telecom companies
-
ఈ లాభం ఎలా వచ్చింది?
బీఎస్ఎన్ఎల్కి చివరగా 2009–2010 ఆర్థిక సంవత్సరంలో 581 కోట్ల రూపాయల లాభం వచ్చింది. అది కూడా అప్పటికి దానికి ఉన్న డిపాజిట్ల మీద వచ్చిన వడ్డీ తప్ప వాణిజ్యపరమైన లాభాల వల్ల కాదు. వాణిజ్య పరంగా దానికి లాభాలు 2007–2008 ఆర్థిక సంవత్సరంలో చివరగా వచ్చాయి. భారత ప్రభుత్వం ‘సావరిన్ గ్యారెంటీ’తో రూ. 8,500 కోట్ల రుణం బాండ్ల రూపంలో తీసుకోవడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో 2020 సెప్టెబర్ 28న బీఎస్ఎన్ఎల్ లిస్ట్ అయింది. దానితో ప్రతి మూడు నెలలకు ఒకసారి తమ ఆర్థిక ఫలితాలను సెబీకి ఇవ్వవలసి ఉంటుంది. ఈ రకంగా ప్రతి మూడు నెలలకు ఆ సంస్థ తన ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తోంది. డిసెంబర్ 2024తో ముగిసిన మూడు నెలల కాలానికి బీఎస్ఎన్ఎల్కు నికరంగా 262 కోట్ల లాభం 17 ఏళ్ల తర్వాత వచ్చింది. ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలానికి మొత్తంగా చూస్తే ఇంకా నష్టాలలోనే ఉన్నా, ఒక త్రైమాసికంలో లాభాలు ఆర్జించడం దాదాపు 17 ఏళ్లలో ఇదే తొలిసారి. అయితే ఇది ఎలా సాధ్యం అనేది ఇప్పుడు చూద్దాం.రెవెన్యూ పరంగా చూస్తే కేవలం 131 కోట్లు మాత్రమే ఆదాయం పెరిగింది. సాధారణంగా మూడు, నాలుగు త్రైమాసికాల్లో టెలికం కంపెనీల ఆదాయాలు పెరుగు తాయి కనుక ఆ ఆదాయం పెరుగుదల లెక్కలోకి రాదు. కానీ ఇతర ఆదాయంలో 336 కోట్ల పెరుగుదల, ఉద్యో గుల జీతభత్యాల ఖర్చులో 336 కోట్లు తగ్గటం, డిప్రిసి యేషన్, ఋణమాఫీ వంటి అంశాలలో 766 కోట్లు తగ్గుదల వల్ల ఈ లాభం ఆర్జించడం సాధ్యమయింది. అంటే ఆర్థిక ఫలితాల లెక్కలు కట్టడంలో ఈ 2024–25 నుండి బీఎస్ఎన్ఎల్ చేసిన మార్పుల వల్ల ఇది సాధ్యం అయింది.లెక్కలు కట్టడంలో చేసిన మార్పులు ఏమిటి?ఉద్యోగుల జీతభత్యాలను ఆ యా ప్రాజెక్టుల వారీగా విడగొట్టి చూపడం వల్ల రూ. 337 కోట్లు ఖర్చు ఆదా అయింది. అలాగే డిప్రిసియేషన్, పారు బకాయిల రద్దు వంటి చర్యలను ఆ యా సర్కిళ్లకు ప్రత్యేకంగా లెక్క కట్టడం ద్వారా 766 కోట్లు తక్కువ చూపించగలిగారు. గతంలో ఈ మొత్తాలను సర్కిల్ వారీగా కాకుండా మొత్తం మీద చూపించేవారు. ఏతావతా స్పెక్ట్రం మీద కట్టే మొత్తం డబ్బులను విడగొట్టి ఆయా సర్కిళ్లలో చూపడం, తగ్గుదలను ప్రాజెక్టు వారీగా చూపడం వల్ల ఆదాయం గణనీయంగా పెరగక పోయినా ఈ త్రైమాసికంలో 262 కోట్ల లాభం వచ్చింది. నాల్గవ త్రైమాసికంలో ఏడాదికి కట్టే మొత్తాలు ఉండటం మూలంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది.చదవండి: భావోద్వేగాల డిజిటల్ బందిఖానా!స్థూలంగా చూస్తే ప్రయివేటు టెలికాం కంపెనీలు రేట్లు పెంచితే కేవలం నాలుగు నెలల్లో 65 లక్షల మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్కు వస్తే ఆ తరువాత నెలలో మళ్లీ 4 లక్షల మంది వినియోగదారులు వెళ్లిపోయారు. అంతకుముందు కేవలం ఏడాదిన్నరలో బీఎస్ఎన్ఎల్ రెండు కోట్ల మంది వినియోగదారులను కోల్పోయింది. ఇందుకు కారణం విశ్లేషిస్తే నెట్వర్క్ నాణ్యతా లోపం ప్రధాన కారణం. ప్రయివేటు టెలికాం కంపెనీలు 5జీ నెట్వర్క్ అందిస్తుంటే ఇంకా 3జీలోనే బీఎస్ఎన్ఎల్ (BSNL) ఉండటం, భారతీయ సాంకేతికతతో కూడిన 4జీ సేవలు అందుబాటులో రావడానికి గత నాలుగేళ్లుగా ఆలస్యం కావడం, ఇప్పుడిప్పుడే టవర్ల అప్‌గ్రెడేషన్ పూర్తి అవుతున్నా కొన్ని సాంకేతిక సమస్యలు పరిష్కారం కావాల్సి ఉండటం... వంటి కారణాల వల్ల బీఎస్ఎన్ఎల్ మార్కెట్ షేర్‌ను పెంచుకోలేక పోతోంది.4జీ సేవలు అందుబాటులోకి త్వరలో పూర్తి స్థాయిలో రాబోతున్నాయి. దానిని 5జీ లోకి మార్చుకునే అవకాశాలు ఉండటం, శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు విదేశీ కంపెనీతో అనుసంధానం కానుండటంతోనైనా బీఎస్ఎన్ఎల్ తన ఆదాయాలు మరింత పెంచుకుని లాభాలు పూర్తి స్థాయిలో పొందాలని కోరుకుందాం.– తారానాథ్ మురాల టెలికామ్ రంగ విశ్లేషకులు -
మొబైల్ టారిఫ్ పెంపు తర్వాత భారీగా ఆదాయం
టెలికం ఆపరేటర్ల (Telecom Operators) స్థూల ఆదాయం 2024 సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 10.5 శాతం వృద్ధి చెంది రూ.91,426 కోట్లుగా నమోదైంది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్/దీనిపైనే ప్రభుత్వం పన్నులు వసూలు చేసేది) 13 శాతం పెరిగి రూ.75,310 కోట్లకు చేరింది. ఈ వివరాలను టెలికం రంగ నియంత్రణ సంస్థ (TRAI) విడుదల చేసింది.గతేడాది జూలైలో ఎయిర్టెల్ (Airtel), జియో (Jio), వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) తమ మొబైల్ టెలిఫోనీ చార్జీలను 11–25 శాతం మధ్య పెంచడం తెలిసిందే. ఈ పెంపు అనంతరం సగటు యూజర్ నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) పెరిగింది. కానీ, అదే సమయంలో సబ్స్క్రయిబర్లను కొంత మేర కోల్పోవాల్సి వచ్చింది.టెలికం కంపెనీల నెలవారీ ఏఆర్పీయూ సెప్టెంబర్ త్రైమాసికంలో 10 శాతం పెరిగి రూ.172.57కు చేరింది. జూన్ త్రైమాసికంలో ఇది 157.45గా ఉంది. ప్రీపెయిడ్ కనెక్షన్ల ఏఆర్పీయూ రూ.171గా ఉంటే, పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లకు రూ.190.67గా నమోదైంది. మొబైల్ చందాదారులు 1.68 కోట్ల మంది తగ్గి 115.37 కోట్లకు పరిమితమయ్యారు. జూన్ క్వార్టర్ చివరికి చందాదారుల సంఖ్య 117 కోట్లుగా ఉంది. కంపెనీల వారీగా ఏజీఆర్ భారతీ ఎయిర్టెల్ ఏజీఆర్ 24 శాతం పెరిగి రూ.24,633 కోట్లకు చేరింది. రిలయన్స్ జియో ఏజీఆర్ 14 శాతం వృద్ధితో రూ.26,652 కోట్లకు.. వొడాఫోన్ ఐడియా ఏజీఆర్ 4 శాతం పెరిగి రూ.7,837 కోట్లుగా నమోదయ్యాయి. సెప్టెంబర్ త్రైమాసికానికి టెలికం కంపెనీల నుంచి ప్రభుత్వం వసూలు చేసిన లైసెన్స్ ఫీజు 13 శాతం పెరిగి రూ.6,023 కోట్లకు చేరింది. -
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు తీపికబురు
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) తన కస్టమర్లకు శుభవార్త అందించింది. సమీప భవిష్యత్తులో టారిఫ్ రేట్లను పెంచబోమని బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ రవి స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో బీఎస్ఎన్ఎల్కు కస్టమర్లు పెరుగుతున్న నేపథ్యంలో స్పామ్ బ్లాకర్స్, ఆటోమేటెడ్ సిమ్ కియోస్క్‌లు, డైరెక్ట్-టు-డివైస్ సేవలు వంటి కొత్త ఆఫర్లను తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉన్న వినియోగదారులను నిలుపుకోవడంతోపాటు కొత్తవారిని ఆకర్షించడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడుతాయని చెప్పారు.సెప్టెంబర్ 2024లో బీఎస్ఎన్ఎల్ ఊహించని విధంగా 8.5 లక్షల మంది సబ్స్క్రైబర్లను పొందింది. ప్రైవేట్ రంగ టెలికాం కంపెనీలకు ఈమేరకు కస్టమర్లు తగ్గుతున్నారు. జులైలో ప్రైవేట్ టెలికాం సంస్థలు 10 శాతం నుంచి 27 శాతం వరకు టారిఫ్ రేట్లను పెంచడంతో వినియోగదారులు బీఎస్ఎన్ఎల్కు మళ్లుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డేటా ప్రకారం రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ఇటీవల కాలంతో దాదాపు కోటి మంది చందాదారులను కోల్పోయాయి. జియో ఒక్కటే 79.69 లక్షల మంది సబ్స్క్రైబర్లను నష్టపోయింది.ఇదీ చదవండి: రిపేర్ బిల్లు చూసి చిర్రెత్తిన కస్టమర్!మెరుగైన సేవలందిస్తే మేలు..ప్రస్తుతం జియో 46.37 కోట్లు, ఎయిర్టెల్ 38.34 కోట్లు, బీఎస్ఎన్ఎల్ 9.18 కోట్ల మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉంది. బీఎన్ఎన్ఎల్కు సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ ప్రైవేట్ పోటీదారులతో పోల్చితే 4జీ, 5జీ సేవలందించడంతో చాలా వెనకబడి ఉంది. వినియోగదారుల పెంపును ఆసరాగా చేసుకుని విభిన్న విభాగాల్లో మెరుగైన సేవలందిస్తే మరింత మంది సబ్స్రైబర్లు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
రెండేళ్లలో రూ.5 లక్షల కోట్ల ఆదాయం
దేశీయంలో టెలికాం సంస్థల వార్షిక ఆదాయం వచ్చే రెండేళ్లలో రూ.ఐదు లక్షల కోట్లకు చేరుతుందని భారత టెలికా విభాగం(డాట్) తెలిపింది. ప్రభుత్వం గతంలో తీసుకున్న సులభతర వాణిజ్య చర్యల వల్ల ఇది సాధ్యమవుతుందని డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్ సభ్యుడు మనీశ్ సిన్హా అంచనా వేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘దేశంలో టెలికాం రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రాబోయే రెండేళ్లలో టెలికాం కంపెనీల వార్షికాదాయాలు రూ.5 లక్షల కోట్లకు చేరవచ్చు. ప్రభుత్వం కొంతకాలంగా ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా సులభతర వ్యాపార చర్యలను అనుసరిస్తున్నారు. దాంతో ఈ రంగం వృద్ధి బాటలో పయనిస్తోంది. అయితే స్పెక్ట్రమ్ కేటాయింపు విషయంలో మాత్రం ప్రస్తుత పద్ధతులను సమీక్షించుకోవాలి. స్పెక్ట్రమ్‌ను ప్రస్తుతం పది లేదా ఇరవై ఏళ్లకు కేటాయిస్తున్నారు. ఈ కాలపరిమితి మార్చాల్సి ఉంది. తక్కువ గడువుకు స్పెక్ట్రమ్‌ను మంజూరు చేయాలి. స్పెక్ట్రమ్ వినియోగం, సామర్థ్యం, ఆర్థిక విలువల విషయంలో సమస్యలున్నాయి. నిత్యం కంపెనీల వృద్ధి పెరుగుతోంది. అందుకు భిన్నంగా పదేళ్లు, ఇరవై ఏళ్ల వరకు స్పెక్ట్రమ్ అనుమతులుండడంపై చర్చించాలి’ అన్నారు.ఇదీ చదవండి: రూ.5.18 లక్షలు.. జీతం కాదు.. ఇంటి అద్దె!టెలికాం నియత్రణ సంస్థ ట్రాయ్ నివేదిక ప్రకారం.. 2023-24లో టెలికాం నెట్వర్క్ కంపెనీలు రూ.3.36 లక్షల కోట్ల స్థూల ఆదాయాన్ని నమోదు చేశాయి. ఈ ఏడాది వీటి ఆదాయం రూ.4 లక్షల కోట్లకు చేరుతుందని సిన్హా అంచనా వేశారు. ఇదిలాఉండగా, టెలికాం కంపెనీలు తమకు తోచినట్లుగా టారిఫ్‌ను పెంచుతూ పోతున్నాయనే వాదనలున్నాయి. జులైలో జియో, ఎయిర్టెల్ వంటి ప్రముఖ సంస్థలు గతంలో కంటే 20 శాతం వరకు టారిఫ్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. చేసేదేమిలేక వినియోగదారులు దాన్ని చెల్లిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని బీఎస్ఎన్ఎల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి అన్ని ప్రదేశాల్లో 4జీ, 5జీ సేవలందిస్తే మరింత మేలు జరుగుతుందని కస్టమర్లు భావిస్తున్నారు. -
Telcos Profits: సగటు యూజర్ నుంచి రూ.157.45
న్యూఢిల్లీ: టెలికం కంపెనీల బ్యాలన్స్ షీట్లు ఆర్థికంగా బలపడుతున్నాయి. ఒక్కో మొబైల్ యూజర్ నుంచి వచ్చే నెలవారీ సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 8 శాతం పెరిగి జూన్‌తో ముగిసిన త్రైమాసికం చివరికి రూ.157.45కు చేరినట్టు ట్రాయ్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది మార్చి చివరికి ఇది రూ.153.54గా ఉంది. త్రైమాసికం వారీ పనితీరు సూచిక నివేదికను ట్రాయ్ విడుదల చేసింది. టెలికం రంగం సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) 0.13 శాతం పెరిగి రూ.70,555 కోట్లుగా ఉంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంతో పోల్చి చూస్తే ఏజీఆర్ 7.51 శాతం పెరగడం గమనార్హం. టెలిఫోన్ చందాదారులు మార్చి చివరికి 1,199.28 మిలియన్లుగా ఉంటే, జూన్ చివరికి 1,205.64 మిలియన్లకు చేరింది. వైర్‌లైన్ టెలిఫోన్ చందాదారుల సంఖ్య 35.11 మిలియన్లకు పెరిగింది. క్రితం ఏడాది జూన్ నాటి గణాంకాలతో పోల్చి చూస్తే 16% పెరిగింది. నికరంగా జూన్ క్వార్టర్లో వైర్లెస్ చందాదారులు 54 లక్షల మేర పెరిగారు. దీంతో మొత్తం వైర్లెస్ చందాదారుల సంఖ్య 1,170.53 మిలియన్లకు చేరింది. ఈ ఏడాది మార్చి నాటికి వైర్లెస్ చందాదారులు 1,165.49 మిలియన్లుగా ఉన్నారు. వైర్‌లైన్ టెలీ సాంద్రత 2.50 శాతంగా ఉంటే, వైర్లెస్ టెలీ సాంద్రత 85.95 శాతానికి చేరింది. పల్లెల్లో పెరిగిన టెలికం వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో టెలీ సాంద్రత మార్చి చివరికి ఉన్న 59.19 శాతం నుంచి జూన్ చివరికి 59.65 శాతానికి పెరిగింది. కానీ, ఇదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో టెలీ డెన్సిటీ (టెలికం సదుపాయం ఉన్నవారు) 133.72 శాతం నుంచి 133.46 శాతానికి తగ్గింది. ఇంటర్నెట్ చందాదారులు 1.59 శాతం పెరిగి 969.60మిలియన్లకు చేరారు. -
టెలికాం కంపెనీల పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలకు సంబంధించిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) లెక్కింపులో తప్పులు దొర్లాయని, వాటిని సవరించాలంటూ వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ కంపెనీలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ బకాయిలపై బహిరంగ విచారణ జరపాలని కోరాయి. ఈమేరకు సుప్రీంకోర్టు విచారణ జరిపి సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రభుత్వానికి ఇచ్చే పూర్తి బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌లోని వివరాలు విచారించింది. టెలికాం కంపెనీలు లైసెన్స్ రెన్యువల్ చేయడానికి, స్పెక్రమ్ వినియోగించుకున్నందుకు ప్రభుత్వానికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని కారణాల వల్ల బకాయిలు చెల్లించకపోతే తిరిగి వడ్డీతో సహా జమ చేయాలి. ఇవి ఏజీఆర్ కిందకు వస్తాయి. ఎయిర్టెల్, వొడాఫోన్ఐడియా కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం..సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్) బకాయిలు లెక్కించడంలో లోపాలు జరిగాయి. వాటిని సవరించాలి. ఇప్పటికే పోగైన బకాయిలపై వడ్డీని ఉపసంహరించాలి. క్యూరేటివ్ పిటిషన్‌ను బహిరంగంగా విచారణ చేయాలని కంపెనీలు కోరాయి.ఇదీ చదవండి: స్టార్టప్ కంపెనీలో క్రికెటర్ రూ.7.4 కోట్లు పెట్టుబడిగతంలో సెప్టెంబర్ 1, 2020లో కోర్టు విడుదల చేసిన ఆదేశాల ప్రకారం..మార్చి 31, 2021లోపు కంపెనీల బకాయిల్లో 10 శాతం చెల్లించాలి. తదుపరి ఏడాది మరో 10 శాతం చొప్పున 2031 మార్చి 31లోపు పూర్తి బకాయిలు కట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం టెలికాం విభాగానికి చెల్లించాల్సిన ఏజీఆర్‌పై రీవాల్యుయేషన్ అనుమతించబడదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. ఇదిలాఉండగా, అన్ని టెలికాం కంపెనీలు కలిపి మొత్తం రూ.1.47 లక్షల కోట్ల ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిలో లైసెన్స్ ఫీజు బకాయిలు మొత్తం రూ.92,642 కోట్లు కాగా, స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీలు రూ.55,054 కోట్లుగా ఉన్నాయి. వొడాఫోన్ఐడియా కంపెనీ 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఏజీఆర్ బకాయిలు రూ.70,320 కోట్లు, భారతీ ఎయిర్టెల్ రూ.43,980 కోట్లు కట్టాల్సి ఉంది. -
జరా జాగ్రత్త ..! అలా చేస్తే బ్లాక్ లిస్టింగే.. ట్రాయ్ హెచ్చరిక
-
టెల్కోల ఆదాయం జూమ్..
న్యూఢిల్లీ: మార్చి త్రైమాసికంలో టెలికం సంస్థల ఆదాయాలు గణనీయంగా పెరిగాయి. రిలయన్స్ జియో ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) అత్యధికంగా 10 శాతం వృద్ధి చెంది రూ. 22,985 కోట్ల నుంచి రూ. 25,331 కోట్లకు చేరింది. అటు భారతీ ఎయిర్‌టెల్‌ది 13.25 శాతం పెరిగి రూ. 15,500 కోట్ల నుంచి రూ. 20,952 కోట్లకు ఎగిసింది. వొడాఫోన్ ఐడియా ఏజీఆర్ స్వల్పంగా 2.22% పెరిగి రూ. 7,211 కోట్ల నుంచి రూ. 7,371 కోట్లకు చేరింది. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ ఆదాయం 4.41 శాతం తగ్గి రూ. 1,992 కోట్లకు, ఎంటీఎన్ఎల్ ఆదాయం 14% క్షీణించి రూ. 157 కోట్లకు పరిమితమైంది. మొత్తం టెల్కోల ఏజీఆర్ 9% వృద్ధి చెంది రూ. 70,462 కోట్లకు చేరింది. టెల్కోలు కట్టాల్సిన స్పెక్ట్రం యూసేజీ చార్జీలు, లైసెన్సు ఫీజులను లెక్కించడానికి ప్రభుత్వం ఏజీఆర్‌నే పరిగణనలోకి తీసుకుంటుంది. -
‘సిగ్నల్’ చోరీ
సాక్షి, అమరావతి: దేశంలో సెల్‌ఫోన్ సిగ్నల్ సమస్య పెరుగుతోంది. ఫోన్ చేస్తే మధ్యలోనే కాల్ డ్రాప్ అవుతోంది. ఒక్కోసారి సిగ్నల్ ఉన్నట్టే ఉంటుంది.. కానీ ఫోన్ మాత్రం కలవదు. ఇవన్నీ తమ వల్ల వచ్చిన సమస్యలు కావని.. సెల్ టవర్లపై దొంగలు చేతివాటం ప్రదర్శిస్తుండటంతో తలెత్తిన సమస్యలని నెట్వర్క్ ఇంజనీర్లు, టెలికాం సంస్థలు చెబుతున్నాయి. గత 6 నెలల్లో దేశవ్యాప్తంగా 17 వేల రేడియో రిమోట్ యూనిట్లు(ఆర్ఆర్యూ) చోరీకి గురయ్యాయి. టెలి కమ్యూనికేషన్స్‌లో ట్రాన్స్ రిసీవర్‌గా ఆర్ఆర్యూ ఉపయోగపడుతుంది. ఇది ట్రాన్స్మిషన్ పనితీరును, మొబైల్ సిగ్నల్ల స్వీకరణను మిళితం చేస్తుంది. ఆర్‌ఆర్‌యూలు చోరీకి గురవుతుండటంతో సిగ్నల్ సమస్యలు పెరిగిపోతున్నాయని టెలికాం నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా దొంగతనాలతో దేశవ్యాప్తంగా టెలికాం కంపెనీలు రూ.800 కోట్ల మేర నష్టాలను చవిచూశాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దొంగిలించిన ఆర్ఆర్ యూనిట్లును చైనా, బంగ్లాదేశ్ తదితర దేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెల్యులార్ ఆపరేటర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ).. ఆర్ఆర్యూ దొంగతనాలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. దేశ డిజిటల్ భవిష్యత్‌కు ఉపయోగపడే కీలక మౌలిక సదుపాయాలను రక్షించడానికి కఠిన చర్యలు అవసరమని అభిప్రాయపడుతోంది.ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ.. గతేడాది అక్టోబర్ నుంచి ఈ తరహా దొంగతనాలు పెరిగాయి. గుజరాత్‌తో పాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, హరియాణా, ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. -
6.8లక్షల మొబైల్ నంబర్లను ధ్రువీకరించాలన్నటెలికాంశాఖ
ఉపయోగంలోలేని, నకిలీ ధ్రువపత్రాలతో తీసుకున్న 6.8 లక్షల మొబైల్ కనెక్షన్లను ధ్రువీకరించాలని టెలికాం శాఖ ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మొబైల్ నంబర్లను 60 రోజుల్లోపు గుర్తించి వెంటనే రీ-వెరిఫికేషన్ చేయాలని తెలిపింది. లేదంటే వాటిని డిస్కనెక్ట్ చేస్తామని హెచ్చరించింది.నకిలీ ఫోన్ నంబర్లు, ఉపయోగంలోలేని కనెక్షన్లను గుర్తించడానికి టెలికాంశాఖ అధునాతన ఏఐను వినియోగించినట్లు ప్రకటనలో చెప్పింది. ఏఐ విశ్లేషణలో భాగంగా ఉపయోగంలోలేనివి, నకిలీ ఐడీ ప్రూఫ్‌లతో ఉన్న దాదాపు 6.8 లక్షల మొబైల్ కనెక్షన్లు గుర్తించినట్లు తెలిపింది. వెంటనే నెట్వర్క్ ఆపరేటర్లు వాటిని ధ్రువీకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ 60 రోజుల్లోపు పూర్తి చేయాలని చెప్పింది.ఇదీ చదవండి: అప్పు తీసుకుంటున్నారా..? ఒక్కక్షణం ఆలోచించండిఒకవేళ ఆపరేటర్లు ముందుగా విధించిన గడువులోపు మొబైల్ నంబర్లను ధ్రువీకరించకపోతే వాటిని డిస్కనెక్ట్ చేస్తామని హెచ్చరించింది. అవసరమైతే కొందరు ఆపరేటర్లు ఈ తంతును మళ్లీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 2024 ఏప్రిల్‌లో టెలికాంశాఖ 10,834 మొబైల్ నంబర్లపై అనుమానం వ్యక్తంచేస్తూ వీటిని రీవెరిఫికేషన్ చేయాలని తెలిపింది. వీటిలో 8,272 కనెక్షన్లు ధ్రువీకరణలో విఫలమవడంతో డిస్కనెక్ట్ చేసినట్లు పేర్కొంది. -
86శాతం తగ్గిన ధరావతు సొమ్ము.. స్పెక్ట్రమ్ అంటే..?
నెట్వర్క్ సేవల స్పెక్ట్రమ్ బ్యాండ్ల వేలంలో కంపెనీలు సమర్పించిన ధరావతు సొమ్ము(ఈర్నెస్ట్ మనీ డిపాజిట్లు-ఈఎండీ) 2022 కంటే సుమారు 86శాతం తక్కువగా ఉందని మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి.తాజా కథనాల ప్రకారం..5జీ స్పెక్ట్రమ్ వేలం కోసం టెలికాం కంపెనీలు సమర్పించిన ఈఎండీ రూ.300-రూ.3,000 కోట్లుగా ఉంది. గత పదేళ్లలో అత్యల్ప ఈఎండీ నమోదవడం ఇదే తొలిసారి. 2022లో జరిగిన వేలంలో కంపెనీలు సమర్పించిన ఈఎండీల కంటే ఇది దాదాపు 79-86% తక్కువగా ఉంది.స్పెక్ట్రమ్‌లో ఈఎండీలు బిడ్డింగ్ వ్యూహాన్ని, కొనుగోలు సామర్థ్యాన్ని సూచిస్తాయి. ఆక్షన్‌లో పాల్గొనేందుకు కావాల్సిన అర్హత పాయింట్లను ఈఎండీల ద్వారా పొందవచ్చు. ఈసారి దాదాపు రూ.97,000 కోట్ల (దాదాపు 12 బిలియన్లు డాలర్లు) విలువైన 5జీ ఎయిర్‌వేవ్‌లలో ప్రభుత్వం 21% స్పెక్ట్రమ్‌ను అమ్మే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎలాగైనా గరిష్ఠవాటాను సొంతం చేసుకోవాలని టాప్ కంపెనీలు ఈఎండీ చెల్లించి, అధిక పాయింట్లు పొందుతుంటారు. తర్వాత ఆక్షన్‌లో పాల్గొని స్పెక్ట్రమ్‌ను చేజిక్కించుకుంటారు.రిలయన్స్ జియో 2022లో ఈఎండీలు రూ.14000 కోట్లు, ఈసారి రూ.3000 కోట్లు.భారతీఎయిర్‌టెల్ 2022లో ఈఎండీలు రూ.5500 కోట్లు, ఈసారి రూ.1050 కోట్లు.వొడాఫోన్ ఐడియా 2022లో ఈఎండీలు రూ.2200 కోట్లు, ఈసారి రూ.300 కోట్లు.స్పెక్ట్రమ్ అంటే?సెల్ఫోన్లు, రేడియోలు వంటి వైర్లెస్ సాధనాలకు సిగ్నళ్లు కావాలి. వీటి మధ్య సమాచార మార్పిడికి విద్యుదయస్కాంత తరంగాలు అవసరం. వీటినే రేడియో తరంగాలు అని కూడా అంటారు. ఇలాంటి విద్యుదయస్కాంత తరంగాల శ్రేణినే స్పెక్టమ్ అంటారు. ఒక సాధనం నుంచి ఇంకో సాధనానికి సమాచారం చేరవేతకు నిర్దిష్ట పౌనఃపున్యాలు (ఫ్రీక్వెన్సీలు) ఉంటాయి. రేడియోకు వేరేగా.. సెల్ఫోన్లకు వేర్వేరు ఫ్రీక్వెన్సీలను కేటాయించారు. ఫ్రీక్వెన్సీని బట్టి స్పెక్ట్రమ్‌ను వివిధ బ్యాండ్లుగా వర్గీకరించారు.ఇదీ చదవండి: అప్పు తీసుకుంటున్నారా..? ఒక్కక్షణం ఆలోచించండిగతంలో 5జీ కోసం రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72 గిగా హెర్జ్ స్పెక్ట్రాన్ని వేలానికి ఉంచారు. 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 3300 MHz, 26GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్లకు ప్రస్తుతం వేలం నిర్వహించనున్నారు. -
నేపాల్‌లో నిలిచిన ఇంటర్నెట్ సేవలు.. కారణం..
నేపాల్ ప్రైవేట్ ఇంటర్నెట్ ప్రొవైడర్లు భారతీయ కంపెనీలకు చెల్లింపులు చేయకపోవడంతో ఇంటర్నెట్ సేవలు నిలిచాయి. నేపాల్‌కు చెందిన అప్‌స్ట్రీమ్ భాగస్వాములు బకాయిలు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు నేపాల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ (ఇస్పాన్) తెలిపింది.నేపాల్‌లోని ప్రైవేట్ ఇంటర్నెట్ కంపెనీలు గురువారం రాత్రి తమ సేవలను నిలిపేసినట్లు ఇస్పాన్ పేర్కొంది. ఇంటర్నెట్ మానిటర్ సంస్థ నెట్‌బ్లాక్స్ విడుదల చేసిన డేటా ప్రకారం..18 నేపాలీ ఇంటర్నెట్ ప్రొవైడర్లు ఐదు గంటలపాటు సర్వీసులను తగ్గించినట్లు, అందులో కొన్ని బ్యాండ్ విడ్త్‌ను పూర్తిగా తగ్గించినట్లు తేలింది. ఇంటర్నెట్ అంతరాయం కొనసాగవచ్చని, ఈ అంశం తమ పరిధిలో లేదని ఇస్పాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సువాష్ ఖడ్కా తెలిపారు. ప్రస్తుతం ఇంటర్నెట్ సేవలకు అధికప్రాధాన్యం ఉందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.ఇదీ చదవండి: భారత కంపెనీపై ‘టెస్లా’ ఫిర్యాదు.. ఏం జరిగిందంటే..స్థానిక బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్లు భారతీయ కంపెనీలకు సుమారు మూడు బిలియన్ నేపాలీ రూపాయలు (రూ.187 కోట్లు) బకాయిపడ్డారు. అయితే బయటిదేశాలకు డబ్బు బదిలీ చేయడానికి అక్కడి ప్రభుత్వం అనుమతించడం లేదు. ఇంటర్నెట్ ప్రొవైడర్లు పాత బకాయిలు చెల్లిస్తేనే సర్వీసులు అందిస్తామని కంపెనీలు చెబుతున్నాయి. కొంతకాలంగా ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇటీవల ఇంటర్నెట్ సర్వీసులు నిలిపేసినట్లు తెలిసింది. నేపాల్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీ లెక్కల ప్రకారం ప్రైవేట్ ఇంటర్నెట్ కంపెనీలకు 10 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లున్నారని సమాచారం. -
నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచిన టెలికాం కంపెనీలు.. ఎందుకంటే..
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కాసేపట్లో జరగబోతుంది. రామ మందిర ప్రారంభ వేడుకల్లో కార్పొరేట్ సంస్థలు సందడిగా పాల్గొంటున్నాయి. దాదాపు 7000 మంది అతిథులు కార్యక్రమానికి హాజరుకానున్నారు. దేశంలోని కోట్లమంది ఈ క్రతువును పరోక్షంగా టీవీలు, సామాజిక మాధ్యమాలు, ఇతర మీడియాల్లో వీక్షించే అవకాశం ఉంది. దాంతో ఇప్పటికే టెలికాం సంస్థలు అందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ప్రతిష్టాపన పూర్తయిన తర్వాత రోజూ మూడు నుంచి ఐదు లక్షల మంది సందర్శకులు అయోధ్యను సందర్శించే అవకాశం ఉందని అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో దేశీయ టెలికాం సంస్థలైన వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ అయోధ్యలో తమ నెట్వర్క్ సామర్థ్యాన్ని మెరుగుపరిచాయి. రామమందిర ప్రతిష్ఠాపన నేపథ్యంలో అయోధ్యలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో నెట్వర్క్ మౌలిక సదుపాయాలు, సామర్థ్యాన్ని పెంచినట్లు తెలిపాయి. దీంతో వినియోగదారులు స్పష్టమైన వాయిస్ కాల్స్, హై-స్పీడ్ డేటా, వీడియో స్ట్రీమింగ్ వంటి సదుపాయాల్ని పొందొచ్చని చెప్పాయి. ఇదీ చదవండి: అయోధ్యలో హూటల్ రూం ధర ఎంతంటే..? అయోధ్య రైల్వే స్టేషన్, రామమందిర ప్రాంగణం, విమానాశ్రయం, ప్రధాన ప్రాంతాలు, నగరంలోని హోటళ్లతో సహా అన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో తమ నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచినట్లు వెల్లడించాయి. లఖ్‌నవూకు అనుసంధానించే హైవేలతో సహా నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో పటిష్ట సిగ్నలింగ్ కోసం స్పెక్ట్రమ్ సామర్థ్యాన్ని మెరుగుపరిచినట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. అదనపు నెట్వర్క్ సైట్లు, అంతరాయం లేని నెట్వర్క్ అందించటం కోసం ఆప్టిక్ ఫైబర్ కేబుల్‌ను ఏర్పాటు చేసినట్లు ఎయిర్టెల్ ప్రకటించింది. -
క్రికెట్ అభిమానుల కోసం ప్రత్యేక డేటా ప్లాన్లు
న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్ ఆరంభం కావడంతో టెలికం కంపెనీలు ఎయిర్టెల్, జియో క్రికెట్ అభిమానుల కోసం ప్రత్యేక ప్లాన్లను ఆవిష్కరించాయి. ► జియో రూ.328 ప్లాన్ రోజూ 1.5 జీబీ హైస్పీడ్ డేటా, 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మూడు నెలల డిస్నీప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్రి్కప్షన్ ఇందులో భాగంగా ఉంటుంది. ► జియో రూ.758 ప్లాన్‌లో రోజూ 1.5 జీబీ హైస్పీడ్ డేటా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులోనూ మూడు నెలల డిస్నీప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్రి్కప్షన్ ఉచితం. ► జియో రూ.388 ప్లాన్ రోజువారీ 2జీబీ హైస్పీడ్ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ, మూడు నెలల డిస్నీహాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో ఉంటుంది. ► జియో రూ.808 ప్లాన్ రోజువారీ 2జీబీ డేటా, 84రోజుల వ్యాలిడిటీ, మూడు నెలల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్్రస్కిప్షన్తో వస్తుంది. ► జియో రూ.598లో 84 రోజులు, రూ.3,178 ప్లాన్‌లో ఏడాది పాటు డిస్నీ హాట్‌స్టార్ ఉచితంగా లభిస్తుంది. ► భారతీ ఎయిర్టెల్ 6జీబీ డేటా, ఒక రోజు వ్యాలిడిటీతో రూ.49 ప్లాన్‌ను తీసుకొచ్చింది. అలాగే, రెండు రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ డేటా ఆప్షన్‌తో రూ.99 ప్లాన్‌ను ఆవిష్కరించింది. -
అవాంఛిత కాల్స్‌పై టెల్కోలతో ట్రాయ్ భేటీ
న్యూఢిల్లీ: అవాంఛిత కాల్స్, మెసేజీలను కట్టడి చేసే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందుకోసం ’వ్యాపారపరమైన అవాంఛిత కమ్యూనికేషన్ (యూసీసీ) డిటెక్ట్’ విధానాన్ని అభివృద్ధి చేయడం, అమలు చేయడానికి సంబంధించి మార్చి 27న టెల్కోలతో సమావేశం కానుంది. (ఇదీ చదవండి: హిండెన్‌బర్గ్ లేటెస్ట్ రిపోర్ట్: భారత సంతతి ఎగ్జిక్యూటివ్ అమృత ఆహూజా పాత్ర ఏంటి?) డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (డీఎల్టీ) ప్లాట్‌ఫాంపై అవాంఛిత సందేశాలను టెల్కోలు గుర్తించడం, వాటిని పంపే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడం, కృత్రిమ మేథ ఆధారిత యాంటీ–ఫిషింగ్ సిస్టమ్‌ను వినియోగించడం తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నారు. సాంకేతిక సొల్యూషన్స్, నియంత్రణ, ఆదేశాలు, నిశిత పర్యవేక్షణ వంటి బహుముఖ వ్యూహాలతో అవాంఛిత కాల్స్, మెసేజీల సమస్యను పరిష్కరించే దిశగా టెల్కోలతో సమావేశం ఉండనున్నట్లు ట్రాయ్ పేర్కొంది. (మండే వేసవిలో ప్రయాణికులకు గుడ్ న్యూస్: రైల్వే కీలక నిర్ణయం) -
5జీని విస్తరిస్తున్న టెల్కోలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా టెలికం కంపెనీలు 5జీ సేవలను వేగంగా విస్తరిస్తున్నాయి. రిలయన్స్ జియో తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోసహా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 27 నగరాలు, పట్టణాల్లో నూతనంగా 5జీ సర్వీసులను జత చేసింది. దీంతో భారత్‌లో కంపెనీ మొత్తం 331 ప్రాంతాల్లో ఆధునిక టెక్నాలజీని పరిచయం చేసినట్టు అయింది. జియో వెల్కమ్ ఆఫర్లో భాగంగా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండానే కస్టమర్లు ప్రస్తుత చార్జీతో 1 జీబీపీఎస్ స్పీడ్‌తో అపరిమిత ఇంటర్నెట్ను ఆస్వాదించవచ్చు. 2023 చివరినాటికి దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో 5జీ సర్వీ సులను అందుబాటులోకి తేవాలన్నది రిలయన్స్ లక్ష్యం. సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భారతీ ఎయిర్టెల్ సైతం.. మరో టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ ఏకంగా 125 నగరాలు, పట్టణాల్లో కొత్తగా 5జీ సేవలను జోడించింది. దీంతో సంస్థ అందిస్తున్న 5జీ సర్వీసులు దేశంలో మొత్తం 265 ప్రాంతాలకు విస్తరించాయి. ఉత్తరాదిన జమ్మూ మొదలుకుని దక్షిణాదిన కన్యాకుమారి వరకు ప్రతి ప్రధాన నగరంలో నూతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చినట్టు ఎయిర్టెల్ ప్రకటించింది. దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలకు 5జీని వేగంగా చేర్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపింది. 2024 మార్చి నాటికి అన్ని పట్టణాలతోపాటు ప్రధాన గ్రామీణ ప్రాంతాల్లో అడుగుపెడతామని భారతీ ఎయిర్టెల్ సీటీవో రన్‌దీప్ సెఖన్ తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలు లక్ష్యమని తెలిపారు. -
5జీ సేవలకు మరింత స్పెక్ట్రం కావాలి
న్యూఢిల్లీ: 5జీ సేవలను విస్తరించాలంటే మరింత స్పెక్ట్రం అవసరమని టెల్కోల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ తెలిపారు. కీలకమైన 6 గిగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంను టెలికం సంస్థలకు కేటాయించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలా జరగని పక్షంలో 5జీ సేవలను విస్తరించడం, వేగంగాను.. చౌకగాను అందించడంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని కొచర్ వివరించారు. భారీ జనాభా ఉండే ప్రాంతాల్లో.. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నెట్ సర్వీస్ లను విస్తరించడానికి అత్యంత నాణ్యమైన 6 గిగాహెట్జ్ బ్యాండ్ అనువుగా ఉంటుంది. దీంతో ఈ బ్యాండ్‌లో స్పెక్ట్రం కోసం వైఫై సంస్థలు, టెల్కోల మధ్య పోటీ ఉంటోంది. నగరాల్లో విస్తృతంగా మొబైల్ నెట్‌వర్క్‌ను పెంచుకోవాలంటే 6 గిగాహెట్జ్ బ్యాండ్ కీలకమని కొచర్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే టెలికం శాఖకు విజ్ఞప్తి చేశామని ఆయన చెప్పారు. దీనిపై ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటైందని వివరించారు. కాల్ డ్రాప్స్‌పై రాష్ట్ర స్థాయి డేటా సాధ్యం కాదు కాల్ అంతరాయాలకు సంబంధించి రాష్ట్రాల వారీగా డేటా ఇవ్వాలన్న టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశాలు ఆచరణ సాధ్యం కాదని కొచర్ పేర్కొన్నారు. యూజర్లకు ఎట్టి పరిస్థితుల్లోనైనా నాణ్యమైన సేవలను అందించేందుకు టెల్కోలు ప్రయత్నిస్తుంటాయని, కానీ ఈ సూచనలను అమలు చేయాలంటే క్షేత్ర స్థాయిలో అడ్మిని్రస్టేషన్పరంగా అనేక సవాళ్లు ఉంటాయని ఆయన చెప్పారు. నిబంధనల ప్రకారం టెలికం సేవలను ప్రస్తుతం సర్కిళ్ల వారీగా, ఎల్ఎస్ఏ (లైసెన్స్డ్ సర్వీస్ ఏరియా)వారీగా అందిస్తున్నామని, దానికి అనుగుణంగానే డేటా కూడా ఉంటుందని కొచర్ తెలిపారు. ఇవన్నీ వివిధ జ్యూరిడిక్షన్లలో ఉంటాయి కాబట్టి రాష్ట్రాలు, జిల్లాల స్థాయిలో డేటా ఇవ్వాలంటే వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారమని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాటిస్తున్న ఎల్ఎస్ఏ (లైసెన్స్డ్ సర్వీస్ ఏరియా) స్థాయి డేటా విధానాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని కొచర్ వివరించారు. రాష్ట్ర స్థాయి డేటా వెల్లడి ఆదేశాలపై పునరాలోచన చేయాలని ట్రాయ్‌ను సీవోఏఐ కోరినట్లు చెప్పారు. -
Ashwini Vaishnaw: ఈ గ్రామాల్లో 4జినే లేదు!
సాక్షి, అమరావతి: దేశంలో మొబైల్ సేవల రంగంలో అయిదో జనరేషన్ (5 జి) మొదలైంది. ఇంతకు ముందు 4జి, దానికి ముందు 2జి సేవలు అందించిన టెలికాం సంస్థలు ఇప్పుడు 5జిని అందిపుచ్చుకున్నాయి. సాంకేతికత వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, దేశంలో ఇంకా 4జి సేవలే లేని గ్రామాలు ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. కానీ ఇది నిజం. దేశంలో ఇప్పటికీ 45,180 గ్రామాలకు 4 జి మొబైల్ సేవలు అందుబాటులో లేవని లోక్ సభలో కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల వెల్లడించారు. ఈ గ్రామాలకు సంతృప్త స్థాయిలో 4జి సేవలు అందించాలంటే రూ. 26,316 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు ఆయన తెలిపారు. దేశంలో 6,44,131 గ్రామాలుండగా ఇందులో 5,98,951 గ్రామాలకు 4జి మొబైల్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. అంటే 93శాతం గ్రామాలకు 4 జి సేవలు ఉన్నాయి. మిగతా 7 శాతం గ్రామాలకు 4జి నెట్వర్క్ లేదు. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 99 శాతం గ్రామాలకు 4జి సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యధికంగా ఒడిశాలో 7,592 గ్రామలకు 4జి కవరేజ్ లేదు. మహారాష్ట్రంలో 3,793 గ్రామాలకు 4జి లేదు. ఆంధ్రప్రదేశ్‌లో 3,169 గ్రామాల్లో 4జి అందుబాటులోకి రాలేదు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు 4జి సేవలందించేందుకు రూ.2,211 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. -
ఆ రంగంలో మూడేళ్లకోసారి లక్ష కోట్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత టెలికం పరిశ్రమ మూడేళ్లకోసారి రూ.1,03,262 కోట్ల ఆదాయ వృద్ధి నమోదు చేస్తుందని డెలాయిట్ ఇండియా–సీఐఐ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణలను పెంచే అవకాశం ఉన్న 5జీ రాక ఇందుకు కారణమని వివరించింది. ‘2023 చివరినాటికి భారత టెలికం పరిశ్రమ రూ.10,32,625 కోట్లకు చేరుతుంది. 5జీ ఎంట్రీతో మూడేళ్లకోసారి పరిశ్రమకు ఒక లక్ష కోట్లు తోడవుతాయి. 2022 అక్టోబరులో 5జీ సేవలు ప్రారంభం అయిన నెలరోజుల్లోనే ఒక టెలికం కంపెనీ 10 లక్షల 5జీ చందాదార్ల సంఖ్యను దాటింది. ఆర్థిక వృద్ధిని 5జీ వేగవంతం చేస్తుంది. అలాగే ఉద్యోగ అవకాశాలను పెంచుతుంది. పట్టణ, గ్రామీణ జనాభాను కలుపుతుంది. ఈ సాంకేతికత ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం వంటి క్లిష్టమైన రంగాలలో సామర్థ్యాన్ని పెంచుతుంది. సరైన ఆలోచన, సాంకేతిక నైపుణ్యంతో దేశంలో ఆర్థిక వృద్ధి, స్థితిస్థాపకతను వేగవంతం చేయడానికి భారతీయ టెలికమ్యూనికేషన్ పరిశ్రమ 5జీని ఉపయోగించవచ్చు. 5జీ నెట్వర్క్కి మారడం వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకున్న తర్వాత భారతీయ పరిశ్రమలలో ప్రైవేట్ నెట్‌వర్క్‌ల అవసరాలు పెరుగుతాయి. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
ఓటీటీలకూ భారీ షాక్.. ఇకపై అలా కుదరదండి!
న్యూఢిల్లీ: కమ్యూనికేషన్ సేవలు అందించే సంస్థలన్నింటికీ ఒకే రకం నిబంధనలు అమలు చేయాలని టెల్కోల సమాఖ్య సీవోఏఐ డిమాండ్ చేసింది. తమకు వర్తింపచేస్తున్న నిబంధనలను ఓటీటీ (ఓవర్–ది–టాప్) కమ్యూనికేషన్ యాప్స్‌కు కూడా వర్తింపచేయాలని కోరింది. అలా చేయని పక్షంలో తమ లైసెన్సులు, నియంత్రణపరమైన నిబంధనలనైనా సడలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అన్ని ‘ఓటీటీ కమ్యూనికేషన్ సేవల విషయంలో అన్ని టెక్నాలజీలకు సమానంగా రూల్స్‌ను అమలు చేయాలి. తద్వారా పరిశ్రమలో సముచితమైన, ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది‘ అని ఒక ప్రకటనలో సీవోఏఐ పేర్కొంది. ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీసులను కూడా ఇటీవలి టెలికమ్యూనికేషన్స్ బిల్లు ముసాయిదాలో పొందుపర్చడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే ఈ తరహా సేవల విషయంలో ఎటువంటి గందరగోళం లేకుండా స్పష్టమైన నిర్వచనం ఇవ్వాలని కోరుకుంటున్నామని వివరించింది. టెలికం సంస్థలు స్పెక్ట్రం కొనుగోలు చేయం మొదలుకుని నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసుకోవడం వరకూ భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని, అనేక నిబంధనలను పాటించాల్సి ఉంటోందని సీవోఏఐ తెలిపింది. మరోవైపు ఓటీటీలు మాత్రం టెలికం సర్వీసులను ఇలాంటి బాదరబందీలేమీ లేకుండా, ఎలాంటి నిబంధనలు పాటించాల్సిన అవసరం లేకుండా అందించడం ద్వారా ప్రయోజనాలు పొందుతున్నాయని పేర్కొంది. సీవోఏఐలో టెలికం సంస్థలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మొదలైనవి సభ్యులుగా ఉన్నాయి. వాట్సాప్ వంటి ఓటీటీ కమ్యూనికేషన్ యాప్‌లు .. ఇంటర్నెట్ టెక్నాలజీ ఆధారంగా టెలికం సంస్థల తరహాలోనే వాయిస్, వీడియో కాలింగ్ సేవలను అందిస్తున్నాయి. చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
5జీ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఖచ్చితంగా వీటిని పరిశీలించండి
‘ఇండియన్ మొబైల్ కాంగ్రెస్’ ఈవెంట్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 5జీ నెట్వర్క్ ప్రారంభించారు. దీంతో దేశంలో 5జీ నెట్వర్క్ సేవలు అధికారికంగా వినియోగించేకునే సౌకర్యం కలిగింది. ప్రస్తుతం టెలికం సంస్థ ఎయిర్ టెల్ మాత్రమే ఎంపిక చేసిన ప్రాంతాల్లో 5జీ సర్వీసుల్ని ప్రారంభించగా జియో, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్లు ఈ లేటెస్ట్ టెక్నాలజీ నెట్‌వర్క్‌లను వినియోగదారులకు అందించేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో 5జీ నెట్ వర్క్‌ల పనితీరు, సిమ్‌లు, నెట్ వర్క్ ప్లాన్ ధరలు సంగతి పక్కన పెడితే..యూజర్లు 5జీ సపోర్ట్ చేసే ఫోన్లను కొనుగోలు చేసేందుకు అన్వేషిస్తున్నారు. అయితే రోజువారీ అవసరాల కోసం 5జీ నెట్ వర్క్ పనిచేసేలా స్మార్ట్ ఫోన్లలో ఏయే ఫీచర్లు ఉండాలనే విషయాల గురించి తెలుసుకుందాం. 5జీ చిప్సెట్ 5జీ నెట్‌వర్క్‌లకు సపోర్ట్ చేసేలా మీ ఫోన్లో తప్పని సరిగా 5జీ చిప్సెట్ ఉండాలి. ఇక్కడ శుభ పరిణామం ఏంటంటే? ఇప్పటికే తయారు చేసిన కొత్త చిప్సెట్లు మిడ్ రేంజ్, ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లకు 5జీ నెట్ వర్క్ సపోర్ట్ చేస్తున్నాయి. క్వాల్కమ్ ప్రాసెసర్ సపోర్ట్ చేసే ఫోన్లలో స్నాప్ డ్రాగన్ 695 , స్నాప్‌డ్రాగన్ 765జీ, స్నాప్‌డ్రాగన్ 865, చిప్ సెట్లు డిఫాల్ట్‌గా 5జీ నెట్ వర్క్‌కి మద్దతు ఇస్తాయి. మీడియా టెక్ ప్రాసెసర్‌కు సపోర్ట్ చేసే ఫోన్లలో మీడియా టెక్ డైమెన్సిటీ సిరీస్ చిప్సెట్ ఉంటే 5జీ నెట్ వర్క్‌ను వినియోగించుకోవచ్చు. ఇందులో డైమెన్సిటీ 700 వంటి తక్కువ స్థాయి ఫోన్లు, అలాగే హై-ఎండ్ డైమెన్సిటీ 8100, డైమెన్సిటీ 9000 ఉన్నాయి. పాత జీ-సిరీస్, హీలియో సిరీస్ ఫోన్లు 5జీని వినియోగించుకోలేం. 5G బ్యాండ్లు స్మార్ట్ ఫోన్ 5జీ నెట్‌వర్క్‌లకు సపోర్ట్ చేస్తుందా? లేదా? అనేది ఫోన్ చిప్సెట్ నిర్ణయిస్తుంది. అందుకే మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఏదైనా ఫోన్లో 5జీ బ్యాండ్లకు సపోర్ట్ చేస్తాయా? లేదా అనేది ఒక్కసారి చెక్ చేయండి. సంబంధిత కంపెనీ వెబ్సైట్లో డివైజ్ ప్రొడక్ట్ పేజీ విభాగంలో స్పెసిఫికేషన్ సెక్షన్లో బ్యాండ్ వివరాలు ఉంటాయి. 5జీ బ్యాండ్స్ 8-12 మధ్య ఉంటే సరిపోతుంది. వాటి పనితీరు బాగుంటాయి. -
28 రోజుల మొబైల్ రీఛార్జ్ ప్లాన్ వెనక మతలబు ఇదే!
సాక్షి,ముంబై: సాధారణంగా ఏ మొబైల్ ఫోన్ రీచార్జ్ చేసుకోవాలన్నా 28రోజుల వాలిడిటీ ఉంటుంది గమనించారా? నెలలో 30, 31 రోజులుంటే టెలికాం కంపెనీలు లెక్క మాత్రం 28 రోజులే. అలాగే 56 లేదా 84 రోజులు మాత్రమే ఎందుకు? ఉంటాయి. దీనికి వెనుక బిజినెస్ ప్లాన్‌గురించి ఒకసారి ఆలోచిస్తే.. కస్టమర్లు సంవత్సరానికి 12 నెలలకు 12 సార్లకు బదులుగా 13 సార్లు రీఛార్జ్ చేసు కోవాలనేది ఎపుడైనా గుర్తించారా? అదే కంపెనీ దోపిడీ మంత్ర. ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఇలా ఆయా కంపెనీల ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్‌లో అనేక రకాల ప్లాన్లను అందిస్తాయి. ఈ రకమైన ప్లాన్ కారణంగా వినియోగదారులు సంవత్సరానికి 12 రీఛార్జ్‌లకు బదులుగా 13 రీఛార్జ్‌లు చేయాల్సి ఉంటుంది. 28 రోజుల ప్లాన్ కారణంగా 30 రోజులు ఉన్న నెలలో 2 రోజులు మిగిలిపోతాయి. నెలలో 31 రోజులు ఉంటే 3 రోజులు మిగిలి పోతాయి. (పీకల్లోతు మునిగిన వొడాఫోన్ ఐడియా: కస్టమర్లకు బ్యాడ్ న్యూస్) ఫిబ్రవరి నెల 28/29 రోజులు మాత్రమే ఆ సంవత్సరం మరికొన్ని రోజులు అదనంగా మిగులుతాయి. దీని కారణంగా మీరు అదనపు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కంపెనీలు ప్రతి సంవత్సరం గరిష్టంగా ఒక నెల రీఛార్జ్ ప్రయోజనాన్ని కంపెనీలు దండుకుంటున్నాయి. అయితే ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం 30 రోజుల ప్లాన్ ఇప్పటికీ అందిస్తోంది. (డ్రోన్ కెమెరా ఆర్డర్ చేస్తే...ప్యాకేజీ చూసి కస్టమర్ షాక్!) ట్రాయ్ కీలక ఆదేశాలు వినియోగదారుల ఫిర్యాదుమేరకు 28 రోజుల ప్రణాళికను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తప్పుబట్టింది. 28 రోజులకు బదులు 30 రోజుల ప్లాన్ ఇవ్వాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్ మార్గదర్శకం జారీ చేసింది.దీని ప్రకారం నెల చెల్లుబాటయ్యేలా జియో రూ. 259 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అలాగే ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాకూడా మొత్తంగా కాకగాపోయినా కొన్ని ప్లాన్లను లాచ్ చేసింది. -
టెలికం కంపెనీలకు ‘సిమ్’ పోటు.. ఈ– సిమ్ పంచాయితీ!
న్యూఢిల్లీ: టెలికం సేవల కంపెనీలు (ఆపరేటర్లు), మొబైల్ ఫోన్ల తయారీదారుల మధ్య పేచీ వచ్చింది. ఇదంతా సిమ్ కార్డులకు కొరత ఏర్పడడం వల్లే. కరోనా కారణంగా లాక్డౌన్లతో సెమీకండక్టర్ పరిశ్రమలో సంక్షోభం నెలకొనడం తెలిసిందే. రెండేళ్లయినా కానీ సెమీకండక్టర్ల కొరత ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలను వేధిస్తోంది. ఇది టెలికం కంపెనీలనూ తాకింది. సిమ్‌కార్డుల సరఫరాలో కొరత నెలకొంది. అంతేకాదు, 2024కు ముందు సిమ్ల సరఫరా పరిస్థితి మెరుగుపడేలా లేదు. దీంతో రూ.10,000 అంతకుమించి విలువ చేసే అన్ని మొబైల్ ఫోన్లలో, ఫిజికల్ సిమ్ స్లాట్‌తోపాటు.. ఎలక్ట్రానిక్ సిమ్ (ఈ–సిమ్) ఉండేలా మొబైల్ ఫోన్ తయారీదారులను ఆదేశించాలని టెలికం ఆపరేటర్లు కోరుతున్నారు. ఇందుకు సంబంధించి సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) టెలికం శాఖకు లేఖ రాసింది. కానీ, సీవోఏఐ డిమాండ్‌ను ఇండియన్ సెల్యులర్ ఎలక్ట్రానిక్స్ అసిసోయేషన్ (ఐసీఈఏ)ను నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఈ నెల 10న కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖకు లేఖ రాసింది. సెల్యులర్ ఆపరేటర్లు కోరుతున్నట్టు మొబైల్ ఫోన్లలో ఈ–సిమ్ కార్డులను ప్రవేశపెట్టడం వాటి తయారీ వ్యయాలు పెరిగేందుకు దారితీస్తుందని పేర్కొంది. అదనపు హార్డ్‌వేర్ అవసరంతోపాటు, డిజైన్లోనూ మార్పులు అవసరమవుతాయని వివరించింది. ధరలు పెరిగే ప్రమాదం.. ప్రస్తుతం ఈ–సిమ్ ఆప్షన్ ఖరీదైన ఫోన్లలోనే ఉంది. కేవలం 1–2 శాతం మంది చందాదారులే ఈ ఫోన్లను వినియోగిస్తున్నారు. రూ.10,000పైన ధర ఉండే ఫోన్లు మొత్తం ఫోన్ల విక్రయాల్లో 80 శాతంగా ఉన్నాయని ఐసీఈఏ అంటోంది. ఈ–సిమ్‌ను తప్పనిసరి చేస్తే భారత మార్కెట్లో అమ్ముడుపోయే ఫోన్ల కోసం ప్రత్యేక డిజైన్లు అవసరమవుతాయని పేర్కొంది. ఎందుకంటే ఇతర దేశాల్లో ఈ–సిమ్ తప్పనిసరి అనే ఆదేశాలేవీ లేవు. దీంతో భారత మార్కెట్లో విక్రయించే ఫోన్లను ఈ–సిమ్‌కు సపోర్ట్ చేసే విధంగా తయారు చేయాల్సి వస్తుంది. ఫలితంగా మధ్య స్థాయి ఫోన్ల ధరలు పెరిగిపోతాయి. మొబైల్ ఫోన్ల మార్కెట్లో సగం రూ.10,000–20,000 బడ్జెట్‌లోనివే కావడం గమనార్హం. సిమ్‌కార్డులకు కొరత ఏర్పడడంతో వాటి ధరలు పెరిగాయన్నది సెల్యులర్ ఆపరేటర్ల మరో అభ్యంతరంగా ఉంది. దీన్ని కూడా ఐసీఈఏ వ్యతిరేకిస్తోంది. ‘‘సిమ్ కార్డుల ధర ఐదు రెట్లు పెరిగినా ఫర్వాలేదు. కానీ, ఈ–సిమ్ కోసం ఫోన్లో చేయాల్సిన హార్డ్‌వేర్ మార్పుల కోసం అయ్యే వ్యయంతో పోలిస్తే తక్కువే’’అన్నది ఐసీఈఏ వాదనగా ఉంది. అన్ని మొబైల్ ఫోన్లకు ఈ–సిమ్‌లను తప్పనిసరి చేసినట్టయితే అది మొబైల్ ఫోన్ల పరిశ్రమ వృద్ధిని దెబ్బతీస్తుందని, ఎగుమతుల పట్ల నెలకొన్న ఆశావాదాన్ని సైతం నీరుగారుస్తుందని అంటోంది. త్వరలో కుదురుకుంటుంది.. సిమ్‌కార్డుల కొరత సమస్య త్వరలోనే సమసిపోతుందని ఐసీఈఏ అంటోంది. వచ్చే 6–9 నెలల్లో సాధారణ పరిస్థితి ఏర్పడొచ్చని చెబుతోంది. కానీ, సిమ్ సరఫరాదారులతో సీవోఏఐ ఇదే విషయమై చేసిన సంప్రదింపుల ఆధారంగా చూస్తే.. సిమ్ కార్డుల సరఫరా 2024కు ముందు మెరుగయ్యే అవకాశాల్లేవని తెలుస్తోంది. హైలైట్స్ ► సరఫరా సమస్యల కారణంగా సిమ్ కార్డుల ధర పెరిగిపోయింది: సీవోఏఐ ► సిమ్ కార్డుల ధర ఐదు రెట్లు పెరిగినా, హార్డ్‌వేర్‌లో ఈ–సిమ్ల కోసం చేయాల్సిన మార్పుల వల్ల అయ్యే వ్యయాలతో పోలిస్తే తక్కువే: ఐసీఈఏ ► ఈ–సిమ్ కార్డులతో సిమ్‌కార్డుల వ్యర్థాలను (నంబర్ పోర్టబులిటీ రూపంలో) నివారించొచ్చు: సీవోఏఐ ► 1–2 శాతం చందాదారులే ఈ సిమ్‌లను వాడుతున్నారు. అన్ని ఫోన్లకు తప్పనిసరి చేయొద్దు: ఐసీఈఏ ► సిమ్ కార్డుల సరఫరా 2024లోపు మెరుగుపడే అవకాశాలు కనిపించడం లేదు: సీవోఏఐ ► 6–9 నెలల్లో సరఫరా సాధారణ స్థితికి వచ్చేస్తుంది: ఐసీఈఏ -
ఐఫోన్లలోనే కాదు.. స్మార్ట్ ఫోన్లలో సైతం అదిరిపోయే ఫీచర్..
టెలికం రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 1జీ మొదులుకొని 2జీ, 3జీ, 4జీ అంటూ కొత్త కొత్త టెక్నాలజీలను అందుబాటులోకి తెస్తున్నాయి. వినియోగదారుల జీవన విధానాన్ని మరింత సులభతరం చేస్తున్నాయి. త్వరలో 4జీ కంటే 10రెట్ల వేగంతో పనిచేసే 5జీ అందుబాటులోకి తేనున్నాయి. ఈ తరుణంలో టెలికం రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు, లేటెస్ట్ టెక్నాలజీలను వినియోగంలోకి తెచ్చేందుకు అనుసరిస్తున్న ఆధునిక పద్ధతుల్ని..ఆకళింపు చేసుకుంటున్న స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు వాటిని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ మరికొద్ది రోజుల్లో విడుదల చేయనున్న ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లలో శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. తొలిసారి యాపిల్ ఈ శాటిలైట్ ఫీచర్‌పై వర్క్ చేస్తుండగా..ఇప్పుడు అదే దారిలో గూగుల్‌తో పాటు ఇతర సంస్థలు సైతం ఈ సరికొత్త ఫీచర్‌ను యూజర్లకు అందించనున్నాయి. గూగుల్ సైతం గూగుల్ ఆండ్రాయిడ్ వెర్షన్ డెవెలప్మెంట్ టీంలో కీలకంగా పనిచేస్తున్న Hiroshi Lockheimer యాపిల్ తన ఐఫోన్లలో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ ఎనేబుల్ చేయడంపై స్పందించారు. ఈ ఫీచర్ ఐఫోన్లలోనే కాకుండా.. వచ్చే ఏడాది విడుదల కానున్న ఆండ్రాయిడ్ 14లో ఎనేబుల్ చేసేందుకు గూగుల్, గూగుల్‌తో ఒప్పందమైన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. అయితే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి వస్తే ఆండ్రాయిడ్ 13 కోసం సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి, పాత వెర్షన్లలో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌ను తెచ్చేందుకు గూగుల్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలన్ మస్క్ మహిమ ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో స్మార్ట్ ఫోన్లలో శాటిలైట్ కనెక్టివిటీకి ప్రాధాన్యం పెరిగింది. ఈ ఫీచర్ సాయంతో స్మార్ట్ ఫోన్ యూజర్లు నెట్ వర్క్ లేని ప్రాంతాల్లో సైతం టెక్ట్స్, కాల్స్ చేసుకునే సౌకర్యం ఉంది. శాటిలైట్ కనెక్టివిటీ ఎంపిక చేసిన దేశాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది. శాటిలైట్ నెట్ వర్క్‌లను ఆపరేట్ చేసేందుకు, వినియోగదారులకు అందుబాటులో తెచ్చేందుకు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ ఫీచర్ ఎనేబుల్ అవుతుందా? లేదా అని తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సి ఉంటుందని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 సముద్రంలో పడిన ఐఫోన్, 'బ్రాండ్' బాబుకు దొరికిందోచ్! -
నా 30 ఏళ్ల అనుభవంలో తొలిసారి: ఎయిర్టెల్ చైర్మన్ ఆశ్చర్యం, ప్రశంసలు
సాక్షి,ముంబై: 5జీ స్పెక్ట్రం కొనుగోలుకు సంబంధించి ఎయిర్టెల్ ముందస్తు చెల్లింపులు చేసిన కొన్ని గంటల్లోనే సంబంధిత స్పెక్ట్రమ్‌ను సంస్థకు కేటాయించడం విశేషంగా నిలిచింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించినతీరుపై ఎయిర్టెల్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ప్రశంసలు కురిపించారు. ఊహించిన దానికంటే ముందుగానే 4జీతో పోలిస్తే 10 రెట్ల వేగంగో 5జీ సేవలు దేశంలో అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. ఆ మేరకు ఆయన ట్విటర్లో ఒక ప్రకటన విడుదల చేశారు ఎయిర్ టెల్ చెల్లింపులు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే 5జీ స్పెక్ట్రం కేటాయించినట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం నుంచి లేఖ అందిందని ఎయిర్టెల్ చైర్మెన్ సునీల్ భారతి మిట్టల్ సంతోషం ప్రకటించారు. నిర్ణీత ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల కేటాయింపు లేఖ చేతికందిందని, ఇచ్చిన హామీ మేరకు స్పెక్ట్రమ్‌తోపాటు ఇ బ్యాండ్ కేటాయింపులు జరిగాయని వెల్లడించారు. బహుశా చెల్లింపులు జరిపిన రోజే ఇలా లేఖ అందడం ఆశ్చర్యం కలిగించిందనీ, చరిత్రలో తొలిసారి అని పేర్కొన్నారు. తన 30 అనుభవంలో తొలిసారి ఇలా జరిగిందంటూ ఉబ్బితబ్బిబ్బవుతునన్నారు. ఎలాంటి గందరగోళం, వివరాల ఆరాలు, ఆఫీసుల చుట్టూ తిరగడాలు ఈ బాదర బందీ ఏమీ లేకుండానే ఇది సాధ్యమైందని తెలిపారు. ఇదంతా టెలికాం శాఖ నాయకత్వ కృషి అని, ఈజీ బిజినెస్‌కు ఇది నిదర్శనమన్నారు. ప్రస్తుతం ఈ మార్పే అవసరమని ఇదే మనదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ఇంధనంగా తోడ్పడు తుందంటూ మిట్టల్ అభిప్రాయపడ్డారు. Ready to lead India into the next generation of connectivity. #Airtel5G pic.twitter.com/deFlNWlZcC — Bharti Airtel (@airtelnews) August 18, 2022 టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు స్పెక్ట్రమ్ కేటాయింపు లేఖలను జారీ చేసినట్లు ప్రభుత్వం గురువారం తెలిపింది, ఎయిర్టెల్ ఈ నెలాఖరులో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.షెడ్యూల్ కంటే 4 సంవత్సరాల ముందుగానే బకాయిలను చెల్లించిందని కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ కూ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేసారు. "5G అప్డేట్: స్పెక్ట్రమ్ అసైన్మెంట్ లెటర్ జారీ చేశాం. 5G లాంచ్‌కు సిద్ధం కావాలని సర్వీసు ప్రొవైడర్లను అభ్యర్థిస్తున్నాను" అని పేర్కొన్నారు. కాగా 5జీ స్పెక్ట్రమ్ బకాయిల కోసం టెలికాం కంపెనీలు రూ.17,873 కోట్లకు పైగా చెల్లించాయి. ఇందులో దాదాపు సగం నాలుగేళ్లకు చెందిన ముందస్తు చెల్లింపులు రూ. 8,312.4 కోట్లు భారతీ ఎయిర్టెల్ చెల్లించింది. -
ఆరో రోజూ కొనసాగిన స్పెక్ట్రం వేలం
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రం వేలం కొనసాగుతోంది. ఆరో రోజైన ఆదివారం మరో రూ. 163 కోట్ల బిడ్లు అదనంగా రావడంతో ఇప్పటిదాకా వచ్చిన బిడ్ల విలువ మొత్తం రూ.1,50,130 కోట్లకు చేరినట్లు టెలికం శాఖ వెల్లడించింది. ఉత్తర్ ప్రదేశ్ ఈస్ట్ సర్కిల్‌కు శనివారం డిమాండ్ కాస్త తగ్గినట్లు కనిపించినా ఆదివారం మళ్లీ పుంజుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో ఏడో రోజైన సోమవారం నాడు కూడా వేలం కొనసాగనుంది. టెలికం సంస్థలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా వేలంలో పాల్గొంటోంది. దాదాపు రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే 72 గిగాహెట్జ్ స్పెక్ట్రంను ప్రభుత్వం విక్రయిస్తోంది. -
సై అంటై సై.. రెండో రోజు బిడ్లు@ రూ.1.49 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: అత్యంత వేగవంతమైన 5జీ టెలికం సేవలకు అవసరమైన స్పెక్ట్రంను కేటాయించేందుకు నిర్వహిస్తున్న వేలంలో టెల్కోలు గట్టిగా పోటీపడుతున్నాయి. రెండో రోజు (బుధవారం) ముగిసేసరికి తొమ్మిది రౌండ్లు పూర్తి కాగా రూ. 1.49 లక్షల కోట్ల విలువ చేసే బిడ్లు వచ్చాయి. తొలి రోజున నాలుగు రౌండ్లు నిర్వహించగా, టెల్కోలు రూ. 1.45 లక్షల కోట్ల బిడ్లను దాఖలు చేశాయి. రెండో రోజైన బుధవారం మరో అయిదు రౌండ్లు జరిగాయి. వేలం ప్రక్రియ మూడో రోజున (గురువారం) కూడా కొనసాగనున్నట్లు టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. చదవండి: America Federal Reserve Bank: ప్చ్.. మళ్లీ పెంచారు, ఏడాది చివరికల్లా మరో షాక్! -
స్పెక్ట్రం వేలం కోసం రూ. 21,800 కోట్ల బయానా
న్యూఢిల్లీ: త్వరలో నిర్వహించబోయే 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు టెలికం సంస్థలు రూ. 21,800 కోట్లు బయానాగా (ఈఎండీ) చెల్లించాయి. వీటిలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అత్యధికంగా రూ. 14,000 కోట్లు, భారతి ఎయిర్టెల్ రూ. 5,500 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 2,200 కోట్లు, అదానీ డేటా నెట్వర్క్స్ రూ. 100 కోట్లు డిపాజిట్ చేశాయి. టెలికం శాఖ పోర్టల్‌లో పొందుపర్చిన ప్రీ–క్వాలిఫైడ్ బిడ్డర్ల జాబితా ప్రకారం ఈ వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం మీద 2021లో మూడు సంస్థలు బరిలో ఉన్నప్పుడు వచ్చిన రూ. 13,475 కోట్లతో పోలిస్తే తాజాగా మరింత ఎక్కువగా రావడం గమనార్హం. బిడ్డింగ్‌కు సంబంధించి డిపాజిట్ చేసిన మొత్తాన్ని బట్టి జియోకి అత్యధికంగా 1,59,830 అర్హత పాయింట్లు, ఎయిర్‌టెల్‌కు 66,330, వొడాఫోన్‌కు 29,370, అదానీ డేటా నెట్వర్క్స్కు 1,650 పాయింట్లు కేటాయించారు. జులై 26న ప్రారంభమయ్యే వేలంలో వివిధ ఫ్రీక్వెన్సీల్లో 72 గిగాహెట్జ్ స్పెక్ట్రంను కేంద్రం విక్రయించనుంది. బేస్ ధర ప్రకారం దీని విలువ రూ. 4.3 లక్షల కోట్లు. కంపెనీలు డిపాజిట్ చేసిన మొత్తాన్ని బట్టి స్పెక్ట్రం కొనుగోలు చేయడంలో వాటి ఆర్థిక స్థోమత, వ్యూహాలు మొదలైన వాటిపై అంచనాకు రావచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
5జీ వేలంపై టెల్కోల్లో ఆసక్తి
న్యూఢిల్లీ: అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలకు ఉపయోగపడే 5జీ స్పెక్ట్రంపై టెలికం సంస్థలు ఆసక్తిగానే ఉన్నాయని, వేలంలో ఉత్సాహంగా పాల్గొంటాయని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ధీమా వ్యక్తం చేశారు. 5జీ సర్వీసులతో దేశం ముందుకెళ్లడానికి ఇదే సరైన సమయమని ఆయన పేర్కొన్నారు. స్పెక్ట్రం బేస్ ధరను గణనీయంగా తగ్గించడంతో పాటు, యూసేజీ చార్జీలనూ ఎత్తివేయడంతో టెల్కోలపై ఆర్థిక భారం చాలా మటుకు తగ్గిపోతుందని మంత్రి చెప్పారు. ఇక టెక్ కంపెనీలు సొంతంగా క్యాప్టివ్ నెట్‌వర్క్‌లు ఏర్పాటు చేసుకునేందుకు స్పెక్ట్రం కేటాయించే విషయంలో టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సుల మేరకే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టెలికం శాఖ జూలై 26న స్పెక్ట్రం వేలం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ వేలంలో దాదాపు రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే 72 గిగాహెట్జ్ స్పెక్ట్రంను విక్రయించనుంది. దీనికి సంబంధించి జూన్ 20న ప్రీ–బిడ్ కాన్ఫరెన్స్‌ను టెలికం శాఖ నిర్వహించనుంది. -
టెలికం సంస్థల విమర్శలు..గట్టి కౌంటర్ ఇచ్చిన ట్రాయ్
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రం నిబంధనలపై టెల్కోల విమర్శల నేపథ్యంలో టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తన సిఫార్సులను సమర్ధించుకుంది. ఇవి అంతర్జాతీయంగా పాటిస్తున్న ప్రమాణాలకు అనుగుణంగా, సహేతుకంగా, సరళతరంగా, సముచితంగానే ఉన్నాయని స్పష్టం చేసింది. కనీస సర్వీసుల కల్పన నిబంధన తిరోగామి చర్యగా టెల్కోలు వ్యాఖ్యానించడంపై ట్రాయ్ స్పందించింది. ఇతర 5జీ మార్కెట్లలో కూడా ఇది అమల్లో ఉందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 5జీ ప్రయోజనాలు ఆపరేటర్లకు మాత్రమే కాకుండా కస్టమర్లకు కూడా అందేలా చూడాల్సిన బాధ్యత ట్రాయ్‌పై ఉందని ఆయన చెప్పారు. కనీస సర్వీసుల నిబంధనలు విధించకపోతే స్పెక్ట్రం వనరులను సమర్ధంగా ఉపయోగించుకోని పరిస్థితి తలెత్తుతుందని అధికారి వివరించారు. 5జీ సేవల వ్యాప్తికి నియమాలను నిర్దేశించే క్రమంలో అయిదేళ్లలో సగటున 4జీ సర్వీసుల విస్తరణను ట్రాయ్ పరిగణనలోకి తీసుకుందని ఆయన చెప్పారు. అందులో నాలుగో వంతు.. అది కూడా సర్కిళ్లను బట్టి వచ్చే 3–5 ఏళ్లలో అమలు చేయమంటోందని చెప్పారు. స్పెక్ట్రం ధర, ఇతర నిబంధనలను పునఃసమీక్షించాలన్న మొబైల్ ఆపరేటర్ల డిమాండ్లను ఆయన కొట్టిపారేశారు. సంపూర్ణ అధ్యయనంతో సహేతుకంగా చేసిన సిఫార్సులను ప్రకటించిన వారం రోజులకే మళ్లీ సమీక్షించే అవకాశమే ఉండదని పేర్కొన్నారు. సుమారు రూ. 7.5 లక్షల కోట్ల బేస్ ధరతో వివిధ బ్యాండ్లలో స్పెక్ట్రంను వేలం వేసేలా ట్రాయ్ ఈ నెల తొలినాళ్లలో సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: ప్రచారంలో పీక్స్.. మొబైల్ కొంటే పెట్రోల్, నిమ్మకాయలు ఉచితం -
వరుసగా మూడోసారి రిలయన్స్ జియోకు గట్టి షాకిచ్చిన యూజర్లు..! జోష్‌లో ఎయిర్టెల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో టెలికం చందాదార్ల సంఖ్య 2022 ఫిబ్రవరిలో 116.6 కోట్లు నమోదైంది. జనవరితో పోలిస్తే ఇది 0.29 శాతం తగ్గుదల. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రకారం.. యూపీ తూర్పు, జమ్ము, కశ్మీర్, హర్యానా మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో మొబైల్ కస్టమర్లు తగ్గుముఖం పట్టారు. బ్రాడ్‌బ్యాండ్ చందాదార్లు స్వల్పంగా తగ్గి 78.34 కోట్ల నుంచి 78.33 కోట్లకు వచ్చి చేరారు. మొబైల్ సర్వీసెస్ విభాగంలో రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా కస్టమర్లను పోగొట్టుకోగా, కేవలం భారతి ఎయిర్టెల్ మాత్రమే కొత్త వినియోగదార్లను సొంతం చేసుకుంది. భారతి ఎయిర్టెల్ నూతనంగా 15.91 లక్షల మందిని చేర్చుకుంది. రిలయన్స్ జియో మొబైల్ కస్టమర్లను పోగొట్టుకోవడం వరుసగా మూడవసారి. ఫిబ్రవరిలో ఈ సంస్థ నుంచి 36.6 లక్షల మంది వినియోగదార్లు నిష్క్రమించారు. దీంతో జియో మొత్తం మొబైల్ కస్టమర్ల సంఖ్య 40.27 కోట్లకు వచ్చి చేరింది. ఫిక్స్డ్ లైన్ చందాదార్లు క్రమంగా పెరుగుతున్నారు. వీరి సంఖ్య 2.42 కోట్ల నుంచి 2.45 కోట్లకు ఎగసింది. ప్రైవేటు కంపెనీలు కస్టమర్లను పెంచుకుంటుండగా ప్రభుత్వ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వెనుకబడుతున్నాయి. ఈ విభాగంలో రిలయన్స్ జియో 2.44 లక్షలు, భారతి ఎయిర్టెల్ 91,243, వొడాఫోన్ ఐడియా 24,948, క్వాడ్రెంట్ 18,622, టాటా టెలీసర్వీసెస్ 3,772 కొత్త వినియోగదార్లను నమోదు చేశాయి. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంయుక్తంగా 70 వేల పైచిలుకు కస్టమర్లను దూరం చేసుకున్నాయి. చదవండి: జియో అదిరిపోయే బంపరాఫర్, రూ.200కే '14 ఓటీటీ' యాప్స్ సబ్స్క్రిప్షన్! -
ధరల తగ్గింపుపై టెలికాం సంస్థల అసంతృప్తి... ట్రాయ్ వివరణ..!
న్యూఢిల్లీ: స్పెక్ట్రం ధరల తగ్గింపు ఆశించిన స్థాయిలో లేదంటూ టెల్కోలు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్.. తన సిఫార్సులను సమర్థ్ధించుకుంది. శాస్త్రీయంగా లెక్కించి, హేతుబద్ధమైన చార్జీలనే సిఫార్సు చేశామని ట్రాయ్ చైర్మన్ పీడీ వాఘేలా చెప్పారు. 5జీ మార్కెట్లో భారీ అవకాశాలు ఉన్నందున.. స్పెక్ట్రం వేలంలో టెలికం సంస్థలు చురుగ్గా పాలుపంచుకుంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము సిఫార్సు చేసిన రిజర్వ్ ధరలు .. బిడ్డర్లకు ఆకర్షణీయంగా ఉండగలవని భావిస్తున్నట్లు వాఘేలా తెలిపారు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడం, పరిశ్రమ వర్గాల నుంచి విస్తృతంగా సేకరించిన అభిప్రాయాలు, దేశీయంగా 5జీ విస్తృతికి గణనీయంగా అవకాశాలు ఉండటం తదితర అంశాలే ట్రాయ్ ప్రస్తుత నిర్ణయానికి ప్రాతిపదికలని ఆయన వివరించారు. ‘ఆకర్షణీయమైన ధర, సరళతర చెల్లింపు ఆప్షన్లు, సులభతరంగా సరెండర్ చేసే నిబంధనలు, లీజింగ్ విషయంలో చేసిన సిఫార్సులు మొదలైన వాటితో త్వరలో నిర్వహించబోయే వేలం.. ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా ఉంటుంది‘ అని వాఘేలా తెలిపారు. 30 ఏళ్ల వ్యవధికి కేటాయించే స్పెక్ట్రం కనీస ధరలను దాదాపు 39% తగ్గిస్తూ .. సుమారు రూ. 7.5 లక్షల కోట్ల మెగా వేలానికి ట్రాయ్ సిఫార్సు చేసింది. -
కరోనా కాలర్ ట్యూన్లు తక్షణమే ఆపేయండి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు అందుబా టులోకి తెచ్చిన కాలర్ ట్యూన్లను ఇకపై నిలిపివేయాలని టెలికం కంపెనీలను కేంద్రం ఆదేశించింది. కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు, వ్యాధిపై ముందు జాగ్రత్తలు, టీకా ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర టెలీకమ్యూనికేషన్ల శాఖ రెండేళ్లుగా పలు దఫాలుగా వీటిని జారీ చేసింది. ఇకపై కరోనా సంబంధిత అన్ని ప్రకటనలు, కాలర్ ట్యూన్లను తక్షణమే ఆపేయాలని టెలికం ప్రొవైడర్లను కోరుతూ టెలికమ్యూనికేషన్ల శాఖ మార్చి 29వ తేదీన ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఇందుకు, కేంద్ర కుటుంబ, ఆరోగ్య శాఖ కూడా సమ్మతించిం దని వివరించింది. వీటి కారణంగా అత్యవసర సమయాల్లో ఫోన్ కాల్స్ ఆలస్యమవు తున్నాయంటూ కేంద్రానికి ఇటీవలి కాలంలో పలువురి నుంచి విజ్ఞాపనలు అందాయి. -
మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్.. 28 కాదు ఇకపై 30 రోజులు
భారత టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ మరో సరికొత్త నిబంధన తీసుకొచ్చింది. టెలికాం సంస్థలకు ప్రీపెయిడ్ ప్యాక్‌ల విషయంలో వాలిడిటీని పెంచాలని షాకిచ్చింది. తద్వారా మొబైల్ ఫోన్ వినియోగదారుల ప్రీపెయిడ్ ప్యాక్ వ్యాలిడిటీ విషయంలో గుడ్ న్యూస్ చెప్పినట్లయ్యింది. గతంలో ప్రీపెయిడ్ ప్యాక్‌లు 30 రోజుల కాలపరిమితితో లభ్యమయ్యేవి. అయితే, ఆ తర్వాత వీటిని అన్ని టెలికం సంస్థలు 28 రోజులకు తగ్గించేశాయి. ఫలితంగా సంవత్సరానికి 13 సార్లు రీచార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. వినియోగదారులకు ఇది భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి సంస్థ 30 రోజుల కాలపరిమితితో.. ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్‌లను తీసుకురావాలని ఆదేశించింది. ఈ మేరకు టెలికమ్యూనికేషన్ ఆర్డర్ 1999కి మార్పు చేస్తూ.. ప్లాన్ ఓచర్, ఒక స్పెషల్ టారిఫ్ ఓచర్, కాంబో వోచర్లు ఉండాలని స్పష్టం చేసింది. ప్రతి నెలా ఒకే తేదీన వీటిని రీచార్జ్ చేసుకుంటే సరిపోయేలా ఉండాలని ఆదేశించింది. అంతేకాదు, రెండు నెలల్లోపు తమ ఆదేశాలను అమలు చేయాలని టెల్కోలను ఆదేశించింది. -
కేంద్రం కీలక ఆదేశాలు! కాల్ రికార్డ్స్, ఇంటర్నెట్ యూజర్ల వివరాలన్నీ..
టెలికాం ఆపరేటర్లకు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న యూజర్ల కాల్ రికార్డింగ్ డాటాను, ఇంటర్నెట్ యూసేజ్ డాటాను రెండేళ్ల పాటు భద్రపర్చాలంటూ ఆ ఆదేశాల్లో పేర్కొంది. గతంలో ఈ సమయం ఏడాది పాటే ఉండేది. ఒకవేళ భద్రతా ఏజెన్సీలు కోరితే ఆ గడువును పెంచే విధంగా సవరణ వెసులుబాటు ఉండేది(గతంలో ఎన్నడూ జరగలేదు!). అయితే ఈసారి రెండేళ్లపాటు భద్రపర్చాలంటూ యునిఫైడ్ లైసెన్స్ అగ్రిమెంట్‌కు సవరణ చేయడం విశేషం. రెండేళ్లపాటు లేదంటే ప్రభుత్వం చెప్పేవరకు వివరాలను భద్రపర్చి ఉంచాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం(DoT) డిసెంబర్ 21న ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా టెలికామ్ కంపెనీలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, టెలికాం లైసెన్స్‌లు కలిగిన ఇతరులు.. కమర్షియల్‌తో పాటు యూజర్ల కాల్ వివరాల రికార్డ్లను భద్రపర్చాలని స్పష్టం చేసింది. భద్రతా ఏజెన్సీలు కోరినందునే ఈసారి ఈ సవరణ చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రజాప్రయోజనాల దృష్ట్యా లేదంటే భద్రతాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని టెల్కోస్, ఇంటర్నెట్ ప్రొవైడర్లకు టెలికమ్యూనికేషన్ విభాగం ఈ తరహా ఆదేశాల్ని జారీ చేస్తుంటుంది. కాల్ రికార్డింగులు, మెసేజ్‌ల వివరాలతో పాటు ఇంటర్నెట్ సేవలకు సంబంధించి ఈ-మెయిల్, లాగిన్, లాగ్ అవుట్.. ఇలా అన్ని వివరాలను జాగ్రత్త పర్చాల్సి ఉంటుంది. ఐపీ అడ్రస్ వివరాలకు అదనంగా ఈసారి ఇంటర్నెట్ టెలిఫోనీ(యాప్‌ల ద్వారా చేసే కాల్స్, వైఫై కాల్స్ తదిరత వివరాలు) సైతం రెండు సంవత్సరాలపాటు భద్రపర్చాల్సిందే!. దర్యాప్తు, విచారణ, భద్రతా ఏజెన్సీలు ఎప్పుడు కోరితే అప్పుడు ఆ వివరాల్ని కంపెనీలు సమర్పించాల్సి ఉంటుంది. థర్డ్ జనరేషన్ ఇంటర్నెట్.. మీరూ కుబేరులు అయిపోవచ్చు! -
టెలికాం కంపెనీలే లక్ష్యంగా..నోకియా బిగ్ స్కెచ్..!
Nokia Plans To Launch Cloud Based Software Subscription Service For Telecom Companies: టెలికాం కంపెనీలను లక్ష్యంగా చేసుకొని నోకియా భారీ ఆలోచనతో ముందుకురానుంది. అనలిటిక్స్, సెక్యూరిటీ , డేటా మేనేజ్మెంట్ సర్వీస్ సాఫ్ట్‌వేర్‌ను అందించడం కోసం క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్ సబ్స్క్రిప్షన్ సర్వీస్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు నోకియా బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అనేక సాంకేతిక సంస్థలు ఊహాజనిత, పునరావృత వ్యాపారాన్ని నిర్మించడానికి ముందస్తు లైసెన్సింగ్ నుంచి సబ్స్క్రిప్షన్ మోడల్ వైపుగా కదులుతున్నాయి. దీంతో నోకియా సబ్స్క్రిప్షన్ మోడల్ వైపుగా చూస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: తగ్గేదె లే అంటున్న జియో! నోకియా రూపొందించిన పలు సాఫ్ట్వేర్ పోర్ట్‌ఫోలియోలను ఈ ఏడాది నుంచి సబ్స్క్రిప్షన్ బేస్‌లో అందిస్తుండగా...వచ్చే ఏడాది ప్రారంభంలో పూర్తిగా ఆయా సాఫ్ట్వేర్ పోర్ట్‌ఫోలియోలను వాణిజ్యపరంగా అందుబాటులో ఉంచాలని నోకియా భావిస్తోంది. క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్ సర్వీసులను నోకియా 2016లోనే సృష్టించినప్పటికీ...సబ్స్క్రిప్షన్ మోడల్‌పై కంపెనీ అంతగా మొగ్గుచూపలేదని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మార్క్ బన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం సబ్స్క్రిప్షన్ మోడల్‌ను పూర్తి స్ధాయిలో అందుబాటులోకి వస్తోందని మార్క్ వెల్లడించారు. దీంతో పలు టెలికాం కంపెనీల వ్యయాలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. క్లౌడ్-ఆధారిత సాఫ్ట్వేర్ టెలికాం కంపెనీల డేటా, అనలిటిక్స్, సెక్యూరిటీ పరంగా నిర్వహణ మరింత సులభతం కానుంది. ఇప్పటికే పలు టెలికాం కంపెనీలతో క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్ వినియోగంపై నోకియా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 2021-2025 కాలానికి 3.1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 23,060 కోట్లు) ను నోకియా లక్ష్యంగా పెట్టుకుంది. చదవండి: సెకండ్‌కు సుమారు 6 లక్షల 48 వేల సంపాదన..! -
ఇంటర్నెట్ స్పీడ్ ఎంత వస్తుందో ఇలా చెక్ చేయండి..!
మన నిత్యజీవితంలో ఇంటర్నెట్ ఒక భాగమైంది. ఇంటర్నెట్ లేకుండా మన డే స్టార్ట్ అవ్వడం కష్టమే. సాంకేతిక కారణాల వల్ల మనకు ఇంటర్నెట్ స్పీడ్ కొంచెం స్లోగా వస్తుంది. పలు టెలికాం నెట్వర్క్స్ సంస్థలు మా నెట్వర్క్ ఇంతా స్పీడ్ వస్తోందని యాడ్స్‌ను ఇవ్వడం మనం చూసే ఉంటాం. వారు చెప్పేది ఒకటి మనకు వచ్చే ఇంటర్నెట్ స్పీడ్ మరొకటి. మనం వాడుతున్న ఆయా టెలికాం నెట్వర్క్ ఇంటర్నెట్ స్పీడ్ ఎంత వస్తుందో అనే విషయాన్ని పలు యాప్స్‌ను ఉపయోగించి తెలుసుకోవచ్చును. మీకు ఆయా టెలికాం నెట్వర్క్ అందిస్తోన్న స్పీడ్‌ను టెలికాం నెట్వర్క్ ఆపరేటర్‌కు తెలియజేస్తే మీరు ఉండే పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ స్పీడ్‌ను బూస్ట్ చేసేందుకు చర్యలను తీసుకుంటారు. చదవండి: Google Pay: గూగుల్ పేలో ఆ సేవలు కష్టమే..! ఊక్లా ఇంటర్నెట్ స్పీడ్‌టెస్ట్: ఊక్లా , ఇంటర్నెట్ యాక్సెస్ పనితీరు కొలమానాలను అందించే వెబ్ సర్వీస్ సంస్థ. ప్రముఖ టెలికాం కంపెనీలు ఊక్లా టెస్ట్‌ను ఆధారం చేసుకొనే నెట్వర్క్ స్పీడ్‌ను ప్రకటిస్తాయి. యాపిల్ స్టోర్‌లో అప్లికేషన్ అందుబాటులో ఉంది. ఇది అత్యంత విశ్వసనీయమైన ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. యాప్‌లో యూజర్ లొకేషన్‌తో పాటు ఇతర అనుమతులను ఊక్లా అడుగుతోంది. స్పీడ్‌టెస్ట్ మాస్టర్: ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ స్పీడ్‌ను పరీక్షించడానికి స్పీడ్‌టెస్ట్ మాస్టర్ సులభమైన అప్లికేషన్. ఇది 4జీ, డీఎస్ఎల్, 5జీ, ఏడీఎస్ఎల్ వంటి వివిధ నెట్‌వర్క్‌ల వేగాన్ని పరీక్షించే అవకాశం ఉంది. మోటియోర్ : ఈ యాప్‌ను ఉపయోగించి అతి తక్కువ స్థాయిలో ఇంటర్నెట్ స్పీడ్‌ను కొలవవచ్చును. గూగుల్ స్పీడ్ టెస్ట్ : మీరు ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేయకూడదనుకుంటే మీకు గూగుల్ స్పీడ్ టెస్ట్ ప్రయోజనకరంగా ఉంటుంది. క్రోమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేసి గూగుల్ స్పీడ్ టెస్ట్‌ని సెర్చ్ చేశాక ...గూగుల్ స్పీడ్ టెస్ట్‌పై క్లిక్ చేశాక మీ నెట్వర్క్ డౌన్లోడ్ వేగం, ఆప్‌లోడ్ వేగాలను గుర్తించవచ్చును. చదవండి: సడన్‌గా కాల్ డిస్కనెక్ట్ అవుతోందా..! ఇలా చేయండి..! -
టెలికం రాయితీలతో ప్రజలకేం లాభం?
టెలికం రంగ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎన్నో ప్రశ్నలకు తావిస్తోంది. కేవలం మూడు ప్రైవేటు టెలికం కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల మేర రాయితీలు ప్రకటించిన కేంద్రం, అదే ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ విషయంలో పూర్తి విరుద్ధంగా ప్రవర్తించింది. విశాఖ ఉక్కు కర్మాగారం అప్పు విషయంలోనూ కేంద్రం ధోరణి అదే. మరి ప్రైవేటు రంగం మీద ఎందుకింత ప్రేమ? అయితే, ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఉన్న అవరోధాల వల్ల ఈ సహాయం అవసరమేననే నిపుణుల వాదన కూడా తోసిపుచ్చదగినది కాదు. కానీ ఈ మొత్తం ఉదారత సామాన్యులకు అందే సేవల్లో ఏమేరకు ప్రతిఫలిస్తుంది అన్నదే వేచిచూడాల్సిన అంశం.ఇటీవల కేంద్ర ప్రభుత్వం టెలికం కంపెనీలకు ప్రకటించిన రాయితీల విషయం ఆయా రంగాల్లోని వారికి తప్ప ఇతరులకు పెద్ద ఆసక్తి గొలపలేదు. కానీ టెలికం రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. కేవలం మూడు టెలికం కంపెనీలకు దాదాపు రూ.రెండు లక్షల కోట్ల రాయితీ ఇచ్చి, దేశ టెలికం రంగం బాగుపడిందంటే నమ్మడం ఎలా? ప్రజలకు వీటి వల్ల ఒరిగేదేమిటి? పూర్వరంగం 1994లో ప్రైవేటు టెలికం కంపెనీలకు ఫిక్స్డ్ లైసెన్సు విధానంలో అనుమతి నిచ్చారు. లైసెన్స్‌తో పాటు కొంత స్పెక్ట్రమ్ ఉచితంగా ఇచ్చేవారు. ఫిక్స్డ్ లైసెన్స్ విధానం అంటే, ఏడాదికి కొంత మొత్తం లైసెన్స్‌గా చెల్లించడం. ఏడాదికి కచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని టెలిఫోన్ కనెక్షన్లు ఇవ్వాలన్న నిబంధనలు ఉండేవి. అప్పట్లో ఇన్కమింగ్ కాల్స్‌కు కూడా ప్రైవేటు టెలికం కంపెనీలు డబ్బులు వసూలు చేసేవి. లైసెన్స్ నిబంధనల ఉల్లంఘన, గ్రామీణ ప్రాంతాల్లో ఫోన్లు ఇవ్వని కారణంగా ప్రైవేటు టెలికం కంపెనీలు రూ.50వేల కోట్ల పెనాల్టీ చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. తమకు నష్టాలు వస్తున్నాయని, పెనాల్టీలు రద్దు చేయాలని టెలికం కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో 1999 నూతన టెలికం విధానం వచ్చింది. దీని ప్రకారం టెలికం కంపెనీలు ఫిక్స్డ్ లైసెన్స్ విధానం ప్రకారం కాకుండా, రెవెన్యూపై 8 శాతం లైసెన్స్ ఫీజుగానూ, 3–5 శాతం స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీగానూ చెల్లించాలి. ప్రైవేటు టెలికం కంపెనీలు చెల్లించాల్సిన 50 వేల కోట్ల పెనాల్టీ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే రెవెన్యూ అంటే ఏమిటి అన్న విషయంలో టెలికం కంపెనీలకూ, ప్రభుత్వానికీ వివాదం ఏర్పడింది. నాన్ టెలికం ఆదాయంపై కూడా పన్ను చెల్లించాలని ప్రభుత్వం కోరింది. సుప్రీంకోర్టు 2019లో ఈ విషయంలో తీర్పు ఇస్తూ– ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పన్ను చెల్లించాలని తీర్పు నిచ్చింది. దీని ప్రకారం రూ.1,46,000 కోట్లు వెంటనే చెల్లించాలని ఆదేశించింది. దీనిపై అప్పీలుకు వెళ్లినా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ సమయంలో ప్రైవేటు టెలికం కంపెనీలు చెల్లించాల్సిన పన్నులు చెల్లించే అవసరం లేకుండా రెండేళ్ల మారిటోరియం విధించింది. ప్రైవేటు టెలికం కంపెనీలు చెల్లించాల్సిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూపై పన్నులు చెల్లించేందుకు 10 ఏళ్ల గడువు ఇవ్వాలని కోరగా సుప్రీంకోర్టు అంగీకరించింది. రూ.39 వేల కోట్ల రూపాయలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండగా ఇవ్వకుండా, వీఆర్ఎస్ పేరుతో 90 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపిన ఘనత కేంద్ర ప్రభుత్వానిది. కానీ మూడు ప్రైవేటు టెలికం కంపెనీలు రూ.1,46,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, వారికి 10 ఏళ్ల గడువు ఇమ్మని కోర్టును కేంద్రం కోరడం గమనార్హం. తాజాగా కల్పించిన రాయితీలేమిటి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం టెలికం కంపెనీలకు ఏమేమి రాయితీలు కల్పించిందో చూద్దాం: 1.అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ నిర్వచనాన్ని మార్చి, ప్రైవేటు టెలికం కంపెనీలు కోరుకున్న విధంగా నాన్ టెలికం ఆదాయంపై పన్ను చెల్లించకుండా వెసులుబాటు. అయితే ఈ నిర్ణయం ఇప్పటి నుంచి మాత్రమే వర్తిస్తుంది. గత కాలపు పన్ను బకాయిలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చెల్లించాలి. 2.టెలికం కంపెనీలు చెల్లించాల్సిన చట్టబద్ద పన్నులకు గతంలోని రెండేళ్ల కాలానికి అదనంగా మరో నాలుగేళ్ళ మారటోరియం విధించారు. అంటే అక్టోబర్ 2025 వరకు టెలికం కంపెనీలు కేవలం వడ్డీ చెల్లిస్తే చాలు. 3.డైరెక్ట్ విధానం ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 100 శాతం అమలు. ఈ నిర్ణయం వల్ల విదేశీ టెలికం కంపెనీలు దేశ టెలికం రంగాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. 4.వడ్డీ రేటు గతంలో ఎస్బీఐ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటుకు అదనంగా నాలుగు శాతం ఉండగా, దాన్ని రెండు శాతానికి తగ్గించారు. 5.స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీలు ఇకపై రద్దు. గతకాలపు స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీలు నెలవారిగా కాకుండా ఏడాదికి ఒకసారి చెల్లించే వెసులుబాటు. 6.లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీ చెల్లించకపోతే విధించే అదనపు రుసుం రద్దు. 7.స్పెక్ట్రమ్ లైసెన్స్ ఇకపై 20 ఏళ్ళు కాకుండా 30 ఏళ్ల కాలానికి పొడిగింపు. 8.స్పెక్ట్రమ్ షేరింగ్ చేసుకోవచ్చు. ఈ షేరింగ్‌పై ఇప్పటివరకు విధించిన రెవెన్యూపై 0.5 శాతం పన్ను రద్దు. 9. బ్యాంకు గ్యారెంటీలు ఇకపై బిజినెస్ సర్కిల్ ప్రకారం కాకుండా యావత్ ఇండియా ప్రాతిపదికన ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల టెలికం కంపెనీలకు 80 శాతం భారం తగ్గుతుంది. 10.ఇకపై ప్రతి ఆర్థిక సంవత్సరం చివరలో స్పెక్ట్రమ్ వేలం. 11. నాలుగేళ్ళ మారటోరియం తర్వాత కూడా టెలికం కంపెనీలు పన్నులు చెల్లించలేకపోతే ఆ మొత్తం ఈక్విటీగా మార్చుకోవచ్చు. 12. స్పెక్ట్రమ్ వాపస్ ఇవ్వాలంటే కనీసం 10 ఏళ్ల తర్వాతనే వీలవుతుంది. ఇలా విధాన పరమైన నిర్ణయాల్లో కేంద్రం మార్పులు చేసింది. ప్రధానంగా ఈ నిర్ణయాల వల్ల దివాలా స్థితిలో ఉన్న వొడాఫోన్–ఐడియా కంపెనీ తాను చెల్లించాల్సిన లక్షా ఎనభై వేల కోట్ల బకాయిలలో, రూ. 96,000 కోట్ల వెసులుబాటు నాలుగేళ్ళ కాలానికి లభించింది. ప్రజలకు ఏం ఉపయోగం? విశాఖ ఉక్కు కర్మాగారానికి ఉన్న అప్పు 20,000 కోట్ల రూపాయలు. ఈ మొత్తాన్ని ఈక్విటీగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరగా కేంద్రం తిరస్కరించింది. మానిటైజేషన్ పేరుతో బీఎస్ఎన్ఎల్కు చెందిన 20,000 టవర్లు అమ్మివేసి, కేబుల్ అమ్మి, భూములు అమ్మి రూ.35,000 కోట్లు ఆర్జించాలని కేంద్రం ప్రకటించింది. కానీ టెలికం కంపెనీలకు ప్రకటించిన రాయితీలు గమనిస్తే ఒక్క వొడాఫోన్–ఐడియాకే రూ.96,000 కోట్ల వెసులుబాటు వచ్చింది. కాగా మొత్తం టెలికం రంగానికి రెండు లక్షల కోట్ల రూపాయల మేర రాయితీలు ఇచ్చారు. 1994 నుండి ఇప్పటి దాకా అనేక పర్యాయాలు టెలికం రంగానికి రాయితీలు లభించాయి. టెలికం రంగ పారిశ్రామికవేత్తల అభిప్రాయం ప్రకారం– టెలికం రంగంలో 2జీ నుండి 3జీకి, 3జీ నుండి 4జీకి, 4జీ నుండి 5జీకి ప్రతి నాలుగైదేళ్ల వ్యవధిలో మారాల్సి రావడం, దానికోసం టెక్నాలజీ దిగుమతులు, సాంకేతిక అభివృద్ధి కోసం పెట్టుబడులు, టెలికం కంపెనీల మధ్య అనారోగ్య కరమైన పోటీతో ధరల తగ్గుదల లాంటి కారణాల వల్ల పెట్టుబడులు పెరిగి, ఆదాయాలు తగ్గి, నష్టాలు వస్తున్నాయి కనుక ఈ వెసులుబాట్లు అవసరం. కొంతమంది పారిశ్రామికవేత్తల కోసం ఇంత మొత్తంలో రాయితీ ఇవ్వడం సరి కాదని, ఈ రాయితీలు ప్రజలకు సరాసరి చేరేలా చూసే విధానాన్ని రూపొందిస్తే బాగుండేదని మరికొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రజల ధనంతో దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న ఆరు లక్షల కిలోమీటర్ల ఫైబర్‌ను భారత్ నెట్ కింద నిర్మిస్తూ, అందులో రెండు లక్షల కిలోమీటర్ల ఫైబర్‌ను అమ్మి రూ.20,000 కోట్లు సమీకరించాలను కోవడం ఏమిటి? మరోవైపు లక్షల కోట్లు రాయితీగా ఇవ్వడం ఏమిటి? బీఎస్ఎన్ఎల్కు ఉన్న 70,000 టవర్లలో 20,000 టవర్లు అమ్మి రూ.15,000 కోట్లు సమీకరించే ఆలోచన ఎందుకు? 4జీ ఇవ్వకుండా, టవర్లను 4జీకి అప్‌గ్రేడ్ చేయకుండా ప్రభుత్వ డైరెక్టర్లే అడ్డు పడటం ఏమిటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా టెలికం రంగంలో ఒకటి రెండు కంపెనీల గుత్తాధిపత్య నివారణకు ప్రభుత్వం భారీ రాయితీలే ఇచ్చింది. ఈ రాయితీల ద్వారా మెరుగైన సేవలను ప్రజలకు ప్రైవేటు టెలికం కంపెనీలు అందుబాటులోకి తెస్తాయని; ప్రపంచంలొనే అతి తక్కువ టారిఫ్‌లు ఉన్న దేశంగా మనం ఇకపై కూడా కొనసాగేలా ఉండాలంటే ప్రభుత్వ రంగంలోని బీఎస్ఎన్ఎల్/ఎంటీఎన్ఎల్కు కూడా మరిన్ని వెసులుబాట్లు ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుందాం. మురాల తారానాథ్ వ్యాసకర్త టెలికం రంగ విశ్లేషకులు -
సామాన్యుడి నెత్తిన మరో పిడుగు...!
దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు, నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడి నెత్తిమీద మరో పిడుగు పడనుంది. ఈ సారి మొబైల్ రీచార్జ్ టారిఫ్‌ల రూపంలో రానుంది. పలు టెలికాం కంపెనీలు రీచార్జ్ టారిఫ్‌ల రేట్లను పెంచనున్నట్లు తెలుస్తోంది. టారిఫ్‌ల పెంపులతో సామాన్యుడికి మరింత భారం కానుంది. తాజాగా భారతి ఎయిర్టెల్ తన యూజర్ల కోసం బేసిక్ స్మార్ట్ ప్రీ పెయిడ్ ప్లాన్ ధరను రూ. 49 నుంచి ఏకంగా రూ. 79 పెంచేసింది. ఈ బేసిక్ ప్లాన్‌పై సుమారు 55 మిలియన్ల యూజర్లు ఆధారపడి ఉన్నారు. ఎయిర్టెల్ ఈ ప్లాన్‌లో భాగంగా అవుట్ గోయింగ్ కాల్స్‌కు సంబంధించి నాలుగు రెట్లు అధికంగా టాక్‌టైంను అందించింది. దాంతోపాటుగా డబుల్ మొబైల్ డేటాను చేసింది. తాజాగా ఎయిర్టెల్ బాటలో వోడాఫోన్-ఐడియా కూడా టారిఫ్‌లను పెంచే దారిలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. వోడాఫోన్-ఐడియా ఇప్పటికే రూ. 49 ప్లాన్‌ను విరమించుకుంది. ఈ ప్లాన్‌కు బదులుగా కొత్తగా 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 79 ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా బాటలోనే పలు టెలికాం కంపెనీలు ప్రయాణించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే 6 నెలల్లో రీచార్జ్ టారిఫ్ ప్లాన్ల ధరలను 30 శాతం మేర పెంచాలని టెలికాం కంపెనీలు భావిస్తున్నాయి. టారిఫ్‌లను పెంచడంతో యూజర్ల నుంచి వచ్చే సగటు తలసరి ఆదాయాన్ని (ఏఆర్పీయూ) పెంచుకోవాలని టెలికాం కంపెనీలు యోచిస్తున్నాయి. గోల్డ్‌మన్ సాచ్ ప్రకారం.. టెలికం కంపెనీలు 2021 ఆర్థిక సంవత్సరంలో ప్రీ పెయిడ్ కస్టమర్ల నుంచి 50-80 శాతం వరకు రెవెన్యూను జనరేట్ చేసుకున్నాయని పేర్కొంది. టెలికాం కంపెనీల్లో ఫ్రీ క్యాష్ ఫ్లో (ఎఫ్‌సీఎఫ్) మెరుగుపడాలంటే..కచ్చితంగా ప్రీపెయిడ్ ప్లాన్ల టారిఫ్‌ల పెంపు అనివార్యమని తెలిపింది. కాగా జియో నుంచి టారిఫ్‌ల పెంపు తక్కువగా ఉండే అవకాశం ఉందని గోల్డ్‌మన్ సాచ్ పేర్కొంది. -
ఆ కాల్స్‌కు ముందుగా ‘0’ నొక్కండి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్స్‌కు చేసే కాల్స్‌కు ముందుగా ‘0’ నొక్కాలని టెలికం కంపెనీలు కస్టమర్లను కోరాయి. ఈ మేరకు ల్యాండ్‌లైన్ వినియోగదార్లకు సందేశాలను పంపాయి. గతేడాది నవంబర్‌లో టెలికం శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు 2021 జనవరి 15 నుంచి ఈ నూతన విధానం అమలులోకి వచ్చిందని కంపెనీలు తెలిపాయి. ల్యాండ్‌లైన్ నుంచి ల్యాండ్‌లైన్‌కు, మొబైల్ నుంచి ల్యాండ్‌లైన్‌కు, మొబైల్ నుంచి మొబైల్‌కు చేసే కాల్స్‌లో ఎలాంటి మార్పు లేదు. -
5జీ టెక్నాలజీను వెంటనే అనుమతించండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా 5జీ టెక్నాలజీని త్వరితగతిన అనుమతించమంటూ పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు వీలుగా పాలసీ నిర్ణయాలను సాధ్యమైనంత త్వరగా తీసుకోవలసిందిగా అభ్యర్థించారు. దేశంలో డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ జోరందుకునేందుకు పలు సూచనలను చేశారు. మూడు రోజుల భారత్ మొబైల్ కాంగ్రెస్ సదస్సు 2020 ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, టెలికం మంత్రి రవిశంకర ప్రసాద్ వద్ద డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ పలు అంశాలను ప్రస్తావించారు. వివరాలు ఇలా.. చౌక ఫోన్లతో వచ్చే ఏడాది(2021) ద్వితీయార్థానికల్లా దేశంలో 5జీ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవలసి ఉంది. ఇదేవిధంగా అందుబాటు ధరల్లో 5జీ స్మార్ట్ ఫోన్లను అందించేందుకు వీలు కల్పించవలసి ఉంది. ఇందుకు అవసరమైన విధానపరమైన నిర్ణయాలను సాధ్యమైనంత త్వరగా తీసుకోవలసిందిగా కోరుతున్నాను. ప్రధాని మోడీజీ డిజిటల్ మిషన్ కారణంగా కోవిడ్-19 వల్ల ఎదురైన కష్టకాలంలోనూ దేశం బలంగా నెగ్గుకురాగలిగింది. ఆన్లైన్లోనే విద్య, షాపింగ్, ఆఫీసులు, ఆరోగ్యం తదితర పలు కార్యక్రమాలు కొనసాగాయి. ఇందుకు దేశమంతటా విస్తరించిన 4జీ నెట్వర్క్ మౌలిక సదుపాయాలు సహకరించాయి. అయితే ఇప్పటికీ 30 కోట్లమంది ప్రజలు 2జీ నెట్‌వర్క్‌కే పరిమితమై ఉన్నారు. చౌక ధరల్లో స్మార్ట్ఫోన్లకు తెరతీయడం ద్వారా మరింతమంది ప్రజలకు డిజిటల్ సేవలు అందించేందుకు వీలుంటుంది. ప్రభుత్వ సహకారం కారణంగా టెలికం పరిశ్రమ పలు సర్వీసులను అందించగలిగింది. కోవిడ్-19 కట్టడికి త్వరలో చౌక ధరలోనే వ్యాక్సిన్లను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నందున 2021లో పరిస్థితులు చక్కబడతాయని విశ్వసిస్తున్నాను. దీంతో ఆర్థిక రికవరీతోపాటు.. జీడీపీ వృద్ధి బాట పట్టేవీలుంది. తద్వారా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించే దిశలో పరుగుపెట్టనుంది. జియో ముందుంటుంది ప్రస్తుతం ప్రపంచంలో భారత్ సైతం డిజిటల్ కనెక్టెడ్ దేశాల జాబితాలో ముందుంటోంది. దీనిని కొనసాగిస్తూ ప్రభుత్వం అత్యవసర ప్రాతిపదికన 5జీ సేవలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతోపాటు.. అందుబాటు ధరలో సర్వీసులు, స్మార్ట్ఫోన్లకు అవకాశం కల్పించవలసి ఉంది. తద్వారా 2021 ద్వితీయార్థానికల్లా రిలయన్స్ జియో ద్వారా 5జీ విప్లవానికి బాటలు వేయగలం. దీంతో దేశీయంగా 5జీ నెట్వర్క్, హార్డ్‌వేర్, టెక్నాలజీ పరికరాల తయారీకి ఊపు లభిస్తుంది. ప్రధాని మోడీజీ ఆవిష్కరించిన ఆర్మనిర్భర్ భారత్ విజన్‌లో జియో 5జీ సర్వీసులు భాగంకావడం ద్వారా డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌కు ఊపు నిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. జియో ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఆధునిక సాంకేతితతో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఆర్థిక, వాణిజ్య విభాగాలలో కొత్తతరహా సర్వీసులను అందిస్తున్నాం. హార్డ్‌వేర్ తయారీ కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు మరిన్ని చర్యలు చేపట్టవలసి ఉంది. ఇప్పటికే మంత్రివర్యులు రవిశంకర ప్రసాద్ కృషి నేపథ్యంలో గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలు దేశానికి తరలివచ్చి హార్డ్‌వేర్ తయారీపై దృష్టిపెడుతున్నాయి. పూర్తిస్థాయిలో డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సాధించేందుకు దేశీయంగా తయారీని బలపరుచుకోవలసి ఉంది. తద్వారా దిగుమతులపై ఆధారపడటానికి చెక్ పెట్టవచ్చు. -
5జీపై రూ. 2.3 లక్షల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 5జీ సేవలందించేందుకు స్పెక్ట్రం, సైట్లు, ఫైబర్ నెట్‌వర్క్‌పై టెలికం కంపెనీలు దాదాపు రూ. 1.3–2.3 లక్షల కోట్ల దాకా పెట్టుబడులు పెట్టాల్సి రావొచ్చని మోతీలాల్ ఓస్వాల్(ఎంవోఎఫ్ఎస్) ఒక నివేదికలో అంచనా వేసింది. ఒక్క ముంబై సర్కిల్లోనే 5జీ నెట్‌వర్క్‌పై రూ. 10,000 కోట్లు, ఢిల్లీలో రూ. 8,700 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందని పేర్కొంది. మధ్య లేదా కనిష్ట స్థాయి బ్యాండ్ స్పెక్ట్రం రిజర్వ్ ధర ప్రాతిపదికన ఎంవోఎఫ్ఎస్ ఈ లెక్కలు వేసింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ రిజర్వ్ ధర ప్రకారం ముంబైలో 100 మెగాహెట్జ్ మిడ్ బ్యాండ్ స్పెక్ట్రం కోసం రిజర్వ్ ధర రూ. 8,400 కోట్లుగా ఉండనుంది. మరిన్ని కంపెనీలు తీవ్రంగా పోటీపడితే బిడ్డింగ్ ధర మరింతగా పెరగవచ్చు. కవరేజీ కోసం కనీసం 9,000 సైట్లు అవసరమయిన పక్షంలో వీటిపై సుమారు రూ. 1,800 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి రావొచ్చు. దీంతో ముంబైలో 5జీ నెట్‌వర్క్‌పై వెచ్చించాల్సిన మొత్తం రూ. 10,000 కోట్ల స్థాయిలో ఉండనుంది. -
టెల్కోల ఆదాయానికి బూస్ట్
న్యూఢిల్లీ: టెలికం సంస్థలకు యూజర్లపై వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) క్రమంగా పెరగనుంది. కరోనా వైరస్ కాలంలో పెరిగిన డేటా వినియోగం, టారిఫ్‌ల పెంపు (మార్కెట్ ఆధారితమైనది కావొచ్చు లేదా నియంత్రణ సంస్థపరమైన చర్యల ఆధారితమైనదైనా కావొచ్చు) తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. జేఎం ఫైనాన్షియల్ సంస్థ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. దేశీ టెలికం రంగంలో కన్సాలిడేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయిపోయిన నేపథ్యంలో ఏఆర్పీయూల పెరుగుదల తప్పనిసరిగా ఉండవచ్చని, ఫలితంగా 2024–25 నాటికి పరిశ్రమ ఆదాయం రెట్టింపై సుమారు రూ. 2,60,000 కోట్లకు చేరవచ్చని పేర్కొంది. భవిష్యత్ పెట్టుబడుల అవసరాలను బట్టి చూస్తే 2025 ఆర్థిక సంవత్సరం నాటికి టెల్కోల ఏఆర్పీయూ రూ. 230–250 స్థాయికి చేరాల్సి ఉంటుందని నివేదిక తెలిపింది.ఇక ఆధిపత్యమంతా రెండు కంపెనీలదే కాకుండా చూసేందుకు వొడాఫోన్ ఐడియా మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే.. 2023 ఆర్థిక సంవత్సరం నాటికి ఆ సంస్థ ఏఆర్పీయూ రూ. 190–200 దాకా ఉండాల్సి వస్తుందని పేర్కొంది. కొత్త చోదకాలు..: ప్రస్తుతం శైశవ దశలోనే ఉన్న ఫైబర్ టు ది హోమ్ (ఎఫ్టీటీహెచ్), ఎంటర్ప్రైజ్ కనెక్టివిటీ వంటి వ్యాపార విభాగాలు భవిష్యత్‌లో వృద్ధికి కొత్త చోదకాలుగా మారగలవని జేఎం ఫైనాన్షియల్ నివేదిక తెలిపింది. ఈ రెండు విభాగాల్లో జియో వాటా 5–10 శాతం స్థాయిలోనే ఉండటంతో అది చౌక పోటీనిచ్చేందుకు ప్రయత్నిస్తోందని వివరించింది. ఈ నేపథ్యంలో జియో యూజర్ల సంఖ్య పెరగడం కొనసాగుతుందని వివరించింది. వొడాఫోన్ ఐడియా యూజర్లను కొల్లగొట్టడం ద్వారా 2025 ఆర్థిక సంవత్సరం నాటికి జియో 50% మార్కెట్ వాటా లక్ష్యాన్ని సాధించవచ్చని, ఎయిర్టెల్ మాత్రం తన 30% వాటాను రక్షించుకోగలదని నివేదిక అభిప్రాయపడింది. -
టెల్కోలకు కాస్త ఊరట
న్యూఢిల్లీ: ఏజీఆర్ బాకీల భారంతో కుంగుతున్న టెలికం సంస్థలకు సుప్రీంకోర్టు కాస్త ఊరట కల్పించింది. బకాయిల చెల్లింపునకు 10 సంవత్సరాల వ్యవధినిచ్చింది. 2021 మార్చి 31లోగా బాకీలో 10 శాతం భాగాన్ని కట్టాలని ఆదేశించింది. ఆయా టెల్కోల మేనేజింగ్ డైరెక్టర్లు (ఎండీ) లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (సీఈవో) బకాయిల చెల్లింపునకు సంబంధించి నాలుగు వారాల్లోగా వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు పేర్కొంది. వాయిదాలను చెల్లించని పక్షంలో జరిమానా, వడ్డీ విధించడంతో పాటు కోర్టు ఆదేశాల ధిక్కరణ కింద చర్యలు కూడా ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇక దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటున్న టెలికం సంస్థలు స్పెక్ట్రంను విక్రయించే అంశంపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) తుది ఉత్తర్వులు ఇస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. బాకీల లెక్కింపునకు సంబంధించి టెలికం శాఖ లెక్కలు, గతంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్లో మార్పేమీ ఉండబోవని జస్టిస్ అరుణ్ మిశ్రా సారథ్యంలోని బెంచ్ స్పష్టం చేసింది. వాస్తవానికి బాకీల చెల్లింపునకు టెల్కోలు, టెలికం శాఖ (డాట్) 20 ఏళ్ల వ్యవధికి అనుమతి కోరాయి. కానీ దాన్ని తిరస్కరించిన సుప్రీం కోర్టు పదేళ్ల వ్యవధికి అనుమతించడం గమనార్హం. వొడాఫోన్‌కు కష్టం.. ఎయిర్‌టెల్‌కు ఫర్వాలేదు.. సుప్రీం కోర్టు తాజా ఆదేశాల ప్రకారం పదేళ్ల వ్యవధిలో బాకీలన్నీ కట్టాలంటే వొడాఫోన్ ఐడియాకు కష్టంగా ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. భారతీ ఎయిర్టెల్ మాత్రం షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు జరిపే అవకాశాలు ఉన్నాయని బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేర్కొంది. ఎనిమిది శాతం వడ్డీ రేటు ప్రకారం చూస్తే ఏటా భారతీ ఎయిర్టెల్ రూ. 3,900 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 7,500 కోట్లు కట్టాల్సి వస్తుందని లెక్క వేసింది. ఒకవేళ వడ్డీ భారం గానీ లేకపోతే ఇది రూ. 2,600 కోట్లు /రూ. 5,000 కోట్లకు తగ్గవచ్చని వివరించింది. ఇంకా వడ్డీ రేటు విషయంలో నిర్దిష్ట ఉత్తర్వులేమీ లేవని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ (ఈక్విటీ స్ట్రాటెజిస్ట్ బ్రోకింగ్ విభాగం) హేమంగ్ జానీ తెలిపారు. ‘ఎయిర్‌సెల్, వీడియోకాన్ కట్టాల్సిన బాకీల భారం ఎయిర్‌టెల్‌పై పడదు. అలాగే ఆర్‌కామ్ బకాయిల భారం రిలయన్స్ జియోపై ఉండదు. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలు ఎయిర్టెల్, రిలయన్స్‌లకు సానుకూలమైనవే కాగలవు‘ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు రీపేమెంట్ గడువులోగా లైసెన్సుల వ్యవధి ముగిసిపోయే టెలికం సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని కేఎస్ లీగల్ అండ్ అసోసియేట్స్ మేనేజింగ్ పార్ట్నర్ సోనమ్ చంద్వాని అభిప్రాయపడ్డారు. ఇలాంటి టెల్కోలు లైసెన్సును రెన్యువల్ చేసుకోవడంలో విఫలమైతే పదేళ్ల వ్యవధి కన్నా ముందే బకాయి మొత్తం కట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఏం జరిగింది.. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) ఫార్ములా ప్రకారం స్పెక్ట్రం యూసేజీ చార్జీలు, లైసెన్సు ఫీజుల బాకీలను కేంద్రానికి టెలికం సంస్థలు కట్టాల్సిందేనని సుప్రీంకోర్టు గతేడాది అక్టోబర్‌లో ఆదేశాలు ఇచ్చింది. డాట్ లెక్కించిన దాని ప్రకారం టెల్కోలు దాదాపు రూ. 1.6 లక్షల కోట్లు పైచిలుకు కట్టాల్సి ఉంది. అయితే, తమ సొంత లెక్కల ప్రకారం తమ బాకీలు అంత భారీ స్థాయిలో లేవంటూ టెల్కోలు కొంతమేర కట్టాయి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నందున మిగతాది కట్టేందుకు 20 ఏళ్ల వ్యవధినివ్వాలంటూ కోరాయి. అటు టెలికం శాఖ కూడా 20 ఏళ్ల వ్యవధినివ్వడంపై ఈ ఏడాది మార్చిలో అఫిడవిట్ దాఖలు చేసింది. వాయిదా పద్ధతిలో బాకీలు చెల్లించడంపై జూలై 20న సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసి ఉంచింది. అయితే, బాకీ మొత్తం విషయానికి సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులేమీ ఉండబోవంటూ స్పష్టం చేసింది. ఇదే క్రమంలో టెలికం కంపెనీల గత పదేళ్ల ఖాతాలు సమర్పించాలని సూచించింది. అటు రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), రిలయన్స్ జియో మధ్య స్పెక్ట్రం షేరింగ్ ఒప్పందం వివరాలు కూడా ఇవ్వాలని ఆగస్టు 14న సూచించింది. తాజాగా బాకీల చెల్లింపు వ్యవధి విషయంలో ఆదేశాలు జారీ చేసింది. -
టెలికం బాకీలు... రిజర్వ్‌లో సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: టెలికం సంస్థలు కట్టాల్సిన ఏజీఆర్ బాకీలపై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఆర్‌కామ్ తదితర సంస్థల నుంచి స్పెక్ట్రం తీసుకున్నందుకు గాను రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కూడా అదనంగా బాకీలు కట్టాల్సి ఉంటుందా అన్న దానిపై కూడా స్పష్టతనివ్వనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) ఫార్ములా ప్రకారం టెలికం సంస్థలు కట్టాల్సిన స్పెక్ట్రం యూసేజీ చార్జీలు, లైసెన్సు ఫీజు బాకీలకు సంబంధించిన కేసుపై సోమవారం కూడా విచారణ కొనసాగింది. ఒకవేళ స్పెక్ట్రం విక్రేత గానీ బాకీలు కట్టకుండా అమ్మేసిన పక్షంలో ఆ బకాయీలన్నీ కొనుగోలు సంస్థకు బదిలీ అవుతాయని సుప్రీం కోర్టు పేర్కొంది. ఒకవేళ టెల్కోలు గానీ బాకీలు కట్టేందుకు సిద్ధంగా లేకపోతే స్పెక్ట్రం కేటాయింపును పూర్తిగా రద్దు చేయాలని ఆదేశిస్తామని స్పష్టం చేసింది. అయితే, స్పెక్ట్రం రద్దు చేసిన పక్షంలో ప్రభుత్వానికి గానీ బ్యాంకులకు గానీ దక్కేది ఏమీ ఉండదని జియో తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే తెలిపారు. విక్రేత, కొనుగోలుదారు నుంచి విడివిడిగా లేదా సంయుక్తంగా బాకీలను తాము వసూలు చేసుకోవచ్చని టెలికం శాఖ (డాట్) వెల్లడించింది. ఈ వాదనల దరిమిలా దివాలా చర్యలు ఎదుర్కొంటున్న టెలికం సంస్థలు.. స్పెక్ట్రంను విక్రయించవచ్చా అన్న అంశంతో పాటు వాటి నుంచి ప్రభుత్వం ఏజీఆర్‌పరమైన బాకీలను ఎలా రాబట్టాలి అన్న దానిపైన సుప్రీం కోర్టు ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది. ఏజీఆర్ బకాయిల విషయంలో సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపునకు విజ్ఞప్తి మరోవైపు, ఏజీఆర్ బకాయిలపై సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ టెలికం ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ కేంద్రాన్ని కోరింది. అదనంగా లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలను కట్టాల్సి రానుండటంతో దీనికి సర్వీస్ ట్యాక్స్ కూడా తోడైతే మరింత భారం అవుతుందని జూలై 17న కేంద్ర టెలికం శాఖకు రాసిన లేఖలో సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 2016 – మార్చి 2017 మధ్యకాలంలో సర్వీస్ ట్యాక్స్ బాకీల కింద టెలికం సంస్థలు రూ. 6,600 కోట్లు కట్టినట్లు తెలిపారు. -
జియోపై మీ వైఖరి చెప్పండి
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు ప్రభుత్వానికి కట్టాల్సిన లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల వివాదం కేసు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. వివరాల్లోకి వెడితే.. దివాలా తీసిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) కట్టాల్సిన బాకీలను ఆ కంపెనీ స్పెక్ట్రంను వాడుకుంటున్నందున రిలయన్స్ జియో సంస్థ కట్టాలని సుప్రీంకోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, ఆర్‌కామ్ దివాలా ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో జియోకు స్పెక్ట్రం విక్రయ అంశంపై కేంద్ర టెలికం శాఖ (డాట్), ఇటు కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. దివాలా ప్రక్రియ జరుగుతుండగా స్పెక్ట్రంను విక్రయించడానికి లేదన్నది డాట్ భావన కాగా, గరిష్ట విలువను రాబట్టేందుకు విక్రయమే సరైన మార్గమని ఎంసీఏ భావిస్తోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సోమవారం సుప్రీం కోర్టులో జరిగిన వాదనల సందర్భంగా తెలిపారు. దీనికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఏ ఉత్తర్వులు ఇచ్చినా సమ్మతమేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌కామ్ కట్టాల్సిన బాకీలను జియో చెల్లించే అంశంపై అసలు కేంద్రం వైఖరి ఏమిటన్నది తెలియజేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఏయేడాదికాయేడు ఆర్‌కామ్ కట్టాల్సిన బాకీల వివరాలను సమర్పించాలంటూ డాట్‌కు సూచించింది. తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది. -
టెలికం టారిఫ్‌ల పెంపు తప్పదు: ఈవై అంచనా
న్యూఢిల్లీ: ప్రస్తుత స్వరూపంలో ఆపరేటర్లకు సముచిత స్థాయిలో రాబడులు వచ్చే అవకాశాలు లేనందున టెలికం టారిఫ్‌లు తప్పకుండా మరింత పెరగవచ్చని కన్సల్టెన్సీ సంస్థ ఈవై అంచనా వేసింది. టెల్కోలు వచ్చే 12–18 నెలల వ్యవధిలో మరో రెండు విడతలు పెంచవచ్చని పేర్కొంది. ఇందులో భాగంగా రాబోయే ఆరు నెలల్లోనే ఒక విడత పెంచే అవకాశం ఉందని ఈవై లీడర్ (వర్ధమాన దేశాల టెక్నాలజీ, మీడియా, టెలికం విభాగం) ప్రశాంత్ సింఘాల్ తెలిపారు. అయితే, ఇదంతా కరోనా వైరస్‌పరమైన పరిణామాలు, యూజర్ల చెల్లింపు సామర్థ్యాలపై పడిన ప్రతికూల ప్రభావాలు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. -
ఎప్పట్లోగా కడతారో చెప్పండి..
న్యూఢిల్లీ: లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలకు సంబంధించిన (ఏజీఆర్) బకాయీలను ఎప్పట్లోగా, ఎలా చెల్లిస్తారో స్పష్టమైన ప్రణాళిక సమర్పించాలంటూ టెలికం సంస్థలను సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే పూచీకత్తులు కూడా ఇవ్వాలని సూచించింది. టెల్కోలు కట్టాల్సిన ఏజీఆర్ బాకీలపై గురువారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. బాకీలు కట్టేందుకు టెల్కోలకు 20 ఏళ్ల గడువు ఇచ్చే అంశంపై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. 1999 నుంచి కేసు నలుగుతోందని.. ఈ 20 ఏళ్లలో బాకీలు కట్టనప్పుడు మరో 20 ఏళ్లలో కట్టేస్తారనడానికి గ్యారంటీ ఏమిటని టెల్కోలను ప్రశ్నించింది. వాయిదాల పద్ధతిలో కట్టుకోవడానికి కోర్టు అనుమతించే పరిస్థితి లేదని.. బ్యాంక్ గ్యారంటీలివ్వడానికి టెల్కోలు, వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వడానికి ఆయా సంస్థల డైరెక్టర్లు గానీ సిద్ధంగా ఉన్నారేమో తెలియజేయాలని సూచించింది. తదుపరి విచారణను జూన్ 18కి వాయిదా వేసింది. సవరించిన ఆదాయాల ఫార్ములా ప్రకారం టెల్కోలు బాకీలు కట్టేలా సుప్రీం కోర్టు గతేడాది అక్టోబర్‌లో ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. టెలికం శాఖ లెక్కల ప్రకారం భారతి ఎయిర్టెల్ రూ. 43,980 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 58,254 కోట్లు, టాటా గ్రూప్ రూ. 16,798 కోట్లు కట్టాల్సి ఉంది. అయితే, టెల్కోలు తమ బాకీలు ఆ స్థాయిలో లేవని చెబుతున్నాయి. స్వీయ మదింపు ప్రకారం ఇప్పటికే కొంత కట్టాయి. ఇది పోగా మిగతా రూ. 93,520 కోట్ల ఏజీఆర్ బాకీలను టెల్కోలు కట్టేందుకు 20 ఏళ్ల దాకా వ్యవధినిచ్చేందుకు అనుమతించాలంటూ సుప్రీం కోర్టును కేంద్రం కోరింది. స్పెక్ట్రమే గ్యారంటీ..: వొడాఫోన్ ఐడియా తీవ్ర సంక్షోభంలో ఉందని, ఉద్యోగులకు కనీసం జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని విచారణ సందర్భంగా ఆ సంస్థ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీం కోర్టుకు తెలిపారు. టెలికం సంస్థలు వేల కోట్ల రూపాయలు చెల్లించి వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రం, లైసెన్సులనే ప్రభుత్వం గ్యారంటీగా పరిగణించవచ్చని ఆయన చెప్పారు. ఒకవేళ టెల్కోలు బాకీలు కట్టకపోతే వీటిని రద్దు చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, స్వీయ మదింపు ప్రకారం ఇప్పటికే 70% కట్టేశామని, ప్రభుత్వంతో సంప్రతించాకా మిగతాది కూడా కట్టేస్తామని భారతి ఎయిర్టెల్ తెలియజేసింది. పీఎస్యూలపై ఆ బాదుడేంటి.. ఇక ఏజీఆర్ బాకీలపై గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రాతిపదికన ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) నుంచి రూ. 4 లక్షల కోట్ల బాకీలు రాబట్టేందుకు టెలికం శాఖ చర్యలు తీసుకోవడాన్ని కూడా సుప్రీం కోర్టు ప్రశ్నించింది. పీఎస్‌యూలనుంచి బాకీలు రాబట్టేందుకు తమ ఉత్తర్వును ప్రాతిపదికగా తీసుకోవడానికి లేదని పేర్కొంది. ‘ఈ డిమాండ్ నోటీసులను వెనక్కి తీసుకోండి. లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది‘ అని స్పష్టం చేసింది. గతేడాది అక్టోబర్‌లో ఏజీఆర్ బాకీలపై సుప్రీం ఆదేశాల ప్రకారం.. స్పెక్ట్రం, లైసెన్సులున్న గెయిల్, పవర్‌గ్రిడ్, ఆయిల్ ఇండియా మొదలైన పీఎస్‌యూలు రూ. 4 లక్షల కోట్లు కట్టాలంటూ టెలికం శాఖ లెక్కేసింది. దీనిపై ఆయా సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. -
జూన్ 18కి ఏజీఆర్ కేసు వాయిదా
టెలికాం సంస్థల ఏజీఆర్ కేసు విచారణను జూన్ 18కి వాయిదా సుప్రీంకోర్టు తెలిపింది. బకాయిల చెల్లింపులకు సంబంధించి 5రోజుల్లోగా అఫిడవిట్లను కోర్టులో ధాఖలు చేయాలని వోడాఫోన్ ఐడియాతో సహా ఇతర టెలికాం సంస్థలను ఆదేశించింది. టెలికాం కంపెనీలు ఏజీఆర్ బకాయిల రూపంలో కేంద్రానికి రూ. 1.47 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇంత మొత్తంలో చెల్లింపులు ఒకేసారి తమ వల్ల కాదని టెలికాం సంస్థలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఏజీఆర్ బకాయిలను 20 లేదా అంతకు ఎక్కువ కంటే ఎక్కువ సంవత్సరాల్లో వార్షిక వాయిదాల పద్దతిలో చెల్లించే ఫార్ములాకు అనుమతిని కోరుతూ టెలికమ్యూనికేషన్ విభాగం మార్చి 16న సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ నేడు విచారణకు వచ్చింది. జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నాం: వోడాఫోన్ ఐడియా బకాయిలు భారీగా ఉన్నాయని, అఫిడవిట్లు 3-4 రోజుల్లో దాఖలు చేయలేమని వోడాఫోన్ ఐడియా సుప్రీం కోర్టకు విన్నవించుకుంది. ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు, కనీస ఖర్చులకు కూడా సంస్థ వద్ద డబ్బు లేదని వోడాఫోన్ అపెక్స్ కోర్టు తెలిపింది. ఏ బ్యాంక్ గ్యారెంట్ ఇవ్వడానికి ముందురావలేని స్థితిలో కంపెనీ ఉందని వోడాఫోన్ తరపు లాయర్ తెలిపారు. కేంద్రం లెక్కల ప్రకారం వోడాఫోన్ ప్రభుత్వానికి రూ.53వేల కోట్లను చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తంలో చట్టబద్ధమైన బకాయిలు చెల్లించనందుకు వడ్డీలు, జరిమానాలు ఉన్నాయి. మార్కెట్ ముగిసే సరికి వోడాఫోన్ ఐడియా షేరు నిన్నటి ముగింపు(రూ.10.82)తో పోలిస్తే 13.22శాతం నష్టపోయి రూ.9.39 వద్ద స్థిరపడింది. -
కరోనా ఎఫెక్ట్ : డేటాకు పెరిగిన డిమాండ్..
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో పెద్దసంఖ్యలో ఉద్యోగులు, వ్యాపారులు ఇంటి నుంచే పని చేసేందుకు మొగ్గుచూపుతుండటంతో డేటాకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. మొత్తం ఇంటర్నెట్ ట్రాఫిక్ 10 శాతం పైగా పెరిగిందని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా డాంగల్స్‌కూ డిమాండ్ రెట్టింపవడంతో రిటైలర్లు స్టాక్ తెప్పించేందుకు వారం సమయం కోరుతున్నారు. ఇంటర్నెట్ ట్రాఫిక్ 10 శాతం పెరిగిందని తమ టెలికాం సభ్యుల నుంచి సమాచారం అందిందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మ్యాథ్యూస్ వెల్లడించారు. ట్రాఫిక్ అనూహ్యంగా పెరగడంతో నెట్‌వర్క్‌లు స్తంభించే అవకాశం లేదని ఆయన తెలిపారు. డేటా డిమాండ్ పెరిగిన ఫలితంగా సమస్యలు ఎదురుకాబోవని.. నెట్వర్క్స్ అన్నీ తగిన సామర్థ్యంతో కూడుకని ఉన్నాయని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. మరోవైపు రిలయన్స్ జియో వంటి టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్ కస్టమర్లకు వారి మొబైల్స్‌లో డేటా కెపాసిటీని డిమాండ్‌కు అనుగుణంగా పెంచుతున్నాయి. టాప్‌అప్స్‌కు సరికొత్త టారిఫ్ ప్యాకేజ్‌ను జియో ఇటీవల లాంఛ్ చేసింది. రూ 21 టాప్అప్ చేయిస్తే అంతకుముందు 1 జీబీ స్ధానంలో 2జీబీ డేటా, 200 నిమిషాల ఇంటర్నెట్ కాల్స్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇక భారతి ఎయిర్టెల్ హోం బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు ఇంటి నుంచి పనిచేసుకునేందుకు వీలుగా వేగవంతమైన, అధిక డేటా ప్లాన్స్‌ను వర్తింపచేస్తోందని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. ఇక కరోనా వైరస్ నిరోధించేందుకు ప్రభుత్వ సూచనలతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో బ్రాడ్‌కాస్టింగ్, ఓటీటీ కంపెనీలు కూడా అత్యధిక వ్యూయర్లను, సబ్‌స్ర్కైబర్లను పొందుతున్నాయి. చదవండి : జనతా కర్ఫ్యూ: ఇటలీ నుంచి 263 మంది -
కోవిడ్ కాలర్ ట్యూన్‌తో ‘కాలయాపన’
సాక్షి, హైదరాబాద్: ఎవరికి ఫోన్ చేసినా మూడు సార్లు దగ్గు.. ఆ తర్వాత ఆంగ్లంలో కోవిడ్–19 వైరస్ గురించి ఆదరాబాదరా ఉపన్యాసం.. చివరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ జారీ చేసిన ప్రకటన అంటూ 30 సెకన్ల తర్వాత ముక్తాయింపు. గత రెండ్రోజులుగా రాష్ట్రంలోని అన్ని నెట్‌వర్క్‌ల మొబైల్ వినియోగదారులకు కోవిడ్ వైరస్ వ్యాప్తి నిరోధం కోసం వస్తున్న కాలర్ ట్యూన్ ఇది. కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా కాలర్ ట్యూన్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడంలో ఎవరికీ అభ్యంతరం లేదు కానీ.. ఆంగ్లంలో హడావుడిగా దొర్లుకుంటూ.. చివరకు ప్రజలను గజిబిజి చేసే విధంగా నంబర్లతో ముగించడంతో కాలయాపన తప్ప ప్రయోజనం ఏమీ లేదనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ కాలర్‌ట్యూన్ వలన రెండు రకాల ఇబ్బందులు వస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ట్యూన్‌తో పాటు కాల్ కనెక్ట్ కావడం లేదని, ఈ ట్యూన్ పూర్తయ్యాకే మనం ఫోన్ చేసిన వ్యక్తికి లైన్ కలుస్తుండటంతో చాలా టైమ్ వేస్ట్ అవుతోందని, పదేపదే అదే ట్యూన్ వినడం విసుగుపుట్టిస్తోందని మెజార్టీ మొబైల్ వినియోగదారులంటున్నారు. మరో ముఖ్యమైన సమస్య ఏమిటంటే కాలర్ ట్యూన్ ఇంగ్లిష్‌లో ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు అర్థం కాక ఫోన్ కలవడం లేదంటూ కట్ చేస్తున్నారు. మొబైల్ అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోయినా, నెట్వర్క్ సమస్యతో ఫోన్ కలవకపోయినా సదరు వినియోగదారుడికి కూడా ఆ నెట్వర్క్ ప్రతినిధులు ఇంగ్లిష్‌లోనే వివరిస్తుంటారు. ఇప్పుడు కోవిడ్ కాలర్ ట్యూన్ కూడా ఇంగ్లిష్‌లోనే వస్తుండటంతో ఫోన్ కలవడంలో సమస్య ఉందని, అందుకే ఎవరో ఇంగ్లిష్‌లో చెబుతున్నారనే భావనతో గ్రామీణ నిరక్షరాస్యులు ఫోన్ కట్ చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఎవరికి చేసినా ఇదే సమస్య వస్తోందంటూ కొందరు మొబైల్ షాప్‌లకు కూడా వెళ్లాల్సి వస్తోంది. మొత్తంమీద కోవిడ్‌పై చైతన్యపర్చడంలో తప్పేమీ లేదని, కానీ ఇంగ్లిష్ వల్లే ఇబ్బందులొస్తున్నాయనే భావన వ్యక్తమవుతోంది. కాలర్‌ట్యూన్‌ను మాతృభాషలో ఇస్తే అందరికీ అర్థమవుతుందని, తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశముందని చర్చ ఇంగ్లిష్‌లో ఇవ్వడం వల్ల జరిగే ఉపయోగ మేంటన్న జరుగుతోంది. మాతృభాషలో ఇచ్చినా రోజుకు రెండు లేదా మూడు సార్లు కోవిడ్ వైరస్ గురించి చెపితే బాగుంటుం దని, ప్రతిసారీ ఫోన్ చేయగానే దగ్గు వినిపించడం కూడా మానసికంగా ఇబ్బందేనని ప్రజలంటున్నారు. ఇప్పటికైనా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా తెలుగులో కాలర్ ట్యూన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
మరో రూ. 8వేల కోట్లు కట్టిన టెల్కోలు
న్యూఢిల్లీ: ఏజీఆర్ బకాయిలకు సంబంధించి టెలికం సంస్థలు మంగళవారం మరో రూ. 8,000 కోట్లు కేంద్రానికి చెల్లించాయి. వొడాఫోన్ ఐడియా రూ. 3,043 కోట్లు, భారతి ఎయిర్టెల్ రూ. 1,950 కోట్లు, రిలయన్స్ జియో రూ. 1,053 కోట్లు, టాటా టెలీసర్వీసెస్ రూ. 2,000 కోట్లు కట్టాయి. ఇప్పటికే పూర్తి సెటిల్మెంట్ కోసం రూ. 2,197 కోట్లు కట్టామన్న టాటా టెలీసర్వీసెస్.. ఒకవేళ లెక్కల్లో వ్యత్యాసాలేమైనా వచ్చినా సర్దుబాటు చేసేందుకు వీలుగా అదనపు మొత్తం కట్టినట్లు వెల్లడించింది. మరోవైపు, వొడాఫోన్ ఐడియా(వీఐఎల్) సీఈవో రవీందర్ టక్కర్ మరోసారి టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్‌తో భేటీ అయ్యారు. అయితే, సమావేశం వివరాలు ఆయన వెల్లడించలేదు. అటు.. వీఐఎల్ ఎప్పట్లోగా బాకీల స్వీయ మదింపు పూర్తి చేస్తుందన్న ప్రశ్నకు స్పందించేందుకు టక్కర్ నిరాకరించారు. సవరించిన స్థూల ఆదాయ (ఏజీఆర్) లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీ (ఎస్‌యూసీ) బాకీల కింద 15 టెలికం సంస్థలు.. సుమారు రూ. 1.47 లక్షల కోట్లు కట్టాల్సి ఉంది. ఏజీఆర్ బాకీల విషయంలో టెల్కోల స్వీయ మదింపు, తమ లెక్కల్లో వ్యత్యాసాలు వచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై ఆయా సంస్థలకు టెలికం శాఖ త్వరలోనే లేఖలు పంపనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
మళ్లీ పేలనున్న సెల్ బాంబ్!
న్యూఢిల్లీ: టెలికం సేవల మార్కెట్లోకి రిలయన్స్ జియో రాకతో ఎక్కువగా మురిసిపోయింది సగటు వినియోగదారుడేనని అనడంలో సందేహం లేదు. కానీ, మారిన పరిస్థితులతో ఇప్పుడు అదే వినియోగదారుడు ఆందోళన చెందాల్సిన పరిస్థితి...! కేంద్రానికి భారీ బకాయిలు కట్టాల్సి ఉన్న టెలికం కంపెనీలు ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు చార్జీలు పెంచడం ద్వారా నిధులు సమకూర్చుకోవడం మినహా ప్రత్యామ్నాయ మార్గాలు కనిపించడం లేదు. ఒకవైపు 4జీ నెట్వర్క్ విస్తరణపై భారీగా నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి.. మరోవైపు జియోకు వినియోగదారులు చేజారిపోకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి.. ఇంకోవైపు కేంద్రానికి భారీ బకాయిలు చెల్లించక తప్పని పరిస్థితి.. అందుకే గత డిసెంబర్లో ఏకంగా 42 శాతం వరకు చార్జీలను పెంచేసిన సంస్థలు.. తాజా పరిణామాల నేపథ్యంలో రానున్న ఏడాది కాలంలో మరింత పెంపునకు సిద్ధం అవుతున్నాయి. జియో రాక పూర్వం ఒక జీబీ డేటా వినియోగానికి రూ.200కుపైన ఖర్చు చేయాల్సిన పరిస్థితి. మోస్తరు కాల్స్ చేసుకునే వారు కూడా నెలకు రూ.200 వరకు వెచ్చించే వారు. కానీ, 2016లో జియో అడుగుపెట్టడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రయోగాత్మకంగా 4జీ సేవలను ఉచితంగా ఆరంభించిన జియో భారీగా వినియోగదారులను సొంతం చేసుకుంది. డేటా, కాల్స్‌ను పరిమితి లేకుండా ఉచితంగా అందించి వినియోగాన్ని కొత్త పుంతలు తొక్కించింది. జియో దెబ్బకు రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌సెల్, టాటా డొకొమో, టెలినార్ ఇలా అందరూ దుకాణాలను మూతేసుకోవాల్సి వచ్చింది. మూడేళ్లలోనే జియో చందాదారుల సంఖ్యా పరంగా నంబర్ 1 స్థానానికి చేరుకుంది. జియో విధ్వంసాన్ని తట్టుకోలేక ప్రధాన టెలికం ప్లేయర్లు వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులర్ విలీనమైన వొడాఫోన్ ఐడియాగా అవతరించాయి. చివరకు మూడు ప్రైవేటు సంస్థలు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా టెలికం మార్కెట్లో మిగిలాయి. ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు ప్రభావంతో గత 20 ఏళ్లకు సంబంధించి స్పెక్ట్రమ్, ఇతర బకాయిల రూపంలో టెల్కోలు ఇప్పుడు కేంద్రానికి రూ.1.47 లక్షల కోట్లను చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎయిర్టెల్ రూ.35వేల కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.53 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఈ ప్రభావాన్ని అధిగమించేందుకు వాటి ముందున్న మార్గం చార్జీల పెంపే. అదే జరిగితే డేటాను పొదుపుగా వాడుకోవాల్సిన రోజులు మళ్లీ వచ్చేలా ఉన్నాయి. లేదంటే జేబు నుంచి మరింత ఖర్చు చేయక తప్పదు. రానున్న ఏడాది కాలంలో సగటు వినియోగదారు నుంచి వచ్చే నెలవారీ ఆదాయం(ఏఆర్పీయూ) రెట్టింపు కావచ్చని టెలికం కంపెనీలు అంచనాలు వేసుకుంటున్నాయి. లాభాల్లోకి రావాలంటే పెంచాల్సిందే.. ‘‘2020 చివరికి ఏఆర్పీయూ నెలకు కనీసం రూ.200 స్థాయికి, 2021 నాటికి కనీసం రూ.300కు చేరాల్సి ఉందన్న సంకేతాన్ని ఇచ్చాం. టారిఫ్‌ల పెంపు వినియోగాన్ని తగ్గించొచ్చేమో కానీ, సంఖ్యపై ప్రభావం చూపించదు’’ అని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ తెలిపారు. 2019 మార్చి నాటికి ఏఆర్పీయూ రూ.113 స్థాయిలో ఉంది. దీనిపై కంపెనీలకు 18 శాతం నష్టాలు వచ్చాయి. ఏఆర్పీయూ 77 శాతం పెరిగి రూ.200కు చేరుకుంటే అప్పుడు కంపెనీలు లాభాల్లోకి ప్రవేశిస్తాయి. ఆదాయంలో లాభాలు 10 శాతానికి చేరుకుంటాయని కంపెనీల అంచనా. ఇక ఏఆర్పీయూ రూ.300కు చేరుకుంటే కంపెనీల ఆదాయంలో పన్ను అనంతరం లాభాలు 30–40 శాతానికి విస్తరిస్తాయి. అయితే టెలికం నెట్‌వర్క్‌పై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి ఉన్నందున వాస్తవ లాభాలు తక్కువగానే ఉంటాయన్నది విశ్లేషణ. వచ్చే పలు త్రైమాసికాల్లో ఏఆర్పీయూ రూ.200కు, ఆ తర్వాత కొంత కాలానికి రూ.300కు చేరుకుంటుందని భారతీ ఎయిర్టెల్ విశ్లేషకులకు ఇప్పటికే తెలియజేయడం గమనార్హం. ముఖ్యంగా ఏజీఆర్ బకాయిల భారాన్ని వినియోగదారులకు బదిలీ చేసే పరిస్థితులు తేటతెల్లంగా కనిపిస్తున్నాయి. కానీ, మార్కెట్లోకి లేటుగా వచ్చిన జియోకు ఈ ఏజీఆర్ భారం ఏమీ లేకపోవడంతో.. టారిఫ్‌ల పెంపు రూపంలో ఆ సంస్థకు లాభాల వరద పారనుంది. ఐడియా మూసేస్తే.. వొడా–ఐడియా ఒక్కో త్రైమాసికంలో రూ.6వేల కోట్లకు పైగా నష్టాలను ఎదుర్కొంటోంది. గత చార్జీల పెంపు సంస్థకు కలసి రాలేదు. పైగా కేంద్రానికి రూ.53 వేల కోట్ల వరకు కట్టాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఉపశమనం రాకపోతే సంస్థను మూసేయక తప్పదని కుమారమంగళం బిర్లా బహిరంగంగానే సంకేతమిచ్చారు. ఒకవేళ వొడా–ఐడియా దుకాణం బంద్ అయితే, ఈ సంస్థ చందాదారుల్లో (సుమారు 30 కోట్లు) కనీసం సగం మందిని అయినా సొంతం చేసుకోవడం ద్వారా 50 కోట్ల మార్క్‌ను అధిగమించాలని, 64.6 కోట్ల చందాదారుల లక్ష్యాన్ని చేరుకోవాలన్న ప్రణాళికలతో జియో సిద్ధంగా ఉందని తెలుస్తోంది. వొడా–ఐడియా నిష్క్రమణ చందాదారుల పరంగా అటు ఎయిర్టెల్ కూడా కలసి రానుంది. ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ 4జీ సేవల్లో లేదు కనుక ఆ సంస్థకు వెళ్లే చందాదారులు తక్కువగానే ఉంటారని అంచనా. -
బాకీలు చెల్లిస్తున్న టెల్కోలు
న్యూఢిల్లీ: ఏజీఆర్ బాకీలకు సంబంధించి సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో టెలికం సంస్థలు చెల్లింపులు ప్రారంభించాయి. సోమవారం భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, టాటా టెలీసర్వీసెస్ కొంత మొత్తాన్ని కట్టాయి. టెలికం శాఖకు (డాట్) ఎయిర్టెల్ రూ. 10,000 కోట్లు, టాటా గ్రూప్ రూ.2,197 కోట్లు చెల్లించాయి. ‘భారతి ఎయిర్టెల్, భారతి హెక్సాకామ్, టెలినార్‌ల తరఫున రూ.10,000 కోట్లు చెల్లించాం. మిగతా బాకీలపై స్వీయ మదింపు చేపట్టాం. సుప్రీం కోర్టులో తదుపరి విచారణ తేదీలోగా దీన్ని కట్టేస్తాం’ అని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో రూ.9,500 కోట్లు భారతి ఎయిర్‌టెల్‌కి సంబంధించినవి కాగా రూ.500 కోట్లు భారతి హెక్సాకామ్కు చెందినవి. మరోవైపు, టాటా టెలీ, టాటా టెలీ (మహారాష్ట్ర) తరఫున మొత్తం బాకీల కింద రూ.2,197 కోట్లు కట్టేశామని, వీటికి సంబంధించిన లెక్కల వివరాలను కూడా డాట్‌కు అందజేశామని టాటా టెలీసర్వీసెస్ తెలిపింది. సోమవారం రూ.2,500 కోట్లు కట్టిన వొడాఫోన్ ఐడియా.. శుక్రవారం నాటికి మరో రూ.1,000 కోట్లు కడతామంటూ సుప్రీం కోర్టుకు విన్నవించింది. అప్పటిదాకా డాట్ ఎటువంటి చర్యలు తీసుకోకుండా సూచనలివ్వాలని కోరింది. అయితే, సుప్రీం కోర్టు దీన్ని తోసిపుచ్చింది. బ్యాంక్ గ్యారంటీల స్వాధీనం సహా బాకీల వసూలుకు అన్ని చర్యలూ తీసుకునేందుకు డాట్‌కు వెసులుబాటునిచ్చింది. డాట్ గణాంకాలను బట్టి సవరించిన స్థూల ఆదాయ (ఏజీఆర్) లెక్కల ప్రకారం టెల్కోల నుంచి లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల కింద సుమారు రూ.1.47 లక్షల కోట్లు వసూలు కావాలి. ఎయిర్టెల్ సుమారు రూ. 35,586 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 53,000 కోట్లు, టాటా టెలీసర్వీసెస్ సుమారు రూ.13,800 కోట్లు చెల్లించాలి. ఈ ఏడాది జనవరి 23లోగా వీటిని కట్టేయాలంటూ గతేడాది ఆదేశించినా.. అమలు కాకపోవడంపై ఇటీవల సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కంపెనీలు, డాట్ కదిలాయి. దీనిపై మార్చి 17న సుప్రీం కోర్టు తదుపరి విచారణ జరపనుంది. బ్యాంక్ గ్యారంటీలపై డాట్ దృష్టి.. బాకీలను పూర్తిగా వసూలు చేసుకునే క్రమంలో.. టెల్కోలిచ్చిన బ్యాంక్ గ్యారంటీలను స్వాధీనం చేసుకునే అవకాశాలను డాట్ పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై డాట్ అధికారులు మంగళవారం సమావేశమై, నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించాయి. ఒకవేళ బ్యాంక్ గ్యారంటీలను నిజంగానే స్వాధీనం చేసుకుంటే... నిధులు సమీకరించుకునేందుకు నానా తంటాలు పడుతున్న వొడాఫోన్ ఐడియా వంటి సంస్థలు మూతబడక తప్పకపోవచ్చని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. రెండు త్రైమాసికాల లైసెన్సు ఫీజులు, ఇతర బకాయిలకు సరిపడే స్థాయిలో ఈ బ్యాంక్ గ్యారంటీ ఉంటుంది. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాకు సంబంధించి ఇది సుమారు రూ.5,000 కోట్ల మేర ఉంటుంది. డాట్ లెక్కలను టెల్కోలు ప్రశ్నించాయి. తమ సొంత మదింపు ప్రకారమే కడతామంటూ సూచనప్రాయంగా వెల్లడించాయి. ఈ మొత్తం వివాద ప్రభావం బ్యాంకులపై ఎలా ఉండవచ్చన్న అంశాన్ని రిజర్వ్ బ్యాంక్ పరిశీలిస్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఒక ఇంటర్వూ్య సందర్భంగా తెలిపారు. ఆ ఉత్తర్వులు.. నాన్–టెల్కోలకు కాదేమో: ధర్మేంద్ర ప్రధాన్ నాన్ టెలికామ్ ఆదాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని కంపెనీలు ఏజీఆర్ బాకీలు కట్టాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలు.. టెలికంయేతర ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తించకపోవచ్చని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు. సమాచార లోపం వల్లే చమురు కంపెనీలకు కూడా డాట్ నోటీసులిచ్చి ఉంటుందని, న్యాయనిపుణుల సలహాలు తీసుకున్నాక తమ అభిప్రాయం తెలియజేశామని చెప్పారు. నోటీసులు అందుకున్న కంపెనీలకు టెలికం కార్యకలాపాలు ప్రధాన వ్యాపారం కాదన్నారు. స్పెక్ట్రం వాడుకున్నందుకు గాను గెయిల్, ఆయిల్ ఇండియా, పవర్‌గ్రిడ్ వంటి టెలికంయేతర కంపెనీలు కూడా రూ.2.7 లక్షల కోట్లు కట్టాలంటూ డాట్ నోటీసులివ్వటం తెలిసిందే. ద్రవ్య లోటు తగ్గుతుంది: ఆర్థికవేత్తల అంచనా టెలికం సంస్థలు రూ.1.20 లక్షల కోట్ల బాకీలు కట్టిన పక్షంలో 2019–20 ఆర్థిక సంవత్సరంలో.. సవరించిన గణాంకాల కన్నా ద్రవ్య లోటు తగ్గగలదని ఆర్థికవేత్తలు తెలిపారు. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ఇది 3.5 శాతానికి పరిమితం కాగలదని ఎస్బీఐ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. సవరించిన గణాంకాల ప్రకారం ఇది 3.8 శాతం స్థాయిలో ఉండొచ్చని గతంలో అంచనా వేశారు. ‘టెల్కోలు బాకీలు కట్టేందుకు గడువైన మార్చి 16 తర్వాత ద్రవ్య లోటు పరిస్థితి గణనీయంగా మారిపోతుంది. ఏజీఆర్ బాకీలు కనీసం రూ.1.20 కోట్లు వసూలైనా.. ప్రస్తుత 2019–20 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు.. జీడీపీలో 3.5 శాతానికి దిగి రావొచ్చు‘ అని ఎస్బీఐ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. మరోవైపు, వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగిపోవడంతో ప్రజలు మళ్లీ కాలుష్యకారక పాత ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతున్నారని తెలిపారు. గ్యాస్ సిలిండర్ అందుబాటు ధరల్లో అందించడం ద్వారా ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించవచ్చని ఆర్థిక వేత్తలు పేర్కొన్నారు. -
టెల్కోలపై సుప్రీం కన్నెర్ర!
న్యూఢిల్లీ: ఏజీఆర్ బకాయిల షెడ్యూల్‌పై ఊరట లభిస్తుందని ఆశిస్తున్న టెలికం సంస్థలకు శుక్రవారం షాకుల మీద షాకులు తగిలాయి. బాకీలు కట్టేందుకు మరికాస్త వ్యవధి లభించేలా గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలంటూ టెల్కోలు వేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. పైగా రూ.1.47 లక్షల కోట్లు కట్టాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్దేశించిన విధంగా బాకీలు చెల్లించకపోతే టెలికం సంస్థల అధినేతలు కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించింది. అటు టెలికం శాఖ (డాట్)కూ మొట్టికాయలు వేసింది. గత ఉత్తర్వులను పక్కన పెడుతూ బాకీల వసూలు విషయంలో టెల్కోలపై ఒత్తిడి తేవొద్దని లిఖితపూర్వక ఆదేశాలిచ్చిన డాట్ డెస్క్ ఆఫీసర్ ’తెంపరితనం’తో వ్యవహరించారని ఈ సందర్భంగా ఆక్షేపించింది. ఆ ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించకపోతే సదరు అధికారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. తదుపరి విచారణ తేదీ మార్చి 17లోగా బాకీలు కట్టేయాలంటూ టెలికం సంస్థలను ఆదేశించింది. గత ఆదేశాల ఉల్లంఘనకు గాను కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో ఆయా టెల్కోల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, డాట్ డెస్క్ అధికారి వివరణ ఇవ్వాలని సూచించింది. నిర్దేశిత గడువులోగా బకాయిలు కట్టని పక్షంలో .. ఆయా టెల్కోల ఎండీలు/డైరెక్టర్లతో పాటు డెస్క్ ఆఫీసర్ కూడా మార్చి 17న వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఏజీఆర్ సంబంధిత బాకీల చెల్లింపునకు మరింత సమయం ఇవ్వాలంటూ వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్టెల్, టాటా టెలీసర్వీసెస్ దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. రూ. 2.65 లక్షల కోట్లు కట్టాలన్న డాట్ నోటీసులపై తగు కోర్టులను ఆశ్రయించాలంటూ గెయిల్ తదితర టెలికంయేతర సంస్థలకు సూచించడంతో అవి తమ పిటిషన్లను ఉపసంహరించుకున్నాయి. సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో దాదాపు రూ. 35,586 కోట్ల బకాయిల్లో సుమారు రూ.10,000 కోట్లు.. వారం రోజుల్లో డిపాజిట్ చేస్తామంటూ ఎయిర్టెల్ వెల్లడించింది. చట్టాలు అమలయ్యే పరిస్థితే లేదా.. దేశంలో చట్టాల అమలు జరిగే పరిస్థితే లేదా? అంటూ అత్యున్నత న్యాయస్థానం విచారణ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేసింది. ఏజీఆర్‌కి సంబంధించి తమ ఉత్తర్వులను నిలుపుదల చేసేలా డెస్క్ ఆఫీసర్ స్థాయి అధికారి ఆదేశాలివ్వడమేంటని కోర్టు ఆక్షేపించింది. సదరు అధికారికి నోటీసులు జారీ చేసింది. ‘సుప్రీం కోర్టు ఆదేశాలను నిలుపుదల చేసేలా ఒక డెస్క్ ఆఫీసరు.. ఏకంగా అకౌంటెంట్ జనరల్‌కు రాస్తారా? ఇది ధనబలం కాకపోతే మరేంటి? న్యాయస్థానాలతో వ్యవహరించే తీరు ఇదేనా? దేశంలో చట్టాలు అమలయ్యే పరిస్థితే లేదా? ఇవన్నీ చూస్తుంటే తీవ్ర ఆవేదన కలుగుతోంది. ఈ కోర్టులోనూ, ఈ వ్యవస్థలోనూ పనిచేయాలనిపించడం లేదు. నాకు చాలా ఆవేదనగా ఉంది. సాధారణంగా నేను కోపగించుకోను.. కానీ ఈ వ్యవస్థ, ఈ దేశంలో జరుగుతున్నవి చూస్తుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు‘ అని జస్టిస్ అరుణ్ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. డెస్క్ ఆఫీసర్ తీరుపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు క్షమాపణలు తెలిపారు. అయితే, ‘ఇలాంటి ధోరణులు ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఒక డెస్క్ అధికారి.. ఇంత తెంపరితనంతో వ్యవహరించారంటే సుప్రీం కోర్టును మూసేద్దామా? అసలు అతనిపైనా, ఈ కంపెనీలపైనా కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదు? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? టెల్కోల రివ్యూ పిటీషన్‌ను డిస్మిస్ చేశాం. అయినా ఇప్పటిదాకా అవి పైసా కట్టలేదు. న్యాయవ్యవస్థ, దేశం ఏమై పోతుందా అని ఆందోళన కలుగుతోంది‘ అని మిశ్రా వ్యాఖ్యానించారు. మిగిలేవి రెండు సంస్థలే..: విశ్లేషకులు టెల్కోల బకాయిలపై అత్యున్నత న్యాయస్థానం గట్టి చర్యలకు ఆదేశించిన నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా పరిస్థితి అగమ్యగోచరంగా మారనుందని విశ్లేషకులు పేర్కొన్నారు. దీనివల్ల టెలికం రంగంలో ఇక రెండే సంస్థల ఆధిపత్యం ఉండే అవకాశాలు గతంలో కన్నా మరింత పెరిగాయని అభిప్రాయపడ్డారు. ‘సుప్రీం కోర్టు తీర్పు.. నిస్సందేహంగా టెలికం పరిశ్రమకు దుర్వార్తే. ముఖ్యంగా వొడాఫోన్ ఐడియా పరిస్థితి గతంలో కన్నా దారుణంగా మారనుంది‘ అని కన్సల్టింగ్ సంస్థ కామ్ ఫస్ట్ డైరెక్టర్ మహేష్ ఉప్పల్ తెలిపారు. లైసెన్సు ఒప్పందం ప్రకారం బాకీలు కట్టాల్సిన బాధ్యత టెల్కోలపై ఉందంటూ గడిచిన రెండు, మూడు పర్యాయాలు సుప్రీం కోర్టు చెప్పినందున .. శుక్రవారం వచ్చిన ఆదేశాలు అనూహ్యమైనవేమీ కావని ఆయన చెప్పారు. అర్ధరాత్రిలోగా కట్టండి: టెలికం శాఖ సుప్రీం కోర్టు అక్షింతలు వేయడంతో టెలికం శాఖ కదిలింది. బకాయిల విషయంలో టెల్కోలపై ఒత్తిడి తేవొద్దంటూ జనవరి 23న ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. గతేడాది అక్టోబర్ 24న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలు దిశగా సత్వర చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సూచించింది. దీనికి అనుగుణంగా.. శుక్రవారం అర్ధరాత్రిలోగా బకాయీలన్నీ కట్టేయాలంటూ భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తదితర సంస్థలను ఆదేశించింది. వివాదం ఏంటంటే... లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల లెక్కింపునకు టెల్కోల టెలికంయేతర ఆదాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చంటూ ప్రభుత్వానికి అనుకూలంగా గతేడాది అక్టోబర్ 24న సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీన్ని సమీక్షించాలంటూ టెల్కోలు వేసిన రివ్యూ పిటిషన్లను జనవరి 16న కొట్టి వేసింది. జనవరి 23లోగా బాకీలు కట్టేయాలంటూ సూచించింది. దీనిపై టెల్కోలు పునఃసమీక్షకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇది తేలేలోగా బాకీల విషయంలో టెల్కోలపై ఒత్తిడి తేవద్దంటూ డాట్ డెస్క్ అధికారి ఆదేశాలు ఇవ్వడం వివాదాస్పదమైంది. డాట్ లెక్కల ప్రకారం మొత్తం 15 సంస్థలు.. కేంద్రానికి రూ. 1.47 లక్షల కోట్ల బాకీలు కట్టాల్సి ఉంది. వొడా–ఐడియా షేరు భారీ పతనం సుప్రీం కోర్టు ఆదేశాలతో వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) షేరు ఏకంగా 23 శాతం పతనమైంది. బీఎస్ఈలో రూ. 3.44 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో 27 శాతం క్షీణించి రూ. 3.25 స్థాయిని కూడా తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ రూ.2,988 కోట్లు తగ్గి రూ. 9,885 కోట్లకు పడిపోయింది. అటు టెలికం రంగానికి భారీగా రుణాలిచ్చిన బ్యాంకుల షేర్లపై కూడా ఈ తీర్పు ప్రతికూల ప్రభావం పడింది. ఇండస్ఇండ్ బ్యాంక్ 4.38%, ఎస్బీఐ 2.41%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.77%, యాక్సిస్ బ్యాంక్ 1.5% క్షీణించాయి. క్యూ3 ఆర్థిక ఫలితాల్లో వొడాఫోన్ ఐడియా రూ. 6,439 కోట్ల నష్టాలు ప్రకటించడం తెలిసిందే. -
గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ఇకపై రీఛార్జ్‌లు కూడా..!
గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో దొరకనిదంటూ ఉండదని మనకు తెలిసిన విషయమే. ఏదైనా మనకు అనుమానం వస్తే వెంటనే గూగుల్ తల్లి ఉంది కదా అంటూ వెంటనే మొబైల్‌ను వాడుతున్న యూజర్లకు గూగుల్ ఇప్పుడు ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై యూజర్లు గూగుల్ సెర్చ్ ద్వారానే తమ ప్రీపెయిడ్ మొబైల్‌ను రీచార్జ్ చేసుకోవచ్చు. అందుకు గాను గూగుల్ సంస్థ దేశంలోని టెలికాం ఆపరేటర్లయిన ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో, బీఎస్ఎన్ఎల్ కంపెనీలతో భాగస్వామ్యం అయింది. ఈ క్రమంలో యూజర్లు గూగుల్ సెర్చ్‌లో ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జ్ అని టైప్‌చేసి సెర్చ్ చేస్తే వచ్చే ఆప్షన్లలో తమ మొబైల్ నెంబర్, ఆపరేటర్, ప్లాన్ వివరాలను ఎంటర్ చేసి అక్కడి నుంచి నేరుగా తమ మొబైల్‌ను రీచార్జ్ చేసుకోవచ్చు. అందుకుగానూ.. పేటీఎం, ప్రీచార్జ్, గూగుల్ పే తదితర పేమెంట్ ఆప్షన్లను గూగుల్ అందిస్తున్నది. -
ఏజీఆర్ బకాయిలపై టెల్కోలకు ఊరట
న్యూఢిల్లీ: ఏజీఆర్ బకాయిల వివాదంలో టెల్కోలకు కాస్త ఊరట లభించింది. దీనిపై సుప్రీం కోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేదాకా బలవంతంగా బాకీల వసూలుకు చర్యలు తీసుకోరాదని టెలికం శాఖ(డాట్) నిర్ణయించింది. లైసెన్సింగ్ ఫైనాన్స్ పాలసీ వింగ్ ఈ మేరకు అన్ని విభాగాలకు ఆదేశాలు పంపించింది. గతేడాది అక్టోబర్‌లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ..సవరించిన స్థూల ఆదాయం(ఏజీఆర్) లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల కింద టెల్కోలు రూ. 1.47 లక్షల కోట్లు కట్టాల్సి ఉంది. దీనికి జనవరి 23 ఆఖరు తేదీ. దీనిపై టెల్కోలు మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించగా విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. దీంతో.. సుప్రీం కోర్టు నుంచి తాజా ఉత్తర్వులు వచ్చేదాకా ఏజీఆర్ బాకీలను కట్టలేమంటూ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా డాట్‌కు తెలియజేశాయి. ఈ రెండు సంస్థలు సుమారు రూ. 88,624 కోట్లు బాకీలు కట్టాల్సి ఉంది. మరోవైపు, రిలయన్స్ జియో సుమారు రూ. 195 కోట్ల ఏజీఆర్ బకాయిలను కట్టేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అటు, స్పెక్ట్రం వాడుకున్నందుకు గాను దాదాపు రూ. 3 లక్షల కోట్లు కట్టాలంటూ టెలికంయేతర ప్రభుత్వ రంగ సంస్థలకు డాట్ ఇచ్చిన నోటీసులపై చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. సమాచార లోపం వల్లే ఇది జరిగిందని, ఆయా సంస్థలు కట్టాల్సిన బాకీలేమీ లేవన్నారు. -
టెల్కోలకు ‘సుప్రీం’ షాక్
న్యూఢిల్లీ: దాదాపు రూ. 1.47 లక్షల కోట్ల మేర బకాయీల భారం విషయంలో ఊరట లభించగలదని ఆశతో ఉన్న టెలికం సంస్థలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. సవరించిన స్థూల ఆదాయానికి (ఏజీఆర్) నిర్వచనానికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ టెల్కోలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీన్ని మరోసారి సమీక్షించేందుకు తగిన కారణాలేమీ లేవని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. టెలికం కంపెనీలపై విధించిన వడ్డీ, జరిమానాలు సరైనవేనని అభిప్రాయపడింది. దీనిపై తదుపరి లిటిగేషనేదీ ఉండబోదని, టెలికం కంపెనీలు కట్టాల్సిన బకాయిల లెక్కింపు, చెల్లింపునకు నిర్దిష్ట గడువు ఉంటుందని స్పష్టం చేసింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ ఎంఆర్ షాతో కూడుకున్న బెంచ్ గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణను ఓపెన్ కోర్టు విధానంలో నిర్వహించాలని టెల్కోలు కోరినప్పటికీ.. ఇన్–చాంబర్ విధానంలోనే జరపాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. తీర్పు నిరాశపర్చింది: భారతి ఎయిర్టెల్ ఏజీఆర్ బకాయీలపై పునఃసమీక్ష పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేయడం తమను నిరాశపర్చిందని భారతీ ఎయిర్టెల్ వెల్లడించింది. దీనిపై క్యూరేటివ్ పిటీషన్ దాఖలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. ‘టెలికం పరిశ్రమ ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడం, స్పెక్ట్రం కొనుగోలు చేయడం, 5జీ వంటి కొంగొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టడం మొదలైన వాటిపై భారీగా పెట్టుబడులు పెడుతూ ఉండాలి. ఈ తీర్పు కారణంగా టెలికం పరిశ్రమ లాభదాయకత పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తాం. అయితే దీనిపై మా నిరాశ కూడా తెలియజేదల్చుకున్నాం. ఏజీఆర్‌పై దీర్ఘకాలంగా నెలకొన్న వివాదంపై మా వాదనలు సరైనవేనని మేం గట్టిగా విశ్వసిస్తున్నాం’ అని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. అటు వొడాఫోన్ ఐడియా కూడా క్యూరేటివ్ పిటిషన్ వేసే యోచనలో ఉంది. ఇంటర్నెట్ సంస్థలకు దెబ్బ: ఐఎస్‌పీఏఐ సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వు .. టెలికం సంస్థలను మరింత సంక్షోభంలోకి నెట్టేస్తుందని, వాటిపై ఆధారపడిన ఇంటర్నెట్ సంస్థలకు ఇది పెద్ద దెబ్బని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎస్‌పీఏఐ) ప్రెసిడెంట్ రాజేశ్ ఛారియా వ్యాఖ్యానించారు. ‘రివ్యూ పిటిషన్ తిరస్కరణతో టెలికం రంగం మొత్తం రెండు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది వినియోగదారులకు ఎంత మాత్రం మంచిది కాదు. ఏజీఆర్ నిర్వచనాన్ని సమీక్షించే విషయంలో ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోకపోతే చిన్న స్థాయి ఐఎస్పీల మనుగడ కష్టమవుతుంది‘ అని ఆయన పేర్కొన్నారు. వివాదమిదీ.. టెలికం కంపెనీలు కట్టాల్సిన లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలను మదింపు చేయడానికి ఉద్దేశించిన ఏజీఆర్ నిర్వచనం సరైనదేనంటూ గతేడాది అక్టోబర్ 24న కేంద్రానికి అనుకూలంగా సుప్రీం కోర్టు ఉత్తర్వులిచ్చింది. టెలికంయేతర ఆదాయాలను కూడా ఏజీఆర్‌లో కలపడం వల్ల బాకీలు తడిసి మోపెడు కావడంతో టెలికం సంస్థలకు శరాఘాతంగా మారింది. దీని ప్రకారం చూస్తే వడ్డీలు, జరిమానాలు కలిపి.. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, ఇతర టెలికం కంపెనీలు జనవరి 23లోగా ఏకంగా రూ. 1.47 లక్షల కోట్ల మేర కట్టాల్సి రానుంది. ప్రభుత్వపరంగా మినహాయింపేదైనా లభిస్తుందేమోనని టెల్కోలు ఆశించినప్పటికీ.. అలాంటి సంకేతాలేమీ కనిపించలేదు. టెల్కోలు దాదాపు రూ. 1.47 లక్షల కోట్ల బకాయీలు కట్టాల్సి ఉందంటూ గతేడాది నవంబర్‌లో పార్లమెంటుకు కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. టెలికం సంస్థలు లైసెన్సు ఫీజు బకాయీల కింద రూ. 92,642 కోట్లు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల (ఎస్‌యూసీ) కింద రూ. 55,054 కోట్లు కట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి వడ్డీ, పెనాల్టీలను మాఫీ చేసే యోచనేదీ లేదని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలు, టెలికం శాఖ లెక్కింపు ప్రకారం.. వొడాఫోన్ ఐడియా బాకీలు రూ. 53,038 కోట్లు (రూ. 24,729 కోట్ల ఎస్‌యూసీ, రూ. 28,309 కోట్ల లైసెన్సు ఫీజు) కాగా, భారతీ ఎయిర్టెల్ బకాయీలు రూ. 35,586 కోట్ల మేర (రూ. 21,682 కోట్ల లైసెన్సు ఫీజు, రూ. 13,904 కోట్లు ఎస్‌యూసీ) ఉంటాయి. భారతి ఎయిర్‌టెల్‌లో విలీనమైన టెలినార్, టాటా టెలిసర్వీసెస్ బాకీలు విడిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 24న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ టెలికం సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. వడ్డీ, పెనాల్టీ, జరిమానాపై మళ్లీ వడ్డీ విధింపునకు సంబంధించిన అంశాలను పునఃసమీక్షించాలంటూ భారతీ ఎయిర్టెల్ కోరింది. ఈ రివ్యూ పిటిషన్లపైనే సుప్రీం కోర్టు తాజా ఆదేశాలిచ్చింది. బాకీల విషయంలో ఊరట లభించకపోతే కంపెనీని మూసివేయక తప్పదంటూ వొడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార మంగళం బిర్లా ఇప్పటికే ప్రకటించడంతో .. ప్రైవేట్ రంగంలో రెండే సంస్థలు మిగిలే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. -
ప్రభుత్వం సాయం చేయాలి..లేదంటే మూతే!!
న్యూఢిల్లీ: కేంద్రానికి చెల్లించాల్సిన పాత బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఊరట చర్యలేమీ తీసుకోకపోతే కంపెనీని మూసివేయక తప్పదని టెలికం సంస్థ వొడాఫోన్– ఐడియా చైర్మన్ కుమార మంగళం బిర్లా వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వం నుంచి ఏ రకమైన తోడ్పాటూ లేకపోతే ఇక వొడాఫోన్ ఐడియా కథ ముగిసినట్లే. ఇందులో ఇంకా పెట్టుబడులు పెట్టడం వల్ల ప్రయోజనమేమీ ఉండదు. సంస్థను మూసేయాల్సి ఉంటుంది‘ అని శుక్రవారం ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. అయితే, ఎకానమీని గాడిలో పెట్టే దిశగా.. సంక్షోభంలో ఉన్న టెలికం రంగాన్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘టెలికం అనేది చాలా కీలక రంగమని ప్రభుత్వం గుర్తించింది. మొత్తం డిజిటల్ ఇండియా కార్యక్రమమంతా దీనిపైనే ఆధారపడి ఉంది. ఇది నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి.. ప్రభుత్వం నుంచి మరింత తోడ్పాటు అవసరం‘ అని ఆయన చెప్పారు. ఏ రకమైన ఊరట చర్యలు కోరుకుంటున్నారన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ‘ప్రధానమైన సమస్య .. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) వివాదమే. ఇది ప్రస్తుతం కోర్టులో ఉంది. ప్రభుత్వమే టెల్కోలకు వ్యతిరేకంగా ఈ కేసు వేసింది. చర్చల ద్వారా దీన్ని పరిష్కరించవచ్చు‘ అని బిర్లా పేర్కొన్నారు. ఏజీఆర్ లెక్కింపు వివాదంలో ఇటీవల కేంద్రానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో టెలికం సంస్థలు ఏకంగా రూ. 1.4 లక్షల కోట్ల మేర లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బకాయీలు కట్టాల్సి రానుంది. దీంతో వీటికి కేటాయింపులు జరపాల్సి రావడం వల్ల వొడాఫోన్ ఐడియా సెపె్టంబర్ త్రైమాసికంలో ఏకంగా రూ.50,921 కోట్ల మేర రికార్డు స్థాయిలో నష్టాలు ప్రకటించడం తెలిసిందే. ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలి.. ఎకానమీకి ఊతమిచ్చేందుకు కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గించటం మాత్రమే సరిపోదని, ఆర్థికంగా తోడ్పాటునిచ్చేలా పటిష్టమైన ఉద్దీపన ప్యాకేజీలాంటిది అవసరమని బిర్లా చెప్పారు. ఆ రూపంలో వచ్చే నిధులతో కొన్ని కార్పొరేట్లు రుణభారం తగ్గించుకోగలవని, మరికొన్ని ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా విస్తరించుకోగలవని ఆయన వివరించారు. ఎకానమీని గట్టెక్కించడానికి ఆదాయ పన్ను రేటును తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోందన్న వార్తలపై స్పందిస్తూ.. ‘ఇది కేవలం వినియోగ డిమాండ్ పెంచడానికే పరిమితమైన సమస్య కాదు. ఆదాయాలు తక్కువగా ఉన్నాయి. ప్రజలు మరింతగా ఖర్చు చేయడానికి ఇష్టపడటం లేదు. దీన్నుంచి బైటపడాలంటే.. ఉద్దీపన చర్యలు ప్రకటించడం ఒక్కటే మార్గం. జీఎస్టీని 15 శాతానికి తగ్గించారనుకోండి.. అదే పెద్ద ఉద్దీపన చర్య కాగలదు‘ అని బిర్లా చెప్పారు. మరోవైపు ఇన్ఫ్రాపై ప్రభుత్వం మరింతగా పెట్టుబడులు పెట్టడం కూడా ఎకానమీపై బాగా సానుకూల ప్రభావం చూపగలదని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను రిజర్వ్ బ్యాంక్ ఏకంగా 6.1 శాతం నుంచి 5 శాతానికి కుదించిన నేపథ్యంలో బిర్లా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
టెల్కోల వీరబాదుడు..!
న్యూఢిల్లీ: చౌక మొబైల్ కాల్, డేటా సేవలకిక కాలం చెల్లింది. సుమారు నాలుగేళ్ల తర్వాత.. టెలికం సంస్థలు పోటాపోటీగా రేట్ల పెంపుతో ప్రీ–పెయిడ్ వినియోగదారులను బాదేందుకు సిద్ధమయ్యాయి. వొడాఫోన్–ఐడియా, ఎయిర్టెల్, రిలయన్స్ జియో సంస్థలు టారిఫ్‌లను పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించాయి. వొడా–ఐడియా, ఎయిర్టెల్ టారిఫ్‌ల పెంపు ఏకంగా 50 దాకాను, జియో టారిఫ్‌ల పెంపు 40 శాతం దాకాను ఉండనుంది. వొడా–ఐడియా, ఎయిర్టెల్ కొత్త రేట్లు డిసెంబర్ 3 నుంచి, జియో రేట్లు డిసెంబర్ 6 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజా పరిణామంతో.. భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కస్టమర్లు నెలరోజుల పాటు కనెక్షన్ కలిగి ఉండాలంటే కనీసం రూ. 49 కట్టాల్సి రానున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ‘టీ ఖర్చుకన్నా తక్కువే’..! వొడాఫోన్–ఐడియా ... 28 రోజులు, 84 రోజులు, 365 రోజుల వ్యాలిడిటీ గల అన్లిమిటెడ్ ప్లాన్స్‌ను సవరిస్తూ కొత్త ప్లాన్స్ ప్రవేశపెట్టింది. మార్కెట్ స్పందనను బట్టి వీటిల్లో మార్పులు, చేర్పులు చేయడమో లేదా మరిన్ని కొత్త ప్లాన్స్ ప్రవేశపెట్టడమో జరుగుతుందని పేర్కొన్నాయి. మరోవైపు, ‘టారిఫ్ పెంపు రోజుకు కేవలం 50 పైసల నుంచి రూ. 2.85 దాకానే ఉండనుంది. మెరుగైన డేటా, కాలింగ్ ప్రయోజనాలు ఉంటాయి‘ అని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో పేర్కొంది. బడ్డీ కొట్టులో టీ తాగేందుకు ఓ వారం ఖర్చు చేసేంత కూడా టారిఫ్‌ల పెంపు ఉండదని కంపెనీ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఇక, జియో విషయానికొస్తే.. ‘అన్లిమిటెడ్ వాయిస్, డేటాతో సరికొత్త ఆల్–ఇన్–వన్ ప్లాన్స్‌ను ప్రవేశపెట్టబోతున్నాం. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్ విషయంలో సముచిత వినియోగ విధానం ఉంటుంది. 300 శాతం దాకా అదనపు ప్రయోజనాలు అందించే కొత్త ప్లాన్లు డిసెంబర్ 6 నుంచి అమల్లోకి వస్తాయి‘ అని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. టెలికం టారిఫ్‌లను సవరించే విషయంలో ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగిస్తామని పేర్కొంది. అపరిమితంలో.. పరిమితులు... అన్లిమిటెడ్ ప్లాన్స్ అయినప్పటికీ.. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్ విషయంలో వొడా–ఐడియా, ఎయిర్టెల్ ప్లాన్స్‌లో పరిమితులు ఉన్నాయి. 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్‌లో 1,000 నిమిషాలు, 84 రోజుల పథకాల్లో 3,000 నిమిషాలు, 365 వ్యాలిడిటీ ప్లాన్‌లో 12,000 నిమిషాల పరిమితి ఉంటుంది. దీన్ని దాటితే ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చార్జీ ఉంటుంది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్)ను లెక్కించే విషయంలో కేంద్రానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో టెల్కోలు కేంద్రానికి లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బకాయిల కింద ఏకంగా రూ. 1.4 లక్షల కోట్లు కట్టాల్సి రానుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వీటికి కేటాయింపులు జరపాల్సి రావడంతో వొడాఫోన్ ఐడియా ఏకంగా రూ. 50,921 కోట్లు, ఎయిర్టెల్ రూ. 23,045 కోట్ల మేర నష్టాలు ప్రకటించాయి. వీటన్నింటిని భర్తీ చేసుకోవడం కోసం, నెట్‌వర్క్‌పై మరింతగా ఇన్వెస్ట్ చేయడం కోసం టెలికం సంస్థలు తాజాగా చార్జీల పెంపు బాట పట్టాయి. -
వచ్చే నెల నుంచి మొబైల్ చార్జీల మోత
సాక్షి, న్యూఢిల్లీ : మొబైల్ కాల్ చార్జీలకు రెక్కలు రానున్నాయి. భారీ నష్టాలతో కుదేలవుతున్న టెలికాం కంపెనీలు ఇక టారిఫ్ పెంపు అనివార్యమని స్పష్టం చేశాయి. మొబైల్ టారిఫ్‌ల (ఫ్లోర్ ప్రైస్) నిర్ధారణలో ట్రాయ్, టెలికాం విభాగాల మధ్య ఏకాభిప్రాయం కొరవడటంతో కాల్ చార్జీల పెంపుపై అవి జోక్యం చేసుకునే పరిస్థితి లేకపోవడం టెలికాం కంపెనీలకు కలిసివచ్చింది. వచ్చే నెల నుంచి టారిఫ్‌లు పెంచేందుకు ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్, ఐడియా, బీఎస్ఎన్ఎల్లు సిద్ధమయ్యాయి. టారిఫ్‌లపై ఇక ఎలాంటి చర్చలు ఉండవని, టెలికాం కంపెనీలు టారిఫ్‌లు పెంచాలని ఇప్పటికే నిర్ణయించాయని, మున్ముందు కూడా చార్జీలు పెరుగుతాయని టెలికాం వర్గాలు స్పష్టం చేసినట్టు ఎకనమిక్ టైమ్స్ వెల్లడించింది. టెలికాం కంపెనీల టారిఫ్‌ల పెంపులో తాము జోక్యం చేసుకోమని ఓ అధికారి పేర్కొన్నారు. నూతన కాల్చార్జీలు అమలయ్యాక యూజర్నుంచి వచ్చే సగటు రాబడి (ఏఆర్పీయూ) ఎలా కుదురుకుంటుందో తాము వేచిచూస్తామని, ఏఆర్పీయూలు తగిన స్ధాయిలో ఉంటే ఫ్లోర్ ప్రైసింగ్ అవసరం లేదని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాజన్ మ్యాథ్యూస్ చెప్పారు. ఏఆర్పీయూలు పెరిగితే టెలికాం పరిశ్రమ కోలుకుంటుందని ఆయన తెలిపారు. మరోవైపు మొబైల్ టారిఫ్‌లు పెంచేందుకు వొడాఫోన్, ఐడియా, ఎయిర్‌టెల్‌లు సన్నద్ధమవగా, జియో టారిఫ్‌లను పెంచకుంటే తాము పెద్దసంఖ్యలో సబ్‌స్ర్కైబర్లను కోల్పోతామని ఆందోళన చెందుతున్నాయి. టారిఫ్‌ల పెంపునకు జియో కూడా సంకేతాలు పంపినా ఇతర టెలికాం కంపెనీలు పెంచిన స్ధాయిలో చార్జీల పెంపు ఉండదని భావిస్తున్నారు. ఇక మొబైల్ చార్జీల పెంపుతో పాటు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ 42,000 కోట్ల స్పెక్ట్రమ్ చెల్లింపులపై రెండేళ్ల మారటోరియం వంటి నిర్ణయాలతో టెలికాం పరిశ్రమ కోలుకుంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. -
మొబైల్ టారిఫ్‌లలో మరింత పారదర్శకత
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ సర్వీస్ రేట్ల విషయంలో మరింత పారదర్శకత తెచ్చే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కస్టమర్లకు అనువైన ప్లాన్ సూచించేలా టారిఫ్ కాల్క్యులేటర్ ప్రవేశపెట్టడం తదితర ప్రతిపాదనలు చేసింది. టెలికం ఆపరేటర్లు కొత్త ప్లాన్లు ప్రవేశపెట్టినప్పుడు.. పాత పథకాల వివరాలు కూడా అందుబాటులో ఉంచాలని ప్రతిపాదించింది. దీనివల్ల రెండింటిని పోల్చి చూసుకుని తగిన ప్లాన్ ఎంపిక చేసుకోవడం సులువవుతుంది. ప్రస్తుతం టెల్కోలు కొత్త ప్లాన్లు ప్రవేశపెట్టాక.. పాత ప్లాన్ల వివరాలను తొలగించేస్తున్నాయి. ఫలితంగా సరైన సమాచారం లేకపోవడం లేదా వివరాలు తప్పుదోవ పట్టించేవిగా ఉండటం లేదా అస్పష్టంగా ఉండటం వంటి వివిధ కారణాలతో యూజర్లు గందరగోళ పరిస్థితి ఎదుర్కొంటున్నారని ట్రాయ్ అభిప్రాయపడింది. ఇక యూజరు తను ఎంత డేటా, ఎన్ని నిమిషాల అవుట్గోయింగ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు, ఎన్నాళ్ల వేలిడిటీ కోరుకుంటున్నారు తదితర వివరాలిస్తే.. వారికి అత్యంత అనువైన ప్లాన్స్‌ను సూచించేలా టారిఫ్ కాల్‌క్యులేటర్‌ను రూపొందించాల్సిన అవసరం ఉందని ట్రాయ్ పేర్కొంది. మరోవైపు, ఫెయిర్ యూసేజీ పాలసీ (ఎఫ్‌యూపీ), ఫస్ట్ రీచార్జ్ కండీషన్ (ఎఫ్ఆర్సీ) వంటి విధానాలు అమలు చేసేటప్పుడు షరతులు, నిబంధనలను సవివరంగా తెలపకపోవడం లేదా తెలిపినా స్పష్టత లేకపోవడం వంటి అంశాల వల్ల యూజర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని ట్రాయ్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సర్వీసులు మెరుగుపర్చడానికి టెల్కోలు ఇంకా ఏం చర్యలు తీసుకోవచ్చన్న దానిపై అభిప్రాయాలు తెలపాలంటూ టెలికం యూజర్లకు ట్రాయ్ సూచించింది. అభిప్రాయాలు పంపేందుకు తుది గడువు డిసెంబర్ 26 కాగా.. పరిశ్రమ వర్గాలు కౌంటర్ కామెంట్స్ సమర్పించేందుకు జనవరి 9 ఆఖరు తేదీగా ట్రాయ్ నిర్ణయించింది. కాగా, చార్జీలు పెంచాలని టెల్కోలు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం దీనిపై జోక్యం చేసుకోరాదని ట్రాయ్ భావిస్తున్నట్లు సమాచారం. టెల్కోల చీఫ్‌లతో ట్రాయ్ చైర్మన్ భేటీ.. వచ్చే ఏడాది (2020) దేశీ టెలికం రంగానికి సంబంధించిన అజెండా రూపకల్పనలో భాగంగా వొడాఫోన్–ఐడియా సీఈవో రవీందర్ టక్కర్ సహా వివిధ టెల్కోల చీఫ్‌లతో ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ సమావేశమయ్యారు. 2020లో ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. -
ఏజీఆర్‌పై సుప్రీంలో టెల్కోల రివ్యూ పిటిషన్
న్యూఢిల్లీ: టెల్కోల రాబడి (ఏజీఆర్)కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎయిర్టెల్ శుక్రవారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఏజీఆర్ మొత్తంపై వడ్డీ, జరిమానాను రద్దు చేయాలని ఈ పిటిషన్లో కోరింది. ఈ ఏడాది జూలై నాటికి డాట్ లెక్కల ప్రకారం ఎయిర్టెల్ రూ. 21,682 కోట్లు లైసెన్సు ఫీజు కింద బకాయి పడింది. స్పెక్ట్రం యూసేజీ చార్జీగా చెల్లించాల్సింది రూ.13,904 కోట్లు. కాగా వొడాఫోన్ ఐడియా కూడా సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే... కొత్త టెలికం విధానం ప్రకారం.. టెల్కోలు తమ సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్)లో నిర్దిష్ట వాటాను ప్రభుత్వానికి వార్షిక లైసెన్సు ఫీజుగా కట్టాల్సి ఉంటుంది. దీనితో పాటు స్పెక్ట్రం వినియోగానికి గాను నిర్దిష్ట చార్జీలు (ఎస్‌యూసీ) చెల్లించాలి. అయితే ఈ ఏజీఆర్ లెక్కింపు విషయంలో వివాదం నెలకొంది. అద్దెలు, స్థిరాస్తుల విక్రయంపై లాభాలు, డివిడెండు మొదలైన టెలికంయేతర ఆదాయాలు కూడా ఏజీఆర్ కిందే వస్తాయని, దానిపైనే లైసెన్సు ఫీజు కట్టాల్సి ఉంటుందని టెలికం వివాదాల పరిష్కార, అప్పిలేట్ ట్రిబ్యునల్ (టీడీశాట్) గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్సు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల భారం భారీగా పెరిగిపోనుండటంతో టీడీశాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ టెల్కోలు .. సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. గత నెల 24వ తేదీన ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. దీనిప్రకారం రూ.92,642 కోట్లు టెల్కోలు లైసెన్స్ ఫీజుగా చెల్లించాల్సి ఉండగా, రూ.55,054 కోట్లు స్పెక్ట్రమ్ వినియోగ చార్జీగా చెల్లించాలి. మారటోరియం, టారిఫ్ పెంపు సరిపోదు: ఫిచ్ రేటింగ్స్ స్పెక్ట్రం యూసేజీ చార్జీల చెల్లింపుపై రెండేళ్ల మారటోరియం, టారిఫ్‌ల పెంపు వంటివి సానుకూలమే అయినప్పటికీ .. వీటి వల్ల టెలికం రంగానికి పెద్దగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ వెల్లడించింది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్)కి సంబంధించి సుప్రీం కోర్టులో ప్రతికూల తీర్పుతో భారీగా లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు కట్టాల్సి రానున్న టెల్కోలకు ఊరట లభించకపోవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో 2020 సంవత్సరం.. టెలికం రంగానికి ప్రతికూలంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. జియోకు సానుకూలం..: టారిఫ్ పెంపుతో అత్యంత వేగంగా మార్కెట్ వాటా పెంచుకుంటున్న జియోకు లాభపడగలదని ఫిచ్ అంచనా వేసింది. 2020 ద్వితీయార్ధానికి జియో 40 కోట్ల మంది యూజర్లు, పరిశ్రమ ఆదాయంలో 40 శాతం వాటాను దక్కించుకోగలదని భావిస్తున్నట్లు పేర్కొంది. -
మొబైల్ చార్జీల మోత ఎంత?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో మూడు దిగ్గజ మొబైల్ నెట్వర్క్ ప్రొపైడర్లయిన వొడాఫోన్ ఐడియా, రిలయెన్స్ జియో, భారతి ఎయిర్టెల్ కంపెనీలు డిసెంబర్లో టారిఫ్‌లు పెంచుతామని ప్రకటించడంతో వినియోగదారుల గుండెల్లో కాస్త గుబులు మొదలయింది. డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి పెంచుతామని వొడాఫోన్ ఐడియా ప్రకటించగా, తేదీ చెప్పకుండా డిసెంబర్లో పెంచుతామని భారతి ఎయిర్టెల్ కంపెనీ ప్రకటించాయి. తామూ టారిఫ్‌లను సముచితంగా కొన్ని వారాల్లో పెంచుతామని రిలయెన్స్ జియో ప్రకటించింది. లైసెన్స్ ఫీజులు, వడ్డీలు కలుపుకొని వొడాఫోన్ 28 వేలు, భారతి ఎయిర్టెల్ 12 వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాలంటూ 16 ఏళ్ల వివాదానికి తెరదించుతూ సుప్రీం కోర్టు ఇటీవలనే తీర్పు చెప్పింది. ఈ రెండు కంపెనీలు గత సెప్టెంబర్‌లో విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల ప్రకారం వీటికి ఉమ్మడిగా 73 వేల కోట్ల రూపాయల నష్టాలు వచ్చాయి. సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా అమలు చేయాలంటే మొత్తం లక్ష కోట్ల రూపాయలు దాటుతుంది. మొబైల్ టారిఫ్‌లను ఎంత పెంచితే ఈ కంపెనీలు నష్టాల నుంచి గట్టెక్కుతాయి? ఈ నేపథ్యంలో మొబైల్ చార్జీల మోత మోగుతుందని మొబైల్ యూజర్లు ఆందోళన చెందుతున్నారు. చదవండి: మొ‘బిల్’ మోతే..! బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్ కంపెనీ సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో భారత్‌లోని తన యూనిట్‌ను మూసివేస్తుందని వదంతులు రావడంతో ఆ 40 వేల కోట్లను ఇప్పుడే చెల్లించాల్సిన అవసరం లేదని, మెల్లగా చెల్లించవచ్చంటూ కేంద్రం రాయితీ ఇవ్వడంతో ఈ రెండు కంపెనీలు ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకుంటున్నాయి. రిలయెన్స్ జియోకు ఇలాంటి బాధలు లేవు. భారతి ఎయిర్టెల్ భారత కంపెనీయే అయినప్పటికీ ఇప్పటికీ నష్టాల్లోనే ఉంది. వ్యాపారం రీత్యా వొడాఫోన్ దేశంలో మొదటి స్థానంలో ఉండగా రిలయెన్స్ రెండో స్థానంలో, ఎయిర్టెల్ మూడో స్థానంలో కొనసాగుతోంది. రిలయెన్స్ జియో లాభాలు కూడా ఈ ఏడాది దాదాపు 600 కోట్ల నుంచి 900 కోట్ల రూపాయలకు చేరుకుంది. రిలయెన్స్ కంపెనీ 2016లో జియోను తీసుకరావడం, దాదాపు ఏడాది పాటు ఉచిత సేవలు అందించడంతో వొడాఫోన్, ఎయిర్టెల్ కంపెనీలు పోటీకి పోయి బాగా నష్టపోయాయి. అతి తక్కువ టారిఫ్‌లకు రిలయెన్స్‌కు లాభాలు రావడమేమిటీ? వొడాఫోన్ లాంటి కంపెనీలను నష్టాలు రావడం ఏమిటీ అన్న సందేహం ఎవరికైనా రావచ్చు. కేంద్ర ప్రభుత్వం నుంచి రిలయెన్స్ జియోకు చాలా రాయితీలు ఉన్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే అన్ని టెలికమ్ పరికరాలపై దిగుమతి సుంకాన్ని కేంద్రం గతేడాదే రెట్టింపు చేసింది. భారతీయ కంపెనీగా రిలయెన్స్ జియోకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. వాస్తవానికి రిలయెన్స్ జియో తన టారిఫ్‌లను ఇప్పుడే పెంచాల్సిన అవసరం లేదు. పెంచుతున్నట్లు ప్రకటించడం వల్ల స్టాక్ మార్కెట్లో జియో వ్యాపారం 9.5 లక్షల కోట్ల నుంచి 9.9 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. పది లక్షల కోట్లకు తీసుకెళ్లడం కంపెనీ లక్ష్యంగా కనిపిస్తోంది. వొడాఫోన్ ఐడియా అన్ని టారిఫ్‌లను పది శాతం పెంచుతున్నట్లు, ఆ టారిఫ్‌లను చూసిన తర్వాత అంతకన్నా కొంచెం తక్కువగా టారిఫ్‌లను పెంచాలని ఎయిర్టెల్ చూస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. వాటికంటే జియో టారిఫ్‌లు తక్కువగానే పెరిగే అవకాశం ఉంది. త్వరలోనే రిలయన్స్ జియో చార్జీల పెంపు -
ఎజిఆర్ ఛార్జీలతో ఖంగుతిన్న టెలికాం సంస్థలు
-
ఇన్కమింగ్ కాల్ రింగ్ ఇకపై 30సెకన్లు!!
న్యూఢిల్లీ : మొబైల్ రింగ్‌పై టెలికం ఆపరేటర్ల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మొబైల్ ఫోన్‌కు చేసే ఇన్కమింగ్ కాల్స్ రింగ్ టైమ్ కనీసం 30 సెకన్లు ఉండాలని టెలికాం రెగ్యులేటరీ సంస్థ (ట్రాయ్) నిర్దేశించింది. ల్యాండ్‌లైన్స్‌కు చేసే కాల్స్‌కు అయితే 60 సెకన్ల పాటూ ఉండాలని ట్రాయ్ పేర్కొంది. ట్రాయ్ నిర్దేశకాలు జారీచేయడానికి ముఖ్య కారణం ఇప్పటివరకు టెలికాం కంపెనీలు పోటాపోటీగా ఇన్ కమింగ్ కాల్ రింగ్ సమయాన్ని తగ్గించడమే. వాస్తవానికి గతంలో ఇన్ కమింగ్ రింగ్ సమయానికి ఎలాంటి పరిమితి లేదు. ఎవరైనా కాల్ చేస్తే 45 సెకండ్ల పాటు రింగ్ అవుతూ ఉండేది. కాల్ లిఫ్ట్ చేయకపోతే 45 సెకండ్ల తర్వాత డిస్కనెక్ట్ అయ్యేది. మొదట ఇన్ కమింగ్ కాల్ రింగ్ సమయాన్ని జియో 25 సెకన్లకు తగ్గించింది. అనంతరం ఎయిర్టెల్, వొడాఫోన్ కూడా అదేవిధంగా 25 సెకన్లకు తగ్గించాయి. దీంతో వినియోగదారులు ఫోన్ ఎత్తేలోపే లైన్ కట్ అవుతండడంతో అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. ఇకపై కాల్ ఎత్తకపోయినా లేదా రిజక్ట్ చేసినా.. ఇన్కమింగ్ వాయిస్ కాల్స్ అలర్ట్‌కు ఈ సమయాభావాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆపరేటర్లకు తెలిపింది. ట్రాయ్ తీసుకున్న తాజా నిర్ణయంతో టెలికాం సంస్థల మధ్య నెలకొన్న పోటీకి తెరపడినట్టే. -
టెల్కోల ధరల పోరుకు తెర!
న్యూఢిల్లీ: కొన్నాళ్లుగా హోరాహోరీ పోరులో గణనీయంగా టారిఫ్‌లను తగ్గించాల్సి వచ్చి తీవ్రంగా దెబ్బతిన్న టెలికామ్ కంపెనీలు... క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరునాటికి టెలికం మార్కెట్లో స్థిరత్వం, హేతుబద్ధత తిరిగి రాగలదన్న అంచనాలు ఏర్పడుతున్నాయి. పరస్పరం దెబ్బతీసుకునే చార్జీల విధానానికి స్వస్తి చెప్పి..లాభాలు, ఆదాయాలు పెంచుకోవడానికి టెల్కోలు కొత్త మార్గాలను అన్వేషిస్తుండటం ఇందుకు దోహదపడుతుందని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ అంచనా వేస్తోంది. ‘ధరల విషయంలోనూ, ఇతర సంస్థల కస్టమర్లను తమవైపు తిప్పుకోవడంలోనూ కొన్నాళ్లుగా మార్కెట్ పరిస్థితి అసంబద్ధంగా మారింది. అయితే, క్రమంగా మార్కెట్లో స్థిరత్వం, హేతుబద్ధత తిరిగి వస్తాయని ఆశిస్తున్నాం‘ అని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీవోఏఐ) డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ చెప్పారు. ‘పరిశ్రమపరంగా చూస్తే పోటాపోటీగా టారిఫ్‌లు తగ్గించడం మొదలుకుని అత్యంత దారుణ పరిస్థితులన్నీ ఈ మధ్య కాలంలో చూడటం జరిగింది. నిధుల సమీకరణలో సవాళ్ల వల్ల మార్కెట్ క్రమంగా స్థిరపడుతున్నట్లుగా కనిపిస్తోంది. గతం ఎంత దుర్భరంగా ఉండేదనేది పక్కన పెట్టి భవిష్యత్‌పై సానుకూల దృక్పథంతో పరిశ్రమ ముందుకెడుతోంది‘ అని మాథ్యూస్ చెప్పారు. కొత్త మార్గాలవైపు దృష్టి.. ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు ఆదాయాలు, లాభాల తగ్గుదలకు అడ్డుకట్ట వేసేందుకు టెలికం సంస్థలు మరిన్ని కొత్త మార్గాల వైపు దృష్టి పెడుతున్నాయని మాథ్యూస్ చెప్పారు. కంటెంట్, ఈ–కామర్స్, ఆర్థిక సేవలు మొదలైనవన్నీ కూడా అందించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ‘గడిచిన 5–6 త్రైమాసికాలుగా ఆదాయాలు, లాభదాయకత తగ్గడాన్ని చూశాం. దీనికి అడ్డుకట్ట పడొచ్చు. వ్యక్తిగతంగానైతే... ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికల్లా ఆదాయాల క్షీణతకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నాను‘ అని ఆయన చెప్పారు. ఆశావహంగా టెల్కోల ఫలితాలు అసాధారణ ఆదాయం ఊతంతో గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో అనూహ్యంగా లాభంలో 29 శాతం వృద్ధితో టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ అందర్నీ ఆశ్చర్యపర్చింది. రిలయన్స్ జియో రాకతో తీవ్రంగా దెబ్బతిన్న ఎయిర్టెల్.. జనవరి– మార్చి త్రైమాసికంలో రూ. 107.2 కోట్ల నికర లాభం ఆర్జించింది. పలు త్రైమాసికాల తర్వాత లాభంలో వృద్ధి నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక కంపెనీ ఆదాయం కూడా 6.2 శాతం ఎగిసి రూ.20,602.2 కోట్లకు పెరిగింది. మరోవైపు, రిలయన్స్ జియో నికర లాభం 64.7 శాతం పెరిగి రూ.840 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో జియో లాభం రూ. 510 కోట్లు. 2018–19 నాలుగో త్రైమాసికంలో జియో నిర్వహణ ఆదాయం 55.8 శాతం పెరిగి రూ. 11,106 కోట్లకు చేరింది. అంతక్రితం సంవత్సరం ఇదే వ్యవధిలో నిర్వహణ ఆదాయం రూ. 7,128 కోట్లు. మరో టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా మే 13న ఆర్థిక ఫలితాలు వెల్లడించనుంది. ఎయిర్టెల్ సిగ్నల్: ఫిచ్ న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ మార్చి క్వార్టర్ నికర లాభం 29 శాతం వృద్ధి చెందడం ఆధారంగా చూస్తే.. ఈఏడాదిలో దేశీ మొబైల్ రంగ ఆదాయం 5–10 శాతం మేర పెరిగేందుకు అవకాశం ఉందని ఫిచ్ రేటింగ్స్ అంచనావేసింది. ఈ రంగంలోని టాప్–3 కంపెనీలు లాభదాయకత వైపు దృష్టిసారించేందుకు ఆస్కారం ఉండగా.. వీటి మార్కెట్ వాటా ప్రతి కంపెనీకి 30–33 శాతం మధ్య ఉండనుందని అంచనాకట్టింది. ఈ సంస్థల మధ్య కొనసాగుతున్న పోటీతత్వం ఇక నుంచి నెమ్మదిగా తగ్గిపోయి.. డేటా టారిఫ్ పెరిగేందుకు ఆస్కారం ఉంది. ఒక్కో ఖాతాదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) నెలకు 10–20 శాతం వృద్ధి చెంది 1.6–1.7 డాలర్లకు చేరుతుందని అంచనావేసింది. -
ఆధార్ అడిగితే రూ.కోటి జరిమానా!
న్యూఢిల్లీ: గుర్తింపు వివరాలు, అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు మాత్రమే కావాలంటూ బ్యాంకులు, టెలికాం సంస్థలు ఒత్తిడి చేయడం కుదరదిక! ఇలా బలవంతం చేసే సంస్థలు, కంపెనీలకు కోటి రూపాయల వరకు జరిమానా విధించడంతో పాటు.. అందుకు బాధ్యులైన సిబ్బందికి జైలు శిక్ష పడేలా కేంద్రప్రభుత్వం నిబంధనలు సవరించింది. శిక్షాకాలం మూడు నుంచి పదేళ్ల వరకు ఉండనుంది. ఈమేరకు సవరించిన నిబంధనలకు కేంద్ర కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. పార్లమెంటులో ఆమోదం పొందిన వెంటనే కొత్త సవరణలు అమల్లోకి రానున్నాయి. కాగా వినియోగదారులు కావాలంటే తమ ఆధార్ గుర్తింపును కూడా కేవైసీ ప్రక్రియ కోసం ఉపయోగించుకునేలా సవరణలు చేశారు. ఆధార్‌పై సుప్రీంకోర్టు తీర్పు మేరకు భారత టెలీగ్రాఫ్, పీఎంఎల్ఏ చట్టాలకు కేంద్రం సవరణలు చేసింది. ప్రభుత్వ నిధులతో అందించే సంక్షేమ పథకాలకు మాత్రమే ఆధార్ కార్డు తప్పనిసరి చేయవచ్చునని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. మొబైల్ కనెక్షన్, బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు వినియోగదారులు సాధారణంగా పాస్‌పోర్టులు, రేషన్ కార్డులను గుర్తింపు కార్డులుగా సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తమ రాష్ట్రాల్లో ఆధార్‌ను తప్పనిసరి చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కల్పించాలని కూడా కేంద్రం నిర్ణయించింది. అయితే రాష్ట్రాలు కూడా సుప్రీం తీర్పునకు అనుగుణంగానే వ్యవహరించాలని సూచించింది. ఇకపై వినియోగదారుడి అనుమతి లేకుండా ఆధార్ ధ్రువీకరణ కోసం వివరాలు సేకరిస్తే రూ.10 వేలు జరిమానతో పాటు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. క్యూఆర్ కోడ్స్ ద్వారా చేసే ఆఫ్‌లైన్ వెరిఫికేషన్లకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. -
బ్యాంక్‌లకు, టెల్కోలకు ఆధార్ తప్పనిసరి చేయొచ్చు
న్యూఢిల్లీ : బ్యాంక్‌లకు, మొబైల్ నెంబర్లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం గత కొన్ని రోజుల క్రితం సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆధార్ అనుసంధానం అవసరం లేదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా అవి తప్పనిసరి చేయొచ్చు అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఆమోదం పొందిన చట్టం ద్వారా మొబైల్ నెంబర్లకు, బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ తప్పనిసరి చేయొచ్చు అని చెప్పారు. కానీ కొత్త చట్టం తీసుకొస్తున్నారా? లేదా? అన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. శనివారం జరిగిన హెచ్‌టీ నాయకత్వ సదస్సులో ఆయన మాట్లాడారు. ‘ఆధార్ అనేది పౌరసత్వ గుర్తింపు కార్డు కాదు’ అని జైట్లీ తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం అందించే ఎన్నో సబ్సిడీలు, ఇతర సహాయాలకు ఇది ఉపయోగపడుతుంది. ఆధార్ అసలు ప్రయోజనం కూడా అదేనని తెలిపారు. ఆధార్ చేసే పనులను సుప్రీంకోర్టు కూడా సమర్థించిందన్నారు. ‘సుప్రీం ఇచ్చిన తీర్పు వెనుక ప్రధాన ఉద్దేశం ప్రైవేటు సంస్థలు ఆధార్‌ను ఉపయోగించకూడదనే. అయితే, సెక్షన్ 57 ప్రకారం చట్టం ద్వారా లేదా, ఏదైనా ఒప్పందం ప్రకారం తప్పనిసరిగా సమర్పించాలి. చట్టం ప్రకారం ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయొచ్చు’’ అని అన్నారు. అయితే, అందుకు సంబంధించి పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చే విషయంపై మాత్రం జైట్లీ ఏం చెప్పలేదు. -
15 రోజుల్లో ఆధార్ ఆపే ప్లాన్ చెప్పండి!!
న్యూఢిల్లీ : టెలికాం కంపెనీలు ఆధార్‌ను వాడుకోరాదంటూ.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కీలక తీర్పు నేపథ్యంలో యూనిక్ అథంటికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) తదుపరి చర్యలు ప్రారంభించింది. ఆధార్ ధృవీకరణను రద్దు చేసే ప్లాన్ గురించి అక్టోబర్ 15 లోగా తమకు తెలియజేయాలని టెలికాం కంపెనీలను యూఐడీఏఐ ఆదేశించింది. ‘ అన్ని టెలికాం సర్వీసు ప్రొవైడర్లు వెంటనే 26.09.2018 రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పాటించాలి. ఈ తీర్పు నేపథ్యంలో ఆధార్ ఆధారిత ధృవీకరణ ప్రక్రియను రద్దు చేసే యాక్షన్ ప్లాన్/ఎగ్జిట్ ప్లాన్‌ను 2018 అక్టోబర్ 15లోగా మాకు సమర్పించాలి’ అని యూఐడీఏఐ ఆదేశించింది. సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడానికి కంటే ముందు, ప్రతి టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ నుంచి జియో వరకు తమ మొబైల్ యూజర్ల నుంచి తప్పనిసరిగా ఆధార్‌ను లింక్ ప్రక్రియను చేపట్టాయి. కొత్త మొబైల్ నెంబర్లకు, పాత నెంబర్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఆధార్ తప్పనిసరి చేశాయి. కానీ సుప్రీంకోర్టు టెలికాం కంపెనీలకు షాకిస్తూ.. ఆధార్ ధృవీకరణను వాడుకోవద్దంటూ ఆదేశించింది. బ్యాంక్‌లు సైతం ఆధార్ లింక్‌ను తప్పనిసరి చేయుద్దని తీర్పు వెలువరించింది. స్కూల్ అడ్మినిషన్లకు, సీబీఎస్ఈ, నీట్, యూజీసీలకు కూడా ఆధార్ అవసరం లేదని తేల్చి చెప్పింది. కానీ ప్రభుత్వ పథకాలకు, పాన్ నెంబర్లకు ఆధార్ తప్పనిసరి అని టాప్ కోర్టు పేర్కొంది. -
సిమ్ కొంటున్నారా.. అయితే జాగ్రత్త!
సాక్షి, ఉలవపాడు : సాధారణంగా సిమ్ కొంటే కొనేవారి వివరాలు సదరు షాపునకు అందజేస్తే అక్కడి నుంచి నేరుగా సంబంధిత నెట్వర్క్ మెయిన్ ఆఫీస్‌కు వెళ్లేవి. అక్కడి నుంచి సిమ్‌ని యాక్టివేట్ చేసే వారు. ఈ ఇద్దరి మధ్య మాత్రమే మన వివరాలు ఉండేవి. అలాంటి సమయంలోనే ఎన్నో తప్పులు దొర్లాయి. ఇప్పుడు కొత్తగా వేలిముద్రతో సిమ్‌లు అందజేస్తున్నారు. ఈ సమయంలో మనకు సంబంధించిన వివరాలు మొత్తం వచ్చేస్తున్నాయి. దాని ఆధారంగా సిమ్‌లు అమ్ముతున్నారు. కానీ ఇటీవల కొన్ని టెలికమ్ కంపెనీలు తమ వద్ద కొన్న సిమ్‌లు తీసుకున్న వారిని నిలబెట్టి ఫొటో తీస్తున్నారు. తర్వాత వారి ద్వారా పూర్తి చేసిన సమాచారం మొత్తాన్ని ఆయా కంపెనీల గ్రూప్‌ల్లో పోస్టు చేస్తున్నారు. ఈ గ్రూప్‌ల్లో జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని సెల్‌షాపు యజమానులు ఉంటారు. అంటే ఎక్కడైనా ఓ వ్యక్తి సిమ్ కొంటే దానికి సంబంధించి అతని ఫొటోతో పాటు అన్ని వివరాలు బహిర్గతం చేస్తున్నారు. ఇది కంపెనీల తప్పనిసరి కాదని పలు షాపు యజమానులు చెబుతున్నారు. వారు కేవలం ఎన్ని సిమ్‌లు అమ్మారని అడుగుతున్నారు. కానీ కొందరు అన్ని వివరాలు పెట్టి తాము సిమ్‌లు అమ్మిన వారిని కూడా చూపిస్తున్నారని తెలిపారు. సదరు వ్యక్తి ఇలా సిమ్ కొనే సమయంలో షాపులో నిలబెట్టి మరీ ఫొటోలు తీస్తున్నారు. అలా అయితేనే సిమ్ ఇస్తామని కొందరు యజమానులు చెబుతున్నారు. ప్రధానంగా అక్షరాస్యత లేని వారిని ఇలా చేస్తున్నారు. దీని వలన ఈ గ్రూపులో ఉన్న వారెవరైనా ఈ సమాచారం తీసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేందుకు వీలుకలుగుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతా బహిర్గతం ఇలా వాట్సాప్ గ్రూప్‌లో సిమ్ కొన్న వారి సమాచారం మొత్తం పెడుతున్నారు. ఈ గ్రూప్‌లో చూస్తే సిమ్ కొన్న వ్యక్తి ఫొటో వస్తోంది. ఆ తర్వాత అతను సిమ్ దరఖాస్తులో పూర్తి చేసిన సమాచారం మొత్తం పోస్టు చేస్తున్నారు. ఆధార్ ఆధారంగా వారి ఇంటి అడ్రస్సు కూడా బహిర్గతమవుతోంది. ఇక పుట్టిన తేదీతో సహా తెలుస్తోంది. ప్రస్తుతం తీసుకుంటున్న సిమ్ నంబర్ వివరాలు, అవసరం కోసం ప్రస్తుతం వాడుతున్న నంబరుతో సహా అన్ని వివరాలు గ్రూప్‌లోకి వస్తున్నాయి. గ్రూప్‌లో వందల మంది షాపుల యజమానులు ఉంటారు. ఈ సమాచారం మొత్తం అందరికీ వస్తుంది. వారు డౌన్లోడ్ చేసుకుని మరే ఇతర అవసరాలకు వినియోగించుకునే అవకాశం లేకపోలేదు. మహిళలు మరిన్ని ఇబ్బందులు పడే అవకాశం లేకపోలేదు. ఆందోళనలో వినియోగదారులు సిమ్‌లు కొన్న తర్వాత ఇలా గ్రూప్‌లో పెడుతున్నారని చాలామందికి తెలియదు. తెలుసుకున్న తర్వాత వారు చాలా ఆందోళన చెందుతున్నారు. ఆధార్ నంబర్ ఉపయోగించుకుని ఏం చేస్తారోనని భయం పట్టుకుంది. ఇక గ్రూప్ సభ్యుల్లో అందరూ ఒకేలా ఉండరు. మహిళల ఫోన్ నంబర్లు తీసుకోవడంతో పాటు వారికి కాల్ చేయడం, మెసేజ్ చేయడం వంటివి జరుగుతాయోమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేసే హక్కు ఎవరికీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం సిమ్ అమ్మిన వారు ఇలా సమాచారం బహిర్గతం చేయడం మంచి పద్ధతి కాదని, దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సమాచారాన్ని బహిర్గతం చేయడంతో ఎలాంటి అసాంఘిక పనులైనా వారి మీద మరొకరు చేసే పరిస్థితి వస్తుందని అంటున్నారు. వినియోగదారుల వివరాలు సెల్ షాపుల యజమానుల గ్రూప్‌లో పెట్డడం నిలుపుదల చేయాలని పలువురు కోరుతున్నారు. విచారించి చర్యలు తీసుకుంటాం: సెల్ వినియోగదారుల వ్యక్తిగత వివరాలు బహిర్గతం చేయడం మంచిది కాదు. సిమ్ కంపెనీల యజమానులు అలా ఎందుకు చేస్తున్నారో విచారించి చర్యలు తీసుకుంటాం. - వైవీ రమణయ్య, ఎస్ఐ, ఉలవపాడు -
మీ పేరుతో ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకోండిలా
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల తెలంగాణలో భారీ సిమ్‌కార్డు స్కాం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. నకిలీ వేలిముద్రలు, ఆధార్‌తో వేలాది సిమ్‌కార్డులను అక్రమంగా యాక్టివేట్ చేశాడు ఓ మొబైల్ షాపు యజమాని. మన ఆధార్ కార్డుతో ఒకే సిమ్‌కార్డు తీసుకున్నామనే అనుకున్నా, వాటిని నకిలీ చేసి వాటి నుంచి ఎన్ని సిమ్‌కార్డులు తీసుకున్నారో ఎవరికి తెలుసు? ఇటీవల తెలంగాణలో వెలుగు చూసిన సంఘటనతో మన వివరాలతో ఎవరు ఏ దారుణాలకు ఒడిగడుతున్నారో? అనే భయం ఇప్పుడు ప్రతిఒక్కరిలో ఉంది. అందుకే ఆ భయం పోవడానికి, మీ పేరుతో ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకోండి. పలు టెలికం కంపెనీల్లో మన ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్‌లు ఉన్నాయో ఇలా చెక్ చేసుకోండి. యూఐడీఏఐ ఆదేశాల మేరకు, గతంలో ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారుడు తన ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకునేలా ఎస్ఎంఎస్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇప్పుడు ఆ జాబితాలో ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ కూడా చేరింది. ఒక్క మెసేజ్‌తో వివరాలను అందిస్తోంది. జియో తన యాప్‌లో ఆ వివరాలను పొందుపరుస్తుంది. అయితే ఐడియా, వొడాఫోన్, డొకోమో, టెలీనార్, రిలయన్స్ కంపెనీలు మాత్రం ఈ సర్వీసులను అందించడం లేదు. మీఆధార్ మీద ఎన్ని సిమ్‌లు ఉన్నాయో తెలుసుకోండి ఇలా.. మీరు ఎయిర్టెల్ వినియోగదారుడు అయితే మీఫోన్ నుంచి ADCHK స్పేస్ ఆధార్‌కార్డు నెంబర్ టైప్ చేసి 121కి మెసేజ్ చేయాలి. మరుక్షణమే మీ ఆధార్ కార్డుతో లింక్ అయిన నెంబర్ల జాబితా వస్తుంది. జియో వినియోగదారుడు అయితే మై జియో యాప్, మై అకౌంట్లో లింక్ న్యూ అకౌంట్ అని ఉంటుంది. అలా కనుక లేకపోతే మీ పేరు మీద ఒక జియో సిమ్ ఉన్నట్లే లెక్క. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ అయితే ALIST స్పేస్ ఆధార్ నెంబర్ టైప్ చేసి 53734 అనే నెంబర్‌కు మెసేజ్ చేయాలి. రిప్లై మెసేజ్‌లో మీ ఆధార్ కార్డుతో లింక్ అయిన బీఎస్ఎన్ఎల్ నంబర్లు వస్తాయి. -
కేంద్రం ఆదేశం : ఆధార్ అవసరం లేదు
న్యూఢిల్లీ : ఆధార్ కార్డును ప్రతి ఒక్క అవసరానికి తప్పనిసరి చేయడంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో ఆధార్ కార్డు తప్పనిసరిపై సుప్రీంకోర్టులో వాదనలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మొబైల్ సిమ్ పొందడానికి ఆధార్ కార్డు అవసరం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. ఈ విషయంపై కేంద్రం టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీచేసింది. ప్రత్యామ్నాయ డాక్యుమెంట్లు డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ కార్డు వంటి డాక్యుమెంట్లతో సిమ్ కార్డును ఇవ్వాలని టెలికాం కంపెనీలను కేంద్రం ఆదేశించింది. వినియోగదారులకు అసౌకర్యం కలిగించకుండా వెంటనే ఈ ఆదేశాలను అమలు చేయాలని టెలికాం సెక్రటరీ అరుణ్ సుందరరాజన్ తెలిపారు. తమ తుది నిర్ణయం వచ్చే వరకు సిమ్ కార్డులకు ఆధార్ సమర్పించడం తప్పనిసరి సరికాదని అపెక్స్ కోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ‘అన్ని టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీచేస్తున్నాం. ఆధార్ నెంబర్ లేదని వినియోగదారులకు సిమ్ కార్డు ఇవ్వడాన్ని నిరాకరించవద్దు. ఇతర కేవైసీ దరఖాస్తులు, డాక్యుమెంట్లను సమర్పించాలని కోరండి. సిమ్ కార్డుల జారీని కొనసాగించండి’ అని సుందరరాజన్ తెలిపారు. అంతకముందు టెలికాం డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆదేశాలతో మొబైల్ కంపెనీలు ఆధార్ వెరిఫికేషన్‌ను చేపడుతున్నాయి. ఈ నిర్ణయం నుంచి ఎన్ఆర్ఐలకు, విదేశీయులకు మినహాయింపు ఇచ్చింది. ఈ ఆదేశాలపై స్పందించడానికి మొబైల్ ఆపరేటర్లు నిరాకరించాయి. ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
రూ.500కే స్మార్ట్ఫోన్లు, అసలు భారమెంత?
న్యూఢిల్లీ : దేశీయ టెలికాం ఆపరేటర్లు రూ.500 కన్నా తక్కువ ధరలో 4జీ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నాయి. రిలయన్స్ జియో లాంచ్‌చేసిన జియోఫోన్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌లు ఈ కసరత్తు చేస్తున్నాయని తెలిసింది. కానీ 500 రూపాయలకే స్మార్ట్ఫోన్లను తీసుకొస్తున్న ఈ కంపెనీలకు, అసలెంత భారం పడుతుందో వివరిస్తూ.. టెలికాం ఇండస్ట్రీ అంచనాలు విడుదల చేసింది. ఈ అంచనాల్లో కంపెనీ భరించబోయే భారం చాలా పెద్ద మొత్తంలోనే ఉన్నట్టు తేలింది. ఎంట్రీ-లెవల్ 4జీ ఎనాబుల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయడానికి సగటును 3వేల రూపాయల మేర ఖర్చు అవుతుంది. ఈ డివైజ్‌లకు కనుక ఎక్కువ మొత్తంలో ఆర్డర్ చేస్తే.. దీని ఖర్చు 2700 రూపాయలకు తగ్గవచ్చు. కానీ దీని కంటే ఐదింతల తక్కువ రేటుకు అంటే 500 రూపాయలకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆఫర్ చేస్తామని కంపెనీలు చెబుతున్నాయి. ఇలా 500 రూపాయలకే స్మార్ట్ఫోన్లను అందించడం వల్ల టెలికాం కంపెనీలు దాదాపు 26వేల కోట్ల భారాన్ని భరించాల్సి వస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ఆర్థికంగా చితికి పోయిన టెలికాం పరిశ్రమకు, ఈ సబ్సిడీ అదనపు భారమని, కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాక రుణాలు కూడా మరో రూ.5 లక్షల కోట్లకు పెరుగుతాయని పేర్కొంటున్నారు. నెలకు 60 రూపాయల రీఛార్జ్ ప్లాన్‌తో ఈ డివైజ్‌లను టెలికాం కంపెనీలు ప్రవేశపెట్టబోతున్నాయి. అంటే ఏడాదికి 117 మిలియన్ యూజర్ల నుంచి రూ.8,424 కోట్లను టెలికాం కంపెనీలు రికవరీ చేసుకోవచ్చు. దీని ప్రకారం కంపెనీలు ఆఫర్ చేసిన మొత్తం సబ్సిడీని రికవరీ చేసుకోవాలంటే దాదాపు మూడేళ్లకు పైగానే సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అదీ కూడా కస్టమర్ ఒకే ఆపరేటర్‌ను వాడితే తప్ప, ఆ రికవరీ సాధ్యం కాదు. మరోవైపు భారీగా పెరుగుతున్న పోటీతర వాతావరణ నేపథ్యంలో, రికవరీ కాలం మరింత పెరిగినా ఆశ్చర్యం పోక్కర్లేదని తెలుస్తోంది. మొత్తం 1.2 బిలియన్ మంది వైర్లెస్ సబ్‌స్క్రైబర్లుండగా.. 780 మిలియన్ల మంది ఫీచర్ ఫోన్ వాడుతున్నారు. దేశీయ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ వాడకం తక్కువగా ఉందని, ఇంటర్నెట్ ఎనాబుల్డ్ ఫోన్లను ఎక్కువగా ప్రజలకు ఆఫర్ చేయాల్సినవసరం ఉందని ఐడీసీ ఇండియా సీనియర్ మార్కెట్ అనాలిస్ట్ జైపాల్ సింగ్ తెలిపారు. -
కాల్ డ్రాప్స్ కట్టడికి టెల్కోల 74,000 కోట్లు!!
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారానికి భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయి. భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో సహా ఇతర టెలికం కంపెనీలు రూ.74,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్లతో వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అప్‌గ్రేడ్ చేసుకోనున్నాయని టెలికం కార్యదర్శి అరుణ సుందరరాజన్ తెలిపారు. ఆమె మంగళవారమిక్కడ టెలికం కంపెనీల సీనియర్ అధికారులతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. టెల్కోలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్‌గ్రేడ్, విస్తరణతో కాల్ డ్రాప్స్ సమస్యను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. టెలికం ఆపరేటర్లు మొబైల్ టవర్ల ఏర్పాటుకు స్థలం లభ్యత కష్టంగా మారడం సహా పలు ఇతర సమస్యలు ఎదురౌతున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ‘భారతీ ఎయిర్టెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై రూ.16,000 కోట్లు పెట్టుబడులు పెట్టింది. మరో రూ.24,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇక జియో వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్ష టవర్ల ఏర్పాటుకు రూ.50,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది’ అని సుందరరాజన్ వివరించారు. ఇక ఐడియా, వొడాఫోన్ కంపెనీలు కూడా వాటి మొబైల్ టవర్ల పెంపునకు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. -
ఇతరుల ఆధార్‌తో మొబైల్ కనెక్షన్లు
విశిష్ట గుర్తింపు సంఖ్య భద్రత ప్రశ్నార్థకం ► వివరాలు తస్కరిస్తున్న అక్రమార్కులు ► ఇష్టారాజ్యంగా దుర్వినియోగం ► ఇతరుల ఆధార్‌తో మొబైల్ కనెక్షన్లు ► ఢిల్లీలో ఓ మహిళ ఆధార్ నంబర్‌తో ► 9 బోగస్ మొబైల్ కనెక్షన్లు ► ట్వీటర్లో పోస్టు చేయడంతో కలకలం ► వేలాదిగా స్పందించిన నెటిజన్లు ► అలా జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయండి: యూఐడీఏఐ సాక్షి, హైదరాబాద్ : ఆర్.డి.ప్రియా.. ఢిల్లీలోని వసంత్‌కుంజ్‌లో ఉంటారామె.. తన మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు కొద్దిరోజుల కిందట ఎయిర్టెల్ స్టోర్‌కు వెళ్లింది.. కానీ అప్పటికే ఆమె ఆధార్‌తో ఏకంగా 9 మొబైల్ కనెక్షన్లు అనుసంధానమై ఉన్నాయని అక్కడి సిబ్బంది చెప్పడంతో ప్రియా షాక్‌కు గురైంది! ఆధార్ వివరాలు ఏమాత్రం బయటకు వెళ్లే అవకాశం లేదని, అత్యంత పకడ్బందీగా పరిరక్షిస్తున్నామని కేంద్రం చెబుతున్న మాటల్లోని డొల్లతనం ఈ ఉదంతంతో మరోసారి బయటపడింది! ఆధార్ గోప్యతపై అనేక అనుమానాలను రేకెత్తించింది. తనకు ఎదురైన ఈ అనుభవాన్ని వివరిస్తూ ప్రియా తాజాగా ట్వీటర్లో చేసిన పోస్టు కలకలం రేపుతోంది. వాస్తవానికి ఆమె గత 18 ఏళ్ల నుంచి ఒకే మొబైల్ నంబర్‌ను వినియోగిస్తోంది. ఇప్పటివరకు ఆ నంబర్‌తో సహా ఏ మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయలేదు. తీరా ఇప్పుడు అనుసంధానం చేసేందుకు వెళ్లగా 9 కనెక్షన్లు లింక్ అయి ఉన్నాయని చెప్పడంతో ఆశ్చర్యపోయింది. ‘ఇది నా జీవితంలో అతిపెద్ద షాక్’అంటూ ఐదు రోజుల కింద ఆమె ట్వీటర్లో పేర్కొంది. వేలాది మంది ఆమె ట్వీట్‌ను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు తెరదీసింది. ఆధార్‌తో పౌరుల వ్యక్తిగత సమాచారానికి భంగం వాటిల్లుతోందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త సిమ్ కార్డు జారీ లేదా ఇప్పటికే వినియోగిస్తున్న మొబైల్ నంబర్లను ఆధార్‌తో అనుసంధానం చేసే సమయంలో టెలికం కంపెనీలు వినియోగదారుల వేలి ముద్రల(బయోమెట్రిక్)ను స్కాన్ చేసి ఆధార్ డేటాతో సరిపోల్చి చూసుకుంటాయి. అయితే తాజా ఘటనలో బాధితురాలికి సంబంధించిన బయోమెట్రిక్ డేటాతో నిర్ధారించుకోకుండానే టెలికం కంపెనీలు ఆమె ఆధార్ నంబర్‌తో 9 మొబైల్ కనెక్షన్లు ఎలా జారీ చేశాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఒక ఆధార్ నంబర్‌పై గరిష్టంగా 6 మొబైల్ కనెక్షన్లు మాత్రమే జారీ చేయాలని ట్రాయ్, డీఓటీ నిబంధనలు చెబుతుండగా.. 9 కనెక్షన్లు ఎలా జారీ అయ్యాయన్నది అర్థం కాని ప్రశ్నగా మారింది. అలా చేస్తే ఫిర్యాదు చేయండి ఈ వివాదం తీవ్రం కావడంతో ఆధార్ కార్డులను జారీ చేస్తున్న భారతీయ విశిష్ట గుర్తింపు యాజమాన్య సంస్థ (యూఐడీఏఐ)తోపాటు ఎయిర్టెల్ స్పందించింది. బాధితురాలు ప్రియాతో ట్వీటర్లో సంప్రదింపులు జరిపాయి. తమ ఆధార్ నంబర్‌తో ఎన్ని మొబైల్ కనెక్షన్లు అనుసంధానమై ఉన్నాయో తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని యూఐడీఏఐ పేర్కొంది. తమ ఆధార్ నంబర్‌తో మొబైల్ కంపెనీలు మోసపూరితంగా సిమ్‌కార్డులు జారీ చేస్తే ట్రాయ్, లేదా డీఓటీలకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. మరోవైపు బాధితురాలిని ‘సాక్షి’ట్వీటర్లో పలకరించగా.. ఈ ఘటనపై ఇంకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయలేదని వివరించింది. తనకు పూర్తి సమాచారం ఇస్తానని ఎయిర్టెల్ హామీ ఇచ్చిందని, కొద్దిరోజులు వేచి చూసి ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపింది. భద్రతకు ఏదీ భరోసా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు, కార్యక్రమాలకు ఆధార్‌ను తప్పనిసరి చేశాయి. రేషన్ కార్డులు, బ్యాంక్ ఖాతా, గ్యాస్ కనెక్షన్, డ్రైవింగ్ లైసెన్స్, ఉపకార వేతనాలు, స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు, విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఎరువులు, పాస్‌పోర్టు, సామాజిక పింఛన్లు, సంక్షేమ పథకాలు.. ఇలా ప్రతి అవసరానికి ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతిని తీసుకుంటున్నారు. అయితే వాటిని పకడ్బందీగా సంరక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కార్యాలయాల్లో పని చేసే కొంతమంది సిబ్బంది లబ్ధిదారుల ఆధార్ జిరాక్స్ ప్రతులను తస్కరించి తమ సొంత అవసరాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని చాలాకాలంగా ఆరోపణలున్నాయి. ప్రధానంగా స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల లబ్ధి కోసం రాష్ట్రంలో ఏటా లక్షల మంది విద్యార్థులు తమ దరఖాస్తులతో పాటు ఆధార్ ప్రతిని జత చేస్తున్నారు. స్కాలర్షిప్లు జారీ చేసే సంక్షేమ శాఖలు, విద్యా సంస్థల కార్యాలయాల్లో విద్యార్థుల దరఖాస్తులను కుప్పలు తెప్పలుగా పడేస్తుండడంతో వారి ఆధార్ గుర్తింపు ప్రమాదంలో పడింది. లింక్‌కు మార్చి 31 వరకు గడువు ప్రతి మొబైల్ ఫోన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియను కేంద్రం చేపట్టింది. టెలికం సర్వీస్ ప్రొవైడర్లు తమ వినియోగదారుల మొబైల్ ఫోన్ నంబర్లను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు వచ్చే మార్చి 31 వరకు గడువు పొడిగిస్తూ టెలికం శాఖ ట్రాయ్ నోటిఫికేషన్ జారీ చేశాయి. వినియోగదారులు టెలికాం కంపెనీ స్టోర్‌కు వెళ్లినప్పుడు తమ ఆధార్ నంబర్‌తో ఇంకా ఏమైనా మొబైల్ కనెక్షన్లు అనుసంధానమై ఉన్నాయా? అన్న విషయాన్ని అడిగి తెలుసుకోవచ్చు. ఒకవేళ తమకు సంబంధం లేని మొబైల్ కనెక్షన్లు లింక్ అయి ఉంటే తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ట్రాయ్ అధికార వర్గాలు సూచిస్తున్నాయి. ఆధార్ వినియోగాన్నిఇలా తెలుసుకోవచ్చు https://resident.uidai.gov.in/notification-aadhaar వెబ్సైట్ లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ.. ఇప్పటివరకు ఎక్కడెక్కడ తమ ఆధార్ నంబర్ వినియోగమైందన్న సమాచారం తెలుసుకోవచ్చు. 12 అంకెల ఆధార్ గుర్తింపు నంబర్, సెక్యూరిటీ కోడ్(వెబ్సైట్లోనే ఉంటుంది)ను ఎంటర్ చేయగానే, ఆధార్‌తో అనుసంధానమైన ఫోన్‌కు వన్ టైమ్ పాస్వర్డ్(ఓటీపీ) వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే ఆధార్ వినియోగ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. -
లైసెన్స్‌లు రద్దు... కంపెనీలు మాయం
సాక్షి, బిజినెస్ విభాగం 2జీ స్కామ్‌కు సాక్ష్యాలు లేవని రాజా, కనిమొళి తదితరులను నిర్దోషులుగా ప్రకటించింది ప్రత్యేక కోర్టు. ఇదే వ్యవహారానికి సంధించి గతంలో సుప్రీంకోర్టు 122 లైసెన్సులను రద్దు చేసింది. ఆయా సర్కిళ్లలో కార్యకలాపాలు సాగిస్తున్న పలువురు టెలికామ్ ఆపరేటర్లు లైసెన్సులు కోల్పోయారు. కొందరైతే ఆ దెబ్బకు మూటాముల్లే సర్దుకుని వెళ్లిపోయారు కూడా!! ఇంకొందరు కొనసాగినా మనుగడ సాగించలేకపోయారు. అసలు ఎవరెవరికి లైసెన్సులు దక్కాయి? ఎవరెంత నష్టపోయారు? ఆ వివరాలేంటో చూద్దాం... 2008 నాటికి దేశంలో టెలికామ్ ఆపరేటర్ల సంఖ్య 18. ఇపుడేమో 11. తాజా విలీనాలు, కొనుగోళ్ల తరవాత చివరికి మిగిలినవి భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్–ఐడియా, రిలయెన్స్ జియో, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ మాత్రమే. 2008లో అప్పటి కేంద్ర టెలికం మంత్రి కొత్త 2జీ లైసెన్స్‌లకు బిడ్లను ఆహ్వానించారు. ‘మొదట వచ్చినవారికి మొదట కేటాయింపు’ ప్రాతిపదికన 122 లైసెన్సులు జారీ చేస్తామంటూ ఈ బిడ్లు పిలిచారు. అయితే ఈ స్పెక్ట్రమ్ కేటాయింపులో పలు నియమాలు ఉల్లంఘించారని, కొన్ని సంస్థలు తమకు అనుకూలంగా లంచాలిచ్చాయనే ఆరోపణలొచ్చాయి. లైసెన్స్ పొందిన టెలికం సంస్థలివే.. యూనిటెక్ వైర్లెస్: 22 లైసెన్స్‌లు దేశీ రియల్టీ దిగ్గజం యూనిటెక్ లిమిటెడ్ 22 లైసెన్స్‌లు పొందింది. దీంతో నార్వేకు చెందిన టెలినార్... ఈ సంస్థలో 67.5 శాతం వాటా కొనుగోలు చేసి ఇండియాలోకి రంగప్రవేశం చేసింది. మొత్తంగా టెలినార్ గ్రూప్ రూ.6,100 కోట్లు ఈక్విటీ, రూ.8 వేల కోట్లు కార్పొరేట్ గ్యారంటీల రూపంలో పెట్టుబడి పెట్టింది. ► తైవాన్‌కు చెందిన లూప్ టెలికం 21 లైసెన్స్‌లు పొందింది. తరవాత దీన్ని ఖైతాన్ గ్రూప్ కొనుగోలు చేసింది. ► వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్... డాటాకామ్ సొల్యూషన్స్ పేరిట 21 లైసెన్స్‌లు. ► స్వాన్ టెలికామ్‌కు 13 లైసెన్స్‌లు దక్కాయి. ఎమిరేట్స్‌కు చెందిన ఎటిసలాట్– దేశీ రియల్టీ సంస్థ డీబీ కార్ప్ జతకట్టి స్వాన్‌ను, మరో 2 లైసెన్స్‌లను తీసుకున్నాయి. ► సింగపూర్‌కు చెందిన ఎస్ టెల్ లిమిటెడ్‌కు 6 లైసెన్స్‌లు దక్కగా... దీన్లో వాటాలను బహ్రెయిన్ టెలికమ్యూనికేషన్స్ (బాటెల్కో) కొనుగోలు చేసింది. ► రష్యాకు చెందిన సిస్టెమా, ఇండియాకు చెందిన శ్యామ్ గ్రూప్‌ల సంయుక్త భాగస్వామ్య కంపెనీయే సిస్టెమా శ్యామ్. దీనికి 21 లైసెన్స్‌లు దక్కాయి. ► దేశంలో 3వ అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా ఉన్న ఐడియా... తొలిదశలో 9, రెండో దశలో మరో 4 లైసెన్స్‌లు దక్కించుకుంది. ళీ టాటా 3 లైసెన్స్‌లు దక్కించుకుంది. ఎవరికెంత నష్టం? కస్టమర్లు: టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గణాంకాల ప్రకారం దేశంలోని మొత్తం యాక్టివ్ సబ్స్క్రైబర్లలో 5 శాతం కస్టమర్లపై ఇది ప్రభావం చూపింది. మొత్తం 89.4 కోట్ల మంది యూజర్లలో 4.5 కోట్ల మంది సబ్స్క్రైబర్లు వారి టెలికం సర్వీస్ ప్రొవైడర్లను మార్చుకోవాల్సి వచ్చింది. టెలికం రంగంలో పోటీ తగ్గడంతో స్థానికంగా ఉన్న టెలికం కంపెనీలు టారిఫ్ ధరలను కూడా పెంచేశాయి. విదేశాలతో పోలిస్తే సుమారు 30 శాతం ధరలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. విదేశీ పెట్టుబడిదారులు: 2జీ స్కామ్ ప్రభావం 11 కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. మరీ ముఖ్యంగా యూఏఈకి చెందిన ఎటిసలాట్, రష్యాకు చెందిన సిస్టెమా, నార్వేకు చెందిన టెలినార్ గ్రూప్ సంస్థలకు 2జీ దెబ్బ గట్టిగానే తగిలింది. దీంతో విదేశీ టెలికం కంపెనీలకు మన దేశీయ టెలికం రంగంపై నమ్మకం పోయింది. ఇక్కడి టెలికం బిడ్లు, లైసెన్స్ జారీలో పారదర్శకత లేదన్న విషయం తేటతెల్లం కావటంతో ఆ తర్వాత జరిగిన టెలికం బిడ్లలో విదేశీ కంపెనీలేవీ పాల్గొనలేదు. ఇది ఒక రకంగా అప్పడు టెలికం మార్కెట్లో ఉన్న భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ కంపెనీలకు కలిసొచ్చింది. టెలికం వెండర్స్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద కూడా ప్రభావం చూపించింది. నోకియా, సిమెన్స్, ఎరిక్సన్, హువావే, విప్రో వంటి టెక్నాలజీ కంపెనీలపై ప్రభావం పడింది. టవర్ల నిర్వహణ, సాంకేతిక అభివృద్ధి కోసం యూనినార్‌తో నోకియా, సిమెన్స్, ఎటిసలాట్‌తో టెక్ మహీంద్రా ఒప్పందం చేసుకున్నాయి. సుమారు 400 మిలియన్ డాలర్ల ఒప్పందాలు రద్దయ్యాయని అంచనా. బ్యాంకులు, టవర్ల నిర్వహణ కంపెనీలపై కూడా ప్రభావం చూపించింది. -
రూ. 15 వేల కోట్ల ఆదాయం తగ్గించి చూపించాయి
న్యూఢిల్లీ: టాటా టెలీ, జియో సహా అయిదు టెలికం సంస్థలు లెక్కల్లో దాదాపు రూ. 14,814 కోట్ల మేర ఆదాయాలను తక్కువగా చేసి చూపాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆక్షేపించింది. దీనివల్ల ఖజానాకు సుమారు రూ. 2,578 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొంది. 2014–15 దాకా ఈ 5 కంపెనీలు తమ ఆదాయాలను రూ. 14,814 కోట్ల మేర తక్కువ చేసి చూపించినట్లు ఆడిటింగ్‌లో తేలిందని కాగ్ వివరించింది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన కాగ్ నివేదిక ప్రకారం.. టాటా టెలీ, టెలినార్, వీడియోకాన్ టెలికామ్, క్వాడ్రాంట్ (వీడియోకాన్ గ్రూప్ సంస్థ), రిలయన్స్ జియో సంస్థల నుంచి ప్రభుత్వానికి లైసెన్సు ఫీజు కింద రావాల్సిన మొత్తంలో రూ. 1,015 కోట్లు, స్పెక్ట్రం యూసేజి చార్జీలు రూ. 512 కోట్లు, చెల్లింపుల్లో జాప్యంపై వడ్డీ కింద మరో రూ. 1,052 కోట్లు తక్కువ వచ్చింది. మొత్తం మీద లైసెన్సు ఫీజు, ఎస్‌యూసీ, వడ్డీ కింద చెల్లించాల్సిన దాంట్లో టాటా టెలీసర్వీసెస్ నుంచి రూ. 1,894 కోట్లు, టెలినార్ రూ. 604 కోట్లు, వీడియోకాన్ రూ. 48 కోట్లు, క్వాడ్రాంట్ రూ. 27 కోట్లు, రిలయన్స్ జియో రూ. 7 కోట్ల మేర తక్కువగా కట్టాయి. -
ఒక్క ఓటీపీతో ఆధార్-సిమ్ లింక్, అదెలా?
న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజ కంపెనీలు ఎయిర్టెల్, రిలయన్స్ జియో, ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియాలు సిమ్ కార్డుతో ఆధార్ లింకింగ్ ప్రక్రియను సులభతరం చేస్తున్నాయి. ఓటీపీ సాయంతో ఈ లింకింగ్‌ను పూర్తిచేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ ప్రక్రియ కోసం టెలికాం సంస్థలు సమర్పించిన బ్లూప్రింట్‌ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఆమోదించింది. మొబైల్‌తో ఆధార్ లింక్‌కు డెడ్‌లైన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 వరకు ఉన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 1 నుంచి ఈ ఓటీపీతో ఆధార్ ఆధారిత సిమ్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మొబైల్ నెంబర్లను ఆధార్‌తో లింక్ చేసుకునే ప్రక్రియకు మూడు కొత్త విధానాలను గత నెలలోనే ప్రభుత్వం ఆమోదించింది. అందులో ఓటీపీ కూడా ఒకటి. మరో రెండు యాప్ లేదా ఐవీఆర్ఎస్ సౌకర్యం. ఈ మూడు ప్రక్రియల ద్వారా ఆధార్‌తో మొబైల్ నెంబర్లను లింక్ చేసుకునే ప్రక్రియ ప్రజలకు సౌకర్యవంతంగా ఉండనుంది. ఈ నెల చివరిలోగా ఓటీపీ ఆధారిత లింకింగ్ ప్రక్రియను మొదలుపెడతామని టెలికాం కంపెనీలు హామీ ఇచ్చాయని యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే వెల్లడించారు. ఓటీపీ ఆధారిత విధానం వల్ల రీవెరిఫికేషన్ ప్రక్రియ వేగవంతం కానుంది. దివ్యాంగులకు, సీనియర్ సిటిజన్లకు, దీర్ఘకాలికంగా అనారోగ్యం పాలైన వ్యక్తులకు ఇంటి వద్దనే మొబైల్‌తో ఆధార్ లింక్ ప్రక్రియను చేపట్టాలంటూ ప్రభుత్వం, కంపెనీలను ఆదేశించింది. అయితే స్టోర్స్‌కు వెళ్లి ఆధార్‌ను లింకు చేసుకునే ప్రక్రియ కూడా కొనసాగుతుందని తెలిసింది. -
చాపచుట్టేస్తున్న టెలికాం కంపెనీలు