న్యూఢిల్లీ: సిమ్ కార్డు దెబ్బతినడం వంటి కారణాలతో దాన్ని రీప్లేస్ చేసిన తర్వాత, మొబైల్ నంబరు పోర్టింగ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వ్యవధిని ట్రాయ్ ఏడు రోజులకు తగ్గించింది. వాస్తవానికి మొబైల్ ఫోన్ నంబర్లతో జరిగే మోసాలను కట్టడి చేసేందుకు గతంలో ఈ వ్యవధి పది రోజులుగా ఉండేది. అయితే, అత్యవసరంగా పోరి్టంగ్ చేసుకోవాల్సిన సందర్భాల్లో అన్ని రోజులు నిరీక్షించడం సమస్యగా ఉంటోందని, దీన్ని రెండు నుంచి నాలుగు రోజులకు తగ్గిస్తే సముచితంగా ఉంటుందని పలు వర్గాలు అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు వివరణ నోట్‌లో ట్రాయ్ పేర్కొంది.
ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా అటు మోసపూరిత పోర్టింగ్‌ను కట్టడి చేసేందుకు సమయం మరీ తక్కువ కాకుండా ఇటు వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా ఉండేలా చూసేందుకు దీన్ని ఏడు రోజులకు మారుస్తూ తాజా సవరణ చేసినట్లు తెలిపింది. ఇది జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం సిమ్‌ను మార్చుకున్న ఏడు రోజుల్లోగా పోరి్టంగ్ కోసం ప్రయతి్నస్తే యూనిక్ పోరి్టంగ్ కోడ్ (యూపీసీ) లభించకుండా, దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment