వాషింగ్టన్: సుమారు పదికోట్ల మొబైల్ నెట్‌వర్క్ యూజర్ల డేటాను హ్యాకర్లు దొంగిలించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన రెండో అతిపెద్ద టెలికాం సంస్థ టీ-మొబైల్ యూజర్ల డేటాను డార్క్‌వెబ్‌లో హ్యాకర్లు విక్రయానికి ఉంచినట్లు తెలుస్తోంది. పదికోట్ల మంది యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని హాక్ చేసినట్లు వస్తోన్న వార్తలపై దర్యాప్తు చేయనున్నట్లు టీ-మొబైల్ ప్రకటించింది. (చదవండి: Apple: ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్..!)
వినియోగదారుల ఫోరమ్‌లో యూజర్ల డేటా హ్యాక్‌కు గురైన్నట్లు వస్తున్న క్లెయిమ్స్‌ను కంపెనీ పరిశీలిస్తుందని, వాటిని వెంటనే పరిష్కారిస్తామని టీ-మొబైల్ ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు. టీ-మొబైల్ వినియోగదారుల డేటా హ్యక్‌కు గురైనట్లు మొదటిసారిగా వైస్‌కు చెందిన మదర్‌బోర్డ్ టెక్ న్యూస్ వెబ్‌సైట్ వెల్లడించింది. కస్టమర్ల పేర్లు, చిరునామాలు, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను హ్యాకర్లు డార్క్ వెబ్‌లో ఉంచినట్లు మదర్‌బోర్డ్ పేర్కొంది. జూన్ చివరి నాటికి టీ-మొబైల్ 26 మిలియన్ పోస్ట్‌పెయిడ్ ఖాతాలను, 84 మిలియన్ల మొబైల్ నెట్‌వర్క్ కనెక్షన్లను టీ-మొబైల్ కలిగి ఉంది. (చదవండి: సరికొత్త రికార్డు సృష్టించిన టీసీఎస్)
మొబైల్ నెట్‌వర్క్ యూజర్ల డేటా లీక్.!
Published Tue, Aug 17 2021 8:41 PM | Last Updated on Tue, Aug 17 2021 8:44 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment