seven days
-
నంబరు ‘పోర్టింగ్’ వ్యవధి 7 రోజులకు తగ్గింపు
న్యూఢిల్లీ: సిమ్ కార్డు దెబ్బతినడం వంటి కారణాలతో దాన్ని రీప్లేస్ చేసిన తర్వాత, మొబైల్ నంబరు పోర్టింగ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వ్యవధిని ట్రాయ్ ఏడు రోజులకు తగ్గించింది. వాస్తవానికి మొబైల్ ఫోన్ నంబర్లతో జరిగే మోసాలను కట్టడి చేసేందుకు గతంలో ఈ వ్యవధి పది రోజులుగా ఉండేది. అయితే, అత్యవసరంగా పోరి్టంగ్ చేసుకోవాల్సిన సందర్భాల్లో అన్ని రోజులు నిరీక్షించడం సమస్యగా ఉంటోందని, దీన్ని రెండు నుంచి నాలుగు రోజులకు తగ్గిస్తే సముచితంగా ఉంటుందని పలు వర్గాలు అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు వివరణ నోట్లో ట్రాయ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా అటు మోసపూరిత పోర్టింగ్‌ను కట్టడి చేసేందుకు సమయం మరీ తక్కువ కాకుండా ఇటు వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా ఉండేలా చూసేందుకు దీన్ని ఏడు రోజులకు మారుస్తూ తాజా సవరణ చేసినట్లు తెలిపింది. ఇది జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం సిమ్‌ను మార్చుకున్న ఏడు రోజుల్లోగా పోరి్టంగ్ కోసం ప్రయతి్నస్తే యూనిక్ పోరి్టంగ్ కోడ్ (యూపీసీ) లభించకుండా, దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. -
హోం క్వారంటైన్ ఇక ఏడు రోజులే
న్యూఢిల్లీ: కరోనా ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు విస్తృతంగా వ్యాపిస్తూ థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో హోం క్వారంటైన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ వేరియెంట్ ప్రమాదకారి కాకపోవడంతో హోం క్వారంటైన్ వ్యవధిని 10 రోజుల నుంచి ఏడు రోజులకు తగ్గించింది. కోవిడ్–19 స్వల్ప లక్షణాలు కలిగిన వారు, ఏ లక్షణాలు లేకుండా పాజిటివ్ వచ్చిన వారికి హోం క్వారంటైన్ కాల పరిమితిని తగ్గిస్తూ బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన దగ్గర్నుంచి ఏడు రోజులు ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుందని స్పష్టం చేసింది. ప్రజలెవరూ సొంత వైద్యం చేసుకోవద్దని సూచించింది. వైద్యుడిని సంప్రదించకుండా సీటీ స్కాన్, ఎక్స్‌రేలు, రక్త పరీక్షలు చేయించుకోవద్దని హితవు చెప్పింది. వైద్యులు చెప్పకుండా సొంతంగా స్టెరాయిడ్స్ వంటివి తీసుకుంటే ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించింది. ► ఎవరికైనా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణై స్వల్ప లక్షణాలు, లేదంటే అసలు లక్షణాలు లేకపోతే వారు హోం క్వారంటైన్ ఉంటే సరిపోతుంది. ► కరోనా సోకిన తర్వాత వరుసగా మూడు రోజులు జ్వరం రాకపోతే మాస్కులు ధరించి వారు బయట తిరగవచ్చు. ► స్వల్ప లక్షణాలున్న వారు హోం క్వారంటైన్ ముగిసిన తర్వాత తిరిగి కరోనా పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. కోవిడ్–19 నెగెటివ్‌గానే వారిని పరిగణిస్తారు. ► 60 ఏళ్ల వయసు పైబడి గుండె, కిడ్నీ వంటి వ్యాధులున్న వారు వైద్యుల పర్యవేక్షణలో హోం క్వారంటైన్లో ఉండాలి. ► హెచ్ఐవీ, కేన్సర్ రోగులు మాత్రం కరోనా సోకిన వెంటనే ఆస్పత్రిలో చేరాలి ► జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు హోం క్వారంటైన్ కేసుల్ని పర్యవేక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి బాధ్యత వహించాలి. ► క్షేత్ర స్థాయిలో ఎఎన్ఎం, శానిటరీ ఇన్స్పెక్టర్, మల్టీపర్పస్ హెల్త్‌వర్కర్‌తో కూడిన కోవిడ్ బృందాలు హోం క్వారంటైన్ రోగుల్ని పర్యవేక్షిస్తూ ఉండాలి. ► రాష్ట్ర ప్రభుత్వాల విధానాల ఆధారంగా ఈ బృందాలు రోగులకు కరోనా కిట్లను అందించాలి. డేంజర్ బెల్స్ భారత్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని కేంద్రం తెలిపింది. వైరస్ వ్యాప్తిని సూచించే ఆర్–వాల్యూ ప్రస్తుతం ఏకంగా 2.69కు చేరింది. డెల్టా వేరియెంట్ కారణంగా సెకండ్ వేవ్ అత్యంత ఉధృతంగా ఉన్నపుడు సైతం గరిష్ట ఆర్– వాల్యూ 1.69 శాతమేనని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు. నగరాల్లో వ్యాప్తి ఎక్కువగా ఉందని, ఒమిక్రానే ప్రధాన వేరియెంట్‌గా అవతరించిందని పేర్కొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడటాన్ని నివారించాలన్నారు. -
ఉద్యోగం వచ్చిన వారం రోజులకే.
రామభద్రపురం: ఒక్కగానొక్క కుమారుడు. ఉద్యోగం వచ్చి వారం రోజులు కూడా కాలేదు. ఇంతలోనే ఆ ఇంటి దీపం ఆరిపోయింది. ఉద్యోగం వచ్చింది.. మిమ్మల్ని బాగా చూసుకుంటానన్న కుమారుడు అర్ధంతరంగా కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని సోంపురం గ్రామ సమీపంలో ఉన్న చెరువులో ఆటో బోల్తా పడిన సంఘటనలో ఇట్లామామిడిపల్లి గ్రామానికి చెందిన రెడ్డి గణపతి (28) దుర్మరణం చెందాడు. ఇతనికి వారం రోజుల కిందటే కొమరాడ మండలం మాదలింగి పీహెచ్సీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం వచ్చింది. ఆదివారం ఉగాది పండుగ కావడంతో తల్లిదండ్రులతో గడిపేందుకు గణపతి స్వగ్రామానికి వచ్చాడు. ఈ సందర్భంగా స్నేహితులతో సరదాగా గడిపాడు. స్నేహితుడు ధనుకొండ రమేష్ ఇంట్లో భోజనం చేశాడు. అనంతరం స్నేహితుడి ఆటోలో రామభద్రపురం బయలుదేరారు. సరిగ్గా సోంపురం వద్ద గల చెరువు వద్దకు చేరుకోగానే ప్రమాదవశాత్తూ ఆటో చెరువులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గణపతి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రెడ్డి తిరుపతి, పార్వతి సంఘటనా స్థలానికి చేరుకుని కుమారుడు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఉద్యోగం వచ్చిన కొద్ది రోజులకే నీకు నూరేళ్లూ నిండిపోయాయా నాయనా? అంటూ వారు రోదిస్తున్న తీరు చూసి అక్కడి వారి కళ్లు చెమర్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం బాడంగి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డీడీ నాయుడు తెలిపారు. -
ఈ 'పిల్'తో ఆ ఆలోచన రానేరాదట!
నిరాశ, నిస్పృహలో కుంగిపోయిన చాలామందిని 'ఆత్మహత్య' ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. సమస్యలు, నిస్సహాత, మానసిక బలహీనతలే చాలామందిని బలవన్మరణాలకు ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏడురోజుల్లోనే ఆత్మహత్యకు పురికొల్పే ఆలోచనలకు పుల్ స్టాఫ్ పెట్టే సరికొత్త ఔషధ మాత్రను తాజాగా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వారంలోపే ఈ మాత్ర ప్రభావం చూపి మనుష్యులను బలన్మరణం ముప్పు నుంచి తప్పిస్తుందని వారు తెలిపారు. మెదడులో ఉత్పత్తి అయ్యే 'ఫీల్ గుడ్ రసాయనం' 'ఒపియాయిడ్'తో రూపొందిన ఈ ఔషధం వల్ల ఏడురోజుల్లోనే మనుష్యుల్లో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు గణనీయంగా ఆగిపోయాయని ప్రాథమిక పరీక్షల్లో తేలింది. ఈ పరీక్షల్లో భాగంగా తమ జీవితాన్ని చాలించాలనుకుంటూ ప్రమాదకర స్థితిలో 40 మంది వ్యక్తులకు 'ఒపియాయిడ్'ను తక్కువ మోతాదులో ఏడురోజులపాటు ఇచ్చారు. దీంతో వారిలో ఈ ఆలోచనలు 50శాతం తగ్గి.. సానుకూల దృక్పథం మెరుగుపడింది. ఈ మేరకు అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తలు పరీక్షలు నిర్వహించారు. 'ఒపియాయిడ్'ను సాధారణంగా నొప్పి తగ్గించేందుకు 'పెయిన్ కిల్లర్'గా వైద్యులు ఉపయోగిస్తారు. బుప్రీనార్ఫైన్గా పిలిచే దీనిని వేసుకోవడం వల్ల కేవలం వారంరోజుల్లోనే ఆత్మహత్య ఆలోచనలు తిరుగుముఖం పట్టాయని న్యూసైంటిస్ట్ పత్రిక తెలిపింది. మరిన్ని పరీక్షల్లో కూడా ఈ మాత్ర విజయవంతమైతే త్వరలోనే ఆత్మహత్యలను నిరోధించేందుకు వేగంగా పనిచేసే ఔషధం మార్కెట్లోకి వచ్చినట్టేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆత్మహత్య ఆలోచనలతో సతమతమవుతున్న వ్యక్తులపై ప్రస్తుతం అనుసరిస్తున్న సంప్రదాయ విధానాలైన కౌన్సెలింగ్, కుంగుబాటు నిరోధక చికిత్సల ప్రభావం దాదాపు ఆరునెలలకుకానీ ఉండటం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఔషధ మాత్ర మార్కెట్లోకి వస్తే గణనీయమైన ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు.