ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యూజర్స్ ఎక్కువగా వినియోగించే యాప్స్ లో ట్రూకాలర్ యాప్ ఒకటి. దీని సహాయంతో ఎవరైనా తెలియని నెంబర్ నుండి ఫోన్ వస్తే మనకు వెంటనే తెలిసిపోతుంది. అలాగే, ఏవైనా స్పామ్ కాల్స్ వస్తే వెంటనే బ్లాక్ చేసే సదుపాయం కూడా ఉంది. అయితే ఇది థర్డ్ పార్టీ యాప్ కావడంతో వినియోగదారుల భద్రతపై చాలా అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి అనుమానాలకు చెక్ పెడుతూ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ట్రూకాలర్ తరహా ఫీచర్స్‌తో తన ఫోన్ యాప్‌లో మార్పులు చేస్తుందట. ఈ యాప్ ని గూగుల్ కాల్ పేరుతో దీనిని పిలుస్తున్నారు.(చదవండి: ఐఐటి గువహతి పరిశోధకుల అద్భుత ఆవిష్కరణ)
ఈ క్రొత్త యాప్ గురించి యూట్యూబ్ లో ఒక ప్రకటన కూడా వచ్చింది. ప్రస్తుతానికి గూగుల్ ప్లే స్టోర్ లో ఇంకా అందుబాటులో లేనప్పటికి త్వరలో అధికారికంగా తీసుకురానున్నట్లు సమాచారం. యూట్యూబ్ లో వచ్చిన ప్రకటనలో గూగుల్ కాల్ యాప్ పేరు, లోగోను వెల్లడించింది. గూగుల్ రీ-బ్రాండెడ్ ఫోన్ యాప్ ట్రూకాలర్ యాప్ వినియోగదారులను ఆకర్షించగలదా లేదా అనేది చూడాలి. ఈ గూగుల్ కాల్ స్పామ్ కాల్స్ నుండి రక్షణను అందిస్తుంది. అలానే యాప్‌లో కొత్తగా కాలర్ ఐడీ ఫీచర్‌ను జోడించారు. దాంతో కాల్ వచ్చినప్పుడు కాలర్ పేరు, ఫోన్ నంబర్ చదివి వినిపిస్తుంది. దాంతో పాటు 30 రోజుల తర్వాత పాత కాల్ స్క్రీన్ రికార్డింగ్‌లు వాటంతటవే డిలీట్ అయ్యే ఫీచర్‌ను కూడా తీసుకొచ్చారు. తాజాగా ఫోన్ యాప్ పేరు మార్చి కొత్త ఫీచర్స్‌తో కాల్ యాప్‌తో యూజర్స్‌కి మరిన్ని మెరుగైన సేవలు అందించాలని గూగుల్ భావిస్తోంది. ప్రస్తుతం బీటా వినియోగదారులకు గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment