సాక్షి, హైదరాబాద్: కేంద్ర బలగాలతో తమపై పెద్ద ఎత్తున దాడులు చేశారని మంత్రి మల్లారెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ కుట్రలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. తన పేరు ప్రతిష్టలు డ్యామేజ్ చేయాలనే దాడులు చేశారని ఆరోపించారు. తమనే కాదు, సీఎం కేసీఆర్‌ను కూడా ఏమీ చేయలేరని అన్నారు. ఈ విషయం కేసీఆరా్ ముందే చెప్పారన్నారు. తాము ఎంతో మంది పేద విద్యార్థులకు చదవు చెప్పించామని మల్లారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు తమపై మూడు సార్లు ఐటీ దాడులు జరిగాయని.. కానీ ఇంత దౌర్జన్యం జీవితంలో ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు.
‘ఐటీ అధికారులు నమ్మించి మోసం చేశారు. బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. నా సంస్థలు ఓపెన్ బుక్.. నాది హై థింకింగ్, లో ప్రొఫైల్. కొడుకు, కోడలు ఆసుపత్రిలో ఉన్నారని చెప్పిన నన్ను విడిచిపెట్టలేదు. నా కొడుకుతో దౌర్జన్యంగా సంతకం చేయించుకున్నారు. రూ. 6లక్షలు దొరికితే అక్కడే విడిచిపెట్టిపోయారు. ఇప్పటి నుంచి విచారణకు రావాలని వేధిస్తారు.
సంబంధిత వార్త: మల్లారెడ్డిపై ఐటీ దాడులు: సంచలనం రేపుతున్న ‘రూ.100 కోట్లు’
మెడికల్ సీట్లు అడ్మిషన్లలో అక్రమాలు జరిగాయంటున్నారు. మెడికల్ కాలేజీ డొనేషన్స్‌లో డబ్బులు గుంజుకున్నారని ఆరోపిస్తున్నారు. మెడికల్ సీట్లకు డొనేషన్ తీసుకోవట్లేదు. ఎంబీబీఎస్‌లో మెనేజ్‌మెంట్ కోటా లేదు. వివిధ క్యాటగిరీలతో అన్నీ కౌన్సిలింగ్ సీట్లే. అంతా ఆన్‌లైన్‌లోనే, కౌన్సిలింగ్‌లోనే జరుగుతుంది. మేనేజ్‌మెంట్ కోటా లేనప్పుడు డొనేషన్లు ఎలా వస్తాయి? వందల కోట్లు ఎలా వస్తాయి?.
నా కొడుకు ఎంబీబీఎస్ చదవాలన్న డొనేషన్‌తో నా కాలేజీలో సీటు ఇప్పించలేను. మేము తీసుకుంటే డబ్బులు దొరకాలి కదా. మా ఇంట్లో, కొడుకులు, అల్లుడు, మా కళాశాల, ప్రొఫెసర్, టీచర్, క్లర్స్, ఇళ్లలో చేసిన సోదాలో 28 లక్షలు దొరికాయి’ అని తెలిపారు.
చదవండి: మంత్రి మల్లారెడ్డికి ఐటీ నోటీసులు.. సోదాల్లో ఎంత నగదు దొరికిందంటే?
Comments
Please login to add a commentAdd a comment