Mobile number portability
-
నంబరు ‘పోర్టింగ్’ వ్యవధి 7 రోజులకు తగ్గింపు
న్యూఢిల్లీ: సిమ్ కార్డు దెబ్బతినడం వంటి కారణాలతో దాన్ని రీప్లేస్ చేసిన తర్వాత, మొబైల్ నంబరు పోర్టింగ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వ్యవధిని ట్రాయ్ ఏడు రోజులకు తగ్గించింది. వాస్తవానికి మొబైల్ ఫోన్ నంబర్లతో జరిగే మోసాలను కట్టడి చేసేందుకు గతంలో ఈ వ్యవధి పది రోజులుగా ఉండేది. అయితే, అత్యవసరంగా పోరి్టంగ్ చేసుకోవాల్సిన సందర్భాల్లో అన్ని రోజులు నిరీక్షించడం సమస్యగా ఉంటోందని, దీన్ని రెండు నుంచి నాలుగు రోజులకు తగ్గిస్తే సముచితంగా ఉంటుందని పలు వర్గాలు అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు వివరణ నోట్లో ట్రాయ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా అటు మోసపూరిత పోర్టింగ్‌ను కట్టడి చేసేందుకు సమయం మరీ తక్కువ కాకుండా ఇటు వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా ఉండేలా చూసేందుకు దీన్ని ఏడు రోజులకు మారుస్తూ తాజా సవరణ చేసినట్లు తెలిపింది. ఇది జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం సిమ్‌ను మార్చుకున్న ఏడు రోజుల్లోగా పోరి్టంగ్ కోసం ప్రయతి్నస్తే యూనిక్ పోరి్టంగ్ కోడ్ (యూపీసీ) లభించకుండా, దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. -
మొబల్ నంబర్ పోర్టింగ్‌కు కొత్త రూల్
-
ఇక మూడు రోజుల్లోనే నంబర్ పోర్టబిలిటీ
సాక్షి, న్యూఢిల్లీ : మొబైల్ నంబర్‌ను పోర్ట్ చేయడానికి ఇకపై వారం రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఒకే సర్కిల్లో అయితే మూడు రోజుల్లోనే నెంబర్ పోర్టబిలిటీ అందుబాటులోకి రానుంది. నూతన నిబంధనలతో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పి) ప్రక్రియను సులభతరం చేసింది. నూతన నిబంధనలు ఈనెల 16 నుంచి వర్తిస్తాయి.సబ్‌స్క్రైబర్ తన మొబైల్ నంబర్‌ను పోర్ట్ చేయడానికి అర్హతలు ఉంటే టెలికాం రెగ్యులేటర్ ప్రత్యేకమైన పోర్టింగ్ కోడ్ (యుపిసి)ని అందిస్తుంది. కస్టమర్‌కు మొబైల్ నంబర్ పోర్టబిలిటీకి అర్హత ఉందా లేదా అనేది ట్రాయ్ నిర్ణయిస్తుంది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లు తాము చెల్లించాల్సిన బకాయిలు చెల్లించిన తర్వాతే ఎంఎన్‌పీకి అనుమతి లభిస్తుంది. మొబైల్ నంబర్ ఓనర్‌షిప్‌ను మార్చాలని అప్పటికే కోరిన పక్షంలో పోర్టబిలిటీకి ఆ నంబర్‌ను అనుమతించరు. చట్టనిబంధనల ప్రకారం నిషేధానికి గురైన మొబైల్ నంబర్‌ను కూడా ఎంఎన్‌పీకి అనుమతించరు. న్యాయస్ధానాల పరిధిలో ఉన్న మొబైల్ నెంబర్‌కూ ఎంఎన్‌పీని అనుమతించరు. ఆయా మొబైల్ ఆపరేటర్లతో ఎగ్జిట్ క్లాజ్‌లో కాంట్రాక్టులో పొందుపరిచిన అంశాలను పరిష్కరించకుండా ఉంటే ఎంఎన్‌పీ వర్తించదు. ఇక ప్రతి పోర్టింగ్ విజ్ఞప్తికి ట్రాయ్ రూ 6.46లను లావాదేవీ ఫీజుగా వసూలు చేస్తుంది. వ్యక్తిగత యూజర్ల పోర్టింగ్ వినతిని యూపీసీ వ్యాలిడిటీ ముగిసే వరకూ తిరస్కరించరాదని ట్రాయ్ స్పష్టం చేసింది. ఇక కార్పొరేట్ సంస్థలు యూజర్ల కార్పొరేట్ మొబైల్ నంబర్ల పోర్టింగ్ కోసం అధికారికంగా లేఖను ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అదే సర్కిల్లో నంబర్ పోర్టింగ్‌కు మూడు పనిదినాలు, వేరే సర్కిల్లో అయితే అయిదు పనిదినాల్లో ఈ ప్రక్రియ ముగుస్తుందని ట్రాయ్ పేర్కొంది. -
బీఎస్ఎన్ఎల్కు మారుతున్న యూజర్లు...
మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) కారణంగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు మారే వారి కన్నా.. వేరే ఆపరేటర్ల నుంచి బీఎస్ఎన్ఎల్కు మారే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. 2018–19లో పోర్ట్–అవుట్స్ సంఖ్య (వేరే ఆపరేటర్‌కు మారినవారు) 28.27 లక్షలుగా ఉండగా, పోర్ట్–ఇన్స్ (బీఎస్ఎన్ఎల్కు మారిన వారు) 53.64 లక్షలుగా ఉంది. మొత్తం మీద 2019 అక్టోబర్ దాకా 2.04 కోట్ల మేర పోర్ట్–ఇన్స్ ఉండగా, 1.80 కోట్ల మేర పోర్ట్–అవుట్స్ ఉన్నాయి. ఆగస్టు 31 నాటికి బీఎస్ఎన్ఎల్ మొబైల్ కనెక్షన్ల సంఖ్య 11.64 కోట్లుగా ఉన్నట్లు కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ లోక్‌సభలో తెలిపారు. -
నచ్చని టెల్కోలకు గుడ్‌బై!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్‌పీ) కోసం దేశవ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఆశించిన స్థాయిలో సేవలు అందకపోతే కస్టమర్లు మరో ఆపరేటర్‌కు సులువుగా మారుతున్నారు. 2019 జూలై 31 నాటికి 44.74 కోట్ల మంది ఎంఎన్‌పీ సేవలను వినియోగించుకున్నారంటే వినియోగదార్లలో చైతన్యం అర్థం చేసుకోవచ్చు. ఇలా అభ్యర్థనలు వచ్చిన రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 4.14 కోట్ల దరఖాస్తులతో కర్ణాటక తొలి స్థానంలో ఉండగా.. 3.78 కోట్ల రిక్వెస్టులతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడు, రాజస్తాన్, మహారాష్ట్ర సర్కిళ్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక ఈ ఏడాది జూలైలో ఎంఎన్‌పీ కోసం 59.2 లక్షల విన్నపాలు వచ్చాయి. 2010 నవంబరు 25న హరియాణా సర్వీస్ ఏరియాలో తొలుత ఎంఎన్‌పీ అందుబాటులోకి వచ్చింది. దశలవారీగా అన్ని సర్కిళ్లకు ఈ సర్వీసును విస్తరించారు. పెరుగుతున్న ఫిర్యాదులు.. టెలికం రంగంలో భారత్‌లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. 2జీ తర్వాత 3జీ విస్తరణ కంటే వేగంగా 4జీ సేవలు దూసుకుపోయాయి. ప్రధానంగా రిలయన్స్ జియో రాకతో టెలికం రంగంలో పోటీ తీవ్రమైంది. 2019 జూలై నాటికి భారత్‌లో వైర్లెస్ చందాదారులు 97.2 కోట్ల మంది ఉన్నారు. మెరుగైన సేవల కోసం వినియోగదార్లు ఖర్చుకు వెనుకంజ వేయడం లేదు. మరోవైపు కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఉత్తమ కవరేజ్, సర్వీసుల కోసం ఏటా అన్ని టెలికం కంపెనీలు ఎంత కాదన్నా రూ.10,000 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఎయిర్టెల్ ప్రాజెక్ట్ లీప్ కింద రూ.10,000 కోట్లు వ్యయం చేస్తోంది. టవర్ల ఏర్పాటును రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు అడ్డుకోరాదన్న సుప్రీం తీర్పు తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మరోవైపు కేంద్ర టెలికం మంత్రిత్వ శాఖ చొరవతో టవర్ల ఏర్పాటుకు ప్రభుత్వ భవనాలను వినియోగించుకునే వెసులుబాటు టెలికం కంపెనీలకు లభించింది. ప్రధాన సమస్యలు ఇవే.. కవరేజ్, డేటా స్పీడ్, కాల్ డ్రాప్, కాల్ కనెక్టివిటీ, కాల్ క్వాలిటీ వంటి నెట్వర్క్ సంబంధ ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. అలాగే బిల్లింగ్ పారదర్శకత, కాల్ సెంటర్‌తో అనుసంధానం, అందుబాటులో ఔట్లెట్ల వంటి సర్వీస్ విషయాలనూ కస్టమర్లు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఫిర్యాదు చేయాలంటే కాల్ సెంటర్‌కు లైన్ కలిసే అవకాశమే ఉండడం లేదు. యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని టెల్కోలు చెబుతున్నా అంతిమంగా పరిష్కారం అయ్యే చాన్స్ తక్కువ. వినియోగం కంటే మొబైల్ బిల్లు ఎక్కువగా ఉందని భావించే కస్టమర్లు మెరుగైన ప్యాకేజీ కోసం ఆపరేటర్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఎంఎన్‌పీ ప్రత్యేకత ఏమంటే వినియోగదారు మరో రాష్ట్రానికి (టెలికం సర్కిల్) మారినా వినియోగిస్తున్న నంబరు మారకపోవడం. ఈ అంశమే కస్టమర్లకు అస్త్రం. టెల్కోను మార్చిన 90 రోజులకు మరో ఆపరేటర్‌ను ఎంచుకునే వెసులుబాటు ఉండడం వినియోగదార్లకు కలిసి వస్తోంది. -
మరింత సులువుగా నంబరు పోర్టబిలిటీ
న్యూఢిల్లీ: మొబైల్ నంబర్ పోర్టబిలిటీని (ఎంఎన్‌పీ) మరింత సులభతరం చేసే క్రమంలో ఇందుకు సంబంధించిన నిబంధనలను సడలించే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రతిపాదనలు చేసింది. వీటి ప్రకారం ఇకపై యూనిక్ పోర్టింగ్ కోడ్ (యూపీసీ)ని జనరేట్ చేసే బాధ్యతను ఎంఎన్‌పీ సర్వీస్ ప్రొవైడర్ (ఎంఎన్‌పీఎస్‌పీ)కి అప్పగించింది. ప్రస్తుత విధానం ప్రకారం టెలికం సంస్థే దీన్ని జనరేట్ చేసి సబ్‌స్క్రయిబర్‌కి పంపుతోంది. అయితే, నంబర్ పోర్ట్ చేసుకోవడానికి అర్హులా కాదా అన్నది సదరు సబ్‌స్క్రయిబర్‌కి తెలియడానికి నాలుగు రోజుల దాకా పట్టేస్తోంది. కొన్ని సందర్భాల్లో బిల్లుల బకాయిలు ఉన్నాయనో లేదా ప్రత్యేక స్కీమ్స్ కింద కనెక్షన్ ఇచ్చామనో టెలికం సంస్థలు ఎంఎన్‌పీ అభ్యర్ధనను తిరస్కరిస్తున్నాయి. ఎంఎన్‌పీఎస్‌పీలు సమర్పించిన నివేదిక ప్రకారం.. మొత్తం పోర్టింగ్ అభ్యర్ధనల్లో దాదాపు 11 శాతం అభ్యర్ధనలను టెలికం సంస్థలు వివిధ కారణాలతో తిరస్కరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త సవరణలను ట్రాయ్ ప్రతిపాదించింది. యూపీసీ వ్యవధి ముగిసిపోయిందని, సరిపోలడం లేదన్న కారణాలతో కూడా టెల్కోలు పోర్టింగ్ అభ్యర్ధనలను తిరస్కరిస్తుండటాన్ని కూడా ట్రాయ్ పరిగణనలోకి తీసుకుంది. దీంతో.. ఇకపై టెలికం యూజరు గానీ నంబర్ పోర్టబిలిటీ అభ్యర్ధిస్తే వారి టెలికం సంస్థ .. దాన్ని ఎంఎన్‌పీఎస్‌పీకి పంపుతుంది. ఆ తర్వాత యూజర్ వివరాలన్నీ పరిశీలించిన మీదట పోర్టబిలిటీకి అర్హులని భావించిన పక్షంలో ఎంఎన్‌పీఎస్‌పీనే వారికి యూపీసీని సత్వరం జారీ చేస్తుంది. తద్వారా ఈ ప్రక్రియకు పట్టే సమయం తగ్గనుంది. అలాగే జారీ అయిన యూనిక్ కోడ్ వర్తించే కాలావధిని ఏడు పని దినాల నుంచి నాలుగు పనిదినాలకు ట్రాయ్ తగ్గించింది. ఈ ప్రతిపాదనలపై అక్టోబర్ 24 దాకా ప్రజలు తమ అభిప్రాయాలను ట్రాయ్‌కి తెలియజేయొచ్చు. వేరే టెలికం సంస్థకు మారినా.. పాత మొబైల్ నంబరునే కొనసాగించుకునే వెసులుబాటు నంబర్ పోర్టబిలిటీతో లభిస్తుందన్న సంగతి తెలిసిందే. జరిమానాలు కూడా.. ట్రాయ్ ప్రతిపాదనల ప్రకారం నిర్దేశిత గడువు నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో టెలికం సంస్థకు రూ. 5,000 జరిమానా విధిస్తారు. ఒకవేళ అర్హతపరమైన నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో జరిమానా రూ. 10,000గా ఉంటుంది. మరోవైపు, నిబంధనలను అమలు చేయడానికి పెనాల్టీలు విధించడమొక్కటే మార్గం కాదని.. సమన్వయంతో కలిసి పనిచేయడం ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం శ్రేయస్కరమని సెల్యులార్ ఆపరేటర్స్ సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ అభిప్రాయపడ్డారు. ఎయిర్‌సెల్, టెలినార్, ఆర్‌కామ్ మూతబడిన తర్వాత ఎంఎన్‌పీకి డిమాండ్ గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. -
నెంబర్ పోర్టబులిటీ ఇక కష్టమే..!
న్యూఢిల్లీ : నెట్వర్క్ నచ్చకపోతే.. ఇన్నిరోజులు మొబైల్ నంబర్ పోర్టబులిటీ (ఎంఎన్‌పీ) ద్వారా మొబైల్ నెంబర్ మార్చుకోకుండానే.. ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు మారేవాళ్లం. కానీ ఇక నుంచి ఈ ప్రక్రియ కష్టతరం అయ్యే అవకాశాలున్నాయట. దేశంలో మొబైల్ నెంబర్ పోర్టబులిటీ సేవలను అందిస్తున్న ఇంటర్ కనెక్షన్ టెలికాం సొల్యూషన్స్, సినివెర్స్ టెక్నాలజీస్ సంస్థలు ఎంఎన్‌పీ సేవలను 2019 మార్చి నుంచి నిలిపివేయనున్నాయని ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు చేసింది. పోర్టింగ్ ఛార్జీలను భారీ ఎత్తున్న తగ్గించడంతో, ఈ సర్వీసులను నిలిపివేయనున్నామని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డీఓటీ)కి ఈ కంపెనీలు లేఖ రాసినట్టు రిపోర్టు పేర్కొంది. ఒకవేళ ఈ కంపెనీలు అన్నట్టుగానే సర్వీసులను నిలిపివేస్తే... వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లకు మారడం ఇక అంత సులువు కాదు. ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ఎంఎన్‌పీ ఫీజులను టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ 19 రూపాయల నుంచి 4 రూపాయల వరకు అంటే 80 శాతం మేర తగ్గించింది. అప్పటి నుంచి తాము నష్టాలను చవిచూస్తున్నామని వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి తమ లైసెన్స్ ముగియగానే ఎంఎన్‌పీ సేవలు నిలిపివేస్తామని డీఓటీకి తాజాగా రాసిన లేఖలో ఈ రెండు కంపెనీలు పేర్కొన్నాయని రిపోర్టు వెల్లడించింది. మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ద్వారా కేవలం ఒకే లైసెన్స్ సర్వీసు ఏరియాలో మాత్రమే కాక, ప్యాన్ ఇండియా నెట్‌వర్క్‌ను మార్చుకోవచ్చు. మరోవైపు ఈ సర్వీసులను కొనసాగించడానికి మరో కొత్త సర్వీసు కంపెనీలకు లైసెన్స్ ఇచ్చే అవకాశాలున్నాయని టెలికాం వర్గాలంటున్నాయి. వినియోగదారులకు రక్షణ కల్పించేందుకు, కంపెనీలు నాణ్యమైన సేవలు అందించేలా ప్రభుత్వం ఎంఎన్‌పీ విధానాన్ని ప్రవేశపెట్టింది. జియో రాకతో రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలీసర్వీసెస్, ఎయిర్‌సెల్, టెలీనార్ ఇండియా తదితర కంపెనీలు మూతపడ్డాయి. దీంతో నెలవారీ ఎంఎన్‌పీ రిక్వెస్టుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఒక్క మార్చి నెలలో మొబైల్ నెంబర్ పోర్టబులిటీ అభ్యర్థనలు 19.67 మిలియన్లకు పెరిగాయి. మరోవైపు తమ వినియోగదారులను కాపాడుకొనేందుకు దిగ్గజ టెలికాం కంపెనీలు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా తదితర కంపెనీలు కూడా భారీగా తమ టారిఫ్‌లను తగ్గిస్తున్నాయి. -
చాలా వేగంగా మొబైల్ నెంబర్ పోర్టబులిటీ
మొబైల్ నెంబర్‌ను పోర్టబులిటీ పెట్టుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక నుంచి ఈ ప్రక్రియ చాలా తేలికగా, వేగంగా అయిపోనుందని తెలుస్తోంది. మొబైల్ నెంబర్ పోర్టబులిటీ మెకానిజాన్ని(ఎంఎన్‌పీ) సమీక్షించాలని టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ ప్లాన్ చేస్తోంది. ఎంఎన్‌పీ కింద ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు మారడానికి సమయాన్ని తగ్గించేందుకు ట్రాయ్ ఓ కన్సల్టేషన్ పేపర్ కూడా రూపొందిస్తోంది. ఇది మొత్తం ప్రక్రియను సులభతరం చేయనుందని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రక్రియకు చాలా సమయం పడుతుందని, ఈ సమయాన్ని తగ్గించడంతో పాటు, మొత్తం ప్రక్రియను మార్చాలని కన్సల్టేషన్ పేపర్ లక్ష్యంగా పెట్టుకుందని శర్మ అన్నారు. ప్రస్తుతం దీనిపై పనిచేస్తున్నామని, ఈ నెలాఖరి వరకు ఈ ప్రక్రియ ముగుస్తుందని చెప్పారు. అంతకముందే మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ఛార్జీలను ట్రాయ్ 79 శాతం మేర తగ్గించిన సంగతి తెలిసిందే. అంతకముందు 19 రూపాయలుగా ఉన్న ఎంఎన్‌పీ ఛార్జీలను ప్రస్తుతం గరిష్టంగా 4 రూపాయలు ఉండేలా నిర్ణయించింది. దీనిపై ఇండస్ట్రి అభిప్రాయాలను కూడా ట్రాయ్ స్వీకరిస్తోంది. మొత్తం ఎంఎన్‌పీ ప్రక్రియ ఎలా సులభతరంగా, వేగంగా చేయాలో కూడా ట్రాయ్ ఇండస్ట్రి అభిప్రాయాలను కోరుతోంది. ప్రస్తుతం ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు మారడానికి ఏడు రోజుల సమయం పడుతోంది. కానీ గ్లోబల్‌గా ఈ ప్రక్రియకు కేవలం గంటల వ్యవధి మాత్రమే సమయం పడుతుందని ట్రాయ్ అధికారులు చెప్పారు. ఎంఎన్‌పీ కింద నెంబర్‌ను మార్చుకోవాల్సినవసరం లేకుండా ఒక ఆపరేటర్ నుంచి మరో ఆపరేటర్‌కు పోర్టబులిటీ పెట్టుకోవచ్చు. గత కొన్ని నెలలుగా రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలిసర్వీసెస్, ఎయిర్‌సెల్ ఆపరేటర్ల సబ్స్క్రైబర్లు తమ నెంబర్లను పోర్టబులిటీ పెట్టుకోవడానికి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. -
పోర్టింగ్ ఛార్జీలు భారీగా తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ : మొబైల్ నెంబర్ పోర్టబులిటీ.... నెంబర్ మారకుండా ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌లోకి మారడం. తొలుత 2010లో టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ ఈ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. ఇలా నెట్వర్క్ మార్చుకున్నందుకు గాను పోర్టబులిటీ ఛార్జీగా రూ.19ను ట్రాయ్ నిర్ణయించింది. అయితే ఈ ఛార్జీలు ప్రస్తుతం 80 శాతం మేర తగ్గిపోనున్నాయి.. ఇన్ని రోజులు ఉన్న పోర్టబులిటీ ఛార్జీలను రూ.19 నుంచి రూ.4కు తగ్గించాలని ట్రాయ్ ప్రతిపాదించింది. దీనిపై డిసెంబర్ 29 వరకు వాటాదారులు తమ స్పందన తెలుపాలని ట్రాయ్ కోరింది. దేశవ్యాప్తంగా ఈ సిస్టమ్ 2015 నుంచి పూర్తిగా అమల్లోకి వచ్చింది. ఇక అప్పటి నుంచి నెంబర్ పోర్టబులిటీకి అనూహ్య స్పందన వస్తోంది. మొబైల్ నెంబర్ పోర్టబులిటీ సర్వీసు ప్రొవైడర్ల కార్యకలాపాల వ్యయాలు తగ్గుతూ వచ్చాయి. దీంతో ప్రస్తుతమున్న రూ.19 చాలా అధికంగా ఉందని ట్రాయ్ గుర్తించింది. అంతేకాక నెంబర్ పోర్టబులిటీ అభ్యర్థనలు కూడా 2014-15లో 3.68 కోట్లు ఉంటే, 2016-17 నాటికి ఇవి 6.36 కోట్లకు పెరిగాయి. ఈ నేపథ్యంలో పోర్టబులిటీ ఛార్జీలను తగ్గించాలని ట్రాయ్ నిర్ణయించింది. ఒక్కో పోర్టు లావాదేవీ అప్పర్ సీలింగ్‌ను తగ్గించాలని అథారిటీ నిర్ణయించిందని ట్రాయ్ ఓ ప్రకటనలో తెలిపింది. ట్రాయ్ అంతకముందు నిర్ణయించిన పోర్టబులిటీ ఛార్జీలు ఎనిమిదేళ్ల క్రితం రెండు మొబైల్ నెంబర్ పోర్టబులిటీ సర్వీసు ప్రొవైడర్లు సమర్పించిన ఆర్థిక డేటా ఆధారంగా నిర్ణయించారు. ప్రస్తుతం ఒక్కో పోర్టు లావాదేవి ఖర్చు తగ్గిందని 2016-17లో వార్షిక అకౌంట్లలో తేలింది. దీంతో ఈ ఛార్జీలను కూడా రూ.4కు తగ్గించాలని ట్రాయ్ నిర్ణయించింది. -
గతవారం బిజినెస్
ఆన్లైన్ రిటైల్ రంగంలోకి వి మార్ట్ రిటైల్ చెయిన్ వి మార్ట్ ఆన్లైన్ రిటైల్ రంగంలోకి ప్రవేశిస్తోంది. వచ్చే ఏడాది దీపావళి కల్లా ఆన్లైన్ రిటైల్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని వి-మార్ట్ రిటైల్ సీఎండీ లలిత్ అగర్వాల్ చెప్పారు. మొబైల్ యాప్ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ద్వారా ఆన్లైన్ రిటైల్ కార్యకలాపాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. తొలి ఈ-కామర్స్ ఐపీఓ... దేశంలో తొలిసారిగా పబ్లిక్ ఇష్యూకిరానున్న ఈ-కామర్స్ కంపెనీగా గుజరాత్‌కు చెందిన ఇన్ఫీబీమ్ ఇన్కార్పొరేషన్ లిమిటెడ్ రికార్డు సృష్టించనుంది. సెబీకి దాఖలు చేసిన ప్రాస్పెక్టస్ ప్రకారం ఈ ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ దాదాపు రూ.450 కోట్ల నిధులను సమీకరించాలని భావిస్తోంది. ఐపీఓ ద్వారా వచ్చే నిధులను క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటు, 75 లాజిస్టిక్స్ కేంద్రాలను నెలకొల్పడంతోపాటు, రిజిస్టర్డ్, కార్పొరేట్ కార్యాలయ ఏర్పాటుకు వినియోగించనుంది. అలాగే టీమ్‌లీజ్ రూ.500 కోట్లు, ఇండిగో ఎయిర్‌లైన్స్ రూ.2,500 కోట్ల మేరకు నిధులను సమీకరించాలని భావిస్తున్నాయి. భారత్ విదేశీ రుణ భారం 476 బిలియన్ డాలర్లు భారత విదేశీ రుణ భారం 2015 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం 476 బిలియన్ డాలర్లకు చేరింది. 2014 మార్చితో పోలిస్తే ఈ మొత్తం 29.5 బిలియన్ డాలర్లు (6.6%) ఎగశాయి. విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ), ఎన్ఆర్ఐ డిపాజిట్లు భారీగా పెరగడం రుణ భారం పెరగడానికి కారణం. 2015 మార్చి నాటికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చిచూస్తే విదేశీ రుణ భారం 23.8 శాతంగా ఉంది. జీప్ మోడల్‌పై ఫియట్ భారీ పెట్టుబడులు ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్(ఎఫ్సీఏ) సంస్థ జీప్ మోడల్ ఉత్పత్తి కోసం భారత్‌లో రూ.1,780 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. టాటా మోటార్స్‌తో కలిసి జాయింట్ వెంచర్‌గా ఉత్పత్తి చేయనున్న ఈ జీప్ మోడల్ 2017 జూన్‌కల్లా మార్కెట్లోకి వస్తుందని అంచనా. మహారాష్ట్రలోని రంజన్‌గావ్ ప్లాంట్‌లో ఈ జీప్ మోడల్‌ను ఉత్పత్తి చేస్తారు. వైజాగ్‌లో ఉబర్ సేవలు ఉబర్ కంపెనీ తన ట్యాక్సీ సేవలను వైజాగ్‌లో గురువారం నుంచి ప్రారంభించనుంది. వైజాగ్‌తోపాటు ఉబర్ సేవలు భువనేశ్వర్, కోయంబత్తూరు, ఇండోర్, మైసూర్, నాగ్‌పూర్, సూరత్ వంటి ఆరు టైర్-2 పట్టణాల్లో కూడా ప్రారంభంకానున్నాయి. దీంతో ఉబర్ సేవలు దేశంలో 18 పట్టణాల్లో ఉన్నట్లు అవుతుంది. అలాగే ఉబర్‌కు అమెరికా తర్వాత భారత్ రెండో అతిపెద్ద మార్కెట్ ప్రాంతంగా మారుతుంది. రూ. 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రధాని మోదీ డిజిటల్ ఇండియా వీక్ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఇందులో ముకేశ్ అంబానీ, సునీల్ మిట్టల్, సైరస్ మిస్త్రీ, కుమార మంగళం బిర్లా, అజీం ప్రేమ్‌జీ, అనిల్ అంబానీ, బెర్న్‌హార్డ్ గెర్వర్ట్ తదితర దేశ విదేశ దిగ్గజాలు పాల్గొన్నారు. వీరందరూ దాదాపు 18 లక్షల ఉద్యోగాల కల్పన జరిగేలా డిజిటల్ రంగంపై సుమారు రూ. 4.5 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో బిర్లా 7 బిలియన్ డాలర్లు, మిట్టల్ రూ. 1 లక్ష కోట్లు, అనిల్ అంబానీ రూ. 10,000 కోట్లు, కుమార మంగళం బిర్లా 9 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతామని వెల్లడించారు. భారత్‌లో హెచ్‌టీసీ అసెంబ్లింగ్ కేంద్రం హెచ్‌టీసీ భారత్‌లో మొబైళ్ల విక్రయాల్లో బలమైన వృద్ధిని సాధిస్తోంది. దీంతో భారత్‌లోనే స్థానికంగానే ఒక మొబైల్ అసెంబ్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. అయితే ఏ ప్రాంతంలో ఏర్పాటుచేసే అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ప్రస్తుతం హెచ్‌టీసీకి తైవాన్, చైనాల్లో అసెంబ్లింగ్ కేంద్రాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మొబైల్ నంబర్ పోర్టబిలిటీ దేశవ్యాప్తంగా పూర్తి స్థాయి మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్తో పాటు ప్రైవేట్ కంపెనీలు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, ఆర్‌కామ్.. ఇందుకుఅన్ని సన్నాహాలు చేసినట్లు తెలిపాయి. మొబైల్ వినియోగదారులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే .. వేరే టెలికం ఆపరేటరుకు మారినా పాత నంబరునే కొనసాగించుకునేందుకు ఎంఎన్‌పీ వల్ల వెసులుబాటు లభిస్తుంది. హైదరాబాద్‌లో గోల్డ్ డెలివరీ సెంటర్ నేషనల్ కమోడిటీ డెరివేటివ్ ఎక్స్ఛేంజ్ (ఎన్సీడెక్స్) హైదరాబాద్‌లో బంగారం డెలివరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఎన్‌సీడీఎక్స్ కొత్తగా ప్రవేశపెట్టిన ‘గోల్డ్ నౌ’ ఫార్వర్డ్ కాంట్రాక్టులను శుక్రవారం నుంచి హైదరాబాద్‌లో అందుబాటులోకి తీసుకురావడంతో ఇక్కడ డెలివరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎన్సీడెక్స్ బిజినెస్ హెడ్ సురేష్ దేవ్నాని తెలిపారు. గోల్డ్ నౌ ఫార్వర్డ్ కాంట్రాక్టు ద్వారా పది శాతం మార్జిన్ చెల్లించి బంగారం కోనుగోలు చేస్తే రెండు రోజుల తర్వాత డెలివరీ (టి+2) ఇస్తామన్నారు. ఎగుమతుల్లో ఎంపెడా రికార్డ్ స్థాయి వృద్ధి సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) ఎగుమతుల్లో రికార్డు స్థాయి వృద్ధి సాధించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 5511.12 మిలియన్ అమెరికా డాలర్ల విలువైన మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేసి ఈ ఆల్‌టైమ్ హై రికార్డును సొంతం చేసుకుంది. రూ.33,441.61 కోట్ల విలువైన 10,51,243 మెట్రిక్ టన్నుల మత్స్య సంపదను ఎగుమతి చేసింది. డీల్స్.. ► ప్రముఖ ఫార్మా దిగ్గజం లుపిన్ రష్యాకు చెందిన బయోకామ్ ఫార్మా కంపెనీని కొనుగోలు చేసింది. ఈ కంపెనీలో వంద శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేశామని లుపిన్ పేర్కొంది. అయితే ఆర్థిక వివరాలను వెల్లడించలేదు. ► భారత సాయుధ బలగాలకు అవసరమయ్యే హెలికాప్టర్ల తయారీ కోసం మహీంద్రా గ్రూప్, యూరోపియన్ దిగ్గజం ఎయిర్‌బస్ చేతులు కలిపాయి. ఎయిర్‌బస్ హెలికాప్టర్స్, మహీంద్రా డిఫెన్స్ కంపెనీలు కలిసి జాయింట్ వెంచర్ సంస్థను నెలకొల్పనున్నాయి. ► ఆన్లైన్ ట్యాక్సీ సర్వీసుల సంస్థ ఓలాలో పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా వ్యక్తిగత హోదాలో పెట్టుబడులు పెట్టారు. అయితే, ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేసింది, ఎంత వాటాలు తీసుకుంది వెల్లడి కాలేదు. ప్రస్తుతం ఓలా సంస్థకు దే శవ్యాప్తంగా 100 నగరాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. 1.5 లక్షల పైచిలుకు వాహనాలు ఇందులో నమోదయ్యాయి. నియామకాలు ► మారుతీ సుజుకీ మాతృసంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్ ప్రెసిడెంట్‌గా తొషిహిరో సుజుకీ ఎంపికయ్యారు. ► ప్రముఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ సంస్థ ఐడీఎఫ్సీ స్వతంత్ర డెరైక్టర్‌గా కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) మాజీ డెరైక్టర్ వినోద్ రాయ్ నియమితులయ్యారు.ఆయన ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఎల్ఐసీలకు సంబంధించిన బోర్డులలో డెరైక్టర్‌గా ఉన్నారు. ► టాటా మోటార్స్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా సి.రామకృష్ణన్ నియమితులయ్యారు. ► ఆయిల్ ఇండియా తాత్కాలిక చైర్మన్‌గా యు.పి. సింగ్‌ను ప్రభుత్వం నియమించింది. చమురు మంత్రిత్వ శాఖలో ఆయన సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ► ఐసీఐసీఐ బ్యాంకు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కె.వి.కామత్ స్థానంలో ఎం.కె.శర్మ నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం మూడేళ్లు. ► సింగపూర్‌కు చెందిన జంగ్లీ వెంచర్స్‌కు ప్రత్యేక సలహాదారుగా రతన్ టాటా వ్యవహరించనున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వినూత్నమైన టెక్నాలజీ కంపెనీలకు తోడ్పాటునందించేందుకు అనురాగ శ్రీవాత్సవ, అమిత్ ఆనంద్‌లు జంగ్లీ వెంచర్స్‌ను ప్రారంభించారు. -
ఎంఎన్‌పీతో టెలికం సర్వీసులు మెరుగు
- టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన పూర్తి స్థాయి మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) వల్ల టెల్కోల మధ్య పోటీతత్వం పెరుగుతుందని, సర్వీసులు మెరుగుపడటంతో పాటు ప్రజలకు సాధికారత లభించగలదని కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. పూర్తి స్థాయి ఎంఎన్‌పీని మేలోనే ప్రారంభించాలని ముందుగా భావించినప్పటికీ టెలికం ఆపరేటర్ల విజ్ఞప్తి మేరకు జూలై 3 దాకా పొడిగించాల్సి వచ్చిందని బీఎస్ఎన్ఎల్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. ‘ఇకపై మీ మొబైల్ నంబరుకు మీరే యజమాని. మీరెక్కడికెళ్లినా మీ నంబరును మార్చనక్కర్లేదు’ అని మొబైల్ సబ్‌స్క్రయిబర్స్‌ను ఉద్దేశించి ఆయన చెప్పారు. మొబైల్ వినియోగదారులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే .. వేరే టెలికం ఆపరేటరుకు మారినా పాత నంబరునే కొనసాగించుకునేందుకు వీలు కల్పించే పూర్తి స్థాయి ఎంఎన్‌పీ.. శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటిదాకా ఈ సదుపాయం కేవలం ఒక టెలికం సర్కిల్ పరిధికి మాత్రమే పరిమితమై ఉండేది. ఈ సదుపాయం వల్ల వేరే టెలికం సర్కిల్‌లోకి నంబరు మార్చుకుంటే సదరు సర్కిల్లో రోమింగ్ చార్జీలు భారం ఉండదు. అయితే, టెలికం సర్కిల్ పరిధి వెలుపల మాత్రం రోమింగ్ చార్జీలు వర్తిస్తాయి. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌సెల్, యూనినార్, టాటా డొకొమో తదితర టెలికం సంస్థలన్నీ ఎంఎన్‌పీని అమల్లోకి తెచ్చాయి. -
దేశవ్యాప్తంగా మొబైల్ నంబర్ పోర్టబిలిటీ
నేటి నుంచే పూర్తి స్థాయిలో అమలు న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పూర్తి స్థాయి మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) శుక్రవారం అమల్లోకి వస్తోంది. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్తో పాటు ప్రైవేట్ రంగ కంపెనీలు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, ఆర్‌కామ్.. ఇందుకోసం అన్ని సన్నాహాలు చేసినట్లు తెలిపాయి. అలాగే, యూనినార్, సిస్టెమా శ్యామ్ టెలీసర్వీసెస్, వీడియోకాన్ కూడా ఎంఎన్‌పీ అమలుకు సిద్ధమయ్యాయి. మొబైల్ వినియోగదారులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే .. వేరే టెలికం ఆపరేటరుకు మారినా పాత నంబరునే కొనసాగించుకునేందుకు ఎంఎన్‌పీ వల్ల వెసులుబాటు లభిస్తుంది. దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు జూలై 3 ఆఖరు తేదిగా ప్రభుత్వం నిర్దేశించింది. ఎంఎన్‌పీ సేవలు అందించేందుకు తమ నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేసినట్లు ఐడియా సెల్యులార్ తెలిపింది. తమ ప్రీ-పెయిడ్, పోస్ట్-పెయిడ్ కస్టమర్ల కోసం, వేరే సంస్థల నుంచి తమ కంపెనీకి మారే కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నట్లు రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) తెలిపింది. అటు ఎయిర్టెల్ కూడా ఎంఎన్‌పీకి సంబంధించి ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. నంబర్ పోర్టబిలిటీ అమలు కోసం తమ ఐటీ, నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అప్‌గ్రేడ్ చేసుకున్నట్లు యూనినార్ వెల్లడించింది. -
15 నుంచి బీఎస్ఎన్ఎల్ ఉచిత రోమింగ్
* జూలైలో పూర్తి మొబైల్ నంబర్ పోర్టబులిటీ * కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సాక్షి, న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ పరిధిలో ఉచిత రోమింగ్ సేవలు జూన్ 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. పూర్తిస్థాయి మొబైల్ నంబర్ పోర్టబులిటీ జూలై నుంచి మొదలవ్వనుందని తెలిపారు. ఢిల్లీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టెలికం, పోస్టల్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో సాధించిన ప్రగతిని ఆయన వివరించారు. 2004లో బీఎస్ఎన్ఎల్ రూ.10 వేల కోట్ల లాభాల్లో ఉండగా యూపీఏ పదేళ్ల పాలనలో రూ.7,500 కోట్ల నష్టాల్లోకి వెళ్లిందన్నారు. 2008 వరకు లాభా ల్లో ఉన్న ఎంటీఎన్ఎల్ కూడా నష్టాల బాట పట్టిం దన్నారు. వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడం, టెలికం, పోస్టల్, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధి లక్ష్యంగా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామన్నారు. స్పెక్ట్రం వేలం ద్వారా ప్రభుత్వానికి లక్ష కోట్లకు పైగా ఆదాయం సమకూరిందన్నారు. దేశంలోని 100 పర్యాటక ప్రాంతాల్లో వైఫై ఏర్పాటు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తెలంగాణలోని హైదరాబాద్ సహా బెంగుళూరు, వారణాసిలో ఇప్పటికే వైఫై సేవలు ప్రారంభమైనట్లు వెల్లడించారు. -
ఎంఎన్‌పీ అంటేనే హడల్!
⇒ బీఎస్ఎన్ఎల్ అధికారుల నిర్లక్ష్యం ⇒ తిప్పలు పడుతున్న వినియోగదారులు ⇒ ప్రభుత్వరంగ నెట్‌వర్క్‌పై తీవ్ర అసంతృప్తి ⇒ వారాల తరబడి యాక్టివేషన్ కాని కొత్త సిమ్‌లు తిరుపతి అర్బన్: మొబైల్ నంబర్ పోర్టబులిటి (ఎంఎన్‌పీ)... ఈ విధానంతో ఒక మొబైల్ నెట్వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు మారే వెసులుబాటు ఉంది. ఈ కొత్త విధానాన్ని ఏడాది కిందటే కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. అయితే ఇప్పటికి కూడా ఈ విధానం అమలులో లోపాలు సరిదిద్దలేని పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో కోరుకున్న నెట్వర్క్ సకాలంలో అందక, యాక్టివేషన్కాక వినియోగదారులు నిత్యం అవస్థలు పడుతున్నారు.ముఖ్యంగా ప్రభుత్వరంగ టెలికం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్లో ఆ అవస్థలు మరిన్ని ఎక్కువగా ఉంటున్నాయి. అందుకు సంస్థలోని సాంకేతిక విభాగం అధికారుల నుంచి సిబ్బంది వరకు నెలకొన్న నిర్లక్ష్య ధోరణే ప్రధాన కారణమని వినియోగదారులు మండిపడుతున్నారు. పలువురు వినియోగదారులు కార్పొరేట్ మొబైల్ సంస్థల నెట్వర్క్ నుంచి బీఎస్ఎన్ఎల్కు మారేవారు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లకు బీఎస్ఎన్ఎల్ అధికారులు చవిచూపుతున్న చేదు అనుభవాలతో ‘ఇక మాకు ఈ ప్రభుత్వ నెట్వర్కే వద్దు దేవుడా...’ అనే పరిస్థితులు కల్పిస్తున్నాయి. ఒక్కసారి ఎంఎన్‌పీ కోసం బీఎస్ఎన్ఎల్లో దరఖాస్తు చేసుకుంటే సంబంధిత వినియోగదారుని ప్రాంతంలోని జేటీవో లేదా టీటీఏ స్థాయి అధికారి ధ్రువీకరించాల్సి ఉంటుంది. అందుకోసం వినియోగదారుడు రోజుల తరబడి ప్రదక్షిణలు చేసినా ఆ అధికారులు అందుబాటులో ఉండరు. ఆ కారణంతో పోర్టబులిటీ పెట్టుకున్న నెట్వర్క్ సకాలంలో యాక్టివేషన్ కాకుండా ఒకవైపు, పాత నెట్వర్క్ సంస్థ నుంచి డిస్కనెక్ట్ చేసుకుని మరోవైపు వినియోగదారునికి అవస్థలు తప్పడం లేదు.బీఎస్ఎన్ఎల్ జిల్లా కార్యాలయ కేంద్రం, జనరల్ మేనేజర్ కొలువైన తిరుపతిలోని వినియోగదారులకే ఎదురవుతున్న నిత్య అవస్థలు ఇవి. జిల్లా మొత్తంలోని బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అవసరమయ్యే ఎలాంటి సేవలనైనా క్షణాల్లో జీఎం కార్యాలయం ద్వారా అందించేంత సాంకేతిక పరిజ్ఞానం ఉంది. వినియోగదారులు తమకు కావాల్సిన ఏ సేవలకైనా నేరుగా ప్రధాన కార్యాలయానికి వస్తుంటారు. అయితే ఇక్కడి అధికారులు సవాలక్ష ఆంక్షలు ఉన్నాయని చెప్పి మళ్లీ వినియోగదారులను ఆయా ఎక్స్చేంజీల అధికారుల వద్దకు వెళ్లాలని సెలవిస్తున్నారు. దీంతో ప్రధాన కార్యాలయం అధికారులు చెప్పే సలహాలు విని ఆయా ప్రాంతాల అధికారుల వద్దకెళ్తే ఇక వారు రోజుల తరబడి అందుబాటులో ఉండరు. ఇలాంటి అవస్థలు నగరంలోని వినియోగదారులకే నిత్యం ఎదురవుతుంటే ఇక మారుమూల ప్రాంతాల్లోని వారికి ఎదురవుతున్న అవస్థలు ఏ పాటివో అర్థం చేసుకోవచ్చు. యాక్టివేట్ కాని కొత్త సిమ్‌లు... ఎంఎన్‌పీ ద్వారా వినియోగదారులు కొనుగోలు చేసుకున్న బీఎస్ఎన్ఎల్ 2జీ, 3జీ, స్మార్ట్ ఫోన్ సిమ్‌లు వారాల తరబడి యాక్టివేషన్‌కు నోచుకోవడం లేదని వినియోగదారులు పేర్కొంటున్నారు. ఒక్కసారి ఇతర నెట్‌వర్క్‌ల నుంచి బీఎస్ఎన్ఎల్కు ఎంఎన్‌పీ ద్వారా మార్పు చేసుకుంటే 48 గంటల్లో సిమ్ యాక్టివేట్ కావాల్సి వుంది. అయితే స్థానిక టెక్నికల్, సిమ్ విభాగాల అధికారుల నిర్లక్ష్య ధోరణితో వేలాది మంది ఎంఎన్‌పీ వినియోగదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాక ఎంఎన్‌పీ ద్వారా తీసుకునే సిమ్ పోస్టుపెయిడ్ అయితే డిపాజిట్ కూడా వేలల్లో ఉంటుంది. దీంతో వినియోగదారునికి ఆర్థిక కష్టాలూ తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా బీఎస్ఎన్ఎల్ జీఎం తగు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. అన్ని సేవలు ఇక్కడే అందేలా చర్యలు: బీఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో అన్ని సేవలు ఇప్పటికే ఆన్లైన్ అనుసంధానంతో కొనసాగుతున్నాయి. వాటిలో ఎంఎన్‌పీకి సంబంధించిన సిమ్ యాక్టివేషన్, వెరిఫికేషన్ వంటి కార్యక్రమాలను ఆయా ప్రాంతాల జేటీవోలకు కాకుండా ఇక్కడే జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. కొత్త సిమ్ల యాక్టివేషన్ విషయమై టెక్నికల్ విభాగంలో, సేల్స్ కౌంటర్లలో విచారించి సమస్యను పరిష్కరిస్తాం. - ఎంఎస్ఏ న్యూటన్, బీఎస్ఎన్ఎల్ జీఎం, తిరుపతి టెలికం జిల్లా -
మార్చి 3 నుంచి దేశవ్యాప్తంగా మొబైల్ పోర్టబిలిటీ
ఎంఎన్‌పీ చట్టానికి సవరణ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మొబైల్ నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్‌పీ) వచ్చే నెల 3 నుంచి అమల్లోకి వస్తోంది. ఈ మేరకు టెలికం నియంత్రణ సంస్థ(ట్రాయ్) 2009 నాటి ఎంఎన్‌పీ నిబంధనలను సవరించింది. ఈ చట్టానికి చేసిన ఆరో సవరణ ప్రకారం దేశవ్యాప్తంగా వచ్చే నెల 3 నుంచి ఎంఎన్‌పీ అందుబాటులోకి వస్తుందని ట్రాయ్ పేర్కొంది. వినియోగదారుడు తన ఫోన్ నంబర్‌ను మార్చుకోకుండానే టెలికం సర్వీసులందజేసే ఆపరేటర్‌ను మార్చుకోవడానిన ఎంఎన్‌పీగా వ్యవహరిస్తారు. ఇప్పటివరకూ ఈ ఎంఎన్‌పీ ఒక టెలికం సర్కిల్(సాధారణంగా ఒక రాష్ట్రానికి)కు మాత్రమే పరిమితమై ఉంది. ఇక వచ్చే నెల 3 నుంచి ఇది దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. అంటే హైదరాబాద్‌లో ఉన్న వినియోగదారుడు ఢిల్లీకి మారితే, అక్కడ ఆ యూజర్ ఎంఎన్‌పీని పొందొచ్చు. కాగా ఎంఎన్‌పీ నిబంధనలు ఉల్లంఘించినందుకు మొబైల్ సర్వీసులందజేసే కంపెనీలపై రూ.9.4 కోట్ల జరిమానాలు విధించామని టెలికం మంత్రి రవిశంకర్ పేర్కొన్నారు. లోక్‌సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. నిర్దేశిత గడువులోగా వినియోగదారుడి ఎంఎన్‌పీని పూర్తి చేయలేని పక్షంలో రూ.5,000కు మించకుండా ట్రాయ్ జరిమానా విధించవచ్చన్నారు. ఎంఎన్‌పీ విజ్నప్తిని అన్యాయంగా తిరస్కరిస్తే రూ.10,000కు మించకుండా జరిమానా విధించవచ్చని వివరించారు. -
మే 3 నాటికి పూర్తిస్థాయి నంబర్ పోర్టబిలిటీ
న్యూఢిల్లీ: పూర్తిస్థాయి మొబైల్ నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్‌పీ)ని వచ్చే ఏడాది మే 3 కల్లా అమల్లోకి తీసుకురావాలని టెలికం కంపెనీలకు కేంద్రం నిర్ధేశించింది. ఈ నెల 3న టెల్కోలకు రాసిన లేఖలో టెలికం శాఖ ఈ ఆదేశాలను జారీచేసింది. మొబైల్ యూజర్లు తమ టెలికం ఆపరేటర్‌ను మార్చినా అదే నంబర్‌ను కొనసాగించుకునేందుకు ఎంఎన్‌పీ ఉపయోగపడుతుంది. అయితే, ప్రస్తుతం(2010-11 నుంచి) పాక్షిక ఎంఎన్‌పీ అమల్లో ఉంది. అంటే ఒకే సర్కిల్లో నంబర్ మారకుండా టెల్కోలను మార్చుకునేందుకు వీలవుతుంది. ఇప్పుడు పూర్తిస్థాయి ఎంఎన్‌పీ అమల్లోకివస్తే... దేశంలోని అన్ని సర్కిళ్లలో ఏ టెల్కో సేవలకు మారినా యూజర్లు అదే మొబైల్ నంబర్‌ను వాడుకునే చాన్స్ లభిస్తుంది. ఉదాహరణకు హైదరాబాద్‌లోని ఒక టెలికం కంపెనీ కస్టమర్.. తన నంబర్‌ను మార్చకుండానే పంజాబ్‌లోని మరో టెలికం ఆపరేటర్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22 టెలికం సర్కిళ్లు/సర్వీస్ ఏరియాలు ఉన్నాయి. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాల ప్రకారం... ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది మొబైల్ యూజర్లు ఎంఎన్‌పీ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అంచనా. -
మార్చినాటికి పూర్తి స్థాయి నంబర్ పోర్టబిలిటీ
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి 31లోగా దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో మొబైల్ నంబర్ పోర్టబిలిటీని (ఎంఎన్‌పీ) అమల్లోకి తేవాలని టెలికం శాఖ నిర్దేశించుకుంది. దీని వల్ల సర్కిల్ మారినా మొబైల్ నంబరు మార్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇతర టెలికం కంపెనీ సర్వీసులకు మారే వీలు లభిస్తుంది. ఉదాహరణకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టెలికం సర్కిల్లో ఉన్న మొబైల్ యూజరు ఒకవేళ తన నంబరు మార్చుకోకుండా వేరే టెలికం కంపెనీకి మారదల్చుకుంటే.. ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో మాత్రమే మార్చుకోవడానికి వీలుంది. అదే పూర్తి స్థాయి ఎంఎన్‌పీ అమల్లోకి వస్తే ఇతర రాష్ట్రాల సర్కిల్స్‌లో సైతం వేరే టెలికం కంపెనీకి మారడానికి వెసులుబాటు లభిస్తుంది. ఇందుకు సంబంధించి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సులకు టెలికం కమిషన్ ఆమోదముద్ర వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తుది ఆమోదముద్ర కోసం టెలికం కమిషన్ నిర్ణయాన్ని టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ ముందు ఉంచనున్నట్లు వివరించాయి. పూర్తి స్థాయి ఎంఎన్‌పీ అమలుకు సంబంధించి ప్రతిపాదనపై ఆమోదముద్ర వేసినప్పట్నుంచీ ఆరు నెలల పాటు టెలికం ఆపరేటర్లకు వ్యవధి ఇవ్వాలని ట్రాయ్ సిఫార్సు చేసింది. మరోవైపు తదుపరి రౌండు స్పెక్ట్రం వేలం ప్రక్రియ నిర్వహణ కోసం వేలంపాటదారు ఎంపిక తదితర అంశాలకు సంబంధించిన ప్రక్రియకు టెలికం కమిషన్ ఆమోదముద్ర వేసింది. ఆక్షనీర్ల(టెలికం కంపెనీలు) నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నవంబర్ తొలి వారంలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన కూడా టెలికం శాఖ మంత్రి ముందు ఉంచనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 95 కోట్లకు టెలికం యూజర్ల సంఖ్య... * టెలికం వినియోగదారుల సంఖ్య ఈ ఏడాది ఆగస్టులో 95 కోట్లను దాటింది. వీటిల్లో మొబైల్ వినియోగదారుల సంఖ్య 92.43 కోట్లుగా ఉందని ట్రాయ్ తెలి పింది. టెలికం యూజర్ల సంఖ్య 95 కోట్లను అధిగ మించడం ఇది రెండోసారి. గతంలో 2012 మార్చిలో ఈ సంఖ్య 95 కోట్లను దాటింది. ట్రాయ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం... * ఈ ఏడాది జూలైలో 94.64 కోట్లుగా ఉన్న మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య ఈ ఏడాది ఆగస్టులో 95.18 కోట్లకు పెరిగింది. * మొబైల్, ఇంటర్నెట్ డాంగిల్ కనెక్షన్లతో కలిపి మొత్తం వెర్లైస్ యూజర్ల సంఖ్య 92.4 కోట్లకు చేరింది. * మొత్తం టెలికం కస్టమర్లలో ప్రైవేట్ కంపెనీల వినియోగదారుల వాటా 90 శాతానికి పైగా ఉంది. -
ఇక పూర్తి స్థాయి నంబర్ పోర్టబిలిటీ
* పంచాయతీల్లో బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ సవరణ ప్రతిపాదనకు ఓకే * నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లో టెలికం సేవల విస్తృతిపై దృష్టి * టెలికం కమిషన్ నిర్ణయాలు న్యూఢిల్లీ: దేశంలో ఏ ప్రాంతానికి వె ళ్లినా, ఆపరేటరును మార్చినా మొబైల్ నంబరును మార్చుకోవాల్సిన పని లేకుండా పూర్తి స్థాయి మొబైల్ నంబరు పోర్టబిలిటీకి (ఎంఎన్‌పీ) టెలికం కమిషన్ సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎంఎన్‌పీ విధానం ప్రకారం ఆపరేటరు మారినా ఒకే నంబరును కొనసాగించుకునే వెసులుబాటు ఒక సర్కిల్‌కి మాత్రమే పరిమితమైంది. టెలికం కమిషన్ నిర్ణయంతో.. సర్కిల్ మారినా కూడా దేశవ్యాప్తంగా ఈ వెసులుబాటు లభిస్తుంది. పూర్తి స్థాయి ఎంఎన్‌పీ అమలు విషయంలో బ్యాంకు గ్యారంటీలు తదితర అంశాల గురించి ట్రాయ్ నుంచి మరింత అదనపు సమాచారాన్ని టెలికం కమిషన్ కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. శుక్రవారం సమావేశమైన అంతర -మంత్రిత్వ శాఖల టెలికం కమిషన్.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు ప్రతిపాదనలను ఆమోదించింది. 2.5 లక్షల గ్రామ పంచాయతీల్లో జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ (ఎన్‌వోఎఫ్‌ఎన్) ప్రాజెక్టు గడువును 2017 మార్చి దాకా పొడిగిస్తూ సవరించిన ప్రతిపాదనకు ఓకే చెప్పింది. దాదాపు రూ. 20,000 కోట్ల ఈ ప్రాజెక్టు 2015 సెప్టెంబర్ నాటికి పూర్తి కావాల్సి ఉంది. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, పవర్‌గ్రిడ్, రెయిల్‌టెల్‌తో ఏర్పాటు చేసిన భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ ఇందులో సింహభాగం పనులు చేపడుతోంది. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో మొబైల్ టవర్లు.. తొమ్మిది నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో టెలిఫోన్ సేవలు విస్తరించేందుకు మొబైల్ టవర్లను ఏర్పాటు చేయాలన్న యోచనకు టెలికం కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో టెలికం నెట్‌వర్క్‌ను పటిష్టం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ. 2,900 కోట్ల వ్యయం కాగలదని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ అంచనా వేసింది. ఈ ప్రతిపాదనలను క్యాబినెట్ తుది ఆమోదానికి పంపనున్నారు. ఎన్‌వోఎఫ్‌ఎన్ ఇన్ఫ్రాను వినియోగించుకునే గవర్నమెంట్ యూజర్ నెట్వర్క్ (గన్) అనే వైఫై ప్రాజెక్టుకు కూడా టెలికం కమిషన్ ఆమోదముద్ర వేసింది. దీనికి రూ. 25,000 కోట్ల మేర నిధులు అవసరమవుతాయని అంచనా. అటు ప్రభుత్వోద్యోగులకు శిక్షణ కల్పించేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఫైనాన్స్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది. దీనిపై క్యాబినెట్ తుదినిర్ణయం తీసుకోనుంది. -
ఎంఎన్‌పీ వినియోగదార్లు @ 10 కోట్లు
న్యూఢిల్లీ: భారత్‌లో ఇప్పటివరకూ మొబైల్ నంబర్ పోర్టబిలిటి(ఎంఎన్‌పీ)ని వినియోగించుకున్న వారి సంఖ్య 10 కోట్లుగా ఉందని టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) తెలిపింది. ఇది మొత్తం మొబైల్ వినియోగదారుల్లో ( ఈ ఏడాది మార్చి 31 నాటికి 90.45 కోట్లు) 11 శాతానికి సమానమని పేర్కొంది. ఏదైనా ఒక టెలికాం సర్కిల్లో మొబైల్ నంబర్‌ను మార్చుకోకుండానే, టెలికాం ఆపరేటర్‌ను మార్చుకునే సౌకర్యాన్ని ఎంఎన్‌పీ అంటారు. ఇది అమల్లోకి వచ్చి మూడేళ్లయింది. కాగా, ఎంఎన్‌పీ పోర్టింగ్ చార్జీలను ట్రాయ్ రూ.19గా నిర్ణయించింది. ఎంఎన్‌పీ నిబంధనలను ఉల్లంఘించిన, పోర్టింగ్ విజ్ఞప్తులను తిరస్కరించిన టెలికాం కంపెనీలపై ట్రాయ్ ఇప్పటిదాకా రూ.8 కోట్ల జరిమానాలను వడ్డించింది. కాగా నంబర్‌ను మార్చుకోకుండానే దేశవ్యాప్తంగా వేరే టెలికాం ఆపరేటర్‌ను మార్చుకునే పూర్తి మొబైల్ నంబర్ పోర్టబిలిటికి సంబంధించి ప్రతిపాదనలను ట్రాయ్ ఇప్పటికే రూపొందించింది. ఈ పూర్తి ఎంఎన్‌పీ ప్రతిపాదనలపై టెలికాం డిపార్ట్మెంట్ ప్రస్తుతం కసరత్తు చేస్తోంది.