హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత టెలికం పరిశ్రమ మూడేళ్లకోసారి రూ.1,03,262 కోట్ల ఆదాయ వృద్ధి నమోదు చేస్తుందని డెలాయిట్ ఇండియా–సీఐఐ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణలను పెంచే అవకాశం ఉన్న 5జీ రాక ఇందుకు కారణమని వివరించింది. ‘2023 చివరినాటికి భారత టెలికం పరిశ్రమ రూ.10,32,625 కోట్లకు చేరుతుంది. 5జీ ఎంట్రీతో మూడేళ్లకోసారి పరిశ్రమకు ఒక లక్ష కోట్లు తోడవుతాయి.
2022 అక్టోబరులో 5జీ సేవలు ప్రారంభం అయిన నెలరోజుల్లోనే ఒక టెలికం కంపెనీ 10 లక్షల 5జీ చందాదార్ల సంఖ్యను దాటింది. ఆర్థిక వృద్ధిని 5జీ వేగవంతం చేస్తుంది. అలాగే ఉద్యోగ అవకాశాలను పెంచుతుంది. పట్టణ, గ్రామీణ జనాభాను కలుపుతుంది. ఈ సాంకేతికత ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం వంటి క్లిష్టమైన రంగాలలో సామర్థ్యాన్ని పెంచుతుంది. సరైన ఆలోచన, సాంకేతిక నైపుణ్యంతో దేశంలో ఆర్థిక వృద్ధి, స్థితిస్థాపకతను వేగవంతం చేయడానికి భారతీయ టెలికమ్యూనికేషన్ పరిశ్రమ 5జీని ఉపయోగించవచ్చు. 5జీ నెట్‌వర్క్‌కి మారడం వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకున్న తర్వాత భారతీయ పరిశ్రమలలో ప్రైవేట్ నెట్‌వర్క్‌ల అవసరాలు పెరుగుతాయి.
చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే!
Comments
Please login to add a commentAdd a comment