న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా నవంబర్‌లో కొత్తగా 25 లక్షల మంది మొబైల్ కస్టమర్లను సొంతం చేసుకున్నాయి. వొడాఫోన్ ఐడియా 18.3 లక్షల మంది వినియోగదార్లను కోల్పోయింది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రకారం.. జియో నూతనంగా 14.26 లక్షల మందిని చేర్చుకుంది.
దీంతో సంస్థ మొబైల్ చందాదార్ల సంఖ్య నవంబర్ చివరినాటికి 42.28 కోట్లకు చేరింది. భారతీ ఎయిర్‌టెల్ 10.56 లక్షల మంది కొత్త కస్టమర్ల చేరికతో మొత్తం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 36.60 కోట్లను తాకింది. వొడాఫోన్ ఐడియా చందాదార్లు 24.37 కోట్లకు వచ్చి చేరారు. భారత్‌లో మొ త్తం మొబైల్ కనెక్షన్లు 114.3 కోట్లు ఉన్నాయి.
చదవండి: Union Budget 2023: కేంద్రం శుభవార్త.. రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా!
Comments
Please login to add a commentAdd a comment