Truecaller India
-
ట్రూకాలర్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు.. అసలేమైంది?
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కాలర్ ఐడీ ప్లాట్‌ఫాం ట్రూకాలర్ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్‌లో లొసుగులు, పన్ను ఎగవేతల ఆరోపణలకు సంబంధించి సమాచారాన్ని సమీకరించేందుకు, పత్రాలను పరిశీలించేందుకు సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు.విచారణకు పూర్తిగా సహకారం అందిస్తున్నట్లు కంపెనీ వర్గాలు వివరించాయి. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ విషయంలో అంతర్జాతీయంగా ఆమోదయోగ్యమైన విధానాలనే పాటిస్తున్నట్లు పేర్కొన్నాయి. స్వీడిష్ కంపెనీ అయిన ట్రూకాలర్‌కు భారత్‌లో ముంబై, గురుగ్రామ్, బెంగళూరులో కార్యాలయాలు ఉన్నాయి.ఇదీ చదవండి: అంబానీ, మిట్టల్‌లకు షాక్.. మస్క్ వైపే కేంద్రం మొగ్గు! -
వాట్సప్, టెలిగ్రామ్ బాటలోనే ట్రూకాలర్.. కొత్త ఫీచర్ ప్రారంభం
ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని నంబర్ల నుంచి ఏదైనా కాల్ వస్తే వెంటనే దానికి సంబంధించిన వివరాలు మొబైల్లో డిస్ప్లే అవ్వడానికి ట్రూకాలర్ వినియోగిస్తుంటారు. తన వినియోగదారులకు మరింత సేవలందించేందుకు ట్రూకాలర్ కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సప్‌వెబ్, టెలిగ్రామ్ వెబ్ మాదిరిగానే ‘ట్రూకాలర్ వెబ్’ వెర్షన్‌ను ప్రారంభించింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా కాంటాక్ట్‌లిస్ట్‌లో లేని మొబైల్ నంబర్‌ను డెస్క్‌టాప్/ ల్యాప్‌టాప్‌లోనూ సెర్చ్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. దాంతోపాటు ఎస్ఎంఎస్, ఛాట్ మిర్రరింగ్, కాల్నోటిఫికేషన్ ఫీచర్లు కూడా వెబ్ వెర్షన్లో అందుబాటులోకి వచ్చాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఒకసారి లింక్ చేసిన డివైజ్ డీలింక్ చేయకపోతే 30 రోజుల్లో ఆటోమెటిక్‌గా సైన్అవుట్ అవుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వినియోదారులకే అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: సెలబ్రిటీలు ఇన్వెస్ట్ చేసిన యూనికార్న్‌లు ఇవే.. ఎలా కనెక్ట్ చేయాలంటే.. డెస్క్‌టాప్/ ల్యాప్‌టాప్ బ్రౌజర్‌లోకి వెళ్లి వాట్సప్‌వెబ్, టెలిగ్రామ్ వెబ్ లాగే ట్రూకాలర్వెబ్ అని టైప్‌చేయాలి. లింక్డిబైజ్ ఆప్షన్‌పై క్లిక్ చేసిన వెంటన్ వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఏ మొబైల్ తరఫున లాగిన్ చేయాలో ఆ ఫోన్ ఆన్‌చేసి ట్రూకాలర్ యాప్‌లోకి వెళ్లాలి. అందులో మెసేజెస్ విభాగంలో త్రిడాట్ మెను ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. అందులో ‘ట్రూకాలర్ ఫర్ వెబ్’పై ప్రెస్ చేయాలి. లింక్ డివైజ్ అనే అప్షన్ కనిపిస్తుంది. దాని ద్వారా డెస్క్టాప్పై కనిపిస్తున్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. క్షణాల్లో ఫోన్ యాప్ డెస్క్‌టాప్ వెర్షన్‌తో లింక్ అవుతుంది. -
ట్రూకాలర్ నుంచి మరో కొత్త యాప్
న్యూఢిల్లీ: ట్రూకాలర్ అనే యాప్ మీకు తెలిసే ఉందిగా.. కొత్త నెంబర్ల నుంచి ఫోన్ చేసేవారిని గుర్తించడంతోపాటు, విసుగుపుట్టించే కాల్‌ను బ్లాక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆ యాప్ మరో ముందడుగు వేసి ఇప్పుడు స్టాక్ మెస్సేజింగ్ యాప్‌ను కూడా భారత్‌లో ప్రారంభించింది. దీని ద్వారా మెస్సేజ్ పంపించింది ఎవరో తెలుసుకోవచ్చు. దీని సహాయంతో ఇన్ బాక్స్‌లో ఉన్న ఫేక్ మెస్సేజ్‌లను స్పామ్‌లోకి పంపించే వీలుంటుంది. 'ట్రూకాలర్ యాప్ ప్రతినెల 900 మిలియన్ల ఫోన్ కాల్స్ గుర్తిస్తుంది. ఏడు కాల్స్‌లో ఒకటి స్పామ్‌లోకి పంపిస్తుంది. ఇదే సహాయాన్నిట్రూ మెస్సెంజర్ ద్వారా అందించాలనుకున్నాం. మరో రెండు మూడు వారాల్లో దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో అందుబాటులోకి వస్తుంది' అని ట్రూకాలర్ ఇండియా హెడ్ కారి కృష్ణమూర్తి తెలిపారు. ప్రస్తుతం ఇండియాలో ట్రూకాలర్‌ను 80 మిలియన్ల మంది ఉపయోగిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా 150 మంది ఉపయోగిస్తున్నారని చెప్పారు. భారత్‌లో తమ యాప్‌కు అత్యధిక ప్రాధాన్యత ఉందని, దానిని మరింత రెట్టింపు చేయాలని నిర్ణయించామని వివరించారు. ప్రస్తుతం ట్రూకాలర్ ఎయిర్ టెల్, టాటా డొకామో, జియోనీ, ఓబీఐ, సెల్కాన్, మైక్రోమాక్స్, మైక్రోసాఫ్ట్, సియానోజెన్వంటి కంపెనీలతో సంబంధాలు కలిగిఉంది. కొత్త యాప్ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లకు వర్తిస్తుంది.