![Income-Tax dept searches Truecaller India offices](/styles/webp/s3/article_images/2024/11/8/truecaller.jpg.webp?itok=4JOPtq0t)
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కాలర్ ఐడీ ప్లాట్‌ఫాం ట్రూకాలర్ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్‌లో లొసుగులు, పన్ను ఎగవేతల ఆరోపణలకు సంబంధించి సమాచారాన్ని సమీకరించేందుకు, పత్రాలను పరిశీలించేందుకు సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు.
విచారణకు పూర్తిగా సహకారం అందిస్తున్నట్లు కంపెనీ వర్గాలు వివరించాయి. ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ విషయంలో అంతర్జాతీయంగా ఆమోదయోగ్యమైన విధానాలనే పాటిస్తున్నట్లు పేర్కొన్నాయి. స్వీడిష్ కంపెనీ అయిన ట్రూకాలర్‌కు భారత్‌లో ముంబై, గురుగ్రామ్, బెంగళూరులో కార్యాలయాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: అంబానీ, మిట్టల్‌లకు షాక్.. మస్క్ వైపే కేంద్రం మొగ్గు!
Comments
Please login to add a commentAdd a comment