
ప్రపంచవ్యాప్తంగా ట్రూకాలర్ యాప్ ఎంతో ఫేమస్. మొబైల్‌కు వచ్చే గుర్తుతెలియని నెంబర్ల వివరాలు తెలుపడం ఈ యాప్ ప్రత్యేకత. అయితే, ట్రూకాలర్ యాప్‌తో యూజర్ ఖాతా వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశముందని తాజాగా తేలింది. ఈ మేరకు యాప్‌లోని ప్రధాన లోపాన్ని సెక్యూరిటీ పరిశోధకుడు ఎహరాజ్ అహ్మద్ కనుగొన్నారు. రద్దైన, పనిచేయని ఫోన్ నెంబర్ల ఆధారంగా కూడా ట్రూకాలర్‌లోని ఖాతాదారుల వివరాలు పసిగట్టవచ్చునని ఆయన గుర్తించారు. ఒకవేళ ట్రూకాలర్ ఖాతాను దుర్వినియోగపరుస్తే ట్రూకాలర్ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ నెంబర్ ‘ట్రూఎస్‌డీకే’ ద్వారా సైన్ చేసి తెలుసుకోవచ్చు. ప్రసిద్ది చెందిన షాప్‌క్లూస్, ఓయో, గ్రోఫర్స్ మింత్ర లాంటి ఆప్స్ ఈ సూత్రాన్నే పాటిస్తున్నాయి.
అయితే, ట్రూకాలర్ నంబర్ వెరిఫికేషన్ సిస్టమ్‌లోకి సైబర్ అటాకర్లు లాగిన్ కావడానికి ఈ లోపం ఉపకరిస్తుందని, ఒకసారి ఎవరైనా అటాకర్ నెంబర్ వెరిఫికేషన్ సిస్టమ్ ద్వారా ట్రూకాలర్ ఖాతాదారుడి అకౌంట్‌లోకి లాగిన్ అయితే.. అతని వివరాలు, డాటా అటాకర్ల చేతిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుందని అహ్మద్ తెలిపారు. దీనిని ఒక వీడియో ద్వారా ఆయన సవివరంగా వివరించారు. ఇందులో ట్రూకాలర్ చాట్ నుంచి పనిచెయ్యని మొబైల్ నెంబర్‌కు మెసెజ్ పంపించారు . అది ఎయిర్‌టెల్ కస్టమర్ కేర్ సెంటర్‌దని తేలింది. ఈ మేరకు ట్రూకాలర్ ఖాతాల దుర్వినియోగంపై ఎయిర్‌టెల్, వోడాఫోన్ సంస్థలు స్పందిస్తూ అహ్మద్ ప్రయత్నం చాలా గొప్పదని, ఆయన కనిపెట్టిన లోపాలను గ్రహించామని తెలిపారు. అతనితో కలిసి పనిచేస్తామని సంస్థలు వెల్లడించాయి. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటామని పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment