారా? తదితర అంశాలు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతంలో ఓ ల్యాప్‌టాప్ బోయిన్పల్లి పోలీసుస్టేషన్ గేటు వద్ద ప్రహరీని ఆనుకుని ఉండటం కానిస్టేబుళ్ల కంటపడింది. దీంతో వారు దాన్ని రత్నాకర్‌కు చూపించగా.. ఆ ల్యాప్‌టాప్ తనది కాదని, దాన్ని ఎవరో మార్చేశారని అన్నారు. దీంతో దాని పంచనామా నిర్వహించిన సిబ్బంది దుండిగల్ పోలీసులకు అప్పగించాలని నిర్ణయించారు. ఇదీ చదవండి: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. వెలుగులోకి రఘురామ కృష్ణరాజు పేరు -
IT Raids: మల్లారెడ్డికి మరో షాకిచ్చిన ఐటీ అధికారులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు రాజకీయంగా సంచలనంగా మారింది. కాగా, ఐటీ దాడుల సందర్భంగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి రైడ్‌ను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఇంతమంది సీఆర్పీఎఫ్ బలగాలను ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలన్నారు. మేము దొంగలమా? ఇంత అరాచకమా? అంటూ కామెంట్స్ చేశారు. ఇక, దాడుల నేపథ్యంలో తాజాగా మంత్రి మల్లారెడ్డితో పాటు 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. సోమవారం నుంచి విచారణకు హాజరు కావాలని ఐటీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. 28, 29 తేదీల్లో ఐటీ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేశారు. ఇక, నోటీసులు ఇచ్చిన వారిలో మల్లారెడ్డి సోదరులు, కుమారులు, అల్లుడు, సన్నిహితులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారు. మరోవైపు.. ఆస్తులు, ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు విచారణ చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే విద్యా సంస్థల్లో(ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ) డొనేషన్లపై ఐటీ అధికారులు ఆరా తీయనున్నారు. -
తెలంగాణ ఐటీ దాడులపై బండి సంజయ్ రియాక్షన్
-
ఐటీ దాడులు కొత్త కాదు.. అది తెలీకపోవడం విడ్డూరం: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: ప్రజలను దోచుకొని అడ్డంగా ఆస్తులు సంపాదిస్తే సోదాలు చేస్తారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఫిర్యాదులు వస్తే ఆధారాలతో వాటిపై స్పందించి తనిఖీలు చేయాల్సిన బాధ్యత సంబంధిత శాఖ, అధికారులపై ఉంటుందని తెలిపారు. తప్పులు చేయనప్పుడు సహకరించి నిజాయితీ నిరూపించుకోవచ్చన్నారు. అక్రమార్కులపై అధికారులు దాడులు జరిపినప్పుడు పార్టీలకనుగుణంగా మలుచుకొని మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. అధికారులకు పార్టీలతో సంబంధం ఉండదని.. ఇది కూడా తెలియకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. మేము సిద్ధం: లక్ష్మణ్ ఐటీ దాడులు కొత్త కాదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. తప్పు చేయనివాళ్లు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. దీన్ని రాజకీయానికి ముడిపెట్టి డైవర్ట్ చేయడం సరికాదన్నారు. రాజకీయంగా బీజేపీని ఎదుర్కోలేక కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాము రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఎవరో నలుగురు పేర్లను అడ్డంగా పెట్టుకొని కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ‘ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా అక్రమ సంపాదించిన వారు, పన్ను ఎగవేతదారులపై దాడి చేసి లెక్కలు బయటకు తీయడమే ఐటీ సంస్థల పని అన్నారు. ఏమి తప్పు చేయనివారు ఎందుకు భయపడటం?. ఐటీ సోదాల్లో నోట్ల కట్టలు వెలుగులోకి వస్తుంటే వాటికి లెక్కలు చూపించాల్సిన బాధ్యత మీపై ఉంది. కానీ రాజకీయ విమర్శలతో తప్పించుకోవాలని చూడటం సరికాదు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది’ అని లక్ష్మణ్ చెప్పారు. చదవండి: లిక్కర్ స్కామ్‌లో ల్యాప్‌టాప్ నివేదిక కీలకం.. మరో వారం కస్టడీ కోరిన ఈడీ -
మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్.. ఇలాంటి రైడ్స్ నా జీవితంలో చూడలేదు
సాక్షి, హైదరాబాద్: సోదాల సందర్భంగా విధులకు ఆటంకం కలిగించారన్న ఐటీ అధికారుల వ్యాఖ్యలపై తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తాను సంతకం చేసిన తర్వాతే అధికారులు బయటకు వెళ్లారని.. ఎవరి విధులకు అడ్డుపడలేదని చెప్పారు. వందకోట్లు బ్లాక్‌మనీ ఉన్నట్లు రాసి నా కొడుకుతో బలవంతంగా సంతకం చేయించారని ఆరోపించారు. కొడుకు సంతకం పెట్టిన ఫైల్స్ చూపించడం లేదన్నారు. ఇలాంటి రైడ్‌ను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఇంతమంది సీఆర్పీఎఫ్ బలగాలను ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలన్నారు. 'తప్పులు చూపిస్తే ఫైన్ కడతాం.. మేము దొంగలమా? ఇంత అరాచకమా?. నాకొడుకును ఆస్పత్రిలో చేర్చినట్లు కూడా మాకు చెప్పలేదు. ఇంకా చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలపై రైడ్స్ ఉంటాయి. ఎన్నిరైడ్స్ జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం' అని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మల్లారెడ్డిపై కేసు నమోదు అంతకుముందు, మల్లారెడ్డిపై బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఐటీ అధికారి ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్తో ఈ కేసును దుండిగల్ పీఎస్‌కు బదిలీ చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారని ఐటీ అధికారి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో 342, 353, 201, 203, 504, 506, 353, 379 రెడ్‌విత్ R/W 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐటీ అధికారులపై భద్రారెడ్డి ఫిర్యాదు ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో తమపై ఐటీ అధికారులు దౌర్జన్యం చేశారని పేర్కొన్నారు. దీంతో ఐటీ అధికారులపై 384 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. చదవండి: (మల్లారెడ్డిపై ఐటీ దాడులు: సంచలనం రేపుతున్న ‘రూ.100 కోట్లు’) -
ఐటీ అధికారులు చాలా అమానుషంగా సోదాలు చేశారు
-
కుట్రతోనే బీజేపీ దాడులు చేస్తోంది
-
ఏకధాటిగా ఐటీ దాడులు.. స్పందించిన మంత్రి మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బలగాలతో తమపై పెద్ద ఎత్తున దాడులు చేశారని మంత్రి మల్లారెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ కుట్రలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. తన పేరు ప్రతిష్టలు డ్యామేజ్ చేయాలనే దాడులు చేశారని ఆరోపించారు. తమనే కాదు, సీఎం కేసీఆర్‌ను కూడా ఏమీ చేయలేరని అన్నారు. ఈ విషయం కేసీఆరా్ ముందే చెప్పారన్నారు. తాము ఎంతో మంది పేద విద్యార్థులకు చదవు చెప్పించామని మల్లారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు తమపై మూడు సార్లు ఐటీ దాడులు జరిగాయని.. కానీ ఇంత దౌర్జన్యం జీవితంలో ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. ‘ఐటీ అధికారులు నమ్మించి మోసం చేశారు. బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. నా సంస్థలు ఓపెన్ బుక్.. నాది హై థింకింగ్, లో ప్రొఫైల్. కొడుకు, కోడలు ఆసుపత్రిలో ఉన్నారని చెప్పిన నన్ను విడిచిపెట్టలేదు. నా కొడుకుతో దౌర్జన్యంగా సంతకం చేయించుకున్నారు. రూ. 6లక్షలు దొరికితే అక్కడే విడిచిపెట్టిపోయారు. ఇప్పటి నుంచి విచారణకు రావాలని వేధిస్తారు. సంబంధిత వార్త: మల్లారెడ్డిపై ఐటీ దాడులు: సంచలనం రేపుతున్న ‘రూ.100 కోట్లు’ మెడికల్ సీట్లు అడ్మిషన్లలో అక్రమాలు జరిగాయంటున్నారు. మెడికల్ కాలేజీ డొనేషన్స్‌లో డబ్బులు గుంజుకున్నారని ఆరోపిస్తున్నారు. మెడికల్ సీట్లకు డొనేషన్ తీసుకోవట్లేదు. ఎంబీబీఎస్‌లో మెనేజ్మెంట్ కోటా లేదు. వివిధ క్యాటగిరీలతో అన్నీ కౌన్సిలింగ్ సీట్లే. అంతా ఆన్లైన్లోనే, కౌన్సిలింగ్‌లోనే జరుగుతుంది. మేనేజ్మెంట్ కోటా లేనప్పుడు డొనేషన్లు ఎలా వస్తాయి? వందల కోట్లు ఎలా వస్తాయి?. నా కొడుకు ఎంబీబీఎస్ చదవాలన్న డొనేషన్‌తో నా కాలేజీలో సీటు ఇప్పించలేను. మేము తీసుకుంటే డబ్బులు దొరకాలి కదా. మా ఇంట్లో, కొడుకులు, అల్లుడు, మా కళాశాల, ప్రొఫెసర్, టీచర్, క్లర్స్, ఇళ్లలో చేసిన సోదాలో 28 లక్షలు దొరికాయి’ అని తెలిపారు. చదవండి: మంత్రి మల్లారెడ్డికి ఐటీ నోటీసులు.. సోదాల్లో ఎంత నగదు దొరికిందంటే? -
మా ఇంట్లో ఎలక్ట్రానిక్ లాకర్లు లేవు : మర్రి రాజశేఖర్ రెడ్డి
-
మల్లారెడ్డి నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు