
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, భాగస్వాములపై ఐటీ దాడులు రాజకీయంగా సంచలనంగా మారింది. దాడుల సందర్భంగా మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.
సోదాల సమయంలో రూ.18.5 కోట్ల నగదు, 15 కిలోల బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. ఆస్తులకు సంబంధించి పలు కీలక పత్రాలు, భారీ ఎత్తున ప్రాపర్టీ పేపర్స్ స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని లాకర్లను ఐటీ శాఖ అధికారులు తెరవనున్నారు.
ఇక, దాడుల నేపథ్యంలో తాజాగా మంత్రి మల్లారెడ్డితో పాటు 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. సోమవారం నుంచి విచారణకు హాజరు కావాలని ఐటీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. 28, 29 తేదీల్లో ఐటీ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేశారు.
చదవండి: (IT Raids: మల్లారెడ్డికి మరో షాకిచ్చిన ఐటీ అధికారులు!)
Comments
Please login to add a commentAdd a comment