Truecaller
-
వాట్సప్, టెలిగ్రామ్ బాటలోనే ట్రూకాలర్.. కొత్త ఫీచర్ ప్రారంభం
ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని నంబర్ల నుంచి ఏదైనా కాల్ వస్తే వెంటనే దానికి సంబంధించిన వివరాలు మొబైల్లో డిస్ప్లే అవ్వడానికి ట్రూకాలర్ వినియోగిస్తుంటారు. తన వినియోగదారులకు మరింత సేవలందించేందుకు ట్రూకాలర్ కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సప్‌వెబ్, టెలిగ్రామ్ వెబ్ మాదిరిగానే ‘ట్రూకాలర్ వెబ్’ వెర్షన్‌ను ప్రారంభించింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా కాంటాక్ట్‌లిస్ట్‌లో లేని మొబైల్ నంబర్‌ను డెస్క్‌టాప్/ ల్యాప్‌టాప్‌లోనూ సెర్చ్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. దాంతోపాటు ఎస్ఎంఎస్, ఛాట్ మిర్రరింగ్, కాల్నోటిఫికేషన్ ఫీచర్లు కూడా వెబ్ వెర్షన్లో అందుబాటులోకి వచ్చాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఒకసారి లింక్ చేసిన డివైజ్ డీలింక్ చేయకపోతే 30 రోజుల్లో ఆటోమెటిక్‌గా సైన్అవుట్ అవుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వినియోదారులకే అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: సెలబ్రిటీలు ఇన్వెస్ట్ చేసిన యూనికార్న్‌లు ఇవే.. ఎలా కనెక్ట్ చేయాలంటే.. డెస్క్‌టాప్/ ల్యాప్‌టాప్ బ్రౌజర్‌లోకి వెళ్లి వాట్సప్‌వెబ్, టెలిగ్రామ్ వెబ్ లాగే ట్రూకాలర్వెబ్ అని టైప్‌చేయాలి. లింక్డిబైజ్ ఆప్షన్‌పై క్లిక్ చేసిన వెంటన్ వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఏ మొబైల్ తరఫున లాగిన్ చేయాలో ఆ ఫోన్ ఆన్‌చేసి ట్రూకాలర్ యాప్‌లోకి వెళ్లాలి. అందులో మెసేజెస్ విభాగంలో త్రిడాట్ మెను ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. అందులో ‘ట్రూకాలర్ ఫర్ వెబ్’పై ప్రెస్ చేయాలి. లింక్ డివైజ్ అనే అప్షన్ కనిపిస్తుంది. దాని ద్వారా డెస్క్టాప్పై కనిపిస్తున్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. క్షణాల్లో ఫోన్ యాప్ డెస్క్‌టాప్ వెర్షన్‌తో లింక్ అవుతుంది. -
అప్పుడు నారాయణమూర్తి ఇలా సమాధానమిచ్చారు - ట్రూకాలర్ సీఈఓ
ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తిని ఎనిమిదేళ్ల క్రితం కలిసినట్లు, ఆ సమయంలో ఆయన చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ.. ట్రూకాలర్ సీఈఓ 'అలాన్ మామెడి' ట్వీట్ చేసాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. సుమారు ఎనిమిది సంవత్సరాల క్రితం మొదటిసారి నారాయణ మూర్తిని కలిసినప్పుడు అతడెవరో తనకు తెలియదని, నేనెవరో ఆయనకు తెలియదని వెల్లడించాడు. వారివురు మాట్లాడుకునే సమయంలో మీరు ఏమి చేస్తారని అడిగానని అలాన్ చెప్పాడు. దీనికి సమాధానంగా 'జీవితంలో నాకు అదృష్టం ఉండటం వల్ల ప్రజలకు తప్పకుండా కొంత సాయం చేయాలని నా భార్య ఎప్పుడూ నాతో చెబుతుంది, అదే చేస్తున్న అని చెప్పాడని ట్వీట్లో వెల్లడించాడు. వందలకోట్ల సంపద ఉన్నప్పటికీ నారాయణ మూర్తి చాలా వినయపూర్వకమైన వ్యక్తి అని అలాన్ మామెడి వెల్లడించాడు. ఇదీ చదవండి: కొత్త కారు కొనడానికి ఇదే మంచి సమయం - మునుపెన్నడూ లేనన్ని బెనిఫిట్స్ నిజానికి నేను (అలాన్ మామెడి) చదువుకునే రోజుల్లో మా ఇంట్లో కంప్యూటర్ బాగుచేయడానికి ఇన్ఫోసిస్ కంపెనీకి చెందిన ఒక వ్యక్తి వచ్చాడని.. అప్పుడే ఆ సంస్థలో ఉద్యోగం చేయాలనుకున్నట్లు వివరించాడు. కానీ జీవితం ఎలా ముందుకు సాగుతుందో తెలియదని ఇందులో ప్రస్తావించాడు. First time I met Narayana was almost 8 yrs ago. I did not know who he was and he didn't know what I did. After an inspiring hour of discussing everything about life, I asked him what he do and he said "My wife always told me that because I had luck in life, I must give back, and… https://t.co/7dVJupNmqI pic.twitter.com/KGljiEvW59 — Alan Mamedi (@AlanMamedi) November 3, 2023 -
ట్రూకాలర్‌లో అదిరిపోయే ఫీచర్..
స్మార్ట్ ఫోన్ కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ (Truecaller) కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత ఎస్సెమ్మెస్ రక్షణ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మోసపూరిత మెసేజ్‌లపై అవగాహన లేని యూజర్లకు ఈ రక్షణ ఫీచర్ ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. ట్రూకాలర్ అంచనా ప్రకారం 100 మిలియన్లకుపైగా యూజర్లు ఆ యాప్‌ని ఉపయోగిస్తున్నారు. వారు గత మూడు నెలల్లో కనీసం ఒక మోసపూరిత ఎస్సెమ్మెస్ అందుకున్నారు. ఈ మోసపూరిత ఎస్సెమ్మెస్‌లు ప్రధానంగా విద్యుత్ బిల్లు చెల్లింపులు, బ్యాంకులు, ఉద్యోగ ఆఫర్లు, కేవైసీ సంబంధిత, లోన్లు, ఛారిటీ, లాటరీ వంటి అంశాలకు సంబంధించినవి వస్తున్నాయి. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! ట్రూకాలర్ ప్రవేశపెట్టిన ఈ ఎస్సెమ్మెస్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ఫీచర్ ఫోన్లకు వచ్చే మోసపూరిత సందేశాలను తెలివిగా గుర్తించగలదు. యూజర్ రిపోర్ట్లు లేకుండానే ట్రూకాలర్స్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఫ్రాడ్ ఎస్సెమ్మెస్‌లను గుర్తిస్తుంది. కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే.. ట్రూకాలర్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ఫీచర్ ప్రస్తుతం భారతదేశంలోని ఆండ్రాయిడ్ వినియోగదారులందరికీ ఉచితంగా అందుబాటులో ఉంది. యూజర్ ఫోన్‌కు మోసపూరిత ఎస్సెమ్మెస్ వచ్చినప్పుడు కొత్త ఫీచర్ ఆధారంగా ట్రూకాలర్ యాప్ ఎరుపు రంగు నోటిఫికేషన్ చూపుతుంది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. ఈ నోటిఫికేషన్ మాన్యువల్‌గా తీసేసే వరకు స్క్రీన్‌పై ఉంటుంది. ఒకవేళ యాజర్ పొరపాటున ఆ ఫ్రాడ్ మెసేజ్‌ను ఓపెన్ చేసినా అందులోని లింక్‌లను ట్రూకాలర్ డిసేబుల్ చేస్తుంది. అయితే ఆ మెసేజ్ సురక్షితమే అని యూజర్ స్పష్టంగా గుర్తించినట్లయితే మాత్రమే ఆ ఎస్సెమ్మెస్‌ను యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇదీ చదవండి: దేశంలో తొలి లిథియం బ్యాటరీ ప్లాంటు షురూ -
భారత్‌లో ట్రూకాలర్ కార్యాలయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాలర్ ఐడీ వెరిఫికేషన్ ప్లాట్‌ఫామ్ ట్రూకాలర్ బెంగళూరులో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. స్వీడన్‌కు వెలుపల ప్రత్యేకంగా కేంద్రాన్ని నెలకొల్పడం ఇదే తొలిసారి అని కంపెనీ ప్రకటించింది. అలాగే సంస్థకు ఇది రెండవ అతిపెద్ద సెంటర్ కూడా. 30,443 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆఫీసులో 250 మంది సిబ్బంది వరకు పనిచేయడానికి ఏర్పాట్లు ఉన్నాయి. కొన్ని ఫీచర్లను తొలిసారిగా ఇక్కడి కస్టమర్లకు అందించడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు సేవలను విస్తరించడానికి ట్రూకాలర్ ఈ సౌకర్యాన్ని ప్రాథమిక కేంద్రంగా ఉపయోగించాలని యోచిస్తోంది. ట్రూకాలర్‌కు 33.8 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వీరిలో భారత్ నుంచి 24.6 కోట్ల మంది ఉండడం విశేషం. -
ట్రూ కాలర్ లో కొత్త ఫీచర్
-
మీరెవరో.. ట్రూకాలర్ ఇట్టే చేప్పేస్తుంది!
కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ మరో అదిరిపోయే ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఈ ఫీచర్ సాయంతో తాము గవర్నమెంట్ అధికారులమని, లేదంటే మంత్రి, ఎమ్మెల్యేలం’ అంటూ డబ్బులు వసూలు చేసే కేటుగాళ్ల ఆటకట్టిస్తున్నట్లు తెలిపింది. తాము తెచ్చిన ఈ గవర్నమెంట్ డిజిటల్ డైరెక్టరీ ఫీచర్‌తో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లను ఈజీగా గుర్తించవచ్చని ట్రూకాలర్ ప్రతినిధులు వెల్లడించారు. అంతేకాదు బాధితులు సమస్యల్ని నేరుగా అధికారులు, సంబంధిత ఎమ్మెల్యే, ఎంపీలతో చర్చించవచ్చని, ఇందుకోసం గవర్నమెంట్ డిజిటల్ డైరెక్టరీ ఫీచర్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, ప్రజా ప్రతినిధుల ఫోన్ నెంబర్లు ఉన్నాయని చెబుతోంది. తాము ప్రభుత్వ పెద్దలమని సామాన్యుల్ని మోసం చేసే వారిని గుర్తించే అవకాశం ఏర్పడుతుందని, తద్వారా మోసాల్ని అరికట్టవచ్చని ట్రూకాలర్ తెలిపింది. ఎవరైనా మోసం చేసేందుకు ప్రయత్నిస్తే వెంటనే ఆ సమాచారం గవర్నమెంట్ డిజిటల్ డైరెక్టరీలో సంబంధిత ఫోన్ వినియోగదారులకు సమాచారం వెళ్తుందని వెల్లడించింది. కాగా, ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. యూజర్లు తమ ఫోన్లలో ట్రూకాలర్ యాప్‌ను అప్డేట్ చేసి ఈ ఫీచర్‌ను పొందవచ్చు. -
గూగుల్ షాకింగ్ నిర్ణయం..ఇకపై ట్రూకాలర్‌లో ఈ ఫీచర్ పనిచేయదు..!
ఆండ్రాయిడ్ యూజర్లకు ప్రైవసీను దెబ్బతీస్తున్నాయనే కారణంతో థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్స్ యాప్స్‌ను నిషేధిస్తున్నట్లు గూగుల్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కొత్త రూల్‌ను తెరపైకి రావడంతో కాలర్ వేరిఫికేషన్ ప్లాట్‌ఫాం ట్రూకాలర్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ యాప్‌లో కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను అందించబోమని ట్రూకాలర్ ప్రకటించింది. ఈ ఫీచర్‌ను మే 11 నుంచి నిలిపివేస్తామని ట్రూకాలర్ పేర్కొంది. మే 11 నుంచి యాక్సెసిబిలిటీ ఏపీఐకి థర్డ్-పార్టీ అప్లికేషన్ల యాక్సెస్‌ని నియంత్రిస్తూ గూగుల్ ప్లే స్టోర్ పాలసీని అప్డేట్ చేసినట్లు గూగుల్ ప్రకటించిన వెంటనే ట్రూకాలర్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో థర్డ్ పార్టీ యాప్స్‌నుపయోగించి కాల్స్‌ను రికార్డింగ్ చేయలేరు. ట్రూకాలర్ యాప్ యూజర్లకు కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను అందరికీ ఉచితంగా అందిస్తోంది, గూగుల్ యాక్సెసిబిలిటీ ఏపీఐని ఉపయోగించి కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసింది. అయితే, గూగుల్ అప్డేట్ చేసిన డెవలపర్ ప్రోగ్రామ్ విధానాల ప్రకారం...ఇకపై కాల్ రికార్డింగ్‌ను అందించలేమని ట్రూకాలర్ పేర్కొంది. ఇదిలా ఉండగా స్మార్ట్‌ఫోన్స్‌లో ముందుగా ఇన్స్టాల్ చేసిన యాప్స్‌తో, గూగుల్ డయలర్‌తో ఫోన్ కాల్స్‌ను రికార్డ్ చేయవచ్చునని గూగుల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆండ్రాయిడ్ వినియోగదారులకు మరింత గోప్యతను అందించడానికి, కాల్ రికార్డింగ్ చట్టాలకు అనుగుణంగా గూగుల్ ఈ మార్పును తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు బిగ్ షాక్.. గూగుల్ కీలక నిర్ణయం -
ట్రూకాలర్‌తో తాన్లా జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సీపాస్ (కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫాం యాజ్ ఎ సర్వీస్) దిగ్గజం తాన్లా ప్లాట్‌ఫామ్స్ తాజాగా కాలర్ ఐడెంటిఫికేషన్ సేవల సంస్థ ట్రూకాలర్‌తో జట్టు కట్టింది. ట్రూకాలర్ బిజినెస్ మెసేజింగ్‌కు తమ వైజ్లీ సీపాస్ ప్లాట్‌ఫామ్ సర్వీసులు అందించనుంది. బార్సెలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2022 సందర్భంగా ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకుంది. సాంప్రదాయ ఎస్ఎంఎస్ సర్వీసులకు భిన్నంగా సందేశాలను వేగవంతంగా, చౌకగా డెలివరీ చేసేందుకు ఇది తోడ్పడుతుంది. వ్యాపార సంస్థలు తమ యూజర్లకు వ్యక్తిగతీకరించిన సందర్భోచిత సందేశాలను సురక్షితంగా అందించడానికి ఈ భాగస్వామ్యం ఉపయోగపడగలదని తాన్లా ప్లాట్‌ఫామ్స్ చైర్మన్ ఉదయ్ రెడ్డి తెలిపారు. దీనితో వ్యాపార సంస్థలకు సరళమైన, సమర్థమంతమైన కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌ను అందించగలమని ట్రూకాలర్ సహ వ్యవస్థాపకుడు నామి జారింగ్హాలెమ్ తెలిపారు. -
20 కోట్ల సార్లు కాల్స్..! 6 లక్షల 64 వేల మందికి నరకం చూపించిన ఒకే ఒక్క నెంబర్..!
సుమారు 20.2 కోట్ల సార్లు కాల్స్..అందులో 6 లక్షల 64 వేల మంది బాధితులకు నరకం చూపించిన ఒకే ఒక్క నెంబర్ అది కూడా స్పామ్ కాల్(అవాంఛనీయ కాల్స్) అని స్టాక్‌హోమ్ ఆధారిత కాలర్ వెరిఫికేషన్ ప్లాట్‌ఫారమ్ ట్రూకాలర్ పేర్కొంది. స్పామ్ కాల్స్ వివరాలపై ట్రూకాలర్ ఒక కొత్త నివేదికను విడుదల చేసింది. వార్షిక గ్లోబల్ స్పామ్ నివేదికలో పలు విషయాలును ట్రూకాలర్ బహిర్గతం చేసింది. ట్రూకాలర్ తన నివేదికలో వెల్లడించిన విషయాలు...! ►భారత్‌లో ఒక స్పామర్ సుమారు 202 మిలియన్లకు పైగా స్పామ్ కాల్లు చేసినట్లు కాలర్-ఐడెంటిఫికేషన్ సర్వీస్ ట్రూకాలర్ షేర్ చేసింది. ప్రతి గంటకు 27 వేల మందిని మొబైల్ వినియోగదారులకు చుక్కలు చూపించిందని ట్రూకాలర్ వెల్లడించింది. ►ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 2021 వరకు యూజర్లు స్పామ్ కాల్ డేటాను ట్రూకాలర్ రిలీజ్ చేసింది. ►భారత్‌లో స్పామ్ కాల్స్ విపరీతంగా పెరిగాయని ట్రూకాలర్ నివేదిక హైలైట్ చేసింది. ►ప్రపంచంలో అత్యధికంగా స్పామ్ కాల్స్‌ను ఎదుర్కొన దేశాల్లో భారత్ 4 వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 9 వ స్థానంలో నిలవడం గమనర్హం. బ్రెజిల్ అగ్రస్థానంలో నిలవగా..పెరూ రెండో స్థానంలో ఉంది. ►భారత్‌లోని మొబైల్ యూజర్లకు సరాసరి నెలకు వచ్చే స్పామ్ కాల్స్ సంఖ్య 16.8గా ఉంది. ►స్పామ్ కాల్స్‌లో పూర్తిగా 93 శాతానికి పైగా అమ్మకాలు లేదా టెలిమార్కెటింగ్ కోసం చేసినవేనని ట్రూకాలర్ నివేదిక పేర్కొంది. ►అక్టోబర్ నాటికి 37.8 బిలియన్ స్పామ్ కాల్స్‌ను బ్లాక్ చేయగా..182 బిలియన్ సందేశాలను బ్లాక్ చేసిందని ట్రూకాలర్ వెల్లడించింది. ►భారత్‌లో ఎక్కువగా కేవైసీ, ఓటీపీ వివరాలను చెప్పాలంటూ వచ్చే కాల్స్ ఎక్కువ స్పామ్ కాల్స్‌గా ఉన్నాయి. చదవండి: యూజర్ల డేటాను ఇతర సంస్థలకు అందిస్తోన్న ట్రూకాలర్..! -
జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న ట్రూకాలర్..!
స్టాక్‌హోమ్ ఆధారిత కాలర్ వెరిఫికేషన్ ప్లాట్‌ఫారమ్ ట్రూకాలర్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 మిలియన్ల యూజర్లను ట్రూకాలర్ సొంతం చేసుకుంది. ఒక్క భారత్‌లోనే ఏకంగా 220 మిలియన్ల యూజర్లు ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు సుమారు 50 మిలియన్ల కొత్త యూజర్లు ట్రూకాలర్‌లో చేరారు. చదవండి: కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోన్న ట్రూకాలర్..! 11 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ట్రూకాలర్ యాప్ బహుళ భాషలకు మద్దతునిస్తూ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. సుమారు 220 మిలియన్ల యూజర్లతో భారత్ ట్రూకాలర్ అతి పెద్దమార్కెట్‌గా నిలుస్తోంది. కాల్ ఐడెంటిఫికేషన్, స్పామ్ బ్లాకింగ్ ప్రధాన లక్షణాలతో పాటు ట్రూకాలర్ స్మార్ట్ ఎస్ఎమ్ఎస్, ఇన్‌బాక్స్ క్లీనర్, ఫుల్-స్క్రీన్ కాలర్ ఐడీ, గ్రూప్ వాయిస్ కాలింగ్ ఇతర ఫీచర్లను యూజర్లకు ట్రూకాలర్ అందిస్తోంది. ట్రూకాలర్ 300 మిలియన్ల యూజర్ల మైలురాయిపై ట్రూకాలర్ సీఈవో, సహా వ్యవస్థాపకుడు అలాన్ మామెడి మాట్లాడుతూ...చిన్న ప్లాట్పాంగా మొదలై 300 మిలియన్ల ఆక్టివ్ యూజర్లను ట్రూకాలర్ సొంతం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ మైలురాయిని చేరుకోవడానికి కృషి చేసిన వారికి ధన్యవాదాలను తెలిపారు. చదవండి: భారతీయ రైల్వేతో జట్టుకట్టిన ట్రూకాలర్..! ఎందుకంటే.? -
భారతీయ రైల్వేతో జట్టుకట్టిన ట్రూకాలర్..! ఎందుకంటే.?
ప్రముఖ కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ గురువారం రోజున ఇండియన్ రైల్వేస్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. రైల్వే ప్రయాణీకులకు కమ్యూనికేషన్ విషయంలో మరింత నమ్మకాన్ని అందించడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని ట్రూకాలర్ పేర్కొంది. రైల్వే ప్రయాణికుల కోసం 139 హెల్ప్‌లైన్ నంబర్‌ను ఐఆర్సీటీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ట్రూకాలర్ యాప్‌తో కుదుర్చుకున్న ఒప్పందంతో 139 హెల్ప్‌లైన్ నంబర్‌కు యూజర్లు కాల్ చేసేటప్పడు గ్రీన్ వెరిఫైడ్ బిజినెస్ బ్యాడ్జ్ లోగో ఇకపై కన్పించనుంది. చదవండి: గూగుల్ ప్లే స్టోర్‌లో అలజడి..! భారీగా నిషేధం..! రైల్వే ప్రయాణికులు పలు గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే ఎస్ఎమ్ఎస్లకు చెక్ పెట్టే అవకాశం ఉన్నట్లు ట్రూకాలర్ పేర్కొంది. ఐఆర్సీటీసీ నుంచి సమాచారాన్ని ట్రూకాలర్ యాప్ గుర్తించి ధృవీకరించబడిన ఎస్ఎమ్ఎస్ అంటూ ట్రూకాలర్ యూజర్లకు నోటిఫికేషన్ ఇస్తుంది. అంతేకాకుండా సురక్షితమైన కస్టమర్ అనుభవాన్ని ట్రూకాలర్ అందిస్తోంది. ట్రూకాలర్ యాప్‌లో 139 హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఇండియన్ రైల్వే లోగో కన్పించనుంది. ట్రూకాలర్ భాగస్వామ్యంపై ఐఆర్సీటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రజనీ హసిజా మాట్లాడుతూ..రైల్వే ప్రయాణికులకు పటిష్టమైన, విశ్వసనీయమైన సమాచారాన్ని అందించడంలో ట్రూకాలర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పలు మోసపూరిత మెసేజ్లనుంచి ప్రయాణికులకు ఊరట లభిస్తోందని పేర్కొన్నారు. చదవండి: మీదే ఆలస్యం.. ఐటీ కంపెనీల్లో లక్ష పైగా ఉద్యోగాలు రెడీగా ఉన్నాయ్ -
కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోన్న ట్రూకాలర్..!
స్టాక్‌హోమ్: స్వీడిష్ కాలర్ ఐడెంటిఫికేషన్ సర్వీస్ మరో కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీకి చెందిన క్లాస్ బీ షేర్లను నాస్డాక్ స్టాక్‌హోమ్‌లో లిస్ట్ చేయడానికి ప్లాన్ వేస్తోంది. మార్కెట్ పరిస్థితులను బట్టి ట్రూకాలర్ లిస్టింగ్ 2021 నాల్గో త్రైమాసికంలో పూర్తవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఐపీవోలో భాగంగా 116 మిలియన్ డాలర్లను సేకరించాలని కంపెనీ యోచిస్తోంది. చదవండి: Jeff Bezos:జెఫ్‌బెజోస్ దెబ్బకు దిగివచ్చిన నాసా..! ట్రూకాలర్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలాన్ మామెడి మాట్లాడుతూ...కనీసం రెండు సంవత్సరాల పాటు ఐపీవోపై ట్రూకాలర్ పనిచేస్తోందని వెల్లడించారు. సీక్వోయా క్యాపిటల్ , అటామికో కంపెనీలు ట్రూకాలర్ ఇన్వెస్టర్లుగా నిలిచాయి. ఒక నివేదిక ప్రకారం ట్రూకాలర్ సుమారు 95 మిలియన్ డాలర్లను సేకరించింది. గత ఆరు సంవత్సరాల నుంచి పలు ఇన్వెస్టర్ల నుంచి 100 మిలియన్ డాలర్లను సేకరించడంతో ట్రూకాలర్ విలువ ఒక బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 278 మిలియన్ల ఆక్టివ్ యూజర్లు ట్రూకాలర్ సొంతం. ఇటీవలి కాలంలో ఆపిల్, గూగుల్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో కాలర్ ఐడి ఫీచర్‌ను మెరుగుపరిచినప్పటికీ, స్పామ్ కాల్‌లను అరికట్టడానికి అనేక ఇతర చర్యలు తీసుకున్నప్పటికీ, ట్రూకాలర్ వాటిని పరిష్కరించలేకపోయింది. భారత్‌ను అతి పెద్ద మార్కెట్‌గా ట్రూకాలర్ పరిగణిస్తోంది. చదవండి: MediaTek : భారీ రిక్రూట్మెంట్కు ప్లాన్ చేస్తోన్న మీడియాటెక్..! -
Truecaller: ట్రూకాలర్ యూజర్లకు అలర్ట్..!
ముంబై: ట్రూకాలర్ మొబైల్ అప్లికేషన్ దేశంలోని చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించి యూజర్ డేటాను ఇతర సంస్థలో పంచుకుందని పేర్కొంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై బాంబే హైకోర్టు బుధవారం కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. శశాంక్ అనే వ్యక్తి దాఖలు చేసిన వ్యాజ్యంలో..ట్రూకాలర్ యాప్ వినియోగదారులందరి డేటాను సేకరించి, వారి అనుమతి లేకుండా ఇతర భాగస్వాములతో వినియోగదారుల డేటాను పంచుకుంటుందని పేర్కొన్నాడు. ఈ వ్యాజ్యాన్ని ఛీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జీ ఎస్ కులకర్ణితో కూడిన బాంబే హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. యూజర్ల డేటా వారికి తెలియకుండా.. యూజర్లకు వేరే యాప్ అందుబాటులో లేకపోవడంతో ట్రూకాలర్ ఆటలు సాగుతున్నాయని పేర్కొన్నాడు. ట్రూకాలర్ యూజర్ల డేటాను వారికి తెలియకుండా గూగుల్ ఇండియా, భారతి ఎయిర్ టెల్, ఐసిఐసిఐ బ్యాంక్, అనేక రుణాలు అందించే సంస్థలకు అందిస్తున్నాయని పిటిషనర్ కోర్టుకు తెలిపాడు. ఈ కేసులో కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలను, రాష్ట్ర ఐటి విభాగం, ట్రూకాలర్ ఇంటర్నేషనల్ ఎల్ఎల్పి, ఐసిఐసిఐ బ్యాంక్, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్‌ను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్ పేర్కొన్నాడు. ట్రూకాలర్ యాప్ యూజర్ల అనుమతి లేకుండానే యూపిఐ సేవలను అందిస్తోందని పిటిషనర్ ఆరోపించారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం..! ప్రభుత్వ అధికారులు ట్రూకాలర్ యాప్‌ను సరైన తనిఖీలు లేకుండా ఆమోదించారని ఆరోపించారు. ట్రూకాలర్ తన మొబైల్ అప్లికేషన్ ద్వారా పౌరుల డేటా గోప్యతను పూర్తిగా ఉల్లంఘించిందని కోర్టుకు విన్నవించాడు. అంతేకాకుంగా యాప్ డేటా రక్షణ చట్టాలను పూర్తిగా అతిక్రమిస్తోందని పేర్కొన్నాడు. హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చుతూ నోటీసులు జారీ చేసింది. నోటీసులకు మూడువారాల్లోపు సమాధానమివ్వాలని సూచించింది. -
ట్రూకాలర్‌కి పోటీగా గూగుల్ యాప్
ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యూజర్స్ ఎక్కువగా వినియోగించే యాప్స్ లో ట్రూకాలర్ యాప్ ఒకటి. దీని సహాయంతో ఎవరైనా తెలియని నెంబర్ నుండి ఫోన్ వస్తే మనకు వెంటనే తెలిసిపోతుంది. అలాగే, ఏవైనా స్పామ్ కాల్స్ వస్తే వెంటనే బ్లాక్ చేసే సదుపాయం కూడా ఉంది. అయితే ఇది థర్డ్ పార్టీ యాప్ కావడంతో వినియోగదారుల భద్రతపై చాలా అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి అనుమానాలకు చెక్ పెడుతూ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ట్రూకాలర్ తరహా ఫీచర్స్‌తో తన ఫోన్ యాప్‌లో మార్పులు చేస్తుందట. ఈ యాప్ ని గూగుల్ కాల్ పేరుతో దీనిని పిలుస్తున్నారు.(చదవండి: ఐఐటి గువహతి పరిశోధకుల అద్భుత ఆవిష్కరణ) ఈ క్రొత్త యాప్ గురించి యూట్యూబ్ లో ఒక ప్రకటన కూడా వచ్చింది. ప్రస్తుతానికి గూగుల్ ప్లే స్టోర్ లో ఇంకా అందుబాటులో లేనప్పటికి త్వరలో అధికారికంగా తీసుకురానున్నట్లు సమాచారం. యూట్యూబ్ లో వచ్చిన ప్రకటనలో గూగుల్ కాల్ యాప్ పేరు, లోగోను వెల్లడించింది. గూగుల్ రీ-బ్రాండెడ్ ఫోన్ యాప్ ట్రూకాలర్ యాప్ వినియోగదారులను ఆకర్షించగలదా లేదా అనేది చూడాలి. ఈ గూగుల్ కాల్ స్పామ్ కాల్స్ నుండి రక్షణను అందిస్తుంది. అలానే యాప్‌లో కొత్తగా కాలర్ ఐడీ ఫీచర్‌ను జోడించారు. దాంతో కాల్ వచ్చినప్పుడు కాలర్ పేరు, ఫోన్ నంబర్ చదివి వినిపిస్తుంది. దాంతో పాటు 30 రోజుల తర్వాత పాత కాల్ స్క్రీన్ రికార్డింగ్‌లు వాటంతటవే డిలీట్ అయ్యే ఫీచర్‌ను కూడా తీసుకొచ్చారు. తాజాగా ఫోన్ యాప్ పేరు మార్చి కొత్త ఫీచర్స్‌తో కాల్ యాప్‌తో యూజర్స్‌కి మరిన్ని మెరుగైన సేవలు అందించాలని గూగుల్ భావిస్తోంది. ప్రస్తుతం బీటా వినియోగదారులకు గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. -
'మా యాప్‌ను నిషేధించడం అన్యాయం'
స్టాక్‌హోమ్ : ప్రపంచవ్యాప్తంగా ట్రూకాలర్ యాప్ ఎంతో ఫేమస్. మొబైల్‌కు వచ్చే గుర్తుతెలియని నెంబర్ల వివరాలు తెలుపడం ఈ యాప్ ప్రత్యేకత. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ట్రూకాలర్ .. కాలర్ ఐడీ.. స్పామ్ డిటెక్షన్, మెసేజింగ్, ఇతర డయలర్ సేవలను అందిస్తున్నది. తాజాగా చైనాతో సరిహద్దు వివాదం తర్వాత 89 రకాల సోషల్ మీడియా యాప్‌లను బ్యాన్ చేయాలని భారత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. వాటిలో ట్రూకాలర్ యాప్ కూడా ఒకటి. దీనిపై ట్రూ కాలర్ యాప్ యాజమన్యం గురువారం స్పందిస్తూ .. మా యాప్‌ను నిషేధించడం అన్యాయం అని పేర్కొంది. కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ ను నిషేధిత దరఖాస్తుల జాబితాలో చేర్చడంపై ఆ సంస్థ తీవ్ర విచారం వ్యక్తంచేసింది. ఈ జాబితాలో ఇప్పటికే ప్రభుత్వం నిషేధించిన టిక్‌టాక్ వంటి చైనీస్ యాప్ లు మాత్రమే కాకుండా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్, జూమ్, రెడ్డిట్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఉన్నాయి. జాతీయ భద్రతా సమస్యలపై ఈ యాప్‌లను తొలగించాలని భారత సైన్యం తన సిబ్బందికి సూచించింది. 'తమ సిబ్బంది కోసం భారత ఆర్మీ నిషేధించిన 89 యాప్ ల జాబితాలో ట్రూకాలర్ ఉన్నదని తెలుసుకుని నిరాశకు గురయ్యాం. ఇది చాలా అన్యాయం. ట్రూకాలర్ అనేది స్వీడన్ కేంద్రంగా పని చేస్తున్న యాప్.ట్రూకాలర్ యాప్ ను నిషేధిత యాప్ ల జాబితాలో ఉంచాడానికి ఎలాంటి కారణాలు లేవు. ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తాం. ట్రూకాలర్ ఇండియాలో 170 మిలియన్లకు పైగా ప్రజలకు కీలకమైన సేవలను అందిస్తున్నది. నిత్యం వందల మిలియన్ల స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్లను గుర్తించి బ్లాక్ చేస్తుంది' అని ట్రూకాలర్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. -
ఆఫీసర్ @ ట్రూ కాలర్
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇప్పిస్తానంటూ ఎర వేసి అనేక మంది నిరుపేదల్ని నిండా ముంచిన వై.రాకేష్ యాదవ్ ‘సాంకేతిక పరిజ్ఞానాన్నీ’ వినియోగించుకున్నాడు. ట్రూ కాలర్ యాప్‌లో తన నెంబర్‌ను కలెక్టరేట్లో అధికారి అంటూ నమోదు చేసుకున్నాడు. దీని ఆధారంగానే బాధితులకు కాల్స్ చేస్తూ వారిని నమ్మించి నిండా ముంచాడు. 17 మంది నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసి మోసం చేసిన రాకేష్ యాదవ్‌ను ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం విదితమే. ఇతడి విచారణలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఉప్పుగూడలోని కందిగల్గేట్ ప్రాంతానికి చెందిన వై.రాకేష్ యాదవ్ పదో తరగతి వరకు చదివి స్థానికంగా ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవాడు. ఇతడి తండ్రి వై.అంజయ్య రేషన్ కార్డులు ఇప్పించడానికి దళారిగా వ్యవహరించాడు. (‘జేసీ బ్రదర్స్’ బాగోతం.. బిగుస్తున్న ఉచ్చు ) ఆయన ద్వారానే ప్రభుత్వ కార్యాలయాల పని తీరుపై రాకేష్‌కు అవగాహన వచ్చింది. ఇటీవల కాలంలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు భారీగా డిమాండ్ పెరిగిందని రాకేష్ తెలుసుకున్నాడు. దీంతో తానే ఓ ప్రభుత్వ అధికారిగా చెప్పుకుంటూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిని గుర్తించడం మొదలెట్టాడు. ఇలా చేయడానికి ముందు తన స్మార్ట్ ఫోన్లో ట్రూ కాలర్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. అందులో తన నెంబర్‌ను ‘ఆఫీసర్ రంగారెడ్డి కలెక్టరేట్’ అంటూ సేవ్ చేసుకున్నాడు. దీంతో ఈ నెంబర్ నుంచి ఎవరికైనా కాల్స్ చేసినప్పుడు ఆ పేరునే ట్రూ కాలర్ చూపేది. దీంతో శ్రీనివాస్‌గా చెప్పుకున్న రాకేష్ కలెక్టరేట్ అధికారి అని తేలిగ్గా నమ్మేవాళ్ళు. దరఖాస్తుదారులకు పూర్తి నమ్మకం కలగడానికి వారి నుంచి దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, పాస్‌పోర్టు ఫొటోలను సంగ్రహించేవాడు. ముందుగా డీడీ కట్టాలంటూ రూ.40 వేల వరకు అడ్వాన్సుగానూ తీసుకునేవాడు. ఆపై తన ఫోన్లో సేవ్ చేసి ఉండే ‘మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరైంది. మొదటి ఇన్స్టాల్మెంట్ రూ.40 వేలు అందింది. రెండోది చెల్లించండి’ అనే ఎస్సెమ్మెస్‌ను బాధితులకు చూపేవాడు. దీని ఆధారంగా మిగిలిన మొత్తం కూడా తీసుకుని మోసం చేసేవాడు. ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం రాకేష్ అబిడ్స్, గోషామహల్, కోఠి తదితర ప్రాంతాలకు చెందిన 17 మంది నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేశాడు. ఇతడిని అరెస్టు చేసే సమయానికి బ్యాంకు ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా లేదని అధికారులు చెప్తున్నాడు. దేవరయాంజాల్‌లో ఓ విల్లా అద్దెకు తీసుకుని ఉంటున్న రాకేష్ జల్సాలకు ఎక్కువగా ఖర్చులు చేశాడని వివరిస్తున్నారు. రాజకీయ నాయకుడి మాదిరిగా వైట్ అండ్ వైట్ ధరించడం, కార్లలో తిరగడం చేస్తూ డబ్బు ఖర్చు చేసినట్లు గుర్తించారు. ఇతడి గతం, తాజా వ్యవహారాలను ఆరా తీస్తున్న పోలీసులు విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. -
ట్రూకాలర్‌తో జాగ్రత్త..
ప్రపంచవ్యాప్తంగా ట్రూకాలర్ యాప్ ఎంతో ఫేమస్. మొబైల్‌కు వచ్చే గుర్తుతెలియని నెంబర్ల వివరాలు తెలుపడం ఈ యాప్ ప్రత్యేకత. అయితే, ట్రూకాలర్ యాప్‌తో యూజర్ ఖాతా వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశముందని తాజాగా తేలింది. ఈ మేరకు యాప్‌లోని ప్రధాన లోపాన్ని సెక్యూరిటీ పరిశోధకుడు ఎహరాజ్ అహ్మద్ కనుగొన్నారు. రద్దైన, పనిచేయని ఫోన్ నెంబర్ల ఆధారంగా కూడా ట్రూకాలర్‌లోని ఖాతాదారుల వివరాలు పసిగట్టవచ్చునని ఆయన గుర్తించారు. ఒకవేళ ట్రూకాలర్ ఖాతాను దుర్వినియోగపరుస్తే ట్రూకాలర్ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ నెంబర్ ‘ట్రూఎస్డీకే’ ద్వారా సైన్ చేసి తెలుసుకోవచ్చు. ప్రసిద్ది చెందిన షాప్‌క్లూస్, ఓయో, గ్రోఫర్స్ మింత్ర లాంటి ఆప్స్ ఈ సూత్రాన్నే పాటిస్తున్నాయి. అయితే, ట్రూకాలర్ నంబర్ వెరిఫికేషన్ సిస్టమ్‌లోకి సైబర్ అటాకర్లు లాగిన్ కావడానికి ఈ లోపం ఉపకరిస్తుందని, ఒకసారి ఎవరైనా అటాకర్ నెంబర్ వెరిఫికేషన్ సిస్టమ్ ద్వారా ట్రూకాలర్ ఖాతాదారుడి అకౌంట్లోకి లాగిన్ అయితే.. అతని వివరాలు, డాటా అటాకర్ల చేతిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుందని అహ్మద్ తెలిపారు. దీనిని ఒక వీడియో ద్వారా ఆయన సవివరంగా వివరించారు. ఇందులో ట్రూకాలర్ చాట్ నుంచి పనిచెయ్యని మొబైల్ నెంబర్‌కు మెసెజ్ పంపించారు . అది ఎయిర్టెల్ కస్టమర్ కేర్ సెంటర్దని తేలింది. ఈ మేరకు ట్రూకాలర్ ఖాతాల దుర్వినియోగంపై ఎయిర్టెల్, వోడాఫోన్ సంస్థలు స్పందిస్తూ అహ్మద్ ప్రయత్నం చాలా గొప్పదని, ఆయన కనిపెట్టిన లోపాలను గ్రహించామని తెలిపారు. అతనితో కలిసి పనిచేస్తామని సంస్థలు వెల్లడించాయి. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటామని పేర్కొన్నాయి. -
ట్రూకాలర్‌లో డీజీపీ అని పెట్టుకొని..
సాక్షి, హైదరాబాద్ : ట్రూకాలర్ ఈ స్మార్ట్ యాప్ గురించి తెలియని వారుండరు. మనకు తెలియని నంబర్ల నుంచి ఫోన్ వస్తే వారి పేరును తెలుసుకునేందుకు సహాయ పడుతుంది. ఈ యాప్ వాడే వ్యక్తులు తమ పేరును రిజిస్టర్ చేసుకుంటారు. అందరూ వాళ్ల అసులు పేరు లేకపోతే ముద్దుపేరు పెట్టుకుంటారు. కానీ తెలివిమీరిన ఓ వ్యక్తి పెట్టుకున్న పేరు, అతడు చేసిన మోసాలు కటకటాలపాలు చేసేలా చేశాయి. వివరాల్లోకి వెళ్తే.. చర్లపల్లి పారిశ్రామికవాడ, ఫేజ్–5లో బిట్ల వెంకటేశ్వరరావు అనే పారిశ్రామికవేత్తకు ఉజ్వల ఇండస్ట్రీస్ పేరిట పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమను 2017 డిసెంబరులో సికింద్రాబాద్‌కు చెందిన ఆర్ఈ కేబుల్స్ ప్రతినిధి హితేష్ జైన్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చాడు. కాగా కంపెనీ వ్యవహరాలన్నీ హితేష్ జైన్ తమ్ముడు జతిన్ జైన్ చూసుకునేవాడు. ఈ క్రమంలో గత మార్చి నుంచి ఇప్పటి వరకు కంపెనీకి సంబంధించి అద్దె, కరెంటు బిల్లులు చెల్లించడం లేదు. దీంతో పరిశ్రమ యజమాని వెంకటేశ్వరరావు జతిన్జైన్ను నిలదీశాడు. దీనిపై వివాదం ఏర్పడగా వెంకటేశ్వరరావు చర్లపల్లి అసోసియేషన్ ప్రతినిధులను ఆశ్రయించాడు. అసోసియేషన్ ప్రతినిధులు జతిన్ జైన్‌కు ఫోన్ చేశారు. వారికి కూడా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. నేనెవరో మీకు తెలుస్తుంది...ఒక్కసారి ట్రూ కాలర్ చెక్ చేసుకోండి అంటూ బెదిరింపు లకు పాల్పడుతూ ఫోన్ కట్ చేశాడు. తరువాత ట్రూకాలర్‌లో చూడగా డీజీపీ–టీఎస్ అని రావడంతో అసోసియేషన్ ప్రతినిధులు బాధితునితో కలిసి మంగళవారం డీజీపీని కలిశారు. వెంటనే స్పందించిన డీజీపీ, సీపీతో మాట్లాడారు. రంగంలోకి దిగిన కుషాయిగూడ పోలీసులు జతిన్జైన్ను అదుపులోకి తీసుకున్నారు. -
‘చెల్లింపు’ల్లోకి ట్రూకాలర్..!
(సాక్షి, బిజినెస్ విభాగం):అంతర్జాతీయ డిజిటల్ టెలిఫోన్ డైరెక్టరీగా ఎదుగుతున్న ‘ట్రూ కాలర్’... రెవెన్యూ ఆర్జించటంపై దృష్టిపెట్టింది. ఇందుకోసం అంతర్జాతీయంగా తనకు అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్‌లో చెల్లింపుల విభాగంలోకి ప్రవేశిస్తోంది. దేశంలో మల్టీ–బ్యాంక్ పేమెంట్స్ యాప్‌గా పేరొందిన ‘చిల్లర్’ యాప్‌ను కొనుగోలు చేసినట్లు ట్రూకాలర్ బుధవారం ప్రకటించింది. చిల్లర్ వ్యవస్థాపకులు సోని జాయ్, అనూప్ శంకర్, మొహమ్మద్ గాలిబ్, లిషయ్ భాస్కరన్‌తో పాటు ఇతర ఉద్యోగులు ఇకపై తమ సంస్థలో భాగంగా ఉంటారని ట్రూ కాలర్ సహ వ్యవస్థాపకుడు నమీ జారింగ్లామ్ తెలియజేశారు. ట్రూకాలర్ పే విభాగానికి సోని జాయ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉంటారన్నారు. మొబైల్ పేమెంట్స్ కార్యకలాపాల విభాగానికి చిల్లర్ ఇంజినీర్లు, డిజైనర్ల అనుభవం తోడ్పడగలదని ఆశిస్తున్నట్లు జారింగ్లామ్ చెప్పారు. అయితే చిల్లర్ కొనుగోలుకు ఎంత మొత్తం వెచ్చించారనేది వెల్లడించలేదు. చిల్లర్ 2014లో కార్యకలాపాలు ప్రారంభించింది. భారత్‌లో 15 కోట్ల మంది యూజర్లు, 300కు పైగా సంస్థలతో భాగస్వామ్యం ఉంది. ఇక ట్రూకాలర్‌కి భారత్‌లో 65 మంది సిబ్బంది ఉన్నారు. ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) కింద మరిన్ని బ్యాంకులను తమ పేమెంట్ యాప్ ప్లాట్‌ఫాంపైకి తేనున్నట్లు సోనీ జాయ్ తెలియజేశారు. ఇండియానే ఎందుకంటే... ట్రూకాలర్‌ను స్వీడన్‌కు చెందిన ట్రూ సాఫ్ట్వేర్ స్కాండనేవియా సంస్థ అందుబాటులోకి తెచ్చింది. 2009లో ఆరంభమైన ట్రూకాలర్‌కు గతేడాది చివరకు ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మంది యూజర్లున్నారు. వీరిలో దాదాపు 15 కోట్ల మంది ఒక్క భారత్‌లోనే ఉన్నట్లు అంచనా. ఈ లెక్కన ట్రూకాలర్‌కు ఇండియానే అతిపెద్ద మార్కెట్. ఇక ట్రూకాలర్ వద్ద దాని యూజర్లకు సంబంధించి రకరకాల డేటా ఉందని, తన సర్వీసులకు సంబంధం లేని డేటాను సైతం అది సేకరిస్తోందని కొన్నాళ్లుగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ‘‘ట్రూకాలర్ యాప్‌ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే మన ఫోన్లోని సమాచారమంతా బేషరతుగా అందజేస్తున్నట్లే లెక్క. మన ఫోన్లో సేవ్ చేసుకున్న పేర్లతో పాటు ఫోన్‌కి వచ్చే, పోయే కాల్స్, మెసేజీల వివరాలన్నీ ట్రూకాలర్‌కి చేరుతున్నాయి. మనం ఇవ్వడానికి ఇష్టపడని సమాచారాన్ని కూడా ఈ యాప్ సేకరిస్తోంది. ఇది ఒక రకంగా గుర్తింపునకు సంబంధించిన వివరాల చౌర్యమే’’ అనేది ఐటీ నిపుణుల మాట. కాకపోతే ఇవన్నీ ట్రూకాలర్ యాప్ రహస్యంగా ఏమీ సేకరించటం లేదు. యాప్‌ను ఇన్స్టాల్ చేసుకునేటప్పుడే అందులోని షరతులు, నిబంధనలను మనం ఓకే చెయ్యాల్సి ఉంటుంది. కానీ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకునే హడావుడిలో యూసేజీ పాలసీని చదవకుండానే అన్ని అనుమతులూ ఇచ్చేసి ఓకే చేసేస్తారు. మనం చూసే కంటెంట్ మొదలుకుని, సెర్చి చేసే అంశాలు, వెబ్సైట్ల దాకా మొత్తం కంటెంట్ సమాచారాన్ని సేకరిస్తామని ట్రూకాలర్ తన పాలసీలో చెబుతోంది. నిజానికి ఇది అందించే సర్వీసులకు ఇలాంటివన్నీ అవసరం లేదన్నది నిపుణుల మాట. అయితే ఇలా సేకరించిన కాంటాక్ట్స్ సమాచారంతో ట్రూకాలర్ భారీ పబ్లిక్ టెలిఫోన్ డైరెక్టరీ వంటి డేటాబేస్‌ను తయారు చేసుకుంటోంది. ఇండియా అతిపెద్ద మార్కెట్ కనక ఇక్కడే పేమెంట్ సర్వీసులను ఆరంభిస్తోంది. పర్మిషన్స్ ముసుగులో నిఘా..! ఇన్స్టలేషన్ సమయంలో... ఫోన్ మైక్రోఫోన్‌కు యాక్సెస్ ఇవ్వాలని, మన ఫోన్‌బుక్‌లోని కాంటాక్ట్స్ వివరాలను తమ సర్వర్స్ సేకరించేందుకు అనుమతించాలని ట్రూకాలర్ అడుగుతోంది. ఇవి హానికరమైనవి కావనే ఉద్దేశంతో పర్మిషన్స్ ఇచ్చేస్తాం. కానీ.. ఈ పర్మిషన్స్ సాయంతో మనం ఫోన్ లిఫ్ట్ చేశామా లేదా, లాక్ అయి ఉందా.. అన్‌లాక్ అయి ఉందా వంటి వివరాలన్నీ కూడా ట్రూకాలర్ యాప్‌కి చేరిపోతున్న సంగతి మనకు తెలియదు. చాలామంది ఫోన్లలో కుటుంబసభ్యులు, చుట్టాలు, ఫ్రెండ్స్ తదితరుల పేర్లను సేవ్ చేసుకునేటప్పుడు వారితో ఉన్న బంధుత్వాన్ని సూచించేలా చివర్లో చుట్టరికాన్ని కూడా చేరుస్తుంటారు. కృష్ణ మామయ్యనో, రాజూ చాచా అనో రకరకాలుగా చేస్తారు. ఇలా సేవ్ చేయడం వల్ల కీలకమైన వ్యక్తిగత సమాచారాన్ని ట్రూకాలర్ చేతికిచ్చినట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం వ్యక్తిగత ప్రైవసీకి కాకుండా స్నేహితులు, ఇతరత్రా మనకు తెలిసినవారి ప్రైవసీకి కూడా భంగం కలిగిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ‘‘కాలర్ ఐడీని తెలుసుకోవటానికి, అనవసర కాల్స్‌ను బ్లాక్ చేయటానికి ట్రూకాలర్ ఉపయోగపడుతుందనే భావనతోనే చాలా మంది ఉన్నారు. కానీ వారి ఫోన్లో ఉన్న డేటా కూడా కంపెనీ చేతికి చేరుతోందనే సంగతి వారికి తెలియదు’’ అని సైబర్ క్రైమ్ పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. అసలు వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలగకుండా ఉండాలనుకుంటే.. ఆన్లైన్ సర్వీసులందించే ఏ సంస్థతోనూ వివరాలు పంచుకోకపోవటమే ఉత్తమమనేది వారి సూచన. -
‘చెల్లింపు’ల్లోకి ట్రూకాలర్..!
(సాక్షి, బిజినెస్ విభాగం) : అంతర్జాతీయ డిజిటల్ టెలిఫోన్ డైరెక్టరీగా ఎదుగుతున్న ‘ట్రూ కాలర్’... రెవెన్యూ ఆర్జించటంపై దృష్టిపెట్టింది. ఇందుకోసం అంతర్జాతీయంగా తనకు అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్‌లో చెల్లింపుల విభాగంలోకి ప్రవేశిస్తోంది. దేశంలో మల్టీ–బ్యాంక్ పేమెంట్స్ యాప్‌గా పేరొందిన ‘చిల్లర్’ యాప్‌ను కొనుగోలు చేసినట్లు ట్రూకాలర్ బుధవారం ప్రకటించింది. చిల్లర్ వ్యవస్థాపకులు సోని జాయ్, అనూప్ శంకర్, మొహమ్మద్ గాలిబ్, లిషయ్ భాస్కరన్‌తో పాటు ఇతర ఉద్యోగులు ఇకపై తమ సంస్థలో భాగంగా ఉంటారని ట్రూ కాలర్ సహ వ్యవస్థాపకుడు నమీ జారింగ్లామ్ తెలియజేశారు. ట్రూకాలర్ పే విభాగానికి సోని జాయ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉంటారన్నారు. మొబైల్ పేమెంట్స్ కార్యకలాపాల విభాగానికి చిల్లర్ ఇంజినీర్లు, డిజైనర్ల అనుభవం తోడ్పడగలదని ఆశిస్తున్నట్లు జారింగ్లామ్ చెప్పారు. అయితే చిల్లర్ కొనుగోలుకు ఎంత మొత్తం వెచ్చించారనేది వెల్లడించలేదు. చిల్లర్ 2014లో కార్యకలాపాలు ప్రారంభించింది. భారత్‌లో 15 కోట్ల మంది యూజర్లు, 300కు పైగా సంస్థలతో భాగస్వామ్యం ఉంది. ఇక ట్రూకాలర్‌కి భారత్‌లో 65 మంది సిబ్బంది ఉన్నారు. ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) కింద మరిన్ని బ్యాంకులను తమ పేమెంట్ యాప్ ప్లాట్‌ఫాంపైకి తేనున్నట్లు సోనీ జాయ్ తెలియజేశారు. ఇండియానే ఎందుకంటే... ట్రూకాలర్‌ను స్వీడన్‌కు చెందిన ట్రూ సాఫ్ట్వేర్ స్కాండనేవియా సంస్థ అందుబాటులోకి తెచ్చింది. 2009లో ఆరంభమైన ట్రూకాలర్‌కు గతేడాది చివరకు ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మంది యూజర్లున్నారు. వీరిలో దాదాపు 15 కోట్ల మంది ఒక్క భారత్‌లోనే ఉన్నట్లు అంచనా. ఈ లెక్కన ట్రూకాలర్‌కు ఇండియానే అతిపెద్ద మార్కెట్. ఇక ట్రూకాలర్ వద్ద దాని యూజర్లకు సంబంధించి రకరకాల డేటా ఉందని, తన సర్వీసులకు సంబంధం లేని డేటాను సైతం అది సేకరిస్తోందని కొన్నాళ్లుగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ‘‘ట్రూకాలర్ యాప్‌ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే మన ఫోన్లోని సమాచారమంతా బేషరతుగా అందజేస్తున్నట్లే లెక్క. మన ఫోన్లో సేవ్ చేసుకున్న పేర్లతో పాటు ఫోన్‌కి వచ్చే, పోయే కాల్స్, మెసేజీల వివరాలన్నీ ట్రూకాలర్‌కి చేరుతున్నాయి. మనం ఇవ్వడానికి ఇష్టపడని సమాచారాన్ని కూడా ఈ యాప్ సేకరిస్తోంది. ఇది ఒక రకంగా గుర్తింపునకు సంబంధించిన వివరాల చౌర్యమే’’ అనేది ఐటీ నిపుణుల మాట. కాకపోతే ఇవన్నీ ట్రూకాలర్ యాప్ రహస్యంగా ఏమీ సేకరించటం లేదు. యాప్‌ను ఇన్స్టాల్ చేసుకునేటప్పుడే అందులోని షరతులు, నిబంధనలను మనం ఓకే చెయ్యాల్సి ఉంటుంది. కానీ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకునే హడావుడిలో యూసేజీ పాలసీని చదవకుండానే అన్ని అనుమతులూ ఇచ్చేసి ఓకే చేసేస్తారు. మనం చూసే కంటెంట్ మొదలుకుని, సెర్చి చేసే అంశాలు, వెబ్సైట్ల దాకా మొత్తం కంటెంట్ సమాచారాన్ని సేకరిస్తామని ట్రూకాలర్ తన పాలసీలో చెబుతోంది. నిజానికి ఇది అందించే సర్వీసులకు ఇలాంటివన్నీ అవసరం లేదన్నది నిపుణుల మాట. అయితే ఇలా సేకరించిన కాంటాక్ట్స్ సమాచారంతో ట్రూకాలర్ భారీ పబ్లిక్ టెలిఫోన్ డైరెక్టరీ వంటి డేటాబేస్‌ను తయారు చేసుకుంటోంది. ఇండియా అతిపెద్ద మార్కెట్ కనక ఇక్కడే పేమెంట్ సర్వీసులను ఆరంభిస్తోంది. పర్మిషన్స్ ముసుగులో నిఘా..! ఇన్స్టలేషన్ సమయంలో... ఫోన్ మైక్రోఫోన్‌కు యాక్సెస్ ఇవ్వాలని, మన ఫోన్‌బుక్‌లోని కాంటాక్ట్స్ వివరాలను తమ సర్వర్స్ సేకరించేందుకు అనుమతించాలని ట్రూకాలర్ అడుగుతోంది. ఇవి హానికరమైనవి కావనే ఉద్దేశంతో పర్మిషన్స్ ఇచ్చేస్తాం. కానీ.. ఈ పర్మిషన్స్ సాయంతో మనం ఫోన్ లిఫ్ట్ చేశామా లేదా, లాక్ అయి ఉందా.. అన్‌లాక్ అయి ఉందా వంటి వివరాలన్నీ కూడా ట్రూకాలర్ యాప్‌కి చేరిపోతున్న సంగతి మనకు తెలియదు. చాలామంది ఫోన్లలో కుటుంబసభ్యులు, చుట్టాలు, ఫ్రెండ్స్ తదితరుల పేర్లను సేవ్ చేసుకునేటప్పుడు వారితో ఉన్న బంధుత్వాన్ని సూచించేలా చివర్లో చుట్టరికాన్ని కూడా చేరుస్తుంటారు. కృష్ణ మామయ్యనో, రాజూ చాచా అనో రకరకాలుగా చేస్తారు. ఇలా సేవ్ చేయడం వల్ల కీలకమైన వ్యక్తిగత సమాచారాన్ని ట్రూకాలర్ చేతికిచ్చినట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం వ్యక్తిగత ప్రైవసీకి కాకుండా స్నేహితులు, ఇతరత్రా మనకు తెలిసినవారి ప్రైవసీకి కూడా భంగం కలిగిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ‘‘కాలర్ ఐడీని తెలుసుకోవటానికి, అనవసర కాల్స్‌ను బ్లాక్ చేయటానికి ట్రూకాలర్ ఉపయోగపడుతుందనే భావనతోనే చాలా మంది ఉన్నారు. కానీ వారి ఫోన్లో ఉన్న డేటా కూడా కంపెనీ చేతికి చేరుతోందనే సంగతి వారికి తెలియదు’’ అని సైబర్ క్రైమ్ పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. అసలు వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలగకుండా ఉండాలనుకుంటే.. ఆన్లైన్ సర్వీసులందించే ఏ సంస్థతోనూ వివరాలు పంచుకోకపోవటమే ఉత్తమమనేది వారి సూచన. -
పేటీఎంకు పోటీగా ట్రూకాలర్..
న్యూఢిల్లీ : డిజిటల్ పేమెంట్ దిగ్గజం పేటీఎంకు పోటీగా ట్రూకాలర్ వచ్చేసింది. పేమెంట్స్ యాప్ చిల్లర్‌ను ట్రూకాలర్ కొనుగోలు చేసింది. చిల్లర్ యాప్ కొనుగోలుతో ట్రూకాలర్ కేవలం పేటీఎంకు మాత్రమే కాక, వాట్సాప్ పేమెంట్స్ సర్వీసులను భారత్‌లో ధీటుగా ఎదుర్కోబోతుంది. గతేడాది డిజిటల్ పేమెంట్ సెగ్మెంట్లోకి ట్రూకాలర్ ప్రవేశించిన అనంతరం భారత్‌లో ఈ కంపెనీ చేపట్టిన తొలి కొనుగోలు ఇదే కావడం విశేషం. దీంతో స్వీడన్‌కు చెందిన ఈ కంపెనీ ప్రస్తుతం యూపీఐ ఆధారిత ట్రాన్సఫర్లను తన యాప్‌లో అనుమతించనుంది. ట్రూకాలర్ పే 2.0 లాంచ్‌తో తన యాప్‌లో బ్యాంకింగ్, పేమెంట్స్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. వచ్చే నెలల్లో క్రెడిట్, ఇతర ఫైనాన్సియల్ సర్వీసులను అందించాలని కూడా ట్రూకాలర్ ప్లాన్ చేస్తోంది. చిల్లర్ వ్యవస్థాపకులు సోనీ జాయ్, అనూప్ సర్కార్, మహ్మద్ గలీబ్, లిషోయ్ భాస్కరన్‌లతో పాటు ఆర్గనైజేషన్‌లో మిగతా ఉద్యోగులు ట్రూకాలర్‌లో చేరబోతున్నారు. సోనీ జాయ్ ట్రూకాలర్ పే సంస్థకు వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించనున్నారు. చిల్లర్ కొనుగోలుతో, తాము మొబైల్ చెల్లింపులకు ఎంతో నిబద్ధతను కలిగి ఉన్నామని పునరుద్ఘాటిస్తున్నామని, యూజర్ బేస్‌ను తాము బలపరుచుకోనున్నామని ట్రూకాలర్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ నామి జరింఘలం అన్నారు. గతేడాది నుంచి చిల్లర్ తన యాప్‌ను విక్రయించడానికి చూస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు చిల్లర్‌కు అతిపెద్ద భాగస్వామి. -
యూనిక్ 4జీ స్మార్ట్‌ఫోన్.. తక్కువ ధరలో
న్యూఢిల్లీ: మైక్రోమ్యాక్స్ సబ్ బ్రాండ్ వైయు టెలివెంచర్స్ నూతన స్మార్ట్‌ఫోన్ ను మంగళవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. బడ్జెట్ ధరలో ఈ డివైస్‌ను మంగళవారం లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ నౌగట్తో 4జీ తో ‘యూ యూ యూనిక్ 2’ ని పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధరను రూ. 5,999 గా కంపెనీ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌లో జూలై27నుంచి ప్రత్యేకంగా అందుబాటులో ఉండనుంది. డ్యూయల్ సిమ్, ట్రూకాలర్ ఇంటిగ్రేటెడ్ స్పెషల్ ఫీచర్‌తో ఈ హ్యాండ్ సెట్‌ను అందిస్తోంది. యూ 'యునిక్ 2' 5 అంగుళాల హెచ్డీ స్క్రీన్ 1280 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ నౌగాట్ 7.0 మీడియా టెక్ మైక్రో 6737 క్వాడ్ కోర్ 1.3 జీహెచ్‌జెడ్ ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్ 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ మొమరీ 13ఎంపీ ప్రైమరీ కెమెరా ప్రాథమిక కెమెరా 4 ఆటో ఫోకస్, మల్టీ షాట్ 5ఎంపీ సెకండరీ కెమెరా ఎఫ్ఎం రేడియో 2500 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఫేస్‌బుక్‌ను మించిపోయిన ట్రూకాలర్!
న్యూఢిల్లీ: మొబైల్ డిస్ప్లేపై గుర్తు తెలియని నంబర్ కనిపించిందటే.. యూజర్లు ట్రూకాలర్ యాప్‌ను ఆశ్రయించడం పెరిగిపోతోంది. ఈ కమ్యూనికేషన్ యాప్‌కు ఇటీవల భారత్‌లో విశేష ఆధరణ లభిస్తోంది. ఎంతలా అంటే.. గూగుల్ ప్లేస్టోర్‌లో అత్యధిక డౌన్లోడ్లు పొందిన యాప్‌ల జాబితాలో ఫేస్‌బుక్‌ను అదిగమించి ట్రూకాలర్ దూసుకెళ్తోంది. మేరీ మీకర్ ఇంటర్నెట్ ట్రెండ్స్ 2017 వెల్లడించిన వివరాల ప్రకారం భారత్‌లో అత్యధిక డౌన్లోడ్లు పొందిన యాప్‌ల జాబితాలో ఫేస్‌బుక్‌ను వెనక్కినెట్టి ట్రూకాలర్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో వాట్సప్ మొదటిస్థానంలో ఉండగా.. మెసెంజర్, షేరిట్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అలాగే.. యాప్‌లో ప్రకటనదారులకు రోజుకు లక్ష క్లిక్‌లను ట్రూకాలర్ అందిస్తుందని మేరీ మీకర్ ఇంటర్నెట్ ట్రెండ్స్ వెల్లడించింది. -
ఫీచర్ ఫోన్స్‌లోనూ ట్రూకాలర్
న్యూఢిల్లీ: కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ సంస్థ ట్రూకాలర్ తాజాగా తమ కాలర్ ఐడీ సేవలను ఫీచర్ ఫోన్స్‌లోనూ అందుబాటులోకి తెచ్చింది. అలాగే మొబైల్ ఫోన్ నంబరు ఆధారిత వీడియో కాలింగ్, పేమెంట్ సర్వీసులనూ ప్రవేశపెట్టింది. నెట్ వినియోగించని లేదా ఫీచర్ ఫోన్స్‌నే ఉపయోగిస్తున్న వారికి కాలర్ ఐడీ సర్వీసులు అందించేందుకు ఎయిర్‌టెల్‌తో ట్రూకాలర్ చేతులు కలిపింది. ట్రూకాలర్ యాప్ ఉన్న స్మార్ట్‌ఫోన్స్‌లో కాల్ చేసే వారి పేరు స్క్రీన్‌పై డిస్ప్లే అవుతుంది. అదే ఫీచర్ ఫోన్స్‌లో కాల్ వస్తుండగానే కాలర్ పేరు ఫ్లాష్ ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. కాగా, పేమెంట్ సర్వీసుల కోసం ఐసీఐసీఐ బ్యాంక్‌తో చేతులు కలిపినట్లు ట్రూకాలర్ తెలిపింది. -
ట్రూకాలర్ నుంచి మరో కొత్త యాప్
న్యూఢిల్లీ: ట్రూకాలర్ అనే యాప్ మీకు తెలిసే ఉందిగా.. కొత్త నెంబర్ల నుంచి ఫోన్ చేసేవారిని గుర్తించడంతోపాటు, విసుగుపుట్టించే కాల్‌ను బ్లాక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆ యాప్ మరో ముందడుగు వేసి ఇప్పుడు స్టాక్ మెస్సేజింగ్ యాప్‌ను కూడా భారత్‌లో ప్రారంభించింది. దీని ద్వారా మెస్సేజ్ పంపించింది ఎవరో తెలుసుకోవచ్చు. దీని సహాయంతో ఇన్ బాక్స్‌లో ఉన్న ఫేక్ మెస్సేజ్‌లను స్పామ్‌లోకి పంపించే వీలుంటుంది. 'ట్రూకాలర్ యాప్ ప్రతినెల 900 మిలియన్ల ఫోన్ కాల్స్ గుర్తిస్తుంది. ఏడు కాల్స్‌లో ఒకటి స్పామ్‌లోకి పంపిస్తుంది. ఇదే సహాయాన్నిట్రూ మెస్సెంజర్ ద్వారా అందించాలనుకున్నాం. మరో రెండు మూడు వారాల్లో దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో అందుబాటులోకి వస్తుంది' అని ట్రూకాలర్ ఇండియా హెడ్ కారి కృష్ణమూర్తి తెలిపారు. ప్రస్తుతం ఇండియాలో ట్రూకాలర్‌ను 80 మిలియన్ల మంది ఉపయోగిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా 150 మంది ఉపయోగిస్తున్నారని చెప్పారు. భారత్‌లో తమ యాప్‌కు అత్యధిక ప్రాధాన్యత ఉందని, దానిని మరింత రెట్టింపు చేయాలని నిర్ణయించామని వివరించారు. ప్రస్తుతం ట్రూకాలర్ ఎయిర్ టెల్, టాటా డొకామో, జియోనీ, ఓబీఐ, సెల్కాన్, మైక్రోమాక్స్, మైక్రోసాఫ్ట్, సియానోజెన్వంటి కంపెనీలతో సంబంధాలు కలిగిఉంది. కొత్త యాప్ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లకు వర్తిస్తుంది.