Mobile network
-
కొత్త ఫీచర్.. ఇక సిగ్నల్ లేకపోయినా 4జీ సేవలు
మొబైల్ కనెక్టివిటీని విప్లవాత్మకంగా మార్చే దిశగా భారత ప్రభుత్వం ఒక కీలక ముందడుగు వేసింది. ఇంటర్-సర్కిల్ రోమింగ్ (ICR) ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. దీంతో బీఎస్ఎన్ఎల్ (BSNL), జియో (Jio), ఎయిర్టెల్ (Airtel) ఇలా నెట్వర్క్ ఏదైనా వినియోగదారులు వారి ప్రాథమిక ప్రొవైడర్‌కు సిగ్నల్ కవరేజ్ లేనప్పటికీ, అందుబాటులో ఉన్న ఏదైనా నెట్వర్క్ని ఉపయోగించి 4జీ (4G) సేవలను పొందే ఆస్కారం ఉంటుంది.ఏమిటీ ఇంటర్ సర్కిల్ రోమింగ్?ఇంటర్-సర్కిల్ రోమింగ్ (Inter-Circle Roaming) అనేది నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పంచుకోవడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను (TSP) ఎనేబుల్ చేసే ఒక అద్భుతమైన ఫీచర్. డిజిటల్ భారత్ నిధి (DBN)-నిధులతో కూడిన మొబైల్ టవర్ల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రారంభించిన ఈ సర్వీస్, తమ నెట్వర్క్ ప్రొవైడర్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వం నిధులు సమకూర్చే టవర్ల ద్వారా 4జీ సేవలను ఉపయోగించుకునే వెసులుబాటును వినియోగదారులకు కల్పిస్తుంది.ఇంతకుముందు డిజిటల్ భారత్ నిధి టవర్లు వాటి ఇన్‌స్టాలేషన్‌కు బాధ్యత వహించే టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు మాత్రమే మద్దతిచ్చేవి. అంటే ఒకే ప్రొవైడర్‌కు మాత్రమే యాక్సెస్ ఉండేది. ఇంటర్-సర్కిల్ రోమింగ్ ఫీచర్‌తో వినియోగదారులు ఇప్పుడు భాగస్వామ్య నెట్‌వర్క్‌లను వినియోగించుకుని అంతరాయం లేని మొబైల్ సేవలు పొందవచ్చు.గ్రామీణ కనెక్టివిటీ మెరుగుఇంటర్-సర్కిల్ రోమింగ్ చొరవ ప్రాథమిక లక్ష్యాలలో గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో కనెక్టివిటీ అంతరాన్ని తగ్గించడం ఒకటి. 35,400 గ్రామాలకు విశ్వసనీయమైన 4జీ సేవలు అందించడానికి ప్రభుత్వం సుమారు 27,000 మొబైల్ టవర్లకు నిధులు సమకూర్చింది. ఈ విధానం విస్తృతమైన కవరేజీని అందించడంలో భాగంగా అనవసరమైన మౌలిక సదుపాయాల కొరతను తగ్గిస్తుంది.గ్రామీణ ప్రాంతాల్లో పరిమిత నెట్వర్క్ కారణంగా తరచుగా సిగ్నల్ లభ్యతకు సంబంధించిన సవాళ్లు ఎదురవుతుంటాయి. దీంతో వినియోగదారులు అవసరమైన సేవలు అందుకోలేకపోతున్నారు. బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ మధ్య సహకారం ద్వారా ఇంటర్-సర్కిల్ రోమింగ్ చొరవ ఈ సవాళ్లను పరిష్కరిస్తుంది. మరింత ఎక్కువమంది 4G కనెక్టివిటీని పొందేలా చేస్తుంది.మెరుగైన సేవలకు సహకారంఇంటర్-సర్కిల్ రోమింగ్ చొరవ విజయవంతం కావడం అనేది బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, జియో వంటి దేశంలోని ప్రధాన టెలికాం సంస్థల మధ్య సహకారంపై ఆధారపడి ఉంటుంది. నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను భాగస్వామ్యం చేయడం ద్వారా ఈ ప్రొవైడర్లు వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడం, నిర్వహణ ఖర్చులను తగ్గించడం, తక్కువ సేవలందే ప్రాంతాల్లో స్థిరమైన సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సింధియా ఈ సహకారం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ ప్రాజెక్ట్ దాదాపు 27,836 సైట్లను కవర్ చేస్తుందని, దేశవ్యాప్తంగా వినియోగదారులకు కనెక్టివిటీ అవకాశాలను పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఉమ్మడి ప్రయత్నం దేశ డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో టెలికాం రంగ నిబద్ధతను తెలియజేస్తుంది. -
నంబరు ‘పోర్టింగ్’ వ్యవధి 7 రోజులకు తగ్గింపు
న్యూఢిల్లీ: సిమ్ కార్డు దెబ్బతినడం వంటి కారణాలతో దాన్ని రీప్లేస్ చేసిన తర్వాత, మొబైల్ నంబరు పోర్టింగ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వ్యవధిని ట్రాయ్ ఏడు రోజులకు తగ్గించింది. వాస్తవానికి మొబైల్ ఫోన్ నంబర్లతో జరిగే మోసాలను కట్టడి చేసేందుకు గతంలో ఈ వ్యవధి పది రోజులుగా ఉండేది. అయితే, అత్యవసరంగా పోరి్టంగ్ చేసుకోవాల్సిన సందర్భాల్లో అన్ని రోజులు నిరీక్షించడం సమస్యగా ఉంటోందని, దీన్ని రెండు నుంచి నాలుగు రోజులకు తగ్గిస్తే సముచితంగా ఉంటుందని పలు వర్గాలు అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు వివరణ నోట్లో ట్రాయ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా అటు మోసపూరిత పోర్టింగ్‌ను కట్టడి చేసేందుకు సమయం మరీ తక్కువ కాకుండా ఇటు వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా ఉండేలా చూసేందుకు దీన్ని ఏడు రోజులకు మారుస్తూ తాజా సవరణ చేసినట్లు తెలిపింది. ఇది జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం సిమ్‌ను మార్చుకున్న ఏడు రోజుల్లోగా పోరి్టంగ్ కోసం ప్రయతి్నస్తే యూనిక్ పోరి్టంగ్ కోడ్ (యూపీసీ) లభించకుండా, దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. -
సిమ్ కార్డ్, నెట్ లేకుండానే వీడియోలు.. ఎలాగంటే..
మొబైల్ వినియోగదారులు త్వరలో సిమ్ కార్డ్, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా వీడియోలను చూడవచ్చు. సమీప భవిష్యత్తులో డైరెక్ట్ టు మొబైల్(డీ2ఎం) ప్రసారాలు అందుబాటులోకి రానున్నాయి. బ్రాడ్ కాస్టింగ్ సమ్మిట్‌ను ఉద్దేశించి కేంద్ర సమాచార, ప్రసార కార్యదర్శి అపూర్వ చంద్ర మాట్లాడారు. దేశీయంగా అభివృద్ధి చేసిన డైరెక్ట్ టు మొబైల్ (డీ2ఎం) సాంకేతికతకు సంబంధించిన ట్రయల్స్ త్వరలో దేశంలోని 19 నగరాల్లో జరుగుతాయని చెప్పారు. ఇందుకోసం 470-582 మెగాహెర్డ్జ్ స్పెక్ట్రమ్‌ను కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుతం బ్రాడ్‌కాస్టింగ్‌లో వీడియో ట్రాఫిక్‌ను 25 నుంచి 30 శాతం డీ2ఎంకి మార్చడం వల్ల 5జీ నెట్‌వర్క్‌లు అన్‌లాగ్ అవుతాయని అపూర్వ చంద్ర అన్నారు. తద్వారా దేశ డిజిటల్ పరిణామాన్ని వేగవంతం చేసి కంటెంట్ డెలివరీని మరింత అందుబాటులోకి తీసుకురావచ్చుని అభిప్రాయపడ్డారు. గతేడాది డీ2ఎం సాంకేతికతను పరీక్షించడానికి బెంగళూరు, నోయిడా వంటి ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్‌లు జరిగాయన్నారు. దేశంలో 69 శాతం కంటెంట్‌ను వీడియో ఫార్మాట్లోనే చూస్తున్నారని చెప్పారు. అయితే వీడియోలను అధికంగా వీక్షిస్తున్నపుడు మొబైల్ నెట్‌వర్క్‌ల వల్ల డేటాకు కొంత అంతరాయం ఏర్పడుతుంది. దీని ఫలితంగా కంటెంట్ బఫర్ అవుతుందని చంద్ర తెలిపారు. సాంఖ్య ల్యాబ్స్ , ఐఐటీ కాన్పూర్ అభివృద్ధి చేసిన డీ2ఎం టెక్నాలజీను టెలికమ్యూనికేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ అసైన్డ్ స్పెక్ట్రమ్ ద్వారా వీడియో, ఆడియో, డేటా సిగ్నల్‌లను నేరుగా మొబైల్ లేదా స్మార్ట్ పరికరాల్లో ప్రసారం చేసే అవకాశం ఉంది. ఇదీ చదవండి: చైనాను బీట్ చేసే భారత్ ప్లాన్ ఇదేనా! దేశంలోని దాదాపు 28 కోట్ల కుటుంబాల్లో కేవలం 19 కోట్ల టెలివిజన్ సెట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తం 80 కోట్ల స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్నారు. ఈ డీ2ఎం సాంకేతికత అందుబాటులోకి వస్తే స్మార్ట్ఫోన్ల వినియోగం ఒక బిలియన్(100 కోట్లు)కు చేరుకుంటుందని అంచనా. ఈ టెక్నాలజీ ద్వారా డేటా ట్రాన్స్మిషన్ ఖర్చులు తగ్గుతాయని, సమర్థమైన నెట్వర్క్ లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. సూపర్ ప్లాన్ అంటే ఇదే, రూ.6వేల వరకు బెనిఫిట్స్ కూడా!
కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఇవి పండుగల లాంటి సమయాల్లో వీటి డోస్ మరింత పెంచుతూ పోతుంటాయి. తాజాగా రిలయన్స్ సంస్థ స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా తన కస్టమర్ల కోసం అదిరిపోయే కొత్త ప్లాన్‌ని తీసుకొచ్చింది. లాంగ్ టర్న్ ప్లాన్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్లాన్‌పై ఓ లుక్కేస్తే.. రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ కింద రూ.2,999తో ఏడాది వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్‌ని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఈ ప్లాన్ లో భాగంగా దాదాపు రూ.5000 వరకు విలువైన కూపన్లను జియో తన కస్టమర్ల కోసం జత చేసింది. కాలింగ్, డేటాతో పాటు, Jio నుంచి అనేక రకాల ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఇందులో ప్రముఖ ఫుడ్ డెలివరీ, ట్రావెల్, ఆన్లైన్ షాపింగ్‌తో పాటు మరిన్నింటిపై తగ్గింపులు కూడా ఉన్నట్లు వెల్లడించింది. ఈ ప్లాన్‌లో ఏమున్నాయంటే.. వినియోగదారులు రోజుకు 2.5GB డేటా, అపరిమిత వాయిస్ కాల్ ప్రయోజనాలు, 365 రోజుల పాటు రోజుకు 100 SMSలను పొందుతారు. వినియోగదారులకు మొత్తం 912.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్యాక్ వినియోగదారులకు 5G డేటాను కూడా అందిస్తుంది. వీటితో పాటు రూ. 249 లేదా అంతకంటే ఎక్కువ విలువైన స్విగ్గీ ఆర్డర్లపై రూ. 100 తగ్గింపు, అలాగే యాత్ర ద్వారా బుక్ చేసుకున్న విమానాలపై రూ. 1,500 వరకు పొదుపు పొందే అవకాశం ఉంది. దేశీయ హోటల్ బుకింగ్‌లపై 15 శాతం తగ్గింపు (రూ. 4,000 వరకు) పొందవచ్చు. Ajioలో ఎంపిక చేసిన ఉత్పత్తుల కోసం రూ. 999 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆర్డర్లపై రూ. 200 తగ్గింపు కూడా ఉంది. నెట్‌మెడ్స్‌లో అదనపు NMS సూపర్క్యాష్తో పాటు రూ. 999 కంటే ఎక్కువ ఆర్డర్లపై 20 శాతం తగ్గింపును కూడా పొందవచ్చు. అంతేకాకుండా, ఈ ఆఫర్ నిర్దిష్ట ఆడియో ఉత్పత్తులు, రిలయన్స్ డిజిటల్ నుంచి కొనుగోలు చేసిన దేశీయ ఉపకరణాలపై ఫ్లాట్ 10 శాతం తగ్గింపును అందిస్తుంది. ఇలా దాదాపు ఈ ప్యాక్‌తో రూ.6000 అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. చదవండి: China Company: భారీ నష్టాల్లో చైనా కంపెనీ.. అదే జరిగితే 70 వేల మంది ఉద్యోగాలు పోతాయ్! -
ఫోన్లో నెట్వర్క్ లేకున్నా.. ఎమర్జెన్సీ కాల్స్ ఎలా వెళ్తాయో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత జనరేషన్లో ఫోన్ గురించి తెలియని వారు ఉండకపోవచ్చు. ఇక, ఫోనులో నెట్వర్క్ లేకపోయినప్పటికీ ఎమర్జెన్సీ కాల్ చేసే ఆప్షన్ కనిపించడాన్ని మనం చాలాసార్లు గమనించే ఉంటాం. ఎవరైనాసరే ఎటువంటి నెట్వర్క్ అవసరం లేకుండా ఎమర్జెన్సీ నంబర్లకు కాల్ చేయవచ్చు. ఎమర్జెన్సీ కాల్లో పోలీసులకు, అంబులెన్స్ మొదలైనవాటికి ఫోను చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, నెట్వర్క్ లేకుండా ఫోన్ ఎలా పనిచేస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఇది ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. మీ ఫోనులో నెట్వర్క్ లేదంటే దాని అర్థం ఆపరేటర్ నుంచి నెట్ వర్క్ అందడం లేదని అర్థం. ఇటువంటి స్థితిలో ఎమర్జెన్సీ కాల్ మరో పద్ధతిలో కనెక్ట్ అవుతుంది. మీ ఫోనుకు మీ ఆపరేటర్ నుంచి నెట్వర్క్ కనెక్ట్ కాకపోతే.. ఆటోమేటిక్‌గా అదే ఏరియాలో అందుబాటులో ఉన్న మరో మొబైల్ నెట్వర్క్ నుంచి కాల్ కనెక్ట్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. ఇటువంటి స్థితిలో ఎమర్జెన్సీ కాల్ ఏదైనా ఇతర నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అవుతుంది. ఇటువంటి సమయంలో సాధారణ కాల్ కనెక్ట్ అవదు. కేవలం ఎమర్జెన్సీ కాల్స్ మాత్రమే కనెక్ట్ అవుతాయి. మీరు ఎప్పుడు ఎమర్జెన్సీ కాల్ చేసినా ఏ నెట్ వర్క్‌తో అయినా కనెక్ట్ అయ్యే అవకాశం కలుగుతుంది. కాగా, ఎమర్జెన్సీ కాల్స్ చేసే సమయంలో ప్రత్యేకమైన నెట్వర్క్ ఉండాలన్న నియమం ఏదీ లేదు. ఈ కారణంగానే ఎమర్జెన్సీ కాల్ ఎప్పుడైనా చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాల్ ఎలా కనెక్ట్ అవుతుందంటే.. సాధారణంగా ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ముందుగా ఆ ఫోను మాధ్యమం ద్వారా సమీపంలోని నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ టవర్‌కు మెసేజ్ చేరుకుంటుంది. అప్పుడు ఫోనుకు కాల్ కనెక్ట్ అవుతుంది. ఈ ప్రక్రియ కొద్ది సెకెన్ల వ్యవధిలోనే జరుగుతుంది. ఫలితంగానే మీరు వెంటనే అవతలి వ్యక్తితో మాట్లాడగలుగుతారు. ఇది కూడా చదవండి: జియో, ఎయిర్టెల్ దెబ్బకు లక్షల యూజర్లను కోల్పోయిన వొడాఫోన్ ఐడియా -
హలో.. అవుటాఫ్ కవరేజ్.. వారికి ఇంకా మొబైల్ కవరేజ్కష్టాలు!
సాక్షి, అమరావతి: దేశంలో 38,901 మారుమూల గ్రామాలకు ఇంకా మొబైల్ కవరేజ్ లేదని కేంద్ర కమ్యునికేషన్ మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంట్లో వెల్లడించింది. వాణిజ్యపరంగా ఇది సాధ్యం కాకపోవడంతోపాటు జనాభా అక్కడక్కడ కొద్దికొద్దిగా ఉండడమే ఇందుకు కారణమని తెలిపింది. దేశంలో మొత్తం 6,44,131 గ్రామాలుండగా 6,05,230 గ్రామాలకు మొబైల్ కవరేజ్ ఉందని, మిగతా 38,901 గ్రామాలకు లేదని వివరించింది. అత్యధికంగా ఒడిశా రాష్ట్రంలో 6,592 గ్రామాలకు.. ఆ తరువాత రాజస్థాన్‌లో 3,316 గ్రామాలకు మొబైల్ కవరేజ్ లేదు. ఆంధ్రప్రదేశ్‌లో 2,971 గ్రామాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. రూ.26,316 కోట్లతో ప్రాజెక్టు దేశవ్యాప్తంగా మొబైల్ కవరేజీ లేని గ్రామాల్లో 4జి మొబైల్ సేవలను దశల వారీగా సంతృప్త స్థాయిలో కల్పించడానికి రూ.26,316 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును రూపకల్పన చేసినట్లు కేంద్ర కమ్యునికేషన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండో దశలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రూ.2,211 కోట్ల అంచనాతో ప్రాజెక్టును చేపడుతున్నట్లు వెల్లడించింది. అలాగే, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతమున్న 2జీ టెక్నాలజీని రూ.2,425 కోట్ల అంచనా వ్యయంతో 4జీ టెక్నాలజీ స్థాయికి పెంచనున్నామని పేర్కొంది. అంతేకాక.. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ సేవలను అందించడానికి రూ.3,673 కోట్ల వ్యయం అంచనాతో పథకాలను చేపడుతున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశాలోని 7,287 గ్రామాలకు.. అలాగే, ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని 502 గ్రామాలకు 4జీ మొబైల్ కనెక్టివిటీని అందించడానికి రూ.7,152 కోట్ల అంచనాతో ప్రాజెక్టును చేపడుతున్నట్లు కేంద్రం తెలిపింది. -
దూసుకుపోతున్న జియో, ఎయిర్టెల్.. కొత్తగా ఎన్ని లక్షల కస్టమర్లంటే!
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా నవంబర్‌లో కొత్తగా 25 లక్షల మంది మొబైల్ కస్టమర్లను సొంతం చేసుకున్నాయి. వొడాఫోన్ ఐడియా 18.3 లక్షల మంది వినియోగదార్లను కోల్పోయింది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రకారం.. జియో నూతనంగా 14.26 లక్షల మందిని చేర్చుకుంది. దీంతో సంస్థ మొబైల్ చందాదార్ల సంఖ్య నవంబర్ చివరినాటికి 42.28 కోట్లకు చేరింది. భారతీ ఎయిర్టెల్ 10.56 లక్షల మంది కొత్త కస్టమర్ల చేరికతో మొత్తం సబ్స్క్రైబర్ల సంఖ్య 36.60 కోట్లను తాకింది. వొడాఫోన్ ఐడియా చందాదార్లు 24.37 కోట్లకు వచ్చి చేరారు. భారత్‌లో మొ త్తం మొబైల్ కనెక్షన్లు 114.3 కోట్లు ఉన్నాయి. చదవండి: Union Budget 2023: కేంద్రం శుభవార్త.. రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా! -
ఎయిర్టెల్ భారీ ప్లాన్: రూ.28,000 కోట్ల పెట్టుబడి, టార్గెట్ అదే!
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ భారతి ఎయిర్టెల్ రూ.27–28 వేల కోట్ల పెట్టుబడి వ్యయం చేయనున్నట్టు ప్రకటించింది. ప్రధానంగా 5జీ నెట్వర్క్ విస్తరణ లక్ష్యంగా ఈ పెట్టుబడి ఉంటుంది. మొబైల్ యాంటెన్నాలు, ఫైబర్, బ్రాడ్‌బ్యాండ్, ఎంటర్ప్రైస్ టెక్నాలజీ డేటా సెంటర్స్‌పై ఈ ఖర్చు చేస్తారు. ‘ఎయిర్టెల్ మూలధన వ్యయం గత మూడేళ్లలో ఖర్చు చేసిన దానికి అనుగుణంగా ఉంటుంది. 5జీ వేగవంతమైన రోల్అవుట్ కారణంగా ఇది హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఏడాదిలో ఈ వ్యయంలో పెరుగుదలను చూడవచ్చు. క్రమంగా అదే స్థాయిలో కొనసాగవచ్చు’ అని కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. నవంబర్ 26 నాటికి కంపెనీ 5జీ నెట్వర్క్ కోసం 3,293 బేస్ స్టేషన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. మొబైల్ సేవల ధరలు పెరిగే అవకాశం ఉందని అధికారి వెల్లడించారు. మార్కెట్ పరిస్థితులనుబట్టి ధరల శ్రేణి ఆధారపడి ఉంటుందని అన్నారు. అధిక చార్జీలు ఉండవు.. హరియాణా, ఒడిషాలో కనీస రిచార్జ్ విలువ 28 రోజుల కాలపరిమితి గల ప్యాక్‌పై 57 శాతం ధర పెంచి రూ.155గా కంపెనీ నిర్ణయించింది. ఈ పైలట్ ప్యాక్ కింద అన్లిమిటెడ్ కాలింగ్, 1 జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్లను ఆఫర్ చేస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌పై ఆరు వారాల్లో కంపెనీ ఒక అవగాహనకు రానుంది. తదనుగుణంగా ఇతర టెలికం సర్కిల్స్‌లో ఈ ప్యాక్‌ను ప్రవేశపెడతారు. ప్రపంచంలో 5జీకి ప్రీమియం చార్జీలు విజయవంతం కాలేదని కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. అధిక చార్జీలు వసూలు చేసే ఆలోచన లేదన్నారు. 2జీ నుంచి 4జీకి మళ్లడం, ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్, పోస్ట్ పెయిడ్ వినియోగదార్లు బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్ వంటివి కొనుగోలు కారణంగా ఒక్కో కస్టమర్ నుంచి సగటు ఆదాయం అధికం అవుతుందన్నారు. జూలై–సెప్టెంబర్‌లో వినియోగదారు నుంచి ఎయిర్‌టెల్‌కు సమకూరిన సగటు ఆదాయం రూ.190. గతేడాది ఇదే కాలంలో ఇది రూ.153 నమోదైంది. చదవండి: MNCs Quitting India: భారత్‌ను వదిలి వెళ్లిపోతున్న దిగ్గజ కంపెనీలు.. కారణం అదే! -
ఆ రంగంలో మూడేళ్లకోసారి లక్ష కోట్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత టెలికం పరిశ్రమ మూడేళ్లకోసారి రూ.1,03,262 కోట్ల ఆదాయ వృద్ధి నమోదు చేస్తుందని డెలాయిట్ ఇండియా–సీఐఐ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణలను పెంచే అవకాశం ఉన్న 5జీ రాక ఇందుకు కారణమని వివరించింది. ‘2023 చివరినాటికి భారత టెలికం పరిశ్రమ రూ.10,32,625 కోట్లకు చేరుతుంది. 5జీ ఎంట్రీతో మూడేళ్లకోసారి పరిశ్రమకు ఒక లక్ష కోట్లు తోడవుతాయి. 2022 అక్టోబరులో 5జీ సేవలు ప్రారంభం అయిన నెలరోజుల్లోనే ఒక టెలికం కంపెనీ 10 లక్షల 5జీ చందాదార్ల సంఖ్యను దాటింది. ఆర్థిక వృద్ధిని 5జీ వేగవంతం చేస్తుంది. అలాగే ఉద్యోగ అవకాశాలను పెంచుతుంది. పట్టణ, గ్రామీణ జనాభాను కలుపుతుంది. ఈ సాంకేతికత ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం వంటి క్లిష్టమైన రంగాలలో సామర్థ్యాన్ని పెంచుతుంది. సరైన ఆలోచన, సాంకేతిక నైపుణ్యంతో దేశంలో ఆర్థిక వృద్ధి, స్థితిస్థాపకతను వేగవంతం చేయడానికి భారతీయ టెలికమ్యూనికేషన్ పరిశ్రమ 5జీని ఉపయోగించవచ్చు. 5జీ నెట్వర్క్కి మారడం వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకున్న తర్వాత భారతీయ పరిశ్రమలలో ప్రైవేట్ నెట్‌వర్క్‌ల అవసరాలు పెరుగుతాయి. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్!
భారత్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 5జీ సేవలు (5G Services) ప్రారంభమయ్యాయి. అయితే ఈ సేవలు ఒకేసారి దేశవ్యాప్తంగా కాకుండా ప్రస్తుతానికి కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే లభ్యమవుతోంది. 5జీ సేవలు ఉపయోగించాలంటే ఆయా మొబైల్ కంపెనీలు సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దీంతో కొన్ని కంపెనీలు ఇప్పటికే అప్డేట్ ప్రక్రియను పూర్తి చేయగా.. తాజాగా యాపిల్ కంపెనీ ఐఫోన్ యూజర్లకు శుభవార్త చెప్పింది. దేశంలోని ఐఫోన్ యూజర్లకు 5జీ సపోర్ట్ అందించినట్లు యాపిల్ కంపెనీ తెలిపింది. 5జీ సేవలు ప్రారంభం జియో , ఎయిర్టెల్ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్న ఐఫోన్ యూజర్లకు 5జీ అప్డేట్ సేవలు అందజేసినట్లు యాపిల్ స్పష్టం చేసింది. iOS 16.2 రిలీజ్ కావడంతో.. భారత్‌లోని వినియోగదారులు కవరేజీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 5G నెట్వర్క్ స్పీడ్‌ను ఉపయోగించగలరు. ఐఫోన్ 12 తర్వాత మార్కెట్లోకి వచ్చిన అన్ని అనుకూల మోడల్‌లలో 5G సేవలు సపోర్ట్ చేస్తాయి. మొదట ఐఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. అనంతరం జనరల్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆపై సాఫ్ట్వేర్ అప్డేట్పై ట్యాప్ చేయాలి. అక్కడ iOS 16.2ని డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. నిబంధనలు అంగీకరించిన తర్వాత అప్డేట్ను డౌన్లోడ్ చేయాలి. సాఫ్ట్వేర్ అప్డేట్ iOS 16.2కి అప్డేట్ చేయడానికి ముందు మీ మొబైల్లో తగినంత బ్యాటరీ ఉందని నిర్ధారించుకోవడం ముఖ్యం. చదవండి: పదేళ్లుగా నడుస్తోంది.. ఐఫోన్లకు సంబంధించి పెద్ద సీక్రెట్ బయటపెట్టిన యాపిల్ సీఈఓ! -
ఫిక్సిడ్ లైన్లలో జియో టాప్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఫిక్సిడ్ లైన్ల విభాగంలోనూ హవా కొనసాగిస్తోంది. తాజాగా ఆగస్టులో ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ను తోసిరాజని అగ్రస్థానం దక్కించుకుంది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జియో వైర్‌లైన్ యూజర్ల సంఖ్య 73.52 లక్షలకు చేరింది. బీఎస్ఎన్ఎల్ యూజర్లు 71.32 లక్షలుగా ఉన్నారు. మొత్తం వైర్‌లైన్ సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య జూలైలో 2.56 కోట్లుగా ఉండగా ఆగస్టులో 2.59 కోట్లకు పెరిగింది. బీఎస్ఎన్ఎల్ 15,734 మంది యూజర్లు, ఎంటీఎన్ఎల్ 13,395 మంది కస్టమర్లను కోల్పోయాయి. జియోకు 2.62 లక్షలు, భారతి ఎయిర్‌టెల్‌కు 1.19 లక్షలు, వొడాఫోన్ ఐడియాకు (వీఐ) 4,202, టాటా టెలీ సర్వీసెస్‌కు 3,769 మంది యూజర్లు కొత్తగా జతయ్యారు. ఇక దేశవ్యాప్తంగా మొత్తం టెలికం సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య స్వల్పంగా 117.36 కోట్ల నుంచి 117.5 కోట్లకు పెరిగింది. జియోకు కొత్తగా 32.81 లక్షలు, ఎయిర్‌టెల్‌కు 3.26 లక్షల మంది మొబైల్ యూజర్లు జతయ్యారు. వీఐ 19.58 లక్షలు, బీఎస్ఎన్ఎల్ 5.67 లక్షలు, ఎంటీఎన్ఎల్ 470 మంది యూజర్లను కోల్పోయాయి. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల విషయానికొస్తే 80.74 కోట్ల నుంచి 81.39 కోట్లకు చేరాయి. జియోకు అత్యధికంగా 42.58 కోట్ల మంది, ఎయిర్‌టెల్‌కు 22.39 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. చదవండి: ట్రైన్ జర్నీ క్యాన్సిల్ అయ్యిందా? రైల్వే ప్రయాణికులకు శుభవార్త -
జియో కీలక ప్రకటన.. ఆ 4 నగరాల్లో 5జీ సేవలు!
జియో యూజర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. దేశంలో 5జీ సేవలకు సంబంధించి రిలయన్స్ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, వారణాసి నగరాల్లో అక్టోబర్ 5 నుంచి 5జీ సేవలను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ప్రయోగాత్మకంగా మొదట ఈ 4 నగరాల్లో సేవలు అందించి.. ఆపై మిగతా నగరాలకు సేవలను విస్తరిస్తామని తెలిపింది. కాగా అక్టోబర్ 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 ఎగ్జిబిషన్లో 5జీ సేవలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీపావళికి సందర్భంగా జియో సేవలని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన జియో దసరా పర్వదినాన నాలుగు నగరాల్లో జియో ట్రూ 5జీ (Jio True 5G) సేవలు ప్రారంభించింది. ప్రస్తుతం పేర్కొన్న నగరాలలో జియో ట్రూ 5జీ వెల్కం ఆఫర్ కింద కస్టమర్లకు బీటా ట్రయల్ సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు 5జీ అపరిమిత డేటాను 1జీబీపీఎస్ స్పీడ్‌తో పొందవచ్చు. జియో వెల్కమ్ ఆఫర్ కింద ఉన్న యూజర్లు ఆటోమేటిక్‌గా జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని, దీనికోసం జియో సిమ్‌గానీ, 5జీ హ్యాండ్‌సెట్‌గానీ మార్చాల్సిన అవసరం లేదని పేర్కొంది. -
5జి వచ్చేస్తోంది.. మీ ఫోన్లో ఈ ఆప్షన్ ఉంటే సపోర్ట్ చేసినట్లే!
ఈ అక్టోబర్‌లో భారతదేశం ఎట్టకేలకు 5జి మార్కెట్ కానుంది. మరి కొద్ది వారాల్లో మీ స్మార్ట్ ఫోన్ స్టేటస్ బార్ లో మీరు 5జి ఐకాన్ చూడడం సాధ్యపడే అవకాశం ఉంది. జులైలో స్పెక్ట్రమ్ విజయవంతంగా ముగిసిన తరువాత, భారతదేశంలోని టెలికాం ఆపరేటర్లు 5జి ని వినియోగించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. అక్టోబర్ 1 నుంచి ఢిల్లీ లో జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సు లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 5జి సేవలను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు కేంద్ర టెలికాం శాఖ మంత్రి ఇటీవలే ప్రకటించారు. జియో, ఎయిర్ టెల్ ఈ సేవలను వెంటనే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వోడాఫోన్ ఐడియా (వి) కి మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మెట్రో నగరాలు మొదటగా 5జి సేవలను పొందనున్నాయి. తాము 5జి సేవలను అందించే విషయంలో కంపెనీలు ఎంతో విశ్వాసంతో ఉన్నాయి. అదే సమయంలో 5జి అనుభూతిని పొందేందుకు కస్ట మర్లు చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. 5జి కి సంబంధించి కస్టమర్లు సమాధానాలు తెలుసు కోవాలనుకుంటున్న ప్రశ్నలు కూడా ఎన్నో ఉన్నాయి. 5జి ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది? దాన్ని నేను ఎలా పొందగలుగుతాను? నాకు కొత్త ఫోన్ అవసరమవుతుందా? నేను ఏ ఫోన్ తీసుకోవాలి? కొత్త సిమ్ కార్డ్ అవసరమవుతుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు. వీటిలో కొన్ని మాత్రం ముఖ్యమైనవే. నాకు 5జి అవసరమా? జీవనశైలిని అప్ గ్రేడ్ చేసుకోవాలనే భావనను పక్కనపెడితే, అసలు ఇంటర్నెట్ కనెక్షన్ నుంచి మీరు ఏం పొందాలనుకుంటున్నారు అనే దానిపై ఈ ప్రశ్నకు సమాధానం ఆధారపడి ఉంటుంది. వేగవంతమైన ఇంట ర్నెట్ అనేది ఎలాంటి బఫరింగ్ లేకుండా హై-క్వాలిటీ వీడియోలను స్ట్రీమ్ చేస్తుంది. అతి తక్కువ లాటెన్సీ (స్పందించే సమయం) తో హై - గ్రాఫిక్స్ గేమ్స్ ను ప్లే చేస్తుంది. మీ కనెక్షన్ స్లో అవుతుందేమో అన్న బాధ లేకుండా పలు ఉప కరణాలను ఉపయోగించవచ్చు. 5జి కనెక్షన్ పొందడం అనేది టెంప్టింగ్ గా ఉండడాన్ని అర్థం చేసుకోవచ్చు. అది క్యూరియాసిటీ వల్ల కావచ్చు లేదా తోటి వారంతా దాని గురించి ముచ్చటించుకోవడం నుంచైనా కావచ్చు. హై డెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్, మొబైల్ గేమింగ్, వీడియో కాల్స్ వంటి సేవలకు అంతరాయం లేని యా క్సెస్ ను పొందేందుకు అవసరమైన బ్యాండ్ విడ్త్, లాటెన్సీని 5జి అందిస్తుంది. భారతీయ స్మార్ట్ ఫోన్ విని యోగదారులకు సంబంధించి ఒక కన్జ్యూమర్ సర్వే ప్రకారం వేగవంతమైన నెట్ వర్క్ వేగాలు తమ మొబైల్ సేవలను మెరుగుపరుస్తాయని 42 శాతం మంది భావిస్తున్నారు. మరింత విశ్వసనీయమైన కనెక్షన్, మెరుగైన్ ఇన్ డోర్ కనెక్షన్ ఉంటాయని భావిస్తున్న వారి శాతం కూడా అధికంగానే ఉంది. భారతీయ ఆపరేటర్లు వేలం ద్వారా పొందిన స్పెక్ట్రమ్ సి-బ్యాండ్, సబ్-1GHz లలో అధిక సామర్థ్యాన్ని, కవరేజీని అందించనుంది. టాప్ లైన్ స్పీడ్స్ పరంగా చెప్పాలంటే, 5జి మార్కెట్లలో చేసిన ఈ అధ్యయనం ప్రకారం, ప్రస్తుత 4జి కంటే కూడా 5జి వేగం 7 నుంచి 10 రెట్లు అధికంగా ఉండనుంది అని మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం. మీరు గనుక అప్ గ్రేడ్ కావాలనుకుంటే, భారతదేశంలో 4జి ప్రవేశపెట్టబడినట్లుగానే, 5జి మీకు అందించే ప్రోత్సాహకాలు ఏమిటో తెలుసుకోండి. అప్పట్లో టారిఫ్ లలో అగ్రెసివ్ ప్రైసింగ్ (ధరలు బాగా తక్కువగా ఉండడం) వెనుక పోటీ కూడా ఒక కారణంగా ఉండింది. ఈ రెండు అంశాలతో పాటుగా 5జికి గల డిమాండ్, దేశంలో 5జి సేవల ప్రోత్సా హకాలను ప్రభావితం చేయనున్నాయి. 2016లో జియో మొదలైనప్పుడు అది మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు, మార్కెట్ వాటా పొందేం దుకు తన నూతన 4జి నెట్ వర్క్ పై సుమారుగా 6 నెలల పాటు వాయిస్, డేటాను ఉచితంగా అందించింది. దీంతో 4జి మార్కెట్ లో జియో అత్యధిక మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. 5జి సేవలను అందించడంలో పోటీలో ముందు ఉండాలని భారతీయ ఆపరేటర్లు తహతహలాడుతున్న తరుణంలో ఆకర్షణీయ 5జి అప్ గ్రేడ్ ఆఫర్లు మార్కెట్ ను ముంచెత్తే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా జియో 'ట్రూ 5జి' సేవలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఇటీవలే ప్రకటించారు. నా ఫోన్ 5జికి సిద్ధంగా ఉందా? మీ ఫోన్ 5జిని సపోర్ట్ చేస్తుందా లేదా అనే విషయం తెలుసుకునేందుకు సులభమార్గం ఉంది. 2019లోనే దేశంలో మొదటి 5జి ఫోన్ రావడాన్ని పరిగణనలోకి తీసుకుంటే, మీరు మీ ఫోన్ నెట్ వర్క్ సెట్టింగ్స్ ను లేదా మీ సిమ్ కార్డ్ కు సంబంధించి ప్రిఫర్డ్ నెట్ వర్క్ ను పరిశీలించండి అది గనుక 5జి ని కూడా సూచిస్తే, మీ ఫోన్ 5జిని సపోర్ట్ చేస్తున్నట్లు లెక్క. ఓక్లా నిర్వహించిన ఒక మార్కెట్ సర్వే ప్రకారం చూస్తే, భారతీయులు 5జి ఫోన్ ఉపయోగిస్తూ తమ మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ ను పరీక్షించుకుంటున్నారు. ఎంతో మంది భారతీయులు ఇప్పటికే 5జి సామర్థ్యం కలిగిన ఉపకరణాలు ఉపయోగిస్తూ స్పీడ్ టెస్ట్ యాప్ ను రన్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే, 5జి అప్ గ్రేడేషన్ అనేది ఖరీదైన హ్యాండ్ సెట్ ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండానే, ఒక నూతన మొబైల్ రీచార్జ్ ప్లాన్ ను కొనుగోలు చేసినంత సులభం కానుందని ఈ సర్వే తెలుపుతోంది. 5జి అనేది ఖరీదైన ఫోన్లలోనే కాకుండా మధ్యస్థాయి ఫోన్లలో కూడా ఒక సాధారణ ఫీచర్ గా ఉంటోంది. మీ మొబైల్ నెట్ వర్క్ సెట్టింగ్స్ లో ఎక్కడా కూడా మీకు 5జి అనేది కనిపించకపోతే, మీ ఫోన్ 5జిని సపోర్ట్ చేయదనే అర్థం. అలాంటప్పుడు మాత్రం మీరు 5జిని సపోర్ట్ చేసే కొత్త ఫోన్ కొనుక్కోవాల్సి ఉంటుంది. కొత్త 5జి ఫోన్ అవసరమా? అక్టోబర్ మొదలుకొని వచ్చే ఏడాది నాటికి వివిధ భారతీయ నగరాల్లో 5జి అందుబాటు లోకి రానుంది. ప్రస్తుతానికి మాత్రం అది మెట్రో నగరాల్లోనే లభ్యం కానుంది. మీరు గనుక ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, హైదరాబాద్ లేదా బెంగళూరులలో నివసిస్తున్నట్లయితే, వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ అనుభూతి పొందేందుకు మీ వద్ద 5జి ఫోన్ ఉండాల్సిందే. 5జి ఫోన్ ను కొనడం ఎంతో ప్రయోజనదాయకం అవుతుంది. అహ్మదాబాద్, లక్నో, చండీగఢ్, గురుగ్రామ్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ఇతర నగరాల్లో 5జి కనెక్టివిటీ మరికొన్ని రోజుల తరువాత రానుంది. దేశంలో 5జి మొదటగా ఆవిష్కరించబడే 13 నగ రాల పేర్లను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఇప్పటికే ప్రకటించింది. మొదట పెద్ద పెద్ద నగరాల్లో ఈ కవరేజీ అందుబాటులోకి రానుంది. తమ పెట్టుబడులపై ప్రతిఫలాలు రావచ్చు అన్న అంచనాతో టార్గెట్లపై ఆపరేటర్లు పని చేస్తున్నారు. టాప్ 100 భారతీయ నగరాల్లో 5జి కవరేజ్ ప్లానింగ్ ను ఇప్పటికే పూర్తి చేసి నట్లుగా జియో ప్రకటించింది. 2024 నాటికి దేశంలో గ్రామీణ ప్రాంతాలతో సహా అన్ని నగరాల్లోనూ కవర్ చేయాలన్న సంకల్పంతో ఎయిర్ టెల్ ఉంది. నా ముందున్న ఆప్షన్లు ఏంటి? వివిధ ధరల శ్రేణుల్లో యాపిల్ ఐఫోన్లు, సామ్ సంగ్, షావోమి, పోకో, రియల్ మి, వివో వంటి బ్రాండ్లు 5జి స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఉన్నాయి. 5జి చిప్ సెట్ తయారీ సంస్థలైన మీడియా టెక్, క్వాల్ కమ్ వంటి వాటితో వ్యూహా త్మక ఒప్పందాలతో ఓఈఎంలు చాలా తక్కువ ధరకే అంటే రూ. 15,000లకే 5జి స్మార్ట్ ఫోన్లను అందించ గలుగుతున్నాయి. ఇది 5జి సేవల కోసం మరింత మంది ముందుకు వచ్చేలా చేస్తుంది. రియల్ మి వంటి బ్రాండ్లు రూ.10,000 లోపుగానే 5జి ఫోన్లను అందించేందుకు వాగ్దానం చేశాయి. 5జి స్మార్ట్ ఫోన్లను కొనాలనుకునే వినియోగదారులు అనుకూలతలు, ప్రతికూలతలు అన్ని ఒకసారి బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. తమకు సరిపోయే ఫీచర్లు గల ఫోన్ కోసం చూడాలి. 5జీ ఫోన్ కొనేటప్పుడు ఏయే అంశాలను చూడాలి? కొత్త ఫోన్ కొనేటప్పుడు 5జి తో పాటు మరెన్నో ఇతర అంశాలకూ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. 5జి అనేది నేడు ఫోన్లకు ఒక తప్పనిసరి ఆవశ్యకతగా మారింది. రిటైల్ బాక్స్ లపై ‘‘5జి’’ అని ముద్రించబడి ఉంటుంది. అది ఒక్కటి మాత్రమే సరిపోదు. మరే ఇతర అంశాలపై కూడా దృష్టి పెట్టాలో చూద్దాం. 5-జి రెడీ ఫోన్ ఒక్కటే సరిపోదు. ఏ విధమైన 5జి బ్యాండ్స్ ను మీ ఫోన్ సపోర్ట్ చేస్తుందో కూడా తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సమాచారం ఫోన్ రిటైల్ బాక్స్ పై సులభంగా అందుబాటులో ఉంటుంది. 5జి స్పెక్ట్రమ్ లో మూడు బ్యాండ్స్ ఉంటాయి, వీటినే టెలికాం కంపెనీలు పొందాయి. లో – బ్యాండ్, మిడ్ -బ్యాండ్, హై- బ్యాండ్. లో-బ్యాండ్ అనేది 700MHz స్పెక్ట్రమ్ ను కలిగిఉంటుంది. దీన్నే n28గా కూడా వ్యవహరిస్తారు. మిడ్ బ్యాండ్ అనేది 3500MHz ను కలిగి ఉంటుంది. దీన్నే n78 అని వ్యవహరిస్తారు. దాదాపుగా ప్రతీ 5జి ఫోన్ కూడా n78 ను సపోర్ట్ చేస్తుంది. కానీ బాగా ఖరీదైన ఫోన్లలోనే n28ను మీరు గుర్తించే అవకాశం ఉంది. ఎందుకంటే 700MHz అనేది స్టాండ్ అలోన్ 5జి సేవలకు ఉద్దేశించింది. రిలయన్స్ జియో ఒక్కటి మాత్రమే దీన్ని అందించగలదు. హై-బ్యాండ్ అనేది 26GHz స్పెక్ట్రమ్ ను కలిగిఉంటుంది. దీన్ని mmWave గా, n258గా వ్యవహరిస్తారు. చాలా కొద్ది ఫోన్లు మాత్రమే n258ను సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే, ఇది mmWave కనెక్టివిటీ. ఈ కనెక్టివిటీ 5జి ఆరంభంలోనే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. 5జి ఎంత వేగంగా ఉండవచ్చు? ప్రపంచవ్యాప్తంగా 5జి నెట్వర్క్ లు వినియోగదారులకు 1జీబీపీఎస్ కు మించిన వేగాన్ని అందించగలుగు తున్నాయి. భారతీయ టెల్కోలు 4జి కన్నా అధికంగా డౌన్ లోడ్, అప్ లోడ్ వేగాలను అందించేందుకు వాగ్దానం చేశాయి. అయితే, 5జి స్పీడ్ అనేది ఆపరేటర్ పైనే గాకుండా, లొకేషన్ పై కూడా ఆధారపడి ఉంటుంది. 5జి ఫోన్లో 4జి సిమ్ కార్డ్ పని చేస్తుందా? మీ ప్రస్తుత 4జి సిమ్ కార్డ్ కొత్త 5జి ఫోన్లోనూ ఖచ్చితంగా పని చేస్తుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ, SMS మరియు వాయిస్ కాలింగ్ వంటి 4జి మరియు 5జి సేవలను పొందొచ్చు. భారతీయ టెలికాంలు NSA 5జి సాంకేతికతను అవలంబించడంతో, వారి ప్రస్తుత 4జి సిమ్ కార్డ్ Rel 99+ ప్రమాణానికి మద్దతు ఇస్తుంది. ఈ ప్రమాణం 2జి, 3జి, 4జి, మరియు 5జి సేవలు అందించేందుకు అనుకూలంగా ఉంటుంది. చదవండి: Ration Card New Rules: కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్! -
బీఎస్ఎన్ఎల్ చవకైన ప్లాన్.. రూ.275 ప్లాన్‌తో 3300జీబీ.. ఆఫర్ లాస్ట్ డేట్ ఇదే!
BSNL Rs.275 Broadband Plan: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day 2022) సందర్భంగా తమ కస్టమర్ల కోసం అదరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల కోసం చవకైన ప్లాన్‌ని ప్రవేశపెట్టింది. తక్కువ ధరలో అధిక ప్రయోజనాలు యూజర్లకు కలిగే విధంగా ఈ ప్లాన్‌ని ప్రకటించింది. అయితే ఈ ప్లాన్ పరిమిత కాలమే ఉంటుందన్న బీఎస్ఎన్ఎల్ తాజాగా ఆ ఆఫర్ చివరి తేదీని వెల్లడించింది. ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లకోసం సరికొత్త ప్లాన్ రూ. 275 బీఎస్ఎన్ఎల్(BSNL) తన ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లకోసం సరికొత్త ప్లాన్ రూ.275ను ప్రకటించింది. ప్రత్యేకంగా ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 60 Mbps స్పీడ్‌తో 3300జీబీ (3.3TB) వరకు డేటా లభిస్తుంది. అయితే ఇది ప్రమోషనల్ ప్లాన్ కాబట్టి, ఈ ఆఫర్ పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక ప్లాన్‌ను అక్టోబర్ 13వ తేదీ వరకే అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ తాజాగా ప్రకటించింది. అంటే ఈ రూ.275 ప్లాన్ బెనిఫిట్స్ పొందాలంటే అక్టోబర్ 13వ తేదీలోగా రీచార్జ్ చేసుకోవాలి. కొత్త కస్టమర్లు, ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వాడుతున్న కస్టమర్లు కూడా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. రూ.275 భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ వివరాలు ఇవే బీఎస్ఎన్ఎల్ రూ.275 ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఆఫర్ రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ రెండు ఆఫ్షన్లకు కూడా వ్యాలిడిటీ మాత్రం 75 రోజులు ఉంటుంది. డేటా కూడా 3.3టీబీ(3.3TB) అంటే 3,300జీబీ వరకు డేటా లభిస్తుంది. అయితే ఇందులో ఓ ఆప్షన్‌కి 30Mbps, మరో ఆప్షన్‌కి 60Mbps స్పీడ్ లభిస్తుంది. వినియోగదారులు ఈ ప్లాన్‌లో తమకు నచ్చిన ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. డేటా కోటా పూర్తవగానే 2Mbps స్పీడ్‌తో ఇంటర్నెట్ వస్తుంది. చదవండి: టెన్షన్ పెడుతున్న కొత్త రకం బ్యాంకింగ్ వైరస్.. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులూ జాగ్రత్త! -
రెడీగా ఉండండి.. ‘త్వరలో హైస్పీడ్ 5జీ ఇంటర్నెట్ సేవలు’
భువనేశ్వర్: రాష్ట్రానికి హైస్పీడ్ 5జీ ఇంటర్నెట్ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర సాంకేతిక, సమాచార శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పూరీ పర్యటన పురస్కరించుకుని ఆయన ఈ విషయాన్ని శుక్రవారం వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ శిక్షణా శిబిరం కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి విచ్చేశారు. కేంద్రప్రభుత్వం సంకల్పించిన 5జీ సేవలు తొలి దశలోనే రాష్ట్రానికి కల్పిస్తున్నట్లు ప్రకటించడం విశేషం. దేశంలో పలు ప్రాంతాలకు ఈ సేవలు లభిస్తాయని, ఈ వ్యవస్థలో మానవాళికి ఎటువంటి ముప్పు ఉండబోదని హామీ ఇచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) జారీ చేసిన రేడియేషన్ పరిమితి కంటే సుమారు 10 రెట్లు తక్కువగా దేశంలో ప్రవేశ పెట్టనున్న హైస్పీడ్ ఇంటర్నెట్ వ్యవస్థ ఉంటుందని స్పష్టంచేశారు. వినియోగదారులకు విస్తృత 5జీ సేవలు కల్పించేందుకు అనుబంధ టెలికాం సంస్థలు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లతో సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అతి త్వరలో హైస్పీడ్ 5జీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి తొలి దశలో అవకాశం కల్పించే యోచన కనబరచడంపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. చదవండి: పవర్ ఆఫ్ సారీ:రూ.6 లక్షలతో.. 50కోట్లు వచ్చాయ్! -
5జీ సేవలు ముందుగా ప్రారంభమయ్యే నగరాలు ఇవే!
సాంకేతిక విప్లవానికి తెరతీస్తూ దేశంలో 5జీ నెట్వర్క్ సేవలు ఊహించిన దానికంటే ముందుగానే అందుబాటులోకి రానుంది. ప్రముఖ టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌లు ఈ నెలాఖరులోగా దేశంలో 5జీ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మార్కెట్లో 5జీ సపోర్ట్ స్మార్ట్ఫోన్లు హల్చల్ చేస్తున్నాయి. మరోవైపు మొబైల్ వినియోగదారులు కూడా 5జీ సేవల రాక కోసం ఎదురు చూస్తున్నారు. (హౌసింగ్ బూమ్..! రేట్లు పెరిగినా తగ్గేదెలే!) ఇటీవల, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. 5జీ సేవలను ఊహించిన దానికంటే త్వరగా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 4జీ కంటే 5జీ స్పీడ్ 10 రెట్లు ఎక్కువగా ఉంటుందన్నారు. గతంలో 4జీ సేవలు కూడా మొదట్లో ప్రధాన నగరాల్లో ప్రారంభించి ఆ తర్వాత చిన్న పట్టణాలకు సైతం విస్తరించాయి. 5జీ సేవల విషయంలోనూ ఈ ఫార్ములానే పాటించనున్నారు. (బంపర్ ఆఫర్: మొబైల్ ఫోన్ అలవెన్స్ ఏడాదికి రూ.2 లక్షలు) ఈ నేపథ్యంలో తాజాగా దేశంలో 5జీ నెట్వర్క్ సేవలు తొలుత అందుబాటులోకి వచ్చే నగరాల జాబితాలో.. హైదరాబాద్, అహ్మాదాబాద్, బెంగళూరు, చండీఘర్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గుర్గావ్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పుణె నగరాలు ఉన్నాయి. మొదట్లో ఈ నగరాల్లో ప్రారంభించి ఆ తర్వాత చిన్న నగరాలకు సైతం సేవలను అందించనున్నారు. (నేషనల్ పెన్షన్ స్కీమ్: నేరుగా జమ చేస్తే కమీషన్) -
Hyderabad: పోలీసు ఫోన్ నెంబర్లు మారాయి.. కొత్త నెంబర్లు ఇవే
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు విభాగంలో పని చేస్తున్న అధికారుల ఫోన్ నెంబర్లు మారాయి. ఇప్పటి వరకు వినియోగిస్తున్న వాటి స్థానంలో ఎయిర్‌టెల్‌కు చెందినవి సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. పాత సర్వీస్ ప్రొవైడర్ సేవల వల్ల నెట్వర్క్ పరమైన ఇబ్బందులు వస్తుండటంతో పోలీసులు అధికారులు మరో సంస్థ సేవలు తీసుకోవాలని నిర్ణయించారు. 4జీ, 5జీతో పాటు అనేక వాల్యూ యాడెడ్ సర్వీసెస్ (వీఏఎస్) అందించడానికి ఎయిర్టెల్ సంస్థ ముందుకు వచ్చింది. అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ పోలీసు విభాగం ఈ సంస్థతో ఒప్పందం చేసుకుంది. తొలుత మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ద్వారా ప్రస్తుతం ఉన్న నెంబర్లనే కొనసాగించాలని భావించారు. అయితే దీనికి కొన్ని సాంకేతిక ఇబ్బందులు వస్తుండటంతో నెంబర్లు మార్చాలని నిర్ణయించారు. దీంతో సోమవారం నుంచి 9490616––– సిరీస్‌కు బదులుగా 8712660–––, 8712661––– సిరీస్‌ల్లో ఆరోహణ క్రమంలో నెంబర్ల వినియోగం మొదలైంది. క్షేత్రస్థాయిలో ఉండే అధికారుల కొత్త నెంబర్లు ప్రజలకు అలవాటు అయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనికోసం నెల రోజుల పాటు పాత నెంబర్లూ అందుబాటులో ఉంచుతున్నారు. చదవండి: వికారాబాద్‌లో సీఎం కేసీఆర్.. కలెక్టరేట్, టీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం అమలులోకి రాబోయే కొత్త నెంబర్లు ఇలా... ► పోలీసు కమిషనర్– 8712660001 ► అదనపు సీపీ (శాంతిభద్రతలు)– 8712660002 ► అదనపు సీపీ (నేరాలు)– 8712660003 ► సంయుక్త సీపీ (సీసీఎస్)– 8712660004 ► సంయుక్త సీపీ (ఎస్బీ)– 8712660005 ► సంయుక్త సీపీ (పరిపాలన)– 8712660006 ► సంయుక్త సీపీ (ట్రాఫిక్)– 8712660007 ► మధ్య మండల డీసీపీ– 8712660101 ► ఉత్తర మండల డీసీపీ– 8712660201 ► దక్షిణ మండల డీసీపీ– 8712660301 ► పశ్చిమ మండల డీసీపీ– 8712660401 ► తూర్పు మండల డీసీపీ– 8712660501 ► టాస్క్‌ఫోర్స్ డీసీపీ– 8712660701 ► ప్రధాన కంట్రోల్ రూమ్: 871266000, 8712661000 -
గెట్ రెడీ వచ్చేస్తున్నాం.. ఆగస్ట్‌లో 5జీ సేవలు: ఎయిర్టెల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ ఈ నెలలోనే 5జీ సేవలను ప్రారంభించనుంది. ఇందుకోసం టెలికం పరికరాల తయారీ కంపెనీలైన ఎరిక్సన్, నోకియా, శామ్సంగ్తో ఒప్పందం చేసుకున్నట్టు బుధవారం ప్రకటించింది. ఇటీవల ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ బిడ్డింగ్‌లో ఎయిర్టెల్ సైతం పాల్గొన్న సంగతి తెలిసిందే. 900 మెగాహెట్జ్, 1800, 2100, 3300 మెగాహెట్జ్, 26 గిగాహెట్జ్ బ్యాండ్స్‌లో 19,867.8 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను కంపెనీ దక్కించుకుంది. స్పెక్ట్రమ్ కొనుగోలుకై ఈ సంస్థ రూ.43,084 కోట్లు వెచ్చించింది. భారత్‌లో 5జీ విప్లవానికి నాంది పలికేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఎయిర్టెల్ ప్రకటించింది. ‘ఆగస్ట్‌లో 5జీ సేవలను ప్రారంభిస్తున్నాం. నెట్వర్క్ ఒప్పందాలు పూర్తయ్యాయి. 5జీ పూర్తి ప్రయో జనాలను వినియోగదార్లకు అందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ సాంకేతిక భాగస్వాములతో కలిసి పనిచేస్తాం’ అని ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు. చదవండి: Lic: ఇదే మొదటి సారి.. అరుదైన ఘనత దక్కించుకున్న ఎల్ఐసీ! -
5జీ వేలం: కంపెనీలు తగ్గేదేలే.. రికార్డ్ బ్రేక్, తొలి రోజు రూ.1.45లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: వేగవంతమైన 5జీ టెలికం సర్వీసులకు సంబంధించి మంగళవారం ప్రారంభమైన స్పెక్ట్రం వేలానికి భారీ స్పందన లభించింది. తొలి రోజున నాలుగు రౌండ్లలో, నాలుగు కంపెనీలు ఏకంగా రూ. 1.45 లక్షల కోట్ల బిడ్లు వేశాయి. నేడు (బుధవారం) కూడా వేలం కొనసాగనుంది. టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలతో పాటు అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా వేలంలో కూడా ‘చురుగ్గా‘ పాల్గొన్నట్లు టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అంచనాలను దాటి, 2015 రికార్డులను కూడా అధిగమించి తొలి రోజే ఏకంగా రూ. 1.45 లక్షల కోట్ల బిడ్లు దాఖలైనట్లు పేర్కొన్నారు. ఆగస్టు 14 కల్లా స్పెక్ట్రంను కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, సెప్టెంబర్ నాటికి 5జీ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. మధ్య, పైస్థాయి బ్యాండ్లకు బిడ్లు.. గత వేలంలో అమ్ముడు కాకుండా మిగిలిపోయిన 700 మెగాహెట్జ్ బ్యాండ్‌కు కూడా ఈసారి బిడ్లు వచ్చినట్లు మంత్రి తెలిపారు. మధ్య స్థాయి 3300 మెగాహెట్జ్, పైస్థాయి 26 గిగాహెట్జ్ బ్యాండ్లపై టెల్కోల నుంచి ఎక్కువగా ఆసక్తి వ్యక్తమైనట్లు వివరించారు. 4జీ సర్వీసులతో పోలిస్తే 5జీ టెలికం సేవలు అత్యంత వేగవంతంగా ఉంటాయి. వీటితో అత్యంత నాణ్యమైన వీడియోలు, సినిమాలను కేవలం సెకన్ల వ్యవధిలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలీ మెడిసిన్, అడ్వాన్స్డ్ మొబైల్ క్లౌడ్ గేమింగ్ మొదలైన విభాగాల్లో 5జీ సేవలు ఉపయోగకరంగా ఉండనున్నాయి. ప్రస్తుతం 600 మెగాహెట్జ్ మొదలుకుని 26 గిగాహెట్జ్ వరకూ వివిధ ఫ్రీక్వెన్సీల్లో స్పెక్ట్రంను వేలం వేస్తున్నారు. చదవండి: RBI: క్లెయిమ్ చేయని నిధులు రూ.48వేల కోట్లు.. వీటిని ఏం చేస్తారంటే! -
5జీ టెక్నాలజీ రాక.. కొత్త విధానాల కోసం కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: 5జీ వంటి ఆధునిక టెక్నాలజీల రాక నేపథ్యంలో టెలికం చట్టాలను సరళతరం చేసేందుకు, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు అనువుగా కొత్త విధానాలను అమల్లోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు సంబంధించి టెలికం శాఖ (డాట్) చర్చాపత్రాన్ని రూపొందించింది. దీనిపై సంబంధిత వర్గాలు ఆగస్టు 25 వరకూ తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి డాట్ అత్యధికంగా రూ. 50 కోట్ల మేర పెనాల్టీ విధించవచ్చు. అయితే, తాజా చర్చాపత్రం ప్రకారం శిక్షా నిబంధనలను ఉల్లంఘన పరిమాణాన్ని బట్టి మార్చేలా ప్రభుత్వం ప్రతిపాదించింది. యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఓఎఫ్) పరిధిని కేవలం గ్రామీణ టెలికం ప్రాజెక్టులకే కాకుండా పట్టణ ప్రాంతాలు, అలాగే పరిశోధన..అభివృద్ధి ప్రాజెక్టులు, శిక్షణా కర్యకలాపాలకు కూడా పెంచనుంది. మూతబడిన కంపెనీలు, దివాలా ప్రక్రియలో ఉన్న సంస్థలు తమ వద్ద ఉన్న స్పెక్ట్రంను వాపసు చేసేందుకు వెసులుబాటు కల్పించేలా తగు నిబంధనలు ఉండనున్నాయి. అలాగే కొత్త చట్టాలు సాధారణ ప్రజానీకానికి కూడా అర్థమయ్యేలా సరళంగా, సులభతరంగా ఉండాలని చర్చాపత్రంలో ప్రతిపాదించారు. సంబంధిత వర్గాలపై ప్రతికూల ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో కొత్త నిబంధనలను .. పాత తేదీల నుండి వర్తింపచేయరాదని చర్చాపత్రం పేర్కొంది.\ చదవండి: ఎయిర్టెల్ చీఫ్ మిట్టల్ ప్యాకేజీ తగ్గింపు.. ఎంతంటే -
ఎయిర్టెల్ చీఫ్ మిట్టల్ ప్యాకేజీ తగ్గింపు.. ఎంతంటే
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి (2021–22) సంబంధించి టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ప్యాకేజీ 5 శాతం తగ్గింది. రూ. 15.39 కోట్లకు పరిమితం అయ్యింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 16.19 కోట్లుగా నమోదైంది. గత రెండేళ్లుగా ఆయన జీతాలు, ప్రోత్సాహకాలు యథాప్రకారంగానే ఉన్నప్పటికీ ..హోదాపరంగా లభించే కొన్ని ప్రయోజనాల విలువ కొంత తగ్గడమే మిట్టల్ ప్యాకేజీలో తగ్గుదలకు కారణం. 2020–21లో వీటి విలువ రూ. 1.62 కోట్లుగా ఉండగా తాజాగా ఇది రూ. 83 లక్షలకు పరిమితమైంది. -
ట్రాయ్ రిపోర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్ జియో ధన్ ధనా ధన్!
సాక్షి,హైదరాబాద్: టెలికాం రెగ్యులేటరీ సంస్థ (TRAI) విడుదల చేసిన తాజా సబ్‌స్క్రైబర్ డేటా ప్రకారం, మే 2022 నెలకు గాను రిలయన్స్ జియో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 3.27 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది. ఇదే నెలలో భారతీ ఎయిర్టెల్ 71,312 మొబైల్ కస్టమర్లను చేర్చుకుంది. మరోవైపు ఇదే సమయంలో వోడాఫోన్ ఐడియా 74,808 మంది సబ్స్క్రైబర్లను కోల్పోగా, ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) 78,423 మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది. జాతీయంగా, రిలయన్స్ జియో మే నెలలో 31.11 లక్షల వైర్లెస్ సబ్స్క్రైబర్లను సంపాదించి, భారతీయ టెలికాం మార్కెట్లో తన ఆధిక్యాన్ని మరింతగా పెంచుకుంది. ఫలితంగా, దేశవ్యాప్తంగా జియో మొత్తం మొబైల్ కస్టమర్ల సంఖ్య ఇప్పుడు 40.87 కోట్లకు చేరుకుంది. భారతీ ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా 10.27 లక్షల మంది సబ్స్క్రైబర్లను చేర్చుకుంది, దీంతో సంస్థ మొత్తం మొబైల్ వినియోగదారుల సంఖ్య 36.21 కోట్లకు చేరుకుంది. మరో వైపు, వోడాఫోన్ ఐడియా సబ్స్క్రైబర్ల సంఖ్య ఈ నెలలో 7.59 లక్షలు తగ్గి 25.84 కోట్లకు పడిపోయింది. బీఎస్ఎన్ఎల్( BSNL ) వినియోగదారుల సంఖ్య కూడా దాదాపు 53.62 లక్షలు తగ్గి 11.28 కోట్లకు పడిపోయింది. చదవండి: ఇలా అయితే జీఎస్టీ ఉండదు: నిర్మలా సీతారామన్ క్లారిటీ -
జేబులో ఐమాక్స్.. యూట్యూబ్, సినిమాలు, వీడియోలు అన్నీ చూడొచ్చు
జేబులో ఐమాక్స్... అంత పెద్ద థియేటర్ మన జేబులో పట్టడమేంటని ఆలోచిస్తున్నారా? నిజమే.. కాకపోతే థియేటర్ కాదు. ఆ స్క్రీన్‌ను తలపించే కళ్లద్దాలు వచ్చేశాయి. ఇంట్లో, కారులో, బయట ఎక్కడంటే అక్కడ కూర్చుని థియేటర్ యాంబియెన్స్‌తో మీ ఫోన్లోని సినిమాలు, వీడియోలు చూసేయొచ్చు. అరచేతిలో అంతపెద్ద స్క్రీన్‌ను చూపించే ఆ కళ్లద్దాల కథేమిటో తెలుసుకుందాం. బ్రిటిష్ మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఈఈ (ఒకప్పటి ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్) ఈ ‘ఎన్రియల్ ఎయిర్’ కళ్లజోడును ఆవిష్కరించింది. చూడటానికి సాధారణ కళ్లద్దాల మాదిరిగానే కనిపించే వీటి వెనకాల ఆర్గానిక్ ఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది. దీనితో సినిమాలు చూడొచ్చు. గేమ్స్ ఆడుకోవచ్చు. అంత బిగ్ స్క్రీన్‌ను ఆవిష్కరించే గ్లాసెస్ కదా.. ఎంత బరువుంటాయో అన్న అనుమానం వద్దు. అవి కేవలం 79గ్రాముల బరువుంటాయి. సాధారణ యూఎస్బీ కేబుల్‌తో గ్లాసెస్‌ను ఫోన్‌కు కనెక్ట్ చేస్తే చాలు. 20 అడుగుల స్క్రీన్ మీ కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. కళ్లద్దాలకు పక్కనే చెవుల మీదుగా ఉండే ఫ్రేమ్‌లో ఏర్పాటు చేసిన స్పీకర్స్లోంచి ఆడియో వినబడుతుంది. యూట్యూబ్ వీడియోస్ చూడొచ్చు, వెబ్‌ను సర్ఫ్ చేయొచ్చు. ఒకేసారి అనేక స్క్రీన్స్ చూసే అవకాశమూ ఇందులో ఉంది. ఇక రెండోది ఎయిర్ కాస్టింగ్. దీనితో మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎదురుగా ఉన్న వర్చువల్ స్క్రీన్కు కనెక్ట్ చేయొచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న అప్లికేషన్స్ అంటే గేమ్స్, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్, సోషల్ మీడియాను ఆపరేట్ చేయొచ్చు. చదవండి: జాబిల్లిపై పచ్చదనం! -
దిమ్మతిరిగే స్పీడ్.. చిటికెలో 27 సినిమాల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు!!
ప్రపంచ దేశాల్లో 5జీ (5జనరేషన్) వైర్లెస్ మొబైల్ నెట్ వర్క్ ప్రారంభం కానేకాలేదు. కానీ అప్పుడే 6జీ టెక్నాలజీ గురించి చర్చ మొదలైంది. 5జీ కంటే 6జీ ఎంత వేగంతో పనిచేస్తుంది. ఎంత తక్కువ సమయంలో డేటానుషేర్ చేయొచ్చు. ఎన్ని రోజుల్లో 6జీ నెట్వర్క్ అందుబాటులోకి వస్తుందనే' పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా 6జీ మొబైల్ టెక్నాలజీ వైర్లెస్ ట్రాన్స్మిషన్ స్పీడ్‌లో సరికొత్త రికార్డులను నమోదు చేస్తుందని చైనా మీడియా సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది. చైనా రీసెర్చర్లు సెకన్ వ్యవధిలో 206.25 డేటాను షేర్ చేసే కెపాసిటీ 6జీ టెక్నాలజీని బిల్డ్ చేసినట్లు చైనా మీడియా తన కథనంలో పేర్కొంది. అంతేకాదు 6జీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే 5జీ కంటే 100రెట్లు ఫాస్ట్‌గా పనిచేస్తుందని వెల్లడించింది. ఉదాహరణకు 4కే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మూవీస్ మొత్తం 59.5గంటలు ఉండగా..ఆ మొత్తాన్ని చిటికెలో డౌన్లోడ్ చేయొచ్చు. అంటే 206.25గిగా బైట్ల వేగంతో ఆ అన్నిగంటల సినిమాను కేవలం 16 సెకన్లలో డౌన్లోడ్ చేయొచ్చన్నమాట. కాగా, సౌత్ కొరియా మీడియా కథనాల ప్రకారం..టెలికాం సంస్థల నుంచి సేకరించిన సమాచారం మేరకు 6జీ టెక్నాలజీ 2030 కల్లా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. 5జీకి కోవిడ్ దెబ్బ ప్రపంచంలోని ఎక్కువ దేశాల్లో కోవిడ్, సప్లయి చైన్, 5జీ ఎక్విప్మెంట్ అధిక ధరల కారణంగా 5జీ నెట్‌వర్క్‌లు సేవలకు ప్రారంభం కాలేదు. ముఖ్యంగా మనదేశంలో 5G స్పెక్ట్రమ్ కోసం వేలం మరింత ఆలస్యం కారణంగా 5జీ సేవలు పూర్తిస్థాయిలో అందేందుకు మరింత సమయం పట్టనుంది. చదవండి: 6జీ టెక్నాలజీ..! ముందుగా భారత్‌లోనే.. -
మారుమూల గ్రామాలకూ 4జీ
సాక్షి ప్రతినిధి, అనంతపురం : మొబైల్ సిగ్నల్స్ రాని మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో 4జీ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఏపీలోని 1,218 గ్రామాల్లో 4జీ మొబైల్ సర్వీస్‌లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర టెలి కమ్యూనికేషన్స్ శాఖ సన్నాహాలు పూర్తి చేసింది. ఇప్పటికే దీని టెండర్లు పూర్తయ్యాయి. దేశ వ్యాప్తంగా 7,287 గ్రామాలకు 4జీ సేవలు అందించనుండగా.. వాటిలో 1,218 గ్రామాలు ఏపీలో ఉన్నాయి. రాష్ట్రంతో పాటు ఛత్తీస్‌గడ్‌లో 699, జార్ఖండ్‌లో 827, మహారాష్ట్రలో 610, ఒడిశాలో 3,933 గ్రామాల్లో తాజాగా మొబైల్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విశాఖ జిల్లాలో జి.మాడుగుల, ముంచంగిపుట్టు, నిమ్మలపాడు వంటి మండలాల్లోని గ్రామాలకు కొత్తగా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఏపీలో 3 జిల్లాల్లో 1,218 ప్రాంతాల్లో 4జీ సర్వీసులు అందిస్తారు. ఇందుకోసం 771 టవర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ ఆదేశించింది. ఒక్కో టవర్ ఎత్తు 40 మీటర్లకు తగ్గకుండా ఏర్పాటు చేస్తారు. మొబైల్ ద్వారా మాట్లాడుకోవడమే కాకుండా, ఎస్ఎంఎస్లు, ఇంటర్నెట్ డేటా కూడా వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి టవర్ కూడా 24 గంటలూ పనిచేసేలా ఉంటుంది. ఏపీలో 1,218 గ్రామాల్లో ఒక్క విశాఖలోనే 1,054 గ్రామాలకు 4జీ సేవలు అందుబాటులోకి వస్తుండగా, విజయనగరం జిల్లాలో 154, వైఎస్సార్ జిల్లాలో 10 ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఏపీలో కోటి మందికి స్మార్ట్ ఫోన్‌లున్నట్టు ట్రాయ్ తేల్చింది. కొత్తగా 1,218 గ్రామాల్లో 4జీ మొబైల్ సేవలు అందుబాటులోకొస్తే.. స్మార్ట్ ఫోన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.