Rs 40 Crore Income Tax Refund Scam Busted in Hyderabad - Sakshi
Sakshi News home page

IT Scam Hyderabad:హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ కుంభకోణం

Published Thu, Jun 29 2023 2:33 PM | Last Updated on Thu, Jun 29 2023 2:57 PM

Huge IT Scam Came Out in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ స్కాం వెలుగులోకి వచ్చింది. రూ. 40 కోట్ల ఆదాయపుశాఖ పన్ను రీ ఫండ్‌ కుంభకోణాన్ని ఐటీ అధికారులు గురువారం బట్టబయలు చేశారు. ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ పొందేందుకు బోగస్ డాక్యుమెంట్లు, తప్పుడు కారణాలు చూపించినట్లు ఐటీ అధికారుల సోదాల్లో బయటపడింది. ఈ స్కాం వెనక 8 మంది ట్యాక్స్‌ కన్సల్టెంట్‌లతోపాటు, రైల్వే, పోలీస్‌శాఖలకు చెందిన పలువురు ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు అధికారులు తేల్చారు.

ఈ మేరకు హైదరాబాద్‌, విజయవాడలోని పలు ఐటీ కంపెనీల్లో అధికారులు సోదాలు జరిపారు. నిజాంపేట్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురంలోని ఐటీ కన్సల్టెంట్స్‌పై దాడులు చేపట్టారు.ఐటీ శాఖనే బురిడి కొట్టించిన కంపెనీలు, వ్యక్తులపై కేసులు నమోదు చేసేందుకు ఐటీ అధికారులు రంగం సిద్దం చేశారు. నోటీసులు జారీ చేసి విచారించనున్నారు. ఏజెంట్ల రీఫండ్‌ మొత్తంపై 10శాతం కమీషన్‌ కోసం ఐటీ కన్సల్టెంట్‌లు తప్పుడు రిటర్న్‌లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు.

2017లో ఇదే తరహా మోసాన్ని ఐటీ గుర్తించిన అధికారులు.. 200 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యుల్లో ఉన్న వైకల్యాలు, దీర్ఘకాలిక అనారోగ్యాల ద్వారా తప్పుడు రీఫండ్‌లను క్లెయిమ్ చేసినట్లు పేర్కొన్నారు. ఉద్యోగులకు అర్హత లేకపోయినా కన్సల్టెంట్‌లు బోగస్‌ డాక్యుమెంట్లతో మోసం చేసినట్లు గుర్తించారు.

చదవండి: సాయి చంద్‌ భార్యను ఓదార్చిన సీఎం కేసీఆర్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement