ట్రూకాలర్ నుంచి మరో కొత్త యాప్
న్యూఢిల్లీ: ట్రూకాలర్ అనే యాప్ మీకు తెలిసే ఉందిగా.. కొత్త నెంబర్ల నుంచి ఫోన్ చేసేవారిని గుర్తించడంతోపాటు, విసుగుపుట్టించే కాల్ను బ్లాక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆ యాప్ మరో ముందడుగు వేసి ఇప్పుడు స్టాక్ మెస్సేజింగ్ యాప్ను కూడా భారత్లో ప్రారంభించింది. దీని ద్వారా మెస్సేజ్ పంపించింది ఎవరో తెలుసుకోవచ్చు. దీని సహాయంతో ఇన్ బాక్స్లో ఉన్న ఫేక్ మెస్సేజ్లను స్పామ్లోకి పంపించే వీలుంటుంది. 'ట్రూకాలర్ యాప్ ప్రతినెల 900 మిలియన్ల ఫోన్ కాల్స్ గుర్తిస్తుంది. ఏడు కాల్స్లో ఒకటి స్పామ్లోకి పంపిస్తుంది. ఇదే సహాయాన్నిట్రూ మెస్సెంజర్ ద్వారా అందించాలనుకున్నాం.
మరో రెండు మూడు వారాల్లో దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో అందుబాటులోకి వస్తుంది' అని ట్రూకాలర్ ఇండియా హెడ్ కారి కృష్ణమూర్తి తెలిపారు. ప్రస్తుతం ఇండియాలో ట్రూకాలర్ను 80 మిలియన్ల మంది ఉపయోగిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా 150 మంది ఉపయోగిస్తున్నారని చెప్పారు. భారత్లో తమ యాప్కు అత్యధిక ప్రాధాన్యత ఉందని, దానిని మరింత రెట్టింపు చేయాలని నిర్ణయించామని వివరించారు. ప్రస్తుతం ట్రూకాలర్ ఎయిర్ టెల్, టాటా డొకామో, జియోనీ, ఓబీఐ, సెల్కాన్, మైక్రోమాక్స్, మైక్రోసాఫ్ట్, సియానోజెన్వంటి కంపెనీలతో సంబంధాలు కలిగిఉంది. కొత్త యాప్ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లకు వర్తిస్తుంది.