ఢాకా : భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్ సేవలను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిలిపి వేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భద్రతా కారణాలను ప్రస్తావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బంగ్లాదేశ్ టెలికాం ఆపరేటర్లు పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్న నేపథ్యంలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కిలోమీటర్ పరిధిలో మొబైల్ నెట్‌వర్క్ సేవలు నిలిపి వేయాలనే నిర్ణయం తీసుకున్నామని సోమవారం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సీఏఏ చట్టం తీసుకు వచ్చిన అనంతరం ఈ చట్టానికి వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్ ముస్లింలు బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించవచ్చనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. మొబైల్ నెట్‌వర్క్‌ల నిలిపివేత ప్రభావం దాదాపు 1 కోటి మందిపై పడుతుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment